
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు(బుధ, గురు) నీటి సరఫరాలో అంతరాయం కలగనుందని జలమండలి వెల్లడించింది. కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్-2 లోని కోదండాపూర్ పంప్ హౌజ్ లో రెండో పంపు ఎన్‌ఆర్‌వీ వాల్వ్ మరమ్మతులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. జలమండలి ఓ అండ్ ఎం డివిజన్లు - 2, 3, 4, 5, 7, 9, 10(A), 10(B), 13, 14, 16, 20 పరిధిలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు తాగునీటి సరఫరాలో కొన్నిచోట్ల పూర్తి అంతరాయం కలుగుతుంది.
ఎన్‌పీఏ, మిరాలం, బాలాపూర్, మైసారం, బార్కాస్ భోజగుట్ట, ఆళ్లబండ, మేకలమండి, భోలక్ పూర్, చిలకల గూడ, తార్నాక, లాలాపేట్, బౌద్ధ నగర్, మారేడ్ పల్లి, కంట్రోల్ రూమ్, రైల్వేస్, MES, కంటోన్మెంట్, ప్రకాశ్ నగర్, పాటిగడ్డ, హస్మత్ పేట్, ఫిరోజ్ గూడ, గౌతమ్ నగర్, వైశాలి నగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, అల్కపురి కాలనీ, మహీంద్రహిల్స్, ఏలుగుట్ట, రామంతాపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిల్కా నగర్, బీరప్పగడ్డ, బుద్వేల్, శాస్త్రిపురం, మీర్ పేట్, బడంగ్ పేట్, శంషాబాద్ ప్రాంతాల్లో అంతరాయం ఏర్పడుతుంది. ఆ ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి అధికారులు సూచించారు.