
అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి
వేసవికాలం దృష్ట్యా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి. చిన్నారులు, వృద్ధులు, మహిళలు ఎండల వేళ బయటకు వెళ్లకపోవడమే మంచిది. ఒక వేళ వెళ్లాల్సివస్తే గొడుగు, నెత్తిన టోపీలు, చలువ అద్దాలు ధరించాలి. అధిక ఎండల వల్ల శరీరంలోని లవణాలు త్వరగా చెమట రూపంలో కోల్పోతాం. లవణాలను తిరిగి పొందేందుకు నీరు, చెరకు, నిమ్మ రసం, మజ్జిగ సేవించాలి. –డాక్టర్ రాజేశ్వర్,
ఎండీ జనరల్ ఫిజీషియన్, సిద్దిపేట