
రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
హుస్నాబాద్: హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యకర్తలను సమాయత్తం చేస్తూ శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ నినాదంతో దిగ్విజయంగా 25 సంవత్సరాలుగా తన ప్రస్థానాన్ని కొనసాగడం ఒక్క గులాబి జెండాకే దక్కిందన్నారు. సమావేశంలో నాయకులు రాయిరెడ్డి రాజిరెడ్డి, తిరుపతిరెడ్డి, అన్వర్ పాష, వెంకట్, నవీన్, రజిత, అనిత, వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమ స్ఫూర్తితో..
తొగుట(దుబ్బాక): ఉద్యమ స్ఫూర్తితో అధిక సంఖ్య లో కార్యకర్తలు తరలివచ్చి రజతోత్సవ సభను జయప్రదం చేయాలని బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి కోరారు. కార్యక్రమంలో నాయకులు యాదగిరి, అరుణ్‌కుమార్, రమేశ్, నరేందర్, ఆబిద్ హుస్సేన్ పాల్గొన్నారు.
హుస్నాబాద్‌కు చేరుకున్న పాదయాత్ర
హుస్నాబాద్: హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించునున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు సిద్దిపేట నుంచి బీఆర్‌ఎస్ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర శనివారం రాత్రి హుస్నాబాద్‌కు చేరుకుంది. స్థానిక నాయకులు స్వాగతం పలికారు. అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. డీజే సౌండ్, డప్పుల చప్ప్ళుళ్లతో నృత్యం చేస్తూ సందడి చేశారు. మండలంలోని పోతారం(ఎస్) శుభం గార్డెన్‌లో రాత్రి బసచేసి ఆదివారం ఉదయం పాదయాత్రగా ఎల్కతుర్తికి బయలుదేరనున్నట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో రాయిరెడ్డి రాజిరెడ్డి, రజిత, అనిత, వెంకట్, తిరుపతిరెడ్డి, మంగ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్

రజతోత్సవ సభను విజయవంతం చేయాలి