గల్ఫ్‌ బాధితుడికి విముక్తి | - | Sakshi
Sakshi News home page

గల్ఫ్‌ బాధితుడికి విముక్తి

Published Sun, Apr 27 2025 7:56 AM | Last Updated on Sun, Apr 27 2025 7:56 AM

గల్ఫ్

గల్ఫ్‌ బాధితుడికి విముక్తి

మంత్రి పొన్నం చొరవతో

క్షేమంగా ఇంటికి..

హుస్నాబాద్‌: గల్ఫ్‌లో చిక్కుకున్న చొప్పరి లింగయ్య ఎట్టకేలకు సొంతూరుకు చేరుకున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తనకు స్వదేశానికి రప్పించాలని కోరుతూ హుస్నాబాద్‌ పట్టణానికి చెందిన చొప్పరి లింగయ్య ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రి పొన్నంకు సెల్ఫీ వీడియో ద్వారా విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియో వైరల్‌ అయింది. వెంటనే స్పందించిన మంత్రి.. ఎన్నారై అడ్వైజరీ కమిటీ చైర్మన్‌ వినోద్‌కుమార్‌, వైస్‌ చైర్మన్‌ మంద భీంరెడ్డిలను సమన్వయం చేశారు. ఎన్నారై ప్రతినిధులు లింగయ్యను పరామర్శించి ధైర్యం చెప్పారు. విమాన టికెట్‌ డబ్బులను మంత్రి పొన్నం భరించారు. దీంతో లింగయ్య హైదరాబాద్‌కు చేరుకున్నాడు. చొరవ చూపిన మంత్రి పొన్నంకు లింగయ్య, అతని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

గంజాయి, మత్తు పదార్థాలపై

ఉక్కుపాదం: సీపీ

సిద్దిపేటకమాన్‌: గంజాయి, మత్తు పదార్థాలను ఉక్కుపాదంతో అణచివేయాలని సిద్దిపేట పోలీసు కమిషనర్‌ అనురాధ అన్నారు. సిద్దిపే ట డివిజన్‌ పోలీసు అధికారులతో ఆమె సమీక్షించారు. పోక్సో, ఎస్సీ ఎస్టీ కేసులలో 60రోజులలో ఇన్వెస్టిగేషన్‌ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేయాలన్నారు. నూతన టెక్నాలజీపై పోలీసు అధికారులు, సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. రాబోవు రోజుల్లో సీసీటీఎన్‌ఎస్‌ డాటా ప్రకారమే దేశ, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పోలీసు స్టేషన్‌లు ఎంపిక చేస్తారన్నారు. సైబర్‌ నేరాలు, గంజాయి తదితర అంశాలపై యవతకు అవగహన కల్పించాలన్నారు. సమావేశంలో ఏసీపీ మధు, టాస్క్‌ఫోర్స్‌ ఏసీసీ రవీందర్‌, సీఐలు వాసుదేవరావు, ఉపేందర్‌, విద్యాసాగర్‌, శ్రీను, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌గౌడ్‌, ఎస్‌ఐలు అపూర్వరెడ్డి, బాలకృష్ణ, అసిఫ్‌, గంగరాజు, హరీశ్‌, రాజేష్‌, పరుశరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

చదువుతోనే ఉజ్వల భవిష్యత్‌

జగదేవ్‌పూర్‌(గజ్వేల్‌): చదువుతోనే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రాజన్న అన్నారు. ఇటీవల వెలువడిన ఇంటర్‌ ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ప్రతిభ చాటిన విద్యార్థులను కళాశాలలో శనివారం శాలువాలు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు పది, ఇంటర్మీడియెట్‌ విద్యే భవితకు పునాదన్నారు. చదువతోనే సమాజంలో గుర్తింపు, గౌరవం వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

చైర్మన్‌, వైస్‌ చైర్మన్లకు

ఘన సన్మానం

కొండపాక(గజ్వేల్‌): వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ పరశురాములును కాంగ్రెస్‌ నాయకులు ఘనంగా సన్మానించారు. మండలంలోని వెలికట్ట గ్రామంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ డైరెక్టర్‌ బూర్గుల సురేందర్‌రావు మాట్లాడుతూ 15యేళ్లుగా మార్కెట్‌ కమిటీ పాలకవర్గ లేకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు పడ్డార న్నారు. ధాన్యం కొనుగోళ్లలో అవకతవకతలు, ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు. లింగారావు, గంగాధర్‌, సిద్దులు, ప్రభాస్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

గల్ఫ్‌ బాధితుడికి విముక్తి1
1/3

గల్ఫ్‌ బాధితుడికి విముక్తి

గల్ఫ్‌ బాధితుడికి విముక్తి2
2/3

గల్ఫ్‌ బాధితుడికి విముక్తి

గల్ఫ్‌ బాధితుడికి విముక్తి3
3/3

గల్ఫ్‌ బాధితుడికి విముక్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement