
ఏసీబీకి పట్టుబడిన యూబీడీ డిప్యూటీ డైరెక్టర్
గచ్చిబౌలి: శేరిలింగంపల్లి వెస్ట్‌జోనల్ అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ విప్పెర్ల శ్రీనివాస్ రూ.70 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ సిటీ రేంజ్ యూనిట్–2 డీఎస్‌పీ శ్రీధర్ ఆధ్వర్యంలో మంళగవారం మధ్యాహ్నం 1.30 గంటలకు 20 మంది సిబ్బందితో రైడ్ చేశారు. శేరిలింపల్లి జోన్ యూబీడీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ చారి్మనార్ జోన్ ఇన్‌చార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు.
చార్మినార్ జోనల్ పరిధిలో మొక్కలు నాటిన ఓ కాంట్రాక్టర్ వద్ద నుంచి రూ.70 వేలు తీసుకొని టేబుల్ డ్రాలో పెట్టగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మొక్కలు నాటిన పనులకు గాను ఓ కాంట్రాక్టర్‌కు రూ.44 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని డీఎస్‌పీ శ్రీధర్ తెలిపారు. ఈ బిల్స్ క్లియర్ చేసేందుకు శ్రీనివాస్ కాంట్రాక్టర్ నుంచి రూ.2.20 లక్షలు డిమాండ్ చేశారన్నారు. ఇప్పటికే పలు దఫాలుగా రూ.1.50 లక్షలు ఇచ్చినట్లు విచారణలో తేలిందన్నారు. వేరే కాంట్రాక్టర్ యూపీఐ ద్వారా రూ.50 వేలు వేయించుకున్నాడని, మరో సారి రూ.50 వేలు నగదుగా తీసుకున్నారని ఆయన వివరించారు.
శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలోని లిఫ్ట్‌లో కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం కాంట్రాక్టర్ ఇచి్చన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు. నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తామని పేర్కొన్నారు. అర్బన్ బయో డైవర్సిటీ డైరెక్టర్ సునంద నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు. శేరిలింగంపల్లి యూబీడీ విభాగంలో తనిఖీలు చేస్తున్నామని, సిబ్బందిని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. అధికారులకు లంచం ఇవ్వవద్దని, ఎవరైనా లంచం అడిగితే 1064లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
పత్తాలేని అధికారులు
శేరిలింగంపల్లి వెస్ట్ జోనల్‌లో అర్బన్ బయోడైవర్సిటీ విభాగంలో ఏసీబీ అధికారులు సోదాలు చేయడంతో మిగతా విభాగాల అధికారులు పత్తా లేకుండా పోయారు. ఆయా విభాగాల అధికారుల కోసం వచి్చన ప్రజలకు ఫీల్డ్ విజిట్ హెడ్ ఆఫీస్‌లో మీటింగ్‌కు వెళ్లారంటూ సిబ్బంది నుంచి సమాదానం వచి్చంది. మంళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు దాడులు చేసిన ఏసీబీ అధికారులు యూబీడీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్‌ను అంచం తీసుకుంటుండగా రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ఆ విషయం తెలిసి సంబంధిత శాఖల అధికారులు పత్తా లేకుండా పోయారు.