
ఇలాంటి సంస్కృతి ఏ రాష్ట్రంలోనూ లేదు..
పత్రికా విలేకరి ఎవరైనా కథనం రాస్తే అవతలివారికి పరువు భంగం కలిగిందనకుంటే లీగల్‌గా వెళ్లవచ్చు. కానీ రాసే వార్తను ఆధారంగా చేసుకు ని ఎడిటర్లపైన, యాజమాన్యాలపైన క్రిమినల్ కేసులు పెట్టే సంస్కృతి ఏ రాష్ట్రంలోనూ లేదు. మనకే ఆ దౌర్భాగ్యం. ఒక రాష్ట్రంలో నమోదైన ఫిర్యాదు, ఎఫ్‌ఐఆర్ మరో రాష్ట్రంలో మరో విధంగా నమోదు కావడం అన్యాయం. కూటమి ప్రభుత్వం ఇకనైనా ఇలాంటివి విరమించి రాజ్యాంగ పరిధిలో పనిచేస్తున్నామన్న సందేశమివ్వాలి. – నల్లి ధర్మారావు,
స్సామ్నా రాష్ట్ర అధ్యక్షులు, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు
●