
సమష్టి కృషితోనే విజయం
–జగన్‌ను కలిసిన నేదురుమల్లి,
మున్సిపల్ చైర్‌పర్సన్, కౌన్సిలర్లు
వెంకటగిరి(సైదాపురం): సమష్టి కృషి వల్లే వెంకటగిరి మున్సిపల్ అవిశ్వాస తీర్మానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గురువారం నేదురుమల్లి ఆధ్వర్యంలో వెంకటగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ నక్కా భానుప్రియ తోపాటు కౌన్సిలర్లు, బీసీ నేత డాక్టర్ బొలిగర్ల మస్తాన్‌యాదవ్, పార్టీ నాయకులు తాడేపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ అవిశ్వాస తీర్మానంలో జరిగిన కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులను ప్రత్యేకంగా వివరించారు. అనంతరం మాజీ సీఎం వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ బీఫాంపై గెలిచిన 25 మంది కౌన్సిలర్లలో చంద్రబాబు ఆరు గురిని మాత్రమే భయపెట్టి.. కొనగలిగారని, మిగిలిన 19 మంది కౌన్సిలర్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంటే నిలబడ్డారన్నారని, ఇదంతా నేదురుమల్లి కృషేనని కొనియాడారు. రాష్ట్రంలో 50 చోట్ల ఉప ఎన్నికలు నిర్వహించగా.. 39 చోట్ల వైఎస్సార్‌సీపీ జెండా ఎగిరిందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నేత డాక్టర్ మస్తాన్‌యాదవ్, మున్సిపల్ చైర్‌పర్సన్ నక్కా భానుప్రియ, పట్టణ కన్వీనర్ పులి ప్రసాద్‌రెడ్డి, పద్మశాలి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ నక్కా వెంకటేశ్వర్లు, విప్ పూజారి లక్ష్మి, వైస్‌చైర్మన్‌లు సేతరాసి బాలయ్య, చింతపట్ల ఉమామహేశ్వరి, కౌన్సిలర్లు సుబ్బారావు, తుపాటి సుజాత, ఎంఏ.నారాయణ, ఆరి శంకరయ్య, ఆటంబాకం శ్రీనివాసులు, శివ, ధనియాల రాధ, వహిద, సుభావలి, సుఖన్య, విజయలక్ష్మి, కందాటి కళ్యాణి, నాయకులు పూజారి శ్రీనివాసులు, కందాటి రాజారెడ్డి, చింతపట్ల మురళి, కొండూరు వెంకటరత్నంరాజు, యస్థాని బాషా, కల్లు సతీష్ తదితరులు పాల్గొన్నారు.