Top Stories
ప్రధాన వార్తలు

అంతా భారత్ ఇష్టమేనా?.. దేనికైనా రెడీ.. పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ పాక్ ప్రధాని షెహబాబ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. భారత్ ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదు అంటూ కామెంట్స్ చేశారు.జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌పై భారత్ పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ పౌరులు భారత్‌ను విడిచి వెళ్లిపోవాలని, నదుల విషయంలో కూడా నీటిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ పరిణామాలపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీష్ స్పందించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తామంటూ ఇటీవల భారత ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై షరీఫ్ పరోక్షంగా స్పందించారు.Prime Minister Shehbaz Sharif has offered India cooperation in an impartial investigation of the Pahalgam incident, stating that there will be no compromise on Pakistan's security and dignity.#ShehbazSharif #Pakistan #India #Pahalgam #PakistanArmy #TOKReports pic.twitter.com/5vh6y1O63T— Times of Karachi (@TOKCityOfLights) April 26, 2025ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాక్ ప్రధాని షరీఫ్ మాట్లాడుతూ..‘మా దేశ భద్రత, సార్వభౌమత్వంపై ఎన్నటికీ రాజీపడబోం. ఎలాంటి ముప్పును ఎదుర్కోడానికైనా సంసిద్ధంగా ఉన్నాం. పహల్గాంలో ఇటీవల జరిగిన విషాదకర ఘటనతో మరోసారి మన దేశం నిందలు ఎదుర్కొంటోంది. ఆ ఘటనపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. శాంతికే మా ప్రాధాన్యం. సింధూ జలాల ఒప్పందం నిలిపివేత అంశం కరెక్ట్ కాదు. భారత్ ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదు. ఈ చర్యతో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని మేం కోరుకుంటున్నాం’ అంటూ భారత్‌ను నిందించే ప్రయత్నం చేశారు. చివరగా.. ఉగ్రవాదాన్ని తాము కూడా ఖండిస్తామంటూ చెప్పుకొచ్చారు. పహల్గాం దాడి (Pahalgam)పై తటస్థ దర్యాప్తునకు తాము సిద్ధమేనని ప్రకటించారు.Pakistan's PM Shehbaz Sharif says the country’s armed forces are "prepared to defend the country’s sovereignty" after Delhi accused Islamabad of being linked to the attack on tourists in Kashmir. #RUKIGAFMUpdates pic.twitter.com/qtJic92uZU— Rukiga F.M (@rukigafm) April 26, 2025

'ఇక్కడి వారికి హృదయం ఉంది'.. అందుకే..! పాక్ తండ్రి కంటతడి
అప్పటిదాక భారత్ పాక్‌ల మధ్య చక్కటి సానుకూల వాతావరణంతో ఆహ్లాదంగా ఉన్నాయి. ఇరుదేశాల మధ్య ఏవో కొద్దిపాటి ఘర్షణలు ఉన్నా..శాంతియుత జీవన విధానానికే పెద్దపీట వేస్తూ..ఇన్నాళ్లు భారత్ సంయమనం పాటిస్తూ వచ్చింది. ఆ ఒక్క ఘటన.. భారత్ ఆగ్రహం కట్టలు తెంచుకునేందుకు కారణమైంది. ఆ దెబ్బతో సరిహద్దులు, ఒప్పందాలు..అన్ని క్యాన్సిల్ అయ్యాయి. ఆ అమానుష ఘటన యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేయడమే గాక పాక్‌ని కళ్లర్రజేసే పరిస్థితికి తీసుకొచ్చింది. ఆ దేశం పెంచి పోషించిన ఉగ్రవాదమే కష్టాలు తెచ్చిపెట్టింది. పైగా ప్రపంచం ముందు దోషిలా నిలబెట్టింది. కానీ ఈ చర్యలతో అల్లాడుతున్న అమాయక జనం వెతలు చూస్తే..కడుపుతరుక్కుపోతోంది. అందుకే పెద్దలు అంటుంటారు..ఏ పనిచేసినా.. ముందు ఒక్క క్షణం ఆలోచించు..లేదంటే దాని పర్యవసానం ఏ పరిస్థితికి తీసుకొస్తుందో ఊహకందదని." ఇప్పుడు ఆ స్థితినే పాక్ ప్రజలు ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు.ఏ రెండు దేశాల మధ్య ఘర్షణ వచ్చినా..ఇబ్బంది పడేది సామాన్య ప్రజలే అనేది జగమెరిగిన సత్యం. అదే మూడు రోజులక్రితం జరిగిన పహల్గామ్ సంఘటన మరోసారి రుజువు చేసింది. ఆ ఘటనతో భారత్ పాక్‌ల మధ్య సార్క్ వీసా హక్కులు రద్దు అయ్యాయి. అలాగే వాఘా సరిహద్దులు మూసేయడం జరిగింది. దీంతో పిల్లల చికిత్స కోసం వచ్చిన పాకిస్తాన్ తల్లిదండ్రుల బాధలు చూస్తే కడుపు తరుక్కుపోతోంది. తమ కంటిపాపల కోసం భారత్‌కు వస్తే.. హఠాత్తుగా ఉన్నపళంగా వెనక్కి వెళ్లిపోమని దేశాల నుంచి ఆదేశాలు వస్తుంటే.. ఏం పాలుపోక దిక్కుతోచని స్థితిలో విలపిస్తున్న ఆ దృశ్యాలు ఎవ్వరినైనా కంటడిపెట్టిస్తాయి. వారి గాథలు ఎలా ఉన్నాయంటే..ఒక పాకిస్తానీ తండ్రికి ఇద్దరు పిల్లలు పుట్టుకతో వచ్చే గుండె జబ్బుతో బాధపడుతున్నారు. "ఇక్కడైతే ఆధునాతన వైద్య చికిత్స ఉంటుందని డిల్లీకి వచ్చాడు. మరో వారం రోజుల్లో ఆపరేషన్ జరగనుంది. అందుకు అక్కడ ఆస్పత్రి సిబ్బంది, వైద్యులు సహకరిస్తున్నారు. కానీ ఈ అనూహ్య పరిణామం కారణంగా షాక్‌కి గురయ్యాం. ఇక్కడ ఉండటానికి..చికిత్సకు చాలా ఖర్చు అయ్యిందంటూ వేదనగా ఓ పాక్ తండ్రి చెబుతున్నాడు. మరొక పాకిస్తానీ వ్యక్తి తన కొడుకు గుండె ఆపరేషన్ కోసం హైదరాబాద్ వచ్చామని, రెండు రోజుల్లో సర్జరీ అని కన్నీటిపర్యంతమయ్యాడు. ఒక్కొక్కరిది ఒక్కే విధమైన వేదన. అయితే వారంతా ఇక్కడ వారికి హృదయం ఉంది, ఎలాగైనా ఇరుదేశాలను అభ్యర్థిస్తాం తమ పిలల్లకు సర్జరీ అయ్యేంతవరకు ఉండనివ్వమని అని ధీనంగా చెబుతున్నారు. అయితే వారందర్నీ భారత పోలీస్ యంత్రాంగం, విదేశాంగ కార్యాలయం వెంటనే భారత్ నుంచి బయలుదేరాలని ఆదేశించినట్లు తెలిపారు. కాగా, పాకిస్తాన్లో ఉన్న 100 మందికి పైగా భారతీయ పౌరులు గురువారం భారతదేశానికి తిరిగి రాగా, భారత్‌లో ఉన్న 28 మంది పాకిస్తానీయులు వాఘా సరిహద్దు మూసేయడంతో తిరిగి భారత్‌లోకే వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఏదీఏమైనా..ఒక్క దుశ్చర్య ఎంతమందిని బాధల్లోకి నెట్టేసిందనేందుకు ఈ ఉదంతమే ఉదహరణ.(చదవండి: సలుపుతున్న రాచపుండు! చివరి దశలోనే ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులు)

రాజకీయాల్లోకి కొత్త జనరేషన్ రావాలి: రాహుల్ గాంధీ
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్య రాజకీయాలు ప్రపంచవ్యాప్తంగా మారిపోయాయని.. పదేళ్ల క్రితం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. హెచ్ఐసీసీలో కొనసాగుతున్న భారత్ సమ్మిట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పుడంతా మోడ్రన్ రాజకీయమేనని.. ఆధునిక సోషల్ మీడియాతో అంతా మారిపోయిందంటూ చెప్పుకొచ్చారు. నిన్ననే ఇక్కడకు రావాల్సిన ఉన్నా.. కశ్మీర్‌కు వెళ్లడంతో రాలేకపోయాయన్నారు.పాతతరం రాజకీయం ఓ రకంగా అంతరించిపోయిందని.. ప్రతిపక్షాలను అణచివేసే కార్యక్రమాలు జరుగుతున్నాయని రాహుల్ విమర్శలు గుప్పించారు. భారత్ జోడో యాత్రలో 4 వేల కిలోమీటర్లు నడిచానన్నారు. మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేశారు. వాదన వినిపించేందుకు కొత్త దారులు వెతుక్కోవాల్సి వస్తుంది. రాజకీయాల్లోకి కొత్త జనరేషన్ రావాలంటూ ఆయన పిలుపునిచ్చారు.విద్యా, వైద్యం తదితర అంశాలపై నూతన పాలసీలను రూపొందించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేశాను. దేశ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి నా పాదయాత్ర ఎంతగానో ఉపయోగపడింది. విద్వేష రాజకీయాలను మార్చాలని అర్థం చేసుకున్నాను. ఎంతో మందిని కలిసిన తర్వాత చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇండియాలో నూతన రాజకీయాలను నిర్మిద్దాం. అందరి ఆలోచనలు స్వీకరించి నూతన విధానాన్ని కొనసాగిద్దాం. పాదయాత్రలో ఒక వ్యక్తి వచ్చి ఐ లవ్ యూ అని చెప్పారు. ప్రేమ, ఆప్యాయతను ప్రజలతో పంచుకోవడం మొదలు పెట్టాను. పాదయాత్రలో అనేక మందిని కలిసిన తర్వాత విద్వేషపు బజారుల్లో ప్రేమ దుకాణాన్ని తెరిచానని స్లోగన్ తీసుకున్నాను’’ అని రాహుల్ పేర్కొన్నారు.అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యం: సీఎం రేవంత్‌ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడమే తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు. భారత్ సమ్మిట్‌లో ప్రసంగించడం గర్వంగా భావిస్తున్నా.. తెలంగాణకు ఎంతో గొప్ప చరిత్రతో పాటు ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయి. విద్యార్థులు, కార్మిక సంఘాలు, రైతులు, మహిళలు ఉద్యమానికి నాయకత్వం వహించారు. వారి పోరాటం వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని రేవంత్ అన్నారు.

ట్రంప్ యూటర్న్.. అమెరికాలో విదేశీ విద్యార్థులకు గుడ్‌న్యూస్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు విదేశీ విద్యార్థుల బహిష్కరణపై ట్రంప్ వెనక్కి తగ్గారు. తమ వీసాలు రద్దు చేయడంతో విదేశీ విద్యార్థులు అక్కడి న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీంతో, విద్యార్థులకు అనుకూలంగా తీర్పులు రావడంతో ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు.వివరాల ప్రకారం.. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి బహిష్కరణ ముప్పు ఎదుర్కొంటున్న వందల మంది విద్యార్థులకు ఊరట లభించింది. అయితే, అమెరికాలో విదేశీ విద్యార్థులపై ట్రంప్ బహిష్కరణ వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వివిధ కారణాలతో 187 కాలేజీలకు చెందిన 1200 మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసా (Student Visa) లేదా వారి చట్టబద్ధ హోదాలను ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో తమ వీసాల రద్దుపై విద్యార్థులు న్యాయస్థానాలను ఆశ్రయించారు.అనంతరం.. కాలిఫోర్నియా, బోస్టన్ కోర్టుల్లో విద్యార్థులు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన ఆయా న్యాయస్థానాలు.. విద్యార్థుల వీసా రద్దును ఆపాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ట్రంప్ యంత్రాంగం చర్యలను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ క్రమంలోనే ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్.. ఆయా విద్యార్థుల చట్టబద్ధ హోదాను తాత్కాలికంగా పునరుద్ధరించింది. ఈమేరకు అమెరికా ప్రభుత్వానికి చెందిన ఓ న్యాయవాది తాజాగా వెల్లడించారు. దీంతో ఆయా విద్యార్థులకు చట్టబద్ధ హోదా లభిస్తుందన్నారు.ఇదిలా ఉండగా.. విదేశీ విద్యార్థులపై బహిష్కరణ వేటు కారణంగా డిపోర్టేషన్, నిర్బంధం ముప్పు పొంచి ఉండటంతో ఆ విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. వీరిలో కొంతమంది ఇప్పటికే అమెరికాను వీడగా.. కొందరు రహస్య ప్రదేశాల్లో తల దాచుకున్నారు. తాజాగా కోర్టు వ్యాఖ్యలతో ట్రంప్ (Donald Trump) సర్కారు వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అనంత్ అంబానీకి కొత్త బాధ్యతలు: మే 1 నుంచి ఐదేళ్లు..
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) శుక్రవారం తన కంపెనీకి ఫుల్ టైమ్ డైరెక్టర్‌గా చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు 'అనంత్ అంబానీ'ని నియమిస్తున్నట్లు ప్రకటించింది. మానవ వనరులు, నామినేషన్, వేతన కమిటీ సిఫార్సు ఆధారంగా బోర్డు ఈ నియామకానికి ఆమోదం తెలిపింది.అనంత్ అంబానీ.. వాటాదారుల ఆమోదానికి లోబడి 2025 మే 1 నుంచి ఐదు సంవత్సరాల పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ హోల్ టైమ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తారని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.రిలయన్స్ బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేసిన అనంత్ అంబానీ.. ఇప్పుడు భారతదేశంలోని అత్యంత విలువైన కంపెనీలో డైరెక్టర్‌గా ఉండనున్నారు. ఇప్పటికే అనంత్ పలు రిలయన్స్ గ్రూప్ కంపెనీలలో కీలక బాధ్యతలు చేపట్టారు. నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు అనంత్ వేతనం.. ఏడాదికి రూ.4.2 కోట్లు. అయితే ఇప్పుడు ఫుల్ టైమ్ డైరెక్టర్‌గా నియామకమవ్వడంతో ఆయన వేతనం అంతే ఉంటుందా? పెరుగుతుందా అనే విషయం తెలియాల్సి ఉంది.అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందిన అనంత్ అంబానీ, జంతు సంక్షేమం పట్ల కూడా చాలా మక్కువ కలిగి ఉన్నారు. ప్రమాదంలో ఉన్న జంతువులకు పునరావాసం కల్పించడం.. వాటి చివరి సంవత్సరాల్లో సంరక్షణ అందించడంపై దృష్టి సారించిన అనేక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ సమయంలో కాలేయ వ్యాధి: ఇప్పుడు ఓ కంపెనీ అధినేత్రి..ఆకాష్ అంబానీ గ్రూప్ టెలికాం అండ్ డిజిటల్ సేవల విభాగం అయిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. ఇషా అంబానీ రిటైల్ విభాగం అయిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. అంతే కాకుండా ఆకాశ్, ఇషా అంబానీలు కూడా RIL బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా కూడా పనిచేస్తున్నారు.

కేకేఆర్‌తో మ్యాచ్.. పంజాబ్ కింగ్స్ వ్యూహాత్మక నిర్ణయం
ఐపీఎల్-2025 (IPL 2025)లో మరో రసవత్తర పోరు.. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్- పంజాబ్ కింగ్స్ (KKR vs PBKS) మధ్య మ్యాచ్.. శనివారం నాటి ఈ పోరుకు ఈడెన్ గార్డెన్స్ వేదిక.ఈ సీజన్లో ఇప్పటికే ముఖాముఖి ఇరుజట్లు తలపడగా.. అతి స్వల్ప లక్ష్యాన్ని (112) కాపాడుకుని పంజాబ్ కేకేఆర్‌పై జయభేరి మోగించింది. తద్వారా కేకేఆర్ మాజీ కెప్టెన్, పంజాబ్ ప్రస్తుత సారథి శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తన పాత జట్టుపై ప్రతీకారం తీర్చుకున్నాడు.వ్యూహాత్మక నిర్ణయంఇక సొంతగడ్డపై కేకేఆర్‌ను ఓడించాలనే పట్టుదలతో మరోసారి అయ్యర్ బరిలోకి దిగనున్నాడు. ఈ నేపథ్యంలో కేకేఆర్‌తో మ్యాచ్‌కు ముందు వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. దేశీ స్పిన్నర్ తనూశ్ కొటియాన్‌ను నెట్ బౌలర్‌గా రప్పించింది. అతడి బౌలింగ్‌లో పంజాబ్ బ్యాటర్లు శుక్రవారం ప్రాక్టీస్ చేశారు.అతడే ఎందుకు?ఈ సందర్భంగా పంజాబ్ స్పిన్ బౌలింగ్ కోచ్ సునిల్ జోషి.. తనూశ్కు సలహాలు, సూచనలు ఇవ్వడం కనిపించింది. కాగా ఇప్పటికే పంజాబ్ జట్టులో యజువేంద్ర చహల్ రూపంలో మేటి స్పిన్నర్ అందుబాటులో ఉండగా.. హర్‌ప్రీత్‌బ్రార్, ప్రవీణ్ దూబే అతడికి సహకారం అందిస్తున్నారు. అయితే, వీరంతా మణికట్టు స్పిన్నర్లే.అందుకే వైవిధ్యం కోసం ఆఫ్ స్పిన్నర్ అయిన తనూశ్ కొటియాన్‌ను పంజాబ్ నాయకత్వ బృందం బరిలోకి దించింది. కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్లు సునిల్ నరైన్, వరుణ్ చక్రవర్తిలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అతడి బౌలింగ్‌లో ప్రాక్టీస్ చేయించింది.ముంబైకి ప్రాతినిథ్యంకాగా 26 ఏళ్ల తనూశ్ కొటియాన్ దేశవాళీ క్రికెట్లో ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తన అద్భుత స్పిన్ నైపుణ్యాలతో దిగ్గజ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ వారసుడిగానూ నీరాజనాలు అందుకుంటున్నాడు. అయితే, భారత్-ఎ జట్టుకు ఆడుతున్నా.. ఇంత వరకు ఒక్కసారి కూడా జాతీయ జట్టుకు ఎంపిక కాలేదు.ఇక ఇటీవల దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై గెలవడంలో తనూశ్ది కీలక పాత్ర. ఈ ఆర్థోడాక్స్ ఆఫ్ స్పిన్నర్ ఇప్పటి వరకు 33 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 101 వికెట్లు తీశాడు. ఇందులో మూడుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. వేలంలో అమ్ముడుపోలేదు.. నెట్‌బౌలర్‌గా వచ్చాడు అంతేకాదు రెండు శతకాలు, 13 ఫిఫ్టీల సాయంతో 1525 పరుగులు సాధించాడు. ఇక లిస్ట్-ఎ క్రికెట్లో 19 మ్యాచ్‌లు ఆడి 20 వికెట్లు తీయడంతో పాటు.. 90 రన్స్ చేశాడు. అదే విధంగా 25 టీ20 మ్యాచ్‌లలో కలిపి 25 వికెట్లు కూల్చాడు.కాగా తనూశ్ కొటియాన్ గతేడాది రాజస్తాన్ రాయల్స్ జట్టులో ఉన్నాడు. వేలానికి ముందు ఫ్రాంఛైజీ అతడిని వదిలేయగా.. ఐపీఎల్-2025 మెగా ఆక్షన్‌లోకి రూ. 30 లక్షల కనీస ధరతో అందుబాటులోకి వచ్చాడు. కానీ పది ఫ్రాంఛైజీల్లో ఒక్కటీ తనూశ్పై ఆసక్తి చూపలేదు. దీంతో అతడు అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. ఇప్పుడు పంజాబ్ జట్టులోకి నెట్ బౌలర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. చదవండి: CSK vs SRH: ‘బుర్ర పనిచేయడం లేదా’?!.. మెండిస్‌పై కావ్యా మారన్ ఫైర్

పాక్ అధికారి బలుపు సైగలు.. భారతీయుల పీక కోస్తా అంటూ.. (వీడియో)
లండన్: పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఉగ్రవాద చర్యకు వ్యతిరేకంగా పలు దేశాల్లో భారతీయులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో భారతీయులపై పలుచోట్ల కవ్వింపు చర్యలకు దిగుతున్నారు పాకిస్తానీలు. తాజాగా యూకేలో(Pakistan High Commission in London) ప్రవాస భారతీయులను ఉద్దేశించి.. పాక్ చెందిన ఓ అధికారి ఓవరాక్షన్‌కు దిగాడు. పీక కోస్తానంటూ బహిరంగా సైగలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ భారతీయులు లండన్‌లోని పాకిస్థాన్ హైకమిషన్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ క్రమంలో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం, యూకేలో పాకిస్థాన్ హైకమిషన్‌కు చెందిన కల్నల్ తైమూర్ రహత్(Colonel Taimur Rahat) నిరసనలు తెలుపుతున్న ప్రదేశానికి వచ్చారు. అందరూ చూస్తుండగాకల్నల్ తైమూర్ రహత్.. భారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ ఫ్లెక్సీని భారతీయులకు చూపిస్తూ.. పీక కోస్తామంటూ సైగలు చేశాడు. ప్రవాస భారయుతీలను ఉద్దేశించి ఇలా ప్రవర్తించాడు. దీంతో, అక్కడున్న భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.JUST IN: 🇬🇧 Pakistan Army Officer Makes Throat-Slitting Gesture at Indian Protestors in London.Col. Taimur Rahat, Defence Attaché at Pakistan's UK Mission, caught behaving like a street thug — no difference between a uniformed officer and a terrorist.Shameful and cowardly… pic.twitter.com/gy5wY7dH48— Asia Nexus (@Asianexus) April 26, 2025ఇక, పాకిస్థాన్ హైకమిషన్ వద్ద భారతీయులు నిరసనలు తెలుపుతున్న సమయంలో ఆఫీసులో ఉన్న పాక్ అధికారులు భారీ సౌండ్‌తో మ్యూజిక్ వింటున్న శబ్దాలు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. నిరసనలు వారికి వినిపించకుండా ఉండేందుకే ఇలా చేసినట్టు సమాచారం. లండన్‌లోని పాక్ హైకమిషన్ వద్ద దాదాపు 500 మంది భారతీయులు నిరసనలు చేపట్టినట్టు సమాచారం. మరోవైపు, పహల్గాం దాడి తర్వాత.. ఢిల్లీలోని పౌక్ దౌత్య కార్యాలయంలో కేక్ తెచ్చుకుని సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీన్ని బట్టి చూస్తే భారతీయుల విషయంలో పాక్ అధికారులు ఎంత క్రూరంగా ఉన్నారో అర్థమవుతోంది. పాక్ అధికారుల తీరుపై అక్కడున్న సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. Pakistan High Commission London Military Attache Commander Muhammad Zeeshan Nabi Sheikh SI(M) Colonel Taimur Rahat Tea is Fantastic pic.twitter.com/7vz68nHTFk— Malik islam Awan (@MalikIslam_1) April 25, 2025 Indians in London were protesting against the Pahalgam attack outside the Pakistani embassyThen Colonel Taimur Rahat, Pakistan's military attache in Britain, came to the embassy balcony and signaled Indians to slit Abhinandan's throat with a photo of AbhinandanNow you think… pic.twitter.com/rbGpK81kj1— 🇮🇳Jitendra pratap singh🇮🇳 (@jpsin1) April 26, 2025సింధూ నదిలో పారేది రక్తమే.. ఇక, అంతకుముందు.. పాక్ మాజీ విదేశాంగ మంత్రి, పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ భిలావల్ భుట్టో (Bilawal Bhutto) జర్దారీ భారత్‌పై నోర పారేసుకున్నారు. సింధూ (Indus Water treaty) నదిలో నీరు పారకపోతే.. రక్తం పారుతుందంటూ ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సింధూ నది తమదేనని, ఆ నాగరికతకు నిజమైన సంరక్షకులం తామేనంటూ భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు.కాగా.. అంతకుముందు పాక్ (Pakistan) రక్షణ మంత్రి కూడా ఇదేతరహా ప్రేలాపనలు చేశారు. సింధూ నదిలో ప్రతి చుక్కా తమదేనని, భారత్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని మరో మంత్రి ఆరోపించారు. ఇక, మన దేశంపై విషం చిమ్ముతూ లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ సింధూ నది (Indus River) గురించి మాట్లాడిన వీడియో బయటికొచ్చింది. ‘కశ్మీర్లో డ్యాం నిర్మించడం ద్వారా పాక్‌కు నీళ్లు ఆపేస్తామని మీరంటున్నారు. పాక్‌ను నాశనం చేయాలని, చైనా-పాకిస్థాన్ ఆర్థిక నడవా ప్రణాళికలను విఫలం చేయాలని కోరుకుంటున్నారు. కానీ మీరు నీళ్లు ఆపేస్తే.. నదుల్లో మళ్లీ రక్తం పారుతుంది’ అని హఫీజ్ అందులో బెదిరింపులకు పాల్పడటం గమనార్హం.

పోలీసు కేసులు ప్రజాదరణను దూరం చేయలేవు!
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఒక వ్యాఖ్య చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఏమవుతుందని ప్రశ్నించారు. జైలుకు పంపినంత మాత్రాన ప్రజా వ్యతిరేకతను అణచి వేయలేరని ఆయన స్పష్టం చేశారు. గతంలో తనను 16 నెలలు జైలులో పెట్టారని, పార్టీని నడిపే పరిస్థితి లేకుండా చేశారని, అయినా ప్రజలు ఆశీర్వదించారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రతి గ్రామంలో పార్టీ ఉందని, ఎన్ని కేసులు పెడితే ప్రజలు అంత తీవ్రంగా స్పందిస్తారని పేర్కొన్నారు. జగన్ వ్యాఖ్యలు హేతుబద్దమైనవి. మద్యం కేసుతో పాటు సీనియర్ పోలీసు అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును అరెస్టు చేయడంపై ఆయన స్పందించారు. ఒక్కసారి గతంలోకి వెళితే 2011లో జగన్ కాంగ్రెస్ ఎంపీగా ఉండే వారు. తండ్రి మరణం తర్వాత జరిగిన పరిణామాలలో ఆయన సొంతంగా పార్టీని స్థాపించుకోవాలని నిర్ణయించుకుని పదవికి రాజీనామా చేశారు. కడప లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో 5.45 లక్షల ఓట్ల అధిక్యతతో విజయం సాధించి జగన్ సంచలనం సృష్టించారు. అప్పుడు కూడా కాంగ్రెస్, టీడీపీలు కలిసే కుట్ర చేశాయి. జగన్‌ను ప్రజా క్షేత్రంలో ఓడించాలేమన్న భయంతో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఏపీలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై వచ్చిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వకుండా తటస్థంగా వ్యవహరించి కాంగ్రెస్‌కు అండగా నిలిచారు. ఆ తర్వాత జగన్ కంపెనీలతో సంబంధం లేని కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకరరావుతో హైకోర్టులో ఫిర్యాదు చేయించడం, దానికి టీడీపీ మద్దతివ్వడం, ఆ వెంటనే హైకోర్టు ఆ కేసును సీబీఐకి అప్పగించడం జరిగిపోయాయి.తదుపరి సీబీఐ కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు ముఖ్యంగా సోనియాగాంధీ ఆదేశాల ప్రకారం వ్యవహరించి జగన్‌ను జైలులో పెట్టింది. బెయిల్ రాకుండా కూడా అడ్డుపడ్డారు. చివరికి 16 నెలల తర్వాత బెయిల్ లభించింది. అయినా ఆయన రాజకీయంగా నిలబడ్డారు. జైలులో ఉన్నప్పుడు జరిగిన 18 ఉప ఎన్నికలలో 15 చోట్ల జగన్ పార్టీ విజయ దుంధుభి మొగించింది. ఆ అనుభవాలను మననం చేసుకుంటే సరిగ్గా అదే రీతిలో ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వైసీపీ నేతలపై, కొందరు అధికారులపై కేసులు పెడుతున్నట్లు కనిపిస్తుంది. కూటమి అధికారంలోకి రాగానే రాజకీయ ముద్ర వేసి కొందరు అధికారులను సస్పెండ్ చేయడం చేశారు. పోస్టింగులు ఇవ్వకుండా వేధించారు. ఒక మోసకారి నటిని పట్టుకు వచ్చి పోలీసు ఉన్నతాధికారిపై కేసు పెట్టించి, తదుపరి ఆయనను జైలులో పెట్టారు. మరో వైపు అనేక మంది వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెడుతూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఇందు కోసం కొందరు రిటైర్డ్ పోలీసు అధికారులను కూడా ఉపయోగించుకుంటున్నారని చెబుతారు. ఆ తర్వాత తమ రెడ్‌బుక్‌ను పై స్థాయికి తీసుకు రావడానికి ప్రయత్నాలు ఆరంభించారు. దీనికి తగ్గట్లే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో కూడా ఈ కేసుపై చర్చించారని అనుకోవాలి. పైకి పోలవరం-బనకచర్ల తదితర అంశాలపై షా ను కలిసినట్లు ఎల్లో మీడియాలో వార్తలు రాయించుకున్నారు. ఆ పత్రికలలోనే జగన్‌పై మద్యం కేసు విషయంపై కూడా మాట్లాడారని తెలిపారు. అంటే గతంలో కాంగ్రెస్‌తో కుమ్మక్కై పెట్టినట్లుగానే, ఈసారి బీజేపీతో ఒప్పందమై ఇలాంటిదేదో చేయాలని చూస్తున్నట్లు ఉన్నారు.2014 టర్మ్‌లో బీజేపీతో పొత్తులో ఉన్నపుడు ప్రధాని మోడీని చంద్రబాబు కలిసినప్పుడల్లా కేవలం జగన్ కేసులపై ఏదో ఒకటి చేయాలని కోరుతుండేవారని, అప్పటి బీజేపీ అధ్యక్షుడు, ఇప్పటి టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆ రోజుల్లో పలుమార్లు చెప్పేవారు. అదే తరహాలో ఇప్పుడు కూడా బీజేపీ పెద్దలతో సంప్రదించి తన కుట్ర ప్లాన్ అమలు చేయాలని తలపెట్టినట్లు అనుమానాలు వస్తున్నాయి. జగన్ పై 2011 లో పెట్టిన కేసులు ఏమిటి? ఆయన కంపెనీలలో కొందరు పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టారని అందులో క్విడ్ ప్రోక్ జరిగిందని సీబీఐ ఆరోపించింది. అయితే ఇందుకు సంబంధించిన ఏ కంపెనీ కూడా జగన్‌పై ఫిర్యాదు చేయలేదు. అలాగే ప్రభుత్వం, మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలతో జగన్‌కు సంబంధం లేదు. అయినా తన కంపెనీలు ఏర్పాటైన మూడేళ్ల తర్వాత కక్షపూరితంగా కేసులు పెట్టారు. ఇప్పుడు కూడా అదే మోడల్ కనిపిస్తుంది. మద్యం కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ఏ డిస్టిలరీ ఫిర్యాదు చేయలేదు. ఎవరో దారినపోయే వ్యక్తి లెటర్ రాయడం, ఆ వెంటనే దానిపై ప్రభుత్వ కార్యదర్శి ఏసీబీ విచారణకు విచారించాలని పంపడం, తదుపరి ఆగమేఘాల మీద కేసు పెట్టడం అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసు దర్యాప్తులో సిట్ అధికారులు బెవరేజెస్ కార్పొరేషన్ అధికారులను బెదిరించి వాంగ్మూలాలను తీసుకోవడం, వారు హైకోర్టును ఆశ్రయించడం, ఆ తర్వాత వేధింపులు తట్టుకోలేక పోలీసు అధికారులు కోరిన స్టేట్మెంట్ పై సంతకాలు చేశారట. తదుపరి మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డిని ఒక పావుగా వాడుకున్నట్లు అనిపిస్తుంది. ఆయన తనకేదో దీని నుంచి రక్షణ కలుగుతుందని అనుకున్నారో ,ఏమో కాని, రాజ్ కెసిరెడ్డి అన్న మాజీ ఐటి సలహాదారుపై ఆరోపణలు చేశారు.దాంతో విజయసాయిని అదుపులోకి తీసుకోకుండా సిట్ బృందం వదలి వేసింది. ఆ తర్వాత సుప్రీం కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందిన ఎంపీ మిథున్ రెడ్డిని విచారించారు. ఆయన తన వాదన చాలా స్పస్టంగా వినిపించగలిగారు. ఆధారాలు ఉంటే కోర్టులో రుజువు చేయండని సవాల్ చేశారు. తమ కుటుంబంపై చంద్రబాబు కాని, ఎల్లో మీడియా కాని పగపట్టి ఇటీవలి కాలంలో ప్రచారం చేసిన ఉదంతాలను ఆయన మీడియా ముందు ప్రస్తావించి వాటిలో ఒక్కదానిని కూడా నిరూపించలేకపోయిన విషయాన్ని తెలిపారు. ఆ తర్వాత గోవా నుంచి హైదరాబాద్ వచ్చిన రాజ్ కెసిరెడ్డిని హడావుడిగా అదుపులోకి తీసుకున్నారు. ఎల్లో మీడియాలో ఆయనపై పలు కథనాలు రాయించారు. గోవా నుంచి హైదరాబాద్ వచ్చి, అక్కడ నుంచి చెన్నై ద్వారా విదేశాలకు వెళ్లాలని ఆయన ప్లాన్ చేశారని అర్థం, పర్థం లేని రాతలు రాశారు. నిజంగానే అలా వెళ్లదలిస్తే నేరుగా గోవా నుంచో, లేక దగ్గరలో ఉన్న ముంబై, లేదా చెన్నై వెళ్లి విదేశాలకు పోయి ఉండవచ్చు కదా అన్న ప్రశ్నకు జవాబు దొరకదు. కెసిరెడ్డిని విచారించిన సందర్భంలో కూడా పలు పరస్పర విరుద్దమైన అంశాలను సిట్ రిమాండ్ రిపోర్టులో కనిపించాయి. ఒకసారి ఆయన సీఎంఓ అధికారులకు మద్యం డబ్బు చేరవేసినట్లు, మరోసారి ఆయనే ఆయా కంపెనీలలో పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారట. నాలుగు డిస్టిలరీల నుంచే మద్యం ఎక్కువగా తీసుకోవడంపై రిమాండ్ రిపోర్టులో సందేహం వ్యక్తం చేశారు. మరి అదే తరహాలో చంద్రబాబు ప్రభుత్వంలోను జరిగింది కదా అన్నదానికి రిప్లై లేదు.అన్నిటికి మించి రిమాండ్ రిపోర్టుపై రాజ్ సంతకం పెట్టడానికి నిరాకరించారని కూడా సిట్ తెలియ చేసింది. అలాంటప్పుడు ఆ రిపోర్టుకు ఎంత విలువ ఉంటుంది? కేవలం ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియాలో బానర్లు పెట్టుకుని ఆనందపడడానికి తప్ప. జగన్ పేరేదో ఆయన నేరుగా చెప్పారన్నట్లుగా ప్రచారం చేసిన ఈ మీడియా దానిపై రాజ్ సంతకం లేదన్న అంశానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా జాగ్రత్తపడింది. అంటే దీనర్థం ఏదో రకంగా జగన్‌ను జనంలో పలచన చేయడం ద్వారా ప్రజలు ఆ అంశంపై చర్చించుకుంటూ, చంద్రబాబు అండ్ కో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను మర్చిపోవాలనే కదా! మరో సంగతి చెప్పాలి. విజయసాయి తననేదో వదలి వేస్తారని అనుకున్నట్లు ఉన్నారు. రాజ్ అరెస్టు కాగానే ఆయన ఒక కామెంట్ చేశారట. దొరికిన దొంగలు, దొరకని దొంగలు అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆయన కూడా నిందితుడే అయినందున ఏ తరహా కిందకు వస్తారో తేల్చుకోవాలి. ఒకటి మాత్రం వాస్తవం. ప్రజలలో కూటమి సర్కార్ పై విపరీతమైన వ్యతిరేకత కనిపిస్తోంది. అదే టైమ్‌లో జగన్ ఎక్కడకు వెళ్లిన వేల సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. అంటే భవిష్యత్తులో తన పార్టీకి, తన వారసులకు జగన్ పెద్ద బెడద అవుతారని చంద్రబాబు భయపడుతున్నారు. అందుకే ఈ రకమైన కక్ష రాజకీయాలు చేస్తున్నారు.అమిత్ షా తో కూడా ఇదే అంశంపై మాట్లాడడానికి ఢిల్లీ వెళ్లారంటే ఆయనకు ప్రజలకు ఇచ్చిన హామీలకన్నా, జగన్‌ను ఎలాగొలా ఇబ్బంది పెట్టాలన్న లక్ష్యం ఉన్నట్లు అర్థం అవుతోంది కదా! ఇవన్ని గమనించిన తర్వాత జగన్ పీఏసీ సమావేశంలో మాట్లాడినట్లు ఆయన కాని, వైసీపీ శ్రేణులు కాని అన్నిటికి సిధ్దమైనట్ల స్పష్టం అవుతోంది కదా! ఇదే చంద్రబాబుకు అతి పెద్ద సవాల్!- కొమ్మినేని శ్రీనివాస రావు సీనియర్ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

విజయవాడలో దారుణం.. డేటింగ్ పేరుతో హోటల్ రూమ్ బుక్ చేసి..
సాక్షి, విజయవాడ: మాయమాటలతో అమ్మాయిలను దోచేస్తున్న కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను సెంట్రల్ ఏసీపీ దామోదర్ మీడియాకు వెల్లడించారు. కోనసీమ జిల్లాకు చెందిన ఓ యువతి ఉద్యోగం కోసం విజయవాడకు వచ్చింది. వెటర్నరీ కాలనీలోని ఓ హాస్టల్లో ఉంటున్న ఆ యువతికి నెల రోజుల క్రితం కిలారి నాగతేజతో లవ్లీ డేటింగ్ యాప్‌లో పరిచయమైంది. కాగా, నెల రోజుల నుంచి కిలారి నాగతేజ, సదరు యువతి రోజూ ఫోన్లలో మాట్లాడుకుంటున్నారు. డేటింగ్లో భాగంగా ఈ నెల 22 తేదీన ఓ హోటల్లో నాగతేజను ఆ యువతి కలిసింది.ఇద్దరి కోసం హోటల్లో రూమ్ బుక్ చేసిన నాగతేజ.. యువతి నగ్నవీడియోలు తీశాడు. అనంతరం కత్తి చూపించి ఆ యువతి ఒంటిపై బంగారాన్ని తీసుకుని నాగతేజ పారిపోయాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో నాగతేజను పోలీసులు అరెస్ట్ చేశారు.వ్యసనాలకు బానిసైన నాగతేజ.. డబ్బుల కోసం అమ్మాయిలను మోసగిస్తున్నాడు. గతంలోనూ పలువురు యువతులను మోసం చేసిన నాగతేజ.. జైలుకు వెళ్లొచ్చినా తీరు మారలేదు. నాగతేజ అరెస్ట్‌లో సీసీ ఫుటేజ్ కీలకంగా మారింది. డేటింగ్ యాప్, టెలిగ్రామ్, ఫేస్ బుక్, ఇన్‌స్టా గ్రామ్ ద్వారా జరిగే మోసాలపై మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ దామోదర్ సూచించారు.

30 సార్లు ఫోన్ చేసినా హిమాన్షి లిఫ్ట్ చేయలేదు.. బిగ్‌బాస్ విన్నర్
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack)లో 26 మంది కన్నుమూశారు. వారిలో ఇండియన్ నేవీ లెఫ్టినెంట్ కల్నల్ వినయ్ నర్వాల్ ఒకరు. ఏప్రిల్ 16న వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఈ నేవీ అధికారి.. హనీమూన్ కోసం ఏప్రిల్ 21న కశ్మీర్ వెళ్లారు. భార్యతో కలిసి కొత్త లైఫ్‌ను ప్రారంభించాలనుకున్నారు. కానీ, ఆ మరుసటి రోజు పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో వినయ్ నర్వాల్ నేలకొరిగారు.పెళ్లయిన ఆరు రోజులకే..కళ్ల ముందే భర్త ప్రాణాలు కోల్పోవడం చూసి గుండెలు పగిలేలా రోదించింది భార్య హిమాన్షి. అందుకు సంబంధించిన ఫోటో, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించాయి. బిగ్‌బాస్ విన్నర్ ఎల్విష్ యాదవ్ (Elvish Yadav) అయితే ఆ వీడియోలు చూసి మరింత షాక్‌కు గురయ్యాడు. హిమాన్షి కాలేజీలో రోజుల్లో తన క్లాస్మేట్ అని గుర్తు చేసుకున్నాడు. ఇంకా షాక్‌లోనే ఉన్నా..ఎల్విష్ మాట్లాడుతూ.. నేను హన్సరాజ్ కాలేజీలో చదువుకున్నాను. 2018లో నా చదువు పూర్తయింది. హిమాన్షిది కూడా అదే కాలేజ్.. ఆ రోజుల్లో మేము చాలా ఎంజాయ్ చేసేవాళ్లం. మెట్రో స్టేషన్‌కు కూడా కలిసి వెళ్లేవాళ్లం. కాలేజ్ అయిపోయాక మళ్లీ మేము మాట్లాడుకోలేదు. కాకపోతే తన నెంబర్ నా దగ్గర ఇప్పటికీ ఉంది. కానీ, ఇప్పుడామె ఫోన్ ఎత్తి మాట్లాడే పరిస్థితిలో లేదనుకుంటున్నాను. పైగా నేనే ఇంకా షాక్‌లో ఉన్నా.. అలాంటిది తన పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉండి ఉంటుంది!31వ సారి ఫోన్ ఎత్తిందిఅందుకే ఇది సరైన సమయం కాదేమో అనిపించి తనకు ఫోన్ చేసి మాట్లాడలేదు. నా ఫ్రెండ్ ఒకరు తనకు 30 సార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. 31వ సారి ఫోన్ ఎత్తింది. మీడియాలో వస్తున్నట్లుగానే మతం అడిగి తెలుసుకుని మరీ హిందువులను చంపేశారన్నది నిజం అని చెప్పుకొచ్చాడు. కాగా ఎల్విష్ యాదవ్.. హిందీ బిగ్‌బాస్ ఓటీటీ రెండో సీజన్ విజేతగా నిలిచాడు.చదవండి: పారితోషికంగా నోట్ల కట్టలు.. హైదరాబాద్ కింగ్ నేనే: నాని
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
పాకిస్తాన్‌కు ఎప్పుడు వస్తున్నావ్? దద్దమ్మ అంటూ సింగర్ కౌంటర్
మహిళా ప్రయాణికుల భద్రతకు ట్యూటెమ్ యాప్
రాజకీయాల్లోకి కొత్త జనరేషన్ రావాలి: రాహుల్ గాంధీ
ప్రెగ్నెన్సీతో స్టార్ హీరోయిన్.. కోటి రూపాయల గిఫ్ట్!
పెట్ పేరెంట్స్ ఈ మార్గదర్శకాలు మీకోసమే.. లేదంటే!
ఫారిన్ ఫ్లో: స్థిరాస్తి రంగంలో విదేశీ పెట్టుబడుల వెల్లువ..
కేకేఆర్‌తో మ్యాచ్.. పంజాబ్ కింగ్స్ వ్యూహాత్మక నిర్ణయం
‘ఏపీలో స్కీములు లేవు.. అన్నీ స్కాములే’
సీమా హైదర్ పాక్ వెళ్లిపోవాల్సిందేనా?రాఖీ సావంత్ సంచలన వీడియో
చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఐపీఎల్ హిస్టరీలోనే
బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయమన్నా పోయరు!
ప్రాణాలు కాపాడిన ఉప్పు
ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్.. మండిపడ్డ నెటిజన్స్!
సికింద్రాబాద్: గోదాంలో భారీగా నోట్ల కట్టలు కలకలం
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
IPL 2025: ప్లే ఆఫ్స్ రేసు.. ఏ జట్టు ఎన్ని మ్యాచ్‌లు గెలవాలంటే?
తల్లికి వందనం డబ్బులు అడిగితే సంపద సృష్టించే మార్గం చెవిలో చెప్పండని వెళ్లిపోతున్నాడు!
ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
మోస్ట్ పవర్ ఫుల్ ఆర్మీ కల్గిన దేశాలు ఇవే..
వాళ్ల సంగతేమోగానీ! వలసదారులపై మీదాడి గురించి ప్రపంచం కూడా సంతోషంగా లేదు
తెలంగాణకు వర్షసూచన.. ఐదు రోజులు ఈ జిల్లాల్లో గట్టి వానలే..
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు
SRH Vs CSK: గెలిచి నిలిచిన రైజర్స్
కొడుకు అందంగా పుట్టాడని వేధింపులు
PSL: పాకిస్తాన్‌కు భారీ షాక్!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక..
ట్రంప్ యూటర్న్.. అమెరికాలో విదేశీ విద్యార్థులకు గుడ్‌న్యూస్
‘గోల్డెన్ ఛాన్స్ మిస్.. బుర్ర పనిచేయడం లేదా’?!.. కావ్యా మారన్ ఫైర్!
మళ్లీ ఉగ్ర కాండ!
బీరప్పా.. నువ్వు గ్రేటప్పా!
పాకిస్తాన్‌కు వెళ్లిపోయిన కేన్ మామ
కోడలికి రెండో పెళ్లి చేసి, కన్నీటితో సాగనంపిన ‘మామగారు’
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
ఏపీ గవర్నర్‌ను కలిసిన వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ
యాహూ! ఎట్టకేలకు భారతీయురాలిగా..! వీడియో వైరల్
ఒక్కరంటే పర్లేదు.. అందరూ అంతే: అసంతృప్తి వెళ్లగక్కిన ధోని
ఇద్దరు వధువులు.. ఒక వరుడు
Pahalgam: ‘ఆ వీడియోలో ఉన్నది మేమే.. వినయ్ సార్ కాదు’
అంతా భారత్ ఇష్టమేనా?.. దేనికైనా రెడీ.. పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు
Sodara Review: సంపూర్ణేష్ బాబు ‘సోదరా’ మూవీ రివ్యూ
సింధు జలాలను ఆపడమంటే యుద్ధం ప్రకటించడమే: పాక్
సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
మెగా అగచాట్ల డీఎస్సీ!
నా భార్య వర్షిణి ఎక్కడ?.. ప్రత్యేక బ్యారెక్‌లో అఘోరీ అరుపులు, కేకలు!
నా వారసత్వం గొప్పగౌరవమనుకో: శ్రీలీలకు సీనియర్ నటి ఉద్భోధ
పహల్గాం ఉగ్రదాడిపై పాక్ ఉప ప్రధాని సంచలన వ్యాఖ్యలు
విరాట్ కోహ్లి తొందరపడ్డాడు.. అప్పటి వరకు ఆడాల్సింది: సురేష్ రైనా
ఒకే ఇల్లు.. ఒకే వంట
భారత్-పాక్ మధ్య యుద్ధ మేఘాలు.. ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్!
టాపర్ కాస్త హంతకుడిగా..
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
ఉద్యోగుల సంక్షేమాన్ని పట్టించుకోండి
'జాను లిరి ఎవరో కూడా నాకు తెలియదు'.. అది తలచుకుంటే బాధేసింది!
వివాహేతర సంబంధం, భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని..
బయోమెట్రిక్స్, చిరునామా
ఉద్యోగంలో ఉంటారా? ప్యాకేజీ తీసుకొని వెళ్తారా?
పాక్ అధికారి బలుపు సైగలు.. భారతీయుల పీక కోస్తా అంటూ.. (వీడియో)
అవినీతి 'ఐకానిక్'!
పిల్లపామును పెంచి పోషిస్తున్న హఫీజ్ సయ్యద్!
ఔను.. చెత్త పనులు చేశాం.. తప్పు ఒప్పుకున్న పాక్
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
IPL 2025: ‘ఇదొక అద్భుత విజయం.. ప్లే ఆఫ్స్ చేరతాం’
విశాఖలో దంపతుల దారుణహత్య
పాక్‌ను ముక్కలు చేయండి
ఐటీఆర్ ఫైలింగ్‌కు వేళాయే..
ఉగ్రదాడి ఘటనపై నోరు జారిన ఎమ్మెల్యే అరెస్ట్
చిరంజీవి సినిమాలో విలన్‌గా టాలీవుడ్ యంగ్ హీరో!
పహల్గాం ఘటన.. పాక్ కపట నాటకం
నేనేమీ మాట్లాడలేను.. ఒంటరిగా వదిలేయండి:
నా నియోజకవర్గంలో నువ్వు వేలు పెట్టడం ఏంటి?
నిశ్చితార్థం చేసుకుని ఏడాది.. మరి పెళ్లెప్పుడు?
ఆ నలుగురిని వదిలేస్తేనే సీఎస్కే బాగుపడుతుంది: సెహ్వాగ్
కోటీశ్వరుడినయ్యా.. నాకేంటి?!.. వచ్చే ఏడాది కనిపించడు: సెహ్వాగ్
ఇంట్లో పాముల కలకలం
పాకిస్తానీలు వెంటనే మీ దేశానికి వెళ్లండి: తెలంగాణ డీజీపీ
ఆపరేషన్ అనంతరం వెకేషన్లో యాంకర్ రష్మీ.. దేవుడిలాగే చేస్తాడేమో!
ఇక్రమ్.. ఇంకా ఇక్కడే!
పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణం
కాకమ్మకు జర్రమొచ్చింది.. చీమల పుట్టను వెతుక్కుంది
ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
పర్యాటకుల మతంపై ఆరా తీసిన పోనీ రైడ్ నిర్వాహకుడి అరెస్ట్
పహల్గాం ఘటన: ఎల్ఐసీ కీలక ప్రకటన
అనుష్క చేతిలో ఏడు సినిమాలు? ప్రభాస్‌కు జంటగా..!
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
'నెక్ట్స్ వేకేషన్ జమ్మూ కశ్మీర్‌లోనే'.. కేఎల్ రాహుల్ మామ సంచలన కామెంట్స్!
SRH Vs CSK: వారెవ్వా మెండిస్.. ఐపీఎల్ చరిత్రలోనే సంచలన క్యాచ్
'ఇక్కడి వారికి హృదయం ఉంది'.. అందుకే..! పాక్ తండ్రి కంటతడి
ప్రపంచంలోనే తొలి డయాబెటిస్ రైస్ కుక్కర్..!
టూరిస్టులతో టెర్రరిస్ట్.. ‘మా పిల్లలు బాధపడుతుంటే.. మీరు సెలవులు ఎంజాయ్ చేస్తారా?’
సాక్షి కార్టూన్ 25-04-2025
ఐపీఎల్ క్రికెటర్ ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్
పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్‌పై దాడి.. పది మంది సైనికులు మృతి
జలదిగ్బంధం!
పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించిన పాక్ నటి.. నెటిజన్ల ఆగ్రహం!
నాటి రైతు బిడ్డ... నేడు ఐపీఎల్ హీరో
మాజీ ఇరిగేషన్ అధికారి హరిరాం ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీగా ఆస్తి పత్రాలు..
రెండోసారి ప్రెగ్నెన్సీ.. భర్తకి తెలుగు సీరియల్ నటి సర్ ప్రైజ్
సత్తా చాటిన ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్: రూ.35 వేల కోట్లకుపైగా బిజినెస్
బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!
పవన్ సినిమా వాయిదా.. ఎందుకంటే ఈ రెండు మూవీస్
‘అలా చేస్తే అర్జున్ టెండుల్కర్ మరో క్రిస్‌గేల్ అవుతాడు’
బిడ్డను చంపి తల్లిపై గ్యాంగ్‌రేప్!
కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. 38 మంది మావోయిస్టులు మృతి!
అంతర్జాతీయ ప్రయాణం .. మరింత భారం
సునీత మేడం.. వీటికి సమాధానం చెప్పండి: ప్రవస్తి
రూటు మార్చిన చంద్రబాబు.. ఏపీలో ఆర్థిక విధ్వంసం
ధోనీ కంపెనీలో 200 మందికి లేఆఫ్స్
కొత్త టెక్నాలజీలను ఆవిష్కరించిన టీసీఎస్
మూడు సార్లు ప్రెగ్నెన్సీ అయినా ఓకే కానీ : సానియా మీర్జా భావోద్వేగ జర్నీ
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
పాకిస్తాన్‌కు ఎప్పుడు వస్తున్నావ్? దద్దమ్మ అంటూ సింగర్ కౌంటర్
మహిళా ప్రయాణికుల భద్రతకు ట్యూటెమ్ యాప్
రాజకీయాల్లోకి కొత్త జనరేషన్ రావాలి: రాహుల్ గాంధీ
ప్రెగ్నెన్సీతో స్టార్ హీరోయిన్.. కోటి రూపాయల గిఫ్ట్!
పెట్ పేరెంట్స్ ఈ మార్గదర్శకాలు మీకోసమే.. లేదంటే!
ఫారిన్ ఫ్లో: స్థిరాస్తి రంగంలో విదేశీ పెట్టుబడుల వెల్లువ..
కేకేఆర్‌తో మ్యాచ్.. పంజాబ్ కింగ్స్ వ్యూహాత్మక నిర్ణయం
‘ఏపీలో స్కీములు లేవు.. అన్నీ స్కాములే’
సీమా హైదర్ పాక్ వెళ్లిపోవాల్సిందేనా?రాఖీ సావంత్ సంచలన వీడియో
చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఐపీఎల్ హిస్టరీలోనే
బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయమన్నా పోయరు!
ప్రాణాలు కాపాడిన ఉప్పు
ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్.. మండిపడ్డ నెటిజన్స్!
సికింద్రాబాద్: గోదాంలో భారీగా నోట్ల కట్టలు కలకలం
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
IPL 2025: ప్లే ఆఫ్స్ రేసు.. ఏ జట్టు ఎన్ని మ్యాచ్‌లు గెలవాలంటే?
తల్లికి వందనం డబ్బులు అడిగితే సంపద సృష్టించే మార్గం చెవిలో చెప్పండని వెళ్లిపోతున్నాడు!
ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
మోస్ట్ పవర్ ఫుల్ ఆర్మీ కల్గిన దేశాలు ఇవే..
వాళ్ల సంగతేమోగానీ! వలసదారులపై మీదాడి గురించి ప్రపంచం కూడా సంతోషంగా లేదు
తెలంగాణకు వర్షసూచన.. ఐదు రోజులు ఈ జిల్లాల్లో గట్టి వానలే..
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు
SRH Vs CSK: గెలిచి నిలిచిన రైజర్స్
కొడుకు అందంగా పుట్టాడని వేధింపులు
PSL: పాకిస్తాన్‌కు భారీ షాక్!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక..
ట్రంప్ యూటర్న్.. అమెరికాలో విదేశీ విద్యార్థులకు గుడ్‌న్యూస్
‘గోల్డెన్ ఛాన్స్ మిస్.. బుర్ర పనిచేయడం లేదా’?!.. కావ్యా మారన్ ఫైర్!
మళ్లీ ఉగ్ర కాండ!
బీరప్పా.. నువ్వు గ్రేటప్పా!
పాకిస్తాన్‌కు వెళ్లిపోయిన కేన్ మామ
కోడలికి రెండో పెళ్లి చేసి, కన్నీటితో సాగనంపిన ‘మామగారు’
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
ఏపీ గవర్నర్‌ను కలిసిన వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ
యాహూ! ఎట్టకేలకు భారతీయురాలిగా..! వీడియో వైరల్
ఒక్కరంటే పర్లేదు.. అందరూ అంతే: అసంతృప్తి వెళ్లగక్కిన ధోని
ఇద్దరు వధువులు.. ఒక వరుడు
Pahalgam: ‘ఆ వీడియోలో ఉన్నది మేమే.. వినయ్ సార్ కాదు’
అంతా భారత్ ఇష్టమేనా?.. దేనికైనా రెడీ.. పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు
Sodara Review: సంపూర్ణేష్ బాబు ‘సోదరా’ మూవీ రివ్యూ
సింధు జలాలను ఆపడమంటే యుద్ధం ప్రకటించడమే: పాక్
సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
మెగా అగచాట్ల డీఎస్సీ!
నా భార్య వర్షిణి ఎక్కడ?.. ప్రత్యేక బ్యారెక్‌లో అఘోరీ అరుపులు, కేకలు!
నా వారసత్వం గొప్పగౌరవమనుకో: శ్రీలీలకు సీనియర్ నటి ఉద్భోధ
పహల్గాం ఉగ్రదాడిపై పాక్ ఉప ప్రధాని సంచలన వ్యాఖ్యలు
విరాట్ కోహ్లి తొందరపడ్డాడు.. అప్పటి వరకు ఆడాల్సింది: సురేష్ రైనా
ఒకే ఇల్లు.. ఒకే వంట
భారత్-పాక్ మధ్య యుద్ధ మేఘాలు.. ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్!
టాపర్ కాస్త హంతకుడిగా..
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
ఉద్యోగుల సంక్షేమాన్ని పట్టించుకోండి
'జాను లిరి ఎవరో కూడా నాకు తెలియదు'.. అది తలచుకుంటే బాధేసింది!
వివాహేతర సంబంధం, భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని..
బయోమెట్రిక్స్, చిరునామా
ఉద్యోగంలో ఉంటారా? ప్యాకేజీ తీసుకొని వెళ్తారా?
పాక్ అధికారి బలుపు సైగలు.. భారతీయుల పీక కోస్తా అంటూ.. (వీడియో)
అవినీతి 'ఐకానిక్'!
పిల్లపామును పెంచి పోషిస్తున్న హఫీజ్ సయ్యద్!
ఔను.. చెత్త పనులు చేశాం.. తప్పు ఒప్పుకున్న పాక్
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
IPL 2025: ‘ఇదొక అద్భుత విజయం.. ప్లే ఆఫ్స్ చేరతాం’
విశాఖలో దంపతుల దారుణహత్య
పాక్‌ను ముక్కలు చేయండి
ఐటీఆర్ ఫైలింగ్‌కు వేళాయే..
ఉగ్రదాడి ఘటనపై నోరు జారిన ఎమ్మెల్యే అరెస్ట్
చిరంజీవి సినిమాలో విలన్‌గా టాలీవుడ్ యంగ్ హీరో!
పహల్గాం ఘటన.. పాక్ కపట నాటకం
నేనేమీ మాట్లాడలేను.. ఒంటరిగా వదిలేయండి:
నా నియోజకవర్గంలో నువ్వు వేలు పెట్టడం ఏంటి?
నిశ్చితార్థం చేసుకుని ఏడాది.. మరి పెళ్లెప్పుడు?
ఆ నలుగురిని వదిలేస్తేనే సీఎస్కే బాగుపడుతుంది: సెహ్వాగ్
కోటీశ్వరుడినయ్యా.. నాకేంటి?!.. వచ్చే ఏడాది కనిపించడు: సెహ్వాగ్
ఇంట్లో పాముల కలకలం
పాకిస్తానీలు వెంటనే మీ దేశానికి వెళ్లండి: తెలంగాణ డీజీపీ
ఆపరేషన్ అనంతరం వెకేషన్లో యాంకర్ రష్మీ.. దేవుడిలాగే చేస్తాడేమో!
ఇక్రమ్.. ఇంకా ఇక్కడే!
పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణం
కాకమ్మకు జర్రమొచ్చింది.. చీమల పుట్టను వెతుక్కుంది
ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
పర్యాటకుల మతంపై ఆరా తీసిన పోనీ రైడ్ నిర్వాహకుడి అరెస్ట్
పహల్గాం ఘటన: ఎల్ఐసీ కీలక ప్రకటన
అనుష్క చేతిలో ఏడు సినిమాలు? ప్రభాస్‌కు జంటగా..!
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
'నెక్ట్స్ వేకేషన్ జమ్మూ కశ్మీర్‌లోనే'.. కేఎల్ రాహుల్ మామ సంచలన కామెంట్స్!
SRH Vs CSK: వారెవ్వా మెండిస్.. ఐపీఎల్ చరిత్రలోనే సంచలన క్యాచ్
'ఇక్కడి వారికి హృదయం ఉంది'.. అందుకే..! పాక్ తండ్రి కంటతడి
ప్రపంచంలోనే తొలి డయాబెటిస్ రైస్ కుక్కర్..!
టూరిస్టులతో టెర్రరిస్ట్.. ‘మా పిల్లలు బాధపడుతుంటే.. మీరు సెలవులు ఎంజాయ్ చేస్తారా?’
సాక్షి కార్టూన్ 25-04-2025
ఐపీఎల్ క్రికెటర్ ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్
పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్‌పై దాడి.. పది మంది సైనికులు మృతి
జలదిగ్బంధం!
పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించిన పాక్ నటి.. నెటిజన్ల ఆగ్రహం!
నాటి రైతు బిడ్డ... నేడు ఐపీఎల్ హీరో
మాజీ ఇరిగేషన్ అధికారి హరిరాం ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీగా ఆస్తి పత్రాలు..
రెండోసారి ప్రెగ్నెన్సీ.. భర్తకి తెలుగు సీరియల్ నటి సర్ ప్రైజ్
సత్తా చాటిన ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్: రూ.35 వేల కోట్లకుపైగా బిజినెస్
బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!
పవన్ సినిమా వాయిదా.. ఎందుకంటే ఈ రెండు మూవీస్
‘అలా చేస్తే అర్జున్ టెండుల్కర్ మరో క్రిస్‌గేల్ అవుతాడు’
బిడ్డను చంపి తల్లిపై గ్యాంగ్‌రేప్!
కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. 38 మంది మావోయిస్టులు మృతి!
అంతర్జాతీయ ప్రయాణం .. మరింత భారం
సునీత మేడం.. వీటికి సమాధానం చెప్పండి: ప్రవస్తి
రూటు మార్చిన చంద్రబాబు.. ఏపీలో ఆర్థిక విధ్వంసం
ధోనీ కంపెనీలో 200 మందికి లేఆఫ్స్
కొత్త టెక్నాలజీలను ఆవిష్కరించిన టీసీఎస్
మూడు సార్లు ప్రెగ్నెన్సీ అయినా ఓకే కానీ : సానియా మీర్జా భావోద్వేగ జర్నీ
సినిమా

పారితోషికంగా నోట్ల కట్టలు.. హైదరాబాద్ కింగ్ నేనే అన్నట్లు తిరిగా: నాని
తొలి సంపాదన ఎవరికైనా ప్రత్యేకమే.. చాలామంది మొదటి జీతంతో అమ్మానాన్నకు ఏదైనా గిఫ్ట్ ఇస్తుంటారు. లేదంటే వారికోసమే ఏదైనా వస్తువు, దుస్తులు కొనుక్కుంటారు. అదీ కాదంటే భద్రంగా దాచిపెట్టుకుంటారు. తాజాగా హీరో నాని (Nani) తన తొలి సంపాదన గురించి ఆసక్తికర విషయాల్ని చెప్పుకొచ్చాడు. నాని మాట్లాడుతూ.. నా మొదటి జీతం రూ.2,500. క్లాప్ అసిస్టెంట్‌గా పని చేసినందుకుగానూ రెండున్నర వేలు ఇచ్చేవారు. కాకపోతే అది డబ్బు రూపంలో కాకుండా చెక్ ఇచ్చారు.చెక్ బౌన్స్..అయితే ఆ నిర్మాణ సంస్థ ఏదో కారణాల వల్ల వేరే బ్యాంకుకు మారిపోయింది. అప్పటికే అందరూ చెక్‌లో రాసిన మొత్తాన్ని బ్యాంకులో వేసుకున్నారు. నేను మాత్రం చెక్ చూపించుకుంటూ తిరిగాను. 20 రోజుల తర్వాత డబ్బులు డ్రా చేద్దామంటే చెక్ బౌన్స్ అయింది. తర్వాత వెళ్లి అడగడం ఇష్టం లేక దాన్నలాగే దాచుకున్నాను. ఆ డబ్బులు నాకు రాకపోయినా మంచి జ్ఞాపకంగా ఉండిపోయింది.తొలి పారితోషికం..రెండో సినిమా అల్లరి బుల్లోడుకు (అసిస్టెంట్ డైరెక్టర్‌గా) మొదటి నెల రూ.4000 పారితోషికం ఇచ్చారు. చెక్ మాత్రం వద్దని చెప్తే వంద రూపాయల నోట్లు ఇచ్చారు. ఆ నోట్ల కట్టను జేబులో పెట్టుకుని నేనే హైదరాబాద్ కింగ్ అన్నట్లుగా తిరిగాను. నా ఫ్రెండ్స్‌ను బయటకు తీసుకెళ్లాను. దానితోపాటు తర్వాతి మూడు నెలల జీతం దాచిపెట్టి అమ్మానాన్నకు ఉంగరాలు చేయించాను అని చెప్పుకొచ్చాడు.అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రయాణంనాని.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన కెరీర్ మొదలుపెట్టాడు. రాధా గోపాలం, అల్లరి బుల్లోడు, అస్త్రం, ఢీ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశాడు. అష్టా చమ్మా సినిమాతో హీరోగా మారాడు. స్నేమితుడా, భీమిలి కబడ్డీ జట్టు, అలా మొదలైంది, పిల్ల జమీందార్, ఈగ, ఎటో వెళ్లిపోయింది మనసు, ఎవడే సుబ్రహ్మణ్యం, భలే భలే మగాడివోయ్, జెంటిల్మన్, మజ్ను, నేను లోకల్, నిన్ను కోరి, జెర్సీ, శ్యామ్ సింగరాయ్, దసరా, హాయ్ నాన్న.. ఇలా అనేక సినిమాలు చేశాడు.నెక్స్ట్ ఏంటి?చివరగా సరిపోదా శనివారం సినిమాతో అలరించాడు. ప్రస్తుతం హిట్ 3 మూవీ చేస్తున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 1న విడుదల కానుంది. ఈ మూవీలో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి కథానాయికగా యాక్ట్ చేసింది. మరోవైపు నాని.. దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో ద ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు.చదవండి: ఆపరేషన్ అనంతరం వెకేషన్లో యాంకర్ రష్మీ.. దేవుడింతేనేమో!

కాపీ రైట్స్ కేసు.. దిల్‌రాజుకు మధ్యంతర రక్షణ కొనసాగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు (Dil Raju)కు ఇచ్చిన మధ్యంతర రక్షణను సుప్రీంకోర్టు కొనసాగించింది. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కాపీరైట్ వివాదానికి సంబంధించి నిర్మాత వి.వెంకటరమణారెడ్డి అలియాస్ దిల్ రాజుపై చర్యలు తీసుకోవాలంటూ సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఇప్పటికే మధ్యంతర రక్షణ ఇచ్చింది. అంతేగాక తదుపరి విచారణ వరకు దిల్ రాజుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. శుక్రవారం సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా మధ్యంతర రక్షణను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏమిటీ కేసు?‘నా మనసు నిన్ను కోరే నవల‘ ఆధారంగా ‘మిస్టర్ పర్ఫెక్ట్’ అనే సినిమా తీశారంటూ రచయిత్రి ముమ్ముడి శ్యామలాదేవి 2017లో దిల్ రాజుపై కేసు పెట్టారు. దీంతో మాదాపూర్ పోలీసులు నిర్మాత దిల్ రాజుపై కాపీ రైట్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసు విచారణ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో జరిగింది. విచారణ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్న సిటీ సివిల్ కోర్టు, సాక్ష్యాలను పరిశీలించి దిల్ రాజుపై చర్యలు తీసుకోవాలని 2019లో ఆదేశించింది. మధ్యంతర రక్షణఈ ఉత్తర్వులను కొట్టివేయాలంటూ దిల్‌రాజు సుప్రీంకోర్టును ఆశ్రయించగా జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. దిల్ రాజుపై చర్యల విషయంలో గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణను కొనసాగించిన జస్టిస్ జె.బి.పార్ధీవాలా ధర్మాసనం, తదుపరి విచారణను వాయిదా వేస్తూ.. అప్పటి వరకు సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది.చదవండి: ఆపరేషన్ అనంతరం వెకేషన్లో యాంకర్ రష్మీ.. దేవుడిలాగే చేస్తాడేమో!

ఆపరేషన్ అనంతరం వెకేషన్లో యాంకర్ రష్మీ.. దేవుడిలాగే చేస్తాడేమో!
యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi Gautam) ఇటీవల తీవ్ర అనారోగ్యంపాలైంది. రక్తస్రావం, భుజం నొప్పి సమస్యలతో బాధపడుతున్న ఆమెకు ఆపరేషన్ కూడా అయింది. గర్భాశయంలోని ఫైబ్రాయిడ్స్ (గడ్డలు)ను ఆపరేషన్ చేసి తొలగించారని రష్మీ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. ఏప్రిల్ 18న తనకు శస్త్ర చికిత్స జరిగిందని.. ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్లు పేర్కొంది. డాక్టర్ల సూచన మేరకు మూడువారాలు విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలిపింది.బాలి దీవుల్లో రష్మీఅయితే పనికి ఎలాగో బ్రేక్ ఇచ్చిన రష్మీ.. ఈ మండుటెండల్లో కాస్త సేద తీరేందుకు విహారయాత్రకు వెళ్లింది. ఫ్రెండ్స్‌తో కలిసి బాలి దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. పండ్లు, కేక్ ఇష్టంగా ఆరగిస్తోంది. అవే కాకుండా డాక్టర్ రాసిచ్చిన మందుల్ని కూడా క్రమం తప్పకుండా వేసుకుంటోంది. అందుకు సంబంధించిన ఫోటోలన్నింటినీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. "రెండు నెలల క్రితం ఈ ట్రిప్ ప్లాన్ చేశాం. కాకపోతే ఆటలుపాటలు.. ఇలా ఫుల్ ఎంజాయ్ చేయాలనుకున్నాం.దేవుడే ఇలా చేస్తాడేమో!తీరా చూస్తే ఇప్పుడు తినడం, పడుకోవడం, విశ్రాంతి తీసుకోవడం.. వీటితోనే సరిపెట్టుకుంటున్నాం. విహారయాత్రల్లో ఇంతకుముందెన్నడూ ఇలా జరగలేదు. బహుశా దేవుడు.. మనకు జీవితంలో అన్నీ తెలుసుకునేందుకు ఇలా చేస్తాడేమో! ప్రస్తుతం బాలిలోని ఓ విల్లాలో నా ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో సేద తీరుతున్నా.." అని రష్మీ క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) చదవండి: ప్రియదర్శికి స్టార్ హీరో దంపతుల సర్ప్రైజ్.. ఇంతకీ అదేంటంటే?

'జాను లిరి ఎవరో కూడా నాకు తెలియదు'.. అది తలచుకుంటే బాధేసింది!
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇటీవల తన కొరియోగ్రఫీతో విమర్శలు ఎదుర్కొంటున్నారు. డాకుమహారాజ్ దబిడి దిబిడి సాంగ్‌పై కూడా విమర్శలొచ్చాయి. ఆ తర్వాత మరో సాంగ్ విషయంలోనూ ఇదే జరిగింది. అలా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కాస్తా శృతి మించిపోయిందని చాలా మంది కామెంట్స్ చేశారు. అలాగే ఆయన ఓ డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ షోలో జాను లిరిని అభినందించడంతో ఆయనపై పలు రూమర్స్ వచ్చాయి. వీరిద్దరి మధ్య ఏదో ఉందని సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది. ఈ విషయంపై తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో స్పందించారు. దీనిపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. మహిళా డ్యాన్సర్ జాను విషయంలో తనని ఉద్దేశించి సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ ఎంతో బాధించాయని ఆయన తెలిపారు.ఈ వివాదంపై జానీ మాస్టర్ మాట్లాడుతూ.. 'కొరియోగ్రాఫర్లకు పని విషయంలో ఒత్తిడి ఉంటుంది. అయితే టీవీ షోలకు విషయం అలా ఏం ఉండదు. ఒక షోలో జడ్జ్‌గా వ్యవహరించడం రిలాక్స్‌గానే ఉంటుంది. నేను ఆ సీట్లో కూర్చున్నప్పుడు చాలా నిజాయితీగా ఉండాలి. అప్పుడు ఆ షోకు వచ్చిన వాళ్లలో ఆ అమ్మాయి బాగా చేసిందనిపించింది. అందుకే జాను బాగా చేశావని చెప్పా. దాన్ని పట్టుకుని జనాలు నేనేదో చేశానని అంటున్నారు. కానీ ఆ అమ్మాయికి టాలెంట్ ఉంది కాబట్టే విన్నర్ అయింది.. అది జరిగిందక్కడ. దాన్ని కొంతమంది వేరుగా అర్థం చేసుకున్నారు. మా మధ్య ఏం లేదని మా యూనిట్ అందరికీ తెలుసు. అక్కడ ఏదైనా ఉంటే మీరు అనండి. అసలు ఆ షో తర్వాత అమ్మాయి ఎవరో కూడా తెలియదు. సోషల్‌మీడియాలో నా పోస్టులకు ఆమె గురించి కామెంట్స్ పెట్టేవారు. ఆ సమయంలో నేను ఎంతో బాధపడ్డా. ఆమెకు కుటుంబం ఉంది.. నాకు ఫ్యామిలీ ఉంది కాబట్టి ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు' అని అన్నారు. సినీ ఇండస్ట్రీలో సైతం కొరియోగ్రాఫర్ల మధ్య ఎలాంటి గొడవలు లేవని శేఖర్ మాస్టర్ తెలిపారు.
న్యూస్ పాడ్‌కాస్ట్

ఆంధ్రప్రదేశ్ రాజధానిలో దోపిడీ ఐకానిక్... ఐదు టవర్ల నిర్మాణ వ్యయం అనూహ్యంగా పెంపు...

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు... తీవ్రస్థాయికి చేరిన ఉద్రిక్తతలు

పాకిస్తాన్‌కు భారత్ పంచ్. పహల్గాం దాడిపై కేంద్రం సీరియస్. దౌత్య సంబంధాలకు కత్తెర. సింధూ ఒప్పందం సస్పెన్షన్. ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్న భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ

జమ్మూకశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి... కాల్పులకు 26 మంది బలి, మరో 20 మందికి పైగా గాయాలు.. మృతుల్లో ఇద్దరు విదేశీయులు

బాబోయ్ బంగారం. దేశంలో తొలిసారి లక్ష రూపాయల మార్కును దాటేసిన పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం

ఆంధ్రప్రదేశ్‌లో డొల్ల కంపెనీకి ఎకరం 99 పైసల చొప్పున అత్యంత ఖరీదైన భూమిని కేటాయించిన కూటమి ప్రభుత్వం...3 వేల కోట్ల రూపాయల ఖరీదైన భూమిని కొట్టేసే ఎత్తుగ

అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే దర్యాప్తు... ఎంపీ మిథున్‌రెడ్డి విచారణలో సిట్ బాగోతం బట్టబయలు

వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు... దర్యాప్తు ముసుగులో సిట్ అరాచకాలు

సుదీర్ఘ కాలంగా వక్ఫ్ అధీనంలో ఉన్న ఆస్తులను ఇకపై కూడా వక్ఫ్ ఆస్తులుగానే పరిగణించాలని భావిస్తున్నాం... ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలనుకుంటున్నాం... సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్‌లో ఫీజుల షెడ్యూల్‌కు చెల్లుచీటి... కూటమి పాలనలో గతితప్పిన ఫీజు రీయింబర్స్మెంట్... ఊసేలేని వసతి దీవెన
క్రీడలు

ఆ నలుగురిని వదిలేస్తేనే సీఎస్కే బాగుపడుతుంది: సెహ్వాగ్
ఐపీఎల్-2025 (IPL 2025)లో చెన్నై సూపర్ కింగ్స్ ఆట తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag) వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఘన చరిత్ర ఉన్న సీఎస్కే (CSK).. ఈసారి మాత్రం పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికే గురిపెట్టిందని పేర్కొన్నాడు. తద్వారా ఆఖరి స్థానంలో ఉండటంలో ఉండే మజాను ఆస్వాదించాలని ఉవ్విళ్లూరుతోందంటూ సెటైర్లు వేశాడు.కాగా ఐపీఎల్లో ఐదుసార్లు చాంపియన్‌గా నిలవడంతో పాటు అత్యధిక సార్లు ఫైనల్ చేరిన జట్టుగా చెన్నైకి రికార్డు ఉంది. అయితే, ధోని (MS Dhoni) సారథ్య బాధ్యతల నుంచి నిష్క్రమించిన తర్వాత పరిస్థితి మారిపోయింది. గత సీజన్లో కెప్టెన్‌గా వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ ప్లే ఆఫ్స్ చేర్చలేకపోయాడు.ఇక ఈ సీజన్లో ఐదు మ్యాచ్‌ల తర్వాత గాయపడి రుతు జట్టుకు దూరం కాగా.. ధోని మరోసారి పగ్గాలు చేపట్టాడు. కానీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లోనూ చెన్నై ఓటమి పాలైంది. ఈ ఎడిషన్‌లో సీఎస్కేకు తొమ్మిదింట ఇది ఏడో పరాజయం. దీంతో ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా ముగిసిపోయాయి.తొలిసారి అట్టడుగున.. ఆ కిక్కే వేరప్పా!ఈ నేపథ్యంలో కామెంటేటర్ వీరేందర్ సెహ్వాగ్ స్పందిస్తూ.. ‘‘చెన్నై పదో స్థానంతో ముగిస్తుందో లేదో నాకు తెలియదు. కానీ వాళ్లు ఆ పని చేశారంటే ఎంతో బాగుంటుంది. ఎందుకంటే.. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నపుడు.. ఆ అనుభూతి ఎలా ఉంటుందో వారు అనుభవించగలుగుతారు.ఎన్నో ఫైనల్స్ ఆడిన తర్వాత ఇలాంటి అనుభవం వారికి అవసరమే’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. అదే విధంగా.. వచ్చే ఏడాది చెన్నై నలుగురు ప్లేయర్లను వదులుకుంటేనే బాగుంటుందంటూ ఇద్దరు దేశీ, ఇద్దరు విదేశీ క్రికెటర్ల పేర్లు చెప్పాడు.ఆ నలుగురిని వదిలేస్తేనే సీఎస్కే బాగుపడుతుంది‘‘డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, రవిచంద్రన్ అశ్విన్, విజయ్ శంకర్.. వచ్చే ఏడాది సీఎస్కేలో వీరి పేర్లు ఉండకపోవచ్చు. ఒకవేళ నేను గనుక మేనేజ్మెంట్ స్థానంలో ఉంటే.. ఆ నలుగురి స్థానాలను కొత్త ముఖాలతో భర్తీ చేస్తాను.జట్టును నిర్మించడం అంటే ఒక్క సీజన్‌కే పరిమితం కాకూడదు. కనీసం పదేళ్ల పాటు ఆ జట్టు బలంగా ఉండాలి. అప్పుడే పరిస్థితిలో మార్పు వస్తుంది’’ అని సెహ్వాగ్ క్రిక్‌బజ్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ఐపీఎల్-2025: చెన్నై వర్సెస్ హైదరాబాద్👉వేదిక: చెపాక్ స్టేడియం, చెన్నై👉టాస్: హైదరాబాద్.. తొలుత బౌలింగ్👉చెన్నై స్కోరు: 154 (19.5)👉హైదరాబాద్ స్కోరు: 155/5 (18.4)👉ఫలితం: చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో గెలిచిన హైదరాబాద్.చదవండి: CSK vs SRH: ‘బుర్ర పనిచేయడం లేదా’?!.. మెండిస్‌పై కావ్యా మారన్ ఫైర్! A milestone victory 👏#SRH register their first ever win at Chepauk with a strong performance against #CSK 🔝💪Scorecard ▶ https://t.co/26D3UampFQ#TATAIPL | #CSKvSRH | @SunRisers pic.twitter.com/lqeX4CiWHP— IndianPremierLeague (@IPL) April 25, 2025

జోక్ కాదు.. పాక్ క్రికెట్‌తో సంబంధాలన్నీ తెంచుకోండి: గంగూలీ
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) కీలక వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ క్రికెట్‌తో సంబంధాలన్నీ తెంచుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి సూచించాడు. కాగా జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రవాదులు మంగళవారం పాశవిక దాడికి తెగబడిన విషయం తెలిసిందే.ప్రశాంతమైన బైసరన్ లోయలో 26 మంది పర్యాటకులను లష్కర్-ఎ-తొయిబా ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ క్రమంలో భారత్- పాక్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. 2008 తర్వాత టీమిండియా ఒక్కసారి కూడా పాకిస్తాన్ పర్యటనకు వెళ్లలేదన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత పాక్ 2013లో భారత పర్యటనకు వచ్చింది.అనంతరం దాయాది దేశాల పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు లేకపోవడంతో ఇరుజట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు నిలిచిపోయాయి. అయితే, ఐసీసీ ఈవెంట్లు, ఆసియా కప్ టోర్నీల్లో మాత్రం భారత్- పాక్ (Ind vs Pak) ముఖాముఖి తలపడుతున్నాయి. కానీ తాజాగా పహల్గామ్ ఘటన నేపథ్యంలో సంబంధాలు పూర్తిగా తెగిపోయే పరిస్థితి వచ్చింది.సంబంధాలు తెంచుకోవాలిఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. ‘‘అవును.. వందకు వంద శాతం పాకిస్తాన్‌తో అన్ని సంబంధాలు తెంచుకోవాలి. కఠిన చర్యలు చేపట్టాలి. ప్రతి ఏడాది ఇలాంటి ఘటనలు జరగడాన్ని తేలికగా తీసుకోవద్దు. ఇదేమీ జోక్ కాదు. ఉగ్రవాదాన్ని సహించకూడదు. టెర్రరిజంను తుడిచిపెట్టేయాలి’’ అని పేర్కొన్నాడు.ఇక బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఇప్పటికే పాక్‌తో భవిష్యత్తులోనూ ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండబోవని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఐసీసీ నిబంధనలకు అనుగుణంగా ప్రస్తుతం దాయాదితో ఆడుతున్నామని.. అయితే, పరిస్థితులన్నింటినీ ఐసీసీ కూడా గమనిస్తోందని తెలిపారు. భారత ప్రభుత్వం చెప్పినట్లే తాము నడుచుకుంటామని స్పష్టం చేశారు.ముక్తకంఠంతో ఖండించిన క్రీడా లోకంకాగా పహల్గామ్ ఉగ్రదాడి ఘటనను భారత క్రీడా లోకం ముక్తకంఠంతో ఖండించిన విషయం తెలిసిందే. ‘‘బాధిత కుటుంబాలు ఊహించలేని కష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఈ కష్టకాలంలో భారత్‌తో పాటు యావత్ ప్రపంచం వారికి అండగా నిలుస్తోంది. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తేలియజేస్తున్నా. న్యాయం జరగాలని ప్రార్థిస్తున్నా’’ అని టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నాడు.ఇక విరాట్ కోహ్లి సైతం.. ‘‘ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు శాంతి, బలం చేకూరాలని ప్రార్థిస్తున్నా. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నా. ఇలాంటి క్రూరమైన చర్యకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నాడు.మరోవైపు.. ‘‘అమాయకులైన పర్యాటకులపై దాడి హేయమైన చర్య. దీనికి రాబోయే కాలంలో మన ధైర్యవంతమైన సైనికులు గట్టి బదులిస్తారు. జమ్మూకశ్మీర్‌లో శాంతికి భంగం కలగించాలనుకునే వారి ప్రణాళికలు ఎప్పటికీ విజయవంతం కావు’’ అని బాక్సర్ విజేందర్ సింగ్ తన స్పందన తెలియజేశాడు.భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు స్పందిస్తూ.. ‘‘పహల్గామ్ ఉగ్ర దాడి బాధితుల కోసం నా హృదయం తపిస్తోంది. ఎలాంటి కారణమైనా.. ఇంత క్రూరత్వాన్ని సమర్థించదు. బాధితుల దుఖం మాటల్లో చెప్పలేనిది. కానీ వారు ఒంటరి వారు కాదు. వారి వెంట యావత్ దేశం ఉంది. క్లిష్ట సమయంలో ఒకరికొకరు అండగా నిలుద్దాం. శాంతి పునరుద్ధరణ తప్పక జరుగుతుంది’’ అని పేర్కొంది.చదవండి: PSL 2025 Live Suspended: పాకిస్తాన్‌కు భారీ షాక్!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక..

‘గోల్డెన్ ఛాన్స్ మిస్.. బుర్ర పనిచేయడం లేదా’?!.. కావ్యా మారన్ ఫైర్!
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎట్టకేలకు ఓ విజయం.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కమిన్స్ బృందం సత్తా చాటింది.. చెన్నై సూపర్ కింగ్స్ (CSK vs SRH)ను తమ సొంత గడ్డపైనే ఓడించి ఈ సీజన్లో మూడో విజయం సాధించింది.అంతేకాదు.. పన్నెండేళ్ల తర్వాత మొట్టమొదటి సారి చెపాక్‌లో జయభేరి మోగించి.. చెన్నైకి ఊహించని షాకిచ్చింది. ఆద్యంతం ఆసక్తిగా, ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ యజమాని కావ్యా మారన్ (Kavya Maran) పలికించిన భావోద్వేగాలు, ఆమె ఇచ్చిన రియాక్షన్స్ వైరల్‌గా మారాయి.బుర్ర పనిచేయడం లేదా?!ముఖ్యంగా లక్ష్య ఛేదనలో రైజర్స్ స్టార్ కమిందు మెండిస్ (Kamindu Mendis) చేసిన పొరపాటు కావ్యకు ఆగ్రహం తెప్పించింది. దీంతో ‘ఇంత చెత్తగా కూడా ఆడతారా?.. బుర్ర పనిచేయడం లేదా?!’ అన్నట్లు ఆమె ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. అసలేం జరిగిందంటే.. చెపాక్‌లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ తొలుత బౌలింగ్ చేసింది.ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన చెన్నై.. రైజర్స్ బౌలర్ల ధాటికి 19.5 ఓవర్లలో 154 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. హర్షల్ పటేల్ నాలుగు వికెట్ల (28/4)తో చెలరేగి సీఎస్కేను దెబ్బకొట్టగా.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉనాద్కట్ రెండేసి వికెట్లు కూల్చారు. మహ్మద్ షమీ, కమిందు మెండిస్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఇక లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే రైజర్స్‌కు షాకులు తగిలాయి. ఓపెనర్లు అభిషేక్ శర్మ (0), ట్రవిస్ హెడ్ (19) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఇలాంటి క్లిష్ట సమయంలో వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ జట్టును ఆదుకున్నాడు. 34 బంతుల్లో 44 పరుగులు చేసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.అయితే, ఇన్ఫామ్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ (7) విఫలం కావడం.. అనికేత్ వర్మ (19) కూడా పెవిలియన్‌కు చేరడంతో రైజర్స్ శిబిరంలో మరోసారి నిరాశ ఆవహించింది. ఈ క్రమంలో ఆల్‌రౌండర్లు కమిందు మెండిస్, నితీశ్ కుమార్ రెడ్డి చక్కటి సమన్వయంతో ఆడారు.మెండిస్ 22 బంతుల్లో 32, నితీశ్ 13 బంతుల్లో 19 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి.. జట్టును విజయతీరాలకు చేర్చారు. అయితే, సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ పదహారో ఓవర్లో చెన్నై స్పిన్నర్ నూర్ అహ్మద్ వేసిన బంతి నోబాల్‌గా తేలింది.గోల్డెన్ ఛాన్స్ మిస్ఈ క్రమంలో ఫ్రీ హిట్ రాగా.. కమిందు మెండిస్ మాత్రం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆఫ్ స్టంప్ దిశగా వచ్చిన బంతిని స్లాగ్ షాట్‌కు యత్రించి విఫలమయ్యాడు. ఇంతలో బంతి అందుకున్న వికెట్ కీపర్ ధోని.. స్టంప్స్‌ను గిరాటేశాడు. దీంతో ఒక్క పరుగు కూడా రాకుండానే ఫ్రీ హిట్ వృథా అయిపోయింది. ఇదే కావ్యా మారన్ ఆగ్రహానికి కారణమైంది.ఇక 18.4 ఓవర్లలోనే మెండిస్, నితీశ్ కలిసి లక్ష్యాన్ని పూర్తి చేయగానే.. కావ్యా మారన్ సంబరాలు అంబరాన్నంటాయి. తీవ్ర భావోద్వేగానికి గురైన ఈ విజయం ఎంతో ముఖ్యమైనది అంటూ పక్కన ఉన్న వాళ్లను ఆలింగనం చేసుకుని ఆనందాన్ని పంచుకున్నారు.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఐపీఎల్ హిస్టరీలోనేEdge-of-the-seat drama! 😱🔥#NoorAhmad oversteps, but #KaminduMendis can’t cash in on the free hit! Tension through the roof! 😵💫Watch the LIVE action ➡ https://t.co/uCvJbWec8a#IPLonJioStar 👉 #CSKvSRH | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi & JioHotstar! pic.twitter.com/bWQlW9VEna— Star Sports (@StarSportsIndia) April 25, 2025A milestone victory 👏#SRH register their first ever win at Chepauk with a strong performance against #CSK 🔝💪Scorecard ▶ https://t.co/26D3UampFQ#TATAIPL | #CSKvSRH | @SunRisers pic.twitter.com/lqeX4CiWHP— IndianPremierLeague (@IPL) April 25, 2025

ఒక్కరంటే పర్లేదు.. అందరూ అంతే: అసంతృప్తి వెళ్లగక్కిన ధోని
ఐపీఎల్-2025 (IPL 2025)లో చెన్నై సూపర్ కింగ్స్ కథ దాదాపు ముగిసినట్లే!.. సన్‌రైజర్స్ హైదరాబాద్ (CSK vs SRH)తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సీఎస్కే ఓటమిపాలైంది. ఫలితంగా ప్లే ఆఫ్స్ ఆశలు వదులుకోవాల్సిన దుస్థితి. ఈ నేపథ్యంలో రైజర్స్ చేతిలో ఓటమి తర్వాత చెన్నై సారథి మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) స్పందించాడు.తమ పరాజయానికి బ్యాటర్ల వైఫల్యమే ప్రధాన కారణమని స్పష్టం చేశాడు. చెపాక్ వికెట్ మీద తమ వాళ్లు బ్యాట్ ఝులిపించలేకపోయారని విచారం వ్యక్తం చేశాడు. చిదంబరం స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిన చెన్నై తొలుత బ్యాటింగ్‌కు దిగింది.బ్రెవిస్ ఒక్కడేఓపెనర్లలో షేక్ రషీద్ డకౌట్ కాగా.. ఆయుశ్ మాత్రే (19 బంతుల్లో 30) రాణించాడు. మిగతా వాళ్లలో రవీంద్ర జడేజా (21), దీపక్ హుడా (22) ఫర్వాలేదనిపించగా.. కొత్తగా జట్టుతో చేరిన డెవాల్డ్ బ్రెవిస్ ధనాధన్ దంచికొట్టాడు. ఈ సౌతాఫ్రికా స్టార్ 25 బంతుల్లో 42 పరుగులతో సీఎస్కే టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.రైజర్స్ గెలిచి నిలిచిందికెప్టెన్ ధోని (6) సహా మిగతా వాళ్లంతా విఫలం కావడంతో చెన్నై 19.5 ఓవర్లలోనే కేవలం 154 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇక తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రైజర్స్ 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసి.. ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆడిన తొమ్మిదింట చెన్నైకి ఇది ఏడో పరాజయం.మా వాళ్లు విఫలంఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ.. ‘‘తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ మరీ అంత కఠినంగా ఏమీ లేదు. కానీ మేము వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాం. ఈ పిచ్ మీద 155 పరుగుల స్కోరు చెప్పుకోదగ్గది కానేకాదు. అసలు వికెట్ ఎక్కువగా టర్న్ కాలేదు.అయితే, 8-10 ఓవర్ల తర్వాత పిచ్ స్వభావం కాస్త మారింది. అయినా సరే పరుగులు రాబట్టేందుకు ఆస్కారం ఉన్నా మేము ఆ పని చేయలేకపోయాం. ఇక రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ స్పిన్నర్లకు సహకరించింది.మా వాళ్లు నాణ్యంగానే బౌలింగ్ చేశారు. సరైన సమయంలో వికెట్లు తీశారు. కానీ మేము ఇంకో 15- 20 పరుగులు చేసి ఉంటే.. వాళ్లు సులువుగా పని పూర్తి చేసేవారు’’ అని పేర్కొన్నాడు.ఒక్కరంటే పర్లేదు.. అందరూ అంతేఇక డెవాల్డ్ బ్రెవిస్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మాకు మిడిలార్డర్లో అలాంటి ఆటగాడే కావాలి. స్పిన్నర్లు బరిలోకి దిగినప్పుడు మా వాళ్లు కాస్త ఇబ్బంది పడుతున్నారు.అలాంటి సమయంలో బ్రెవిస్ లాంటి వాళ్లు నిలదొక్కుకుంటే పరిస్థితి వేరుగా ఉంటుంది’’ అని ధోని తెలిపాడు. ఏదేమైనా జట్టులో ఒకరిద్దరు బాగా ఆడకపోయినా పెద్దగా తేడా ఉండదని.. అయితే, మూకుమ్మడిగా అందరూ విఫలమైతే ఇలాంటి ఫలితాలే వస్తాయని తలా అసంతృప్తి వ్యక్తం చేశాడు.అదే విధంగా.. ప్రతిసారీ 180- 200 పరుగులు స్కోరు చేయాల్సిన అవసరం లేదన్న ధోని.. పిచ్ పరిస్థితులకు అనుగుణంగా కనీస ప్రదర్శన చేయాలని తమ బ్యాటర్లను విమర్శించాడు. జట్టులో ఎక్కువ మంది విఫలమవుతుంటే ఎలాంటి మార్పులు చేయాలో కూడా అర్థం కాదంటూ పెదవి విరిచాడు. చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఐపీఎల్ హిస్టరీలోనేA milestone victory 👏#SRH register their first ever win at Chepauk with a strong performance against #CSK 🔝💪Scorecard ▶ https://t.co/26D3UampFQ#TATAIPL | #CSKvSRH | @SunRisers pic.twitter.com/lqeX4CiWHP— IndianPremierLeague (@IPL) April 25, 2025
బిజినెస్

ధోనీ కంపెనీలో 200 మందికి లేఆఫ్స్
పాత కార్ల కొనుగోలు, అమ్మకానికి వేదికగా ఉన్న ‘కార్స్ 24’ సంస్థ ఇటీవల 200 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది. కంపెనీ కార్యకలాపాలను పునర్నిర్మించడానికి ఉద్దేశించిన చర్యల్లో భాగంగా ఈ తొలగింపులు జరిగాయని సంస్థ సహ వ్యవస్థాపకులు, సీఈఓ విక్రమ్ చోప్రా ఉద్యోగులకు అంతర్గత నోట్లో స్పష్టం చేశారు. ఈ తొలగింపులు నిరంతర లేఆఫ్స్ ప్రక్రియకు ప్రారంభం కాదని, కంపెనీ దీర్ఘకాలిక లక్ష్యాలకు అవసరమైన చర్యగా ఆయన ఉద్యోగులకు హామీ ఇచ్చారు. కార్స్24 సంస్థలో ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోనీకి వాటాలుండడం గమనార్హం.కఠినంగా నియామకాలుకార్స్24 మరింత కఠినమైన విధానాన్ని అనుసరిస్తూ నియామకాల ప్రక్రియ చేపడుతుందని చోప్రా నొక్కి చెప్పారు. ప్రస్తుత లేఆఫ్స్ కంపెనీ వ్యూహాత్మక లక్ష్యాలకు అనుగుణంగా ఉద్యోగులను సర్దుబాటు చేసేందుకు తోడ్పడుతాయని తెలిపారు. కార్స్ 24 కొత్త వ్యాపార విభాగాలకు విస్తరిస్తున్న సమయంలో ఈ తొలగింపులు జరిగాయి. కంపెనీ తన ప్లాట్‌ఫామ్ సామర్థ్యాలను పెంచడానికి, ఆటోమోటివ్ కమ్యూనిటీని బలోపేతం చేయడానికి దేశపు అతిపెద్ద ఆటోమోటివ్ ఫోరమ్ ‘టీమ్-బీహెచ్పీ’ని ఇటీవల కొనుగోలు చేసింది. అదనంగా, కార్స్ 24 వాహన మరమ్మతులు, ఫైనాన్సింగ్, బీమాతో సహా కొత్త కార్ల అమ్మకాలు, అనుబంధ సేవల కోసం ఆన్లైన్ సర్వీసులను ప్రారంభించింది.ఇదీ చదవండి: లేటరల్ ఎంట్రీ నియామకాలకు నోటిఫికేషన్ఆర్థిక పనితీరు, వ్యూహాత్మక సర్దుబాట్లుకార్స్ 24 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.498 కోట్ల నికర నష్టాన్ని నివేదించింది. ఇది వ్యూహాత్మక సర్దుబాట్ల అవసరాన్ని ఎత్తిచూపింది. యూనిట్ల అమ్మకాలు, సగటు అమ్మకపు ధరల పెరుగుదలతో కంపెనీ నిర్వహణ ఆదాయం 25 శాతం పెరిగి రూ.6,917 కోట్లకు చేరుకుంది. దాంతో కంపెనీ వ్యయాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది.

భారత ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఎంతంటే..
ప్రత్యక్ష పన్ను వసూళ్లలో భారతదేశం 2024-25 ఆర్థిక సంవత్సరానికి గణనీయమైన వృద్ధిని సాధించింది. స్థూల వసూళ్లు 15.59% పెరిగి రూ.27.02 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అధిక కార్పొరేట్, నాన్-కార్పొరేట్ పన్ను ఆదాయాలు, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (ఎస్టీటీ) రాబడుల్లో పెరుగుదల నమోదైంది. ఈ పెరుగుదల దేశం బలమైన ఆర్థిక కార్యకలాపాలు, మెరుగైన పన్ను విధానాన్ని ప్రతిబింబిస్తుంది.కార్పొరేట్ ట్యాక్స్ రాబడులు: కార్పొరేట్ పన్ను వసూళ్లు 2024-25లో రూ.12.72 లక్షల కోట్లకు చేరాయి. అంతకుముందకు ఏడాది ఇది రూ.11.31 లక్షల కోట్లుగా ఉంది.నాన్ కార్పొరేట్ ట్యాక్స్ రెవెన్యూ: నాన్ కార్పొరేట్ ట్యాక్స్ వసూళ్లు 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.11.68 లక్షల కోట్ల నుంచి 2024-25లో రూ.13.73 లక్షల కోట్లకు పెరిగాయి.సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ): క్యాపిటల్ మార్కెట్లలో కార్యకలాపాలు పెరగడంతో ఎస్టీటీ రాబడులు రూ.34,192 కోట్ల నుంచి రూ.53,296 కోట్లకు పెరిగాయి.నికర పన్ను వసూళ్లు, రీఫండ్లురిఫండ్లను పరిగణనలోకి తీసుకుంటే నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.22.26 లక్షల కోట్లలో 26.04 శాతం పెరిగి రూ.4.76 లక్షల కోట్లకు చేరాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.19.60 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 13.57% పెరుగుదలను సూచిస్తుంది. ఇది ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ చట్టబద్ధమైన రీఫండ్ క్లెయిమ్‌లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేస్తుంది.ఇదీ చదవండి: ఏడాదిలో రూ.21.16 లక్షల కోట్లు గీకారు!వృద్ధికి సంకేతంప్రత్యక్ష పన్ను వసూళ్లు పెరగడం భారత ఆర్థిక వృద్ధికి సానుకూల సంకేతం. ప్రభుత్వ ఆదాయాన్ని బలోపేతం చేయడం, రుణాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఇది తోడ్పడుతుంది. అధిక పన్ను ఆదాయాలు మౌలిక సదుపాయాలు, సాంఘిక సంక్షేమం, ఇతర కీలక రంగాలపై ప్రభుత్వ వ్యయాన్ని పెంచడానికి వీలు కల్పిస్తాయి.

బంగారం తగ్గింది కానీ...
దేశంలో తారాస్థాయికి చేరిన బంగారం ధరలు (Gold Prices) దిగివస్తున్నాయి. వరుసగా నాలుగో రోజూ తగ్గుముఖం పట్టాయి. నేడు (ఏప్రిల్ 26) కూడా పసిడి ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. మూడు రోజుల క్రితం పుత్తడి ధర 10 గ్రాములకు ఏకంగా రూ.3000 మేర క్షీణించి రూ.లక్ష దిగువకు వచ్చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు బంగారం చాలా స్వల్పంగా తగ్గినప్పటికీ, మళ్లీ పెరగనందుకు సంతోషం అని కొనుగోలుదారులు భావిస్తున్నారు.అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు, డాలర్‌తో రూపాయి మారకం రేటు, స్థానిక డిమాండ్ వంటి అంశాలు ఈ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఏప్రిల్ 26 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,210- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,020హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.30, రూ.30 చొప్పున తగ్గాయి.👉ఇదీ చదవండి: చూశారా.. ‘బంగారమే డబ్బు’!చెన్నైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,210- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,020చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.30, రూ.30 చొప్పున తగ్గాయి.ఢిల్లీలో.. - 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,310- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,170ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్‌ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్‌మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.30, రూ.30 చొప్పున తగ్గాయి.ముంబైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,210- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,020ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.30, రూ.30 చొప్పున తగ్గాయి.బెంగళూరులో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,210- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,020బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.30, రూ.30 చొప్పున తగ్గాయి.👉ఇది చదివారా? బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు భారత రూపాయి విలువ, దిగుమతి సుంకాలు, స్థానిక ట్యాక్స్‌లు, రవాణా ఖర్చులు ధరలలో వ్యత్యాసాలకు కారణమవుతున్నాయి. అదనంగా, భారతదేశంలో వివాహ సీజన్, పండుగల సమయంలో బంగారం డిమాండ్ పెరగడం వల్ల ధరలు కొంత పెరిగే అవకాశం ఉంది. బంగారం కొనుగోలు చేసే ముందు, హాల్‌మార్క్ సర్టిఫికేషన్‌ను తప్పనిసరిగా తనిఖీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) హాల్‌మార్క్ బంగారం స్వచ్ఛతను నిర్ధారిస్తుంది. అలాగే, వివిధ జ్యువెలరీ షాపుల్లో ధరలు, మేకింగ్ ఛార్జీలను సరిపోల్చడం ద్వారా మంచి డీల్ పొందవచ్చు.👉ఇది చదివారా? ఆ బంగారం మర్చిపోండి.. ఈ లోహమే ‘భవిష్యత్ బంగారం’వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరలు నేడు మార్పు లేకుండా నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ రూ.1,10,900 వద్ద ఉండగా ఢిల్లీలో రూ. 1,00,900 వద్ద కొనసాగుతోంది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

ఏడాదిలో రూ.21.16 లక్షల కోట్లు గీకారు!
క్రెడిట్ కార్డు వ్యయం 2025 ఆర్థిక సంవత్సరంలో అనూహ్యంగా పెరిగి రికార్డు స్థాయిలో రూ.21.16 లక్షల కోట్లకు చేరుకుంది. వినియోగదారుల డిమాండ్, డిజిటల్ లావాదేవీలకు పెరుగుతున్న ప్రాధాన్యత కారణంగా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 15% పెరుగుదలను నమోదు చేసింది. రుణ ఆధారిత వినియోగం అధికం అవుతుండడానికిగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.పట్టణ, డిజిటల్ పరిజ్ఞానం ఉన్న వినియోగదారులు విచక్షణా వ్యయం కోసం క్రెడిట్ కార్డులను వాడుతున్నారు. ముఖ్యంగా ఈ-కామర్స్, ట్రావెల్, డైనింగ్ వంటి రంగాల్లో దీన్ని అధికంగా ఉపయోగిస్తున్నారు.ఆన్లైన్ చెల్లింపులపై ఆసక్తి చూపడం క్రెడిట్ కార్డు వినియోగానికి ఆజ్యం పోసింది. మూడింట రెండొంతుల లావాదేవీలు డిజిటల్ రూపంలో జరుగుతున్నాయి.వ్యయాల పెరుగుదల ఆర్థిక వ్యవస్థపై స్థిరమైన విశ్వాసాన్ని సూచిస్తుంది.ఇదీ చదవండి: లేటరల్ ఎంట్రీ నియామకాలకు నోటిఫికేషన్2025 మార్చి నాటికి చలామణిలో ఉన్న క్రెడిట్ కార్డుల సంఖ్య 10.98 కోట్లకు చేరింది. ఇది ఏడాది క్రితం 10.18 కోట్లుగా ఉండేది. కొత్త కార్డుల జారీ బ్యాంకుల వారీగా భిన్నంగా ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ కార్డ్స్ వంటి ప్రముఖ సంస్థలు గణనీయమైన పెరుగుదలను నమోదు చేయగా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్ వంటి ఇతర సంస్థలు రెగ్యులేటరీ సవాళ్లు, భాగస్వామ్యాల్లో మార్పుల కారణంగా కార్డుల జారీలో క్షీణతను ఎదుర్కొన్నాయి. అన్ సెక్యూర్డ్ రుణాలకు సంబంధించిన రిస్క్‌లను తగ్గించడానికి బ్యాంకులు క్రెడిట్ క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తున్నాయి. బ్యాంకులు ఇప్పటికే ఉన్న వినియోగదారులకు ఆర్థిక ఉత్పత్తులను క్రాస్-సెల్లింగ్ చేయడంపై దృష్టి పెడుతున్నాయి.
ఫ్యామిలీ

వేసవిలో మహాపానీయం 'మజ్జిగ'..! ఎందుకు మంచిదంటే..?
వేసవికాలంలో మజ్జిగ మహాపానీయం ఆరోగ్యానికి మంచిది. ఎండదెబ్బ నుంచి ఉపశమనం పొందడానికి ఎంతగానో ఉపయోగపడటమే కాకుండా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాంటి పానీయానికి సంస్కృతంలో తక్రం, మధితం, ఉదశ్విత్తు అని మూడు పేర్లు ఉన్నాయి. తక్రం : నాలుగో వంతు నీరుపోసి తయారు చేసేది తక్రం. మధితం : అసలు నీరు పోయకుండా చిలికినది. ఇది రుచిగా ఉంటుంది. కానీ ఆరోగ్యానికి అంత ప్రశస్తం కాదు. ఉదశ్విత్తు : సగం నీళ్లు పోసి తయారు చేసేది. ఈ మూడింటిలో తక్రం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వేడి నుంచి ఉపశమనాన్నిస్తుంది.. గతంలో అయితే ఇంటికి వచ్చిన అతిథులకు.. ఎండలో వచ్చిన వారికి, వెళ్లే వారికి మజ్జిగను ఇచ్చేవారు. బాగా చిలికిన మజ్జిగలో ఒక నిమ్మకాయరసం, తగినంత ఉప్పు, చిటికెడు పంచదార కలిపి ఇచ్చేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాలకు వెళ్లే వారు గాజుసీసాలో మజ్జిగ తీసుకెళ్తే ఎండ దెబ్బ నుంచి ఉపశమనం కలుగుతుంది. – ఉన్నవ పూర్ణచందర్రావు, మూసారంబాగ్ వేసవిలో కూర్చిక పానీయం.. ఒక గ్లాసు పాలు తీసుకుని కాచి చల్లార్చి అందులో రెండు గ్లాసుల పుల్లని మజ్జిగ కలపాలి. ఈ పానీయాన్ని కూర్చిక అంటారు. ఇందులో పంచదార, ఉప్పు బదులుగా ధనియాలు, జీలకర్ర, శొంఠి ఈ మూడింటినీ 100 గ్రాములు చొప్పున దేనికదే మెత్తగా దంచి కలుపుకోవాలి. ముందుగా ఈ మూడింటినీ కలిపి తగినంత ఉప్పు చేర్చి దాన్ని ఒక సీసాలో భద్రపరచుకోవాలి. కూర్చికను తాగినప్పుడల్లా అందులో ఈ మిశ్రమాన్ని ఒక చెంచా మోతాదులో కలిపి తాగితే.. వడదెబ్బ కొట్టదు. పేగులకు బలాన్నిస్తుంది. జీర్ణకోశ వ్యాధులన్నింటికీ ఇది మేలు చేస్తుంది. దప్పికని పోగొడుతుంది.మజ్జిగ తాగేవారికి ఏ వ్యాధులూ దరిచేరవని, వచ్చిన వ్యాధులు తగ్గి తిరిగి తలెత్తకుండా ఉంటాయని, విషదోషాలు, దుర్భలత్వం, చర్మరోగాలు, ధీర్ఘకాలిక వ్యాధులు, కొవ్వు, అమితవేడి తగ్గిపోతుందని, శరీరానికి మంచి వర్చస్సు కలుతుందని యోగరత్నాకరంలో పేర్కొన్నారు. ప్రయోజనాలు..వేసవిలో మజ్జిగ ఎక్కువగా తీసుకోడం వల్ల శరీరంలో లవణాలను తగ్గకుండా చేస్తుంది.తోడుపెట్టినందు వల్ల పాలల్లో ఉండే పోషక విలువలన్నీ మజ్జిగలోనూ పదిలంగా ఉంటాయి. దీంతోపాటు మంచి బ్యాక్టీరియా మనకు దొరుకుతుంది. ఫ్రిజ్‌లో పెడితే మజ్జిగలోని ఈ బాక్టీరియా దెబ్బతింటుంది. అందుకే అతి చల్లని మజ్జిగ తాగకూడదు. మజ్జిగను చిలకడం వల్ల తేలికగా అరిగే గుణం ఏర్పడుతుంది. అందుకే పెరుగు కంటే మజ్జిగ మంచింది. (చదవండి: 'టీ లైఫ్'..! మహిళలను ఆంట్రప్రెన్యూర్స్‌గా, ఇండస్ట్రియలిస్ట్‌గా..)

నోరూరించే మామిడి పండ్లతో బిర్యానీ, బొబ్బట్టు చేసేద్దాం ఇలా..!
వేసవి వచ్చిందంటే మామిడి సీజన్ మొదలైనట్లే. నోరూరించే పుల్లటి, తియ్యటి మామిడి రుచులను కాస్త ప్రత్యేకమైన వంటల్లో ఎలా వాడుకోవచ్చో ఇప్పుడు చూద్దామా?మామిడి బిర్యానీకావలసినవి: బాస్మతి బియ్యం – ఒక కప్పు; పచ్చి మామిడికాయ – 1 (ముక్కలుగా తరిగినది); పచ్చిమిర్చి – 3 (చిన్నగా తరిగినది); నువ్వులు – ఒక టీ స్పూన్; వేరుశెనగలు – 4 టేబుల్ స్పూన్లు; కొబ్బరి తురుము – అర కప్పు; బెల్లం తురుము – ఒక టీ స్పూన్; నూనె – సరిపడా; ఆవాలు, శనగపప్పు, మినపప్పు – ఒక టీస్పూన్ చొప్పున; కరివేపాకు, ఇంగువ, పసుపు – కొద్దికొద్దిగా; ఉప్పు – తగినంత; నీరు – 2.5 కప్పులు)తయారీ: ముందుగా బియ్యం కడిగి 20 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి. తరువాత కుకర్‌లో బియ్యం, నీళ్లు, ఉప్పు, కొద్దిగా నూనె వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఈలోపు ఒక మిక్సీ బౌల్లో తరిగిన మామిడికాయ ముక్కలు, నువ్వులు, 1 టేబుల్ స్పూన్ వేరుశెనగలు, కొబ్బరి తురుము, అభిరుచిని బట్టి బెల్లం తురుము వేసుకుని, కొంచెం బరకగా పేస్ట్ చేసుకోవాలి. మందపాటి గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకుని, అందులో మిగిలిన వేరుశెనగలు వేయించుకోవాలి. తర్వాత ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఇంగువ, పసుపు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని, గరిటెతో తిప్పుతూ ఉండాలి. అవి బాగా వేగిన తర్వాత అందులో మామిడి–కొబ్బరి పేస్ట్ వేసుకుని సుమారు 3 నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని, మళ్ళీ బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. ఉడికించిన అన్నం వేసి గరిటెతో బాగా కలిపి, మూతపెట్టి, చిన్న మంట మీద మగ్గనివ్వాలి. రైస్ ఉడికిపోతే మామిడికాయ బిర్యానీ సిద్ధమైనట్లే. నచ్చినవిధంగా గార్నిష్ చేసుకుని, వేయించిన పాపడ్లు, చిప్స్, పెరుగు ఇలా వేటితోనైనా సర్వ్ చేసుకోవచ్చు.మామిడి బొబ్బట్లుకావలసినవి: గోధుమ పిండి – ఒక కప్పు; మామిడిపండు గుజ్జు – ఒక కప్పు (బాగా పండి, తియ్యగా ఉన్నది); కొబ్బరి తురుము – పావు కప్పు; బెల్లం తురుము – పావు కప్పు (మామిడి తీపిని బట్టి ఎక్కువ లేదా తక్కువ వేసుకోవచ్చు); యాలకుల పొడి – అర టీ స్పూన్; ఉప్పు – తగినంత; నెయ్యి – సరిపడా; నీరు – కొన్ని;తయారీఒక గిన్నెలో గోధుమ పిండి, ఉప్పు, టేబుల్ స్పూన్ నెయ్యి వేసి పిండిని ఉండలు లేకుండా కొద్దికొద్దిగా నీరు పోసుకుంటూ మెత్తని చపాతీ పిండిలా కలిపి, 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకుని కళాయిలో 2 టేబుల్స్పూన్ల నెయ్యి వేడి చేసుకుని కొబ్బరి తురుము వేయించి, బెల్లం తురుము వేసి కలపాలి. బెల్లం కరిగిన వెంటనే మామిడిపండు గుజ్జు వేసుకుని తిప్పుతూ ఉండాలి. చిన్న మంట మీద ఈ మిశ్రమాన్ని ఉడికించాలి. ఇది దగ్గరగా హల్వాలా కాగానే, యాలకుల పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరోవైపు గోధుమ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, పూరీల్లా ఒత్తుకుని, మధ్యలో మామిడి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా ఉంచి చేత్తో బొబ్బట్లలా చేసుకోవాలి. వాటిని నేతిలో వేయించుకుంటే సరిపోతుంది. (చదవండి: 'టీ లైఫ్'..! మహిళలను ఆంట్రప్రెన్యూర్స్‌గా, ఇండస్ట్రియలిస్ట్‌గా..)

'టీ లైఫ్'..! మహిళలను ఆంట్రప్రెన్యూర్స్‌గా, ఇండస్ట్రియలిస్ట్‌గా..
‘మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం ఉంటేనే నిర్ణయాధికారం వస్తుంది’ అని నమ్మే వాళ్లలో తాటిపర్తి దీపికారెడ్డి కూడా ఉన్నారు. ఆమె ఎవరు? హైదరాబాద్ వాసి .. టీ లైఫ్ (తెలంగాణ లేడీ ఇండస్ట్రియలిస్ట్ ఫెడరేషన్ ఫర్ ఆంట్రప్రెన్యూర్స్) వ్యవస్థాపకురాలు. ఆంట్రప్రెన్యూర్షిప్ పట్ల గ్రామీణ, పట్టణ ప్రాంత మహిళలకు అవగాహన కల్పించి, ఉచిత శిక్షణతో వాళ్లను ఆ దిశగా నడిపించి.. ఆర్థిక స్వావలంబన సాధించేందుకు కృషి చేస్తున్నారు. ఆమె ఇరవై ఏళ్ల ఆ ప్రయాణం గురించే ఈ కథనం.. చదువుకునే వయసు నుంచే దీపికా రెడ్డి .. ఇండస్ట్రియలిస్ట్‌గా స్థిరపడాలనే కోరుకున్నారు. అయితే ఆ లక్ష్యానికి ప్రయాణం మాత్రం పెళ్లయ్యాకే మొదలైంది. ఆమెకున్న పలురకాల ఆసక్తులు, అభిరుచుల మేరకు ఆయా కోర్సులు చదువుకుంటూ ఆయా రంగాల్లో తన ఆంట్రప్రెన్యూర్ స్కిల్స్‌ను నిరూపించుకున్నారు. అలా పెళ్లి తర్వాత కాకతీయ యూనివర్సిటీ నుంచి హెయిర్ అండ్ స్కిన్ కోర్స్‌లో డిప్లొమా చేశారు. ఏరోబిక్స్‌లో శిక్షణ పొందారు. ఆ అర్హతలతోనే ‘బ్యూటీ అండ్ ఫిట్నెస్ సెంటర్’ అనే ఓన్లీ ఫర్ విమెన్ జిమ్‌ను స్టార్ట్ చేశారు. ఇంటీరియర్ డిజైన్ కోర్స్ చేసి.. ఇంటీరియర్ డిజైనర్‌గా మారి, వేదీస్ ఇంటీరియర్స్ పేరుతో సంస్థనూ పెట్టారు. టీ లైఫ్.. ఇంటీరియర్ డిజైనర్ అండ్ ఆంట్రప్రెన్యూర్‌గా కొనసాగుతున్న దీపికకు హైదరాబాద్‌లోని ఎలీటా అసోసియేషన్ పరిచయం అయింది. అది మహిళల్లో ఆంట్రప్రెన్యూర్షిప్ను పెంపొందించడానికి శిక్షణనిచ్చే సంస్థ. అందులో జాయింట్ సెక్రటరీగా జాయిన్ అయ్యారు ఆమె. మూడేళ్లపాటు ఆ అసోసియేషన్‌లో అనుభవం గడించాక 2017లో తను సొంతంగా టీ లైఫ్ (తెలంగాణ లేడీ ఇండస్ట్రియలిస్ట్ ఫెడరేషన్ ఫర్ ఆంట్రప్రెన్యూర్స్) సంస్థను ప్రారంభించారు. తెలంగాణ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు ఆంట్రప్రెన్యూర్షిప్ పట్ల అవగాహన కల్పించి, వారికి కావల్సిన శిక్షణను ఇప్పించి వారిని ఆంట్రప్రెన్యూర్స్‌గా మలచడమే ఆ సంస్థ లక్ష్యం. అందుకే దాని తరపున ఆమె తెలంగాణలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పర్యటిస్తుంటారు. ఆంట్రప్రెన్యూర్స్ కావాలనుకున్న మహిళల కోసం అక్కడి కలెక్టర్లు, ఇతర ప్రభుత్వ అధికారుల సహాయంతో సదస్సులు నిర్వహిస్తుంటారు. ఆంట్రప్రెన్యూర్షిప్ కోసం బయట ఎలాంటి అవకాశాలున్నాయి, ప్రభుత్వ పథకాలేంటీ, లోన్స్, సబ్సిడీలు, శిక్షణ కార్యక్రమాలు, బిజినెస్ కోసం వాళ్ల ప్రాంతాల్లో ఉన్న రీసోర్సెస్ వంటివన్నీ వివరిస్తారు. సదస్సు తర్వాత వాళ్లకు దరఖాస్తు ఫారాలు ఇచ్చి, హాజరైన మహిళలకున్న బిజినెస్ ఆసక్తులను ఆ దరఖాస్తు ఫారాల్లో నింపమంటారు. ఆ ఫారాల ఆధారంగా వాళ్లకు ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్స్‌కి అందుతున్న రుణాలతో అందులోని సభ్యులు ఎలాంటి బిజినెస్ పెట్టుకోవచ్చో చెప్పి, తగిన శిక్షణనిచ్చి.. ఆ వ్యాపారాలను పెట్టించారు కూడా! ఈ క్రమంలో ఆమె గమనించిన విషయం.. ఆ మహిళలందరినీ వాళ్లమ్మాయిలు ప్రోత్సహించడం.అమ్మాయిల కోసం.. దీపిక.. గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు, ఇంజినీరింగ్ కాలేజీలకూ వెళ్లి అక్కడి అమ్మాయిలకూ బిజినెస్ రంగంలో ఉన్న అవకాశాలు, శిక్షణ వంటి వాటిమీద అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు మూడున్నర వేల మంది మహిళలకు శిక్షణనిచ్చారు. అందులో వందకు పైగా మహిళలు ఆంట్రప్రెన్యూర్స్‌గా నిలబడ్డారు. ఇందులో సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్స్‌కి చెందిన మహిళలే ఎక్కువ. ప్రస్తుతం టీ లైఫ్‌కి జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్‌లలో ఆఫీసులున్నాయి. మే నెలలో మహబూబ్‌నగర్‌లో కూడా ప్లాన్ చేయాలనుకుంటారు. టీ లైఫ్ ఆరంభించినప్పుడు కనీసం పదివేల మంది మహిళలకు అవగాహన కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చేరుకున్నారు కూడా. నెలకు నాలుగు నుంచి అయిదు బ్యాచ్‌లుంటాయి. అభ్యర్థులు పెట్టాలనుకున్న బిజినెస్‌ను బట్టి ఆ శిక్షణ కార్యక్రమాల గడువు ఉంటుంది. ఈ ట్రైనింగ్ సెషన్స్ అన్నీ ఎక్స్‌పర్ట్స్‌తోనే ఉంటాయి. ‘మొదటి నుంచీ నన్ను నేను ప్రూవ్ చేసుకుంటూ వచ్చిన చోటల్లా అది కుటుంబంలో కానీ.. సమాజంలో కానీ ఎక్కడైనా నాకు గౌరవం పెరుగుతూ వచ్చింది. దాన్ని గ్రామీణ మహిళలు, పట్టణ ప్రాంతం వారూ పొందాలని అనుకున్నాను. వాళ్లు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని అనుకుంటున్నాను. అందుకే టీ లైఫ్‌ని స్టార్ట్ చేశాను. మేము వెళ్లినచోటల్లా పాజిటివ్ రెస్పాన్సే వస్తోంది. స్టూడెంట్స్ కూడా చాలా ఉత్సాహంగా ఉంటున్నారు. వాళ్లకోసం కంప్యూటర్, ఏఐ బేస్డ్ ప్రోగ్రామ్స్‌నూ పెట్టాం. ఇంట్లో వాళ్ల నుంచీ నాకు సపోర్ట్ దొరుకుతోంది. టీ లైఫ్ ధ్యేయం ఒక్కటే.. మహిళలు ఆంట్రప్రెన్యూర్స్గానే కాదు ఇండస్ట్రియలిస్ట్స్గానూ ఎదిగేందుకు తోడ్పడాలని. అయితే దీనికి ప్రభుత్వ సహకారం కూడా అసవరమే! కుటుంబంలో మహిళ ఆర్థికంగా బలంగా ఉంటే తర్వాత తరాల అమ్మాయిలూ స్ట్రాంగ్‌గా ఉంటారని నా నమ్మకం.’ అంటున్నారు దీపికారెడ్డి – సరస్వతి రమ(చదవండి: స్టెగానోగ్రఫీ.. అలా చేస్తే లక్షలు మాయం అవుతాయి!)

సాగులో సాధికారత కోసం..
భారతదేశంలో మహిళా రైతులకు ప్రోత్సాహకాలు అందించడానికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలు, కార్యక్రమాలను అమలుచేస్తున్నాయి. అవేంటంటే.. సమాన భూమి హక్కులు.. మహిళా రైతులకూ సమానంగా భూమి హక్కులు కల్పించడం వల్ల వారి ఆర్థిక, సామాజిక సాధికారతను పెంపొందిస్తున్నారు. రుణాలు, ఇతర ఆర్థిక సహాయం.. మహిళారైతులకు రుణసౌకర్యాలు, సబ్సిడీలు, ఇతర ఆర్థిక సహాయాలు అందించడం ద్వారా వ్యవసాయ కార్యక్రమాలనుప్రోత్సహిస్తున్నారు. మిషన్ హార్టీ కల్చర్.. ఈ పథకంతో మహిళలకు సాగు నైపుణ్యం, శిక్షణ, సబ్సిడీలు, మద్దతులను అందిస్తున్నారు. సహాయక సమూహాలు (సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్), రైతు ఉత్పత్తిదారుల సంస్థలు మహిళా రైతులకు సాధికారత కల్పించే లక్ష్యంతో మహిళల నేతృత్వంలోని ఎఫ్‌పీఓలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎమ్ – కిసాన్).. ఈ పథకం ద్వారా అర్హతగల రైతులకు బయోడిజాస్టర్లను అందిస్తూ రైతుల శ్రమ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు దీనివల్ల ఆదాయమూ పెరుగుతోంది. సాంకేతిక పరికరాలు, శిక్షణ.. మహిళా రైతుల కోసం ప్రత్యేక పరికరాలు అందించి.. శిక్షణ కార్యక్రమాలనూ నిర్వహిస్తూ వారు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి భారతప్రభుత్వం కృషిచేస్తోంది. పట్టణప్రాంతాలకు పురుషుల వలస పెరుగుతున్నందున పశువుల పెంపకం, పాడిపరిశ్రమ, ఉద్యానవనాల పెంపకం, సాగు/సామాజిక అటవీ, చేపలు పట్టడం వంటి పనులను ఎక్కువగా మహిళలే నిర్వహిస్తున్నారు. దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ఆహారంలో దాదాపు 60– 80 శాతాన్ని గ్రామీణ మహిళలే అందిస్తున్నారు. అయినప్పటికీ వారి శ్రమకు తగిన గుర్తింపు లభించట్లేదు. సమప్రాధాన్యం అందట్లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగంలో గ్రామీణ మహిళల సాధికారత కోసం అనేక పథకాలు, కార్యక్రమాలను చేపట్టింది. అందులో ఒకటే కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ అమలు చేస్తున్న ‘నమో డ్రోన్ దీదీ’ పథకం. ఇది ఈఅ్గNఖఔM కింద మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లను అందిస్తుంది. ఈ పథకం మొత్తం బడ్జెట్ రూ. 1261 కోట్లు. ద్రావకాలు, పురుగుల మందుల వాడకానికి.. 2024–25 నుంచి 2025–2026 వరకు ఎంపిక చేసిన 14, 500 మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌లకు డ్రోన్లను అందించడం దీని ప్రస్తుత లక్ష్యం. అత్యంత ప్రజాదరణ పొందిన కేంద్రప్రభుత్వ పథకాల్లో ‘బేటీ బచావో.. బేటీ పఢావో’, ‘సుకన్య సమృద్ధి యోజన’ కూడా ఉన్నాయి. – బి.ఎన్. రత్న బిజినెస్ కన్సల్టెంట్, దలీప్మీ సందేహాలను పంపవలసిన మెయిల్ ఐడీ ownership.sakshi@gmail.comనిర్వహణ : సరస్వతి రమ
ఫొటోలు


'కోర్ట్' జ్ఞాపకాలు.. మర్చిపోలేకపోతున్న జాబిలి (ఫొటోలు)


పట్టు చీరలో పుత్తడిబొమ్మలా మెరిసిపోతున్న అనసూయ (ఫొటోలు)


కన్నీటి సుడుల నడమ.. బాధాతృప్త హృదయాలతో వీడుతూ. సరిహద్దులో భావోద్వేగ దృశ్యాలు (చిత్రాలు)


సన్‌రైజర్స్ vs చెన్నై మ్యాచ్‌లో సందడి చేసిన హీరో అజిత్, శివ కార్తికేయన్ (ఫొటోలు)


హైదరాబాద్ : ‘భారత్ సమ్మిట్-2025.. విదేశీ ప్రతినిధులకు ఘనస్వాగతం (ఫొటోలు)


నిశ్చితార్థమై ఏడాది.. కాబోయే భర్తతో 'బిగ్ బాస్' శోభాశెట్టి (ఫొటోలు)


బాబోయ్.. సుర్రుమంటున్న ఎండలు.. జనం బెంబేలు (చిత్రాలు)


త్రిష తల్లిని చూశారా? ఈమె కంటే అందంగా ఉందిగా! (ఫొటోలు)


అందంగా ఆషికా.. అద్దం ముందు నుంచి కదలట్లేదుగా! (ఫోటోలు)


సూర్య ‘రెట్రో’ మూవీ ఆడియో లాంచ్ (ఫొటోలు)
అంతర్జాతీయం

జలదిగ్బంధం!
దశాబ్దాల నాటి సింధూ నదీజల ఒప్పందాన్ని పక్కన పెడుతూ భారత్ కొట్టిన దెబ్బతో ఆర్థికంగా పాకిస్తాన్ నడ్డి విరిగినట్టేనని చెబుతున్నారు. కొందరు చెబుతున్నట్టుగా దీని ప్రభావం పూర్తిస్థాయిలో కనిపించేందుకు దశాబ్దాలేమీ పట్టదని జల వనరుల నిపుణులు అంటున్నారు. పాక్‌పై తక్షణ ప్రభావం చూపేందుకు పలు మార్గాలున్నాయని వారు చెబుతున్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. సింధూ నదిపై డ్యాముల సామర్థ్యాన్ని పెంచనున్నట్టు వెల్లడించాయి. అందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టనున్నట్టు పేర్కొన్నాయి. జీలం తదితర సింధూ ఉపనదుల విషయంలో కూడా ఇదే వ్యూహం అమలవుతుందని తెలిపాయి. వీటితో పాటు కొత్తగా డ్యాములు తదితరాల నిర్మాణం వంటివి కూడా శరవేగంగా జరిపే యోచన ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చినాబ్ బేసిన్లో పలు డ్యాములు, ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. అవి పూర్తయ్యేందుకు ఐదేళ్ల దాకా పట్టవచ్చని అంచనా. తాజా పరిణామాల నేపథ్యంలో వాటన్నింటినీ శరవేగంగా పూర్తి చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పాక్‌కు సమాచారం తొమ్మిదేళ్ల సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం భారత్, పాక్ నడుమ 1960లో సింధూ జలాల ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం తూర్పుకు పారే సట్లెజ్, బియాస్, రావి నదీ జలాలు భారత్‌కు; పశ్చిమానికి ప్రవహించే సింధు, జీలం, చీనాబ్ నదుల జలాలు పాక్‌కు చెందాయి. సింధూ జలాల్లో 20 శాతం భారత్‌కు, 80 శాతం పాక్‌కు దక్కేలా అంగీకారం కుదిరింది. ఆ ఒప్పందాన్ని పక్కన పెడుతున్నట్టు పాక్‌కు కేంద్రం లాంఛనంగా వర్తమానమిచ్చింది. కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఈ మేరకు పాక్ జల వనరుల శాఖ కార్యదర్శికి ఇప్పటికే లేఖ రాశారు. జమ్మూ కశ్మీర్‌ను లక్ష్యం చేసుకుని పాక్ సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతోందని అందులో ఘాటుగా దుయ్యబట్టారు. ‘‘ఏ ఒప్పందానికైనా పరస్పర విశ్వాసమే పునాది. దానికే మీరు తూట్లు పొడుస్తున్నారు. మీ దుశ్చర్యలు సింధూ ఒప్పందం కింద భారత్‌కు దఖలుపడ్డ హక్కులకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి. కనుక సింధూ ఒప్పందాన్ని గౌరవించాల్సిన అవసరం భారత్‌కు ఎంతమాత్రమూ లేదు’’ అని కుండబద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో పాక్ అంగీకారంతో నిమిత్తం లేకుండా సింధూ, దాని ఉపనదులపై ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు వాటి జలాలను భారత్ తోచిన రీతిలో వాడుకునే వీలుంది. వాటికి సంబంధించి దాయాదికి ఎలాంటి ముందస్తు సమాచారమూ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. దీనిపై పాక్ తీవ్రంగా ఆక్రోశించడం, నీటిని ఆపే చర్యలను తమపై యుద్ధ ప్రకటనగా భావిస్తామంటూ బీరాలు పలకడం తెలిసిందే. చుక్క కూడా వదిలేది లేదు కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ అతి త్వరలో సమగ్ర వ్యూహం ప్రధాని ఆదేశాలిచ్చినట్టు వెల్లడి సింధూ ఒప్పందంపై సమీక్ష అమిత్ షా తదితరుల హాజరు న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు చుక్క నీటిని కూడా వదలబోమని కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ స్పష్టం చేశారు. ‘‘ఆ దిశగా సమగ్ర వ్యూహాన్ని రూపొందిస్తున్నాం. ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే పలు సూచనలు చేశారు. స్పష్టమైన ఆదేశాలిచ్చారు’’ అని వెల్లడించారు. సింధూ జలాల ఒప్పందం సస్పెన్షన్ నేపథ్యంలో ఈ విషయమై చేపట్టాల్సిన తదుపరి చర్యల గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. పాటిల్‌తో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు అందులో పాల్గొన్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రధాని ఆదేశాల అమలుకు చేపట్టాల్సిన చర్యలపైనే భేటీలో ప్రధానంగా చర్చించినట్టు వివరించారు. అమిత్ షా కూడా పలు సూచనలు చేసినట్టు తెలిపారు. ఈ దిశగా స్వల్ప, దీర్ఘకాలిక చర్యలు చేపడుతూ మూడంచెల వ్యూహంతో కేంద్రం ముందుకు సాగనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. – సాక్షి, నేషనల్ డెస్క్

అంతర్జాతీయ ప్రయాణం .. మరింత భారం
పహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం దాయాదీ దేశం పాకిస్తాన్‌పై భారత్ కఠిన ఆంక్షలు విధించింది. పాకిస్తాన్ సైతం అదే రీతిలో స్పందిస్తూ తమ గగనతలాన్ని భారతదేశ విమానాలు ఉపయోగించుకోకుండా నిషేధించింది. ఇండియా విమానాలు తమ గగనతలం గుండా ప్రయాణించేందుకు అనుమతి లేదని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలపై అదనంగా ఆర్థిక భారం పడుతోందని, అతిమంగా ప్రయాణికులే భరించాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా ఉత్తర భారతదేశం నుంచి పాక్ గగనతలం గుండా ప శ్చిమ దేశాలకు ప్రయాణించాల్సిన విమానాలు ఇక చుట్టూ తిరిగి వెళ్లక తప్పదు. దీనివల్ల విమాన చార్జీలు 8 నుంచి 12 శాతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. యూరప్, ఉత్తర అమెరికా, మధ్య ప్రాచ్య దేశాలకు వెళ్లేవారు అదనపు భారం భరించాల్సి ఉంటుంది. కొన్ని ముఖ్యమైన అంతర్జాతీయ రూట్లలో విమాన ప్రయాణాలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. ఇండియాలో రిజిస్టర్ అయిన అన్ని విమానాలతోపాటు భారతీయుల యాజమాన్యంలో ఉన్న విమానాలు పాక్ గగనతలం గుండా ప్రయాణించేందుకు అనుమతి లేదు. ఇక సుదూర ప్రయాణాలే పాక్ ఆంక్షల ప్రభావం ఇప్పటికే మొదలైందని ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి సంస్థలు నిర్ధారించాయి. తమ అంతర్జాతీయ విమానాలను మరో మార్గం గుండా మళ్లించామని తెలిపాయి. తమ ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పాక్ ఆంక్షల విషయంలో తాము చేయగలిగేది ఏమీ లేదని నిస్సహాయత వ్యక్తంచేశాయి. ఇండియా నుంచి యూరప్, అమెరికా, మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లాల్సిన విమానాలు అరేబియా సముద్రం మీదుగా ప్రయాణిస్తున్నాయి. దీనివల్ల రెండు నుంచి రెండున్నర గంటల అదనపు సమయం పడుతోందని ఓ పైలట్ చెప్పారు. ఢిల్లీ, అమృత్సర్, జైపూర్, లక్నో, వారణాసి తదితర నగరాల నుంచి ప్రయాణించేవారు అదనపు సమయం వెచి్చంచడంతోపాటు అదనపు వ్యయం భరించాల్సి వస్తోంది. ఇండియా విమానాలకు పాకిస్తాన్ ఎయిర్‌స్పేస్ అత్యంత కీలకం. చాలావరకు విమానాలు ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తుంటాయి. ఇన్నాళ్లూ ఎటువంటి ఇబ్బందుల లేకుండా ప్రయాణాలు సాగిపోయాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఏ విమానానికి ఎంత సమయం అదనంగా అవసరమన్న దానిపై త్వరలో పూర్తి స్పష్టత వస్తుందని సీనియర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఒకరు తెలిపారు. కనెక్టింగ్ విమానాలు అందుకోవడం కష్టం రాబోయే రోజుల్లో అంతర్జాతీయ విమాన ప్రయాణాలు మరింత ఖరీదు కాబోతున్నాయి. విమానాలు ఎక్కువ దూరం ప్రయాణిస్తే ఇంధనంతోపాటు నిర్వహణ ఖర్చులు కూడా పెరుగుతాయి. అదే స్థాయిలో టికెట్ చార్జీలు పెరగడం తథ్యం. విమానయాన సంస్థలు తమపై పడే అదనపు వ్యయాన్ని ప్రయాణికులకే బదిలీ చేస్తాయి. మరో ఇబ్బంది ఏమిటంటే.. ప్రయాణానికి అదనపు సమయం పట్టడం వల్ల ఇతర దేశాల్లో కనెక్టింగ్ విమానాలు అందుకోవడం కష్టం కావొచ్చు. అందుకే ప్రయాణ ప్రణాళికను రీషెడ్యూల్ చేసుకోవాలి. విదేశాల నుంచి వచ్చేవారు కూడా ఆలస్యంగా స్వదేశానికి చేరుకుంటారు. లాంగ్ జర్నీ వల్ల విమానాల్లో ఇంధనం లోడ్ పెరుగుతుంది. ఎక్కువ ఇంధనాన్ని నింపుకోవాలి. ప్రయాణ సమయానికి అనుగుణంగా భద్రతాపరమైన ప్రమాణాలు కూడా పాటించాలి. పేలోడ్‌ను తగ్గించుకోవాలి. అంటే తక్కువ మంది ప్రయాణికులు, తక్కువ లగేజీతో ప్రయాణించాలి. దీనివల్ల విమానాల్లో సీట్లు లభించడం కష్టమవుతుంది. ఓవర్‌బుకింగ్ వంటి పరిణామాలు ఎదురవుతాయి. ముందస్తు ప్రణాళిక ఉంటే తప్ప అంతర్జాతీయ విమానాల్లో అప్పటికప్పుడు సీట్లు దొరకవు. భారత విమానాలకు తమ గగనతలాన్ని పాక్ మూసివేయడం ఇదే మొదటిసారి కాదు. 2019 ఫిబ్రవరిలోనూ ఇలాంటి పరిస్థితి తలెత్తింది. భారత సైన్యం చేపట్టిన బాలాకోట్ వైమానిక దాడుల నేపథ్యంలో తమ గగనతలం గుండా భారత విమానాలు ప్రయాణించకుండా నిషేధించింది. ఈ నిషేధం కొన్ని నెలలపాటు కొనసాగింది. ఇప్పట్లో భారత ప్రయాణికులకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు చేయాల్సిందేమిటి? → పాక్ ఆంక్షల కారణంగా విమానయాన చార్జీలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత త్వరగా టికెట్లు బుక్ చేసుకోవాలి. → విమానాల విషయంలో అప్డేట్స్ కోసం సంబంధిత ఎయిర్‌లైన్స్ వెబ్సైట్ లేదా యాప్‌ను తరచూ చెక్ చేసుకోవాలి. → అంతర్జాతీయ ప్రయాణాలకు అదనపు సమయం కేటాయించేందుకు సిద్ధపడాలి. తదనుగుణంగా పక్కా ప్లానింగ్ ఉండాలి. → ఎయిర్‌లైన్స్ సంస్థలు ప్రయాణికుల లగేజీపై పరిమితి విధించే అవకాశం కనిపిస్తోంది. కనుక తక్కువ లగేజీతోనే ప్రయాణించాలి. – సాక్షి, నేషనల్ డెస్క్

ఔను.. చెత్త పనులు చేశాం.. తప్పు ఒప్పుకున్న పాక్
అమెరికా, బ్రిటన్ కోసమే చెత్త పనులు చేశామని.. ఉగ్రవాదాన్ని పోత్సహించడం పొరబాటని అర్థమైందంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు. అమెరికా కోసమే ఉగ్రవాదులను పెంచిపోషించామంటూ ఆయన తప్పును ఒప్పుకున్నారు. ఉగ్రవాదం వల్ల చాలా ఇబ్బందులు పడ్డామన్నారు. ఉగ్ర సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ నిజమేనంటూ స్వయంగా ఆ దేశ రక్షణమంత్రే అంగీకరించారు. ఓ అంతర్జాతీయ మీడియాతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.పహల్గాం దాడి అనంతరం భారత్‌తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ‘స్కై న్యూస్’ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉగ్ర సంస్థలకు నిధుల సమీకరణ, ఉగ్రవాదులకు శిక్షణ, మద్దతు ఇవ్వడంలో పాకిస్థాన్‌కు సుదీర్ఘ చరిత్ర ఉందని.. దీని మీరు అంగీకరిస్తారా? అంటూ జర్నలిస్టు ప్రశ్నించగా.. ‘‘అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమదేశాల కోసమే మూడు దశాబ్దాల పాటు తాము ఈ చెత్త పనులన్నీ చేస్తున్నామంటూ ఖవాజా బదులిచ్చారు.సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో మేం చేరకపోయి ఉంటే.. పాక్‌కు తిరుగులేని ట్రాక్ రికార్డ్ ఉండేదన్నారు. లష్కరే తోయిబాకు గతంలో పాకిస్థాన్‌తో కొన్ని సంబంధాలు ఉన్నాయని కూడా ఖవాజా ఆసిఫ్ అంగీకరించారు. అయితే, ఇప్పుడు ఈ ఉగ్రవాద సంస్థ అంతమైందన్నారు.

పిల్లపామును పెంచి పోషిస్తున్న హఫీజ్ సయ్యద్!
పహల్గాంలోని బైసరన్ లోయలో ఉగ్రవాదులు నరమేధం జరిపి 26 మందిని పర్యాటకుల్ని పొట్టనబెట్టుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. కశ్మీర్లో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదే కావడం గమనార్హం. అయితే లష్కర్-ఇ-తోయిబా(LeT) తరఫున కరడుగట్టిన టీఆర్ఎఫ్ గ్రూప్ ఈ ఘాతుకానికి పాల్పడగా.. ఆ సంస్థ కదలికలపై భద్రతా ఏజెన్సీలు ఓ అంచనాకి వచ్చాయి.లష్కరే తోయిబా విష సర్పానికి పుట్టిన పిల్ల పామే.. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్). 2019లోనే ఇది పుట్టింది. ఈ విభాగానికి తొలినాళ్లలో షేక్ సాజిద్ గుల్ సుప్రీం కమాండర్‌గా, చీఫ్ ఆపరేషనల్ కమాండర్‌గా బాసిత్ అహ్మద్ దార్ వ్యవహరించారు. ఆ తర్వాత నుంచి లష్కరే చీఫ్ హఫీజ్ సయ్యద్(hafiz saeed) కనుసన్నల్లోనే నడుస్తోంది. డిప్యూటీ హెడ్‌గా సైఫుల్లా(హిజ్బుల్ ముహజిదిన్) వ్యవహరిస్తున్నారు. ఈ ఇద్దరూ పాక్ నుంచే ఎల్ఈటీ కార్యకలాపాలను నడిపిస్తున్నారనే అభియోగాలు ఉండనే ఉన్నాయి. పాక్ సైన్యం, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ISI) టీఆర్ఎఫ్ గ్రూపులకు సైద్ధాంతికపరమైన మద్దతు మాత్రమే కాదు.. అన్నిరకాలుగా మద్దతు ఇస్తున్నాయని భారత గూఢచార సంస్థలు భావిస్తున్నాయి.తొలినాళ్లలో జిహాదీ పేరిట ఆన్లైన్లో The Resistance Front సంస్థ పోస్టులు చేసేది. కశ్మీరీలు భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదంలో చేరేలా గప్‌చుప్ ప్రచారాలు చేసేది. ఉగ్ర కార్యకలాపాల కోసం ఆన్లైన్ ద్వారా యువతను నియమించుకునేది. ఆయుధ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి చర్యలకు పాల్పడింది. ఆ సమయంలో ఈ గ్రూప్ కార్యకలాపాలను కట్టడి చేసేందుకు జమ్ము పోలీసులు చేసిన ప్రయత్నాలేవీ పెద్దగా ఫలించలేదు. ఆ తర్వాత హిజ్బుల్ ముహజిదిన్, లష్కరే తొయిబా సభ్యులతోనే చాన్నాళ్లు నడిచింది. కానీ, ఆ తర్వాతే ఈ గ్రూపులో విదేశీ ఉగ్రవాదుల చేరిక క్రమంగా పెరుగుతూ వచ్చింది. వీళ్లకు కశ్మీర్ నుంచి స్థానిక ఉగ్రవాదుల మద్దతు లభిస్తూ వస్తోంది. అలా.. ఈ సంస్థ కశ్మీర్ లోయలో చాలా కాలంగా యాక్టివ్‌గా ఉంది. 2023లో కేంద్రం హోం శాఖ ఈ గ్రూప్‌పై విషేధం విధించింది.ఇంతకుముందు.. సోనామార్గ్, బూటా పాత్రి, గందర్బల్ దాడులకు ఈ సంస్థే కారణమని భద్రతా సంస్థలు బలంగా నమ్ముతున్నాయి. కిందటి ఏడాది అక్టోబర్‌లో బూటా పాత్రి ఇద్దరు సైనికులు సహా నలుగురిని ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. అదే నెలలో సోనామార్గ్ టన్నెల్ పనులు జరుగుతున్న ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో ఆరుగురు కార్మికులు, ఓ డాక్టర్ చనిపోయారు. పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాది హషీమ్ మూసా.. సోనామార్గ్ దాడిలోనూ పాల్గొన్నట్లు స్పష్టంగా తేలింది. అయితే సోనామార్గ్ ఘటన తర్వాత.. ఎల్ఈటీ ఏఫ్లస్ కేటగిరీ ఉగ్రవాది జునైద్ అహ్మద్ భట్‌ను డిసెంబర్లో దాచిగామ్ వద్ద భద్రతా దళాలు మట్టుపెట్టాయి. ఇదే ఎన్కౌంటర్లో గ్రూప్ సభ్యులు సమీపంలోని అడవుల్లోకి పారిపోయారు.సాధారణంగా దాడులకు పాల్పడ్డాక టీఆర్ఎఫ్ గ్రూప్ సభ్యులు అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోతారు. దట్టమైన అడవుల్లో తలదాచుకుంటూ.. పాక్ నుంచి గ్రూప్ నేతలు ఆదేశాలు కోసం ఎదురు చూస్తుంటారు. టీఆర్ఎఫ్ను తన కనుసన్నల్లోనే నడిపిస్తున్న హఫీజ్ సయ్యదే.. పహల్గాం దాడికి మాస్టర్ మైండ్ హఫీజ్ సయ్యదే అయి ఉండొచ్చని నిఘా సంస్థలు భావిస్తున్నారు. ఏప్రిల్ 24వ తేదీన.. గురువారం జమ్ము కశ్మీర్ పోలీసులు ఉగ్రవాదులకు సంబంధించిన స్కెచ్‌లు రిలీజ్ చేశారు. అందులో హషిమ్ మూసా అలియాస్ సులేమాన్, అలీ బాయి అలియస్ తల్హా పాకిస్థానీలుగా జమ్ము పోలీసులు ప్రకటించారు. మిగతా ఇద్దరు అబ్దుల్ హుస్సేన్ తోకర్, అసిఫ్‌లు స్థానికులేనని ప్రకటిచారు. ఈ ఇద్దరూ 2018లో కశ్మీర్‌కు వెళ్లి.. ఎల్ఈటీలో శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత టీఆర్ఎఫ్లో సహాయకులుగా చేరి.. పహల్గాం మారణ హోమంలో భాగం అయ్యారు.ప్లాన్ ప్రకారమే..సైనికుల దుస్తుల్లో వచ్చిన టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు.. బైసరన్ లోయలోని పిక్నిక్ స్పాట్లో మూడు వేర్వేరు ప్రాంతాలను ఎంచుకుని దాడికి పాల్పడ్డారు. తొలుత పర్యాటకులతో చాలాసేపు వాళ్లు మాట్లాడారు. ఆ తర్వాత పర్యాటకుల్లో ఐదుగురిని ఒక చోట చేర్చి చంపారు. మైదానంలో మరో ఇద్దరిని కాల్చి చంపారు. పారిపోతున్న క్రమంలో.. ఫెన్సింగ్ వద్ద ఇంకొందరిని కాల్చి చంపారు. ఫెన్సింగ్ దూకిన వాళ్లు ప్రాణాలతో బయటపడగలిగారు.
జాతీయం

ఐక్యంగా ఎదుర్కొందాం
శ్రీనగర్: దేశ ప్రజలంతా కలిసికట్టుగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. మనమంతా ఐక్యంగా ఉంటే ఉగ్రవాదం అంతం కావడం ఖాయమని చెప్పారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టి, విభజన తీసుకురావాలన్న లక్ష్యంతోనే పహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగిందని అన్నారు. కలిసి ఉంటున్న సోదరుల మధ్య గొడవలు పెట్టాలన్నదే ముష్కరుల ఉద్దేశమని ఆరోపించారు. ముష్కర మూకల కుట్రలను తిప్పికొట్టడానికి మనమంతా ఒక్కటై చేతులు కలపాలని సూచించారు. ఐక్యమత్యమే మన బలమని ఉద్ఘాటించారు. ఉగ్రవాదాన్ని శాశ్వతంగా ఓడించడానికి యావత్ దేశం ఐక్యంగా ఉండాలని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ శుక్రవారం జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లోని సైనిక ఆసుపత్రిని సందర్శించారు. ఇక్కడ చికిత్స పొందుతున్న పహల్గాం ఉగ్రవాద దాడి బాధితుడిని పరామర్శించారు. అతడి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని బాధితుడికి భరోసా కల్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అసలేం జరిగిందో తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చానని అన్నారు. పహల్గాం దాడి అత్యంత దారుణమని చెప్పారు. ఈ ఉగ్రదాడిని జమ్మూకశ్మీర్ ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించారని తెలిపారు. ఈ దాడిలో ఆప్తులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు తన సానుభూతి ఉంటుందని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొనే చర్యలు పూర్తి మద్దతు ఇస్తున్నామని పునరుద్ఘాటించారు. ప్రతిపక్షం మొత్తం ప్రభుత్వానికి అండగా ఉంటుందన్నారు. దేశంలో ఇతర ప్రాంతాల్లో జమ్మూకశ్మీర్‌కు చెందిన ప్రజలపై దాడుల జరుగుతుండడం విచారకరమని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మన సోదర సోదరీమణులను లక్ష్యంగా చేసుకోవడం సరైంది కాదని చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనమంతా ఒక్కటి కావాలని కోరారు. మరోవైపు జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతోపాటు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. పహల్గాం ఉగ్రదాడి, తదనంతర పరిణామాలపై చర్చించారు. అంతకుముందు జమ్మూకశ్మీర్ వ్యాపారులు, విద్యార్థి సంఘాల నాయకులు, పర్యాటక రంగ ప్రతినిధులతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

భూతల స్వర్గం మళ్ళీ వెలవెల!
భూతల స్వర్గంగా పేరుగాంచిన అందాల కశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడి ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న అక్కడి పర్యాటక రంగాన్ని మళ్లీ సంక్షోభంలోకి నెట్టేసింది. పహల్గాంలో ముష్కరులు 26 మంది టూరిస్టులను అత్యంత పాశవికంగా హతమార్చడం పర్యాటకుల విశ్వాసాన్ని దారుణంగా దెబ్బతీయడమే కాకుండా దాదాపు 2.5 లక్షల మంది కశ్మీరీల జీవనోపాధి, కశ్మీర్ లోయ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ప్రశ్నార్థకం చేసింది. మళ్లీ పర్యాటకుల్లో మునుపటి విశ్వాసం, ఉత్సాహం నెలకొనాలంటే ఎన్నేళ్లు పడుతుందోనని టూరిజం వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. - సాక్షి, స్పెషల్ డెస్క్హోటళ్లన్నీ ఖాళీ..ఈ నెల 22న పహల్గాం సమీపంలో మినీ స్విట్జర్లాండ్‌గా పేరుగాంచిన బైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాద దాడి ప్రభావంతో కశ్మీర్లో పర్యటించేందుకు సిద్ధమైన వేలాది మంది పర్యాటకుల్లో దాదాపు 90 శాతం మంది 24 గంటల వ్యవధిలోనే విమాన టికెట్లు రద్దు చేసుకున్నారు. మరోవైపు ఇప్పటికే కశ్మీర్ సందర్శనకు వచ్చిన పర్యాటకులు రాత్రికి రాత్రే హోటళ్లు, క్యాబ్‌ల బుకింగ్‌లు కూడా పెద్ద ఎత్తున రద్దు కావడం మొదలయ్యాయి.ఇప్పట్లో పర్యాటక పరిశ్రమ కోలుకొనే అవకాశమే లేదని ఓ ట్రావెల్ ఏజెంట్ వ్యాఖ్యానించారు. ‘మొన్నటివరకు పర్యాటకులతో కళకళలాడిన మా హోటల్ ఇప్పుడు వెలవెలబోతోంది. అసలైతే గదులన్నీ వచ్చే నెలకు కూడా బుక్ అయ్యాయి. కానీ రాత్రికి రాత్రే పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులైంది. టూరిస్టులంతా భయంతో గదులు ఖాళీ చేసి వెళ్లిపోయారు’ అని ఓ హోటల్ యజమాని వాపోయారు.కేంద్రం చర్యలన్నీ బూడిదపాలు..కశ్మీరీలకు పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరు. జమ్మూకశ్మీర్ వార్షిక పర్యాటక పరిశ్రమ విలువ దాదాపు రూ. 12 వేల కోట్లు. దీని విలువ 2030 నాటికి రూ. 30 వేల కోట్లకు పెరుగుతుందని అంచనా. జమ్మూకశ్మీర్‌కు స్పెషల్ స్టేటస్ కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని కేంద్రం 2019లో రద్దు చేయడంతోపాటు రాష్ట్ర హోదా తొలగించి జమ్మూకశ్మీర్‌ను లద్దాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసింది. అలాగే ఏటా స్థానికంగా దాదాపు 50 వేల మందికి ఉపాధి కల్పించేలా, ఐదేళ్లలో రూ. 2 వేల కోట్ల వార్షిక పెట్టుబడులను ఆకర్షించేలా 2020లో ప్రత్యేక పర్యాటక పాలసీని తీసుకొచ్చింది. దీనికితోడు మౌలిక సదుపాయాల మెరుగుదల, విమాన కనెక్టివిటీ, విదేశీ పర్యాటకులకు ఆన్–అరైవల్ వీసా, 75 కొత్త పర్యాటక ప్రదేశాలు, 75 కొత్త వారసత్వ/సాంస్కృతిక ప్రదేశాలు, 75 కొత్త సూఫీ/మత ప్రదేశాల స్థాపన కోసం రూ. వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించింది. కశ్మీర్‌ను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో నేరుగా అనుసంధానించడానికి రైల్వే కూడా కసరత్తు ప్రారంభించింది.ప్రీమియం రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కూడా ఇందులో ఉంది. కేంద్రం చర్యలతో 2020 నుంచి కశ్మీర్ లోయను సందర్శించే పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 2024 నాటికి పర్యాటకుల సంఖ్య సుమారు 2.36 కోట్లకు చేరుకుంది. కానీ ఇప్పుడు ఉగ్రవాద దాడితో అక్కడి పర్యాటక రంగం చుట్టూ సంక్షోభం ముసురుకుంది.

ఢిల్లీ మేయర్‌గా బీజేపీ నేత రాజా ఇక్బాల్ సింగ్
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారం దాదాపు రెండేళ్ల తర్వాత బీజేపీకి దక్కింది. ఆ పార్టీకి చెందిన రాజా ఇక్బాల్ సింగ్ శుక్రవారం ఢిల్లీ నూతన మేయర్‌గా ఎన్నికయ్యారు. 142 ఓట్లకు గాను ఇక్బాల్‌కు 133 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్‌కు చెందిన మన్దీప్ సింగ్‌పై ఇక్బాల్ ఘన విజయం సాధించారు. ఒక ఓటును చెల్లనిదిగా అధికారులు ప్రకటించగా, బీజేపీకి చెందిన ఎంపీ మనోజ్ తివారీ గైర్హాజరయ్యారు. కాంగ్రెస్‌కు మొత్తం 8 ఓట్లు పడ్డాయి. కాగా, ఈ ఎన్నికను ఆప్ బహిష్కరించింది. నెల రోజుల్లో స్టాండింగ్ కమిటీ వేసి ఢిల్లీ ప్రభుత్వం సహకారంతో ప్రజలకు సమస్యలే లేకుండా చేస్తామని ఇక్బాల్ సింగ్ ఎన్నిక అనంతరం ప్రకటించారు. ఇక్బాల్ సింగ్ నార్త్ ఎంసీడీ మేయర్‌గా చేశారు. 2020 దాకా పార్టీ సివిల్ లైన్స్ జోన్ చీఫ్‌గా వ్యవహరించారు.

సమరయోధులపై అపహాస్యమా?
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోధులపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు మందలించింది. వీర సావర్కర్‌ను మహారాష్ట్ర ప్రజలు ఎంతగానో ఆరాధిస్తారని గుర్తు చేసింది. ‘‘మీ నానమ్మ ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా సావర్కర్‌ను ప్రశంసిస్తూ లేఖ రాశారని మీకు తెలుసా? మనకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు తెచ్చిపెట్టిన వారిని ఇలా అవమానిస్తారా?’’ అంటూ ఆగ్రహం వెలిబు చ్చింది. ‘‘మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిని సుమోటోగా తీసుకుంటాం’’ అని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం శుక్రవారం హెచ్చరించింది. ‘‘ఇలాగే వదిలేస్తే మున్ముందు ‘గాంధీ బ్రిటిష్‌వారికి సేవకుడు’ అని కూడా చెబుతారు. ఎందుకంటే వైస్రాయ్ను ఉద్దేశించి ప్రసంగించేటప్పుడు గాంధీ ‘మీ నమ్మ కమైన సేవకుడు’ అంటూ మాట్లాడేవారు. స్వాతంత్య్ర యోధులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడాన్ని అనుమతించబోం’’ అని స్పష్టం చేసింది. సావర్కర్‌పై రాహుల్ వ్యాఖ్యలను బాధ్యతారాహిత్యంగా అభివర్ణించింది. యూపీలో దాఖలైన కేసులో క్రిమినల్ ప్రొసీడింగ్స్‌పై స్టే విధించింది.
ఎన్ఆర్ఐ

పిట్స్‌బర్గ్‌లో నాట్స్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
అమెరికాలో తెలుగు వారిని కలిపే అనేక కార్యక్రమాలను చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా పిట్స్బర్గ్ లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించింది. తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నాట్స్ పిట్స్బర్గ్ చాప్టర్ నిర్వహించిన ఉగాది వేడుకలకు స్థానిక తెలుగు వారి నుంచి మంచి స్పందన లభించింది. కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో పాటు, జానపద నృత్యాలు, శాస్త్రీయ సంగీత గీతాలు, నాటక ప్రదర్శనలు, తదితర వినోద కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సంస్కృతి డాన్స్ స్కూల్ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఉగాది వేడుకల్లో భాగంగానే తెలుగు శ్లోక, తెలుగు వచనం, గణితం, చిత్రలేఖనం, లెగో డిజైన్, చెస్ పోటీలు పిల్లల కోసం నిర్వహించగా, ప్రత్యేకంగా విజేతలకు బహుమతులు అందించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానం సాధించిన పిల్లలకు ప్రత్యేకంగా గుర్తింపు, పురస్కారాలను అందజేశారు. ఈ పోటీలు పిల్లలలో సృజనాత్మకతను, విజ్ఞానాన్ని, పోటీ భావనను పెంపొందించేందుకు ఒక గొప్ప వేదికగా నిలిచాయి ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించడంలో నాట్స్ పిట్స్బర్గ్ చాప్టర్ కోఆర్డినేటర్ రవి కొండపి, నాట్స్ వెబ్ సెక్రటరీ రవికిరణ్ తుమ్మల కీలక పాత్ర పోషించారు. వారి నాయకత్వం, అంకితభావం వల్లే ఈ వేడుకలు దిగ్విజయంగా జరిగాయని స్థానిక తెలుగు వారి నుంచి ప్రశంసలు లభించాయి. ఈ వేడుకలకు వ్యాఖ్యాతలుగా శిల్పా శెట్టి, అర్చనా కొండపి, మోనికాలు వ్యవహారించారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించిన సంస్కృతి డ్యాన్స్ స్కూల్‌కి నాట్స్ ధన్యవాదాలు తెలిపింది. ఇక విందు భోజనాన్ని పిట్స్బర్గ్ తత్వా ఇండియన్ క్యూసిన్ అందింయింది., సంప్రదాయ తెలుగు విందు భోజనంతో అందరి చేత ఆహా అనిపించారు.ఉగాది వేడుకలకు సహకరించిన వారికి, వేడుకల కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ పిట్స్ బర్గ్ టీం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. తెలుగు వారి కోసం ఉగాది వేడుకలను దిగ్విజయంగా నిర్వహించిన పిట్స్బర్గ్ టీంకి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

అందాల బొమ్మ.. ఈ గోదావరి భామ
వీరవాసరం: పుట్టింది పల్లెటూరులో.. పెరిగింది పట్నంలో.. ఆపై ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లిన తెలుగమ్మాయి అక్కడ అందాల పోటీల్లో ఫైనల్‌కు చేరింది. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురు గ్రామ శివారు నడపనవారి పాలెం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాంబాబు కుమార్తె కొత్తపల్లి చూర్ణిక ప్రియ (Churnika Priya Kothapalli). అమెరికాలో ఎంఎస్ చదువుతున్న ఆమె తెలుగు సంఘం ఆధ్వర్యంలో డల్లాస్‌లో నిర్వహించిన మిస్ తెలుగు యూఎస్ఏ–2025 పోటీల్లో పాల్గొంది. సుమారు 5 వేల మంది పాల్గొన్న పోటీల్లో ఆమె సత్తాచాటి ఫైనల్–20 జాబితాలో చోటు సంపాదించింది. గోదావరి (Godavari) కీర్తిని చాటింది.అమెరికాలోని డల్లాస్ (Dallas) ఐర్వింగ్ ఆర్ట్ సెంటర్ వేదికగా వచ్చే మే 25న గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ పోటీలో గెలుపొందేందుకు ప్రపంచంలోని తెలుగు ప్రజల ఓట్లే కీలకం. అమెరికాలోని తెలుగు యువతులకు మాత్రమే పరిమితమైన ఈ పోటీల్లో చూర్ణిక ప్రియ అద్భుతమైన ప్రతిభను చాటుతుండటం విశేషం. బీటెక్ పూర్తి చేసిన ఈమె క్లాసికల్ డ్యాన్సర్ గానూ ప్రతిభ చాటింది.చదవండి: టాలెంట్‌ను ట్రంప్ కూడా ఆపలేడు

స్కాట్లాండ్లో ఘనంగా ఉగాది సంబరాలు
స్కాట్లాండ్లోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ (TAS) ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది సంబరాలు నిర్వహించారు. ఇవి తెలుగు సంస్కృతిక ఐక్యతకు ప్రతిబింబంగా నిలిచాయి. ఈ ఉగాది సంబరాలు స్కాట్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 5న మిడ్లాథియన్‌లోని డాల్కీత్ స్కూల్ కమ్యూనిటీ వద్ద నిర్వహించారు.శ్రీ విశ్వావసు నామ సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, సంఘం ఐక్యతను ప్రతిబింబించేలా ఈ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కాట్లాండ్లో ఉన్న వందలాది తెలుగు కుటుంబాలు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు కూడా ఆకర్షణగా నిలిచారు. వందకి పైగా కళాకారులు తమ ప్రతిభ, ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ వేడుక ప్రస్తుత, మాజీ కమిటీ సభ్యులతో జ్యోతి ప్రజ్వలన మొదలవ్వగా, అనంతరం “మా తెలుగు తల్లికి” గేయంతో సాంస్కృతిక కార్యక్రమంతో ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా భారత కాన్సులేట్ అధికారి ఆజాద్ సింగ్, లోథియన్ ప్రాంతానికి చెందిన MSP ఫోయిల్ చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని, ఇతర సంఘాల ప్రతినిధులను చైర్మన్ శివ చింపిరి, అధ్యక్షుడు ఉదయ్ కుమార్ కుచాడి, హానరరీ చైర్పర్సన్ మైథిలి కెంబూరి తదితరులు ఘనంగా సత్కరించారు.. సాంస్కృతిక కార్యదర్శి పండరి జైన్ కుమార్ పొలిశెట్టి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, కళాకారులు, ప్రేక్షకులు, స్పాన్సర్లు, వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్య ఆకర్షణగా “మనబడి” పిల్లలు ప్రదర్శించిన “పరమానందయ్య శిష్యుల కథ” నాటకం, భాషా నేర్పరితో పాటు సాంస్కృతిక విలువలను చక్కగా చాటింది. ఈ ఉగాది సంబరాలు 2025 తెలుగు వారసత్వాన్ని ముందుకెళ్లలా, సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా నిర్వహించడం తోపాటు.. TAS సంఘం ఐక్యత, సేవా ధోరణిని ప్రతిబింభించేలా నిలిచాయి.(చదవండి: న్యూజిలాండ్‌లో ఘనంగా ఉగాది సంబరాలు)

న్యూజిలాండ్‌లో ఘనంగా ఉగాది సంబరాలు
ఆక్లాండ్ నగరంలో తెలంగాణా అసోసియేషన్ అఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్త సంవత్సరాది విశ్వవాసు సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ వేడుకలను నిర్వహించుకున్నారుఈ కార్యక్రమం లో తెలుగుతనం, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పంచాంగ శ్రవణంతో రాశి ఫలితాలను స్థితిగతులను విని ఆనందించారు. ఆ తర్వాత చిన్నారులు పెద్దలు వివిధ తెలుగు సాంప్రదాయ పాటలు, నృత్యాలతో అలరించడమే కాకుండా సాంప్రదాయ పిండి వంటలతో సామూహిక భోజనాలు చేశారు. కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించిన టే అటటు డెంటల్ క్లినిక్ మోనిక శ్రీకాంత్ తోపాటు సామజికసేవాలో ముందున్న తెలుగు ప్రతినిధులను ఉగాది పురస్కారాలతో గౌరవంగా సన్మానించుకోవడం తోపాటు చిన్నారులకు నృత్యకారులకు బహుమతులని అందజేయడం జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి చంద్రశేఖర్ అద్యేక్షతన జరిగిన ఈ వేడుకలో ప్రముఖ వ్యాపారవేత్త శివ కిలారి, రవి సంకర్ అల్ల, సత్యనారాయణ తట్టల, అసోసియేషన్ మాజీ అధ్యక్షలు పట్లోళ్ల నరేందర్ రెడ్డి, మేకల ప్రసన్న కుమార్,శైలందర్ రెడ్డి, విశ్వనాధు బాల, విజేత యాచమనేని, మధు ఎర్ర, శైలజ బాలకుల్ల, లింగం గుండెల్లి, శశికాంత్ గున్నాల, కావ్య, వర్ష పట్లోళ్ల, మేకల స్వాతి,కిరణ్మయి, విశ్వనాథ్ అవిటి, సలీం, ప్రమోద్, విజయ్ శ్రీరామ్, చంద్రకిరణ్,రమేష్ రామిండ్ల, మనోహర్ కన్నం, హరీష్, రమేష్ ఆడెపు, పవన్, అనిల్ మెరుగు తదితరులతో పాటు పెద్ద ఎత్తున ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.(చదవండి: హాంగ్‌కాంగ్‌లో ఘనంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు)
క్రైమ్

అనుమానాస్పద స్థితిలో నర్స్ మృతి
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ సిటీలోని జ్యోతినగర్‌లో నివసిస్తున్న ఓ నర్స్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. టూటౌన్ పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా పాలితం గ్రామానికి చెందిన బాసిల్లి ఝాన్సీ(23) స్థానికంగా ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తోంది. ఇద్దరు స్నేహితులతో కలసి జ్యోతినగర్‌లోని ఓ గదిలో కిరాయికి ఉంటుంది. గురువారం రాత్రి భోజనం చేసిన తర్వాత గదిలోపల ఝాన్సీ ఉండగా ఆమె స్నేహితులు బిల్డింగ్‌పై పడుకోవడానికి వెళ్లారు. అదే సమయంలో వీరికి పరిచయం ఉన్న అజయ్ అనే వ్యక్తి ఫోన్ చేసి ఝాన్సీకి ఫోన్‌చేస్తే లిఫ్ట్ చేయడం లేదని తెలిపాడు. వెంటే స్నేహితులు కిందికి వచ్చి చూడగా ఝాన్సీ అపస్మారక స్థితిలో ఉంది. పక్కనే ఓ ఇంజెక్షన్ ఉండడంతో దానిని ఫొటోతీసి అజయ్‌కు పంపించారు. దీంతో అజెయ్ వెంటనే తన మిత్రుడికి సమాచారం ఇచ్చి స్నేహితులతో ఝాన్సీని ఆసుపత్రికి తరలించేలోపే మృతిచెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తనకు తానే కాల్పులు జరుపుకున్న రిక్కీరై!
కర్ణాటక: పారిశ్రామికవేత్త రిక్కీరైపై జరిగిన కాల్పుల ఘటన మలుపు తిరిగింది. ఆయన తనంటత తానే కాల్పులు జరుపుకున్నారని కాల్పుల వ్యవహారంలో అరెస్ట్ అయిన మాజీ గన్‌మెన్ మన్నప్ప విఠల్ వాంగ్మూలం ఇచ్చారు. కాల్పులకు పాల్పడ్డారనే అనుమానంతో మన్నప్పవిఠల్ను బిడది పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతన్ని రామనగర కోర్టులో హాజరుపరిచి 10 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు.తమదైనశైలిలో విచారణ చేపట్టగా రిక్కీరై తనంతటతానే కాల్పులు జరుపుకున్నట్లు మన్నప్ప విఠల్ వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో రిక్కీరై షూటౌట్ కాల్పుల ఘటనపై నాటకం ఆడినట్లు అనుమానం మరితం బలపడినట్లైంది. మాజీ డాన్ దివంగత ముత్తప్పరై చిన్నకుమారుడు పారిశ్రామికవేత్త రిక్కీ రైపై ఈనెల 18వ తేదీ రాత్రి 11.30 సమయంలో కారులో బెంగళూరుకు వెళ్తుండగా బిడది వద్ద ఆయనపై ఫైరింగ్ జరిగింది. రిక్కీరై ముక్కు, చేతులకు గాయాలయ్యాయి. అనంతరం అతడిని బెంగళూరు హెచ్ఏఎల్ రోడ్డులోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసులకు షూటౌట్ జరిగిన స్థలంలో లభించిన బుల్లెట్, విఠల్ వద్ద ఉన్న గన్లోనిదని తేలింది. పోలీసులు ఇతడి గన్ను స్వాదీనం చేసుకుని ఎప్ఎస్ఎల్ ల్యాబోరేటరీకి పంపించారు. ముత్తప్పరై వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తున్న విఠల్.. రిక్కీ రై వద్దనే పనిచేసేవాడు. ఆరోగ్యం సరిగాలేనందున ఆ ఉద్యోగం వదిలిపెట్టి ఇంటివద్ద సెక్యూరిటీగా పనిచేస్తున్నారు. ముత్తప్పరై చనిపోకముందు ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. కానీ రిక్కీ రై సైట్ ఇవ్వడానికి నిరాకరించారు. ఈ కారణంతో మన్నప్పవిఠల్ కోపంతో ఉండవచ్చని అనుమానం వ్యక్తమైంది. రిక్కీరై గన్‌మెన్ ఇచ్చిన ఫిర్యాదులో ముగ్గురు పేర్లు ఉండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కేసులో ఉన్న పాత్ర ధ్రువీకరించడానికి ఎలాంటి సాక్ష్యాలు కనబడకపోవడంతో ఎవరినీ అరెస్ట్ చేయలేదు. ముత్తప్పరై మాజీ సహచరుడు, మొదటి ఆరోపి రాకేశ్మల్లి, మూడో ఆరోపి నితీశ్శెట్టిని విచారణ చేపట్టి పోలీసులు వదిలిపెట్టారు. రెండో ఆరోపి ముత్తప్పరై రెండో భార్య అనురాధ విదేశాల్లో ఉన్నారు.

మళ్లీ పుట్టి... ఒక్కటవుతాం..!
నెల్లూరు (క్రైమ్): వారిద్దరూ ప్రేమించుకున్నారు. కారణాలు ఏవైనా వారి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. వారిని ఎదిరించి ఒక్కటయ్యే ధైర్యంలేక ఊరుకాని ఊరు వచ్చారు. లాడ్జిలో గదిని అద్దెకు తీసుకుని తల్లిదండ్రులకు సూసైడ్ లేఖ రాశారు. ‘‘అమ్మ, నాన్నలు క్షమించండి. మీరు మా ప్రేమను ఎలాగూ అంగీకరించడం లేదు. మళ్లీ పుట్టి అందరి అంగీకారంతో ఒక్కటవుతాం’’ అంటూ రాసి, పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. హృదయ విదారకమైన ఈ సంఘటన నెల్లూరులోని ఒక లాడ్జిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం ప్రకారం, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన బాచ్చు జోసఫ్ రత్నకుమార్ (23), కృష్ణా జిల్లా కైకలూరు మండలం ఆటపాకకు చెందిన చిల్లుముంత శ్రావణి (21) మధ్య బీటెక్ చదివే సమయంలో చిగురించిన స్నేహం, అటుపై ప్రేమగా మారింది. వారి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 21వ తేదీన నెల్లూరు వచ్చారు. కళాశాలలో కౌన్సెలింగ్ ఉందని చెప్పి ఒక లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నారు. కౌన్సెలింగ్ పూర్తికాలేదని మరో రోజు గదికి నగదు చెల్లించారు. 23వ తేదీన గదిని శుభ్రం చేసేందుకు లాడ్జి స్వీపర్ వెళ్లి తలుపుకొట్టగా లోపల నుంచి ఎలాంటి అలికిడి లేదు. బయటకు వెళ్లి ఉంటారని భావించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. మరుసటి రోజు అలానే జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం వారు అద్దెకు తీసుకున్న గది నుంచి దుర్వాసన వస్తుండటంతో లాడ్జి సిబ్బంది సంతపేట పోలీసులకు సమాచారం అందించారు. ఇన్స్పెక్టర్ జి.దశరథరామయ్య, ఎస్ఐ బాలకృష్ణ తలుపులు పగులగొట్టి చూడగా, బెడ్‌పై జోసఫ్ రత్నకుమార్, నేలపై శ్రావణి మృతదేహాలు కుళ్లిపోతున్న స్థితిలో పడి ఉన్నాయి. సమీపంలో గడ్డిమందు సీసా పడి ఉంది.దీంతో వారు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. వారి బ్యాగ్‌లను పరిశీలించగా అందులో మృతుల ఆధార్ కార్డులు, కళాశాలలకు సంబంధించిన సరి్టఫికెట్లు ఉన్నాయి. ఇరువురు తమ తల్లిదండ్రులకు రాసిన సూసైడ్ లేఖలను పోలీసులు గుర్తించి స్వా«దీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి సంతపేట ఇన్స్పెక్టర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

విశాఖలో దంపతుల దారుణహత్య
విశాఖపట్నం: విశాఖ నగరం గాజువాక సమీపంలోని రాజీవ్‌నగర్‌లో భార్యాభర్తలు దారుణహత్యకు గురయ్యారు. డాక్‌యార్డులో పనిచేసి రిటైరైన గంపాల యోగేంద్రబాబు (66), లక్ష్మి (58) దంపతులను గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. వారు 35 ఏళ్లుగా రాజీవ్‌నగర్‌లో ఉంటున్నారు. రెండు రోజుల కిందట హైదరాబాద్ వెళ్లిన వారు గురువారం ఉదయం ఇంటికి చేరుకున్నారు.శుక్రవారం రాత్రి వరకు వారి ఇంటి తలుపులు తెరవకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో స్థానికంగా ఉన్న బంధువుల అమ్మాయి ఇంటికి వచ్చి చూసింది. ఇంటికి రెండువైపులా తాళం వేసి ఉండటాన్ని గమనించింది. అనుమానం వచ్చిన.. స్థానికుల సాయంతో పోలీసులకు సమాచారం అందించింది. సౌత్ ఏసీపీ టి.త్రినాథ్, దువ్వాడ సీఐ మల్లేశ్వరరావు అక్కడికి చేరుకుని తాళాలు పగలుగొట్టించి తలుపులు తెరిచారు. లోపలికి వెళ్లి చూస్తే హాల్లో యోగేంద్రబాబు, బెడ్రూమ్లో లక్ష్మి రక్తపుమడుగులో పడి ఉన్నారు. వారు అప్పటికే మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. యోగేంద్రబాబుది మచిలీపట్నం కాగా లక్ష్మిది శ్రీహరిపురం. 40 ఏళ్ల కిందట కులాంతర ఆదర్శ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. వారికి వివాహాలు జరిగి, అమెరికాలో స్థిరపడ్డారు. క్లూస్ టీం రంగంలోకి దిగి వివరాలు సేకరించింది.
వీడియోలు


చంద్రబాబు ఘరానా మోసం కార్యక్రమం చేపట్టిన అభినయ్ రెడ్డి


కర్నూల్ మున్సిపల్ కార్పొరేషన్ లో సమస్యలపై YSRCP నిలదీత


కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్


H1B వీసా దరఖాస్తుదారులకు కొత్త నిబంధనలు పెట్టిన అమెరికా


High Tension: కాశ్మీర్లో ఉగ్రవేట


పహల్గాం ఉగ్రదాడి నిరసనకారులకు పాక్ బెదిరింపులు


విష్ణుకుమార్ రాజు పై గంటా శ్రీనివాసరావు ఫైర్


బెలూచిస్థాన్ లో పాకిస్థాన్ ఆర్మీపై దాడి


పవన్ కళ్యాణ్ పాల్గొనాల్సిన రచ్చబండ కార్యక్రమం అర్ధాంతరంగా రద్దు


కాకినాడలో టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వర్సెస్ జనసేన