
గంజాయితో వ్యక్తి అరెస్టు
సోంపేట: మండలంలోని కొర్లాం జాతీయ రహదారి వద్ద గంజాయి తరలిస్తున్న వ్యక్తిని బారువ ఎస్‌ఐ హరిబాబునాయుడు అరెస్టు చేశారు. సోంపేట సర్కిల్ పోలీస్‌స్టేషన్ వద్ద సీఐ బి.మంగరాజు గురువారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. కొర్లాం జంక్షన్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. తనిఖీ చేయగా 1.050 కిలోల గంజాయి పట్టుబడింది. నిందితుడు ఒడిశా నుంచి బాపట్లకు గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు సీఐ తెలిపారు. సమావేశంలో బారువ ఎస్‌ఐ హరిబాబునాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.