
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కేపీహెచ్‌బీ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం సేవించిన యువతి అతి వేగంతో కారు నడిపి బైకును ఢీకొట్టింది. ఈ క్రమంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి గాయాలు కావడంతో పోలీసులను ఆశ్రయించారు.
వివరాల ప్రకారం.. మద్యం సేవించిన యువతి కారు నడిపి కూకట్‌పల్లిలో గురువారం అర్థరాత్రి బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో అతి వేగంగా డ్రైవ్ చేసి ఓ బైకర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకర్‌కు గాయాలు కావడంతో సదరు వ్యక్తి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు చేయగా 212 పాయింట్స్ రీడింగ్ నమోదైంది. దీంతో, ఆమెపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
