
అన్ని కులాలకు న్యాయం జరగాలి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): మాల, మాదిగ, రెల్లి, వాటి ఉప కులాలు అన్నింటికి న్యాయం జరగాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం వ్యవస్థాపకులు పోతల దుర్గారావు కోరారు. శ్రీకాకుళం నగరంలో అంబేడ్కర్ విజ్ఞానభవన్‌లో సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్ విషయంలో అన్ని కులాలకు న్యాయం జరగాలని, గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. మాల, మాదిగ, రెల్లి, రెల్లి ఉపకులాలు అన్ని కలిసి మెలిసి ఉన్నాయని, ఎస్సీలకు మొత్తం మీద రిజర్వేషన్ పెంచాల్సి ఉండగా, విభజించి పాలించు విధంగా చేయడం సరికాదని, సమగ్రంగా రిజర్వేషన్ ప్రక్రియ జరగాలని, రిటైర్డ్ న్యాయమూర్తులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, సంఘాల నాయకుల సమక్షంలో కులాల వారీగా రిజర్వేషన్ శాతం ప్రకటించాలని కోరారు. సమావేశంలో పలు సంఘాల నాయకులు దండాసి రాంబాబు, అంపోలు ప్రతాప్, రామప్పడు, గంజి ఎజ్రా, రాము, అప్పన్న, రమేశ్‌బాబు, బోనేల రమేష్, రమణ, రవికుమార్, రామారావు, తవిటయ్య, పాపారావు, గౌరీ, తవిటిరావు తదితరులు పాల్గొన్నారు.