
పక్షులను కాపాడుకుందాం
మానవులతో సమానంగా ప్రకృతిలో జంతువులు, పక్షులకు జీవించే హక్కు ఉంది. వాటిని రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. పచ్చని చెట్లు ఉంటే మనం రక్షించుకోవడంతో పాటు, జంతువులు, పక్షులు సేదతీరుతాయి. ఇంట్లో పెంచుకునే కుక్కలు, పిల్లులు, పక్షుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పలువురు తమ ఇళ్లు, విద్యాసంస్థల వద్ద పక్షుల కోసం తాగునీటి తొట్టెలు, ధాన్యం ఏర్పాటు చేయడం సంతోషకరం. –డాక్టర్ నరసింహస్వామి,
పర్యావరణ ప్రేమికుడు, సిద్దిపేట