Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

PM Narendra Modi Govt Fires On Pakistan For Pahalgam Terror Attack1
పాక్‌కు ‘పంచ్‌’.. ఆ దేశ పౌరులకు వీసాలు రద్దు

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం వద్ద పర్యాటకులపై మంగళవారం ఉగ్ర ముష్కరులు జరిపిన ఆటవిక దాడిని భారత్‌ అత్యంత తీవ్రంగా పరిగణించింది. దీని వెనక పాకిస్తాన్‌ హస్తం స్పష్టంగా కనిపిస్తోందంటూ మండిపడింది. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాదిపై కఠిన చర్యలకు దిగింది. పాకిస్తాన్‌ పౌరులకు భారత్‌లోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతేగాక పాక్‌తో దౌత్య సంబంధాలకు చాలావరకు కత్తెర వేసింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో సమా వేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఈ మేరకు ఐదు కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధూ నదీ జలాల ఒప్పందం సస్పెన్షన్, అటారీ సరిహద్దు మూసివేత, దౌత్య సిబ్బంది తగ్గింపు తదితరాలు వీటిలో ఉన్నాయి. దీంతో పాక్‌తో ఇప్పటికే క్షీణించిన దౌత్య సంబంధాలు మరింత అట్టడుగుకు దిగజారాయి. ఈ చర్యలతోనే సరిపెట్టకుండా ఉగ్ర ముష్కరులకు, వారిని ప్రేరేపిస్తున్న పొరుగు దేశానికి దీటుగా బదులిచ్చేందుకు కూడా కేంద్రం సమాయత్తమవుతోంది. ఆ దిశగా చేపట్టాల్సిన చర్యలపై సీసీఎస్‌ భేటీలో రెండున్నర గంటలకు పైగా లోతుగా చర్చ జరిగింది. విమానాశ్రయంలోనే మోదీ సమీక్ష మంగళవారం రాత్రి సౌదీ అరేబియా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని వెనుదిరిగిన ప్రధాని మోదీ బుధవారం తెల్లవారుజామున ఢిల్లీ చేరుకున్నారు. విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీతో విమానాశ్రయంలోనే సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. పలు అంశాలపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం సాయంత్రం ఆరింటికి మోదీ సారథ్యంలో సీసీఎస్‌ అత్యవసరంగా సమావేశమైంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, జైశంకర్, దోవల్, కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి టీవీ సోమనాథన్, రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్‌కుమార్‌ సింగ్, విక్రం మిస్రీ, ప్రధాని ముఖ్య కార్యదర్శులు పీకే మిశ్రా, శక్తికాంత దాస్, అత్యున్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు. సీసీఎస్‌ సభ్యురాలైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అమెరికా పర్యటనలో ఉండటంతో హాజరు కాలేదు. దాడిపై ప్రతిస్పందన ఎలా ఉండాలన్నదే ప్రధాన అజెండాగా భేటీ జరిగింది. దాడి జరిగిన తీరు తదితరాలను అమిత్‌ షా వివరించారు. 25 మంది భారతీయులు, ఒక నేపాల్‌ జాతీయుడు మృతి చెందినట్టు చెప్పారు. శిక్షించి తీరతాం: మిస్రీ పహల్గాం దాడిని సీసీఎస్‌ అత్యంత తీవ్రంగా ఖండించినట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ తెలిపారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. దాడికి తెగబడ్డ ముష్కరులతో పాటు దాని సూత్రధారులను కూడా కఠినంగా శిక్షించి తీరాలని సీసీఎస్‌ తీర్మానించింది’’ అని వెల్లడించారు. ముంబై దాడుల సూత్రధారుల్లో ఒకడైన తహవ్వుర్‌ రాణా మాదిరిగానే వారిని కూడా చట్టం ముందు నిలబెట్టడం ప్రకటించారు. ‘‘జమ్మూ కశ్మీర్‌లో విజయవంతంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగి, ఆ ప్రాంతమంతా ఆర్థికాభివృద్ధితో కళకళలాడుతున్న వేళ పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన కుట్రపూరిత దాడి ఇది. దాని వెనక దాగున్న సీమాంతర లింకులపై సీసీఎస్‌ లోతుగా చర్చించింది. ప్రపంచ దేశాలన్నీ దాన్ని అత్యంత తీవ్ర పదజాలంతో ఖండించిన తీరును ప్రశంసించింది. ఉగ్రవాదంపై రాజీలేని పోరులో భారత్‌కు ఆ దేశాల మద్దతుకు ఇది ప్రతీక అని పేర్కొంది. పాక్‌పై తీసుకున్న చర్యల జాబితాను చదివి వినిపించారు. పాక్‌పై చర్యలివే... – సార్క్‌ వీసా మినహాయింపు పథకం (ఎస్‌వీఈఎస్‌) కింద పాక్‌ జాతీయులకు భారత వీసాల జారీ నిలిపివేత. ఇప్పటికే జారీ చేసిన వీసాల రద్దు. వాటిపై ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న పాకిస్తానీలు 48 గంటల్లో దేశం వీడాలని ఆదేశం. – ఉగ్రవాదానికి పాక్‌ మద్దతివ్వడం మానుకునేదాకా 1960లో కుదుర్చుకున్న సింధు నదీ జలాల ఒప్పందం సస్పెన్షన్‌. – భారత్, పాక్‌ మధ్య రాకపోకలు జరుగుతున్న పంజాబ్‌లోని అటారీ సరిహద్దు తక్షణం మూసివేత. దానిగుండా పాక్‌కు వెళ్లినవారు తిరిగొచ్చేందుకు మే 1 దాకా గడువు. – ఢిల్లీలోని పాక్‌ హై కమిషన్‌ నుంచి రక్షణ, త్రివిధ దళాల సలహాదారు, వారి ఐదుగురు సహాయక సిబ్బంది బహిష్కరణ. వారంలోపు భారత్‌ వీడాలని ఆదేశం. ఇస్లామాబాద్‌లోని భారత హై కమిషన్‌ నుంచి భారత రక్షణ, త్రివిధ దళాల సలహాదారుల ఉపసంహరణ. – ఇరుదేశాల హై కమిషన్లలో సిబ్బంది సంఖ్య 55 నుంచి 30కి తగ్గింపు.

YSRCP Candlelight Rally In Protest Against Pahalgam Terror Attack2
పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా వైఎస్సార్‌సీపీ శాంతి ర్యాలీ

సాక్షి, తాడేపల్లి: పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన శాంతి ర్యాలీ తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రారంభమైంది. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ చేస్తున్నారు. పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణమూర్తి, అధికార ప్రతినిధులు కారుమూరి వెంకటరెడ్డి, శివశంకర్, మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎన్.చంద్రశేఖర్ రెడ్డి, మంగళగిరి ఇన్‌ఛార్జి వేమారెడ్డి, అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, పహల్గాం ఘటన పిరికిపంద చర్య అని.. ఇలాంటి దాడులతో భారతీయ స్ఫూర్తిని చెదరగొట్టలేరన్నారు. వైఎస్ జగన్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీలు నిర్వహించామని సజ్జల పేర్కొన్నారు. ‘‘మా ఉక్కు సంకల్పాన్ని కొనసాగిస్తాం. మృతుల కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ తరపున సానుభూతి తెలియజేస్తున్నాం.. అందరం సంఘటితంగా నిలపడాల్సిన సమయం ఇది’’ అని సజ్జల చెప్పారు.కశ్మీర్‌లోని పహల్గామ్‌లో టూరిస్టులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ వైఎస్సార్‌సీపీ.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాండిల్‌ ర్యాలీలు చేపట్టింది. ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్యాండిల్ ర్యాలీలు నిర్వహించాలని పార్టీ నాయకులకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఉగ్రవాదుల దాడిని అమానుష చర్యగా పేర్కొన్న వైఎస్‌ జగన్‌.. దేశం అంతా ఒక్కతాటిపై నిలవాలన్నారు. పహల్గాం ఘటనలో పలువురు మరణించండం అత్యంత బాధాకరమన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఏపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించడం అత్యంత బాధాకరమన్నారు. విజయవాడ నగరంలో..పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా వైఎస్సార్‌సీపీ నేతలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కార్పొరేటర్లు, వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఉగ్ర దాడిలో పర్యాటకులు మృతి చెందడం విచారకరమన్నారు. ఉగ్రదాడిలో ఏపీకి చెందిన ఇద్దరు మరణించారని.. వారి కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఉగ్ర వాదంపై కేంద్రం కఠినంగా వ్యవహరించాలన్నారు.తూర్పుగోదావరి జిల్లాలో..పహల్గాం జరిగిన ఉగ్ర దాడిని నిరసిస్తూ రాజమండ్రిలో వైఎస్సార్‌సీపీ నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వైఎస్‌ జగన్‌ పిలుపు మేరకు భారీ శాంతి ర్యాలీ చేపట్టారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని, ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాలని వైఎస్సార్‌సీపీ నేతలు నినదించారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రులు తానేటి వనిత, వేణుగోపాలకృష్ణ, మాజీ ఎంపీ మార్గాన్ని భరత్, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, వెంకటరావు, డాక్టర్ గూడూరు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.అనంతపురం జిల్లాలో..అనంతపురం జిల్లా: జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకులపై ఉగ్రవాదుల దుశ్చర్యకు నిరసనగా అనంతపురంలో వైఎస్సార్‌సీపీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. అనంతపురంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి సప్తగిరి సర్కిల్ దాకా నిరసన ప్రదర్శన చేపట్టింది. ఉగ్రవాదులపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని.. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నేతలు డిమాండ్ చేశారు.వైఎస్సార్‌ జిల్లాలో..జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్ర దాడులకు నిరసనగా కడపలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసింది. దుశ్చర్యకు పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలన్నారు. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.తిరుపతిలో..జమ్మూకశ్మీర్‌ పహల్గాం ఘటనకు నిరసనగా వైఎస్సార్‌సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. పద్మావతిపురంలో భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ చేపట్టింది. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిని ఖండిస్తున్నాం. ఉగ్రవాదులను సమూలంగా ఏరివేయాలని భూమన అన్నారు.విశాఖలో.. కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి వైఎస్సార్‌ పార్కు వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ.. ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని.. ఈ ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలన్నారు. అమాయకులైన ప్రజల ప్రాణాలను తీసుకోవడం ఉన్మాద చర్యగా ఆయన అభివర్ణించారు. 145 కోట్ల భారతీయులు ఏకతాటిపైకి రావాలని.. తీవ్రవాదం ఏ రూపంలో ఉన్న మట్టు పెట్టాలన్నారు. బాధితులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉండాలన్నారు.

Congress Party Key Decision For Party Posts In Telangana3
65 దాటితే 'నో' పదవి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) పూర్తి స్థాయిలో ప్రక్షాళన కానుంది. రాష్ట్ర కార్యవర్గం నుంచి జిల్లా, బ్లాక్, మండల, గ్రామ స్థాయిల్లోని అన్ని పార్టీ పదవుల్లో కొత్త వారిని నియమించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఇందుకోసం మూడు దశల్లో సమావేశాలు నిర్వహించి, అభిప్రాయసేకరణ ద్వారా సంస్థాగత నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించింది. పార్టీ పదవుల నియామకంలో కొన్ని షరతులను కూడా ఖరారు చేసింది. 65 ఏళ్లు దాటినవారికి బ్లాక్, మండల, గ్రామ స్థాయి అధ్యక్ష పదవులు ఇవ్వరాదని, ఆ పదవుల్లో యువకులను నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం గాంధీభవన్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పార్టీ పరిశీలకుల సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ దిశానిర్దేశం చేశారు. ఇదీ షెడ్యూల్‌..: ⇒ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి 35 జిల్లా యూనిట్లు ఉన్నాయి. ప్రతి జిల్లాకు ఇద్దరు చొప్పున 70 మందిని పార్టీ పరిశీల కులుగా నియమించారు. వీరు ఈ నెల 25 నుంచి 30వ తేదీవరకు ఆయా జిల్లాల్లో జిల్లాస్థాయి సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. ⇒ బ్లాక్, మండల అధ్యక్ష పదవుల కోసం పేర్లను పీసీసీ ఇచ్చిన ఫార్మాట్‌లో సేకరించాలి. జిల్లా అధ్యక్ష పదవుల కోసం 5, బ్లాక్‌ అధ్యక్షుల కోసం 3, మండల అధ్యక్షుల కోసం 5 పేర్లను ప్రతిపాదించాల్సి ఉంటుంది. ⇒ మే 3 నుంచి 10 వరకు మరోమారు సమావేశం నిర్వహించి సంవిధాన్‌ బచావో సభలను నిర్వహించాలి. మే 4 నుంచి 10 వరకు ఆయా జిల్లాల్లో అసెంబ్లీ/బ్లాక్‌ స్థాయి నేతల సమావేశం నిర్వహించాలి. బ్లాక్, మండల కమిటీల ఆఫీస్‌ బేరర్లు, కార్యవర్గం పేర్లను సేకరించాల్సి ఉంటుంది. ⇒ మే 13 నుంచి 20 వరకు మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి గ్రామ కమిటీల కోసం పేర్లను సేకరించాలి. గ్రామ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి కూడా ఐదు పేర్లను తీసుకోవాల్సి ఉంటుంది. ⇒ మూడు దశల సమావేశాల అనంతరం బ్లాక్, మండల, గ్రామ స్థాయి కమిటీల ప్రతిపాదనలతో కూడిన నివేదికను పీసీసీకి సమర్పించాలి. ⇒ ఈ కమిటీల్లో ఖచ్చితంగా ఎస్సీలు, ఎస్టీలు, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని, పదేళ్ల కంటే ఎక్కువ కాలం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారికి అవకాశం కల్పించాలని మీనాక్షి నటరాజన్‌ స్పష్టం చేశారు. ఎవరికి ఏ పదవి ఎందుకు ఇవ్వాలనే అంశాలను కూడా నివేదికలో పేర్కొనాలని ఆమె ఆదేశించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో గుజరాత్‌ పీసీసీ విధానాన్ని మోడల్‌గా తీసుకోవాల సూచించారు. పరిశీలకుల హోదాలో పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేసే బాధ్యతలు చాలా కీలకమైనవని, ఈ బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కోరారు.లేటుగా వచ్చినవారు ఇంటికే.. పరిశీలకుల సమావేశానికి ఆలస్యంగా వచ్చినవారిని బాధ్యతల నుంచి తొలగించాలని మీనాక్షి నటరాజన్‌ ఆదేశించారు. బుధవారం గాంధీభవన్‌లో జరిగిన సమావేశానికి కొందరు పరిశీలకులు అరగంట ఆలస్యంగా వచ్చారు. మరికొందరు రాలేదు. మొత్తం 70 మంది రావాల్సి ఉండగా, 58 మంది హాజరయ్యారు. దీంతో ఆలస్యంగా వచ్చిన వారు, సమావేశానికి రాని వారిని మీనాక్షి ఆదేశాల మేరకు పరిశీలకుల బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు మహేశ్‌కుమార్‌గౌడ్‌ సమావేశంలోనే ప్రకటించారు. పరిశీలకులుగా ఆరుగురు మాత్రమే మహిళలను నియమించడంతో ఇంకా మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచాలని మీనాక్షి సూచించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, విష్ణునాథ్, సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచందర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.

Pahalgam Attack  April 23rd Latest updates4
పహల్గాం ఉగ్రదాడి: జమ్ములో 56 మంది విదేశీ ఉగ్రవాదులు

పహల్గాం ఉగ్రదాడి.. కేంద్రం సీరియస్‌.. అప్‌డేట్స్‌భారత్‌లో ఉన్న పాక్‌ పౌరులు వెంటనే వెళ్లిపోవాలి: విక్రమ్‌ మిస్రీవిదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ మీడియా సమావేశంపాక్‌ పౌరులను భారత్‌లోకి అనుమతించేది లేదుపహల్గాం దాడివెనుక పాక్‌ హస్తం ఉందిమా దగ్గర పూర్తి ఆధారాలున్నాయిఉగ్రదాడిని తీవ్రంగా పరిగణిస్తున్నాంఇండస్‌ వాటర్‌ ఒప్పందాన్ని నిలిపేస్తున్నాంఅటారీ-వాఘా సరిహద్దు చెక్‌పోస్టును మూసివేస్తున్నాంపాక్ తీవ్రవాద స్థావరాలపై భారత్ దాడికి దిగే అవకాశం?“పాక్ ఆక్రమిత్ కాశ్మీర్” (పిఓకే) లో పాక్ తీవ్రవాద స్థావరాలపై భారత్ దాడికి దిగే అవకాశం?“పాక్ ఆక్రమిత కాశ్మీర్” లో 110 నుంచి 125 మంది క్రియాశీలకంగా ఉన్న తీవ్రవాదులుసుమారు 42 “లాంచ్ పాడ్స్” (తీవ్రవాద స్థావరాలు) క్రియాశీలకంగా ఉన్నట్లు సమాచారంఉత్తర కాశ్మీర్ లో క్రియాశీలకంగా ఉన్న 35 మంది తీవ్రవాదులుజమ్మూలో కూడా క్రియాశీలకంగా ఉన్న సుమారు 100 మంది తీవ్రవాదులు. పహల్గాం ఉగ్రదాడిపై ప్రధాని సీరియస్‌సౌదీ పర్యటన కుదించుకుని వచ్చేసిన ప్రధాని మోదీపాక్‌ గగనతలంలోకి వెళ్లకుండా మరో మార్గంలో ప్రయాణం. ఫ్లైట్‌ ట్రాకింగ్‌ వెబ్‌సైట్‌లో ఉన్న దృశ్యాలతో వెల్లడైన విషయం పాక్‌ నుంచి ముప్పు ఉండొచ్చనే అనుమానాల నడుమ దారి మళ్లింపు ఎయిర్‌ పోర్టులోనే కీలక సమావేశం నిర్వహణకేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌తో భేటీప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ భేటీ మరికాసేపట్లో ఉగ్రదాడిలో నేవీ అధికారి మృతి.. కలచివేస్తోన్న నవవధువు కన్నీటి వీడ్కోలు పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన నేవీ అధికారి వినయ్ నర్వాల్‌ వారం క్రితం వివాహం చేసుకుని భార్యతో కలిసి హనీమూన్‌కి వచ్చిన అధికారి ఉగ్రదాడిలో మృతి చెందిన ఆయనకు ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు కలచి వేస్తోన్న నవ వధువు రోదన Indian Navy Lieutenant Vinay Narwal's wife bids an emotional farewell to her husband, who was killed in the #Pahalgam terror attackThe couple got married on April 16. 💔💔 pic.twitter.com/a83lpg3A40— Venisha G Kiba (@KibaVenisha) April 23, 2025జమ్ములో అత్యధికంగా ఎల్‌ఈటీ ఉగ్రవాదులు! జమ్ము కశ్మీర్‌లో 56 మంది విదేశీ ఉగ్రవాదులు అత్యధికంగా లష్కరే తాయిబా(LeT) సభ్యులు ఉన్నారన్న నిఘా వర్షాలు పహల్గాం దాడులు తమ పనేనని ప్రకటించుకున్న ఎల్‌ఈటీ విభాగం అసిఫ్‌ ఫౌజీ, సులేమాన్‌ షా, అబు తల్హా గుర్తింపు ప్రధాన సూత్రధారి సైఫుల్లా సాజిద్‌? ముజాహిదీలు కశ్మీర్‌లో దాడి చేస్తారని తరచూ ప్రకటించిన సాజిద్‌ సాయంత్రం కేబినెట్‌ కీలక సమావేశంపహల్గాం నుంచి ఢిల్లీకి బయల్దేరిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాసాయంత్రం ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్‌ సమావేశంకేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం పహల్గాం ఘటనకు దీటుగా జవాబిస్తాం: రాజ్‌నాథ్‌ సింగ్‌ పహల్గాం ఉగ్రదాడి ఘటనపై మీడియాతో మాట్లాడిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పిరికిపంద చర్యగా అభివర్ణించిన రాజ్‌నాథ్‌ ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు : రాజ్‌నాథ్‌ఉగ్రవాదాన్ని తుదిముట్టించాలనేది భారత్‌ విధానం : రాజ్‌నాథ్‌ఉగ్రదాడికి పాల్పడిన దోషులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోం.: రాజ్‌నాథ్‌పహల్గామ్‌ ఘటనకు దీటుగా జవాబిస్తాం: రాజ్‌నాథ్‌#WATCH | #PahalgamTerrorAttack | Delhi: Raksha Mantri Rajnath Singh says, "Yesterday, in Pahalgam, targeting a particular religion, terrorists executed a cowardly act, in which we lost many innocent lives... I want to assure the countrymen that the government will take every… pic.twitter.com/VhNHD0kO2E— ANI (@ANI) April 23, 2025 ఉగ్ర రక్కసిపై గళమెత్తిన కశ్మీర్‌.. ఆరేళ్లలో తొలిసారి బంద్‌! పహల్గాం దాడిని ఖండిస్తూ వీధుల్లోకి వచ్చిన జనం శ్రీనగర్‌ సహా కశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో స్వచ్ఛందంగా బంద్‌ గతంలో సర్వసాధారణంగా ఉండగా.. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో తొలిసారి బంద్‌ ఉగ్రదాడి.. పాకిస్థాన్‌ హైకమిషన్‌ వద్ద భద్రత కట్టుదిట్టం పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం పాకిస్థాన్‌ హైకమిషన్‌ వద్ద గట్టి సెక్యూరిటీ పక్షపాత రాజకీయాలకు ఇది సమయం కాదు: ఖర్గే పహల్గాం ఉగ్రదాడి మన దేశ ఐక్యత, సమగ్రతపై ప్రత్యక్ష దాడిగా పేర్కొన్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించివేసేందుకు కేంద్రంతో సహకరించేందుకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని ట్వీట్‌ జమ్మును వీడుతున్న పర్యాటకులుపహల్గాం దాడి నేపథ్యంలో జమ్ము కశ్మీర్‌ను వీడుతున్న పర్యాటకులుఉదయం నుంచి 20 విమానాల్లో పైగా తిరుగు ప్రయాణం కిక్కిరిసిపోతున్న రైల్వే స్టేషన్లుకాట్రా నుంచి ప్ర త్యేక రైళ్లుఆరు గంటల్లో కశ్మీర్‌ను వీడిన 3,300 మంది పర్యాటకులుపర్యాటకులు వీడుతుండడంపై ఆవేదన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లాIt’s heartbreaking to see the exodus of our guests from the valley after yesterday’s tragic terror attack in Pahalgam but at the same time we totally understand why people would want to leave. While DGCA & the Ministry of Civil Aviation are working to organise extra flights,… pic.twitter.com/5O3i5U1rBh— Omar Abdullah (@OmarAbdullah) April 23, 2025 భద్రతా బలగాల అదుపులో పలువురు అనుమానితులు ఉగ్రవాదుల్లో ఇద్దరు కశ్మీరీలే!పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల గుర్తింపుఇద్దరు కశ్మీరీలేనని అనుమానిస్తున్న భద్రతా ఏజెన్సీలు2018లో కశ్మీర్‌ను వదిలి పాక్‌ వెళ్లిపోయిన అదిల్‌ గురి, అషన్‌ఇటీవలే మరో నలుగురితో కలిసి కశ్మీర్‌లో చొరబడినట్లు అనుమానంఅదిల్‌, అషన్‌ గురించి సమాచారం సేకరిస్తున్న భద్రతా బలగాలుపాక్‌ మద్దతుదారుల నుంచి వీళ్లకు మందు గుండు సామాగ్రి, ఏకే 47లునిల్వ ఆహారం, డ్రైఫూట్స్‌ ఉంచుకున్నట్లు అనుమానాలుమతాలవారీగా టూరిస్టులను వేరు చేసిన ఉగ్రవాదులుపాయింట్‌ బ్లాక్‌ రేంజ్‌లో టూరిస్టులను కాల్చేసిన టెర్రరిస్టులుహెల్మెట్‌ మౌంటెడ్‌ బాడీ కేమ్‌లతో రికార్డు చేసి పాక్‌కు చేరవేసి ఉండొచ్చనే అనుమానాలు పాక్‌ కవ్వింపు చర్యలుపాక్‌ దొంగ నాటకాలుపహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌ కవ్వింపు చర్యలుసరిహద్దు వెంట భారీగా సైన్యం మోహరింపుకశ్మీర్‌ సరిహద్దులకు యుద్ధ విమానాల తరలింపుకరాచీ నుంచి లాహోర్‌, రాల్పిండికి యుద్ధ విమానాలుపహల్గాం దాడితో తమకేం సంబంధం లేదని ప్రకటించిన పాక్‌ ప్రభుత్వందాడి ఘటనను ఖండిస్తూ.. మరణించినవారి కుటుంబాలకు సానుభూతి ప్రకటనమమ్మల్ని నిందించొద్దు అంటూ పాక్‌ రక్షణ మంత్రి వ్యాఖ్యలుభారత్‌లో పలు రాష్ట్రాల్లో గొడవలు జరుగుతున్నాయని.. అంతర్గత తిరుగుబాటులే పహల్గాం దాడికి కారణమంటూ ప్రకటనఉగ్రవాదులకు సాయం చేసింది పాక్‌ ఐఎస్‌ఐనే పరిహారం ప్రకటించిన జమ్ము ప్రభుత్వంపహల్గాం ఉగ్రదాడి బాధితులకు పరిహారం ప్రకటించిన జమ్ము కశ్మీర్‌ ‍ప్రభుత్వంమృతులకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడినవాళ్లకు రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వాళ్లకు రూ.1 లక్షదాడికి నిరసనగా కశ్మీర్‌ బంద్‌కు పిలుపు ఇచ్చిన ప్రజా సంఘాలు పహల్గాం ఊచకోతను ఖండిస్తూ సుప్రీం కోర్టు ఏకగ్రీవ తీర్మానంపహల్గాం ఉగ్రఘటన.. సుప్రీం కోర్టు న్యాయమూర్తుల నివాళి మతిలేని చర్యగా అభివర్ణించిన సర్వోన్నత న్యాయస్థానంఉగ్రదాడి మృతులకు సంతాపంగా మౌనం పాటించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది ఈ దారుణ ఘటనను ఖండించిన సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ ఉగ్రవాదుల ఏరివేతకు కేంద్రం ఆపరేషన్‌?కశ్మీర్‌, పీవోకేలో ఉగ్రవాదుల ఏరివేతకు కేంద్రం ఆపరేషన్‌?ప్రధాని మోదీ, రక్షణ మంత్రి వరుస సమావేశాలుహోం మంత్రి అమిత్‌ షా క్షేత్రస్థాయి పర్యటనకశ్మీర్‌ పరిస్థితులను ప్రధాని మోదీకి వివరించిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో త్రివిధ దళాధిపతుల సమావేశంకేంద్రం ఆదేశాల అమలుకు సిద్ధమంటున్న త్రివిధ దళాధిపతులుపహల్గాం ఉగ్రదాడి ప్రధానాంశంగా.. సాయంత్రం కేంద్ర కేబినెట్‌ సమావేశంసమావేశం అనంతరం కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం పహల్గాంలో కూంబింగ్‌పహల్గాంలో కొనసాగుతున్న కూబింగ్‌ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న వేటఒకవైపు.. క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న బలగాలుమరోవైపు డ్రోన్‌ల సాయంతో కొనసాగుతున్న గాలింపుఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదలపహల్గాం దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదలముగ్గురి చిత్రాలను విడుదల చేసిన కేంద్రంఅందులో అసిఫ్‌ అనే ఉగ్రవాదిబాడీ క్యామ్‌ ధరించి దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులుమొత్తం ఏడుగురు దాడికి పాల్పడినట్లు చెబుతున్న ప్రత్యక్ష సాక్షులుకానీ, దాడికి పాల్పడింది ముగ్గురి నుంచి నలుగురే?దాడులకు పాల్పడింది తామేనంటూ ప్రకటించిన లష్కరే తోయిబా విభాగం ది రెసిస్టెంట్‌ ఫ్రంట్‌ పహల్గాం దాడిపై కేంద్రం సీరియస్‌రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశంప్రస్తుత పరిస్థితిని వివరించిన త్రివిధ దళాధిపతులుప్రతిచర్యకు సిద్ధమని ప్రకటనసాయంత్రం ఆరు గంటలకు కేబినెట్‌ కీలక సమావేశంమరోవైపు భద్రతా ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ భేటీ పలు నగరాల్లో హైఅలర్ట్‌దేశవ్యాప్తంగా పలు నగరాల్లో హైఅలర్ట్‌ క​శ్మీర్‌ పహల్గాం దాడితో అప్రమత్తమైన కేంద్రంఢిల్లీ, ముంబై సహా పలు నగరాలకు భద్రతాపరమైన హెచ్చరికలు జారీ చేసిన హోం శాఖ బైసరన్‌కు అమిత్‌ షాపహల్గాం బైసరన్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకాల్పులు జరిపిన ప్రాంతంలో పర్యటించిన షాప్రతి చర్య తప్పదని, ఉగ్రవాదులపై కఠిన చర్యలు ఉంటాయని బాధిత కుటుంబాలకు హోం మంత్రి హామీ నేటి ఐపీఎల్‌ మ్యాచ్‌లో సంఘీభావంపహల్గాం ఉగ్రదాడికి సంఘీభావం తెలుపుతున్న ప్రముఖులుఐపీఎల్‌ క్రికెటర్ల సంఘీభావంఇవాళ హైదరాబాద్‌ ఉప్పల్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌దాడికి సంఘీభావంగా నల్ల బ్యాడ్జీలు ధరించనున్న ప్లేయర్స్‌ఒక నిమిషం మౌనం పాటించనున్న ఆటగాళ్లుచీర్‌గర్ల్స్‌ ఉండబోరని ప్రకటించిన బీసీసీఐ రంగంలోకి ఎన్‌ఐఏపహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో రంగంలోకి దిగిన జాతీయ దర్యాప్తు సంస్థ బృందంహోటల్స్‌, లాడ్జిలను జల్లెడ పడుతున్న అధికారులుదాడి తర్వాత అడవుల్లోకి పరారైనట్లు చెబుతున్న ప్రత్యక్ష సాక్షులుఅయినప్పటికీ పహల్గాంను అదుపులోకి తీసుకుని తనిఖీలు చేపడుతున్న భద్రతా బలగాలుప్రత్యక్ష సాక్షులను ప్రశ్నిస్తున్న ఎన్‌ఐఏ టీం పలు రాష్ట్రాల్లో పాక్‌ వ్యతిరేక నిరసనలుపహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ దేశవ్యాప్త నిరసనలు రోడ్డెక్కిన ప్రజలుపాక్‌, ఉగ్రవాద వ్యతిరేక నినాదాలతో ర్యాలీలుఉగ్రవాదం నశించాలంటూ ఫ్లకార్డులతో ప్రదర్శన పహల్గాం ఉగ్రదాడిలో((Pahalgam Terror attack) మరణించిన మృతులకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా నివాళులర్పించారు. బుధవారం ఉదయం శ్రీనగర్‌ కంట్రోల్‌ రూంలో సైనిక గౌరవ వందనం నడుమ మృతదేహాలపై పుష్ప గుచ్ఛాలను ఉంచారాయన. అనంతరం దాడిలో గాయపడి అనంత్‌నాగ్‌ ఆస్పత్రిలో క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. #WATCH | Union Home Minister Amit Shah pays tributes to the victims of the Pahalgam terror attack, in Srinagar, J&K pic.twitter.com/tPRSj4ewUg— ANI (@ANI) April 23, 2025మంగళవారం రాత్రే శ్రీనగర్‌కు చేరుకున్న హోం మంత్రి అమిత్‌ షా(Amit Shah).. వివిధ భద్రతా బలగాల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించిన సంగతి తెలిసిందే. ఈ సమీక్షలో జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌సిన్హా కూడా పాల్గొన్నారు. ఈ ఉదయం మృతదేహాలకు ఆయన నివాళి అర్పించిన అనంతరం.. ప్రత్యేక విమానాల్లో మృతదేహాలను స్వస్థలాలకు తరలించనున్నారు. మరోవైపు.. పహల్గాం ఘటనకు కారకులైన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. అడవుల్లోకి పారిపోయిన ముష్కరుల కోసం డ్రోన్‌లతో భద్రతా బలగాలు గాలిస్తున్నాయి.జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం ఉగ్రవాదులు తెగబడ్డారు. ప్రకృతి అందాలను చూసి పరవశిస్తోన్న వారిపై పాశవికంగా దాడి చేసి 28 మందిని పొట్టన పెట్టకున్నారు. ఈ ఉగ్రవాద దాడి ఘటనపై ప్రపంచం మొత్తం స్పందించింది. అమాయకులపై జరిగిన ఈ హేయ చర్యను ప్రపంచ నాయకులు ఖండించారు. అమెరికా నుంచి రష్యా వరకు, ఇటలీ నుంచి ఇజ్రాయెల్ వరకు ప్రధాన నేతలు ఈ దాడిని తీవ్రంగా తప్పుబడుతూ, భారత్‌కు బలమైన సంఘీభావాన్ని ప్రకటించారు.

Sakshi Editorial On Terrorism At Kashmir Pahalgam5
మళ్లీ ఉగ్ర కాండ!

ఊరు తెలియదు, పేరు తెలియదు... ఎవరో, ఎక్కడివారో అసలే తెలియదు. తమ ప్రాంతం కాదు... భాష కాదు. అలాంటివారిని నిష్కారణంగా, నిర్దయగా కాల్చి చంపడం హేయం, దారుణం. కశ్మీర్‌లోని పహల్గావ్‌ు సమీపంలోని బైసారన్‌ పట్టణంలో పర్యాటకులపై విరుచుకుపడి 28 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులు అక్షరాలా మానవాకార మృగాలు. భయకంపితులు తమకు తాము ధైర్యం తెచ్చుకోవటానికి సాగించే క్రూర చర్యే బీభత్సమని మార్క్సిస్టు సిద్ధాంతవేత్త ఫ్రెడరిక్‌ ఏంగెల్స్‌ అంటాడు. వీళ్లు నిజంగా భీరువులు. పొరుగు దేశం చేతుల్లో పావులు. ఈ ఘోరానికి ఎంచుకున్న సమయం, సందర్భం గమనిస్తే ఇది యాదృచ్ఛికంగా, చెదురుమదురుగా జరిగిన దాడి కాదని స్పష్టంగా తెలుస్తుంది. మన దేశంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కుటుంబ సమేతంగా పర్యటిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇస్లామిక్‌ ప్రపంచంలో అత్యంత పలుకుబడి కలిగిన సౌదీ అరేబియా పర్యటనకెళ్లారు. అంతర్జాతీయంగా అందరి దృష్టీ పడాలంటే ఇంతకన్నా మెరుగైన సమయం లేదని వీరిని వెనకుండి నడిపించిన పాకిస్తాన్‌లోని సూత్రధారులు అనుకున్న పర్యవ సానంగానే ఈ దారుణం చోటుచేసుకుంది. దాడికి తెగబడిన ఏడుగురూ సైనిక దుస్తుల్లో ఆ ప్రాంతంలోకి చొరబడ్డారని, వారిలో దాదాపు అయిదుగురు పాకిస్తానీ పౌరులేనని అంటున్నారు. ఈ దాడిని కేంద్రం చాలా తీవ్రంగా తీసుకున్నదని ప్రధాని అర్ధంతరంగా తన సౌదీ పర్యటనను రద్దు చేసుకుని రావడాన్ని గమనిస్తే అర్ధమవుతుంది. మోదీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ బుధవారం హుటాహుటిన సమావేశమైంది. కాల్పుల్లో గాయపడినవారూ, తప్పించుకున్నవారూ చెబుతున్న కథనాలు హృదయ విదారకంగా ఉన్నాయి. పెళ్లయి కేవలం ఆరు రోజులే అయిన జంటను ఆ దుర్మార్గులు లక్ష్యంగా ఎంచుకుని భర్తను కాల్చిచంపటం ఎలాంటి వారికైనా కంటతడి పెట్టిస్తుంది. తమ దురంతాన్ని ప్రధానికి చెప్పుకోవాలని, అందుకే ప్రాణాలతో విడిచిపెడుతున్నా మని నవవధువుతో వారు చెప్పిన తీరు గమనిస్తే ఉన్మాదం ఏ స్థాయిలో ముదిరిందో తెలుస్తుంది. ఒక ప్రాంతాన్ని బలప్రయోగం ద్వారానైనా సొంతం చేసుకోవాలని, దానిపై సర్వహక్కులూ తమకే ఉన్నాయని ఒక దేశమైనా, ఒక ముఠా అయినా భావించటం ఆశ్చర్యం కలిగిస్తుంది. సాధా రణ పౌరులను లక్ష్యంగా ఎంచుకుని సంహరిస్తే మందీమార్బలంవున్న ప్రభుత్వం లొంగిపోతుంద నుకోవటం పిచ్చితనమని ఈ ఉన్మాదులూ, వీరి వెనకుండి ప్రోత్సహిస్తున్నవారూ గ్రహించలేక పోతున్నారు. ఈ మధ్యే పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఆసిమ్‌ మునీర్‌ కశ్మీర్‌ తమ కంఠనాళమని, దాన్ని మరిచిపోయే లేదా విడనాడే ప్రసక్తేలేదని ప్రకటించారు. కానీ ఈ దుస్సంఘటన జరిగిన వెంటనే దీనితో తమకు సంబంధం లేదంటూ పాత పాటే అందుకున్నారు. తాను పెంచి పోషించిన విష సర్పం తననే కాటేస్తున్న ఉదంతాలున్నా పాక్‌ మూర్ఖంగా ప్రవర్తిసోంది. ఉగ్రవాదుల మతిమాలిన చర్యలకు అక్కడి సమాజం మద్దతు లేదని బుధవారం వెలువడిన పత్రికలు చూస్తేనే తెలుస్తుంది. అక్కడి పత్రికలన్నీ ముష్కరుల దురంతానికి నిరసనగా నల్లటి కాగి తంపై తెల్లటి అక్షరాలతో మొదటి పేజీని నింపాయి. పాలక పక్షానికి నేతృత్వం వహిస్తున్న నేషనల్‌ కాన్ఫరెన్స్, పీడీపీ, హురియత్‌ కాన్ఫరెన్స్‌తోపాటు పౌర సమాజం మొత్తం దాడిని ముక్తకంఠంతో ఖండించింది. పర్యాటకులపై ఈ స్థాయిలో విరుచుకుపడటం 2012 తర్వాత ఇదే మొదటిసారి. ఆ సంవత్సరం బిజ్‌బెహరా ప్రాంతంలో ఉగ్రవాదులు మహారాష్ట్ర నుంచి వెళ్లిన నలుగురు మహిళా పర్యాటకులను పొట్టన బెట్టుకున్నారు. అంతకుముందు పహల్గామ్‌లో 2000 సంవత్సరంలో తీర్థ యాత్రల కోసం వచ్చిన 32 మంది ప్రాణాలు తీశారు. ఆ తర్వాత ఇదే పెద్ద దాడి. జమ్మూ–కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని 2019 ఆగస్టులో కేంద్రం రద్దు చేసిన నాటినుంచీ తీసుకున్న చర్యల వల్ల అక్కడ పరిస్థితులు మెరుగు పడుతున్నాయన్న అభిప్రాయం అందరిలో కలిగింది. కానీ అదంతా నిజం కాకపోవచ్చని అడపా దడపా జరుగుతున్న సంఘటనలు నిరూపిస్తూనే ఉన్నాయి. అందుకే భద్రతా దళాలు మరింత అప్రమత్తంగా ఉండాల్సింది. ఇటీవల జరిగిన దాడుల్లో కూలిపనుల కోసం వెళ్లే స్థానికేతరులను ఉగ్రవాదులు లక్ష్యంగా ఎంచుకున్నారు. కానీ మంగళవారం నాటి ఘటన తీరు గమనిస్తే వారి వ్యూహం మారిందన్న అభిప్రాయం కలుగుతుంది. కశ్మీర్‌లో ఉగ్రవాదం కోరలు పీకామని, ఇక అక్కడేం చేయలేక జమ్మూ ప్రాంతంలో మిలిటెంట్లు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారని ఈమధ్యే జమ్మూ, కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా అన్నారు. ఉగ్రవాదం ఎప్పుడు పడగవిప్పి బుసలు కొడుతుందో అంచనా వేయటం సులభం కాదు. కొన్ని మీడియా సంస్థల కథనాల ప్రకారం పర్యాటకులపై దాడి జరిగే అవకాశం వున్నదని నిఘా సంస్థలు హెచ్చరించాయి. అదే నిజమైతే లోటుపాట్లకు కారకులైనవారిపై కఠినంగా చర్య తీసుకో వాల్సిన అవసరం వుంది. అందాల కశ్మీరాన్ని తనివితీరా చూడాలని, స్థానిక రుచులను ఆస్వాదించి అక్కడి సంస్కృతిని ఆకళింపు చేసుకోవాలని దేశం నలుమూలల నుంచీ అనేకమంది నిత్యం అక్కడికెళ్తున్నారు. ఇప్పుడు ఉగ్రదాడిలో మరణించినవారిలో కూడా భిన్న రాష్ట్రాలకు చెందిన వారున్నారు. దాడికి దిగిన ముఠా సభ్యులు ఎటునుంచి వచ్చారో తెలుసుకోవటం, వారిని సజీవంగా పట్టుకుని విషయాలు రాబట్టడం, అంతర్జాతీయంగా పాక్‌ నిజస్వరూపాన్ని చాటడం అత్యవసరం. దేశం మొత్తం ఏకమై ఉగ్రవాదాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకించాల్సిన తరుణమిది. అందుకే బాధ్యతా యుతంగా మాట్లాడటం అవసరమని రాజకీయ పక్షాలన్నీ గ్రహించాలి.

Sakshi Guest Column On TTD Goshala By Bhumana Karunakara Reddy6
నాడు క్షీరధార! నేడు కన్నీటి వరద!

సర్వదేవ మయే దేవీ–సర్వ దేవా రలంకృతా మామాభిలషితం కర్మ–సఫలం కురు నందినీ ఇది హిందువులు చేసే గోప్రార్థన. ‘సర్వ దేవతా స్వరూపిణీ! సర్వదేవతలచే అలంక రింపబడినదానా! ఓ నందినీ! నా కోరికలను సఫలం చేయి’ అని అర్థం. కేవలం గోవును పూజిస్తే సమస్త దేవత లను పూజించిన ఫలం దక్కుతుందని పెద్దల వాక్కు. ఇది వేదం నుంచి వచ్చిన సంప్ర దాయం, నమ్మకం. హిందువులకు ఆవు ఓ జంతువు కాదు, అభీష్టా లను నెరవేర్చే దైవ స్వరూపం. ఆకలి తీర్చే అన్నపూర్ణ. హిందూ ధర్మానికి వేదం మూలం. వేదం నుంచి యజ్ఞం వచ్చింది. యజ్ఞం వల్ల వర్షం కురుస్తుంది. మానవాళి ఆకలి తీరుతుంది. ఆ యజ్ఞపు అగ్నిహోత్రానికి ఘృతాన్ని (నెయ్యి) సమర్పించాలి. యజ్ఞానికి ఆవు నెయ్యి తప్ప ఇతరాలు సమర్పించరు. గోవు అనే పదానికి సూర్యుడు, యజ్ఞము, భూమి, నీరు, స్వర్గం... ఇలా అనేక అర్థాలు ఉన్నాయి. ‘‘గవా మంగేషు తిష్ఠంతి/ భువవాని చతుర్దశ’’ గోవు శరీర భాగాలలో పదునాలుగు భువనాలు ఉంటాయట. అంటే సమస్త సృష్టికి మూలం గోవు. గోవు అంత పవిత్రమైనది కాబట్టే దాని పేడ, పంచకాలను కూడా ఔషధాలకు ఉపయోగి స్తున్నాం. శాస్త్రం అంగీకరిస్తున్న సత్యం ఇది.పూర్వకాలంలో గోవులేని ఇల్లు వుండేది కాదు. ఎన్ని గోవులుంటే అంత సంపద వున్నట్లు. మహాభారతంలో విరాటరాజు గోవులను దుర్యోధనాదులు అపహరించటానికి పూనుకున్నది ఈ కారణం వల్లే! ఆవు నడయాడిన ప్రాంతంలో క్షేమం తప్ప, క్షామం ఉండదు. నూతన గృహప్రవేశ కాలంలో గోవును తీసుకువెళ్లేది ఇందుకే!శ్రీ మన్మహావిష్ణువు... గోపాలుడు, గోవిందుడు. గోకులంలో ఉండటం, గోవులను కాయడం ఆయనకు ఇష్టం. కాయడం అంటే కేవలం కాపలా కాదు, అన్ని విధాలా రక్షించడం! శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉంటాడన్నది మన నమ్మకం. నిజానికి ఆ స్వామికి నిత్య స్థానము గోలోకమట. అది వైకుంఠం కన్నా పైన ఉంటుందట.అందుకే గోవిందా అని పిలిస్తేనే ఆ స్వామికి ఇష్టం. నవనీత చోరుడు కదా! నేటికీ తిరుమలలో శ్రీవారికి నవనీత నివేదన జరుగుతూనే ఉంది. గోహృదయం తెలిసిన వైఎస్‌ ఆ శ్రీవారి సన్నిధానంలో గోవులకు ఆస్థానం ఉండాలని 1956లో డైరీ ఫారం పేరుతో చిన్న గోశాల ఏర్పాటు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు. 2002లో దాన్ని ట్రస్టు గానూ, 2004లో శ్రీ వేంకటేశ్వర గోరక్షణ శాలగానూ మార్చారు.ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా, నేను తి.తి.దే. అధ్యక్షుడిగా ఉన్న కాలంలో తిరుపతి గోశాలను అభివృద్ధి చేసినంతగా మరెవ్వరూ చేయలేదు అన్నది అతిశయోక్తి కాదు. రైతు హృదయమే కాదు, రైతుకు సంపద అయిన గోçహృదయం కూడా తెలిసినవారు రాజశేఖరరెడ్డి. ఆయన ఆదేశంతో గోసంరక్షణ కోసం తిరుపతిలో మూడు రోజుల పాటు ‘వందే గోమాతరం’ పేరుతో అంతర్జాతీయ సదస్సు నిర్వహించాం. నోబెల్‌ బహుమతి గ్రహీతలైన ఇద్దరు ప్రముఖులు, అరవై మందికి పైగా గోసంరక్షణ ఉద్యమకారులు, వివిధ పీఠాధిపతులు ఆ సదస్సులో పాల్గొన్నారు. ఔషధీకరణ రీత్యా గోవిసర్జితాలు ఎంత ముఖ్యమైనవో, వీరు తమ ప్రసంగాల ద్వారా నిరూపించారు. గోసంరక్షణకు చేపట్టాల్సిన కార్యక్రమాలు వివరించారు. వందే గోమాతరం సదస్సును దేశమంతా ప్రశంసించింది. ఎందరో పీఠాధిపతులు ఆశీస్సులు పంపారు. అప్పటి రాష్ట్రపతి రాజశేఖర రెడ్డి గారిని అభినందిస్తూ లేఖ పంపారు.శ్రీవారి సన్నిధానంలో ఉన్న గోశాలను మరింత విస్తృత పరచాలన్న రాజశేఖర రెడ్డి ఆదేశానుసారం పలమనేరులో అతి పెద్ద గోశాలకు అంకురార్పణ చేశాం.తండ్రి వలెనే ప్రత్యేక శ్రద్ధ వై.ఎస్‌. జగన్‌మోహన రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తండ్రి వలెనే గోసంరక్షణ మీద ప్రత్యేక శ్రద్ధ వహించారు. గోసంపద మరింత విస్తరించాలని సాహివాల్, గిర్, కాంక్రీజ్‌ వంటి నాణ్యమైన దేశవాళీ గోవులు సుమారు 550 తెప్పించారు. రిలయన్స్, మై హోమ్, ఇతర పారిశ్రామిక వేత్తల సహాయంతో ఈ గోవులను పంజాబ్, గుజరాత్, రాజస్థాన్‌ రాష్ట్రాల నుంచి తెప్పించారు. రవాణాలో అవి ఇబ్బందులకు గురి కాకూడదని, అప్పటి రైల్వే మంత్రితో మాట్లాడి ప్రత్యేక కంపార్టుమెంట్ల ద్వారా తెప్పించడం జరిగింది. ఇదీ నాటి ముఖ్యమంత్రి జగన్‌కు ఉన్న శ్రద్ధ.పూర్వకాలపు పద్ధతిలో కవ్వంతో చిలికి వెన్నతీసి, దానిని తిరుమలలో ధూప దీప నైవేద్యాలకు, అన్నప్రసాదాలకు వినియోగించాలని ఏర్పాట్లు చేయడం జరిగింది. కవ్వంతో చిలికి వెన్న తీయడాన్ని బిలోనా పద్ధతి అంటారు. దీనికి 5 కోట్ల నిధిని కేటాయించాం.ఈ 550 గోవుల ద్వారా పునరుత్పత్తి చేసి నాణ్యమైన గోవుల సంఖ్య మరింత పెంచాలని నిర్ణయించాం. దీనికి నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు సహకారం తీసుకున్నాం. దాదాపు 48 కోట్ల రూపాయల ఖర్చుతో ఆవుల కృత్రిమ గర్భధారణకు ప్రయ త్నాలు చేస్తూ, అందులో 90 శాతం ఆడ దూడల జననం కొరకు బృహత్‌ సంకల్పం చేశాం.నవనీత చోరుడు, నవనీత ప్రియుడు అయిన వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాత అనంతరం నవనీత (వెన్న) నివేదన చేస్తారు. ఆ వెన్నను పూర్వం బయట నుంచి కొని తీసుకువచ్చేవారు. స్వామికి వెన్న కొనడం తగదు అని తిరుమలలో గోశాలను ఎనిమిది ఎకరాలకు విస్తరించేలా చేశారు జగన్‌మోహన్‌ రెడ్డి. అందులో 50 సాహివాల్‌ గోవులను ఉంచి, శ్రీవారి సేవకులైన మహిళల ద్వారా వెన్న చిలికించారు. ఆ వెన్నను ప్రతిదినం గోశాల నుండి ఊరేగింపుగా తీసుకువచ్చి శ్రీవారి నవనీత సేవకు అందేలా ఏర్పాటు చేశారు.శ్రీవారికి నివేదించిన వివిధ రకాల పుష్పాలను వృథాగా పారేయక వాటి ద్వారా అగరుబత్తీలు, తదితర పరిమళ ద్రవ్యాలు తయారు చేయడానికి, గోమయంతో సబ్బులు తదితర 14 ఉత్పత్తులు గోశాల ద్వారా రావటానికి ముఖ్య కారకులు జగన్‌ గారే! ఈ రోజు ఆ ఉత్పత్తుల ద్వారా 40 కోట్ల రూపాయల వ్యాపారం జరుగు తోంది. శ్రీవారికి దాదాపు 10 కోట్ల లాభం వస్తోంది. డబ్బు విషయం పక్కన పెడితే, కొన్ని కోట్ల గృహాలలో శ్రీవారి అగరుబత్తీలు వెలు గుతూ తిరుమలను తలపిస్తున్నాయి.అలిపిరి దగ్గర గోప్రదక్షిణశాలను పూర్తి చేసి భక్తులకు అందు బాటులోకి తెచ్చింది జగన్‌ గారే. ఆవు అలమటిస్తోంది! కొండంత చేసినా కొంచెంగా ఉండటం మాకు అలవాటు. అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తిగా చేశాం తప్ప ప్రచారం కోసం కాదు. చేసినవి చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ కళ్ళు మూసుకుని కనిపించలేదు అంటే అది తప్పు!ఇరువురు ముఖ్యమంత్రులు ఇంతగా అభివృద్ధి చేసిన గోశాల నేడు దీనంగా ఉంది. ఆవు అలమటిస్తోంది. క్షీరధార బదులు, కన్నీటి ధార విడుస్తోంది. నిజం చెబితే దాన్ని స్వీకరించాలి, సరిదిద్దుకోవాలి. అంతేగానీ విమర్శకు విలవిలలాడిపోయి ఎదురుదాడికి దిగితే,దొంగ కేసులు పెడితే అది వారికే నష్టం. నేను కోరేది ఒక్కటే! అధికారాలు, ప్రభుత్వాలు మారవచ్చు. కానీ పీఠంపై ఎవరున్నా శ్రీవారికి ఇష్టమైన ‘గోపతు’లుగా ఉండాలి తప్ప, ‘గోఘ్నులు’గా ఉండకూడదు అని!భూమన కరుణాకర రెడ్డి వ్యాసకర్త టీటీడీ మాజీ చైర్మన్‌

IPL 2025: Mumbai Indians beat Sunrisers Hyderabad by seven wickets7
రోహిత్‌, సూర్య మెరుపులు.. ఎస్ఆర్‌హెచ్‌పై ముంబై విజ‌యం

ఐపీఎల్‌-2025లో ముంబై ఇండియ‌న్స్ వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతుంది. ఉప్ప‌ల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ముంబై విజ‌య భేరి మోగించింది. 144 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ముంబై కేవ‌లం మూడు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 15.4 ఓవ‌ర్ల‌లోనే చేధించింది.ముంబై బ్యాట‌ర్ల‌లో రోహిత్ శ‌ర్మ‌(46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో 70) అద్బుత ఇన్నింగ్స్ ఆడ‌గా.. సూర్య‌కుమార్ యాద‌వ్‌(19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో 40 నాటౌట్‌) మెరుపు మెరిపించాడు. స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్ల‌లో ఉన‌ద్క‌ట్‌, మ‌లింగ‌, అన్సారీ త‌లా వికెట్ సాధించారు. క్లాసెన్ విరోచిత ఇన్నింగ్స్ వృధా..స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 143 ప‌రుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. 13 ప‌రుగుల‌కే 4 వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్‌హెచ్‌ను క్లాసెన్ విరోచిత పోరాటంతో ఆదుకున్నాడు. కేవ‌లం 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 71 ప‌రుగులు చేశాడు. అత‌డితో పాటు ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా వ‌చ్చిన అభిన‌వ్ మ‌నోహ‌ర్ కీల‌క నాక్ ఆడాడు. 37 బంతుల్లో 2 ఫోర్లు, మూడు సిక్స‌ర్ల‌తో 43 ప‌రుగులు చేశాడు. వీరిద్ద‌రూ ఆరో వికెట్‌కు 99 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పాడు. ముంబై బౌల‌ర్ల‌లో ట్రెంట్ బౌల్ట్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. చాహ‌ర్ రెండు, బుమ్రా, హార్దిక్ త‌లా వికెట్ సాధించారు.

How much wealth did Dhirubhai Ambani left behind for Mukesh Ambani and Anil Ambani8
కుమారుల కోసం ధీరూభాయ్ అంబానీ వదిలివెళ్లిన ఆస్తి ఎంతంటే..

కష్టపడితే సాధించలేనిది లేదు అని కొందరు చెబుతారు, మరికొందరు నిరూపిస్తారు. అలా నిరూపించిన వారిలో చెప్పుకోదగ్గ వ్యక్తి, దివంగత పారిశ్రామిక వేత్త 'ధీరూభాయ్ అంబానీ' ఒకరు. గుజరాత్‌లోని జునాఘడ్ జిల్లాలోని.. చోర్వాడ గ్రామంలో ఓ సాధారణ కుటుంబంలో పుట్టిన ఈయన, అంత గొప్ప పారిశ్రామికవేత్తగా ఎలా ఎదిగారు?, ఆయన మరణించే సమయానికి ఆయన సంపద ఎంత?, కుమారులకు ఇచ్చిన ఆస్తులు ఏమిటి అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.రూ.300 జీతానికిసాధారణ కుటుంబంలో జన్మించిన ధీరూభాయ్ అంబానీ.. ఆర్ధిక పరిస్థితుల కారణంగా, చదువును అర్ధాంతరంగా నిలిపివేసి యెమెన్‌కు వెళ్లి అక్కడ పెట్రోల్ పంప్‌లో రూ. 300 జీతానికి పనిచేయడం మొదలుపెట్టారు. నిజాయితీగా పనిచేస్తూ.. అతి తక్కువ కాలంలోనే అక్కడే మేనేజర్ అయ్యారు. కొన్నేళ్ల తరువాత సొంతంగా ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో ఇండియాకు వచ్చేసారు.భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత.. ధీరూభాయ్ అంబానీ ముంబైలోని అద్దె ఇంట్లో రిలయన్స్ ప్రయాణాన్ని ప్రారంభించారు. వస్త్రాల వ్యాపారంతో మొదలైన ఈయన ప్రయాణం.. ఆ తరువాత పెట్రోకెమికల్స్, టెలికాం మొదలైన రంగాలవైపు సాగింది. ఆ తరువాత రిలయన్స్ ఓ పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా మారింది.ప్రపంచంలో 138వ ధనవంతుడిగారిలయన్స్ సంస్థ ఓ పెద్ద సామ్రాజ్యంగా ఎదిగిన తరువాత.. 2002లో ధీరూభాయ్ అంబానీ మరణించారు. అప్పటికి ఈయన సంపద ఎంత అనేదానికి సంబంధించిన గణాంకాలు అధికారికంగా వెల్లడి కాలేదు. కానీ ఫోర్బ్స్ ప్రకారం.. ఆయన మరణించే సమయానికి, ప్రపంచంలో 138వ ధనవంతుడిగా ఉన్నట్లు.. ఆయన వ్యక్తిగత నికర విలువ 2.9 బిలియన్ డాలర్లు (నేటి భారత కరెన్సీ ప్రకారం రూ. 24000 కోట్లు) అని సమాచారం. కాగా రిలయన్స్ విలువ రూ. 60,000 కోట్లుగా ఉండేది. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ లక్షల కోట్లు.ఇదీ చదవండి: బంగారం, వెండి కొని ధనవంతులు కండి.. రిచ్‌డాడ్‌ పూర్‌ డాడ్‌ రచయితవారసులకు ఏమిచ్చారు?ధీరూభాయ్ అంబానీ మరణించిన తర్వాత, అధికారిక వీలునామా లేకపోవడంతో గ్రూప్ భవిష్యత్తు నాయకత్వం గురించి అనిశ్చితి ఏర్పడింది. ఆ సమయంలోనే ఆయన ఇద్దరు కుమారులు ఆస్తులను పంచుకున్నారు. ఆస్తుల పంపకాల విషయంలో వారి తల్లి కోకిలాబెన్ అంబానీ మధ్యవర్తిత్వం వహించారు.ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL)ను తన ఆధీనంలోకి తీసుకున్నారు. ఇందులో చమురు, గ్యాస్, పెట్రోకెమికల్స్, తరువాత టెలికాం ఉన్నాయి. అనిల్ అంబానీ రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ పవర్ మొదలైనవి తీసుకున్నారు.

Sangareddy Jail Officials Gave A Shock To Aghori9
అఘోరీకి షాక్‌ ఇచ్చిన సంగారెడ్డి జైలు అధికారులు

సాక్షి, సంగారెడ్డి: చీటింగ్ కేసులో అరెస్టయిన అఘోరీకి సంగారెడ్డి జైలు అధికారులు షాక్ ఇచ్చారు. ఆడ, మగ తేలకుండా ఏ బ్యారక్‌లోనూ ఉంచలేమంటూ అధికారులు తేల్చి చెప్పారు. అఘోరీని తిరిగి పంపించిన సంగారెడ్డి జైలు అధికారులు.. లింగ నిర్థారణ జరిగితే గాని ఇక్కడ ఉంచుకోలేమని స్పష్టం చేశారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు డాక్టర్ల వైద్య పరీక్షల అనంతరం లింగ నిర్ధారణ జరిగే అవకాశం ఉంది. పరీక్షల తర్వాత చంచల్ గూడ జైలుకు తరలించే అవకాశం ఉంది.కాగా, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరీని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఓ మహిళను మోసం చేసిన కేసులో అఘోరీని చేవెళ్ల కోర్టులో హాజరుపర్చగా.. న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్​ విధించారు. మరో వైపు, సంగారెడ్డి జైలుకు తరలిస్తున్న సమయంలో అఘోరీ అరుపులతో హడావుడి చేశాడు. తన భార్య వర్షిణిని తనతోనే ఉంచాలంటూ పట్టుబట్టాడు.పూజల పేరుతో తొమ్మిదిన్నర లక్షలు తీసుకుని మోసం చేశాడనే ఫిర్యాదుతో మోకిలా పోలీసులు.. అఘోరీని అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌- మధ్య ప్రదేశ్ సరిహద్దుల్లో అఘోరీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నగరానికి తీసుకువచ్చారు. మోకిలా పోలీసులు. అఘోరీతో పాటు వర్షిణిని కూడా నగరానికి తరలించారు. ఏపీకి చెందిన వర్షిణి.. అఘోరీని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో కూడా వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. తమను ఎవరైనా అరెస్టు చేయాలని చూస్తే, ఆత్మహత్య చేసుకుంటామని కూడా హెచ్చరించిన ఈ జంట.. ఓ సెల్ఫీ వీడియో కూడా విడుదల చేసింది.

Singer Pravasthi Aradhya Reacts on Harini Ivaturi Comments10
ప్రవస్తిది అంతా డ్రామా.. తప్పు నీవైపే.. ఇంకా లాగి ఏం సాధిస్తావ్‌?: సింగర్‌ హారిణి

ఐదేళ్ల వయసులోనే పాటలు పాడటం మొదలుపెట్టింది ప్రవస్తి ఆరాధ్య (Pravasthi Aradhya). సరిగమప లిటిల్‌ ఛాంప్స్‌ రియాలిటీ షోలో విజేతగానూ నిలిచింది. చిన్నతనంలోనే పాడుతా తీయగా ప్రోగ్రాంలో పాల్గొంది. తెలుగు, తమిళ భాషల్లో పలు రియాలిటీ షోలలో పాల్గొంది. ఇటీవల మరోసారి పాడుతా తీయగా సిల్వర్‌ జూబ్లీ షోలో పార్టిసిపేట్‌ చేసింది. ఈ షో నుంచి ఇటీవలే ఎలిమినేట్‌ అయిన ప్రవస్తి.. తనపై జడ్జిలు సునీత, కీరవాణి, చంద్రబోస్‌ వివక్ష చూపించారని ఆరోపించింది. సింగింగ్‌ కెరీర్‌కు ఫుల్‌స్టాప్‌తననొక చీడపురుగులా చూస్తూ ఆత్మస్థైర్యంపై దెబ్బకొట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. షో నిర్మాతలు కూడా కొన్నిసార్లు సరైన డ్రెస్సులు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టేవారంది. షోలో జరిగిన అన్యాయాన్ని బయటపెట్టిన తనకు ఇక భవిష్యత్తు ఉండదని అర్థమై గాయనిగా కెరీర్‌కు ఫుల్‌స్టాప్‌ పెడుతున్నట్లు ప్రకటించింది. అయితే పాటలంటే ప్రాణమున్న నువ్వు సంగీతాన్ని విడిచిపెట్టొద్దని.. సింగర్‌గా కొనసాగాలని గాయని మాళవిక (Singer Malavika) అభ్యర్థించింది. కష్టమంతా బూడిదపాలుఅందుకు ప్రవస్తి స్పందిస్తూ.. నాపై విషం కక్కుతూ ఉంటే ఇంకా ఈ ఫీల్డ్‌లో ఎలా కొనసాగగలను? మీరందరూ నేను పాడాలని కోరుకుంటున్నారు. కానీ నా కష్టం, ప్రతిభ అంతా బూడిదలో కలిసిపోతుంటే ఎలా తట్టుకోగలను? వివక్ష చూపిస్తుంటే ఎలా భరించగలను? అని ప్రశ్నించింది. మరోవైపు ప్రవస్తిపై సింగర్‌ హారిణి ఇవటూరి (Harini Ivaturi) ఆగ్రహం వ్యక్తం చేసింది. నీ డ్రామాలు చాలు.. ప్రశంసల కోసం పాకులాడినప్పుడు విమర్శలు స్వీకరించే ధైర్యం కూడా ఉండాలి. చదవండి: 'మీ బాడీకి ఏ డ్రెస్సూ సరిపోదు'.. ప్రవస్తి ఆరోపణలకు నిర్మాత క్లారిటీఇంకా ఎంతవరకు లాగుతావ్‌?పాడుతా తీయగా షోలో చాలా ఎపిసోడ్లు చూశాను. కొన్ని చోట్ల నిన్ను నువ్వు ఇంకా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. నీ పొరపాట్లను సరిదిద్దుకోవడం మానేసి అనుభవజ్ఞులైన జడ్జిలను ప్రశ్నిస్తున్నావా? నీకేదైనా అన్యాయం జరిగిందంటే అది షోలోనే తేల్చుకోవాలి. షో అయిపోయాక ఇలా పబ్లిక్‌లో మాట్లాడటం సరికాదు. జడ్జిల క్యారెక్టర్లను తప్పుపట్టడం అన్యాయం. నువ్వు నిరాశలో ఉన్నావని... దాన్ని ఇలా లాగుతూనే ఉంటావా? నీకు నిజంగా దమ్ముంటే వారితోనే నేరుగా మాట్లాడతావ్‌.టాలెంట్‌తోనే ఆన్సర్‌..ఇంత రచ్చ చేసి ఏం సాధించాలనుకుంటున్నావో నాకు తెలియట్లేదు. నీకంత బాధ ఉంటే నీ టాలెంట్‌తోనే సమాధానం చెప్పాలి. నా సొంత అనుభవమే చెప్తా.. ఒకసారి చివరి నిమిషంలో నేను పాడాల్సిన పాట మార్చేశారు. అయినా సరే దాన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని పాడా.. బెస్ట్‌ పర్ఫామెన్స్‌ గెలుచుకున్నా! ఛాలెంజ్‌లు లేకుంటే మన ఎదుగుదల ఆగిపోతుంది. రియాలిటీ షోలలో ఒత్తిడి భరించలేకపోతున్నావంటే అవి నీకు సెట్టవవు. నీకేదైనా డ్రెస్‌ నచ్చలేదంటే అప్పుడే ముక్కుసూటిగా చెప్పేయాలి. అప్పుడే పోరాడాల్సిందిఅంతేకానీ ఇప్పుడెందుకు చెప్పడం? నీ ఎలిమినేషన్‌ అప్పుడు మీ తల్లి.. జడ్జిలతో ఎంత గట్టిగా మాట్లాడిందో.. నీకు జరుగుతున్న బాడీ షేమింగ్‌ గురించి మేనేజ్‌మెంట్‌ దగ్గర అంతే గట్టిగా చెప్పాల్సింది. ఇప్పుడు ప్రదర్శిస్తున్న ధైర్యం అప్పుడేమైంది. పబ్లిక్‌గా వాళ్లను విమర్శించడం దేనికి? అని ఆగ్రహించింది. ఈ పోస్ట్‌పై ప్రవస్తి స్పందిస్తూ.. అక్కా, దయచేసి నా బాధను డ్రామా అని పిలవొద్దు. నేను పిరికిదాన్ని అని కూడా అన్నారు. నిజంగా పిరికిదాన్నయితే పవర్‌ఫుల్‌ వ్యక్తుల గురించి మాట్లాడను. నేరుగా మాట్లాడొచ్చుగా అని ఇంకో పాయింట్‌ అన్నారు.నాకు ఛాన్స్‌ ఇస్తేగా!వాళ్లు నాకు అవకాశం ఇస్తే కదా నేరుగా మాట్లాడేది. స్టేజీ మీద ఉన్నప్పుడు నేను అడిగే ప్రశ్నలకు వాళ్లు ఏ సమాధానం చెప్పలేదు. నిజంగా పిరికిదాన్నయితే మీరందరూ నాకు వ్యతిరేకంగా మారిపోతారని తెలిసి కూడా ఇలా బయటకు వచ్చి మాట్లాడేదాన్ని కాదు కదా! అని కౌంటర్‌ ఇచ్చింది. అలాగే తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో తనకు జరిగిన ఓ మంచిని సైతం పొందుపరిచింది. ఇండస్ట్రీలో చెడు ఉన్నట్లే మంచి కూడా ఉందని పేర్కొంది. సంగీత దర్శకుడు తమన్‌ 'బ్రో' మూవీలో ఇతర సింగర్స్‌తో కలిసి వెనకాల కోరస్‌ పాడే అవకాశం ఇచ్చారని పేర్కొంది. View this post on Instagram A post shared by Harini Ivaturi (@hariniivaturi)చదవండి: ఆడవారికి ముద్దులు.. ఆయనది వంకరబుద్ధి.. నేనైతే

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement