తెలంగాణ: ఆర్టీసీ బస్సుల్లో చిల్లర సమస్యకు చెక్‌ పెట్టిన సజ్జనార్‌ | Round Up Charges In TSRTC Pallevelugu Buses Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణ: ఆర్టీసీ బస్సుల్లో చిల్లర సమస్యకు చెక్‌ పెట్టిన సజ్జనార్‌

Published Thu, Mar 17 2022 2:59 PM | Last Updated on Thu, Mar 17 2022 2:59 PM

Round Up Charges In TSRTC Pallevelugu Buses Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుల్లో చిల్లర సమస్యకు చెక్ పడింది. చిల్లర సమస్యను గుర్తించిన ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌.. దీన్ని పరిష్కరించేందుకు రౌండప్‌ చార్జీలను ఖరారు చేశారు. గురువారం నుంచి ఈ కొత్త (రౌండప్‌) చార్జీలను అమలు చేయాలని ఆదేశించారు.

రూ.12చార్జీ ఉన్న చోట టికెట్‌ను రూ. 10 రౌండప్‌ చేసి ప్రయాణికుల వద్ద వసూలు చేయనున్నారు. రూ.13, రూ.14  ఉన్న చోట.. ఆ టికెట్లను రూ. 15గా రౌండప్‌ చేయనున్నారు. అలాగే.. 80 కీలోమీటర్ల దూరానికి ఇప్పటి వరకు రూ.67 వసూలు చేస్తుండగా రౌండప్‌ ఖరారుతో చార్జీలు రూ.65 మాత్రమే వసూలు చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement