కూకట్‌పల్లిలో ఓ ఇంటర్మీడియెట్ విద్యార్థి దారుణ హత్యకు గురైన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మూసాపేటకు చెందిన సుధీర్ సోమవారం ఉదయం ఇంటర్ పరీక్ష రాసేందుకు వెళుతుండగా.. దుండగులు నడిరోడ్డుపైనే వేటకొడవళ్లతో నరికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా స్నేహితులతో జరిగిన వివాదం కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు