
సాక్షి,హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ఆదివారం(జూన్23) సాయంత్రం భారీ వర్షం కురిసింది. అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్, బోరబండ, పంజాగుట్ట, యూసఫ్‌గూడ, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, చంపాపేట్, సైదాబాద్, చాదర్‌ఘాట్, మలక్‌పేట్, సరూర్‌నగర్, అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్, బోరబండ
పంజాగుట్ట, యూసఫ్‌గూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఎల్బీనగర్, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షంతో పలుచోట్ల ట్రాఫిక్‌జామ్ అయింది. వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వరదనీరు చేరింది. ఓ వైపు రహదారి విస్తరణ పనులు, మరోవైపు వరదనీటితో వాహనదారులు ఇక్కట్లకు గురయ్యారు. పలు చోట్ల వరద నీటి కారణంగా వాహనాలు స్లోగా వెళ్లాయి.