
సమ్మర్ క్యాంప్‌లు ఇలా..
● శ్రీకాకుళం పట్టణంలో నృత్యం నేర్చుకోవాలనుకువాళ్లకు సంప్రదాయం కూచిపూడి గురుకులం, కళ్లేపల్లిలో కూచిపూడి నృత్యం, కర్ణాటక సంగీతంపై వేసవి శిక్షణ తరగతులు మే 1 నుంచి జూన్ 5 వరకు జరుగుతాయి.
● పట్టణంలోని పాతశ్రీకాకుళం కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న చిల్డ్రన్స్ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో డ్రాయింగ్‌పై ఉచిత వేసవి శిక్షణ నిర్వహిస్తున్నట్లు రిటైర్డ్ డ్రాయింగ్ టీచర్ ఎల్.నందికేశ్వరరావు తెలిపారు. ఈ నెల 28 నుంచి జూన్ 5 వరకు నిర్వహిస్తారు.
● రఘుపాత్రుని శ్రీకాంత్, శివశ్రీ నృత్య కళానికేతన్, న్యూసెంట్రల్ స్కూల్స్‌లో మే 1నుంచి జూన్ 5 వరకు కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యం కూడా నేర్పుతారు.
● శాంతినగర్‌లో ఎన్‌పీ కవిత, అభినయ నృత్య నికేతన్‌లో తిమ్మరాజు నీరజ, శృతిలయ సంగీత నిలయంలో రెడ్డి సత్యనారాయణ, సుసరాపు లక్ష్మీగణపతి శర్మ, శ్రీరాజరాజేశ్వరీ సంగీతం పీఠంలో శాసీ్త్రయ నృత్య, సంగీతాలు నేర్పిస్తారు.
● అకీరా డ్యాన్స్ ప్లానెట్స్‌లో చిన్నారుల కోసం వేసవి శిబిరం నిర్వహిస్తున్నారు. ఇక్కడి స్పోకెన్ ఇంగ్లిష్, యోగా, అబాకస్, చెస్, డ్రాయింగ్, వెస్ట్రన్ డ్యాన్స్, భగవద్గీత, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేర్పుతారు.
● పట్టణంలో పాండురంగవీధిలో ఉన్న వీఆర్ ఇన్‌స్టిట్యూట్‌లో కీబోర్డు, గిటార్, వోకల్ శిక్షణ ప్రారంభమైంది. మాస్టర్ సిహెచ్. వేంకటరావు ఆధ్వర్యంలో వేసవిలో రెండు నెల లపాటు ఈ శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

సమ్మర్ క్యాంప్‌లు ఇలా..