Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Home Miniseter Amith Sha orders State Govts To Find Pakistanis1
పాకిస్తానీయులను జల్లెడ పట్టండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఢిల్లీ: పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ లో ఉంటున్న పాకిస్తాన్ దేశస్తుల వీసాలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు వారిని జల్లెడ పట్టే పనిలో పడింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు హోంమంత్రి అమిత్ షా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏయే రాష్ట్రాల్లో పాకిస్తానీయులు ఎంతమంది ఉన్నారో గుర్తించి వారిని తిరిగి స్వదేశానికి పంపే ఏర్పాట్లు చేయాల్సిందిగా అమిత్ షా.. రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. దీనిలో భాగంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అమిత్ షా ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. దీన్ని వీలైనంత త్వరగా చేయాల్సిందిగా ఆయన.. రాష్ట్ర సీఎంలను కోరారు. ఇక హైదరాబాద్ విషయానికొస్తే ఇక్కడ పాకిస్తాన్ దేశానికి చెందిన వారు 208 మంది ఉన్నట్లు గుర్తించారు.కాగా, మంగళవారం కశ్మీర్ లోని పెహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా దృష్టిపెట్టింది. భారత్ పై దాడి చేసిన ఉగ్రవాదుల్ని ఎక్కడున్నా మట్టిలో కలిపేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా హెచ్చరించారు. ఈ క్రమంలోనే వారి మూలాలు పాకిస్తాన్ లో ఉన్నాయని బలంగా భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఆ మేరకు చర్యలు చేపట్టింది. భారత్ లో ఉంటున్న పాకిస్తాన్ దేశస్తుల వీసాలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో సింధూ జలాలను సైతం భారత్ నిలిపివేసింది. ఇలా దౌత్యపరమైన ఆంక్షలను పాక్ పై విధించింది భారత్. భారత్ పై ఉగ్రదాడి జరిగిన ప్రతీసారి పాక్ మూలాలు బయటపడటంతో ఇక ఆ దేశంతో తాడోపేడో తేల్చుకోవడానికి భారత్ సన్నద్ధమైంది. దీనిలో భాగంగానే పాక్ పై ఆంక్షలు విధించి వారిని కచ్చితంగా కట్టడి చేయాల్సిన అవసరముందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ దేశానికి చెందిన ఎవరైనా భారత్ ను విడిచి వెళ్లాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.

Pahalgam Incident LIC Opens Special Claim Settlement Window for Victims Families Check The Details2
పహల్గాం ఘటన: ఎల్ఐసీ కీలక ప్రకటన

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన తరువాత బాధితుల కుటుంబాలకు అండగా నిలబడటానికి.. త్వరితగతిన డెత్ క్లెయిమ్ పరిష్కారాలను అందించడానికి 'లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (LIC) ఓ స్పెషల్ విండోను అందుబాటులోకి తీసుకొచ్చింది."పహల్గాంలో అమాయక పౌరుల మరణం పట్ల ఎల్‌ఐసి ఆఫ్ ఇండియా తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. మరణించిన వారి డెత్ క్లెయిమ్‌ను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. దుఃఖంలో ఉన్న బాధిత కుటుంబానికి ఎల్‌ఐసి ఆఫ్ ఇండియా అండగా నిలుస్తుంది" అని ఎల్‌ఐసి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ సిద్ధార్థ మొహంతి ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.డెత్ క్లెయిమ్ ప్రక్రియ పూర్తిగా ఆఫ్‌లైన్‌లో ఉందని క్లెయిమ్‌దారులు తప్పకుండా గమనించాలి. ఈ ప్రక్రియను ప్రారంభించడానికి, నామినీ అవసరమైన అన్ని పత్రాలను తీసుకొని పాలసీని జారీ చేసిన ఎల్ఐసీ శాఖను సంప్రదించాలి. పాలసీ ప్రీమియంలు రెగ్యులర్‌గా చెల్లించి ఉంటే లేదా గ్రేస్ పీరియడ్‌లోపు మరణం సంభవించినట్లయితే క్లెయిమ్ సెటిల్‌మెంట్‌కు అర్హత ఉంటుంది.క్లెయిమ్ ప్రాసెస్➤నామినీ అవసరమైన పత్రాలతో.. పాలసీ జారీ చేసిన ఎల్ఐసీ బ్రాంచ్‌ను సంప్రదించాలి.➤పాలసీ నంబర్, తేదీ, మరణించడానికి కారణం వంటి వివరాలతో LIC సర్వీసింగ్ బ్రాంచ్‌కు లిఖితపూర్వకంగా తెలియజేయాలి.➤నామినీదారునికి, మరణించిన వ్యక్తికి గల సంబంధాన్ని తెలియజేయడానికి ఫారమ్ Aను సబ్మిట్ చేయాలి.➤అధికారిక మరణ ధ్రువీకరణ పత్రంగా.. స్థానిక మరణ రిజిస్టర్ నుంచి ధ్రువీకరించిన పత్రాలను సమర్పించాలి. వయస్సు ధ్రువీకరణ కోసం ఆధార్ లేదా పాన్ కార్డు వంటివి ఇవ్వాల్సి ఉంటుంది.➤మరణ ధృవీకరణ పత్రాలకు బదులుగా, ఉగ్రవాద దాడి కారణంగా పాలసీదారు మరణించినట్లు ప్రభుత్వ రికార్డులలో ఉన్న ఏవైనా ఆధారాలు లేదా కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించిన ఏదైనా పరిహారం వంటివి పాలసీదారు మరణించినట్లు నిర్దారించడానికి ఉపయోగపడతాయి.➤వీటన్నింటినీ.. పరిశీలించి ఎల్ఐసీ క్లెయిమ్ సెటిల్ చేస్తుంది.ఇదీ చదవండి: కుమారుల కోసం ధీరూభాయ్ అంబానీ వదిలివెళ్లిన ఆస్తి ఎంతంటే..

KSR Comments On Chandrababu Govt3
ప్రభుత్వంపై చంద్రబాబు పట్టు పోయిందా?

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌, చంద్రబాబు ప్రభుత్వాల మధ్య తేడా ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. జగన్‌ హయాంలో అడ్డగోలుగా కేసులు పెట్టడం, అరెస్ట్‌లు చేసిన సందర్భాలు దాదాపుగా లేవనే చెప్పాలి. ఆధారాలుంటే మాత్రం పూర్తిస్థాయి విచారణ తరువాత అరెస్టులు జరిగాయి. అయినా కూడా అప్పటి ప్రతిపక్షం తెలుగుదేశం.. అక్రమ కేసులంటూ గగ్గోలు పెట్టేది. దబాయింపులకు దిగేవారు. దుష్ప్రచారానికి తెర లేపారు.టీడీపీకి న్యాయవ్యవస్థపై ఉన్న పట్టు కూడా ఇందుకు ఉపకరించిందని విమర్శకుల అంచనా. మరి ఇప్పుడు? టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వంలో అంతా వారి ఇష్టారాజ్యమే. గిట్టనివారిపై మరీ ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై ఎడాపెడా తోచిన కేసులు పెట్టేస్తున్నారు. అదేమంటే.. రెడ్‌బుక్ ఎఫెక్ట్ అంటున్నారు. ఈ పైశాచికత్వం ఎంతదాకా వెళ్లిందంటే.. పోలీసు అధికారులూ బలయ్యేంత స్థాయికి!. సీనియర్ పోలీస్ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును అరెస్టు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 2014-19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలను ఆధారాలతోపాటు పట్టుకోవడమే ఈయన చేసిన తప్పు. ఆ కక్షతోనే టీడీపీ తప్పుడు కేసులో అరెస్టుకు దిగిందని విశ్లేషకుల అంచనా.పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు సస్పెన్షన్‌లో ఉన్నప్పటికీ, వైఎస్సార్‌సీపీ నేతలతో టచ్‌లో ఉన్నారని, వారికి సలహాలు ఇస్తున్నారని ఈనాడులో ఒక కథనం వచ్చిన కొంత కాలానికే ఆయన్ను అరెస్ట్‌ చేయడం గమనార్హం. స్వతంత్రంగా వ్యవహరిస్తున్నామన్న ముసుగులో ఒక వర్గానికి కొమ్ము కాస్తుండే మీడియా, రాజకీయ పార్టీ ఏకమై పాలన చేస్తే ఎంత ప్రమాదకరమో ఇదే ఉదాహరణ. ఫలానా వారిని ఇంకా అరెస్టు ఎందుకు చేయలేదంటూ.. సీఐడీ విచారణకు హాజరైన ఒక వైఎస్సార్‌సీపీ నేతను రెండు గంటలే ప్రశ్నించారని.. ఎల్లో మీడియా వార్తలు ఇస్తోందంటే.. పాలకపక్షానికి వీరికి మధ్య ఉన్న లోపాయకారి అవగాహన ఏమిటో ఇట్టే తెలిసిపోతుంది.మోసాలు చేస్తుందని స్పష్టంగా తెలిసిన ఒక నటి చేసిన ఆరోపణల ఆధారంగా సీనియర్‌ పోలీస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును అరెస్ట్‌ చేశారు. ఇది ప్రభుత్వానికి అప్రతిష్ట అని, ఐపీఎస్‌ వర్గాల నైతిక స్థైర్యం దెబ్బతింటుందని అధికార వర్గాలు భావిస్తున్నా చంద్రబాబు సర్కార్ మొండిగా ముందుకు వెళ్లింది. ఈ కేసులో ఇప్పటికే మరో ఇద్దరు పోలీసు అధికారులు ముందస్తు బెయిల్ పొందగా ఆంజనేయులు మాత్రం ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించ లేదు. తనను అరెస్టు చేస్తారని తెలిసినా ఆయన అందుకు సిద్దపడ్డారంటేనే తాను తప్పు చేయలేదన్న విశ్వాసం అన్నమాట. తాను టీడీపీకి లొంగిపోనని, జైలుకైనా వెళతానని ఆంజనేయులు మాదిరి ధైర్యంగా నిలబడ్డ అధికారి ఇటీవలి కాలంలో ఇంకొకరు లేరు. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుని ఏపీ ప్రభుత్వం ఆయనను జైలుకు పంపించింది. మోసకారి నటి కేసులో ఇప్పటికే ఒకరు అరెస్టు అవ్వడం, బెయిల్‌పై బయటకు రావడం కూడా జరిగింది.డీజీపీ స్థాయి అధికారిని అరెస్టు చేసిన టైమింగ్ కూడా గమనించదగినదే. ఒక వైపు అమరావతిలో 44 వేల ఎకరాలు అదనంగా తీసుకోవాలన్న కూటమి ప్రతిపాదనపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. విశాఖలో విలువైన భూములను పరిశ్రమల పేరుతో రూపాయికి, అర్ధ రూపాయికి కట్టబెట్టడంపై పలు విమర్శలు ఉన్నాయి. రెండు నెలల క్రితం రిజిస్టర్ అయిన ఉర్సా అనే కంపెనీకి ఏకంగా మూడు వేల కోట్ల విలువైన భూమి కేటాయించాలని తలపెట్టడం వివాదంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు యూరప్ నుంచి తిరిగి రాగానే అరెస్టులు జరగడం కూడా గమనార్హం. ప్రభుత్వం పరపతి కోల్పోతున్నప్పుడు ఇలాంటి డైవర్షన్ వ్యూహాలు అమలు చేయడంలో చంద్రబాబు దిట్ట. ఒకవైపు ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్‌ రెడ్ బుక్ ప్రయోగం, మరోవైపు చంద్రబాబు కుట్రలతో రాష్ట్రానికి నాశనం చేస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా ఒక చిన్న ఘటన జరిగితే చాలు.. చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు ఆయనను సైకో అని, మరొకటనీ, నీచమైన రీతిలో విమర్శలు చేసేవారు. ఇప్పుడు నమోదు అవుతున్న కేసులు, అరెస్టులు చూస్తే నైతిక పతనం ఎన్ని విధాలుగా ఉండవచ్చో ప్రపంచానికి చాటి చెబుతున్నట్టు కనిపిస్తుంది. చంద్రబాబు హయాంలో జరిగిన ఘటనలకు బాధ్యులుగా జగన్‌ కూడా అప్పట్లో పలువురు పోలీసు అధికారులపై కేసులు పెట్టేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఆ పని చేయలేదు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు 23 మందిని కొనుగోలు చేసిన వ్యవహారంలో ఒక పోలీసు ఉన్నతాధికారి పాత్రపై పలు అభియోగాలు ఉన్నాయి. రాజకీయ కార్యకలాపాలలో పాల్గొన్నందుకు గాను ఆయనపై కేసు పెట్టి ఉండవచ్చు కదా. కానీ, ఆ పని జగన్ ప్రభుత్వం చేయలేదు. ఇతర ఆరోపణలపై ఆయనను సస్పెండ్ చేస్తేనే చాలా పెద్ద ఘోరం జరిగినట్లు ప్రచారం చేశారు. ఆయన ఏకంగా టీడీపీ కొమ్ము కాయడమే కాకుండా, రిటైరయ్యాక కుల సభలలో పాల్గొంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.సోషల్ మీడియాలో జగన్ కుటుంబంపై, పలువురు వైఎస్సార్‌సీపీ నేతలపై అరాచకపు పోస్టింగులు పెట్టినా టీడీపీ వారికి ఏమీ కాలేదు. చంద్రబాబు అధికారంలోకి రాగానే వైఎస్సార్‌సీపీ వారిపై ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాపై విరుచుకుపడ్డారు. ఎవరు తప్పు చేసినా చర్య తీసుకోవచ్చు. కానీ, కేవలం వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపైనే కేసులు ఎందుకు వస్తున్నాయంటే అదే రెడ్ బుక్ పాలన అని అంటున్నారు. చంద్రబాబుతో సహా కొందరు టీడీపీ ప్రముఖులపై గత ప్రభుత్వ టైమ్‌లో పై కేసులు పెట్టలేదా? అరెస్టులు చేయలేదా అని కొందరు ప్రశ్నించవచ్చు. చంద్రబాబుపై కేసు పెట్టడానికి ముందు పూర్తి స్థాయిలో విచారణ చేశారు. ఉదాహరణకు స్కిల్ స్కామ్ కేసులో ఈడీ మొదట కేసు పెట్టింది. ఆ తర్వాత ఏపీ సీఐడీ కేసు తీసుకుంది. టీడీపీ ఆఫీస్ బ్యాంక్ ఖాతాలో కూడా అవినీతి డబ్బు వచ్చిందని సీఐడీ ఆధార సహితంగా ఆరోపించింది. దానికి ఇంతవరకు టీడీపీ కౌంటర్ చేయలేకపోయింది.మరికొన్ని కేసులు అయితే సీబీఐ దర్యాప్తు చేయడానికి అభ్యంతరం లేదని గత ప్రభుత్వం తెలిపినా, మేనేజ్ చేశారో, లేక మరే కారణమో తెలియదు కాని కేంద్రం అందుకు సిద్దపడలేదు. ఇప్పుడు మాత్రం ఏపీ ప్రభుత్వం మనోభావాల పేరుతో, మరో పేరుతో, ఒక తరహా ఫిర్యాదును అనేక పోలీస్ స్టేషన్లలో పెట్టడం, నిందితులను వందల కిలోమీటర్లు తిప్పి వారిని అనారోగ్యం పాలు చేయడం వంటి ఘటనలు గమనిస్తే ఈ ప్రభుత్వం మానవత్వంతో వ్యవహారించడం లేదన్న భావన కలుగుతుంది. మరో వైపు కూటమి ఎమ్మెల్యేలు మద్యం, ఇసుక, భూదందాలు, పరిశ్రమల యజమానులను బెదిరించడం వంటి పలు సంఘటనలు జరుగుతున్నా పోలీసులు వారి జోలికి వెళ్లడం లేదు.మోసకారి నటి కేసు కారణంగా ఏపీకి వచ్చే అవకాశం ఉన్న పరిశ్రమలు కూడా రాకుండా పోతున్నాయని చెబుతున్నా, ఏమాత్రం లెక్క పెట్టకుండా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుండడం దురదృష్టకరం. చంద్రబాబు ఎంతో అనుభవజ్ఞుడు. కాలం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదని ఆయనకు తెలుసు. వచ్చే ఎన్నికలలో కూటమి ఓడిపోతే ఎదురయ్యే పరిణామాలు తెలియనంత అమాయకుడు ఏమీ కాదు. అయినా సర్కార్‌ను ఇంత అరాచకంగా నడుపుతున్నారంటే ప్రభుత్వం చంద్రబాబు కంట్రోల్లో లేదేమో అనిపిస్తుంది!.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

ISRO Former Chairman Kasturirangan Passed Away Tributes Pour4
ఇస్రో మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ కస్తూరి రంగన్‌ కన్నుమూత

బెంగళూరు, సాక్షి: ప్రముఖ శాస్త్రవేత్త, ఇస్రో మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ కస్తూరి రంగన్‌ (84) కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కస్తూరి రంగన్‌ గతంలో జేఎన్‌యూ ఛాన్సలర్‌గా, కర్ణాటక నాలెడ్జ్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా పనిచేశారు. ఈయన పూర్తి పేరు కృష్ణస్వామి కస్తూరిరంగన్‌(Krishnaswamy Kasturirangan). కేరళ ఎర్నాకులంలో కస్తూరిరంగన్‌ జన్మించారు. ఈయనది విద్యావంతుల కుటుంబం. ముంబై యూనివర్సిటీలో ఫిజిక్స్‌లో మాస్టర్స్‌ చేసిన రంగన్‌.. అహ్మదాబాద్‌ ఫిజికల్‌ రీసెర్చ్‌ లాబోరేటరీ నుంచి 1971లో డాక్టరేట్‌ అందుకున్నారు. ఖగోళ శాస్త్రం, స్పేస్‌ సైన్స్‌ మీద 240 పేజీల థియరీని సమర్పించారాయన. 1994 నుంచి 2003 దాకా.. తొమ్మిదేళ్లపాటు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO)కి ఆయన చైర్మన్‌గా పని చేశారు. 2003-09 మధ్య రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు. 2004 నుంచి 2009 మధ్య కాలంలో బెంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌కు డైరెక్టర్‌గా పనిచేశారు. మోదీ సర్కార్‌ తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదా కమిటీకి కస్తూరి రంగన్‌ అధ్యక్షుడిగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ, పద్మ భూషణ్‌, పద్మ విభూషణ్‌తో సత్కరించింది. మొత్తం 27 యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్‌లు అందుకున్నారాయన. ఇస్రో శాస్త్రవేత్త నంబీ నారాయణన్‌ మీద దేశద్రోహం ఆరోపణలు వచ్చిప్పుడు ఇస్రో చైర్మన్‌గా ఉంది కస్తూరి రంగనే. 1969లో లక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. రంగన్‌ భార్య 1991లో కన్నుమూశారు.

Pawan Kalyan Cancels Rachabanda Event in Pithapuram5
పిఠాపురంలో పవన్‌ ‘రచ్చ’బండ రద్దు

కాకినాడ, సాక్షి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు సొంత నియోజకవర్గంలోనే వరుస షాకులు తగిలాయి. రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించకుండానే.. రద్దు చేసుకుని తిరుగుపయనం అయ్యారాయన. అదే సమయంలో ఈ పర్యటనలోనే కూటమిలో విబేధాలు కూడా మరోసారి బయటపడ్డాయి.పవన్‌ కల్యాణ్‌ శుక్రవారం పిఠాపురం రచ్చబండలో పాల్గొనాల్సి ఉంది. అయితే.. రైతులు, ఇతర వర్గాల ప్రజలు తమ సమస్యలపై నిరసన తెలిపే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో.. కార్యక్రమాన్ని నిర్వహించకుండానే అర్ధాంతరంగా వెళ్లిపోయారు. మరోవైపు, ఈ పర్యటనలో కూటమిలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. డిప్యూటీ సీఎం, పలు శాఖల మంత్రి హాజరయ్యే కార్యక్రమానికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఇంచార్జి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ గైర్హాజరయ్యారు. ఇక.. ఉప్పాడలో పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేసిన టీటీడీ కళ్యాణ మండపం, సీతారాముల దేవాలయం శంకుస్థాపన శిలాఫలకాల్లో సీఎం చంద్రబాబు పేరు కనిపించలేదు. దీంతో టీడీపీ నేతలు బహిరంగంగానే అక్కడ అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది.

Couple Denies Viral Video Features Navy Officer Vinay Narwal Before Pahalgam incident6
Pahalgam: ‘ఆ వీడియోలో ఉన్నది మేమే.. వినయ్‌ సార్‌ కాదు’

న్యూఢిల్లీ: ఏప్రిల్‌ 16న ఉత్తారఖండ్‌ మసూరీలో పెళ్లి. 19న హర్యానాలోని కర్నాల్‌లో రిసెప్షన్‌. ఏప్రిల్‌ 21న కశ్మీర్‌లో హనీమూన్‌. ఏప్రిల్‌ 23న కర్నాల్‌లో అంత్యక్రియలు. ఇండియన్‌ నేవి లెఫ్టినెంట్‌ కల్నల్‌ వినయ్‌ నర్వాల్‌ జీవితం ఇలా ముగిసింది.ఏప్రిల్‌ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన త్రీవవాదుల దాడిలో 26 మంది మరణించారు. వారిలో నేవి అధికారి వినయ్‌ నార్వాల్‌ ఒకరు. పహల్గాంలో టెర్రరిస్టుల దాడికి కొద్ది నిమిషాల ముందు వినయ్‌ నార్వాల్‌, ఆయన సతీమణి హిమాన్షి సరదగా గడిపిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియోలు చూసిన నెటిజన్లు సైతం విచారం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. We're safe. A recent video was misused by some pages, falsely claiming it was the last video of late Vinay narwal and his wife. They have clarified that this video is not theirs. #Pahalgam #Kashmir #pahalgamattack pic.twitter.com/aAdlnTarNf— Shaheen khan (@shaheenkhan09) April 24, 2025 ఆ వీడియో మాదే కానీ,ఆ వీడియోలో ఉన్నది వినయ్‌ నార్వాల్‌ దంపతులు కాదని, ఆ వీడియోలో ఉన్నది తామేనంటూ ఆశిష్ శరావత్‌, యాషికా శర్మ దంపతులు సోషల్‌ మీడియాలో ఓ వీడియోని పోస్టు చేశారు. ఆ వీడియోలో.. ‘పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్, అతని భార్య చివరి హనీమూన్ వీడియో అంటూ మా వీడియోని షేర్‌ చేస్తున్నారు. నేవి అధికారి వినయ్‌ నర్వాల్‌ దంపతుల పేరిట వైరల్‌ అవుతున్న వీడియో మాదే. దుర్ఘటన జరిగే సమయంలో మేం అక్కడలేము. మేం బ్రతికే ఉన్నాం.. కశ్మీర్‌ టూర్‌లో ఉండగా ఏప్రిల్‌ 14న రికార్డ్‌ చేసిన వీడియోని ఏప్రిల్‌ 22న సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాం. అయితే అదే రోజు పహల్గాం దాడి జరగడం. మేం పోస్టు చేసిన వీడియోకి నెగిటీవ్‌ కామెంట్లు వచ్చాయి. వెంటనే వాటిని డిలీట్‌ చేశాం. కానీ అప్పటికే నేవి అధికారి వినయ్‌ నర్వాల్‌ దంపతుల పేరిట వీడియోని షేర్‌ చేశారని స్పష్టత ఇచ్చారు. యాషికా, ఆశిష్‌లు స్పందిస్తూ.. మేం బ్రతికే ఉన్నాం. మేం షేర్ చేసిన వీడియో ఇలా ఒక విషాద ఘటనకు లింక్ చేయడం మాకు బాధ కలిగింది. మేము లెఫ్టినెంట్ నర్వాల్ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. దయచేసి ఈ వీడియోను షేర్‌ చేయొద్దని కోరారు.తప్పుడు ప్రచారం మమ్మల్ని మరింత బాధిస్తున్నాయిపహల్గాంలో వినయ్‌ నర్వాల్ దంపతులు సంతోషంగా గడిపిన చివరి క్షణం ఇదేనంటూ 19సెకన్ల వీడియోను నెటిజన్లు తెగ షేర్‌ చేస్తున్నారు. ఆ వీడియోపై వినయ్‌ నర్వాల్‌ సోదరి స్రిష్టి నర్వాల్‌ స్పందించారు. ఆ వీడియోలో ఉన్నది తన సోదరుడు వినయ్‌, వదిన హిమాన్షి కాదని తెలిపారు. ఇలా తప్పుడు ప్రచారం చేస్తూ వినయ్‌ను అగౌర పరచొద్దని కోరారు. వినయ్‌ గురించి కుటుంబసభ్యులు సమాచారం ఇస్తారని అన్నారు. మేం ఇప్పటికే తీవ్ర దుఃఖంలో ఉన్నాం. ఇలాంటి పుకార్లు మమ్మల్ని మరింత బాధపెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Maybe Wont See Him Next Year: Sehwag Stunning Statement Advises RR youngster7
కోటీశ్వరుడినయ్యా.. నాకేంటి?!.. వచ్చే ఏడాది కనిపించడు: సెహ్వాగ్‌

రాజస్తాన్‌ రాయల్స్‌ యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)ని ఉద్దేశించి టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ (Virender Sehwag)ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చిన్న వయసులోనే పేరు ప్రఖ్యాతులు పొందిన చాలా మంది ఆటగాళ్లు.. అంతే త్వరగా కనుమరుగైపోయిన దాఖలాలు ఉన్నాయన్నాడు. కాబట్టి వైభవ్‌ ఆచితూచి అడుగేస్తూ కెరీర్‌ ప్లాన్‌ చేసుకోవాలని సూచించాడు.రూ. 1.10 కోట్లకుదేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటిన పద్నాలుగేళ్ల వైభవ్‌ సూర్యవంశీని ఐపీఎల్- 2025 (IPL 2025) మెగా వేలంలో పేరు నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇతర ఫ్రాంఛైజీలతో పోటీపడి మరీ రాజస్తాన్‌ రాయల్స్‌ రూ. 1.10 కోట్లకు అతడిని దక్కించుకుంది. ఇటీవల లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా వైభవ్‌కు అరంగేట్రం చేసే అవకాశం కూడా ఇచ్చింది.తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడుకెప్టెన్‌ సంజూ శాంసన్‌ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో అతడి స్థానంలో వైభవ్‌ వచ్చాడు. టీమిండియా స్టార్‌ యశస్వి జైస్వాల్‌తో కలిపి రాజస్తాన్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. లక్నోతో మ్యాచ్‌ సందర్భంగా అత్యంత పిన్నవయసులోనే ఐపీఎల్‌లో అడుగుపెట్టిన క్రికెటర్‌గా చరిత్రకెక్కిన ఈ బిహార్‌ కుర్రాడు.. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడు.అరంగేట్రంలోనే ఈ ఘనత సాధించిన అతి కొద్ది మంది క్రికెటర్ల జాబితాలో వైభవ్‌ చేరిపోయాడు. ఆ మ్యాచ్‌లో మొత్తంగా 20 బంతులు ఎదుర్కొన్న వైభవ్‌.. 34 పరుగులు సాధించాడు. ఇక తాజాగా శుక్రవారం ఆర్సీబీతో మ్యాచ్‌లోనూ వైభవ్‌ దూకుడుగానే ఆడాడు. రెండు సిక్సర్ల సాయంతో 16 పరుగులు చేసి నిష్క్రమించాడు.కోటీశ్వరుడినయ్యా.. నేను స్టార్‌ అనుకుంటే వచ్చే ఏడాది కనిపించడుఈ పరిణామాల నేపథ్యంలో వీరేందర్‌ సెహ్వాగ్‌ క్రిక్‌బజ్‌ షోలో మాట్లాడుతూ.. ‘‘బాగా ఆడితే ప్రశంసిస్తారని.. ప్రదర్శన బాగా లేకుంటే విమర్శిస్తారని తెలిసిన ఆటగాడు గర్వం తలకెక్కించుకోకుండా ఉంటాడు. అతడి కాళ్లు భూమ్మీదే ఉంటాయి.కానీ చాలా మంది ఆటగాళ్లు.. ఒకటీ- రెండు మ్యాచ్‌ల ద్వారా ఫేమస్‌ అయిన వెంటనే దారి తప్పుతారు. తాము స్టార్‌ ప్లేయర్‌ అయిపోయామనే భ్రమలో ఆ తర్వాత కనీస ప్రదర్శన కూడా చేయలేకపోతారు.ఇక సూర్యవంశీ విషయానికొస్తే.. అతడు మరో 20 ఏళ్ల పాటు ఐపీఎల్‌ ఆడాలనే లక్ష్యంతో ఉండాలి. విరాట్‌ కోహ్లిని చూడండి.. తను 19 ఏళ్ల వయసులో ఐపీఎల్‌ ఆడటం మొదలుపెట్టాడు. ఇప్పటికి 18 సీజన్లు పూర్తి చేసుకున్నాడు.కోహ్లి మాదిరే సూర్యవంశీ ఎదిగేందుకు ప్రయత్నించాలి. అలా కాకుండా.. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సాధించిన దానితో సంతోషపడి.. నేను కోటీశ్వరుడిని.. నా అరంగేట్రమే అద్భుతం.. తొలి బంతికే సిక్స్‌ కొట్టాను.. అనే ఆలోచనలతో ఉంటే.. బహుశా వచ్చే ఏడాది మనం అతడిని చూసే అవకాశం ఉండకపోవచ్చు’’ అని పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీతో మ్యాచ్‌లో రాజస్తాన్‌ ఆఖరి వరకు పోరాడి 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. తద్వారా బెంగళూరు జట్టు ఈ సీజన్‌లో సొంత మైదానంలో తొలి విజయం సాధించగా.. రాజస్తాన్‌ తొమ్మిదింట ఏడు పరాజయాలు నమోదు చేసి పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: క్రెడిట్‌ మొత్తం వాళ్లకే.. జట్టులో గొప్ప నాయకులు ఉన్నారు.. కానీ: పాటిదార్‌𝐌𝐀𝐊𝐈𝐍𝐆. 𝐀. 𝐒𝐓𝐀𝐓𝐄𝐌𝐄𝐍𝐓 🫡Welcome to #TATAIPL, Vaibhav Suryavanshi 🤝Updates ▶️ https://t.co/02MS6ICvQl#RRvLSG | @rajasthanroyals pic.twitter.com/MizhfSax4q— IndianPremierLeague (@IPL) April 19, 2025

India And Pakistan Army Related Full Details8
సింహానికి చిట్టెలుకకు పోలికా?.. భారత్‌, పాక్‌ బలాబలాలు ఇలా..

డిక్కీ బలిసిన కోడి చికెన్ కొట్టు ఎదురుగా తొడగొట్టిందట.. గట్టిగా యాభై కిలోమీటర్ల దూరం వెళ్లేందుకు మిలిటరీ వాహనాలకు డీజిల్ పోయలేరు.. ఒకసారి ఫైటర్ జెట్లను ట్రయల్ రన్ తీయాలంటే లక్షలు ఖర్చు.. దానికి చేతగాదు.. యుద్ధ ట్రయాంకర్లకు ఆయుధాలు.. వంటివి ఫిక్స్ చేయాలంటే నట్లు .. బోల్టులు కరువే.. అసలు సైనికులకు యూనిఫారాలు. బూట్లు కూడా కొత్తవి ఇవ్వాలంటే పాతవాటికి మాసికాలు వేసుకుని రోజులీడుస్తున్న దారుణం. భారత్ నుంచి గోధుమపిండి ఇస్తే తప్ప మూడుపూటలూ ముద్దకు ఠికాణాలేని కరువు బతుకులు.. అలాంటి పాకిస్తాన్ ఇప్పుడు భారత్ కు సవాల్ విసురుతోంది. అంతర్జాతీయంగా భారత్‌కు ఉన్న విలువ, గౌరవం.. మార్కెట్ వాల్యూ.. సైనిక.. ఆర్థిక సంపత్తితో పోలిస్తే పాకిస్తాన్ ఒక పిపీలికం.. కానీ ఏదో తెగింపు.. దేశంలో పోతున్న పరువును కాపాడుకునేందుకు ఏదో ఒక బిల్డప్ ఇస్తూ అక్కడి సైనిక పాలకులు కాస్త ఓవర్ యాక్షన్ చేస్తున్నారు.. ఈ తరుణంలో భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య సైనిక బలాలు.. బలగాల మధ్య ఏపాటి వ్యత్యాసం ఉందో చూద్దాం. గ్లోబల్ ఫైర్‌పవర్ ఇండెక్స్ 2025 తాజా నివేదిక ప్రకారం ఇరు దేశాల మిలిటరీ శక్తి ఇలా ఉందిసమగ్ర మిలిటరీ ర్యాంకింగ్:భారతదేశం: ప్రపంచంలో 4వ ర్యాంక్, పవర్ ఇండెక్స్: 0.1184పాకిస్తాన్: ప్రపంచంలో 12వ ర్యాంక్, పవర్ ఇండెక్స్: 0.2513మానవ వనరులు:మొత్తం జనాభా: భారతదేశం – 1.4 బిలియన్ | పాకిస్తాన్ – 252 మిలియన్యాక్టివ్ సైన్యం : భారతదేశం – 14,55,550 | పాకిస్తాన్ – 6,54,000రిజర్వ్ సిబ్బంది: భారతదేశం – 11,55,000 | పాకిస్తాన్ – 5,50,000పారా మిలిటరీ దళాలు: భారతదేశం – 25,27,000 | పాకిస్తాన్ – 5,00,000వాయుసేన బలాబలాలు.. మొత్తం విమానాలు: భారతదేశం – 2,229 | పాకిస్తాన్ – 1,399యుద్ధ విమానాలు: భారతదేశం – 513 | పాకిస్తాన్ – 328ఎటాక్ హెలికాఫ్టర్లు : భారతదేశం – 80 | పాకిస్తాన్ – 57 పదాతిదళం బలాబలాలు :ట్యాంకులు: భారతదేశం – 4,201 | పాకిస్తాన్ – 2,627ఆర్మర్డ్ వెహికల్స్: భారతదేశం – 1,48,594 | పాకిస్తాన్ – 17,516మొబైల్ రాకెట్ వ్యవస్థలు: భారతదేశం – 264 | పాకిస్తాన్ – 600నావికాబలం :మొత్తం నేవీ స్థావరాలు.. కేంద్రాలు : 293 | పాకిస్తాన్ – 121ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు: భారతదేశం – 2 | పాకిస్తాన్ – 0జలాంతర్గాములు : భారతదేశం – 18 | పాకిస్తాన్ – 8డిస్ట్రాయర్స్: భారతదేశం – 13 | పాకిస్తాన్ – 0రక్షణ ఖర్చు:భారతదేశం: $75 బిలియన్పాకిస్తాన్: $7.64 బిలియన్ఇప్పుడు చెప్పండమ్మా.. ఎవరిది బలం.. ఎవరిది బలుపు.. గతంలో ఎన్నోసార్లు భారత్ మీదకు తెగబడి వారంరోజుల్లోనే చేతులెత్తేసి. మోకాళ్ళమీద నిలబడి శరణు వేడిన సందర్భాలు ఉన్నాయ్. బతికితే చాలు దేవుడా అంటూ పలాయనం చిత్తగించిన పాకీ సేనలు ఇప్పుడు మళ్ళీ ఏం చూసుకుని బోర్డర్లో సైనిక సన్నాహాలు చేస్తున్నాయో. తెగింపా.. తెంపరితనమా.. దేశంలో పరువుకాపాడుకునే క్రమంలో ఈ ఓవర్ యాక్టింగ్ అనివార్యమా.. ఏదైనా సరే.. భారత్ సేన ఒకసారి అడుగు ముందుకు వేస్తె అది పాక్ అంతు చూసేవరకూ ఆగేది లేదని భారత్ ప్రభుత్వం మరోసారి గట్టిగ్గా స్పష్టం చేసింది.- సిమ్మాద్రిప్పన్న

Attari Border Closure Rajasthan Mans Wedding With Pakistani Bride Halted9
Attari Border Closure : పెళ్లి ఆగిపోయింది!

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి పాకిస్తాన్‌, భారత్‌ దేశాల మధ్య ఉద్రికత్తకి దారి తీసింది. ఈ సంఘటన నేపథ్యంలో భారత ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంది. ముఖ్యంగా ఐదు అంశాల కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది.ఇందులో అట్టారి-వాఘా సరిహద్దును తక్షణమే మూసివేయడం. ఈ ఆంక్షల నేపథ్యంలో రాజస్థాన్‌కు చెందిన సైతాన్‌సింగ్‌ కలల వివాహం ఇప్పుడు నిరవధికంగా వాయిదా పడింది. సరిహద్దులు మూసివేయడంతో నిశ్చితార్థం దాకా వచ్చిన పెళ్లి నిలిచిపోయిందని ఆయన వాపోయాడు.రాజస్థాన్‌కు చెందిన సైతాన్‌సింగ్‌కు అట్టారీ సరిహద్దు దాటి పాకిస్థాన్‌లో ఉన్న యువతితో వివాహం నిశ్చయమైంది. పెళ్లికి ఇరు కుటుంబాలు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. వరుడి బంధువు చాలామంది ఇప్పటికే పాకిస్థాన్‌కు చేరుకున్నారు. ఇంతలోనే ఉగ్రవాదులు పహల్గాంలో మారణహోమం సృష్టించారు. 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత్‌ పాకిస్తాన్‌పై ఆంక్షలు విధించింది. సరిహద్దులను మూసి వేయడంతో వధువు ఇంటికి వెళ్లే అవకాశాలు మూసుకు పోయాయి. దీంతో సైతాన్‌సింగ్‌ ఏం చేయాలోఅర్థం కావడం లేదంటూANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాపోయారు.#WATCH | Shaitan Singh, a Rajasthan citizen, who was scheduled to cross the Amritsar's Attari border to enter Pakistan for his wedding today, says, " What the terrorists have done is wrong...We are not being allowed to go (to Pakistan) as the border is closed...Let us see what… pic.twitter.com/FEEuf1GxZG— ANI (@ANI) April 24, 2025"ఉగ్రవాదులు చేసింది తప్పు... సరిహద్దు మూసివేతో(పాకిస్తాన్‌కు) వెళ్లడానికి అనుమతించడం లేదు... ఇప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం." అన్నారు. అటు సైతాన్ సింగ్ సోదరుడు సురీందర్ సింగ్ కూడా మీడియాతో మాట్లాడుతూ, "పర్యాటకులపై (పహల్గామ్‌లో) జరిగిన దాడి చాలా తప్పు. దురదృష్టకర దాడి భారతదేశంలోని అనేక మంది అమాయక పౌరుల జీవితాలతో తమ కుటుంబాన్ని ప్రభావితం చేసిందన్నారు.ఇదీ చదవండి: రూ. 40 లక్షల నుంచి 20 కోట్లకు ఒక్కసారిగా జంప్‌, లగ్జరీ కారు : ఎవరీ నటుడు కాగా ఈ ఉగ్రదాడి తరువాత ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించిన ఇతర చర్యలలో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, పాకిస్తాన్ జాతీయులకు సార్క్ వీసా మినహాయింపు పథకాన్ని రద్దు చేయడం, పాకిస్తాన్ సైనిక సలహాదారులను బహిష్కరించడం , ఇస్లామాబాద్‌లో దౌత్య సిబ్బందిని తగ్గించడం ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. జమ్మూ-రాజౌరి-పూంచ్ జాతీయ రహదారిపై సైనిక నిఘా పెరిగింది, చెక్‌పోస్టుల వద్ద గట్టి నిఘా కొనసాగుతోంది.

Priyadarshi Latest Movie Sarangapani Jathakam Review In Telugu10
ప్రియదర్శి 'సారంగపాణి జాతకం'.. ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్వించాడా?

టైటిల్:‍ సారంగపాణి జాతకంనటీనటులు: ప్రియదర్శి, రూప కొడువాయూర్, వీకే నరేశ్, తనికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్, హర్ష చెముడు తదితరులుదర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటినిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్‌నిర్మాణ సంస్థ: శ్రీదేవి మూవీస్సినిమాటోగ్రఫీ: పీజీ విందాసంగీత దర్శకుడు: వివేక్ సాగర్ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్విడుదల తేదీ: ఏప్రిల్ 25, 2025ఇటీవలే కోర్ట్ మూవీతో సూపర్ హిట్‌ అందుకున్న ప్రియదర్శి మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు వచ్చారు. కోర్టు సక్సెస్‌ ఎంజాయ్‌ చేస్తుండగానే మరో మూవీ థియేటర్లలో పడిపోయింది. వరుస సినిమాలతో ఫుల్‌ స్పీడ్‌లో ప్రియదర్శి నటించిన తాజా చిత్రం సారంగపాణి జాతకం. ఈ ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ను టాలీవుడ్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించారు. ఇవాళ థియేటర్లలో విడుదలైన సారంగపాణి జాతకం ప్రేక్షకులను నవ్వించిందా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం.సారంగపాణి జాతకం కథేంటంటే..సారంగ(ప్రియదర్శి) ఓ కార్ల కంపెనీలో సేల్స్‌ మెన్. చిన్నప్పటి నుంచి యావరేజ్‌ మార్కులతో పాసైన సారంగకు ఆ జాబ్‌ సాధించడం గొప్పే అని సారంగ తల్లిదండ్రుల ఫీలింగ్. ముఖ్యంగా ఇదంతా మనోడి జాతకం తెగ నమ్మేస్తుంటారు. అలా చిన్నప్పటి నుంచి జాతకాలపై సారంగకు పూర్తి నమ్మకం ఏర్పడుతుంది. అయితే ‍అదే కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తోన్న మైథిలి(రూప కొడువాయూర్)తో మన సారంగకు లవ్‌ మొదలవుతుంది. ఆమెకు సారంగ ప్రపోజ్‌ చేద్దాం అనుకునేలోపే మైథిలినే ఊహించని సర్‌ప్రైజ్‌ ఇస్తుంది. అలా ఇద్దరి మధ్య లవ్‌ ట్రాక్‌ మొదలై చివరికీ పెళ్లి వరకు తీసుకెళ్తుంది. అంతా ఓకే అనుకుంటుండగానే సారంగకు చేతి రేఖలు చూసి భవిష్యత్తును డిసైడ్ చేసే జిగ్గేశ్వర్(అవసరాల శ్రీనివాస్‌)ను అనుకోకుండా కలుస్తాడు. ఆయన చేతిరేఖల జాతకంలో ఫేమస్ కావడంతో అతని వద్దకు సారంగ వెళ్తాడు. ఆ తర్వాత సారంగ చేయి చూసిన జిగ్గేశ్వర్ (అవసరాల శ్రీనివాస్) చేతి రేఖలు చూసి అతని జాతకంలో ఉన్న ఓ షాకింగ్‌ విషయం చెప్తాడు. ముందు నుంచి జాతకాలు తెగ నమ్మే సారంగ ఆ విషయం తెలుసుకుని తెగ బాధపడిపోతుంటాడు. ఆ పని పూర్తయ్యాకే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ విషయంలో తన ఫ్రెండ్‌ చందు(వెన్నెల కిశోర్) సాయం కోరతాడు. ఇద్దరు కలిసి సారంగ జాతకం ప్రకారం ఆ పని కోసం తమ మాస్టర్‌ మైండ్స్‌తో స్కెచ్‌ వేస్తారు. మరి అది వర్కవుట్ అయిందా? అసలు సారంగ జాతకంలో ఉన్న ఆ షాకింగ్ విషయం ఏంటి? దాని కోసం చందుతో కలిసి వేసిన ప్లాన్స్‌ సక్సెస్ అయ్యాయా? చివరికీ సారంగ.. తన ప్రియురాలు మైథిలిని పెళ్లి చేసుకున్నాడా? అనేది తెలియాలంటే సారంగపాణి జాతకం చూడాల్సిందే.ఎలా ఉందంటే..సాధారణంగా మనదేశంలో జాతకాలంటే జనాలకు ఎంత పిచ్చో అందరికీ తెలిసిందే. మన గ్రామాల్లో అయితే ఇలాంటివీ విపరీతంగా నమ్మేస్తుంటారు. అలా జాతకాలను తెగ నమ్మేసే ఓ యువకుడి స్టోరీనే మన ముందుకు తీసుకొచ్చారు మోహనకృష్ణ ఇంద్రగంటి. చేతి రేఖల జాతకం అనే కాన్సెప్ట్‌తో తీసుకొచ్చిన ఈ కథ ఆడియన్స్‌కు వివరించే విషయంలో డైరెక్టర్‌ సక్సెస్ అయ్యారు. ప్రేక్షకులను నవ్వించేందుకు జాతకం అనే కాన్సెప్ట్‌ను ఎంచుకోవడం ఈ సినిమాకు ప్లస్‌ పాయింట్. అలా ఫస్ట్ హాఫ్‌లో లవ్‌, కామెడీతో ఇంద్రగంటి కట్టిపడేశారు. ప్రతి సీన్‌లో పంచ్‌లు, ప్రాసలు, అక్కడక్కడ అడల్డ్‌ జోక్స్‌తో ప్రేక్షకున్ని నాన్‌స్టాప్‌గా నవ్వించేశారు డైరెక్టర్‌. తన జాతకం ప్రకారం జరగాల్సిన ఆ పనిని ముందే చేస్తే ఎలా ఉంటుంది? ఆ పని కోసం హీరో(సారంగ) ప్లాన్స్‌ చూస్తే థియేటర్లలో నవ్వుకోని వాళ్లు ఉండరేమో? అలా ఫస్ట్ హాఫ్‌లోనే తన కామెడీ పంచ్‌లతో సగటు ప్రేక్షకున్ని సీట్ నుంచి కదలకుండా చేసేశాడు. సరదాగా వెళ్తున్న కథలో ఓ సీరియస్‌నెస్ తెప్పించే ట్విస్ట్‌ ఇ‍చ్చిన ఇంద్రగంటి ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ పడేశాడు. ఫస్ట్‌ హాఫ్‌తోనే ప్రేక్షకులను తెగ నవ్వించేసిన డైరెక్టర్‌.. సెకండాఫ్‌లో కొత్త పాత్రలతో కథను మరింత ఇంట్రెస్టింగ్‌గా మార్చేశాడు. కొత్త క్యారెక్టర్స్‌తో ఎక్కడా బోర్‌ కొట్టకుండా కామెడీని మరో రేంజ్‌కు తీసుకెళ్లాడు. హర్ష చెముడు, ప్రియదర్శి, వెన్నెల కిశోర్ చేసే కామెడీ ఆడియన్స్‌కు హిలేరియస్‌గా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో కథ మొత్తం ఓ హోటల్‌ చుట్టే ప్లాన్‌ చేశాడు డైరెక్టర్. హోటల్‌లో జరిగే సన్నివేశాలు ప్రేక్షకుల ఉహకందేలా ఉన్నప్పటికీ కామెడీతో ప్రేక్షకుడిని కట్టిపడేయడంలో ఇంద్రగంటి ఫుల్ సక్సెస్ అయ్యారు. సెకండాఫ్‌లో తనికెళ్ల భరణి(అహోబిలం రావు) ఎంట్రీతో ఆడియన్స్‌లో మరింత ఆసక్తి పెంచేశాడు. కథలో ఊహించని ట్విస్ట్‌లతో ఎక్కడా కూడా ప్రేక్షకుడికి బోరింగ్‌ అనే పదం గుర్తు రాకుండా చేశాడు దర్శకుడు. జాతకం అనే కాన్సెప్ట్‌తో ఇంద్రగంటి చేసిన కామెడీ.. రోటీన్‌ కంటే భిన్నంగా ఉందని సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు ఫీలవుతాడు. క్లైమాక్స్‌లో వచ్చే ఓ సీరియస్‌ సీన్‌లోనూ నవ్వులు పూయించడం ఆయనకే సాధ్యమైంది. సందర్భాన్ని బట్టి అక్కడక్కడా కొన్ని అభ్యంతరకర పదాలు వాడినప్పటికీ.. కామెడీ ఎంటర్‌టైనర్‌గా కావడంతో ప్రేక్షకులు అంతగా ఇబ్బందే పడే లా అయితే లేవు. ఓవరాల్‌గా జాతకం అనే కాన్సెప్ట్‌తో డైరెక్టర్‌ చేసిన కామెడీ తీరు ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా ఉందనడంలో సందేహం లేదు. ఎవరైనా ఫ్యామిలీతో కలిసి కడుపుబ్బా నవ్వాలనుకుంటే మీరు కూడా సారంగపాణి జాతకంపై ఓ లుక్కేయండి.ఎవరెలా చేశారంటే..ప్రియదర్శి నటన, కామెడీ టైమింగ్‌తో మరోసారి అదరగొట్టేశాడు. మిస్టర్‌ ప్రెగ్నెట్‌ హీరోయిన్‌ రూప మరోసారి తన అందం, నటనతో మరోసారి ప్రేక్షకులను కట్టిపడేసింది. వెన్నెల కిశోర్, అవసరాస శ్రీనివాస్, హర్ష చెముడు, వీకే నరేశ్, తనికెళ్ల భరణి తమ పాత్రల్లో ఆడియన్స్‌ను అలరించారు. సాంకేతికత విషయానికొస్తే పీజీ విందా సినిమాటోగ్రఫీ బాగుంది. మార్తాండ్ కె వెంకటేశ్‌ ఎడిటింగ్‌ ఫర్వాలేదు. కొన్ని సీన్స్‌ మరింత క్రిస్పీగా కట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. వివేక్ సాగర్ నేపథ్యం సంగీతం ఆకట్టుకునేలా ఉంది. నిర్మాణ విలువలు శ్రీదేవి మూవీస్‌ సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement