
30 నుంచి వీఎస్‌యూలో సాఫ్ట్‌బాల్ పోటీలు
● వీసీ అల్లం శ్రీనివాసరావు
వెంకటాచలం: విక్రమ సింహపురి యూనివర్సిటీ (వీఎస్‌యూ)లో ఈనెల 30 నుంచి మేనెల 8 తేదీ వరకు ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ సాఫ్ట్‌బాల్ (మహిళలు, పురుషులు) టోర్నమెంట్ జరుగుతుంది. దీనికి సంబంధించిన పోస్టర్లను మంగళవారం కాకుటూరులో ఉన్న వర్సిటీలో వీసీ అల్లం శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల నుంచి 93 మహిళా జట్లు 30 నుంచి మే నెల 3 తేదీ వరకు పాల్గొంటాయని తెలిపారు. మేనెల 4 నుంచి 8 తేదీ వరకు 95 పురుషు జట్లు పోటీ పడతాయన్నారు. వీఎస్ యూ క్రీడా విభాగం ఆధ్వర్యంలో ఈ పోటీలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత, ఇన్‌చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ హనుమారెడ్డి, స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డాక్టర్ సీహెచ్ వెంకట్రాయులు, పరీక్షల నిర్వహణాధికారి డాక్టర్ ఆర్.మధుమతి తదితరులు పాల్గొన్నారు.