
ఉర్దూతో ఉద్యోగావకాశాలు
తిరుపతి కల్చరల్: పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన ముస్లిం విద్యార్థులు ఉర్దూ భాషతో ఇంటర్ విద్యను అభ్యసిస్తే మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంజుమన్ తరఖీ ఉర్దూ సంస్థ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ షఫీ అహ్మద్‌ఖాద్రి తెలిపారు. గురువారం గిడ్డంగి వీధిలోని అంజుమన్ తరఖీ ఉర్దూ సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సరోజినీదేవి రోడ్డులోని ఏటీఎన్స్ కళాశాలలో ముస్లిం విద్యార్థులకు ప్రత్యేకంగా ఉర్దూభాషతో కూడిన ఇంటర్ విద్యావకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఇదే కళాశాలలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు ఎస్వీ యూనివర్శిటీలో ఉర్దూ, అరబిర్ విభాగాలలో ఎంఏ చదువుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. ఏటీఎన్స్ కళాశాలలో ఉర్దూతో కూడిన విద్యనభ్యసించే వారికి సంస్థ ద్వారా మెటీరియల్స్, పుస్తకాలు అందిస్తున్నట్లు తెలిపారు. పది పాసైన వారు ఏటీఎన్స్ కళాశాల లో ప్రవేశాలు పొందాలని కోరారు. అంజుమన్ తర ఖీ ఉర్దూ సంస్థ ప్రతినిధులు డాక్టర్ అంజద్ అలిబేగ్, షేక్ హాజీ ఫరీద్‌సాబ్, షేక్ దస్తగిరి, షేక్ నూరుల్లా, షేక్ మహ్మద్, ఎం.అసత్ అలిబేగ్, ఉస్మాన్ ఖాదరి, టిప్పూ ఖాదరి, షాబీర్ పాల్గొన్నారు.