
ఆ మొత్తం ఎప్పుడు చెల్లిస్తారో..?
చిత్రంలో కనిపిస్తున్న ఎం.సూర్యనారాయణది పశ్చిమగోదావరి జిల్లా. తల్లిదండ్రులు రామారావు, భారతి వ్యవసాయ కూలీలు. ఈపీఈఏపీ సెట్ ర్యాంకు ద్వారా ఎచ్చెర్ల శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలో ట్రిపుల్‌ఈ బ్రాంచ్‌లో ప్రవేశం పొందాడు. ప్రస్తుతం చివరి ఏడాదికి చేరుకున్నాడు. ఈ నెలలో చివరి సెమిస్టర్ పూర్తి చేసి, రిలీవ్ అవుతున్నాడు. కళాశాల ఫీజు స్ట్రక్చర్ రూ.43,000 కాగా, మొదటి విడత మాత్రమే రూ.10,750 విడుదలైంది. మిగిలిన డబ్బు మూడు విడతల్లో విడుదల చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. పూర్తి ఫీజు చెల్లించకపోతే కళాశాల యాజమాన్యం విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు అందజేయదు. దీంతో విలువైన సమయం, ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని విద్యార్థి ఆందోళన చెందుతున్నాడు.