
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం మధ్యాహ్నాం రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, భట్టి ఇతరులు టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం ఐదు లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 92.78 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రకటించారు. గురుకులాల్లో 98 శాతం, ఆశ్రమ పాఠశాలల్లో 95 శాతం, ప్రైవేట్ పాఠశాలల్లో 94.12 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా.. గతేడాది కంటే 1.47 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

విద్యార్థులు తమ టెన్త్ ఫలితాలను కింద ఇచ్చిన సాక్షి అధికారిక ఎడ్యుకేషన్ వెబ్ సైట్‌లో పొందవచ్చు. 👇
👉Server 1 https://results2.sakshieducation.com/Results2025/telangana/SSC/2025/ts-ssc-10th-class-results-2025.html
👉Server 2 https://education.sakshi.com/sites/default/files/exam-result/TS-SSC-10th-Class-Results-2025-Direct-Link.html
👉Server 3 http://results1.sakshieducation.com/results/SSC/ts-10th-class-results-2025.html

సరికొత్త విధానం..
కాగా.. ఈసారి గ్రేడింగ్ స్థానంలో మార్కుల మెమోలపై సబ్జెక్ల వారీగా మార్కులు, గ్రేట్లను ఇచ్చారు. ఈమేరకు కొత్త మెమో నమూనాను కూడా విద్యాశాఖ విడుదల చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో మార్కుల విధానాన్ని తొలగించి గ్రేడింగ్ విధానాన్ని అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. 2009 నుంచి ఈ విధానం అమలులోకి వచ్చింది. ఏ-1, ఏ-2, బీ-1,బీ-2, సీ-1, సీ-2, డి, ఈలుగా గ్రేడ్‌లను ఇచ్చేవారు. సబ్జెక్ట్‌ల వారీగా గ్రేడ్లతో పాటు సీజీపీఏ ఇచ్చేవారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఈ విధానాన్ని తొలగించి సీజీపీఏ కాకుండా సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. అయితే విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు, విద్యార్థులతో చర్చించకుండానే సరికొత్త విధానాన్ని అమలు చేయడం పట్ల అనేక ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.