
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
● జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి ● కడవేర్గులో బడిబాట ప్రారంభం
చేర్యాల(సిద్దిపేట): ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని జిల్లా విద్యా శాఖాధికారి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లాలో ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని శనివారం మండల పరిధిలోని కడవేర్గు కాంప్లెక్స్ పరిధిలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉన్నత విద్యార్హతలు, అనుభవం కలిగిన ఉపాధ్యాయుల చేత బోధన ఉంటుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ బడులకు పంపకుండా ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని కోరారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఇళ్లకు వెళ్లి కష్టపడి సంపాదించిన డబ్బు దుబారా చేయొద్దని కోరాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని ఉచిత సౌకర్యాలతో పాటు టెక్నాలజీతో కూడిన బోధన లభిస్తుందని చెప్పారు. ఆయన వెంట ఎంఈఓ కిష్టయ్య, కాంప్లెక్స్ హెచ్‌ఎం చంద్రశేఖర్‌రావు, పాఠశాలల హెచ్‌ఎంలు ఐలయ్య, సంతోష్, మల్లికార్జున్‌రెడ్డి, కిషన్, రాజు, ఉపాధ్యాయులు కాంతికృష్ణ, బాలభాస్కర్, రామచంద్రమూర్తి, విజయ్ తదితరులు ఉన్నారు.