Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Kutami Atrocities No confidence motion against Vizag Mayor Live Updates1
GVMC: అడ్డదారిలో అవిశ్వాసం నెగ్గిన కూటమి

విశాఖపట్నం, సాక్షి: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి పాలనలో ప్రజాస్వామ్యం మళ్లీ మళ్లీ ఖూనీ అవుతోంది. బలం లేకున్నా విశాఖ మేయర్‌పై అవిశ్వాసం పెట్టి.. కుట్రలు, ప్రలోభాల పర్వాలతో అడ్డదారిలో నెగ్గింది. ఏకంగా 30 మంది కార్పొరేటర్లను కొనుగోలు చేసిన టీడీపీ.. యాదవ సామాజిక వర్గానికి చెందిన గొలగాని హరి వెంకటకుమారిను మేయర్‌ పీఠం నుంచి దించేసింది. అధికార వ్యామోహంలో ఉన్న కూటమి ప్రభుత్వం.. కేవలం పది నెలల కాలం ఉన్న ఓ మేయర్ పదవి కోసం కోట్లాది రూపాయలు గుమ్మరించడం గమనార్హం. ఈ క్రమంలో దిగజారుడు రాజకీయాలు చేసింది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను తమవైపు తిప్పుకునేందుకు చివరి నిమిషం దాకా ప్రలోభాల పర్వం కొనసాగిస్తూ వచ్చింది. కార్పొరేటర్లను ప్రత్యేక విమానాల్లో విదేశీ పర్యటనలకు పంపడం, స్టార్‌ హోటల్స్‌లో విడిది ఏర్పాటు చేయడం లాంటి చేష్టలకు పాల్పడింది. కేరళకు వెళ్లి మరీ వైస్సార్‌సీపీ కార్పొరేటర్లను బెదిరించి.. బతిమాలి.. డబ్బు ఆశ చూపించి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కొందరు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం. అవిశ్వాసం నెగ్గాలంటే 74 ఓట్లు అవసరం. ఒకవైపు డబ్బు ఎర, మరోవైపు బెదిరింపులు, ఇంకోవైపు కిడ్నాపులు.. ఇలా టీడీపీ నేతలు ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారు. అయినా సరే బొటాబొటిగా 74 మంది సభ్యులతోనే విశాఖ మేయర్‌పై అవిశ్వాసం నెగ్గింది టీడీపీ. ఇక అవిశ్వాస ఓటింగ్‌కు దూరంగా ఉంటూనే.. భారీ భద్రత నడుమ ఓటింగ్‌ నిర్వహించాలని, ఓటింగ్‌ ప్రక్రియను వీడియో రికార్డింగ్‌ చేయించాలని వైఎస్సార్‌సీపీ చేసిన విజ్ఞప్తిని అధికార యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. కూటమి నేతలను అడ్డుకోని పోలీసులుఅవిశ్వాసం వేళ.. కూటమి కార్పొరేటర్లు, ఎక్స్ ఆఫీషియో సభ్యులు కాకుండా కొందరు కూటమి నేతలను పోలీసులు జీవీఎంసీ కార్యాలయంలోకి లోపలికి అనుమతించారు. బస్సులో ఉన్న కూటమి నాయకులను వారి అనుచరులను నిలువరించకుండా చూస్తూ ఉండిపోయారు. ఓటింగ్‌కు వెళ్లిన సభ్యులతో కలిసి జీవీఎంసీ దర్జాగా కొందరు కూటమి నేతలు వెళ్తున్న దృశ్యాలు మీడియాకు చేరడం గమనార్హం. నీచమైన రాజకీయాలు వద్దని చెప్పాప్రత్యేక విమానంలో కేరళ వచ్చి కూటమి నేతలు నన్ను బెదిరించారు. కూటమికి అనుకూలంగా ఓటు వేయమన్నారు. నేను పార్టీ మారేది లేదని చెప్పాను. మొదటినుంచి నేను వైఎస్సార్‌సీపీలో ఉన్నాను. రాజకీయమంటే వ్యాపారం కాదు. డబ్బులు కోసం నీతిమాలిన రాజకీయాలు చేయను. నీచమైన రాజకీయాలను చెయ్యొద్దని చెప్పాను. వైయస్ జగన్ వలనే నేను కార్పోరేటర్ అయ్యాను అని వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ శశికళ ఈ ఉదయం ఓ వీడియో విడుదల చేశారు కూడా. ఓటింగ్‌కు ముందు వాస్తవ బలాబలాలువైఎస్సార్సీపీ 58 టీడీపీ 29జనసేన 3బీజేపీ 1సీపీఐ 1సీపీఎం 1ఇండిపెండెన్స్ 4.ఖాళీలు 1.జీవీఎంసీలో 98 మంది కార్పొరేటర్లుజీవీఎంసీలో 14 మంది ఎక్స్ ఆఫీషియో సభ్యులుటీడీపీకి 11 మంది సభ్యులు ఉన్నారు.. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఒక ఎమ్మెల్సీ..వైఎస్సార్సీపీకి ముగ్గురు ఎక్స్ అఫీషియ సభ్యులు.ఎంపీ గొల్ల బాబురావు, ఇద్దరు, ఎమ్మెల్సీలు పండుల రవీంద్రబాబు, కుంభ రవిబాబు..ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం జీవీఎంసీ సభ్యుల సంఖ్య బలం 97+14= 111అవిశ్వాసం నెగ్గేందుకు 2/3 మెజారిటీ అంటే 74 మంది సభ్యులు అవసరం..ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి వైఎస్సార్‌సీపీ మొత్తం బలం 61ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి కూటమి మొత్తం బలం 48ఎన్నికకు దూరంగా ఇద్దరు సీపీఎం, సీపీఐ సభ్యులు.

Mithun Chakraborty Request Centre to Impose President Rule In West Bengal2
సైన్యాన్ని దింపండి.. రాష్ట్రపతి పాలన పెట్టండి

కోల్‌కతా: సీనియర్‌ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి(Mithun Chakraborty) పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బెంగాల్‌లో శాంతి భద్రతలు ఘోరంగా దెబ్బ తిన్నాయని, ప్రభుత్వం విఫలమైంది కాబట్టి రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన(President Rule) విధించాలని కేంద్రానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశా. ఇప్పటికీ కేంద్ర హోం శాఖను అదే కోరుతున్నా. కనీసం ఇప్పుడైనా స్పందించి సైన్యాన్ని దించండి. అప్పుడు ఇక్కడ ఎన్నికలు సజావుగా జరుగుతాయి’’ అని అన్నారాయన. తాజాగా వక్ఫ్‌ చట్టాన్ని(Waqf Bill) వ్యతిరేకిస్తూ ముర్షిదాబాద్‌లో జరిగిన అల్లర్లపై స్పందించిన ఆయన.. ఇలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చ ఏడాది మార్చి-ఏప్రిల్‌లో బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. Watch: BJP leader and actor Mithun Chakraborty on the imposition of President's Rule in Bengal says, "I’ve requested many times, and I’m still requesting the Home Minister. At the very least, please deploy the military inside for two months during the elections. If they are… pic.twitter.com/x64pF7j9Mi— IANS (@ians_india) April 19, 2025ఇదిలా ఉంటే.. వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఏప్రిల్‌ 8-12 తేదీల మధ్య షంషేర్‌గంజ్‌, సూటి, ధులియాన్‌, జంగిపూర్‌ ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. ముగ్గురు మరణించగా.. వందల మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఉద్రిక్తతల వేళ భారీగా కేంద్ర బలగాలను మోహరించాల్సి వచ్చింది. మరోవైపు.. సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించొద్దన్న సీఎం మమతా బెనర్జీ విజ్ఞప్తిని ఆ రాష్ట్ర గవర్నర్‌ సీవీ ఆనంద బోస్‌ పట్టించుకోలేదు. మాల్దా క్యాంప్‌లలో ఉన్న బాధిత కుటుంబాలను కలిసి ఆయన మాట్లాడారు. మరోవైపు.. జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ విజయ రహాట్కర్‌ నేతృత్వంలోని బృందం సైతం రిలీఫ్‌ క్యాంప్‌లలో పర్యటించింది.

YSRCP Ambati Rambabu serious On CI Ponnuru Bhaskar3
కృష్ణవేణిని అరెస్ట్‌ చేసి.. దాచేపల్లి సీఐ వేధింపులు: అంబటి

సాక్షి, గుంటూరు: ఒక మహిళ పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించిన దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందని పాలేటి కృష్ణవేణిని అరెస్ట్‌ చేసి ఆమెపై వ్యభిచారం కేసు పెడతానని బెదిరించడం ఏంటి? అని ప్రశ్నించారు.సోషల్ మీడియా కేసులో అరెస్టై గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్‌లో ఉన్న పాలేటి కృష్ణవేణిని ములాకత్ ద్వారా పరామర్శించిన వైఎస్సార్‌సీపీ నేతలు అంబటి రాంబాబు, దొంతి రెడ్డి వేమారెడ్డి, పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు. అనంతరం, మాజీ అంబటి మీడియాతో మాట్లాడుతూ..‘సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందని పాలేటి కృష్ణవేణిని అరెస్టు చేసి పోలీసులు దాచేపల్లి పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లారు. దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్‌.. సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాదులో కృష్ణవేణిని అరెస్టు చేసి మరుసటి రోజు ఉదయం వరకు స్టేషన్‌లోనే ఉంచి కనీసం ఆహారం కూడా ఇవ్వలేదు.కృష్ణవేణి పట్ల సీఐ భాస్కర్‌ అసభ్యంగా మాట్లాడాడు. తాము చెప్పినట్టు వినకపోతే కృష్ణవేణి భర్తపై గంజాయి కేసు పెడతానని సీఐ బెదిరించాడని ఆమె చెబుతోంది. కృష్ణవేణిపై వ్యభిచారం కేసు పెడతానని సీఐ బెదిరించాడట. కృష్ణవేణి బంధువులు పోలీస్ స్టేషన్‌కు రాకుండా సీఐ స్టేషన్ గేట్లకు బేడీలు వేశాడు. తనను సీఐ భాస్కర్ వేధించారని కృష్ణవేణి మేజిస్ట్రేట్‌కి వాంగ్మూలం ఇచ్చింది. ఒక మహిళ పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించిన దాచేపల్లి సీఐపై వెంటనే చర్యలు తీసుకోవాలి.సీమ రాజా, కిరాక్ ఆర్పీ.. మంత్రి నారా లోకేష్ పెంచుతున్న రోబోలు. మాపైన అసభ్యంగా పోస్టులు పెట్టినందుకు సీమ రాజా, కిరాక్ ఆర్పీపై మేము పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే కేసులు కట్టరు. వాళ్లని లోకేష్‌ పోషిస్తున్నాడు కనుక వాళ్లపై కేసులు కట్టడం లేదు. గతంలో పెద్దిరెడ్డి సుధారాణిని 50 రోజులకు పైగా జైలుకు పంపారు. పార్టీ నాయకుల పేర్లు చెప్పమని సీఐ తనను హింసించాడని కృష్ణవేణి చెప్తోంది. మహిళల జోలికి వస్తే ఒప్పుకోనని చెప్పే చంద్రబాబు ఇప్పుడేం చేస్తాడో చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు.

After PSL IPL Discard David Warner Signs with MLC Seattle Orcas4
డేవిడ్‌ వార్నర్‌కు మరో ఆఫర్‌.. ఈసారి..

ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ (David Warner)మరో టీ20 లీగ్‌లో భాగం కానున్నాడు. అమెరికాకు చెందిన మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ (MLC)లో సీటెల్‌ ఒర్కాస్‌ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని సీటెల్‌ ఫ్రాంఛైజీ అధికారికంగా ప్రకటించింది. ఆస్ట్రేలియా సూపర్‌ స్టార్‌ డేవిడ్‌ వార్నర్‌ తమతో జట్టు కట్టినట్లు తెలిపింది.కాగా ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న ఎన్నో టీ20 లీగ్‌లలో వార్నర్‌ భాగమయ్యాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)తో పాటు బిగ్‌ బాష్‌ లీగ్‌ (ఆస్ట్రేలియా), ది హండ్రెడ్‌ (ఇంగ్లండ్‌), ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20 (UAE), పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లలో వివిధ జట్లకు అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.12956 పరుగులు.. సగం ఐపీఎల్‌లోనేఇక టీ20 ఫార్మాట్లో వార్నర్‌కు గొప్ప రికార్డు ఉంది. ఇప్పటి వరకు 402 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. 12956 పరుగులు సాధించాడు. ఇందులో ఐపీఎల్‌లో ఆడిన మ్యాచ్‌లు 184 కాగా.. సాధించిన పరుగులు 6565. 2009లో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన వార్నర్‌ నిలకడైన ఆటతో రాణించాడు.అమ్ముడుపోకుండా మిగిలిపోయాడుఅంతేకాదు 2016లో కెప్టెన్‌గా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు టైటిల్‌ అందించాడు. చివరగా గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున బరిలోకి దిగిన వార్నర్‌.. ఎనిమిది మ్యాచ్‌లు ఆడి కేవలం 168 పరుగులే చేశాడు. ఈ క్రమంలో మెగా వేలం-2025కి ముందు ఢిల్లీ వార్నర్‌ను వదిలేయగా.. వేలంలోనూ అతడు అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు.పీఎస్‌ఎల్‌లో అత్యధిక ధరఈ క్రమంలో పీఎస్‌ఎల్‌ వైపు దృష్టి సారించిన వార్నర్‌.. ఈ పాక్‌ టీ20 లీగ్‌లో అధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచాడు. కరాచీ కింగ్స్‌ అతడిని రూ. 2.57 కోట్లకు కొనుగోలు చేసి.. కెప్టెన్‌గా నియమించింది. ఇక పీఎస్‌ఎల్‌ ఏప్రిల్‌ 11- మే 18 వరకు జరుగనుండగా.. అమెరికా టీ20 లీగ్‌ MLCని జూన్‌ 12- జూలై 13 వరకు నిర్వహించనున్నారు.సీటెల్‌ ఒర్కాస్‌తో తాజా ఒప్పందంఈ నేపథ్యంలో సీటెల్‌ ఒర్కాస్‌ వార్నర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఎంత మొత్తానికి అతడి సేవలు వినియోగించుకోబోతోందో మాత్రం వెల్లడించలేదు. కాగా వార్నర్‌ గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.ఇక ప్రస్తుతం పీఎస్‌ఎల్‌లో కరాచీ కింగ్స్‌ కెప్టెన్‌గా ఉన్న వార్నర్‌.. బిగ్‌ బాష్‌ లీగ్‌లో సిడ్నీ థండర్‌ కెప్టెన్‌గా ఈ ఏడాది జట్టును ఫైనల్‌కు తీసుకువెళ్లాడు. అంతేకాదు.. 12 ఇన్నింగ్స్‌లో కలిపి 405 పరుగులతో లీగ్‌లో అత్యధిక వీరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఇక ఐఎల్‌టీ20లో ఈ ఏడాది టైటిల్‌ గెలిచిన దుబాయ్‌ క్యాపిటల్స్‌ జట్టులో వార్నర్‌ సభ్యుడు. ఇక ది హండ్రెడ్‌ లీగ్‌లో అతడు లండన్‌ స్పిరిట్‌కు ఆడుతున్నాడు. చదవండి: BCCI: ఫిక్సింగ్‌ యత్నం.. బీసీసీఐ ఆగ్రహం.. అతడిపై నిషేధం

Google plans job cuts from Hyderabad and Bengaluru offices5
బెంగళూరు, హైదరాబాద్‌లోని ఉద్యోగులు ఔట్‌..?

గూగుల్ భారత్‌లో ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతోందని వార్తలొస్తున్నాయి. వాటిలోని వివరాల ప్రకారం ప్రధానంగా బెంగళూరు, హైదరాబాద్‌ కార్యాలయాల్లో పని చేస్తున్న వారిపై ఈ ప్రభావం పడనుంది. ప్రకటనలు, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్ బృందాల్లోని వారికి లేఆఫ్స్‌ ప్రకటించే అవకాశం ఉంది. దేశంలో ఉద్యోగుల తొలగింపును గూగుల్ అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ లేఆఫ్స్‌ ప్రక్రియ వచ్చే వారం ప్రారంభం కానుందని బిజినెస్ స్టాండర్డ్ అంచనా వేసింది.గూగుల్ ప్లాట్‌ఫామ్స్‌ అండ్ డివైజెస్ విభాగంలో ఇటీవల జరిగిన పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది ఉద్యోగులను ఇప్పటికే తొలగించారు. తాజాగా మళ్లీ ఇలా లేఆఫ్స్‌ వార్తలు వస్తుండడం ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమవుతుంది. ఈ విభాగం ఆండ్రాయిడ్, పిక్సెల్ స్మార్ట్‌ఫోన్లు, క్రోమ్ బ్రౌజర్ వంటి కీలక ఉత్పత్తులను పర్యవేక్షిస్తుంది. అభివృద్ధి చెందుతున్న వ్యాపార ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉండటానికి సంస్థ ప్రయత్నిస్తున్నందున నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టబోతున్నట్లు తెలిసింది.ఇదీ చదవండి: కోత కోసి.. పూత పూసి..అయితే భారత్‌లో మాత్రం ఇంజినీరింగ్ ఉద్యోగాలకు సంబంధించి గూగుల్ కాస్త మెరుగ్గా వ్యవహరిస్తుందని కూడా నివేదిక వెల్లడించింది. హైదరాబాద్, బెంగళూరు క్యాంపస్‌ల్లో టెక్నికల్ పొజిషన్లలో ఉన్న ఉద్యోగులను నేరుగా తొలగించడానికి బదులుగా ఆదాయం సమకూరే ఇతర ప్రాజెక్టుల్లో కేటాయించే అవకాశం ఉందని తెలిపింది. కంపెనీ ఇటీవల అంతర్గత నిర్మాణంలో విస్తృత మార్పులు చేసింది. గత సంవత్సరం తన ప్లాట్‌ఫామ్స్‌, డివైజెస్ బృందాలను విలీనం చేసింది. దాంతో భవిష్యత్తులో శ్రామిక శక్తి తగ్గింపు కోసం ఉద్యోగులకు స్వచ్ఛంద విరమణ పథకాలను ప్రవేశపెట్టింది. విలీనం తర్వాత ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా కొన్ని తొలగింపులు జరిగాయని ఈ ఏడాది ప్రారంభంలో గూగుల్ ప్రతినిధి ఒకరు అంగీకరించారు. కంపెనీ నుంచి స్వచ్ఛందంగా నిష్క్రమించడానికి జనవరిలో తమ ఉద్యోగులకు కొన్ని ఆఫర్లు ఇచ్చినట్లు గూగుల్ ధ్రువీకరించింది.

Italian prison opens its first Love room for inmates check details here6
సుప్రీం కోర్టే చెప్పింది, ఇక ములాఖత్‌లో ఏకాంతంగా..

‘‘ఖైదీలతో జైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. వాళ్ల మానసిక ఆరోగ్యం ఏమాత్రం బాగుండడం లేదు. కుటుంబాలతో వాళ్ల బంధాలు బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే భాగస్వాములతో శారీరకంగా కలిసేందుకు అనుమతి ఇవ్వండి. పైగా అది వాళ్లకు ఉన్న హక్కు కూడా’’ అంటూ ఇటలీ సుప్రీం కోర్టు(Italy Constitution Court) తాజాగా ఇచ్చి తీర్పు ఇది. ఈ తీర్పునకు అనుగుణంగానే.. ఇటలీ జైళ్లలో శుక్రవారం నుంచి శృంగార గదులు(S*X Rooms) అందుబాటులోకి వచ్చాయి. ఉంబ్రియా రీజియన్‌లోని జైలులో ఓ ఖైదీని తన భార్యతో కలిసేందుకు అధికారులు అనుమతించారు. ఇందుకోసం అక్కడే లవ్‌ రూమ్‌(Love Rooms) పేరిట ఓ గదిని ఏర్పాటు చేయించారు. సాధారణంగా ములాఖత్‌ల టైంలో పక్కనే గార్డులు పర్యవేక్షిస్తుంటారు. కానీ, ఈ ఏకాంత ములాఖత్‌లో ఎవరూ పక్కన ఉండడానికి వీల్లేదు. న్యాయ శాఖ ఈ తరహా ఏర్పాట్లకు సంబంధించి మార్గదర్శకాలను కూడా రూపొందించడం గమనార్హం.ఉత్తర ఇటలీలోని అస్టి కారాగారంలో ఉన్న ఓ ఖైదీ తాను మానసికంగా ఎంతో కుంగిపోయి ఉన్నానని, తనను తన భార్యతో శారీరకంగా కలిసేందుకు అనుమతించాలని ట్యూరిన్‌ కోర్టులో పిటిషన్‌ వేశాడు. అయితే అది తిరస్కరణకు గురైంది. దీంతో అతను ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అక్కడ అతనికి అనుకూలంగా తీర్పు వచ్చింది. తాజా గణాంకాల ప్రకారం.. ఇటలీ వ్యాప్తంగా జైళ్లలో 62 వేలమంది ఖైదీలు ఉన్నారు. ఇది జైళ్ల సామర్థ్యం కంటే 21 శాతం ఎక్కువ. అంతేకాదు తరచూ ఖైదీలు బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇందుకు మానసిక ఒత్తిడే కారణంగా తెలుస్తోంది. అయితే.. ఖైదీలకు కూడా హక్కులు ఉంటాయని, వాటిని అడ్డుకోవాలని చూడొద్దని జైళ్ల శాఖను కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే శృంగారానికి అనుమతించాలని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ప్రిజనర్స్‌ రైట్స్ గ్రూప్‌ సంబురాలు చేసుకుంటోంది.అయితే ఈ తరహా ఏర్పాట్లు ఇటలీ(Italy)లోనే మొదటిసారి కాదు. ఫ్రాన్స్‌, జర్మనీ, స్పెయిన్‌లాంటి యూరప్‌ దేశాల్లో ఈ తరహా ఏర్పాట్లు ఎప్పటి ుంచో ఉన్నాయి.

Jaffer Sadiq Movies Record Collection In Movie Industry7
పిట్ట కొంచెం...కలెక్షన్స్‌ ఘనం.. ఎత్తు 4అడుగులు కలెక్షన్లు రూ.1900కోట్లు

బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్‌ పరిశ్రమలో కలెక్షన్‌ కింగ్స్‌లో ఒకడు, అతని అనేక చిత్రాలు రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసి నిర్మాతలకు కాసుల పంట పండించాయి . అదే విధంగా గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌ హీరో ప్రభాస్‌ కూడా బాక్సాఫీస్‌ దగ్గర సత్తా చూపిస్తున్నాడు. అయితే వీళ్లెవరూ సాధించని విధంగా ఒక నటుడు నటించిన సినిమాల కలెక్షన్స్‌ ప్రకారం చూస్తే.. గత మూడు సినిమాల ద్వారా రూ.1900 కోట్లు రాబట్టాడు. అజానుబాహుడైన హీరోలకు భిన్నంగా ఈ నటుడి ఎత్తు కేవలం ఎత్తు 4 అడుగుల 8 అంగుళాలు మాత్రమే..వయస్సు 27 సంవత్సరాలు అయినప్పటికీ, ఈ దక్షిణ భారత నటుడి గత 3 చిత్రాలు అద్భుతాలు చేశాయి. ఆ నటుడి పేరు జాఫర్‌ సాదిక్‌(Jaffer Sadiq).జాఫర్‌ సాదిక్‌ 1995 జూలై 4న తమిళనాడులోని ఈరోడ్‌లో జన్మించారు. గత 3 సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించడంతో ఇప్పుడు సౌత్‌ ఇండియాలో పాపులర్‌ స్టార్‌ అయిపోయాడు. తన కెరీర్‌ను 2020 సంవత్సరంలో ‘పావ కాదగల్‌’ అనే టీవీ సీరియల్‌తో జాఫర్‌ సాదిక్‌ ప్రారంభించాడు. ఈ సీరియల్‌ తో జాఫర్‌ స్టార్‌ అయిపోయాడు. తన మొదటి సీరియల్‌ తోనే వీక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న తర్వాత, జాఫర్‌కు 2022లో ‘విక్రమ్‌’ చిత్రంలో అవకాశం వచ్చింది. కమల్‌ హాసన్, విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన ‘విక్రమ్‌’ చిత్రంలో సాదిక్‌ పాత్ర చాలా బలంగా ప్రేక్షకులకు కనెక్ట్‌ అయింది. ఈ తమిళ చిత్రం కూడా బాక్సాఫీస్‌ దగ్గర వీరవిహారం చేసి దాదాపు రూ.500 కోట్లు రాబట్టి చరిత్ర సృష్టించింది. విక్రమ్‌ సినిమా తర్వాత, సాదిక్‌ వెందు తనింధతు కాదు అనే చిత్రంలో నటించారు.దీనితో పాటు, సాదిక్‌ సైతాన్‌ అనే వెబ్‌ సిరీస్‌లో కూడా బలమైన పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నాడు. దీని తర్వాత, విడుదలైన ‘జైలర్‌’ చిత్రంలో రజనీకాంత్‌తో జాఫర్‌ సాదిక్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నాడు... ఈ చిత్రం కూడా బాక్సాఫీస్‌ వద్ద చాలా ప్రకంపనలు సృష్టించి రూ. 650 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. రజనీకాంత్‌తో స్క్రీన్‌ను పంచుకున్న తర్వాత, షారుఖ్‌ ఖాన్‌ హీరోగా నటించిన జవాన్‌ చిత్రంలో సాదిక్‌ కూడా తనదైన శైలిలో మెప్పించాడు. ఆ చిత్రం కూడా బాక్సాఫీస్‌ దగ్గర భీభత్సం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. మొత్తంగా చూస్తే జాఫర్‌ సాదిక్‌ గత మూడు సినిమాలు 1900 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. జాఫర్‌ సాదిక్‌ ఎత్తు తక్కువే కావచ్చు, కానీ చాలా తక్కువ టైమ్‌లో, తక్కువ సినిమాలతోనే నటన పరంగా మాత్రం చాలా ఎత్తుకు ఎదిగాడు. ఇంకా బోలెడంత కెరీర్‌ ఉన్న జాఫర్‌...నటనా పరంగా మరిన్ని శిఖరాలు అందుకోవడం తధ్యంగా కనిపిస్తోంది.

YSRCP Corporator Serious Comments ON CBN Govt8
కూటమి నేతలు కేరళకు వచ్చి బెదిరించారు: కార్పొరేటర్‌ శశికళ

సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి ప్రభుత్వంపై ఇష్టానుసారం వ్యవహరిస్తోంది. వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్‌ చేసి.. బెదిరింపులకు దిగుతోంది. జీవీఎంపీ మేయర్‌ వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానంలో భాగంగా కార్పొరేటర్లతో అనుచితంగా ప్రవర్తించింది. ఈ నేపథ్యంలో రాజకీయమంటే వ్యాపారం కాదని వైఎ‍స్సార్‌సీపీ కార్పొరేటర్‌ శశికళ.. చంద్రబాబు సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.జీవీఎంసీ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ శశికళ తాజాగా మాట్లాడుతూ..‘ప్రత్యేక విమానంలో కేరళ వచ్చి కూటమి నేతలు నన్ను బెదిరించారు. కూటమికి అనుకూలంగా ఓటు వేయమన్నారు. నేను పార్టీ మారేది లేదని చెప్పాను. మొదటి నుంచి నేను వైఎస్సార్‌సీపీలోనే ఉన్నాను. రాజకీయమంటే వ్యాపారం కాదు.. డబ్బుల కోసం నీతిమాలిన రాజకీయాలు చేయను. నీచమైన రాజకీయాలను చేయవద్దని చెప్పాను. వైఎస్‌ జగన్ వల్లే నేను కార్పొరేటర్ అయ్యాను అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. అధికార దాహంతో.. గత 11 నెలల పదవి కాలంలో కూటమి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు విశాఖ మేయర్‌పై అవిశ్వాసం వేళ (GVMC No Confidence Motion) మరోసారి భారీగా ప్రలోభాలకు తెరలేపింది. ఈ క్రమంలోనే వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లకు గాలం వేసేందుకు కోట్లాది రూపాయలను మంచి నీళ్లలా ఖర్చు చేస్తోంది. అవిశ్వాసానికి సమయం దగ్గర పడుతుండడంతో కూటమి నేతలు ప్రలోభాల ఉధృతిని పెంచారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల ఇళ్లకు వెళ్లి వాళ్ల కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. భారీగా డబ్బు ఇస్తామని, భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా చూస్తామని హామీలు గుప్పిస్తున్నారు. అలాగే.. శ్రీలంక, కేరళ నుంచి విశాఖకు తీసుకురావడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తామంటున్నారు. విమానం కాకపోతే హెలికాప్టర్స్ అయినా ఏర్పాటు చేస్తామంటూ ఆఫర్లు చేస్తున్నారు. అయితే.. తాము వైఎస్సార్‌ అభిమానులమని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా వైఎస్‌ జగన్‌(YS Jagan)తోనే ఉంటామని చెబుతూ కార్పొరేటర్లు ఆ ఆఫర్లను తిరస్కరిస్తున్నారు. ఈ క్రమంలో బెదిరింపులకు సైతం కొందరు లొంగడం లేదని సమాచారం.జీవీఎంసీ(GVMC) ఎన్నికల్లో 58 స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుని మేయర్‌ పదవిని చేజిక్కించుకుందని, 30 స్థానాలు మాత్రమే గెలుచుకున్న టీడీపీ ఇప్పుడు మేయర్‌ పీఠాన్ని దక్కించుకోవాలనే దురాలోచనతో ఉంది. ఈ క్రమంలోనే భారీగా డబ్బు ఆశ చూపించడం, బెదిరింపులలాంటి అప్రజాస్వామిక ప్రయత్నాలకు దిగింది.

Amazing tips for happy and healthy life9
రోజంతా నిరసంగా అనిపిస్తోందా? ఇలా ప్లాన్‌ చేయండి!

చాలామంది రోజంతా నీరసంగా.. నిస్సత్తువగా గడుపుతుంటారు. దీనివల్ల శరీరం నిస్తేజంగా మారడమే కాకుండా అనేక రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. అయితే కొన్ని చిన్నపాటి మార్పుల ద్వారా రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండవచ్చు. అవేంటో చూద్దాం.. తగినంత నిద్ర.. ప్రతిరోజూ కనీసం 7–8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం. నిద్రలేమి చిరాకు, నీరసానికి దారితీస్తుంది.ఆరోగ్యకరమైన ఆహారం.. పోషకాలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రొటీన్లు శరీరానికి శక్తినిస్తాయి. ప్రాసెస్‌ చేసిన ఆహారాలు, చక్కెర ఎక్కువగా ఉండే వాటిని తగ్గించడం మంచిది. వ్యాయామం.. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల ΄ాటు వ్యాయామం చేయడం వల్ల మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది. శక్తి స్థాయులు పెరుగుతాయి. నడవడం, యోగా, డ్యాన్స్‌ లేదా ఇష్టమైన ఏదైనా శారీరక శ్రమ చేయవచ్చు.నీరు తాగడం.. రోజంతా తగినంత నీరు తాగడం చాలా అవసరం. డీహైడ్రేషన్‌ వల్ల అలసట, చిరాకు కలగవచ్చు.ధ్యానం, విశ్రాంతి.. ప్రతిరోజూ కొంత సమయం ధ్యానం లేదా రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌ కోసం కేటాయించండి. ఇది ఒత్తిడిని తగ్గించడానికి, మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది.పాజిటివ్‌ ఆలోచనలు.. ప్రతికూల ఆలోచనలను తగ్గించుకుని సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోండి. కృతజ్ఞత కలిగి ఉండటం కూడా చాలా ముఖ్యం.ఇష్టమైన పనులు చేయడం.. ఆనందం కలిగించే హాబీలు లేదా పనుల కోసం సమయం కేటాయించడం మన మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.సామాజిక సంబంధాలు.. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడపడం, ఇతరులతో మాట్లాడటం, కనెక్ట్‌ అవ్వడం మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యం.కొత్త విషయాలు నేర్చుకోవడం.. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం లేదా కొత్త విషయాలు తెలుసుకోవడం మీ మనస్సును ఉత్తేజపరుస్తుంది, ఉల్లాసంగా ఉంచుతుంది.రోజువారీ అలవాట్లు.. ఉదయం లేవగానే సహజమైన సూర్యకాంతిలో గడపడం శరీరపు జీవ గడియారాన్ని క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది, ఉల్లాసంగా ఉంచుతుంది.చిన్న చిన్న విరామాలు.. మీరు ఎక్కువసేపు ఒకే పనిలో ఉంటే, మధ్యలో చిన్న విరామాలు తీసుకోండి. లేచి కొంచెం నడవండి లేదా స్ట్రెచ్‌ చేయండి.పనులు ప్లాన్‌ చేసుకోవడం.. రోజువారీ పనులను ఒక క్రమంలో ప్లాన్‌ చేసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది, మరింత నియంత్రణలో ఉన్నట్లు అనిపిస్తుంది.నవ్వండి, నవ్వించండి.. నవ్వడం ఒక గొప్ప ఒత్తిడి నివారిణి, హాయిగా నవ్వుకోడం మానసిక స్థితిని తక్షణం మెరుగు పరుస్తుంది.ఈ చిట్కాలను జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా రోజంతా ఉల్లాసంగాఉత్సాహంగా ఉండగలగడం ఎవరికైనా సాధ్యమే.ఒకవేళ మీకు ఏవైనా ప్రత్యేకమైన ఆందోళనలు ఉంటే, వైద్య నిపుణుడిని సంప్రదించడం మంచిది.

TDP Supporters Protest Against Bandaru Sravani10
టీడీపీలో పొలిటికల్‌ వార్‌.. ఎమ్మెల్యే కారణంగా కీలక నేతల రాజీనామా!

సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి ప్రభుత్వం పాలనలో పలుచోట్ల టీడీపీ కార్యకర్తలు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరు, వారి ప్రవర్తన కారణంగా.. టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఎమ్మెల్యే బండారు శ్రావణికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే వైఖరికి నిరసనగా టీడీపీ ఎంపీటీసీ సైతం రాజీనామా చేశారు.వివరాల ప్రకారం.. శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణిపై టీడీపీ కార్యకర్తల తిరుగుబాటు చేశారు. ఎమ్మెల్యే శ్రావణి కార్యకర్తల కంటే డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్నారని పచ్చ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనంతపురం వచ్చిన మంత్రి టీజీ భరత్‌కు స్థానిక టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం, ఎమ్మెల్యే బండారు శ్రావణికి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేశారు.దీంతో, అక్కడే ఉన్న పోలీసులు.. టీడీపీ కార్యకర్తలను ఈడ్చి పడేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. ఎమ్మెల్యే శ్రావణి వైఖరికి నిరసనగా వెస్ట్ నరసాపురం టీడీపీ ఎంపీటీసీ అంజినమ్మ రాజీనామా చేశారు. ఇదే సమయంలో 30 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న తమకు కనీస గుర్తింపు ఇవ్వలేదని టీడీపీ నేతలు వాసాపురం బాబు, కనంపల్లి ప్రసాద్ ధర్నాకు దిగారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. టిడిపి ఎమ్మెల్యే బండారు శ్రావణి కు సొంత కార్యకర్త నుంచి నిరసన సెగ. పార్టీ కోసం చాలా కష్టపడ్డాను కానీ గుర్తింపు ఇవ్వడం లేదు.- టిడిపి కార్యకర్త pic.twitter.com/ZibwkRqIZv— రాజా రెడ్డి YSRCP (@rajareddzysrcp) April 18, 2025

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement