
గ్రేటర్ పరిధిలో ఇంటర్ మొత్తం ఉత్తీర్ణత 73 శాతం
ఫస్టియర్‌లో మొదటి, రెండో స్థానాల్లో మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలు
సెకండియర్‌లోనూ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో
ఎప్పటి మాదిరిగా వెనుకబడిన హైదరాబాద్ జిల్లా
సాక్షి, (హైదరాబాద్): ఇంటర్ పరీక్ష ఫలితాల్లో మళ్లీ అమ్మాయిల హవానే కొనసాగింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరోసారి సత్తా చాటారు. కాగా.. రాష్ట్ర స్థాయిలోనే ఫస్టియర్‌లో మేడ్చల్– మల్కాజిగిరి ప్రథమ స్థానంలో నిలవగా, రంగారెడ్డి జిల్లా ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది. సెకండియర్‌లోనూ ఈ రెండు జిల్లాలు మూడు, నాలుగో స్థానాలను కైవసం చేసుకున్నాయి. హైదరాబాద్ జిల్లా మరోసారి చతికిలపడి నిరాశే మిగిలి్చంది. మొత్తమ్మీద ఇంటరీ్మడియట్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్‌కు 73 శాతం ఉత్తీర్ణత లభించింది. గత ఏడాది కంటే 3 శాతం ఉత్తీర్ణత పెరిగింది.
ఉత్తీర్ణత ఇలా..
గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో కలిపి ఇంటర్ ప్రథమ సంవత్సరం జనరల్, వృత్తి విద్యా కోర్సులతో కలిపి 73.41 శాతం, ద్వితీయ సంవత్సరంలో 73.39 శాతం ఉత్తీర్ణత లభించింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ప్రథమ సంవత్సరంలో హైదరాబాద్‌లో 66.68 శాతం, రంగారెడ్డి జిల్లాలో 76.36, మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాలో 77.21 శాతం, ద్వితీయ సంవత్సరంలో మేడ్చల్ జిల్లా 77.91, రంగారెడ్డి 77.53, హైదరాబాద్ 67.74 శాతం ఉత్తీర్ణత సాధించాయి.
మరోసారి.. సత్తా చాటి..
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఈ ఏడాది సైతం బాలికల హవానే కొనసాగింది. ప్రథమ సంవత్సరం జనరల్ కోర్సుల్లో ఫలితాలు పరిశీలిస్తే.. మేడ్చల్– మల్కాజిగిరిలో బాలికలు 82.40 శాతం, బాలురు 73.54, రంగారెడ్డి జిల్లాలో 81.92 బాలికలు, 72.24 బాలురు, హైదరాబాద్ జిల్లాలో 74.65 బాలికలు, 60.47 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో.. మేడ్చల్‌లో 82.21 బాలికలు, 74.56 బాలురు, రంగారెడి జిల్లాలో 82 శాతం బాలికలు, 73.70 బాలురు, హైదరాబాద్ జిల్లాలో బాలికలు 74.81, బాలురు 59.50 శాతం చొప్పున ఉత్తీర్ణులయ్యారు.