ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దీనిపై నిజానిజాలు నిరూపించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. చంద్రబాబు సూచించిన ఏ నిపుణుడితోనైనా ఈవీఎంల పనితీరుపై సోమవారం చర్చించేందుకు తాము సిద్ధమని ఈసీ ప్రకటించింది. అయితే ఈవీఎంలను దొంగతనం చేసిన వ్యవహారంలో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వేమూరి హరిప్రసాద్‌తో తాము వీటిపై చర్చించబోమని స్పష్టం చేసింది.