
జనగామ: కరోనా కష్టకాలంలో వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ ఉపాధ్యాయులకు జనగామ జిల్లా కేంద్రంలోని సోమేశ్వర హెయిర్ సెలూన్ యజమాని గడ్డం నరేశ్ అండగా నిలుస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ టీచర్లకు తన వంతు సాయంగా ఉచితంగా క్షవరం చేస్తున్నాడు.
వాట్సాప్ స్టేటస్ ద్వారా ఈ సేవలపై ఆయన ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ, కరోనా సమయంలో తాను సైతం ఆర్థికంగా ఇబ్బందులు పడ్డానని, తనలా సమస్యలు ఎదుర్కొంటున్న వారికి చేదోడుగా నిలవాలన్న భావనతోనే ఉచితంగా హెయిర్ కటింగ్ చేస్తున్నట్లు తెలిపారు.