Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Kutami Atrocities No confidence motion against Vizag Mayor Live Updates1
GVMC: అడ్డదారిలో మేయర్‌ పదవి పీఠం కోసం..

బలం లేకున్నా కుట్రలు, కుతంత్రాలతో విశాఖ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెడుతున్న కూటమి ప్రభుత్వం. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లకు గాలం వేసేందుకు చివరి నిమిషం దాకా ఎడతెరిపి లేకుండా ప్రయత్నించిన కూటమి నేతలు. డబ్బులు, బెదిరింపులు.. ప్రలోభాలకు లొంగకుండా తాము వైఎస్‌ జగన్‌ వెంటే ఉంటామంటూ తేల్చి చెప్పిన కొందరు. ఓటింగ్‌కు దూరంగా ఉంటూనే.. భారీ భద్రత నడుమ అవిశ్వాసం నిర్వహించాలని కలెక్టర్‌కు లేఖ రాసిన వైఎస్సార్‌సీపీ.నీచమైన రాజకీయాలు వద్దని చెప్పాప్రత్యేక విమానంలో కేరళ వచ్చి కూటమి నేతలు నన్ను బెదిరించారుకూటమికి అనుకూలంగా ఓటు వేయమన్నారునేను పార్టీ మారేది లేదని చెప్పానుమొదటినుంచి నేను వైఎస్సార్‌సీపీలో ఉన్నానురాజకీయమంటే వ్యాపారం కాదుడబ్బులు కోసం నీతిమాలిన రాజకీయాలు చేయనునీచమైన రాజకీయాలను చెయ్యొద్దని చెప్పానువైయస్ జగన్ వలనే నేను కార్పోరేటర్ అయ్యాను:::శశికళ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యానికి పాతర.ప్రలోభాలతో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల కొనుగోలుపది నెలల పదవి కోసం కోట్లాది రూపాయలకు ఖర్చు చేసిన కూటమి నేతలుమరికాసేపట్లో మేయర్ పై అవిశ్వాస తీర్మానంప్రైవేట్ హోటల్ నుంచి జీవీఎంసీ కార్యాలయానికి రానున్న కూటమి కార్పోరేటర్లు..జీవీఎంసీ ఎన్నికకు దూరంగా వైఎస్సార్సీపీ.కూటమికి దూరంగా ఉండాలని వామపక్షాల నిర్ణయం మరికాసేపట్లో విశాఖ మేయర్ పై అవిశ్వాస తీర్మానం ఓటింగ్ కు దూరంగా వైఎస్సార్‌సీపీ కూటమికి దూరంగా ఉండాలని వామపక్షాల నిర్ణయం బలం లేకపోయినా బరిలోకి దిగుతున్న కూటమి. అడ్డదారిలో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే కుట్రలు యాదవ సామాజిక వర్గం మహిళను పదవి నుంచి దించే ప్రయత్నం చేస్తున్న కూటమి అవిశ్వాసం నెగ్గాలంటే 74 మంది సభ్యులు అవసరం ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి YSRCP బలం 61 కూటమి బలం 48 ప్రలోభాలతో కొంతమంది వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను తమ పార్టీలో చేర్చుకున్న కూటమి నేతలు భారీ బందోబస్తులో జీవీఎంసీఅవిశ్వాసానికి ముందు ప్రత్యేక కౌన్సిల్‌ సమావేశంకార్పొరేటర్లు, ఎక్స్‌ అఫీషియోభ్యులకే మాత్రమే లోపలికి అనుమతిఅవిశ్వాసంపై వైస్సార్సీపీ అనుమానాలుబలం లేకున్నా కూటమి అడ్డదారులుఅవిశ్వాసానికి అనుకూలంగా ఓటేయాలని బెదిరింపులుకౌన్సిల్‌ సమావేశాన్ని బహిష్కరించిన వైఎస్సార్‌సీపీ ఓటింగ్‌ పటిష్టంగా నిర్వహించాలని ఇప్పటికే కలెక్టర్‌కు లేఖఓటింగ్‌ ప్రక్రియ వీడియో రికార్డింగ్‌ చేయాలని వైఎస్సార్‌సీపీ అభ్యర్థన జీవీఎంసీ కార్పొరేటర్ల వాస్తవ బలాబలాలువైఎస్సార్సీపీ 58 టీడీపీ 29జనసేన 3బీజేపీ 1సీపీఐ 1సీపీఎం 1ఇండిపెండెన్స్ 4.ఖాళీలు 1.జీవీఎంసీలో 98 మంది కార్పొరేటర్లుజీవీఎంసీలో 14 మంది ఎక్స్ ఆఫీషియో సభ్యులుటీడీపీకి 11 మంది సభ్యులు ఉన్నారు.. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఒక ఎమ్మెల్సీ..వైఎస్ఆర్సిపికి ముగ్గురు ఎక్స్ అఫీషియ సభ్యులు.ఎంపీ గొల్ల బాబురావు, ఇద్దరు, ఎమ్మెల్సీలు పండుల రవీంద్రబాబు, కుంభ రవిబాబు..ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం జీవీఎంసీ సభ్యుల సంఖ్య బలం 97+14= 111అవిశ్వాసం నెగ్గేందుకు 2/3 మెజారిటీ అంటే 74 మంది సభ్యులు అవసరం..ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి వైఎస్సార్‌సీపీ మొత్తం బలం 61ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి కూటమి మొత్తం బలం 48ఎన్నికకు దూరంగా ఇద్దరు సీపీఎం, సీపీఐ సభ్యులు. బలం లేకపోయిన బరిలోకినేడు విశాఖ మేయర్ పై అవిశ్వాస తీర్మానంఉదయం 11 గంటలకు అవిశ్వాస తీర్మానం.అవిశ్వాస తీర్మాణంలో నెగ్గేందుకు అడ్డదారులు.వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ బలవంతంగా తీసుకువచ్చేందుకు రౌడీలు.వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లకు ప్రలోభాలు బెదిరింపులు..పార్టీ మారకపోతే కేసులు పెడతామని బెదిరింపులు.వ్యాపారాలు దెబ్బతీస్తామని హెచ్చరిక పార్టీ మారిన కార్పొరేటర్లలో పునరాలోచనకూటమి శిబిరం నుంచి తప్పుకుంటున్న మహిళా కార్పొరేటర్లుమేయర్ గా యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళకు వైఎస్ జగన్ అవకాశం.యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళను పదవి నుంచి దించే కుట్రలు చేస్తున్న కూటమిమహిళను పదవి నుంచి దించడంపై అసంతృప్తి..అవిశ్వాసంపై వైఎస్ఆర్సిపి అనుమానం..భారీ భద్రత నడుమ అవిశ్వాస నిర్వహించాలని కలెక్టర్ కు లేఖ కూటమి నేతల దౌర్జన్యంప్రత్యేక విమానంలో కేరళ వెళ్ళిన వీఎంఆర్డివో చైర్మెన్ ప్రణవ్ గోపాల్, సీతంరాజు సుధాకర్..వైస్సార్‌సీపీ కార్పొరేటర్లు బస చేసిన హోటల్ వద్ద హంగామాప్రత్యేక విమానంలో విశాఖ రావాలని బెదిరింపుఅవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయాలని గుండాయిజంఅవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయకపోతే మీ భర్త ఉద్యోగం తీయస్తామని వార్నింగ్.టీడీపీ నేతల బెదిరింపుకు తలోగ్గని కార్పొరేటర్ శశికళ.టీడీపీ నేతలతో ప్రత్యేక విమానంలో రావడానికి ఒప్పుకొని కార్పోరేటర్ శశికళటీడీపీ నేతలు దౌర్జన్యం పై మండిపడ్డ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ శశికళమీరెవరు నన్ను రమ్మండానికి అంటూ టీడీపీ నేతలపై ఎదురు తిరిగిన కార్పొరేటర్ శశికళ.అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పోలీసులతో హోటల్ కి వచ్చి దౌర్జన్యం చేసే హక్కు మీకు ఎవరిచ్చారన్న శశి కళదౌర్జన్యాన్ని ప్రశ్నించడంతో తోక ముడిచిన టీడీపీ నేతలుకేరళ పోలీసులతో హోటల్ వద్దకు చేరుకున్న టీడీపీ నేతలుతమ కార్పొరేటర్లను తీసుకువెళ్లేందుకు వచ్చామని కేరళ పోలీసులకు చెప్పిన టీడీపీ నేతలుకార్పొరేటర్ శశికళ ఎదురు తిరగడంతో కేరళ పోలీసులతో కలిపి పలాయానం చిత్తగించిన టీడీపీ నేతలు

Delhi Mustafabad Building Collapse Rescue Live Updates2
ఢిల్లీలో కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద పలువురు

న్యూఢిల్లీ, సాక్షి: రాజధాని రీజియన్‌లో గత అర్ధరాత్రి ఘోరం జరిగింది. నాలుగు అంతస్తుల భవనం ఒకటి కుప్పకూలడంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని భావిస్తున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.ANI న్యూస్‌ ఏజెన్సీ కథనం ప్రకారం.. అర్ధరాత్రి 3గం. ప్రాంతంలో ముస్తాఫాబాద్‌లో ఓ భవనం కుప్పకూలినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎన్డీఆర్‌ఎఫ్‌​ సాయంతో రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. ఉదయం కల్లా నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. మరో డజను మందికి పైనే శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. అయితే.. ఆ భవనంలో ఒక పోర్షన్‌లో ఒకే కుటుంబానికి చెందిన పది మంది నివాసం ఉంటున్నారని, అందులో ఆరుగురు చిన్నపిల్లలే ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. వాళ్ల జాడ ఇంకా తెలియరాలేదు. ఇదిలా ఉంటే.. ఢిల్లీలో శుక్రవారం ఒక్కసారిగా వాతావరణం మారింది. ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. ఈ ప్రభావంతోనే భవనం కూలి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతవారం కూడా ఢిల్లీలో ఇలాంటి ఘటనే జరిగింది. భారీ వర్షం, ఈదురు గాలుల ధాటికి నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలి ఓ వ్యక్తి మరణించగా..ఇద్దరు గాయపడ్డారు.#WATCH | Delhi: Mustafabad building collapse caught on camera. As per Delhi Police, "Among the 10 people who were taken out, 4 succumbed. Rescue operations still underway"(Source - local resident) https://t.co/lXyDvOpZ3q pic.twitter.com/NlknYWODRR— ANI (@ANI) April 19, 2025#WATCH | Delhi: 4 people died after a building collapsed in the Mustafabad area; rescue and search operation is underway 8-10 people are still feared trapped, said Sandeep Lamba, Additional DCP, North East District pic.twitter.com/qFGALhkPv3— ANI (@ANI) April 19, 2025

Dear Uma Movie Review And Rating Telugu3
'డియర్ ఉమ' రివ్యూ.. మంచి ప్రయత్నం

తెలుగు చిత్రసీమలో తెలుగమ్మాయిలు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. హీరోయిన్‌గా మెరిసేందుకు చాలా కష్టపడుతుంటారు. అలాంటిది సుమయ రెడ్డి అయితే తన తొలి ప్రయత్నంలోనే హీరోయిన్‌గా, రచయితగా, నిర్మాతగా భిన్న పాత్రల్ని పోషించింది. 'డియర్ ఉమ' అంటూ ఏప్రిల్ 18న వచ్చిన ఈ చిత్రం రొమాంటిక్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కించారు. పృథ్వీ అంబ‌ర్‌, సుమ‌య రెడ్డి( Sumaya Reddy) హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రాన్ని సాయిరాజేష్ మ‌హాదేవ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మరి ఈ సుమయ రెడ్డి తొలి ప్రయత్నం ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.కథేంటి..?గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగిన ఉమ (సుమయ రెడ్డి) వైద్య విద్యను పూర్తి చేసి సొంతంగా ఓ హాస్పిట‌ల్ నిర్మించి తండ్రి క‌ల‌ను నెర‌వేర్చాల‌ని అనుకుంటుంది. మరోవైపు దేవ్‌కు(పృథ్వీ అంబ‌ర్‌) మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. భవిష్యత్‌లో రాక్‌స్టార్ కావాల‌ని ఎన్నో క‌ల‌లు కంటాడు. కానీ, చదువులో చాలా వెనుకపడిపోతాడు. తన కాలేజీ సమయంలో దేవ్‌ ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే, మ్యూజిక్ కార‌ణంగానే దేవ్‌కు ఆ అమ్మాయి బ్రేక‌ప్ చెప్పి వెళ్లిపోతుంది. ప్రేమలో విఫలమైన దేవ్ రాక్ స్టార్ అవ్వాలనే ప్రయత్నంలో అంతగా సక్సెస్ కాలేకపోతాడు. చిన్నా చితకా అవకాశల కోసం గడపగడపకూ తిరుగుతుంటాడు. అలాంటి దేవ్‌కి ఓ సారి ఉమ డైరీ దొరుకుతుంది. తనకు గాయమై హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు తన జీవితం మారిందని.. అప్పటి నుంచే ఉమ జీవితం ఆగిపోయిందని తెలుసుకుంటాడు. అసలు ఉమకి ఏం జరిగింది..? ఉమ నేపథ్యం ఏంటి? ఉమ ఎక్కడి నుంచి వచ్చింది? ఏం చేస్తుండేది? అనే ప్రశ్నలతో సతమతం అవుతుంటాడు దేవ్. ఇక ఉమ కోసం దేవ్ చేసిన పోరాటం ఏంటి? ఉమతో దేవ్ ప్రేమ ప్రయాణం ఎక్కడి వరకు దారి తీస్తుంది? ఈ కథలో దేవ్ అన్న సూర్య (కమల్ కామరాజ్) పాత్ర ఏంటి..? అన్నది కథ.వైద్యం పేరుతో కార్పొరేట్ హాస్పిట‌ల్స్ చేసే మోసాల‌కు ల‌వ్‌స్టోరీని జోడించి డియ‌ర్ ఉమ క‌థ‌ను సుమ‌య రెడ్డి రాసుకుంది. ఈ కథను సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. వైద్య రంగంలోని లోపాలను ఎత్తిచూపుతూ తెరకెక్కించాడు. ప్రస్తుత కాలంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను గుర్తుచేస్తూ, సామాన్య ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా కథను నడిపించారు. ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.ఎలా ఉందంటే..?రధన్ సంగీతం సినిమా మూడ్‌కు తగ్గట్టుగా ఉంది, అయితే, కొన్ని చోట్ల మరింత మెరుగ్గా ఉండాల్సింది. రాజ్ తోట కెమెరా వర్క్ సహజంగా ఉన్నప్పటికీ, కొన్ని ప్రత్యేకమైన షాట్స్ మిస్ అయినట్టు అనిపించవచ్చు. స్క్రీన్ ప్లే సినిమాకు ఒక బలంగా నిలిచింది, ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ ట్విస్ట్‌లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. అయితే, క్లైమాక్స్‌లోని ఎమోషనల్ సన్నివేశాలు కొందరికి అతిగా అనిపించవచ్చు. పతాక సన్నివేశంలోని పాట సినిమా సందేశాన్ని స్పష్టంగా చెప్పినప్పటికీ, కథలో మరింత సహజంగా కలిసిపోయి ఉంటే బాగుండేది. మొత్తానికి, "డియర్ ఉమర్" ఒక మంచి ప్రయత్నం, కానీ కొన్ని అంశాలలో మరింత శ్రద్ధ పెడితే ఇది ఒక గొప్ప చిత్రంగా నిలిచేది. తొలి చిత్రమే అయినా సుమ చిత్ర ఆర్ట్స్, నిర్మాత సుమయ రెడ్డి గొప్ప కథను అందించడంలో సక్సెస్ అయ్యారు.డియర్ ఉమ చిత్రానికి సుమయ రెడ్డి ఆల్ రౌండర్ అని చెప్పుకోవచ్చు. మంచి కథను ఇవ్వడమే కాకుండా.. ఈ కథను అనుకున్నట్టుగా తీయడంలో ఖర్చు పెట్టిన నిర్మాతగానూ సుమయ రెడ్డి సక్సెస్ అయింది. సుమయ రెడ్డిలోని రచయిత, నిర్మాతకు వంద మార్కులు వేసుకోవచ్చు. ఇక నటిగా ఇంకాస్త మెరుగు పర్చుకోవాల్సి ఉంటుందేమో. తెరపై సుమయ రెడ్డి అందంగా కనిపించారు. హీరోగా పృథ్వీ అంబర్ యాక్షన్, ఎమోషన్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌ను పలికించాడు. కమల్ కామరాజ్ పాత్ర సర్ ప్రైజింగ్‌గా ఉంటుంది. అజయ్ ఘోష్ పాత్ర రొటీన్ అనిపిస్తుంది. ఫైమా, లోబో, సప్తగిరి, భద్రం పోషించిన పాత్రలు అక్కడక్కడా నవ్విస్తాయి. పెద్ద‌గా అంచ‌నాలు పెట్టుకోకుండా డియర్‌ ఉమను చూస్తే తప్పకుండా మెప్పిస్తుంది.

IPL: Rajat Patidar Breaks Sachin Tendulkar Record Scripts History4
సచిన్‌ రికార్డు బద్దలు కొట్టిన పాటిదార్‌.. ఐపీఎల్‌లో భారత తొలి బ్యాటర్‌గా..

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB) జట్టు కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ (Rajat Patidar) టీమిండియా దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండుల్కర్‌ రికార్డు బద్దలు కొట్టాడు. ఐపీఎల్‌లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్ట్రైక్‌రేటుతో వెయ్యి పరుగుల మైలురాయిని అందుకున్న భారత తొలి క్రికెటర్‌గా నిలిచాడు. వర్షం వల్ల 14 ఓవర్ల ఆటఐపీఎల్‌-2025 (IPL 2025)లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా పాటిదార్‌ ఈ ఘనత సాధించాడు. బెంగళూరు వేదికగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఈ నేపథ్యంలో పద్నాలుగు ఓవర్లకు మ్యాచ్‌ను కుదించగా.. టాస్‌ గెలిచిన పంజాబ్‌ కింగ్స్‌.. ఆర్సీబీని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు ఫిల్‌ సాల్ట్‌ (4), విరాట్‌ కోహ్లి (1) పూర్తిగా విఫలం కాగా.. రజత్‌ పాటిదార్‌ (18 బంతుల్లో 23) ఫర్వాలేదనిపించాడు.95 పరుగులుఆఖర్లో టిమ్‌ డేవిడ్‌ మెరుపు ఇన్నింగ్స్‌ (26 బంతుల్లో 50 నాటౌట్‌) ఆడటంతో ఆర్సీబీ తొమ్మిది వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. పంజాబ్‌ బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌, మార్కో యాన్సెన్‌, యజువేంద్ర చహల్‌, హర్‌‍ప్రీత్‌బ్రార్‌ రెండేసి వికెట్లు కూల్చగా.. జేవియర్‌ బార్ట్‌లెట్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నాడు.పంజాబ్‌ ఫటాఫట్‌ఇక పంజాబ్‌ 12.1 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి ఆర్సీబీ విధించిన లక్ష్యాన్ని ఛేదించింది. నేహాల్‌ వధేరా (19 బంతుల్లో 33) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చాడు.ఇదిలా ఉంటే.. పంజాబ్‌తో మ్యాచ్‌లో 23 పరుగులు చేసిన ఆర్సీబీ కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌.. ఐపీఎల్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. కేవలం 30 ఇన్నింగ్స్‌లోనే పాటిదార్‌ ఈ మైలురాయిని చేరుకున్నాడు.సచిన్‌ రికార్డు బ్రేక్‌ఈ క్రమంలో సచిన్‌ టెండుల్కర్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ పేరిట ఉన్న రికార్డును పాటిదార్‌ బద్దలు కొట్టాడు. వీరిద్దరు 31 ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగుల మార్కును అందుకున్నారు. ఇక.. గుజరాత్‌ టైటాన్స్‌ ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ కేవలం 25 ఇన్నింగ్స్‌లోనే ఈ మైలురాయిని చేరుకుని.. ఐపీఎల్‌లో భారత్‌ తరఫున అత్యంత వేగంగా వెయ్యి పరుగులు సాధించిన బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.ఐపీఎల్‌లో భారత తొలి బ్యాటర్‌గా రికార్డుఅయితే, రజత్‌ ఇన్నింగ్స్‌ పరంగా సుదర్శన్‌ కంటే వెనుకబడి ఉన్నా... సగటు, స్ట్రైక్‌రేటు పరంగా మెరుగ్గా ఉన్నాడు. తద్వారా ఐపీఎల్‌లో 35కు పైగా సగటుతో 150కి పైగా స్ట్రైక్‌రేటుతో 1000 పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా పాటిదార్‌ చరిత్రకెక్కాడు. టీ20 ఫార్మాట్లో అతడి నిలకడైన ఆటకు ఇది నిదర్శనం.ఐపీఎల్‌-2025: బెంగళూరు వర్సెస్‌ పంజాబ్‌👉వర్షం వల్ల మ్యాచ్‌ 14 ఓవర్లకు కుదింపు👉వేదిక: ఎం.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు👉టాస్‌: పంజాబ్‌.. తొలుత బౌలింగ్‌👉బెంగళూరు స్కోరు: 95/9 (14)👉పంజాబ్‌ స్కోరు: 98/5 (12.1)👉ఫలితం: ఐదు వికెట్ల తేడాతో బెంగళూరుపై పంజాబ్‌ గెలుపు👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: టిమ్‌ డేవిడ్‌ (26 బంతుల్లో 50 నాటౌట్‌). .@PunjabKingsIPL's red is shining bright in Bengaluru ❤️They continue their winning streak with an all-round show over #RCB 👏Scorecard ▶ https://t.co/7fIn60rqKZ #TATAIPL | #RCBvPBKS pic.twitter.com/NOASW2XRMD— IndianPremierLeague (@IPL) April 18, 2025చదవండి: RCB VS PBKS: చరిత్ర సృష్టించిన అర్షదీప్‌ సింగ్‌

Boat carrying 500 capsizes in Congo river Full Details5
వంట కోసం బోటులో పొయ్యి వెలిగించిన మహిళ

మధ్య ఆఫ్రికా దేశం కాంగో(Democratic Republic of the Congo)లో ఘోరం జరిగింది. ప్రయాణికులతో నదిలో వెళ్తున్న ఓ భారీ బోటు అగ్నిప్రమాదానికి గురి కాగా.. 150 మందికి పైగా మృతి చెందారు. మరో వంద మందికి పైగా ఆచూకీ తెలియాల్సి ఉంది. ప్రమాద సమయంలో బోటులో 500 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాంగో నార్త్‌వెస్ట్‌ రీజియన్‌లోని మటాన్‌కుము పోర్టు నుంచి బోలోంబా వైపు.. మంగళవారం వందల మందితో కూడిన భారీ చెక్కబోటు ‘హెచ్‌బీ కాంగోలో’ బయల్దేరింది. అయితే కాంగో నది మధ్యలోకి వెళ్లగానే హఠాత్తుగా బోటులో పేలుడు సంభవించి మంటలు అంటుకున్నాయి. ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రయాణికుల్లో చాలామంది నీళ్లలోకి దూకేశారు. ఈత కొందరు కొందరు నీట మునిగి చనిపోగా.. మరికొందరు అగ్నికి ఆహుతి అయ్యారు. చెల్లాచెదురైన మరో వంద మందికి పైగా జాడ తెలియాల్సి ఉంది. తీవ్రంగా గాయపడిన వాళ్లకు ప్రస్తుతం చికిత్స అందుతోంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులకు విస్మయం కలిగించే విషయం ఒకటి తెలిసిందే. ప్రయాణికుల్లో ఓ మహిళ వంట చేసేందుకు ప్రయత్నించగా.. మంటలు చెలరేగినట్లు నిర్ధారణ అయ్యింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. సదరు మహిళ గ్యాస్‌ స్టౌవ్‌ అంటించగానే.. పేలుడు సంభవించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆమె అగ్నికి ఆహుతై అక్కడికక్కడే మరణించింది. ఇక.. కాంగోలో బోటు ప్రమాదాలు షరా మాములుగా మారిపోయాయి. At Least 148 Dead After Overcrowded Boat Capsizes In Congo@nitingokhale @SuryaGangadha13 @amitabhprevi @s_jkr #Congo #Africa https://t.co/em5A5kUqQZ— StratNewsGlobal (@StratNewsGlobal) April 19, 2025పాతవి, పాడైపోయిన పడవలను ప్రయాణాలకు వినియోగించడం, సామర్థ్యానికి మించిన ప్రయాణికులతో కూడిన పడవ ప్రయాణాలే అందుకు కారణాలు. దీనికి తోడు ప్రయాణికుల భద్రత గురించి ఏమాత్రం పట్టింపు లేకుండా బోటు నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. కిందటి ఏడాదిలో కాంగో వ్యాప్తంగా జరిగిన వేర్వేరు బోటు ప్రమాదాల్లో 400 మందికి పైనే మరణించారు.

TDP Supporters Protest Against Bandaru Sravani6
టీడీపీలో పొలిటికల్‌ వార్‌.. ఎమ్మెల్యే కారణంగా కీలక నేతల రాజీనామా!

సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి ప్రభుత్వం పాలనలో పలుచోట్ల టీడీపీ కార్యకర్తలు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరు, వారి ప్రవర్తన కారణంగా.. టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఎమ్మెల్యే బండారు శ్రావణికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే వైఖరికి నిరసనగా టీడీపీ ఎంపీటీసీ సైతం రాజీనామా చేశారు.వివరాల ప్రకారం.. శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణిపై టీడీపీ కార్యకర్తల తిరుగుబాటు చేశారు. ఎమ్మెల్యే శ్రావణి కార్యకర్తల కంటే డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్నారని పచ్చ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనంతపురం వచ్చిన మంత్రి టీజీ భరత్‌కు స్థానిక టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం, ఎమ్మెల్యే బండారు శ్రావణికి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేశారు.దీంతో, అక్కడే ఉన్న పోలీసులు.. టీడీపీ కార్యకర్తలను ఈడ్చి పడేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. ఎమ్మెల్యే శ్రావణి వైఖరికి నిరసనగా వెస్ట్ నరసాపురం టీడీపీ ఎంపీటీసీ అంజినమ్మ రాజీనామా చేశారు. ఇదే సమయంలో 30 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న తమకు కనీస గుర్తింపు ఇవ్వలేదని టీడీపీ నేతలు వాసాపురం బాబు, కనంపల్లి ప్రసాద్ ధర్నాకు దిగారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. టిడిపి ఎమ్మెల్యే బండారు శ్రావణి కు సొంత కార్యకర్త నుంచి నిరసన సెగ. పార్టీ కోసం చాలా కష్టపడ్డాను కానీ గుర్తింపు ఇవ్వడం లేదు.- టిడిపి కార్యకర్త pic.twitter.com/ZibwkRqIZv— రాజా రెడ్డి YSRCP (@rajareddzysrcp) April 18, 2025

Housing Price Rises 9pc In Top Cities In FY25 PropEquity7
హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు ఎంతలా పెరిగాయంటే..

సాక్షి, సిటీబ్యూరో: దేశంలో ప్రాపర్టీ ధరలు భారీగా పెరిగాయి. దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో గతేడాది కొత్త ప్రాజెక్టుల ధరలు సగటున 9 శాతం మేర పెరిగినట్లు డేటా అనలిటిక్స్‌ సంస్థ ప్రాప్‌ ఈక్విటీ తెలిపింది. 2024–25లో ప్రాపర్టీ ధరలు సగటున 9 శాతం పెరిగి చ.అ.కు రూ.13,197కు చేరినట్లు పేర్కొంది. ఏడాది కాలంలో కోల్‌కతాలో ఇళ్ల ధరలు అత్యధికంగా 29 శాతం మేర పెరిగాయి. ఆ తర్వాత థానేలో 17 శాతం, బెంగళూరులో 15 శాతం, పుణెలో 10 శాతం, ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో 5 శాతం, హైదరాబాద్‌లో 5 శాతం, చెన్నైలో 4 శాతంగా ఉన్నాయి.ముంబై, నవీ ముంబైలో ఇళ్ల ధరలు 3 శాతం తగ్గాయి. కాగా రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఇళ్ల ధరలు 18 శాతం పెరిగాయి. అత్యధికంగా బెంగళూరులో 44 శాతం వృద్ధి నమోదయ్యింది. కోల్‌కత్తాలో 29 శాతం, చెన్నైలో 25 శాతం, థానేలో 23 శాతం, ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో 20 శాతం, పుణేలో 18 శాతం, నవీ ముంబైలో 13 శాతం, ముంబైలో 11 శాతం, హైదరాబాద్‌లో 5 శాతం పెరుగుదల నమోదు చేసింది. మరోవైపు ఈ ఏడాది జనవరి–మార్చిలో గృహాల అమ్మకాలు 23 శాతం తగ్గి, 1,05,791 యూనిట్లకు చేరుకోగా.. సరఫరా 34 శాతం తగ్గి 80,774లకు చేరుకుంది.ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్‌లలో ధరలను పరిశీలిస్తే.. బెంగళూరులో గతేడాది చ.అ. సగటున ధర రూ.8,577 ఉండగా.. ప్రస్తుతం అది రూ.9,852కు పెరిగింది. కోల్‌కత్తాలో చ.అ. ధర రూ.6,201 నుంచి రూ.8,009కి పెరిగింది. చెన్నైలో రేట్లు చ.అ.కు రూ.7,645 నుంచి రూ.7,989కు పెరిగాయి. హైదరాబాద్‌లో చ.అ.కు రూ.7,890 నుంచి రూ.8,306కు పెరిగాయి. పుణెలో చ.అ.కు రూ.9,877 నుంచి రూ.10,832కు పెరిగాయి. థానేలో సగటు చ.అ. ధర రూ.11,030 నుంచి రూ.12,880కు పెరిగాయి. ఢిల్లీలో చ.అ.కు రూ.13,396 నుంచి రూ.14,020కు పెరిగాయి.

Telugu Students Pass In JEE Mains 2025 Results8
జేఈఈ మెయిన్‌లో తెలుగు తేజాలు

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్‌)లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 24 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌ సాధించగా వారిలో నలుగురు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉన్నారు. తెలంగాణకు చెందిన హర్షి ఎ. గుప్తా, వంగల అజయ్‌రెడ్డి, బనిబ్రత మజీతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాయి మనోజ్ఞ గుత్తికొండ 100 పర్సంటైల్‌ సాధించారు. అలాగే టాప్‌–100 ర్యాంకుల్లో 15 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. 99 పర్సంటైల్‌లో వంద మందికిపైగా చోటు సాధించారు. జేఈఈ మెయిన్‌ ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) శుక్రవారం అర్ధరాత్రి విడుదల చేసింది. రాజస్తాన్‌కు చెందిన ఎండీ అనాస్, ఆయుష్‌ సింగల్‌ తొలి రెండు ర్యాంకులు సాధించారు. జేఈఈ మొదటి విడత పరీక్ష జనవరిలో జరిగింది. రెండో సెషన్‌ను ఏప్రిల్‌ 2, 3, 4, 7, 8 తేదీల్లో నిర్వహించారు. దేశవ్యాప్తంగా 10,61,849 మంది ఈ పరీక్షకు రిజిస్టర్‌ చేసుకున్నారు. వారిలో 9,92,350 మంది పరీక్ష రాశారు. తెలుగు రాష్ట్రాల నుంచి 2 లక్షల మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. జేఈఈ మొదటి, రెండో విడత పరీక్ష ఫలితాలను ఆధారంగా చేసుకొని ర్యాంకులు ప్రకటించారు. వాటి ల్లో 2.50 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేశారు. ఈ పరీక్షకు ఈ నెల 23 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 2న పరీక్ష ఉంటుంది.

Kejriwal Tuns into Pushpa Raj Mode Dance With Wife At Daughter Wedding Event9
పుష్ప పాటకు సతీమణితో కేజ్రీవాల్‌ స్టెప్పులు

న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇంట శుభకార్యం జరిగింది. కేజ్రీవాల్‌ కూతురు హర్షిత తన ఐఐటీయన్‌ స్నేహితుడిని వివాహమాడారు. కుటుంబ సభ్యులు, కొద్ది మంది రాజకీయ సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. అయితే ఈ వేడుకలో కేజ్రీవాల్‌ చేసిన సందడి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఢిల్లీలోని షాంగ్రీ లా ఎరోస్‌ హోటల్‌లో గురువారం కేజ్రీవాల్‌ కూతురి నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, ఆప్‌ నేత మనీశ్‌ సిసోడియాలు హాజరయ్యారు. ఈ వేడుకలో పుష్ప 2 చిత్రంలోని ‘అంగారో కా అంబర్‌ సె’ పాటకు సతీమణి సునీతతో కలిసి కేజ్రీవాల్‌ హుషారుగా స్టెప్పులేశారు. #arvindkejriwal #dancevideo #delhiaap pic.twitter.com/1hObFExoGU— Khushbu Goyal (@kgoyal466) April 18, 2025జనాల గోల మధ్య కేజ్రీవాల్‌ వేసిన స్టెప్పులు ఇప్పుడు నెట్టింట వైరల్‌ అయ్యాయి. సుకుమార్‌ డైరెక్షన్‌లో పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్‌ దేశవ్యాప్తంగా ఎంతటి ఆదరణ దక్కించుకున్నారో తెలియంది కాదు. ఈ చిత్రంలోని పాటలు, డైలాగులు, ఆఖరికి పుష్ప మేనరిజం కూడా జనాలకు బాగా ఎక్కేసింది. మరోవైపు.. వివాహ కార్యక్రమానికి హాజరైన పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ కూడా పంజాబీ స్టైల్లో చిందులేసి ఆకట్టుకున్నారు. Punjab CM Bhagwant Mann performing at the engagement ceremony of Kejriwal's daughter in Delhi.#Bhagwantmann #ArvindKejriwal pic.twitter.com/Vy9PqA4Teu— Raajeev Chopra (@Raajeev_Chopra) April 18, 2025పీటీఐ కథనం ప్రకారం.. అరవింద్‌ కేజ్రీవాల్‌ కూతురు హర్షిత ఢిల్లీ ఐఐటీలో చదివారు. కాలేజీ రోజుల్లో స్నేహితుడైన సంభవ్‌ జైన్‌ ఇష్టపడి వివాహమాడారు. ఇంతకు ముందు ఈ ఇద్దరూ కలిసి బసిల్‌ హెల్త్‌ అనే స్టార్టప్‌ను కూడా నడిపిస్తున్నారు. శుక్రవారం కుటుంబ సభ్యుల సమక్షంలో కపుర్తలా హౌజ్‌లో వీళ్ల వివాహం జరిగింది. ఈ వేడుకకు కొందరు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. ఏప్రిల్‌ 20వ తేదీన రిసెప్షన్‌ కార్యక్రమం నిర్వహించనున్నారు.

Mother of four Youth Love with Daughter father-in-law In UP10
వావి వరసలు మరచి.. కూతురి మామతో ప్రేమాయణం..

ఈరోజుల్లో బంధాలకు విలువ లేకుండా పోతోంది. వావివరుసలు మరిచి విపరీత పోకడలకు పోతున్నారు కొందరు. తనకు కాబోయే అల్లుడితో అత్త జంప్‌ అయిన ఘటన మరువక ముందే.. అలాంటి దరిద్రపు ఘటనే యూపీ బదౌన్‌లో వెలుగుచూసింది. ఓ మహిళ.. తన కూతురి మామతోనే సంబంధం పెట్టుకుంది. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన వారిద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం.. డేటాగంజ్ కొత్వాలి ప్రాంతానికి చెందిన సునీల్, మమత(43)కు 2002లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సునీల్‌ ట్రక్క్‌ నడుపుతూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా, తన పెద్ద కుమార్తెను బదౌన్ సదర్ కొత్వాలి ప్రాంతానికి చెందిన శైలేంద్ర కుమారుడికి ఇచ్చి 2022లో వివాహం చేశాడు. అయితే, తన కూతురికి వివాహం చేసిన అనంతరం కూతురు మామ అయిన శైలేంద్రతో మమత ప్రేమలో పడింది. దాదాపుగా రెండేళ్ల నుంచి వీరి మధ్య సంబంధం నడిచింది. సునీల్‌ ట్రక్క్‌ నడుపుతున్న కారణంగా నెలలో కొద్దిరోజులు మాత్రమే ఇంట్లో ఉండేవాడు. సునీల్‌ లేని సమయంలో శైలేంద్ర.. మమత ఇంటికి వచ్చేవాడు. ఇద్దరూ వరుసకు అన్నాచెల్లెలు కావడంతో ఎవరికీ అనుమానం రాలేదు. ఈ క్రమంలో ప్రేమాయణం నడిపిన మమత, శైలేంద్ర.. తాజాగా ఇంటి నుంచి పారిపోయారు. దీంతో, వీరి సంబంధం గురించి బయటి ప్రపంచానికి తెలిపింది.భర్త ఆవేదన..ఈ నేపథ్యంలో బాధితుడు, భర్త సునీల్.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా సునీల్‌ మాట్లాడుతూ.. నేను వేరే ఊరిలో ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాను.. అయినప్పటికి నా భార్యకు సమయానికి డబ్బు పంపిస్తున్నాను. కుటుంబ ఖర్చులకు డబ్బు ఇచ్చేవాడిని. నా భార్య నేను లేనప్పుడు.. శైలేంద్రకు ఫోన్‌ చేసి మాట్లాడింది. అతడిని ఇంటికి రావాలని చెప్పింది. ఇప్పుడు అతనితో పారిపోయింది. ఆమె ఇంట్లో ఉన్న నగలు, డబ్బు అంతా తీసుకుని పారిపోయింది అని ఆవేదన వ్యక్తం చేశారు.బిడ్డల ముందే..మరోవైపు.. మమత కుమారుడు మాట్లాడుతూ.. మా తండ్రి ఇంట్లో లేనప్పుడు మామ శైలేంద్ర మా ఇంటికి వచ్చేవారు. మా తండ్రి ఇంట్లో లేనప్పుడు అమ్మ ప్రతి మూడు రోజులకు ఒకసారి ఆయనకు ఫోన్ చేసేది. మామ.. మా ఇంటికి వచ్చిన ప్రతీసారి మమ్మల్ని వేరే గదికి పంపించారు. ఆమె తన మామతో కలిసి టెంపోలో పారిపోయిందని చెప్పారు. అలాగే, ఈ ఘటనపై స్థానికులు స్పందిస్తూ.. సునీల్ వేరే చోట్ల ట్రక్ డ్రైవర్‌గా పని చేస్తుండే వాడు. నెలలో రెండు మూడుసార్లు మాత్రమే ఇంటికి వచ్చేవాడు. భర్త దూరంగా ఉండటంతో మమత.. శైలేంద్రను ఆహ్వానించేది. అతను రాత్రి 12 గంటలకు ఇంటికి వచ్చి తెల్లవారుజామున వెళ్లిపోయేవాడని చెప్పారు. అతనే మమతను తీసుకెళ్లాడని చెబుతున్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement