
ట్రిపుల్ ఐటీలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల
ఎచ్చెర్ల క్యాంపస్: రాష్ట్రంలోని శ్రీకాకుళం, నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో (ట్రిపుల్ ఐటీలు) ప్రవేశానికి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సండ్ర అమరేంద్రకుమార్ గురువా రం నోటిఫికేషన్ జారీ చేశారు. 10వ తరగతి ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ సైతం విడుదల చేశా రు. ఈ నెల 27వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తు స్వీకరణకు మే 20 చివరి తేదీ. విద్యార్థులు ఒకే దరఖాస్తులో క్యాంపస్‌లు ప్రాధాన్యత బట్టి ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. 10వ తరగతి మార్కులు, రి జర్వేషన్ రోస్టర్ ఆధారంగా ప్రవేశాలు కల్పి స్తారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వెయిటేజ్ ఇస్తారు. శ్రీకాకుళం క్యాంపస్‌లో గత ఏడాది 1100 సీట్లుకు ప్రవేశాలు కల్పించారు. 1000 సీట్లు, 100 ఈడబ్ల్యూఎస్ సీట్లు ఉన్నా యి. ఈ ఏడాది సీట్ల సంఖ్య స్పష్టంగా తెలియా ల్సి ఉంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఎక్కువగా ఎంపికవుతున్నారు. ట్రిపుల్ ఐటీలో సీట్లు వస్తే రెండేళ్లు పీయూసీ (ప్రీ యూనివర్సిటీ కోర్సు), నాలుగేళ్లు ఇంజినీరింగ్ ఆరేళ్లు చదివే అవకాశం లభిస్తుంది. శ్రీకాకుళం జిల్లా నుంచి ఏటా ఎక్కువ మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. బాలికలు ఎక్కువగా ప్రవేశాలు పొందుతున్నారు.