Central Election Commission
-
ఈసీ తీరు పూర్తిగా.. అనుమానాస్పదం
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై పలు పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు మండిపడ్డాయి. ఎన్నికల నిర్వహణలో పారదర్శకతకు సంస్థ పూర్తిగా తిలోదకాలిస్తోందంటూ ధ్వజమెత్తాయి. ‘‘ఓటింగ్‌కు సంబంధించి పౌరులందరికీ తెలియాల్సిన గణాంకాలను అడిగినా బయటపెట్టడం లేదు. ఎన్నికల ప్రక్రియలో భారీ అవకతవకలు జరుగుతున్నాయన్న అనుమానాలు ఈసీ తీరుతో నానాటికీ బలపడుతున్నాయి’’ అంటూ దుయ్యబట్టాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల శాతానికి సంబంధించిన పూర్తి గణాంకాలను బయట పెట్టాల్సిందిగా అవి చిరకాలంగా డిమాండ్ చేస్తుండటం తెలిసిందే. ఈ విషయమై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్)తో పాటు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా తదితరులు సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు కూడా దాఖలు చేశారు. 2019 ఎన్నికల్లో నమోదైన మొత్తం ఓట్లకు సంబంధించి 17సీ పార్ట్–1 తాలూకు ప్రతులన్నింటినీ వెల్లడించేలా ఈసీని ఆదేశించాలని కోరారు. దీనిపై తొలుత ఈసీని సంప్రదించాల్సిందిగా గత నెల కోర్టు వారికి సూచించింది. దాంతో ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ ఆహ్వానం ఆ మేరకు మంగళవారం సమావేశం జరిగింది. ఏడీఆర్ ప్రతినిధులతో పాటు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్, మొయిత్రా తదితరులు భేటీలో పాల్గొన్నారు. తమ డిమాండ్లను మరోసారి ఈసీ ప్రతినిధుల ముందుంచారు. అనంతరం వారంతా మీడియాతో మాట్లాడారు. ఈసీ తీరుపై పెదవి విరిచారు. తమ డిమాండ్లకు ఎలాంటి సానుకూల స్పందనా రాలేదంటూ ఆక్షేపించారు.సీఈసీ, ఈసీ ఎక్కడ: భూషణ్సీఈసీ గానీ, ఎన్నికల కమిషనర్లు గానీ భేటీలో పాల్గొనకపోవడాన్ని ప్రతినిధులు తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ఏదో అత్యున్నత న్యాయస్థానం సూచించింది గనుక తప్పలేదన్నట్టుగా వ్యవహరించారు. భేటీకి కేవలం ఈసీ ప్రతినిధులను పంపి సరిపెట్టారు. సంస్థ విశ్వసనీయతకు సంబంధించిన అతి కీలకమైన సమస్య విషయంలో వారి చిత్తశుద్ధి ఏపాటిదో దీన్నిబట్టే తేలిపోతోంది. అయినా సుప్రీంకోర్టుపై గౌరవంతో మా అనుమానాలన్నింటినీ ఈసీ ప్రతినిధుల ముందుంచాం. 2019 లోక్‌సభ ఎన్నికల ఓటింగ్ శాతానికి సంబంధించిన డేటాలో చాలా అవకతవకలున్నట్టు వారి దృష్టికి తీసుకెళ్లాం. వాటిపై సమాధానాలు కోరాం. ఫాం 17(సీ), 20 వంటివాటిని వెబ్సైట్లో అందరికీ అందుబాటులో ఉంచాల్సిందిగా సూచించాం. ఇది ఈసీ విశ్వసనీయతకే పెనుసవాలు అన్న వాస్తవాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరాం. కానీ వారినుంచి సానుకూల స్పందనే లేదు’’ అంటూ ప్రశాంత్ భూషణ్ పెదవి విరిచారు. దీనిపై తమ తదుపరి వాదనలను ఇక సుప్రీంకోర్టు ముందే ఉంచుతామని స్పష్టం చేశారు. ఓటింగ్ సంబంధిత డేటాను ఎన్నికల ఏజెంట్లకు అందించడంలో లేని అభ్యంతరం వెబ్సైట్లో అప్లోడ్ చేయడానికి ఎందుకని ఆయన ప్రశ్నించారు. ‘‘ఓటింగ్ విషయంలో తప్పిదాలు, అవకతవకలు జరుగుతున్నాయని, ఈవీఎంల టాంపరింగ్ జరుగుతోందని దేశవ్యాప్తంగా ఇప్పటికే చాలా అనుమానాలున్నాయి. అవి వాస్తవమేనంటూ దేశ విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు గళమెత్తుతున్నారు. ఈసీ ప్రవర్తన ఆ అనుమానాలకు మరింతగా బలం చేకూరుస్తోంది’’ అంటూ భూషణ్ దుయ్యబట్టారు.2024లోనూ అవకతవకలు: మొయిత్రా2019లోనే గాక 2024 లోక్‌సభ ఎన్నికల విషయంలో కూడా ఓటింగ్‌కు సంబంధించి భారీ అవకతవకలు జరిగాయని మొయిత్రా ఆరోపించారు. ‘‘గత రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ చాలా నియోజకవర్గాల్లో ఈవీఎంలలో నమోదైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు పొంతనే లేదు. సాయంత్రం దాకా ఉన్న పోలింగ్ శాతాలు రాత్రికల్లా అనూహ్యంగా భారీగా పెరిగిపోయాయి. చాలాచోట్ల ఈ పెరుగుదల ఏకంగా 20 శాతం దాకా ఉంది’’ అని గుర్తు చేశారు. ఫలితంగా ప్రస్తుతం ఈసీ విశ్వసనీయత ఎన్నడూ లేనంతగా అడుగంటిందని విమర్శించారు. ముఖ్యంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఈసీ పూర్తిగా అప్రతిష్టపాలైందన్నారు. ‘‘మేం కోరుతున్నది రహస్య వివరాలేమీ కాదు. దేశప్రజలందరికీ వాటిని తెలుసుకునే హక్కుంది. అంతేకాదు, వాటిని తెలుసుకుని తీరాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది’’ అని ఆమె స్పష్టం చేశారు. -
ఈసీ తీరు అనుమానాస్పదం
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై పలు పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు మండిపడ్డాయి. ఎన్నికల నిర్వహణలో పారదర్శకతకు సంస్థ పూర్తిగా తిలోదకాలిస్తోందంటూ ధ్వజమెత్తాయి. ‘‘ఓటింగ్‌కు సంబంధించి పౌరులందరికీ తెలియాల్సిన గణాంకాలను అడిగినా బయటపెట్టడం లేదు. ఎన్నికల ప్రక్రియలో భారీ అవకతవకలు జరుగుతున్నాయన్న అనుమానాలు ఈసీ తీరుతో నానాటికీ బలపడుతున్నాయి’’ అంటూ దుయ్యబట్టాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల శాతానికి సంబంధించిన పూర్తి గణాంకాలను బయట పెట్టాల్సిందిగా అవి డిమాండ్ చేస్తుండటం తెలిసిందే. ఈ విషయమై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్)తో పాటు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా తదితరులు సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు కూడా దాఖలు చేశారు. 2019 ఎన్నికల్లో నమోదైన మొత్తం ఓట్లకు సంబంధించి 17సీ పార్ట్–1 తాలూకు ప్రతులన్నింటినీ వెల్లడించేలా ఈసీని ఆదేశించాలని కోరారు. దీనిపై తొలుత ఈసీని సంప్రదించాల్సిందిగా గత నెల కోర్టు వారికి సూచించింది. దాంతో ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ ఆహ్వానం మేరకు మంగళవారం సమావేశం జరిగింది. ఏడీఆర్ ప్రతినిధులతో పాటు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్, మొయిత్రా తదితరులు భేటీలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈసీ తీరుపై పెదవి విరిచారు. సీఈసీ, ఈసీ ఎక్కడ: భూషణ్ సీఈసీ గానీ, ఎన్నికల కమిషనర్లు గానీ భేటీలో పాల్గొనకపోవడాన్ని ప్రతినిధులు తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ఏదో అత్యున్నత న్యాయస్థానం సూచించింది గనుక తప్పలేదన్నట్టుగా వ్యవహరించారు. భేటీకి కేవలం ఈసీ ప్రతినిధులను పంపి సరిపెట్టారు. సంస్థ విశ్వసనీయతకు సంబంధించిన అతి కీలకమైన సమస్య విషయంలో వారి చిత్తశుద్ధి ఏపాటిదో దీన్నిబట్టే తేలిపోతోంది. అయినా సుప్రీంకోర్టుపై గౌరవంతో మా అనుమానాలన్నింటినీ ఈసీ ప్రతినిధుల ముందుంచాం. 2019 లోక్‌సభ ఎన్నికల ఓటింగ్ శాతానికి సంబంధించిన డేటాలో చాలా అవకతవకలున్నట్టు వారి దృష్టికి తీసుకెళ్లాం. వాటిపై సమాధానాలు కోరాం. ఫాం 17(సీ), 20 వంటివాటిని వెబ్సైట్లో అందరికీ అందుబాటులో ఉంచాల్సిందిగా సూచించాం. కానీ వారినుంచి సానుకూల స్పందనే లేదు’’ అంటూ ప్రశాంత్ భూషణ్ పెదవి విరిచారు. దీనిపై తమ తదుపరి వాదనలను ఇక సుప్రీంకోర్టు ముందే ఉంచుతామని స్పష్టం చేశారు. ‘‘ఓటింగ్ విషయంలో తప్పిదాలు, అవకతవకలు జరుగుతున్నాయని, ఈవీఎంల టాంపరింగ్ జరుగుతోందని దేశవ్యాప్తంగా చాలా అనుమానాలున్నాయి. అవి వాస్తవమేనంటూ దేశ విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు గళమెత్తుతున్నారు. ఈసీ ప్రవర్తన ఆ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది’’ అంటూ భూషణ్ దుయ్యబట్టారు. 2024లోనూ అవకతవకలు: మొయిత్రా 2019లోనే గాక 2024 లోక్‌సభ ఎన్నికల విషయంలో కూడా ఓటింగ్‌కు సంబంధించి భారీ అవకతవకలు జరిగాయని మొయిత్రా ఆరోపించారు. ‘‘గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో్లనూ చాలా నియోజకవర్గాల్లో ఈవీఎంలలో నమోదైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు పొంతనే లేదు. సాయంత్రం దాకా ఉన్న పోలింగ్ శాతాలు రాత్రికల్లా భారీగా పెరిగిపోయాయి. చాలాచోట్ల ఈ పెరుగుదల ఏకంగా 20 శాతం దాకా ఉంది’’ అని గుర్తు చేశారు. ఫలితంగా ప్రస్తుతం ఈసీ విశ్వసనీయత ఎన్నడూ లేనంతగా అడుగంటిందని విమర్శించారు. ముఖ్యంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఈసీ పూర్తిగా అప్రతిష్టపాలైందన్నారు. ‘‘మేం కోరుతున్నది రహస్య వివరాలేమీ కాదు. దేశప్రజలందరికీ వాటిని తెలుసుకునే హక్కుంది’’ అని ఆమె స్పష్టం చేశారు. -
మా అధికారాల్లోనే జోక్యం చేసుకుంటారా?
సాక్షి, అమరావతి : గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో బోగస్ ఓట్ల తొలగింపు అభ్యర్థనతో అసలైన ఓట్ల తొలగింపు కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు దాఖలు చేయడం వెనుక ఉన్న నిజానిజాలను తేల్చే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తమను సంప్రదించకుండానే సిట్‌ను ఏర్పాటు చేయడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా తప్పుబట్టింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామంది. సిట్ ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీవో ఇచ్చారని, ఇలా చేయడం తమ అధికార పరిధిలో జోక్యం చేసుకోవడమేనని కేంద్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ హైకోర్టుకు వివరించారు. ఈ వ్యవహారాన్ని తాము ఎంత మాత్రం తేలిగ్గా తీసుకునేది లేదన్నారు. తమ అధికార పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటున్నా చూస్తూ ఊరుకుంటే.. రేపు ప్రతి రాష్ట్రం ఇలాగే వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఏకపక్ష తీరుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులిచ్చి వివరణ కోరామన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తీరును అభిశంసించాలని ఆయన కోర్టును కోరారు. సిట్‌ను ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవోను ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం మరో జీవో ఇచ్చిందని, ఆ జీవోలో ఉపయోగించిన భాష కూడా సరిగా లేదని తెలిపారు. బేషరతుగా జీవోను ఉపసంహరించుకోకుండా ఎన్నికల సంఘం చట్ట నిబంధనలకు లోబడి తాము చర్యలు తీసుకుంటామని చెప్పడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తమ పరిధిలో జోక్యం చేసుకుంటామన్న సందేశాన్ని ఇచ్చినట్లయిందన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. సిట్ ఏర్పాటు జీవోను ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో తాము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమంది. సిట్ ఏర్పాటును సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని పరిష్కరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి గురువారం ఉత్తర్వులిచ్చారు. మా అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకుందిఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపించారు. ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణ, ఎన్నికల నిర్వహణ తదితరాలన్నీ తమ పరిధిలోని వ్యవహారాలని చెప్పారు. వీటిలో ఏవైనా పొరపాట్లు గానీ, లోటుపాట్లు గానీ ఉన్నా వాటిని సరిచేయాల్సింది కేంద్ర ఎన్నికల సంఘంగా తాము మాత్రమేనన్నారు. ఇందులో జోక్యం చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. సిట్ ఏర్పాటు ద్వారా ప్రభుత్వం తమ అధికారాలను లాగేసుకుందని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై తాము ఆరోపణలను నమోదు చేసి, ఆయనకు ఖర్చులు విధించాలని కోర్టును కోరారు. ఇలా తాము కోరినట్లు కూడా రికార్డ్ చేయాలని అభ్యర్థించారు. ప్రభుత్వం తరఫున సహాయ ప్రభుత్వ న్యాయవాది అజయ్ వాదనలు వినిపిస్తూ.. సిట్ ఏర్పాటు జీవోను ఉపసంహరించుకుంటూ ఈ నెల 19న మరో జీవో ఇచ్చినట్టు కోర్టుకు వివరించారు. సిట్ ఏర్పాటుపై పిటిషన్ గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పర్చూరు నియోజకవర్గంలో బోగస్ ఓట్ల తొలగింపు అభ్యర్థనతో అసలైన ఓట్ల తొలగింపు కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు (ఫాం 7) దాఖలయ్యాయంటూ పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చారు. దీంతో ఫాం 7 దాఖలుపై విచారణ నిమిత్తం ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 3న జీవో 448 జారీ చేసింది. ఈ జీవోను సవాలు చేస్తూ బాపట్లకు చెందిన గుండపనేని కోటేశ్వరరావు, మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గురువారం జస్టిస్ సుబ్బారెడ్డి విచారణ జరిపారు. -
ఈసీ తీరుపై... అన్నీ అనుమానాలే!
సాక్షి, న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా అవకతవకలు, నకిలీ ఓటర్ కార్డులు, ఓటర్ల సంఖ్యలో అనూహ్య పెరుగుదల, ఇష్టారాజ్యంగా ఓటర్ల తొలగింపు తదితర అంశాలను కాంగ్రెస్‌తో పాటు విపక్ష పార్టీలన్నీ సోమవారం లోక్‌సభలో లేవనెత్తాయి. వీటిపై సందేహాలు, నానాటికీ దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఆరోపణలు మొత్తం ఎన్నికల ప్రక్రియ సమగ్రతనే ప్రశ్నార్థకంగా మార్చాయంటూ ఆందోళన వెలిబుచ్చాయి. పైగా వీటిపై కేంద్ర ఎన్నికల సంఘం అరకొర స్పందన మరిన్ని అనుమానాలకు తావిస్తోందన్నాయి. కనుక ఈ మొత్తం అంశంపై లోక్‌సభలో పూర్తిస్థాయి చర్చ జరగాల్సిందేనని డిమాండ్ చేశాయి. ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇది ప్రతిపక్షాలన్నీ ముక్త కంఠంతో చేస్తున్న డిమాండని ఆయన స్పష్టం చేశారు. స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ ఓటర్ల జాబితాను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుందా అని ప్రశ్నించారు. ‘‘కేంద్రం తయారు చేయదన్నది నిజమే. కానీ ఇవన్నీ మొత్తం ఎన్నికల ప్రక్రియపైనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అందుకే ఈ అంశంపై సవివరమైన చర్చకు మేం డిమాండ్ చేస్తున్నాం’’ అని రాహుల్ బదులిచ్చారు. ‘‘ఓటర్ల జాబితాల విశ్వసనీయతను దేశవ్యాప్తంగా విపక్ష పార్టీలన్నీ ప్రశ్నిస్తున్నాయి. మహారాష్ట్రతో సహా ప్రతి రాష్ట్రంలోనూ ప్రతిపక్షాలు దీనిపై అనుమానాలు లేవనెత్తాయి’’ అని గుర్తు చేశారు. ఇది చాలా తీవ్రమైన అంశమంటూ సమాజ్‌వాదీ, ఆర్జేడీ, బిజూ జనతాదళ్, ఆప్ కూడా గొంతు కలిపాయి. దీన్ని పార్లమెంటు చర్చకు స్వీకరించాల్సిందేనని పట్టుబట్టాయి. తృణముల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతారాయ్ ఓటర్ల జాబితా అంశాన్ని జీరో అవర్‌లో లేవనెత్తారు. ‘‘ఓటర్ల ఫొటో గుర్తింపు కార్డు నంబర్లలో నకిలీల సమస్య దశాబ్దాలుగా ఉంది. కానీ పశి్చమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందోళన అనంతరమే కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై స్పందించింది. సమస్యను మూడు నెలల్లో పరిష్కరిస్తామని ప్రకటించింది’’ అంటూ దృష్టికి తెచ్చారు. అంటే ఇంతకాలంగా తప్పిదాలు జరుగుతూ వస్తున్నట్టే కదా అని ఆయన ప్రశ్నించారు. ‘‘బెంగాల్, హరియాణాల్లో నకిలీ ఓటరు కార్డులు దొరికాయి. ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్ల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. దానిపై అందరూ ప్రశ్నలు లేవనెత్తారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికలప్పుడూ ఇలాగే జరిగింది. ఇవన్నీ తీవ్రమైన లోటుపాట్లే. వచ్చే ఏడాది బెంగాల్, అసోం అసెంబ్లీ ఎన్నికలున్నందున ఆలోపే ఓటర్ల జాబితాలను పూర్తిగా సవరించాలి’’ అని డిమాండ్ చేశారు. ఈ తప్పిదాలపై దేశ ప్రజలకు ఈసీ బదులివ్వాల్సిందేనన్నారు. ఈ అంశంపై సమగ్ర చర్చకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు నిరసనలతో హోరెత్తించారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ పక్షపాతరహితంగా వ్యవహరించాలని సమాజ్‌వాదీ సభ్యుడు ధర్మేంద్రయాదవ్ అన్నారు. ‘‘మహారాష్ట్రలో నెలల వ్యవధిలోనే కొత్తగా లక్షలాది ఓటర్లు ఎలా పుట్టుకొచ్చారు? ఢిల్లీలోనూ అదే జరిగింది. 2022లో యూపీలోనూ ఇదే చేశారు’’ అని ఆరోపించారు.రాజ్యసభలోనూ... రాజ్యసభలో కూడా జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తేందుకు విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రయత్నించారు. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ అందుకు అనుమతివ్వలేదు. దీనితో పాటు డజనుకు పైగా అంశాలపై 267వ నిబంధన కింద చర్చకు డిమాండ్ చేస్తూ విపక్షాలు ఇచి్చన నోటీసులన్నింటినీ తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. దీన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌తో పాటు విపక్షాలన్నీ వాకౌట్ చేశాయి. ‘‘మహారాష్ట్రలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య ఆర్నెల్లలోనే ఓటర్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఇదెలా సాధ్యం? దీనిపై కాంగ్రెస్‌తో పాటు విపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు ఈసీ వద్ద సమాధానమే లేదు. ఓటింగ్ ప్రక్రియ కోసం ఉపయోగించిన ఫొటో ఓటర్ల జాబితాను ఎక్సెల్ ఫార్మాట్లో మాకు అందజేయాలని డిమాండ్ చేస్తే ఈసీ నేటికీ స్పందించనే లేదు. దేశవ్యాప్తంగా ఓటర్ల పేర్లను ఇష్టారాజ్యంగా తొలగించడం, డూప్లికేట్ ఈపీఐసీ నంబర్ల వంటి తీవ్ర తప్పిదాలు, లోటుపాట్లు ఇష్టారాజ్యాంగా చోటుచేసుకుంటున్నాయి. ఇవన్నీ ఎన్నికల ప్రక్రియ తాలూకు సమగ్రతనే సవాలు చేస్తున్నాయి. పైగా ఈ తప్పిదాలను స్వయంగా ఈసీయే అంగీకరించింది. కనుక వీటన్నింటిపై పార్లమెంటులో చర్చ జరగాల్సిందే. అందుకు మోదీ సర్కారు అంగీకరించాల్సిందే’’ అంటూ అనంతరం ఖర్గే ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తద్వారా ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలన్నారు. దేశంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంలో కేంద్ర ఎన్నికల సంఘం కొన్నేళ్లుగా ఘోరంగా విఫలమవుతోందని అంతకుముందు టీఎంసీ సభ్యుడు కల్యాణ్ బెనర్జీ సభలో దుయ్యబట్టారు. ఇందుకు ఈసీపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘డూప్లికేట్ ఓటర్ కార్డుల అంశాన్ని సీఎం మమతే తొలిసారి లేవనెత్తారు. దీనిపై ఈసీ ఇచ్చిన వివరణ ఎన్నికల నిర్వహణ నిబంధనలకే విరుద్ధంగా ఉంది’’ అని ఆరోపించారు. అనుమానాలన్నింటినీ నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రం, ఈసీపై ఉందని ఆప్ సభ్యుడు సంజయ్‌సింగ్ అన్నారు. ఇటీవలి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హరియాణా పౌరులకు విచ్చలవిడిగా ఓటరు కార్డులిచ్చారని ఆరోపించారు. తద్వారా ఎన్నికల ప్రక్రియనే ప్రహసనంగా ఈసీ మార్చేసిందని దుయ్యబట్టారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఈసీ ప్రయత్నిస్తోందని ఆర్జేడీ సభ్యుడు మనోజ్ ఝా ఆరోపించారు. ‘‘ఎన్నికల ప్రక్రియే పార్లమెంటు ఉనికికి ప్రాణం. ఎన్నికల అవకతవకలపై ఇక్కడ చర్చించేందుకు అవకాశమివ్వకపోతే ప్రజాస్వామ్యానికి అర్థమే లేదు’’ అన్నారు. -
నిర్ణయం ఇంకెప్పుడు?
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ప్రతిసారీ ‘‘స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటారు’’ అంటున్నారు. తగినంత సమయం అంటే ఎంత? ఐదేళ్ల పదవీ కాలం పూర్తయ్యే వరకా?. తగినంత సమయాన్ని కోర్టు ఫిక్స్ చేయాలా? వద్దా?. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. చట్ట సభల గడువు ముగిసే వరకు నిర్ణయం తీసుకోకపోతే ఎలా? ప్రజాస్వామ్యానికి అర్థం ఏం ఉంటుంది? ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్ అనే విధంగా వ్యవహరించడం ఎంతమాత్రం సరికాదు..’ అంటూ సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ఎమ్మెల్యేల వ్యవహారంలో స్పీకర్ కార్యాలయం ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి, స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు హైకోర్టు రిజిస్ట్రార్ ద్వారా అందజేయాలని జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జ్ల ధర్మాసనం ఆదేశించింది. ఈ నోటీసులపై వీరంతా ఈనెల 22లోపు వివరణ ఇవ్వాలని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. ఓ ఎస్ఎల్పీ, మరో రిట్ పిటిషన్‌పై విచారణ కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్‌లపై ఎస్ఎల్పీ, మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహీపాల్ రెడ్డి, అరెకపూడి గాందీలపై రిట్ పిటిషన్ దాఖలు అయిన విషయం తెలిసిందే. కాగా ఈ రెండు పిటిషన్లపై తాజాగా మంగళవారం సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఆర్యమ సుందరం, దామ శేషాద్రినాయుడు, పి.మోహిత్‌రావు, స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మనుసింఘ్వీ, ముకుల్ రోహత్గీ తదితరులు వాదనలు వినిపించారు. ఏడాది కావొస్తున్నా చర్యలు లేవు ‘గతేడాది మార్చి, ఏప్రిల్‌లో పార్టీ ఫిరాయింపులపై తొలిసారి కోర్టును ఆశ్రయించాం. అనంతరం జూన్‌లో రిట్ పిటిషన్ దాఖలు చేశాం. ఏడాది అవుతున్నా ఇప్పటివరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. ఆర్టికల్ 32, 226 ప్రకారం స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి సమయం అవసరం లేదు. ప్రధానంగా పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ బీ ఫాంపై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. మరో ఎమ్మెల్యే ఏకంగా కాంగ్రెస్ పార్టీ కోసం లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేశారు. మిగిలిన ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు వాళ్లు పార్టీ ఫిరాయించినట్టే. దీనిపై తొలుత రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా..విచారణకు సమయాన్ని ఖరారు చేయాలంటూ సింగిల్ బెంచ్ నాలుగు వారాలు గడువు ఇచ్చింది. దీనిపై స్పీకర్ కార్యాలయం అప్పీల్‌కు వెళ్లింది. అయితే స్పీకర్‌కు తగినంత సమయం ఇవ్వాలన్న భావనతో ఈ ఉత్తర్వులను డివిజన్ బెంచ్ పక్కన పెట్టింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంను ఆశ్రయించాం. కానీ స్పీకర్ కార్యాలయం ఇప్పటివరకు ఆ తగినంత సమయం అంటే ఎంతో చెప్పనేలేదు. స్పీకర్ సమయం తీసుకునే విషయంలో సుభాష్ దేశాయ్, కేశం మేఘాచంద్, రాజేంద్ర సింగ్ రాణా కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ తీర్పుల ఆధారంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంది..’ అని అని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అయితే సుభాష్ దేశాయ్ కేసులో స్పీకర్ నిర్ణయంపై ఎలాంటి గడువు ఫిక్స్ చేయలేదని జస్టిస్ బీఆర్ గవాయి అన్నారు. రాణా కేసులో మూడు నెలల సమయం ఇవ్వాలని చెప్పిందని తెలిపారు. ఫిరాయింపులపై కాంగ్రెస్ అధికారం ఉన్నచోట ఒకలా... లేనిచోట మరోలా వ్యవహరిస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది అర్యమ సుందరం వాదించారు.స్పీకర్‌కు కోర్టు ఆదేశాలివ్వడానికి అవకాశం లేదుస్పీకర్ కార్యదర్శి తరఫు న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ వాదిస్తూ.. ‘ఫిరాయింపులపై గతేడాది జూలై మొదటి వారంలో స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తే 9వ తేదీ నాటికే కోర్టులో పిటిషన్ వేశారు. మరోవైపు ఫిరాయింపులపై ఫిర్యాదు అందగానే స్పీకర్ స్పందించారు.. నోటీసులు ఇచ్చారు. వారి నుంచి రిప్లై రాగానే నిర్ణయం తీసుకుంటారు. అసలు స్పీకర్ నిర్దిష్ట సమయంలో నిర్ణయం తీసుకోవాలని లేదు. రాజ్యాంగబద్ధంగా అత్యంత ఉన్నతమైన పదవుల్లో స్పీకర్ పదవి ఒకటి. ఈ పదవిలో ఉన్న స్పీకర్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేయడానికి అవకాశం లేదు..’ అని చెప్పారు. దీంతో ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ‘స్పీకర్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేయడానికి అవకాశం లేదూ అంటే.. న్యాయమే డిసైడ్ చేస్తుంది ఆగండి..’ అంటూ వ్యాఖ్యానించింది. నోటీసుల జారీకి ఆదేశాలిచ్చింది. ప్రతివాదుల తరఫు న్యాయవాదులు కూడా వీరికి నేరుగా నోటీసులు ఇవ్వొచ్చని తెలిపింది. ఈనెల 25న ఐటెం నంబర్–1గా కేసును విచారిస్తామని స్పష్టం చేసింది. -
అవేవీ నకిలీ ఓటర్ కార్డులు కావు
సాక్షి, న్యూఢిల్లీ: ఒకే ఎలక్టర్ ఫొటో ఐడెంటిటీ కార్డ్ (ఎపిక్) నంబర్‌తో ఒకటికి మించి ఓటర్ గుర్తింపు కార్డులు జారీ అయిన వైనంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచి్చంది. ఒకే ఎపిక్ నంబర్ ఉన్నా అవేవీ నకిలీ ఓటర్ కార్డులు కావని స్పష్టంచేసింది. ‘‘వేర్వేరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకే విధమైన ఆల్ఫాన్యూమరిక్ సిరీస్‌లను ఉపయోగించడం వల్ల కొందరు ఓటర్లకు ఒకే తరహా ఎపిక్ నంబర్ ఉన్న కార్డులు జారీ అయ్యాయి. ఎపిక్ నంబర్ ఒకలా ఉన్నంత మాత్రాన అవి నకిలీ/డూప్లికేట్ కార్డులు కావు. అన్నీ ఒరిజినల్ కార్డులే’’ అని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. పలు వేర్వేరు రాష్ట్రాల్లో ఓటర్లు ఒకే ఎపిక్ నంబర్లను కలిగి ఉన్నారంటూ వచ్చిన కథనాలపై ఈసీ ఈ మేరకు స్పందించింది. దాంట్లో గందరగోళ పడాల్సిన పని లేదని స్పష్టం చేసింది. ‘‘పలు రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు ఒకే ఆల్ఫాన్యూమరిక్ సిరీస్‌ను అనుసరించడంతో ఇలా జరిగింది. అన్ని రాష్ట్రాల ఎలక్టోరల్ డాటాబేస్‌ను సమీకృత ఎలక్టోరల్ రోల్ మేనేజ్మెంట్ (ఎరోనెట్) ప్లాట్‌ఫాంలోకి మార్చడానికి ముందు, అంటే కేంద్రీకృత వ్యవస్థను అమలుచేయని కాలంలో ఎపిక్ మాన్యువల్‌గా నంబర్లను కేటాయించినప్పుడు ఇది జరిగింది. ఓటర్ల ఎపిక్ నంబర్లు ఒకేలా ఉండొచ్చు గానీ వారి వ్యక్తిగత వివరాలు, అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ బూత్ తదితర వివరాలన్నీ వేరుగానే ఉంటాయి. అలాంటి ఓటరు స్వరాష్ట్రంలో సంబంధిత నియోజకవర్గంలో నిర్దేశించిన పోలింగ్‌బూత్‌లో ఓటు వేసేందుకు ఏ ఇబ్బందీ లేదు. అయినా భయాందోళనలుంటే అలాంటి వారికి ప్రత్యేక (యూనిక్) ఎపిక్ నంబర్‌ను కేటాయిస్తాం. అందుకు వీలుగా ఎరోనెట్ 2.0 ప్లాట్‌ఫాంను త్వరలో అప్డేట్ చేస్తాం’’ అని ఈసీ పేర్కొంది. -
3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ నేడే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఈ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా–గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానాలు, ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో 70 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 1,062 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. పోలింగ్ కోసం 6,287 మంది పోలింగ్ సిబ్బందిని, 8,515 మంది పోలింగ్ సిబ్బందిని కేంద్ర ఎన్నికల సంఘం వినియోగిస్తోంది. అన్ని కేంద్రాల్లో పోలింగ్‌ను లైవ్వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ చేయనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. ఎన్నికల నిరంతర పర్యవేక్షణకు సచివాలయంలోని ప్రధాన ఎన్నికల కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపునకు తూర్పు–పశ్చిమ గోదావరి గ్రాడ్యుయేట్ స్థానానికి ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. కృష్ణా–గుంటూరు గ్రాడ్యుయేట్స్ కౌంటింగ్ గుంటూరు ఏసీ కాలేజీలో జరగనుంది. శ్రీకాకుళం –విజయనగరం – విశాఖ టీచర్ల స్థానానికి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ స్థానానికి 35 మంది పోటీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి అత్యధికంగా 35 మంది పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం గ్రాడ్యుయేట్ ఓటర్లు 3,14,984 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 1,83,347 మంది, మహిళలు 1,31,618 మంది, ఇతరులు 19 మంది ఉన్నారు. ఉమ్మడి కృష్ణా–గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 25 మంది పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం గ్రాడ్యుయేట్ ఓటర్లు 3,47,116 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 2,06,456 మంది, మహిళలు 1,40,615 మంది, ఇతరులు 45 మంది ఉన్నారు. ఉమ్మడి ఉత్తరాంద్ర జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవరా>్గనికి 10 మంది పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం ఉపాధ్యాయ ఓటర్లు 22,493 మంది ఉన్నారు. వీరిలో 13,508 మంది పురుషులు, 8,985 మంది మహిళలు ఉన్నారు. -
‘ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ’ నగారా
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ఏపీ, తెలంగాణలో 10 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 29న ఖాళీ అయ్యే ఈ స్థానాలకు గాను మార్చి 3న నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఈసీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. అదే నెల 20న ఎన్నికలు జరుగుతాయని పేర్కొంది. అదేరోజు ఓట్ల లెక్కింపు ఉంటుంది. కాగా ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఇదే సమయంలో ఎన్నికలు జరుగుతాయని ఈసీ ప్రకటించింది. మార్చి 24 లోపు ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి అవుతుందని తెలిపింది. తెలంగాణలో మండలి ఎన్నికల సందడిసాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల కోటా స్థానాలకు జరగనున్న ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ముగియనుంది. మరోవైపు శానసమండలిలో ఎమ్మెల్యేల కోటాలో వచ్చే నెల 29న ఖాళీ అయ్యే ఐదు స్థానాల్లో ఎన్నికకు సంబంధించి సోమవారం షెడ్యూల్ విడుదలైంది. 40 మంది సభ్యులు ఉన్న శాసనమండలిలో 8 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండటంతో రాష్టంలో రాజకీయ సందడి జోరందుకుంది. టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ముమ్మర ప్రచారం జరుగుతోంది. మంగళవారం చివరిరోజు కావడంతో పార్టీలు ఆఖరి నిమిషంలో చేయాల్సిన ప్రయత్నాలతో పాటు, పోలింగ్‌కు అవసరమైన సన్నద్ధత, ఓటర్లను ఆకర్షించే ఎత్తుగడలపై దృష్టి పెట్టాయి. ఇక ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయ్యే ఐదు స్థానాల్లో ఎవరికి ఎన్ని సీట్లు దక్కే అవకాశం ఉందనే దానిపై కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం వర్గాలో చర్చ జరుగుతోంది. రిటైరవుతున్నది వీరే.. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ ప్రకారం మార్చి 29న ఎమ్మెల్యే కోటాలో ఐదుగురు ఎమ్మెల్సీలు రిటైర్ అవుతున్నారు. వీరిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్ రెడ్డి, యెగ్గె మల్లేశం (ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నారు)తో పాటు ఎంఐఎంకు చెందిన మీర్జా రియాజుల్ హసన్ ఎఫెండీ ఉన్నారు. ఎమ్మెల్యే కోటాలో ఒక్కో ఎమ్మెల్సీ ఎన్నికకు 24 మంది శాసనసభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్‌కు 65, బీజేపీకి 8, ఎంఐఎంకు 7, సీపీఐకి ఒక ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ న్యాయపోరాటం చేస్తోంది. ఎంఐఎం మద్దతుతో కాంగ్రెస్ మూడు స్థానాలను సునాయాసంగా దక్కించుకునే అవకాశముంది. మరోవైపు బీఆర్ఎస్లో కొనసాగుతున్న 28 మంది ఎమ్మెల్యేలతో ఒక ఎమ్మెల్సీ పదవి కచి్చతంగా దక్కుతుంది. ఐదో ఎమ్మెల్సీ పదవి ఎన్నికలో బీఆర్ఎస్ను వీడిన ఎమ్మెల్యేలు, బీజేపీ శాసనసభ్యులు అత్యంత కీలకంగా మారనున్నారు. గతంలో బీఆర్ఎస్ మద్దతుతో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు ను దక్కించుకున్న ఎంఐఎం ప్రస్తుతం ఎలాంటి వైఖరి అనుసరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. టీచర్, గ్రాడ్యుయేట్ కోటా ఈ ముగ్గురు.. శాసనమండలిలో మార్చి 29న ఉపాధ్యాయ కోటాలో ‘మెదక్ –ఆదిలాబాద్– నిజామాబాద్ –కరీంనగర్’ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్‌రెడ్డి (పీఆర్టీయూ), ‘వరంగల్– ఖమ్మం –నల్లగొండ’ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి (స్వతంత్ర), పట్టభద్రుల కోటాలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి (మెదక్– నిజామాబాద్ –ఆదిలాబాద్– కరీంనగర్) రిటైర్ అవుతున్నారు. ఈ మూడు స్థానాల్లో ఎన్నికకు సంబంధించి ఈ నెల 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. ‘మెదక్ –నిజామాబాద్ –ఆదిలాబాద్– కరీంనగర్’పట్టభద్రుల స్థానంలో 56 మంది, ‘మెదక్ –నిజామాబాద్ –ఆదిలాబాద్– కరీంనగర్’ఉపాధ్యా య స్థానంలో 15, ‘వరంగల్ –ఖమ్మం– నల్లగొండ’ఉపాధ్యాయ స్థానంలో 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పట్టభద్రుల కోటా స్థానంలో కాంగ్రెస్, బీజేపీ తరఫున అభ్యర్థులు పోటీలో ఉండగా, బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉంది. ఆగస్టులో మరొకటి ఖాళీ హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా నుంచి మండలికి ఎన్నికైన ఎంఎస్ ప్రభాకర్ రావు పదవీ కాలం ఆగస్టు 6న పూర్తవుతోంది. బీఆర్ఎస్ నుంచి మండలికి ఎన్నికైన ప్రభాకర్ ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నారు. గవర్నర్ కోటాలో మండలికి నామినేట్ అయిన బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్, గోరటి వెంకన్న వచ్చే ఏడాది నవంబర్‌లో రిటైర్ అవుతారు. మండలిలో స్థానిక సంస్థల కోటాలో 14 మంది సభ్యులకు గాను 2028లో ఏకంగా 12 మంది పదవీ కాలం పూర్తవుతుంది. మొత్తంగా 2027లో 9, 2028లో 14 మంది, 2029లో ఐదుగురు, 2030లో ఇద్దరేసి ఎమ్మెల్సీల చొప్పున రిటైర్ అవుతారు. ప్రస్తుతమున్న మండలి సభ్యుల్లో గవర్నర్ కోటాలో నామినేట్ అయిన అమేర్ అలీఖాన్ (కాంగ్రెస్), ప్రొఫెసర్ కోదండరాం (టీజేఎస్) ఆరేళ్ల పదవీ కాలం 2030లో పూర్తి చేసుకుంటారు. -
సీఈసీగా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేశ్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా జ్ఞానేశ్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గత ఏడాది మార్చి నెల నుంచి కేంద్ర ఎన్నికల సంఘంలో ఎలక్షన్ కమిషనర్‌గా సేవలందిస్తున్న జ్ఞానేశ్‌ను సీఈసీగా ఎంపికచేస్తూ ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ రాష్ట్రపతి ముర్ముకు సిఫార్సు చేయడం, వెనువెంటనే ఆ సిఫార్సును ఆమోదిస్తూ, ఆయనను సీఈసీగా నియమిస్తూ గెజిట్ నోటిఫికేషన్ వెలువడటం తెల్సిందే. మరోవైపు హరియాణా కేడర్ మాజీ ఐఏఎస్ అధికారి వివేక్ జోషి ఎన్నికల కమిషనర్‌గా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రాజీవ్ కుమార్ సీఈసీగా పదవీ విరమణ చేశాక ఆ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జ్ఞానేశ్ మాట్లాడారు. ‘‘దేశ నిర్మాణంలో తొలి సోపానం ఓటు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుడు ఓటర్‌గా కొత్త బాధ్యతలు స్వీకరించాలి. ప్రతి ఎన్నికల్లో తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి. భారత రాజ్యాంగంలోని ఎన్నికల చట్టాలు, నియమ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల సంఘం అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ ఓటర్లకు అండగా నిలబడుతుంది’’ అని జ్ఞానేష్ స్పష్టం చేశారు. జ్ఞానేశ్ ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సమయంలో కీలకమైన సార్వత్రిక ఎన్నికలు, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీలకు సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించారు. మరోవైపు ఎలక్షన్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన వివేక్ జోషి గతంలో హరియాణా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. ఐఐటీ రూర్కీలో మెకానికల్ ఇంజనీరింగ్ పట్టభద్రుడైన జోషి ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘంలోని ఎలక్షన్ కమిషనర్లలో అత్యంత పిన్న వయస్కుడు. అయితే సీనియారిటీ ప్రకారం ఒకవేళ ఈయన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పదోన్నతి పొందితే ఈయన సారథ్యంలోనే 2029లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. -
పాతిక లక్షల జనాభాకో లోక్ సభ సీటు
సాక్షి, అమరావతి: ప్రపంచంలోని ప్రధాన దేశాలతో పోల్చితే ఒక లోక్‌సభ (దిగువ సభ) సీటుకు సగటు జనాభా అత్యధికంగా ఉన్న దేశం భారతదేశమే. మిగిలిన ప్రధాన దేశాల్లో ఒక లోక్‌సభ స్థానానికి సగటు జనాభా అతి తక్కువ అని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించిన గణాంకాల ఆధారంగా వివిధ దేశాల్లో దిగువ సభకు సీట్లు, ఒక సీటుకు జనాభా, మహిళల ప్రాతినిధ్యం, ఓటింగ్ శాతాలను ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక విశ్లేషించింది. భారత దిగువ సభలో ఒక్కో నియోజకవర్గం సగటు జనాభా 25.7 లక్షలు ఉండగా.. అమెరికాలో 7.3 లక్షలే ఉన్నట్లు తెలిపింది. ఇండోనేషియాలో 4.8 లక్షలు, జర్మనీ, ఫ్రాన్స్‌లో 1.2 లక్షల జనాభానే ఉందని తెలిపింది. మిగతా దేశాలతో పోల్చితే మన లోక్‌సభలో మహిళల ప్రాతినిధ్యం తక్కువ ఉందని నివేదిక తెలిపింది. అయితే భారత్ సహా ప్రధాన దేశాలన్నింటిలో ఓటింగ్ శాతం దాదాపు సమానంగా ఉన్నట్లు వెల్లడించింది. ఓటింగ్ శాతంలో త్వరలోనే భారత్ ప్రపంచంలోని అగ్ర దేశాల సరసన చేరవచ్చునని తెలిపింది. దిగువ సభ ఓటింగ్ శాతం జర్మనీలో అత్యధికంగా ఉండగా, ఆ తరువాత ఫ్రాన్స్, స్పెయిన్, భారత్ ఉన్నట్లు నివేదిక పేర్కొంది. -
ఈసీ చిత్తశుద్ధికి అభినందనలు
న్యూఢిల్లీ: ప్రజా శక్తిని సాంకేతికత దన్నుతో (Central Election Commission)కేంద్ర ఎన్నికల సంఘం మరింత బలోపేతం చేసిందని ప్రధాని , (Narendra Modi)మోదీ వ్యాఖ్యానించారు. చిత్తశుద్ధితో ఎన్నికలను సజావుగా నిర్వహించిందంటూ అభినందించారు. ఆదివారం ఆయన , (Mann Ki Baat)‘మన్‌కీ బాత్’లో మాట్లాడారు. జనవరి 26న గణతంత్ర వేడుకల నేపథ్యంలో కార్యక్రమాన్ని చివరి ఆదివారానికి బదులు ఒక వారం ముందుకు జరిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకునే ఈసీ వ్యవస్థాపక దినోత్సవం జనవరి 25వ తేదీ సమీపిస్తున్న వేళ ఈసీని మోదీ పొగడటం విశేషం. ‘‘ 1951–52లో తొలిసారి ఎన్నికలు జరిగేటప్పుడు ప్రజాస్వామ్యం దేశంలో మనగలదా అని చాలా మంది అనుమానాలు వ్యక్తంచేశారు. అయితే వాళ్లందరి అనుమానాలను పటాపంచలుచేస్తూ భారత్ ప్రజాస్వామ్యానికి పుట్టిల్లుగా అవతరించింది. ఎప్పటికప్పుడు ఓటింగ్ విధానాన్ని ఆదునీకరిస్తూ, పటిష్టపరుస్తున్న ఈసీకి నా అభినందనలు’’ అని మోదీ అన్నా రు. ‘‘ ఈసారి గణతంత్ర దినోత్సవం చాలా ప్రత్యేకం. భారత గణతంత్రానికి ఇది 75వ వార్షికోత్స వం. ఇంతటి పవిత్ర రాజ్యాంగాన్ని అందించిన రాజ్యాంగపరిషత్లోని మహనీయులకు నా సెల్యూ ట్. ఆనాటి వారి విస్తృతస్థాయి చర్చలు, రాజ్యాంగ సభలో సభ్యుల ఆలోచనలు, వారి ఉపదేశాలు మనకు గొప్ప వారసత్వ సంపద’’అంటూ నాటి చైర్మన్ రాజేంద్ర ప్రసాద్, బీఆర్ అంబేడ్కర్, శ్యామ ప్రసాద్ ముఖర్జీల ప్రసంగాల ఆడియో క్లిప్‌లను మోదీ వినిపించారు. ‘‘ భారత్ తరఫున తొలిసారిగా ప్రైవేట్ ఉపగ్రహాల కూటమి ఫైర్ఫ్లైను నింగిలోకి పంపి బెంగళూరుకు చెందిన అంకుర సంస్థ ‘పిక్సెల్’ చరిత్ర సృష్టించిన విషయాన్ని చెప్పేందుకు గర్వపడుతున్నా’’ అని మోదీ అన్నారు. -
నమోదైన ఓటర్లు 97.97 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికల సమయానికి దేశంలో 97.97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) తెలిపింది. 2019 లోక్‌సభ ఎన్నికలప్పుడున్న 91.19 కోట్ల మందితో పోలిస్తే ఇది 7.43% ఎక్కువని పేర్కొంది. 2019లో 61.4 కోట్ల ఓట్లు పోలవగా 2024లో 64.64 కోట్ల ఓట్లు పోలయ్యాయని ఇందులో 64.21 కోట్లు ఈవీఎంలలో నమోదైనట్లు వివరించింది. ఇందులో 32.93 కోట్ల పురుషులు, 31.27 కోట్ల మహిళలు, 13 వేల మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా, సార్వత్రిక ఎన్నికల్లో 42.81 లక్షల పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి. అస్సాంలోని ధుబ్రి నియోజకవర్గంలో అత్యధికంగా 92.3% ఓట్లు పోల్ కాగా... అత్యల్పంగా శ్రీనగర్‌లో 38.7% పోలింగ్ నమోదైంది. అయితే 2019లో శ్రీనగర్‌లో ఇది 14.4% మాత్రమేనని ఈసీ గుర్తు చేసింది. దేశవ్యాప్తంగా 2024లో నోటాకు 63.71 లక్షల ఓట్లు పడ్డాయని కూడా వివరించింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో జరిగిన ప్రపంచంలోని అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ విస్తృత గణాంకాలను సీఈసీ గురువారం విడుదల చేసింది. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు 2024లో 10.52 లక్షల పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. 2019 కంటే ఇది 14,816 ఎక్కువ. 2019లో 540 చోట్ల రీపోలింగ్ జరగ్గా ఈ ఏడాది కేవలం 40 పోలింగ్ స్టేషన్లలోనే రీపోలింగ్ అయ్యింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 1.62 లక్షల పోలింగ్ స్టేషన్లు ఉండగా...2019తో పోలిస్తే 2024లో బిహార్‌లో అత్యధికంగా 4,739 పోలింగ్ స్టేషన్లు పెరిగాయి. -
పారదర్శకతకు పాతర
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వ్యవహారశైలిపై, దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియపై అనేక అనుమానాలు తలెత్తుతున్న వేళ... అవి మరింత పెరిగే ప్రమాదం తాజాగా తలెత్తింది. ఎన్నికల నిర్వహణ నిబంధనల్ని మారుస్తున్నట్టు కేంద్ర సర్కార్ శుక్రవారం ప్రకటించింది. నిబంధనల్లో సరికొత్త సవరణ వల్ల ఇకపై ఎన్నికలకు సంబంధించిన అన్ని పత్రాలనూ పరిశీలించే అవకాశం ప్రజలకు ఉండదు. సీసీ టీవీ, వెబ్‌కాస్టింగ్ ఫుటేజ్, అభ్యర్థుల వీడియో రికార్డింగుల లాంటి ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు ఇకపై అందుబాటులో ఉండవు. అదేమంటే, అలాంటివన్నిటినీ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంచితే వాటిని దుర్వినియోగం చేస్తారనీ, అసలు ఓటరు భద్రతకే ప్రమాదకరమనీ పాలక వర్గాల వాదన. సోషల్ మీడియా యుగంలో, పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్ల దృశ్యాలు విస్తృతంగా అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో అది వట్టి డొల్ల వాదనే. ఎన్నికల నిబంధనల్లో మార్పుపై దేశ వ్యాప్తంగా అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నది అందుకే!‘‘ఎన్నికకు సంబంధించిన మిగిలిన అన్ని పత్రాలనూ ప్రజాక్షేత్రంలో పరిశీలించేందుకు వీలుండాలి’’ అని 1961 నాటి ఎన్నికల నిర్వహణ నిబంధనల్లోని రూల్ 93(2)(ఎ) చెబుతోంది. దానికే ఇప్పుడు సవరణ చేశారు. ఈసీ సిఫార్సు మేరకు, కేంద్ర న్యాయశాఖ ఈ మార్పును నోటిఫై చేసింది. దాంతో, ఇప్పుడిక నిబంధనల్లో ప్రత్యేకంగా పేర్కొన్న పత్రాలను మాత్రమే జనం పరిశీలించవచ్చన్న మాట. అంతేకాదు... ఎన్నికల పత్రాలన్నిటినీ కోరినవారికి ఇవ్వాలంటూ ఈసీని ఇక కోర్టులు ఆదేశించడానికి వీలుండదు. చిత్రమేమంటే, ఇటీవలి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పోలింగ్ కేంద్రంలో పోలైన ఓట్లకు సంబంధించిన పత్రాల కాపీలు, సెక్యూరిటీ కెమెరాలోని ఫుటేజ్, వీడియోలను ఓ పిటిషనర్‌కు అందించాల్సిందిగా పంజాబ్ – హర్యానా హైకోర్ట్ సరిగ్గా ఈ నెల 9వ తేదీనే ఆదేశా లిచ్చింది. అక్టోబర్ నాటి ఎన్నికల్లో అభ్యర్థి కాదు గనక సదరు పిటిషనర్ ఆ పత్రాలు కోరరాదని ఈసీ వాదించింది. హైకోర్ట్ మాత్రం అభ్యర్థికైతే ఉచితంగా, ఇతరులకైతే రుసుముపై పత్రాలివ్వాలన్న పిటిషనర్ వాదనతో ఏకీభవించింది. కోర్టు ఆదేశాన్ని తప్పక పాటించాల్సిన పరిస్థితి. కానీ, తద్భిన్నంగా ఎన్నికల సంఘం నిబంధనల్ని సవరించడం సహజంగానే చర్చనీయాంశమవుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటిస్తున్నప్పుడే, సామాన్య ఓటర్లకున్న తిరుగులేని సమాచార హక్కును సుప్రీమ్ కోర్ట్ నొక్కి వక్కాణించింది. రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చే వ్యక్తుల, సంస్థల వివరాలు తెలుసుకొనే హక్కు ప్రజలకుందని తేల్చి చెప్పింది. వివాదాస్పద బాండ్ల పథకాన్ని సమర్థించిన సర్కారుకు అది ఎదురుదెబ్బ. నిజానికి, ఎన్నికల ప్రక్రియ పారదర్శకత, నిజాయతీలో రాజీకి తావు లేదని దేశ సర్వోన్నత న్యాయస్థానం అప్పుడే స్పష్టం చేసినట్టయింది. అయినా సరే, ప్రభుత్వం చెవికెక్కించుకోకుండా ఇప్పుడు ఈసీ సిఫార్సు పేరు చెబుతూ, నిబంధనల సవరణకు దిగడం ప్రజాస్వామ్యవాదులకు దిగ్భ్రాంతి కలిగించే విషయం. ఓటర్లే స్వయంగా తమ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా సాక్షిగా పంచుకుంటున్న రోజుల్లో సీసీ టీవీ దృశ్యాల పట్ల ఈసీ ఇంత హంగామా ఎందుకు చేస్తోందో అంతుపట్టదు. సీసీ టీవీ ఫుటేజ్ అందుబాటులో ఉంటే కృత్రిమ మేధతో దుర్వినియోగం చేసే ముప్పుందన్న ఈసీ వాదన కొంత నిజమైనా, డిజిటల్ యుగంలో అన్ని వీడియోలపై నిషేధం పెడతామా? సవాలుకు అది పరిష్కారం కాదు కదా!ఎన్నికల సంఘం సారథ్యంలో నిఖర్సుగా సాగాల్సిన ఎన్నికల ప్రక్రియ తాలూకు నైతిక నిష్ఠ శరవేగంగా హరించుకుపోతోందంటూ ప్రతిపక్షాలు అసలే గొంతు చించుకుంటున్న సమయంలో నిబంధనల్లో ఈ కొత్త సవరణలు చేయ డాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఎన్నికల రికార్డులనూ, డేటాను ప్రజాక్షేత్రానికి దూరంగా ఉంచాలన్న జ్ఞానోదయం హఠాత్తుగా పాలకులకూ, ఈసీకీ ఎందుకు కలిగినట్టు? జనం దృష్టి నుంచి ఏం దాచాలని చూస్తున్నారు? ప్రతిపక్షాలనే కాదు... పౌరులనూ వేధిస్తున్న ప్రశ్నలివి. పైగా విస్తృత స్థాయి చర్చ జరగకుండానే చేపట్టిన ఈ తొందరపాటు చర్య ఎన్నికల ప్రక్రియపై మరిన్ని అనుమానాలు పెంచేలా పరిణమిస్తుంది. ప్రజాస్వామ్య దేశంలో అది మరింత విషాదం. వాస్తవానికి భిన్న భౌగోళిక పరిస్థితులు, భాషలు, సంస్కృతులు, సమస్యలున్న సువిశాల దేశంలో అతి పెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియగా ఇన్నేళ్ళుగా విజయవంతంగా ఎన్నికలను నిర్వహిస్తూ రావడం గొప్పే. అందుకు మన రాజ్యాంగం ఏర్పరచిన సుస్థిర వ్యవస్థనూ, గత దశాబ్దాల్లో ఈసీ పాత్రనూ తప్పక ప్రశంసించాల్సిందే. కానీ ఏ ఎన్నికల ప్రక్రియకైనా పారదర్శకత ప్రాణాధారం. ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికీ అదే కీలకం. తీరా ఆ పారదర్శకతే ఇప్పుడు రానురానూ తగ్గుతూ పోతుంటే ఏమనాలి? ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యంగా గొప్పలు చెప్పుకొనే మనం ఎటువైపు ప్రయాణిస్తున్నట్టు? అందులోనూ ఆంధ్రప్రదేశ్, హర్యానా సహా అనేక చోట్ల ఎన్నికల్లో ఈవీఎంలపై, వీవీప్యాట్లపై నీలినీడలు కమ్ముకున్న ప్రస్తుత పరిస్థితుల్లో... ఈ తరహా కొత్త నిబంధనతో పాలకులు ఏ రకమైన సూచన ఇవ్వదలిచినట్టు? ఎన్నికల ప్రక్రియ పట్ల విశ్వాసం పాదుకొనాలంటే, ఈ సరికొత్త నిబంధనల మార్పును పునఃపరిశీలించాలి. స్వతంత్రంగా సాగాల్సిన ఈసీ పాలకుల చేతిలో మరబొమ్మగా మారిపోతున్నట్టు విమర్శలు పెల్లుబుకుతున్న సందర్భంలో అది అత్యవసరం. -
అనుమానాలను నివృత్తి చేస్తాం..రండి!
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రతీ దశలోనూ పారదర్శకంగా జరిగాయని కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) స్పష్టం చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్, కౌంటింగ్ సమయంలో అవకతవకలు జరిగాయని, ఆధారాలు చూపేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని కాంగ్రెస్ రాసిన లేఖకు ఈసీ స్పందించింది. అనుమానాల నివృత్తి కోసం డిసెంబర్ 3న ఢిల్లీలోని తమ కార్యాలయానికి రావాలని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందాన్ని ఈసీ ఆహ్వానించింది. ఎన్నికల ప్రక్రియ ప్రతి దశలోనూ కాంగ్రెస్‌తోపాటు అన్ని రాజకీయ పార్టీ అభ్యర్థులు/ఏజెంట్ల ప్రమేయం ఉందని వివరించింది. ఓటింగ్ సరళిపై ఎలాంటి అనుమానాలకు అక్కర్లేదని, పోలింగ్ బూత్‌ల వారీగా అభ్యర్థులందరికీ ఆ డేటాను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచామని నొక్కి చెప్పింది. కాంగ్రెస్ పార్టీకి ఉన్న చట్టపరమైన ఆందోళనలను, అనుమానాలను పరిశీలించి రాతపూర్వకంగా బదులిస్తామని ఈసీ స్పష్టం చేసింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు మహాయుతి కూటమిలోని బీజేపీ 132, శివసేన (షిండే) 57, ఎన్సీపీ (అజిత్) 41 సీట్లు సాధించగా, మహా వికాస్ అఘాడీ పక్షాలైన కాంగ్రెస్‌కు 16, శివసేన (ఉద్ధవ్)కు 20, ఎన్సీపీ (శరద్) పార్టీకి 10 స్థానాలు దక్కడం తెలిసిందే. -
వారం పాటు ‘ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం’
సాక్షి, న్యూఢిల్లీ: జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల సంఘం ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధాన్ని అమలు చేయనుంది. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు రెండు పార్లమెంటరీ స్థానాలు, 48 శాసనసభ నియోజకవర్గాలలో ఉప ఎన్నికల సందర్భంగా మీడియా సంస్థలు లేదా మరే ఇతర పద్ధతిలో ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయడాన్ని ఎన్నికల సంఘం నిషేధించింది. ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ తెలిపింది. నవంబర్ 13 నుంచి నవంబర్ 20 వరకు ఎగ్జిట్ పోల్స్ఫై ఆంక్షలు విధించారు. -
బీజేపీ నియంత్రణలో ఈసీ, సీబీఐ, ఈడీ: రాహుల్
రాంచీ: జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు పెంచారు. శనివారం రాంచీలో సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్ సభలో ప్రసంగించారు. ‘‘ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నుంచి సహా అన్ని వైపుల నుంచి రాజ్యాంగంపై ముప్పేట దాడులను ఎదుర్కొంటోంది. వీళ్ల దాడి నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. కేంద్ర ఎన్నికల సంఘం, సీబీఐ, ఈడీ, ఆదాయపన్ను శాఖ, పాలనాయంత్రాంగం, న్యాయపాలికసహా అన్ని వ్యవస్థలను అధికారంలోని బీజేపీ గుప్పిటపట్టింది. నిధులు, సంస్థలనూ నియంత్రణలోకి తెచ్చుకుంది. ఖాతాల స్తంభన కారణంగా నగదులేకపోయినా కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లో పోరాడింది. కులగణనకు సామాజిక ఎక్స్‌రే తప్పనిసరి. వీటికి మోదీ అడ్డుతగులుతున్నారు. మీడియా, న్యాయవ్యవస్థ నుంచి మద్దతు లేకపోయినా సరే మేం అధికారంలోకి వచ్చాక కులగణన చేపడతాం. రిజర్వేషన్లలో 50 శాతం పరిమితిని ఎత్తేస్తాం’’అని రాహుల్ అన్నారు. -
మరో మహా యుద్ధం!
మరో ఎన్నికల సమరానికి తెర లేచింది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం ప్రకటించింది. ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తర్వాత దేశంలో అత్యధికంగా 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో ఒకే విడతలో నవంబర్ 13న, మొత్తం 81 స్థానాలున్న జార్ఖండ్‌కు నవంబర్ 13, 20లలో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఈ ఏడాది ప్రథమార్ధంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టినా, సొంతకాళ్ళపై సర్కారు నడపలేని పరిస్థితి. కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికి ఇది కొంత ఊపు తెచ్చినా, తాజా హర్యానా ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ ముచ్చటగా మూడోసారి గద్దెనెక్కడంతో బ్రేకులు పడ్డాయి. ఇక, ఇప్పుడీ మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలతో ఎన్నికల గోదాలో ఈ ఏడాది ఆఖరి పంచ్ ఏ పార్టీది అవుతుందన్నది తేలనుంది. దేశానికి వాణిజ్య కూడలి లాంటి కీలకమైన మహారాష్ట్రలో బీజేపీ సారథ్య మహాయుతి కూటమికీ, శివసేన (ఉద్ధవ్ బాల్‌ఠాక్రే) – జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ – శరద్‌పవార్) – కాంగ్రెస్‌ల మహా వికాస్ ఆఘాడీ (ఎంవీఏ) కూటమికీ మధ్య పోరు రసవత్తరమే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 48 స్థానాలకు 41 గెలిచిన బీజేపీ – సేన కూటమి, 2024లో 17కే పరిమితమైంది. ఇంత దెబ్బ తగిలినా, కొన్ని నెలలుగా సంక్షేమ పథకాలు, హైవేలపై టోల్ ఫీ రద్దు లాంటి చర్యలతో మహాయుతి, సీఎం ఏక్నాథ్ శిండే రాష్ట్రంలో మళ్ళీ అధికారం నిలుపుకోవాలని చూస్తున్నారు. అయితే, రెండేళ్ళలో రెండు పార్టీలను చీల్చి అనైతిక కూటమితో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు చేశారనే ప్రజా భావన, అధికారపక్ష వ్యతిరేకత, నిరుద్యోగం, ప్రాంతాల మధ్య అభివృద్ధిలో అంతరాలు ప్రతిపక్షానికే అనుకూలిస్తాయని ఓ అంచనా. ఇక, స్థానిక పార్టీలైన శివసేన, ఎన్సీపీలు రెండుగా చీలాక ఎవరి సత్తా ఏమిటో నిరూపించుకొనేందుకు ఈ అసెంబ్లీ పోరు సిసలైన క్షేత్రస్థాయి పరీక్ష కానుంది. హర్యానాతో బీజేపీ పుంజుకుంటే, ప్రతిపక్ష కూటమిలో ఎక్కువ సీట్లు కోరి పెద్దన్న పాత్ర పోషించాలనుకున్న కాంగ్రెస్ వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి. మోదీ, అమిత్‌షాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పర్యటిస్తున్న నేపథ్యంలో... విపక్ష కూటమి విభేదాలు మరిచి, సీట్ల సర్దుబాటులో పట్టువిడుపులు చూపి, తమ వ్యూహానికి పదును పెట్టుకోకుంటే చిక్కులు తప్పవు. జార్ఖండ్ అసెంబ్లీకి జేఎంఎంతో కలసి కూటమిగా పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. సీట్ల సర్దుబాటుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోనప్పటికీ, ఇప్పటి దాకా చేసిన అభివృద్ధి పనులు తమను గెలిపిస్తాయని కూటమి నేతలు భావిస్తున్నారు. రెండు విడతల్లో జరగనున్న జార్ఖండ్ ఎన్నికలు ఆసక్తికరమైనవి. వాజ్‌పేయి హయాంలో 2000లో రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి జార్ఖండ్‌లో జేఎంఎం అయిదేళ్ళ పూర్తి కాలం అధికారంలో కొనసాగడం ఇదే తొలిసారి. గతంలో ఆ పార్టీ అనేక పర్యాయాలు అధికారంలోకి వచ్చినా, ప్రతిసారీ మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది. లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఊపును రాష్ట్రంలో కొనసాగించాలని ‘ఇండియా’ కూటమి ఉబలాటపడుతుంటే, హర్యానా ఫలితాల ఉత్సాహంతో ఈ గిరిజన రాష్ట్రంలో సరికొత్త సామాజిక సమీకరణాల ఆసరాగా అధికారంలోకి రావాలని బీజేపీ కూటమి భావిస్తోంది. ఖనిజ సంపద పుష్కలంగా ఉండే ఈ దక్షిణ బిహార్ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేయాలంటూ ఒకప్పుడు హేమంత్ తండ్రి, జేఎంఎం అధినేత శిబూ సోరెన్ ఉద్యమం చేసి, విజయం సాధించారు. ఆనాటి నుంచి గిరిజన ఓటర్లు ఆ పార్టీకి రాజకీయ అండ. హేమంత్, ఆయన కూటమి ఆ గిరిజన ఓటుబ్యాంకును నమ్ముకున్నారు. దానికి తోడు అక్రమ ఆస్తుల కేసులో హేమంత్ అరెస్ట్ వ్యవహారాన్ని చూపి, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజనుల ఆత్మగౌరవ అంశాన్ని లేవనెత్తాలని జేఎంఎం ప్రయత్నం. సంథాల్ పరగణా లాంటి మారుమూల ప్రాంతాల్లో ఆ పార్టీ సంస్థాగతంగా బలంగా ఉంటే, పట్టణ ప్రాంతాల్లో బీజేపీతో ఢీ అంటే ఢీ అనడానికి కాంగ్రెస్ సత్తా ఉపకరిస్తుందని ఆలోచన. ఇక, రాష్ట్రానికి తొలి సీఎం అయిన గిరిజనుడు బాబూలాల్ మరాండీ ప్రతిపక్ష నేతగా తమ వెంట ఉండడం బీజేపీకి కలిసొచ్చే అంశం. 2015 – 2020 మధ్య గిరిజనేతర నాయకత్వంతో ప్రయోగాలు చేసి దెబ్బతిన్న కాషాయపార్టీ పాఠాలు నేర్చుకుంది. ఈసారి స్థానిక వర్గాలతో వ్యూహాత్మక సర్దు బాట్లకు దిగింది. ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్‌తో జట్టు కట్టి కుర్మీ ఓట్లపై కన్నేసింది. మాజీ సీఎం చంపాయ్ సోరెన్‌ను పార్టీలోకి తీసుకొని గిరిజన ప్రాంతాల్లోకి చొచ్చుకుపోవాలని చూస్తోంది. వెరసి, జార్ఖండ్ ఎన్నికలు సైతం ఆసక్తికరంగా మారాయి. పార్టీల వ్యూహాలు అటుంచితే, ఈవీఎంలపై వివాదం, ఈసీ వ్యవహార శైలిపై అనుమానాలకు మాత్రం ఇప్పటికీ స్పష్టమైన సమాధానాలు లేవు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో 4 విడతల పోలింగ్‌కు సవాలక్ష కారణాలు చెప్పిన ఈసీ ఎక్కువ స్థానాలుండే అసెంబ్లీకి మాత్రం ఒకే విడత పోలింగ్ జరపడం విచిత్రమే. అలాగే, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ మంగళవారం ప్రకటించనున్నారని అస్సామ్ సీఎం హేమంత్ బిశ్వశర్మ ముందే ఎలా చెప్పగలిగారన్నదీ ప్రశ్నార్థకమే. ఇలాంటి వాటి వల్లే ఎన్నికల సంఘం స్వతంత్రత, పని తీరుపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. పోలింగ్ శాతం నుంచి ఫలితాల ప్రకటనపైనా విమర్శలెదుర్కొంటున్న ఈసీ ఇకనైనా పారదర్శకత పెంచుకోవాలి. తన నిజాయతీని నిరూపించుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్యంపై నమ్మకం మిగులు తుంది. ఎందుకంటే, ఈ కీలక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు... వచ్చే ఏడాదికి దిక్సూచి కానున్నాయి. వెంటనే వచ్చే ఢిల్లీ, ఆ పైన జరిగే బీహార్ ఎన్నికలకు భూమికను కూడా సిద్ధం చేస్తాయి. -
మోగిన మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నగారా... షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
మోగిన ఎన్నికల నగారా
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్, హరియాణా ఎన్నికల కోలాహలం ముగిసిన కొద్దిరోజులకే మరో రెండు రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికల హడావిడి మొదలుకానుంది. మహారాష్ట్ర, జార్ఖండ్ శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించి కేంద్ర ఎన్నికల సంఘం మళ్లీ ఎన్నికల వేడిని పెంచింది. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు జ్ఞానేశ్‌కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధూలు మీడియా సమావేశంలో రెండు రాష్ట్రాల ఎన్నికలతోపాటు వయనాడ్, నాందేడ్ లోక్‌సభ స్థానాలు, 15 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల షెడ్యూళ్లను విడుదలచేశారు.వారాంతాల్లో పోలింగ్ నిర్వహిస్తే పట్టణప్రాంత ఓటర్లు సెలవుదినంగా దుర్వినియోగం చేస్తున్నారన్న భావనతో పోలింగ్‌ను కేవలం బుధవారాల్లోనే రెండు రాష్ట్రాల్లో చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. మహారాష్ట్రలో ఒకే విడతలో నవంబర్ 20న, జార్ఖండ్‌లో నవంబర్ 13, 20న రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. జార్ఖండ్ తొలి విడతలో 43 స్థానాలకు, రెండో విడతలో 38 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.పశ్చిమబెంగాల్లోని బసిర్హాట్ ఎంపీ, ఉత్తరప్రదేశ్‌లోని మిల్కిపూర్ ఎమ్మెల్యే స్థానాల్లో ఎన్నికలపై పిటిషన్లు పెండింగ్‌లో ఉండటంతో ఈ రెండు స్థానాల్లో ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలచేయలేదు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే సారథ్యలోని శివసేన పారీ్టతో బీజేపీ అధికారాన్ని పంచుకున్న విషయం తెల్సిందే. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో 48 సీట్లకుగాను 31 సీట్లు గెల్చుకున్న కాంగ్రెస్–ఎన్సీపీ(ఎస్పీ)–శివసేన(యూబీటీ) కూటమి నుంచి అధికార మహాయుతి కూటమికి గట్టిసవాల్ ఎదురవుతోంది. జార్ఖండ్‌లో జార్ఖండ్ ముక్తిమోర్చా(జేఎంఎం), కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉండగా ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ఆరాటపడుతోంది. మహారాష్ట్రలో 288, జార్ఖండ్‌లో 81 మహారాష్ట్రకు సంబంధించి మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 29 ఎస్సీ, 25 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలున్నాయి. రాష్ట్రంలో 9.64 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం ఓట ర్లలో 4.97 కోట్ల మంది పురుషులుకాగా 4.66 కోట్ల మంది మహిళలు ఉన్నారు. రాష్ట్రంలో 1,00,186 పోలింగ్ స్టేషన్లను సిద్ధం చేస్తున్నారు. జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా వాటిలో 9 ఎస్సీ, 28 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలున్నాయి. రాష్ట్రంలో 2.60 కోట్ల మంది ఈసారి ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 1.31 కోట్ల మంది పురుషులు, 1.29 కోట్ల మంది మహిళలు ఉన్నారు. ఎన్నికల కోసం 29,562 పోలింగ్ స్టేషన్లను సిద్ధం చేస్తున్నారు. -
యంత్రమా.. కుతంత్రమా?
సాక్షి, అమరావతి: ఎల్రక్టానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎంలు) పనితీరుపై దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు, స్వచ్ఛంద సంస్థలు, సామాజికవేత్తల నుంచి సాధారణ ప్రజల వరకూ వ్యక్తం చేస్తున్న అనుమానాలను తాజాగా వెల్లడైన హరియాణా ఎన్నికల ఫలితాలు మరింత పెంచాయి. అత్యధిక ఓటింగ్ శాతంతో అత్యధిక ఓట్లు పొందిన కాంగ్రెస్ పార్టీ 37 స్థానాలకు పరిమితం కాగా ఆ పార్టీ కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీకి 48 సీట్లు రావడంతో ఈ సందేహాలు మరింత పెరిగాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎంల వినియోగానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హరియాణా ఎన్నికల ఫలితాల అనంతరం ఈ అనుమానాలు బలపడటంతో ప్రజాస్వామ్య పరిరక్షణకు బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా పెరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా పలు పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లకు, లెక్కింపులో వచ్చిన ఓట్లకు మధ్య భారీ తేడాలు ఉన్నట్లు వోట్ ఫర్ డెమోక్రెసీ (వీఎఫ్‌డీ), అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సంస్థలు ఆధారాలతో సహితంగా బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. వైఎస్సార్ సీపీ కూడా ఈవీఎంల పనితీరుపై పలు సందేహాలను వ్యక్తం చేయడం విదితమే. ఈసీ మౌనంతో పెరుగుతున్న అనుమానాలు ఈవీఎంలపై తలెత్తిన సందేహాలను నివృత్తి చేయాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తొలి నుంచీ మౌనం వహిస్తుండటం అనుమానాలను మరింత పెంచుతోంది. ఫలితాలు వెల్లడైన వెంటనే అప్లోడ్ చేయాల్సిన ఫారం– 20 వివరాలపై తీవ్ర జాప్యం చేయడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. ఫారం – 20లో ఆయా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి అభ్యర్థికి పోలైన ఓట్ల వివరాలు ఉంటాయి. దీని ద్వారా ప్రతి నియోజకవర్గంలో పోటీ చేసిన ఒక్కో అభ్యరి్థకి ఎన్ని ఓట్లు పోలయ్యాయి? లెక్కింపులో ఎన్ని ఓట్లు వచ్చాయి? అనేది తెలిసిపోతుంది.సాధారణంగా ఫారం–20ని ఓట్ల లెక్కింపు జరిగిన వారం రోజుల్లోనే వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. అయితే ఎన్నికల సంఘం ఈసారి ఈ వివరాలను వెంటనే వెల్లడించలేదు. ఎన్నికల కౌంటింగ్ జరిగిన 108 రోజుల తర్వాత తాపీగా గత నెల 19న నియోజకవర్గాలవారీగా పార్లమెంటు, శాసన సభ స్థానాలకు లెక్కించిన ఓట్ల వివరాలతో ఫారం–20ని ‘సీఈవో ఆంధ్ర’ వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. ఇంత ఆలస్యంగా వెల్లడించడంపై పలు అనుమానాలు ముసురుకుంటున్నాయి. భారీగా పెరిగిన పోలింగ్ శాతం ప్రతి ఎన్నికల్లో పోలింగ్ రోజు ఈసీ ప్రాథమికంగా పోలింగ్ శాతాన్ని ప్రకటిస్తుంది. ఆ తర్వాత రోజు తుది శాతాలను ప్రకటిస్తుంది. అయితే ఈసారి పోలింగ్ తుది శాతాన్ని ప్రకటించేందుకు ఏకంగా నాలుగు రోజుల సమయం తీసుకుంది. అందులోనూ ప్రాథమికంగా పోలైన ఓట్లకు, తుది ఓట్లకు మధ్య భారీ తేడాలు ఉన్నాయి. ఇలా తుది శాతాల ప్రకటనకు సుదీర్ఘ సమయం తీసుకోవడం, భారీ తేడాలు రావడంతో అనుమానాలకు బీజం పడింది. మే 13న రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. ఆరోజు రాత్రి 8 గంటలకు తొలుత పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం ప్రకటించింది. తుది శాతాన్ని నాలుగు రోజులు ఆలస్యంగా మే 17న ప్రకటించింది. రాష్ట్రంలో ఈ రెండు పోలింగ్ శాతాల మధ్య 12.54 శాతం పెరుగుదల ఉంది. రాష్ట్రంలో పోలైన ఓట్లలో ఏకంగా 49 లక్షల ఓట్లు అదనంగా పెరిగాయి. రాష్ట్రంలోని 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో సగటున 1.96 లక్షల ఓట్లు అదనంగా పోలయ్యాయి. ఇది ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిందని వోట్ ఫర్ డెమొక్రసీ (వీఎఫ్‌డీ) సంస్థ స్పష్టం చేసింది.దేశవ్యాప్తంగా 538 స్థానాల్లో తేడాలు.. దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 538 ఎంపీ స్థానాల్లో పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్లకు మధ్య భారీ తేడాలు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్), వీఎఫ్‌డీ సంస్థలు పేర్కొన్నాయి. 362 నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే 5,54,598 ఓట్లను తక్కువగా లెక్కించినట్లు తమ అధ్యయనంలో వెల్లడైందని తెలిపాయి. 176 లోక్‌సభ స్థానాల్లో 35,093 ఓట్లకుపైగా అదనంగా లెక్కించారని వెల్లడించాయి. పోలైన ఓట్ల ప్రకారం చూస్తే ఏపీలో కూటమికి 14, వైఎస్సార్సీపీకి 11 లోక్‌సభ స్థానాలు దక్కాలని వీడీఎఫ్ స్పష్టం చేసింది. తమ అధ్యయన నివేదికలను ఎన్నికల సంఘానికి కూడా పంపాయి. పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటానికి కారణాలు ఏమిటో వెల్లడించాలని ఏడీఆర్, వీఎఫ్‌డీ సంస్థల ప్రతినిధులు ఎన్నికల సంఘాన్ని అప్పట్లోనే ప్రశ్నించారు. కానీ.. ఎన్నికల సంఘం ఇప్పటికీ దీనిపై స్పందించకపోవడం గమనార్హం. -
అసెంబ్లీ ఓటర్ల జాబితానే ప్రామాణికం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు జాబితాను యథావిధిగా పరిగణనలోకి తీసుకొని వార్డులు, గ్రామపంచాయతీల వారీగా ముసా యిదా ఓటరులిస్టు తయారు చేయాలని అధికారు లను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి ఆదే శించారు. ముసాయిదా జాబితాలను వచ్చేనెల 6న గ్రామ పంచాయతీల్లో ప్రచురించాలని సూచించా రు. త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్ని కల నిర్వహణకు వార్డులు, గ్రామపంచాయతీల వారీగా ఓటరు జాబితాల తయారీ, ప్రచురణ పురో గతిపై గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ ఈసీ) కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్థసారథి సమీక్షించారు. జిల్లా కలెక్టర్లు (హైదరాబాద్ మినహా) అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు), డీపీవో, డీఎల్పీవోలు, అసెంబ్లీ నియో జకవర్గాల ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు పాల్గొ న్నారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ ముసాయిదా ఓటర్ల జాబి తాల ప్రచురణ తర్వాత మండల, జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై వారి సలహాలు, సూచనలు తీసుకోవాల న్నారు. ఈ ముసాయిదా జాబితాలో ఏవైనా పొరపాట్లు జరిగితే వచ్చేనెల 13వ తేదీ వరకు సంబంధిత ఎంపీడీవోలు, డీపీవోలకు రాత పూర్వకంగా తెలియజేయాలని చెప్పారు. సవరించిన తుది ఓటర్ల జాబితాను వచ్చేనెల 21న ప్రచు రించాలని ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా అర్హులైన ఓటర్లు తమ పేర్లు జీపీ ఓటర్ల జాబితాలో చేర్చు కోవాలన్నా, ఎవరైనా ఓటరును జీపీ ఓటరు లిస్టులో కొనసాగించడానికి ఆక్షేపణలున్నా, వారు నిర్దేశించిన ఫారాలలో సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్టోరల్ రిజి స్ట్రేషన్ అధికారికి దరఖాస్తు చేసుకో వాలన్నారు. ఓటరు జాబితా తయారీ తర్వాత, వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, పోలింగ్ సిబ్బంది వివరాల సేకరణ, రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల నియామకం, పోలింగ్ సిబ్బంది శిక్షణ తదితరాలపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహకారంతో ఎస్ఈసీ తయారు చేసిన గ్రీవెన్స్ మాడ్యూల్‌ను పార్థసారథి ఆవిష్కరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పీఆర్ శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్, పీఆర్ ఆర్డీ కమిషనర్ అనితా రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు. -
జమ్మూకశ్మీర్, హరియాణా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం.. జమ్మూకశ్మీర్‌లో మూడు దశల్లో, హరియాణాలో ఒక దశలో పోలింగ్.. అక్టోబర్ 4న ఫలితాలు. ఇంకా ఇతర అప్డేట్స్
-
Election Commission of India: మోగింది ఎన్నికల భేరీ
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో దశాబ్ద కాలం తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఆర్టీకల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన అనంతరం తొలిసారిగా ఎన్నికల సందడి ప్రారంభం కాబోతోంది. జమ్మూకశ్మీర్‌తోపాటు హరియాణా శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. 90 స్థానాలున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి మూడు దశల్లో, 90 స్థానాలున్న హరియాణా అసెంబ్లీకి ఒక దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌లో సెపె్టంబర్ 18, సెపె్టంబర్ 25, అక్టోబర్ 1న, హరియాణాలో అక్టోబర్ 1న ఎన్నికలు జరుగుతాయని, రెండు రాష్ట్రాల్లో అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలియజేశారు. జమ్మూకశ్మీర్‌లో మొదటి దశలో 24 సీట్లకు, రెండో దశలో 26 సీట్లకు, మూడో దశలో 40 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ చివరిసారిగా 2014 నవంబర్–డిసెంబర్లో ఐదు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలను సాధారణంగా ఐదు దశల్లో నిర్వహిస్తుంటారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో జరిగాయి. దీనిపై విమర్శలు వచ్చాయి. అందుకే జమ్మూకశ్మీర్‌లో తక్కువ సమయంలోనే ఎన్నికలు నిర్వహిస్తామంటూ ఇచి్చన హామీని నిలబెట్టుకుంటున్నామని రాజీవ్ కుమార్ చెప్పారు. ఈసారి కేవలం మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి చేయబోతున్నామని తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో భద్రతా అవసరాల వల్లే.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను మరికొన్ని రోజుల్లో ప్రకటిస్తామని రాజీవ్ కుమార్ చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో భద్రతా అవసరాలను దృష్టిలో పెట్టుకొని మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్‌ను వాయిదా వేసినట్లు వివరించారు. 2019లో హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దాదాపు ఒకే సమయంలో జరిగాయి. ఈ ఏడాది, వచ్చే ఏడాది ఆరంభంలో మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ శాసనసభ ఎన్నికలు సైతం జరగాల్సి ఉందని, వీటిలో రెండు రాష్ట్రాలకు కలిపి ఒకసారి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్, హరియాణాలో పోలింగ్ పూర్తయిన తర్వాత మిగిలిన రాష్ట్రాల షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు. మీడియా సమావేశంలో రాజీవ్ కుమార్‌తోపాటు ఎన్నికల సంఘం కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్సింగ్ సంధూ పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్‌లో ప్రత్యేక ప్రతిపత్తి కలి్పస్తున్న ఆర్టీకల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమరి్థంచిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెపె్టంబర్ 30వ తేదీలోగా జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.ముగ్గురు జెంటిల్మెన్ మళ్లీ వచ్చేశారు ముగ్గురు పెద్దమనుషులు(జెంటిల్మెన్) మళ్లీ వచ్చేశారని మీడియా సమావేశంలో సీఈసీ రాజీవ్ కుమార్ చమత్కరించారు. తన సహచర కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధూను విలేకరులకు పరిచయం చేశారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో ‘లాపతా జెంటిల్మెన్’ అంటూ ట్రోలింగ్ నడిచింది. ‘లాపతా లేడీస్’ చిత్రాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర ఎన్నికల సంఘంలోని ముగ్గురు సభ్యులు కనిపించకుండాపోయారని, లోక్‌సభ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని, రాజకీయ నాయకులు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారని నెటిజన్లు విమర్శలు గుప్పించారు. జూన్ 3న విలేకరుల సమావేశంలో రాజీవ్ కుమార్ మాట్లాడుతూ... లాపతా జెంటిల్‌మన్లు త్వరలో తిరిగివస్తారని చెప్పారు. తాము ఎక్కడికీ వెళ్లలేదని, ఇక్కడే ఉంటున్నామని పేర్కొన్నారు. -
‘సుప్రీం’ తీర్పులకు ఈసీ వక్రభాష్యం
సాక్షి, అమరావతి: ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)ల పనితీరుపై దేశవ్యాప్తంగా అనుమానాలు, సందేహాలు పెరిగిపోతున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. సుప్రీంకోర్టు తీర్పునకు వక్రభాష్యం చెబుతూ ఎన్నికల సంఘం రూపొందించిన టెక్నికల్ స్టాండర్ట్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (టీ–ఎస్వోపీ)పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సంఘం తీరుపై ప్రజల్లో, పోటీ చేసిన అభ్యర్థుల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులకు వారు ఎంపిక చేసుకున్న పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తనిఖీ, పరిశీలనకు అవకాశం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు ఎన్నికల సంఘం తిలోదకాలిచ్చింది. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తనిఖీ, పరిశీలన చేయకుండా మాక్ పోలింగ్ నిర్వహించి చేతులు దులిపేసుకునే దిశగా ఎన్నికల సంఘం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. మాక్ పోలింగ్ నిర్వహించడం ద్వారా ఈవీఎంల ట్యాంపరింగ్ బయట పడే అవకాశమే లేదన్నది నిపుణుల మాట. ఈవీఎంలలో నమోదైన ఓట్లు, వీవీ ప్యాట్ స్లిప్పులను సరిపోల్చి పరిశీలిస్తే కానీ ఈవీఎంల ట్యాంపరింగ్ వెలుగుచూసే అవకాశం ఉండదని వారు చెబుతున్నారు. మాక్ పోలింగ్ కేవలం ఆయా మిషన్లు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అన్న విషయాన్ని మాత్రమే రూఢీ చేస్తుందని, అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేయదని స్పష్టంగా చెబుతున్నారు. సుప్రీంకోర్టు చెప్పింది ఇదీ... ఎన్నికల ఫలితాలు వెల్లడైన తరువాత ఈవీఎంల ట్యాంపరింగ్, మార్పులపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలైన ఓట్లను వీవీ ప్యాట్ల స్లిప్పులతో సరిపోల్చి చూడాలని ఎన్నికల్లో పోటీ చేసి ఓట్లపరంగా రెండు, మూడు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు రాతపూర్వకంగా కోరవచ్చు. అలాంటప్పుడు ఒక్కో అసెంబ్లీ లేదా పార్లమెంట్ నియోజకవర్గ అసెంబ్లీ సెగ్మెంట్లలో 5 శాతం ఈవీఎంలను, వీవీ ప్యాట్ల స్లిప్పులను ఈవీఎంల తయారీ సంస్థల ఇంజనీర్లు తనిఖీ చేసి పరిశీలన చేసి తీరాలి. పోలింగ్ స్టేషన్లను లేదా సీరియల్ నంబర్లను అభ్యర్థులే ఎంపిక చేసుకోవచ్చు. ఈవీఎంల పరిశీలన కోరిన అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులు ఈవీఎంలు, వీవీ ప్యాట్ల పరిశీలన సమయంలో ఉండొచ్చు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన వారం లోపు అభ్యర్థులు ఈవీఎంల పరిశీలన కోరవచ్చు. ఇంజనీర్లతో సంప్రదించిన తరువాత ఈవీఎంల తాలూకు మైక్రో కంట్రోలర్ల ప్రామాణికతను ఎన్నికల అధికారి ధృవీకరించాలి. ఈవీఎం ట్యాంపరింగ్ అయిందని తేలితే పరిశీలన నిమిత్తం ఆ అభ్యర్థి చెల్లించిన మొత్తాన్ని వాపసు చేయాలి. ఎన్నికల సంఘం చేస్తున్నది ఇదీ... ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్లకు, ఆయా అభ్యర్థులకు వచ్చిన ఓట్లకు పొంతనే లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికులకు అసాధారణ మెజారిటీలు వచ్చాయి. ఇవన్నీ ఈవీఎంల పనితీరుపై సందేహాలు, అనుమానాలు రేకెత్తించాయి. దీంతో ఈవీఎంల ట్యాంపరింగ్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈవీఎంలు, వీవీ ప్యాట్ల పరిశీలనకు వైఎస్సార్సీపీ అభ్యర్థులు కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం ఫీజు సైతం చెల్లించారు. అయితే ఇటీవల ఎన్నికల అధికారులు ఈ ఫీజును వాపసు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేతలపై ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు. అయితే ఈ ఒత్తిళ్లకు వారు లొంగలేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తనిఖీ, పరిశీలన చేస్తే ఈవీఎంల ట్యాంపరింగ్ బయటపడుతుందన్న ఆందోళనతోనే ఎన్నికల అధికారులు ఇలా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. తనిఖీ, పరిశీలన స్థానంలో మాక్ పోలింగ్‌ను తెరపైకి తెచ్చారు. ఏమిటీ మాక్ పోలింగ్..? మాక్ పోలింగ్ అనేది ఎన్నికల సంఘం రొటీన్‌గా నిర్వహించే ఓ ప్రక్రియ. పోలింగ్‌కు కొద్ది రోజుల ముందు ఈవీఎంలు, వీవీ ప్యాట్లు, సింబల్ లోడింగ్ యూనిట్లు తదితరాలను తనిఖీ చేస్తారు. ఈవీఎంల తయారీ సంస్థల ఇంజనీర్ల ఆధ్వర్యంలో ఈ తనిఖీలు, పరిశీలనలు ఉంటాయి. పోలింగ్ రోజు ఎలాగైతే ఆయా మిషన్లను ఓటింగ్ కోసం ఉపయోగిస్తారో అదే రీతిలో మాక్ పోలింగ్ సందర్భంగా వాటిని వినియోగిస్తారు. ఒక్కో బటను నొక్కి సక్రమంగా పనిచేస్తుందా? లేదా? అనేది పరిశీలిస్తారు. ఒక్కో అభ్యర్థి పేరు పక్కన ఉన్న బటన్‌ను నొక్కి పని తీరును పరిశీలిస్తారు. అలాగే వీవీ ప్యాట్ల స్లిప్పులు సక్రమంగా వస్తున్నాయా? లేదా? చూస్తారు. అన్ని యూనిట్లు సక్రమంగా కనెక్ట్ అయ్యాయా? లేదా? అన్న విషయాన్ని కూడా పరిశీలిస్తారు. అన్నీ సమన్వయంతో పనిచేస్తున్నాయా? లేదా? అనేది తనిఖీ చేస్తారు. ఎన్నికల సంఘం తీరుపై బాలినేని న్యాయ పోరాటం.. తన నియోజకవర్గంలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందన్న అనుమానాలతో ఓటింగ్ యంత్రాల పరిశీలన, తనిఖీ కోసం దరఖాస్తు చేసుకున్న ఒంగోలు వైఎస్సార్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి తాజాగా ఎన్నికల సంఘం జారీ చేసిన మాక్ పోలింగ్ ఆదేశాలపై న్యాయ పోరాటానికి దిగారు. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినట్లు ఆయన న్యాయవాది వివేకానంద తెలిపారు. ఈ నెల 16న జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని పిటిషన్లో కోర్టును కోరినట్లు చెప్పారు. మాక్ పోలింగ్ ద్వారా ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తనిఖీ, పరిశీలనను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని అభ్యరి్థంచామన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తేనే తనకు న్యాయం జరుగుతుందని, అత్యున్నత న్యాయస్థానం తీర్పును అమలు చేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరామన్నారు. -
సెప్టెంబర్ 3న రాజ్యసభ ఉప ఎన్నికలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఖాళీ అయిన 12 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ 12 స్థానాలకు సెప్టెంబర్ 3న ఎన్నికలు జరుగనున్నట్లు బుధవారం ప్రకటించింది. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, సర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా సహా కాంగ్రెస్ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, దీపేందర్ హుడా వంటి సిట్టింగ్ సభ్యులు లోక్‌సభకు ఎన్నికవడంతో ఆ స్థానాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న కె.కేశవరావు కాంగ్రెస్‌లోకి మారడంతో పాటు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఒక సీటు, ఒడిశాలో మమతా మొహంతా రాజీనామాతో మరో సీటు ఖాళీ అయింది. ఈ 12 స్థానాలకు ఆగస్టు 12న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా, నామినేషన్ పత్రాల దాఖలుకు ఆగస్టు 21 చివరి తేదీగా ఈసీ ప్రకటించింది. 22న నామినేషన్ పత్రాల పరిశీలన, 26న అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, త్రిపుర, 27న బిహార్, రాజస్తాన్, తెలంగాణ, ఒడిశాల్లో నామినేషన్ల ఉపసంహరణకు గడువిచి్చంది. సెపె్టంబర్ 3వ తేదీన ఓటింగ్ నిర్వహిస్తారని, అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేస్తారని తెలిపింది. -
మళ్లీ ‘టీఆర్ఎస్’! బీఆర్ఎస్ పేరు మార్పుపై సాగుతున్న అధ్యయనం
సాక్షి, హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరు తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)గా మార్చాల్సిందేనంటూ పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ పేరు మార్పునకు సంబంధించిన ప్రక్రియ కోసం త్వరలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. పార్టీ పేరును తిరిగి ‘టీఆర్ ఎస్’గా మార్చేందుకు అనురించాల్సిన ప్రక్రియపై ఇప్పటికే పార్టీపరంగా అధ్యయనం జరుగుతోంది. పార్టీ పేరు మార్పునకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. బీఆర్ఎస్ పేరును తిరిగి టీఆర్ఎస్గా మార్చడం సాంకేతికంగా సాధ్యమేనని ఎన్నికల సంఘం నిబంధనలు వెల్లడిస్తున్నట్టు పార్టీవర్గాలు తెలిపాయి. అయితే తిరిగి టీఆర్ఎస్గా పేరును మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బీఆర్ఎస్ నుంచి పలు వివరణలు కోరే అవకాశమున్నందున, అవసరమైన సమాచారాన్ని కూడా సిద్ధం చేసుకోవడంపై దృష్టి సారించింది. ‘టీఆర్ఎస్’పై ఆరేళ్లు ఫ్రీజ్ ‘తెలంగాణ రాష్ట్ర సమితి’పేరు ఇతరులకు కేటాయించకుండా ఎన్నికల సంఘం ఆరేళ్ల పాటు ఫ్రీజ్ చేసింది. పేరు మార్పుకు బీఆర్ఎస్ నుంచి అందిన దరఖాస్తును ఆమోదిస్తే ఓటర్లలో ఏదైనా గందరగోళం ఏర్పడుతుందా అనే విషయాన్ని ఎన్నికల సంఘం ప్రధానంగా పరిశీలిస్తుందని పార్టీవర్గాలు చెబుతున్నాయి. తిరిగి టీఆర్ఎస్గా పేరు మార్పునకు ఎన్నికల సంఘం అంగీకరిస్తే పార్టీ ఎన్నికల చిహ్నం ‘కారు గుర్తు’తిరిగి దక్కుతుందా లేదా అంశాన్ని కూడా బీఆర్ఎస్ అధ్యయనం చేస్తోంది. పేరు మార్పుకు అవసరమైతే పార్టీ నియమావళిని సవరించాల్సి ఉంటుంది. ఈ మేరకు పార్టీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి నియమావళిలో సవరణలను ఆమోదించాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ పేరును తిరిగి టీఆర్ఎస్గా మార్చడంపై పార్టీ చేసే విన్నపాన్ని ఆమోదించే విచక్షణాధికారం కేంద్ర ఎన్నికల సంఘానికే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈసీ నియమావళిని లోతుగా అధ్యయనం చేసి పార్టీ పేరు మార్పుపై సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. త్వరలో జరిగే పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పార్టీ పేరు మార్పు అంశంపై తీర్మానం చేసే అవకాశముందని బీఆర్ఎస్ నేతలు వెల్లడించారు. జాతీయ రాజకీయాల కోసం ‘బీఆర్ఎస్’.. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి రెండు దశాబ్దాల అనంతరం పార్టీ పేరును మార్చుకుంది. జాతీయ రాజకీయాల్లో పార్టీ కార్యకలాపాల విస్తరణకు 2022 అక్టోబర్ 5న భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చారు. పార్టీ పేరు మార్పిడికి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలపడంతో పార్లమెంటు, అసెంబ్లీలోనూ బీఆర్ఎస్ పేరు మార్పునకు ఆమోదముద్ర పడింది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పేరిట పోటీ చేసి రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై ఈ ఏడాది జనవరిలో లోక్‌సభ నియోజకవర్గాల వారీగా జరిగిన పోస్ట్‌మార్టమ్‌లో పార్టీ పేరు మార్చడం కూడా ఓటమికి ప్రధాన కారణంగా పార్టీ శ్రేణులు నొక్కి చెప్పాయి. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అన్ని చోట్లా ఓటమి పాలవడంతో పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చాలని అధినేత కేసీఆర్‌పై ఒత్తిడి చేస్తున్నారు. ఎర్రవల్లి నివాసంలో జరిగిన భేటీల్లోనూ పార్టీ నేతలు ఇదే అంశాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. పార్టీ పేరు మార్పుతో ‘తెలంగాణతో పేగుబంధం తెగిపోయిందనే భావన’ప్రజల్లో నెలకొందని కొందరు అధినేతకు వివరించారు. ఈ నేపథ్యంలో పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్గా మార్చడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరుగుతోంది. -
వలంటీర్ల వ్యవస్థపై నేడు స్పష్టత!
సాక్షి, అమరావతి: ఐదేళ్ల కిందట రాష్ట్రంలో కొత్తగా అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం యథావిధిగా పూర్తిస్థాయిలో అమలు చేస్తుందా లేక మార్పులు చేస్తుందా అన్నదానిపై సోమవారం కొంత స్పష్టత వస్తుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. మొన్నటి ఎన్నికల్లో గెలుపొందిన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వలంటీర్ల వ్యవస్థపై చర్చించే అవకాశం ఉందని, ఈ వ్యవస్థపై ప్రభుత్వ ఆలోచనలు ఏమిటన్నది తెలుస్తుందని చెబుతున్నాయి.చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ.. గత ఐదేళ్లలో కొత్తగా ఏర్పడిన ఈ వ్యవస్థకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయనతోపాటు మంత్రివర్గ సభ్యులందరికీ కూలంకషంగా వివరించేందుకు గ్రామ, వార్డు సచివాలయాలశాఖ ఉన్నతాధికారులు వివిధ రకాల పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు (పీపీటీలు) సిద్ధం చేశారు. మంత్రివర్గ సమావేశానికి ముందే సోమవారం సంబంధిత మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ఆ శాఖ అధికారులతో వేరుగా సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో ప్రతి 50 ఇళ్లకు ఒకరు, పట్టణ ప్రాంతాల్లో 75–100 ఇళ్లకు ఒకరు చొప్పున మొత్తం 2.65 లక్షలమంది వలంటీర్లతో 2019 ఆగస్టు 15న గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థ ఏర్పడిన విషయం తెలిసిందే. అదే ఏడాది 2019 ఆక్టోబరు 2న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను కూడా అప్పటి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసేందుకు ఏకంగా 1.34 లక్షల కొత్త శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను మంజూరు చేసి అప్పటికప్పుడే భర్తీ చేసింది.ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.27 లక్షల మంది శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు. అయితే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు అనుబంధంగా గౌరవ వేతనంతో పనిచేసే 2.65 లక్షల మంది వలంటీర్లపై మొన్నటి ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం అనేక ఆంక్షలు విధించడంతో పాటు ఇతర కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వలంటీర్లు రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం దాదాపు లక్షన్నరమంది వలంటీర్లు మాత్రమే పనిచేస్తున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. -
ఏపీలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు 12న ఉప ఎన్నిక
సాక్షి, న్యూఢిల్లీ: ఎమ్మెల్యే కోటాలో ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీతో పాటు కర్ణాటక, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోని ఒక్కో స్థానానికి మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జూలై 12న ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. వీటిలో మూడు స్థానాలకు ఎమ్మెల్సీల రాజీనామా కారణంగా, రెండు స్థానాలకు అనర్హత వేటు కారణంగా ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది.ఏపీలో సి.రామచంద్రయ్యపై అనర్హత వేటు పడగా, షేక్ మహ్మద్ ఇక్బాల్ రాజీనామా చేశారు. దీంతో ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఇద్దరి పదవీకాలం 2027 మార్చి 29 వరకు ఉంది. ఈ ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జూన్ 25న నోటిఫికేషన్ విడుదల కానుంది. జూలై 12న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. -
ఈవీఎంల గుట్టు విప్పేదెవరు?
సాక్షి, అమరావతి: ఎల్రక్టానిక్ ఓటింగ్ మెషిన్ల (ఈవీఎంలు) పనితీరుపై ముసురుకుంటున్న అనుమానాలతో ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈవీఎంల హ్యాకింగ్ అసాధ్యమేమీ కాదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానం సాయంతో వాటిని సులభంగా హ్యాక్ చేయవచ్చని టెక్ దిగ్గజం, టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ తాజాగా ట్వీట్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈవీఎంలను మనుషులు కూడా హ్యాక్ చేసేందుకు ఆస్కారం ఉందని, అసలు వీటిని రద్దు చేయాలని చాట్ జీపీటీ నిపుణుడైన ఆయన గట్టిగా డిమాండ్ చేయడం గమనార్హం. మరోవైపు ముంబైలో గెలుపొందిన శివసేన (షిండే) అభ్యర్థి రవీంద్ర వైకర్ బంధువు ఒకరు మొబైల్ ద్వారా ఈవీఎంను హ్యాక్ చేసి ఆపరేట్ చేసినట్లు వెలుగులోకి రావడం ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సైతం ఈవీఎంల పనితీరుపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో పారదర్శకత లేకుంటే భవిష్యత్తు లేదని హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఓటింగ్ సరళిపై ఇప్పటికే పలువురు నిపుణులు, పరిశీలకులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా తమ ఓట్లన్నీ ఏమయ్యాయంటూ గ్రామాలకు గ్రామాలే నిలదీస్తుండటం గమనార్హం. గెలుపొందిన అభ్యర్థులు సైతం ఊహించని స్థాయిలో మెజారిటీలు రావటంపై నీలి నీడలు అలుముకుంటున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఈవీఎంల పనితీరుపై సర్వత్రా సందేహాలు తలెత్తుతున్నా... తాము వేసిన ఓట్లు ఏమయ్యాయని ఓటర్లు ప్రశ్నిస్తున్నా.. 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయని యావత్ దేశం నిలదీస్తున్నా... ఇవిగో ఈవీఎం మోసాలంటూ ఆధారాలు చూపిస్తున్నా... కేంద్ర ఎన్నికల సంఘం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. ‘తాంబూలాలు ఇచ్చేశాం... ఇక తన్నుకు చావండి’ అనే రీతిలో ఎన్నికల ప్రక్రియ ముగిశాక తమకు సంబంధం లేదనే రీతిలో బాధ్యతల నుంచి ఈసీ పలాయనం చిత్తగించడం ఈ సందేహాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించిన అనంతరం అందులో లొసుగులు గుర్తించడంతో వాటిని నిషేధించిన దేశాల సంఖ్య పెరుగుతోంది. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఇప్పటికీ బ్యాలెట్ పేపర్ విధానాన్నే అనుసరిస్తున్న నేపథ్యంలో మన దేశంలో ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణ సరికాదని సాధారణ ఓటర్లతోపాటు నిపుణులు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగా పరీక్షిస్తే కానీ ఈ రహస్యం వీడదని టెక్ నిపుణులు వాŠయ్‌ఖ్యానిస్తున్నారు. చిప్‌లోనే చిదంబర రహస్యం..! ఈవీఎంలలో ఉపయోగిస్తున్న చిప్‌లపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిజ్ఞానంపై కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) సూటిగా సమాధానం చెప్పకపోవడం సందేహాలకు బలం చేకూరుస్తోంది. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని పలువురు సవాళ్లు విసురుతున్నా ఈసీ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. దీనిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఈసీ చేసిన ప్రకటన మరిన్ని సందేహాలకు తావిచ్చింది. ఈవీఎంలలలో బ్లూటూత్ టెక్నాలజీ లాంటిది ఉండదు కాబట్టి హ్యాక్ చేయడం సాధ్యం కాదని ఈసీ ఇటీవల వరకు వాదిస్తూ వచ్చింది. అయితే ఈవీఎంలలో ప్రోగ్రామబుల్ చిప్‌లు ఉపయోగిస్తున్నామని, ఫ్లాష్ మెమరీ వాడకం కూడా ఉంటుందని ఈసీ ఇటీవల తొలిసారిగా అంగీకరించింది. ప్రోగ్రామబుల్ చిప్‌లు, ఫ్లాష్ మెమరీని హ్యాక్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఈవీఎంలు భద్రమేనా? అంటే ఈసీ సూటిగా సమాధానం చెప్పడం లేదు. భద్రతా సందేహాస్పదమే ఈవీఎంల భద్రత, నిర్వహణపైనా నీలి నీడలు అలుముకుంటున్నాయి. నిపుణులు వ్యక్తం చేస్తున్న సందేహాలకు ఈసీ సూటిగా సమాధానాలు చెప్పడం లేదు. ఈవీఎంల నిర్వహణ విషయంలో ఎన్నో భద్రత లోపాలు, ఇతర లొసుగులు ఉన్నట్లు ఇప్పటికే చాలా సందర్భాల్లో రుజువైంది. 2017 డిసెంబరు నాటికే ఈవీఎంల చోరీ, ధ్వంసం ఉదంతాలు దాదాపు 70 వరకూ చోటు చేసుకున్నట్లు ‘ద వైర్’ ప్రచురించిన కథనం స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్‌కు చెందిన మాజీ మంత్రి సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఈసీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈవీఎంలను తయారు చేసే ఎల్రక్టానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రకటన ప్రకారం.. ఈసీఐ కోరిన దాని కంటే 1,97,368 ఈవీఎంలు, 3,55,747 కంట్రోల్ యూనిట్లు ఎక్కువగా తయారయ్యాయి. 2024 ఎన్నికల సందర్భంగా కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఈవీఎంలు ప్రైవేట్ వ్యక్తుల వద్ద లభించాయి. ఇక చోరీకి గురైన ఈవీఎంలపై ఈసీ స్పందన విడ్డూరంగా ఉంది. ప్రతి ఈవీఎంకు ప్రత్యేకమైన ఐడీ ఉంటుందని, యంత్రం చోరీకి గురైనా, కనిపించకుండా పోయినా ఆ ఐడీని బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని పేర్కొంది. తద్వారా ఆ ఈవీఎంలలో నమోదైన ఓట్లు పోలైన ఓట్లలో కలవకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలిపింది. మరి చోరీకి గురైన యంత్రాల్లో పరికరాలను మార్చినా, ఓటింగ్ నమోదు చేసేందుకు వాడిన సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసి ఇతర ఈవీఎంలతో కలిపేస్తే ఏమవుతుంది? అనే ప్రశ్నలకు ఈసీ మౌనం దాల్చడం గమనార్హం. ఈవీఎంలను భద్రపరుస్తున్న ప్రదేశాలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నాయా? సీసీ కెమెరాలు ఉంటే వాటి ఫుటేజీని అందరికీ ఎందుకు అందుబాటులోకి ఉంచడం లేదు? అందులో ఇబ్బంది ఏమిటి? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. పోలింగ్ ముగిసిన తరువాత ఓట్ల లెక్కింపు వరకు స్ట్రాంగ్ రూమ్‌లలో ఈవీఎంల భద్రత వ్యవస్థ ఎంతవరకు పటిష్టం? అనే సందేహాలున్నాయి. స్ట్రాంగ్ రూమ్‌ల సీసీ కెమెరాల ఫుటేజీలను అన్ని పార్టీలకూ అందుబాటులో ఉంచితే పారదర్శకంగా ఉంటుంది. ఈ డిమాండ్‌పై ఈసీ కనీసం స్పందించలేదు. ఒకవైపు ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యమేనని నిపుణులు బల్లగుద్ది చెబుతుండగా సందేహాలను నివృత్తి చేయాల్సిన ఈసీ దాగుడుమూతలు ఆడటం అనుమానాలను బలపరుస్తోంది. 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయి? దేశంలో ఏకంగా 20 లక్షల ఈవీఎంలు కనిపించకపోడం మొత్తం ఎన్నికల ప్రక్రియపైనే ప్రశ్నార్థకంగా మార్చేసింది. ఎన్నికల నిర్వహణ కోసం 60 లక్షల ఈవీఎంలను దిగుమతి చేసుకోగా వాటిలో 40 లక్షల ఈవీఎంలను ఎన్నికల ప్రక్రియకు కేటాయించినట్టు ఈసీ వెల్లడించింది. మరి మిగిలిన 20 లక్షల ఈవీఎంలు ఎక్కడున్నాయనే ప్రశ్నకు ఇటు ఈసీగానీ అటు కేంద్ర ప్రభుత్వంగానీ జవాబు చెప్పడం లేదు. ఆ 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయో చెప్పాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ గట్టిగా డిమాండ్ చేశారు. దేశంలో ఎంపిక చేసిన రాష్ట్రాలు, నియోజకవర్గాల్లో గుట్టు చప్పుడు కాకుండా ఈవీఎంలను మార్చి అక్రమాలకు పాల్పడినట్లు కమ్యూనిస్టు పార్టీలు ఆరోపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా విభ్రాంతి వ్యక్తమవుతోంది. వైఎస్సార్ సీపీ, బిజూ జనతాదళ్ పార్టీలు తమకు అత్యంత బలమైన స్థానాల్లో కూడా ఓడిపోవడం విస్మయపరుస్తోంది. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీకి ఏమాత్రం బలం లేని నియోజకవర్గాల్లో సైతం ఆ పార్టీల అభ్యర్థులకు అనూహ్య మెజార్టీలు వచ్చాయి. ఇక ఒడిశాలో బీజేపీ ఉనికి అంతంత మాత్రంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం గమనార్హం. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు పడ్డ పాట్లన్నీ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో.. కర్ణాటకలో ఓ బీజేపీ ఎంపీ అభ్యర్థి వాహనంలో ఈవీఎంలు తరలిస్తున్న విషయం ఎన్నికల ముందే బయటపడింది. పిఠాపురం నియోజకవర్గంలో ఈవీఎంలను బస్సులో తరలించారు. ఓ ప్రైవేట్ వాహనంలో సైతం ఈవీఎంలు తరలించినట్లు బయటపడ్డా ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా పలుచోట్ల ఇదే రీతిలో ఈవీఎంలను ప్రైవేట్ వ్యక్తుల పర్యవేక్షణలో తరలించినట్లు తెలుస్తోంది. అవన్నీ కనిపించకుండాపోయిన 20 లక్షల ఈవీఎంలలోనివేనని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. అదృశ్యమైన 20 లక్షల ఈవీఎంలు ఎక్కడున్నాయో వెల్లడించాలని వామపక్షాలతోపాటు ఇతర పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 40 లక్షల ఈవీఎంతోనే ఎన్నికలు నిర్వహించామని, మిగిలిన 20 లక్షల ఈవీఎంల సంగతి తమకు తెలియదంటూ ఈసీ దాటవేత వైఖరి అనుసరిస్తోంది. ఈసీ, కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కై ఈ అంశాన్ని కప్పిపుచ్చేందుకు యత్నిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈవీఎంలను నిషేధించాలి: ప్యూర్టోరికోలో ఎన్నికల అక్రమాలపై ఎక్స్‌లో ఎలాన్ మస్క్‌ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలంటే ఈవీఎంలను నిషేధించాలి. ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణ సరికాదు. వాటిని సులభంగా హ్యాక్ చేయవచ్చు. ఈ భూమ్మీద హ్యాక్ చేయలేనిది ఏదీ లేదు. సంబంధిత వార్త: ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చు! ఎలాగంటే..ఈవీఎంలు బ్లాక్ బాక్స్‌లు: ఎక్స్‌లో రాహుల్‌గాందీఈవీఎంలు బ్లాక్ బాక్సులు లాంటివి. వాటిని పరిశీలించేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వరు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం తీవ్ర ఆందోళనకరం. నిషేధిస్తూ విధాన నిర్ణయాలుప్రపంచంలో మెజార్టీ దేశాలు ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకంగా విధాన నిర్ణయం తీసుకున్నాయి. భారత్‌తోపాటు బ్రెజిల్, వెనిజులా తదితర దేశాల్లో మాత్రమే ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అత్యధిక దేశాల్లో ఈవీఎంలను పూర్తిగా నిషేధించగా మరికొన్ని దేశాల్లో ఇతర పద్ధతులను జోడించి ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. మొబైల్‌తో ఈవీఎం హ్యాకింగ్‌ఈవీఎంలు ఎంత లోపభూయిష్టమో... వాటిని ఎంత సులువుగా హ్యాక్ చేయవచ్చో బహిర్గతమైంది. ముంబై నుంచి వెలువడే ప్రముఖ దినపత్రిక ‘మిడ్ డే’ కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని వాయువ్య ముంబై నియోజకవర్గం నుంచి ఎంపీగా కేవలం 48 ఓట్లతో విజయం సాధించిన శివసేన (ఏక్నాథ్ షిండే) అభ్యర్థి రవీంద్ర వైకర్ సమీప బంధువు మంగేశ్ పండిల్కర్ తన మొబైల్ ఫోన్ ద్వారా ఈవీఎంను అన్‌లాక్ చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఈ నెల 4న ముంబైలోని నెస్కో సెంటర్లో నిర్వహించారు. ఎంపీ బంధువు మంగేశ్ పండిల్కర్ ఈ సందర్భంగా తన మొబైల్ ఫోన్ ద్వారా ఈవీఎంను అన్‌లాక్ చేశారు. ఓటీపీ జనరేట్ చేయడం ద్వారా ఈవీఎంను అన్‌లాక్ చేయడం గమనార్హం. మొదట్లో శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) అభ్యర్థి అమోల్ సంజన కీర్తికర్ కంటే వెనుకబడిన రవీంద్ర వైకర్ అనూహ్యంగా కేవలం 48 ఓట్లతో విజయం సాధించడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా కౌంటింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్ తీసుకువెళ్లడం, అదే ఫోన్ ద్వారా శివసేన (ఏక్నాథ్ షిండే) అభ్యర్థి పలువురితో మంతనాలు జరపడంపై ముంబై పోలీసులు ఈ నెల 14న కేసు నమోదు చేసి నిందితులకు నోటీసులు జారీ చేశారు. మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. అయితే మొబైల్ ద్వారా ఈవీఎంను హ్యాక్ చేశారన్న మిడ్ డే పత్రిక కథనాన్ని ఎన్నికల కమిషన్ ఖండించింది. -
ఈవీఎం గోల్ మాల్: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ విషయంలో అనుమానాలు
-
ఈవీఎంలలో గోల్మాల్?!
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఫలితాలు వెల్లడైనా ఎన్నికల ప్రక్రియపై నెలకొన్న వివాదాలకు మాత్రం తెర పడటం లేదు. పైగా మొత్తం ఎన్నికల ప్రక్రియ సమగ్రతపైనే నానాటికీ మరిన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. 2024 ఎన్నికల్లో అత్యధిక లోక్‌సభ స్థాన్లాలో పోలైన, లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్యలో తేడా నమోదైనట్టు ‘ద వైర్’ వార్తా సంస్థ పేర్కొంది! కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక గణాంకాలనే ఉటంకిస్తూ ఈ మేరకు కథనం ప్రచురించింది.మొత్తం 543 లోక్‌సభ స్థానాల డేటాను పరిశీలిస్తే డామన్–డయ్యు, లక్షద్విప్, అట్టింగల్ వంటి కొన్నింటిని మినహాయిస్తే అత్యధిక స్థానాల్లో నమోదైన మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్య అంతిమంగా లెక్కించిన ఈవీఎం ఓట్లతో సరిపోలడం లేదని వెల్లడించింది. ఏకంగా 140 పై చిలుకు స్థానాల్లో పోలైన ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన వాటి సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు పేర్కొనడం విశేషం! ఇలా 2 నుంచి 3,811 ఓట్ల దాకా అదనంగా లెక్కించినట్టు వెల్లడించింది. ‘‘పలు లోక్‌సభ స్థానాల్లోనేమో లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య మొత్తం ఈవీఎం ఓట్ల కంటే తక్కువగా ఉంది.ఒక లోక్‌సభ స్థానంలో ఏకంగా 16,791 ఓట్లు తక్కువగా లెక్కించారు! ఇలా తగ్గడానికి దారితీసిన కారణాలపై ఈసీ ఇచ్చిన ఇచ్చిన వివరణ పొంతన లేకుండా ఉంది. ఎక్కువ ఓట్లను లెక్కించడం ఎలా సాధ్యమన్న ప్రశ్నపై మాత్రం ఈసీ పూర్తిగా మౌనం దాల్చింది. ఈ మొత్తం ఉదంతంపై వివరణ కోరుతూ ఈసీకి ఈ మెయిల్ పంపితే ఇప్పటిదాకా స్పందన రాలేదు’’ అని తెలిపింది. కథనంలో ద వైర్ ఏం చెప్పిందంటే... ఫలితాల వెల్లడిలో లోక్‌సభ స్థానాలవారీగా లెక్కించిన ఈవీఎం ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ల సంఖ్యను ఈసీ విడిగానే పేర్కొంది. అంతేగాక ఈసారి పోలైన మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్యను కూడా స్పష్టంగా పేర్కొంది. ఆ సంఖ్యలో ఇక మార్పుచేర్పులకు అవకాశం లేదని కూడా స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్లతో వీటికి సంబంధం లేదని కూడా చెప్పింది. అలా పలు లోక్‌సభ స్థానాల్లో ఈసీ వెల్లడించిన మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్య కంటే లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య తక్కువగా ఉండటంపై సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా చర్చకు తెర లేచింది.దాంతో అది అసహజమేమీ కాదంటూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివరణ ఇచ్చారు. ‘‘కొన్నిచోట్ల అలా జరుగుతుంటుంది. ఒక్కోసారి ప్రిసైడింగ్ అధికారి పొరపాటున కంట్రోల్ యూనిట్/వీవీప్యాట్ యూనిట్ నుంచి మాక్ పోలింగ్ స్లిప్పులను తొలగించకుండానే పోలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. కొన్నిసార్లు ఫామ్ 17–సీలో ఓట్ల సంఖ్యను తప్పుగా నమోదు చేస్తారు. దాంతో అవి కంట్రోల్ యూనిట్‌లోని ఓట్ల సంఖ్యతో సరిపోలవు. ఈ రెండు సందర్భాల్లోనూ సదరు పోలింగ్ స్టేషన్లలో నమోదయ్యే ఓట్లను చివరిదాకా లెక్కించరు.అలాంటి మొత్తం ఓట్ల సంఖ్య విజేతకు లభించిన మెజారిటీ కంటే తక్కువగా ఉంటే ఇక వాటిని పూర్తిగా పక్కన పెట్టేస్తారు. అలాంటప్పుడు పోలైన ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన వాటి సంఖ్య తక్కువగానే ఉంటుంది’’ అని పేర్కొన్నారు. నమోదైన ఈవీఎం ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు లెక్కించడంపై మాత్రం ఈసీ నుంచి స్పందన లేదు. ఒక లోక్‌సభ స్థానంలో విజేతకు కేవలం 48 ఓట్ల మెజారిటీ వచి్చంది. అక్కడ పోలైన ఈవీఎం ఓట్ల కంటే రెండు ఈవీఎం ఓట్లను అదనంగా లెక్కించారు! విజేతకు 1,615 ఓట్ల మెజారిటీ వచ్చిన మరో స్థానంలో 852; 1,884 ఓట్ల మెజారిటీ వచ్చి న ఇంకో చోట 950 ఓట్లు అదనంగా లెక్కించారు.ఇవీ సందేహాలు.. ⇒ నమోదైన మొత్తం ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండటం ఎలా సాధ్యం? ⇒ లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య పోలైన వాటికంటే తగ్గడానికి మాక్ పోలింగ్ డాటాను తొలగించకపోవడమే కారణమన్న నిర్ధారణకు ప్రాతిపదిక ఏమిటి? ⇒ ఇలా ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన ఓట్ల సంఖ్య ఎక్కువ/తక్కువగా నమోదైన లోక్‌సభ స్థానాలవారీగా ఈసీ స్పష్టమైన వివరణ ఎందుకివ్వడం లేదు? ⇒ ఈ ఎన్నికల్లో మొత్తమ్మీద ఎన్ని ఈవీఎంలను, ఏ కారణాలతో పక్కన పెట్టారో ఈసీ వెల్లడించగలదా?వివరణ ఇవ్వాల్సిందే ప్రశాంత్ భూషణ్ఓట్ల లెక్కింపులో గోల్‌మాల్‌కు సంబంధించి ‘ద వైర్’ కథనంపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పందించారు. ‘‘దేశవ్యాప్తంగా 140కి పైగా లోక్‌సభ స్థానాల్లో పోలైన మొత్తం ఈవీఎం ఓట్ల కంటే ఎక్కువ ఈవీఎం ఓట్లను లెక్కించారు! అసలేం జరుగుతోంది?’’ అని ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు. ‘ద వైర్’ కథనాన్ని ట్యాగ్ చేశారు. ‘‘అహంకారంతో ప్రవర్తిస్తున్న ఈసీఐ ఈ విషయంలో దేశ ప్రజలకు కచి్చతంగా వివరణ ఇవ్వాల్సిందే’’ అని డిమాండ్ చేశారు. -
ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలపై ఈసీ స్పందించాలి
సాక్షి, అమరావతి: ఏపీ ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పందించాలని ప్రజా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈవీఎంల పనితీరుపై ఉన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. విజయవాడలో ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు శుక్రవారం మాట్లాడుతూ.. ఈవీఎంల పనితీరుపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించాలన్నారు.గతంలో ఆయన ఈవీఎంల పనితీరుపై పలు సందేహాలు వ్యక్తంచేశారని, ఈవీఎం చిప్‌లను ట్యాంపరింగ్ చేసి ప్రజా తీర్పును మార్చి వెయొ్యచ్చని.. అలాగే, ప్రపంచంలో ఎక్కడా ఈవీఎంలను ఉపయోగించడంలేదని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కృష్ణంరాజు గుర్తుచేశారు. ఇప్పుడు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో చంద్రబాబు వైఖరి ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.గతంలో చంద్రబాబు సాంకేతిక సలహాదారుడిగా పనిచేసిన వేమూరు హరికృష్ణ ప్రసాద్ తన అమెరికన్ మిత్రులు అలెక్స్ హాల్దార్ మెన్, రాస్గోమ్ గ్రీస్ సహకారంతో ఎన్నికల సంఘం నుంచి దొంగిలించిన ఈవీఎంను బహిరంగంగానే హ్యాక్‌చేసి చూపించారన్నారు. ఈవీఎం దొంగతనం ఆరోపణపై హరికృష్ణ ప్రసాద్ అరెస్టు కూడా అయ్యారన్నారు. ప్రజాతీర్పు ఏకపక్షంగా, మెజార్టీలు అత్యధికంగా ఉండటంతో ప్రజల్లో ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.బాబు విదేశీ పర్యటనపై అనుమానాలు..బెటర్ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ సునీత లక్కంరాజు మాట్లాడుతూ.. స్ట్రాంగ్ రూముల్లో ఉన్న అన్ని ఈవీఎంలను ఒకేసారి హ్యాక్ చేయవచ్చునని కూడా హరికృష్ణ ప్రసాద్ చెప్పారన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు విదేశీ పర్యటనలపై కూడా ప్రజలకు అనేక సందేహాలున్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. ఆంధ్ర అడ్వకేట్ ఫోరం కన్వీనర్ బి.అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం వివరణ ఇవ్వకపోతే తమ వద్ద ఉన్న ఆధారాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పౌర సంఘాల ప్రతినిధులు తెలిపారు. -
ECI: పోలింగ్ 65.79 శాతం
న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో 65.79 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. పోస్టల్ బ్యాలెట్లను ఇంకా ఇందులో కలపని కారణంగా తుది పోలింగ్ శాతంలో మార్పులు ఉంటాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించడం తెల్సిందే. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 67.40 శాతం పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికలనాటికి దేశవ్యాప్తంగా 91.20 కోట్ల మంది ఓటర్లు ఉంటే ఆనాడు వారిలో 61.50 కోట్ల మంది మాత్రమే ఓటేశారు. ఇటీవల ముగిసిన 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి మొత్తం ఓటర్ల సంఖ్య 96.88 కోట్లకు పెరగడం విశేషం. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి విడివిడిగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, మొత్తంగా ఓటింగ్ శాతాల సమగ్ర వివరాలు తమకు అందాక అందరికీ అందుబాటులోకి తెస్తామని ఈసీ గురువారం విడుదలచేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. -
Election Commission of India: నేడే అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఫలితాలు
ఈటానగర్/గ్యాంగ్‌టక్: సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఆదివారం ఉదయం ఆరు గంటల కల్లా ఓట్ల లెక్కింపు మొదలయ్యేలా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. 60 స్థానాలున్న అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ఇప్పటికే 10 చోట్ల బీజేపీ ఏకగ్రీవంగా గెలిచింది. మిగిలిన 50 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో ఈవీఎంలలో నిక్షిప్తమైన 133 మంది అభ్యర్థుల భవితవ్యం నేటితో తేలనుంది. తక్కువ స్థానాలు కావడంతో ఆదివారం మధ్యాహ్నంకల్లా తుది ఫలితాలు వెల్లడికానున్నాయని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈఓ) పవన్‌కుమార్ సైన్ శనివారం చెప్పారు. సిక్కింలోనూ.. సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. మరోసారి అధికారం చేపట్టాలని అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా(ఎస్కేఎం) ఉవ్విళ్లూరుతుండగా ఎలాగైనా విజయం సాధించాలని సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్(ఎస్డీఎఫ్), బీజేపీ, కాంగ్రెస్, సిటిజెన్ యాక్షన్ పారీ్ట–సిక్కిం ఆశపడుతున్నాయి. ఈసారి ఏప్రిల్ 19న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 80 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 146 మంది అభ్యర్థులు ఈసారి పోటీపడ్డారు. -
Lok Sabha Election 2024: ఏడో విడతలో 62 శాతం పోలింగ్
న్యూఢిల్లీ/కోల్‌కతా/దుమ్కా: ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య పండగగా పేరొందిన భారత సార్వత్రిక ఎన్నికల పర్వం శనివారంతో ముగిసింది. లోక్‌సభ ఎన్నికల్లో చివరిదైన ఏడో దశ పోలింగ్ శనివారం పూర్తయింది. శనివారం రాత్రి 11.50 గంటలకు అందిన సమాచారం మేరకు 62 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నిరీ్ణత పోలింగ్ సమయం ముగిసేలోపు క్యూ లైన్లలో నిల్చున్న వారిని ఓటింగ్‌కు అనుమతించారు. దీంతో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశముంది. ఏడో దశలో చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం సహా ఏడు రాష్ట్రాల్లోని 57 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. మూడోసారి అధికారం చేపట్టాలని ఉవి్వళూరుతున్న ప్రధాని మోదీ పోటీచేసిన వారణాసి నియోజకవర్గంలోనూ శనివారం పోలింగ్ నిర్వహించారు. పశ్చిమబెంగాల్లో అత్యధికంగా 73.47 శాతం పోలింగ్ నమోదైంది. తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ దక్షిణ కోల్‌కతాలోని భవానీపూర్ ప్రాంతంలోని మిత్ర ఇన్స్టిట్యూట్ స్కూల్ బూత్‌లో ఓటేశారు. బేరామరీలో బాహాబాహీ పశి్చమబెంగాల్లో పలు చోట్ల ఘర్షణలు జరిగాయి. బసీర్హాట్ లోక్‌సభ నియోజకవర్గంలోని సందేశ్‌ఖాలీ పరిధిలోని బేరామరీలో అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. భాంగర్‌లో టీఎంసీ, ఐఎస్ఎఫ్ మద్దతుదారులు ఒకరిపై ఒకరు నాటుబాంబులతో దాడిచేసుకున్నారు. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో పోలీసులు రంగంలోకి దిగి భాష్పవాయుగోళాలు ప్రయోగించారు. లాఠీచార్జ్ చేశారు. తర్వాత కొన్ని నాటుబాంబులను స్వాధీనం చేసుకున్నారు. బెంగాల్ నుంచి మధ్యాహ్నం రెండుగంటల్లోపు 1,900 ఫిర్యాదులు వచ్చాయని ఈసీ తెలిపింది. ఈవీఎంలు మొరాయించడం, బూత్‌లోకి రాకుండా ఓటర్లు, పోలింగ్ ఏజెంట్లను ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలు అడ్డుకోవడం వంటి ఘటనలు జరిగాయని టీఎంసీ, బీజేపీ తదితర పార్టీలు ఫిర్యాదుచేశాయి. కుటుంబాన్ని మించిన కర్తవ్యం 80 ఏళ్ల తల్లి మరణం ఓవైపు, తప్పక ఓటేయాల్సిన బాధ్యత మరోవైపు ఉన్నా తొలుత ఓటేసి కన్నతల్లికన్నా భరతమాతకు ఎక్కువ గౌరవం ఇచ్చారు ఒక వ్యక్తి. బిహార్‌లోని జెహనాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో దేవ్కులీ గ్రామంలో మిథిలేశ్ యాదవ్ తల్లి శనివారం కన్నుమూశారు. ‘ చనిపోయిన అమ్మ ఎలాగూ తిరిగిరాదు. అంత్యక్రియల్ని కొద్దిసేపు ఆపొచ్చు. కానీ పోలింగ్‌ను ఆపలేం. ఎన్నికలు మళ్లీ ఐదేళ్లదాకా రావు. అందుకే ఓటేశాక అంతిమయాత్ర చేపట్టాలని మా కుటుంబం మొత్తం నిర్ణయించుకున్నాం’ అని మిథిలేశ్ చెప్పారు. ఓటేశాక వెంటనే ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. -
ఇది ఈసీ వివక్షే
సాక్షి, అమరావతి: పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫాంపై అటెస్టింగ్ అధికారి సంతకం మాత్రమే ఉండి.. పేరు, హోదా వివరాలు, సీలు లేకపోయినా ఆ పోస్టల్ బ్యాలెట్లను ఆమోదించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. శనివారం సాయంత్రం 6 గంటలకు నిర్ణయం వెలువరిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ న్యాపతి విజయ్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం ఎన్నికల సంఘం గురువారం జారీ చేసిన ఉత్తర్వులను చట్ట విరుద్ధంగా ప్రకటించి, ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఆ ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ ఓ అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా హౌస్ మోషన్ రూపంలో విచారణ జరపాలని కోరుతూ పిటిషనర్ తరఫు న్యాయవాది సన్నపురెడ్డి వివేక్ చంద్రశేఖర్ హైకోర్టు రిజిస్ట్రీని కోరారు. దీంతో రిజిస్ట్రీ ఈ కేసు ఫైల్‌ను ప్రధాన న్యాయమూర్తి (సీజే) ముందు ఉంచింది. దానిని పరిశీలించిన ఆయన హౌస్ మోషన్ రూపంలో అత్యవసర విచారణకు అనుమతి మంజూరు చేశారు. దీంతో జస్టిస్ కిరణ్మయి, జస్టిస్ విజయ్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది.దేశ వ్యాప్తంగా కాకుండా ఏపీలో మాత్రమే అమలు చేస్తారా?వైఎస్సార్సీపీ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, హైకోర్టు సీనియర్ న్యాయవాది పాపెల్లుగారి వీరారెడ్డి, న్యాయవాది వివేక్ చంద్రశేఖర్ వాదనలు వినిపించారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫాంపై అటెస్టింగ్ అధికారి సంతకం మాత్రమే ఉండి.. పేరు, హోదా వివరాలు, సీలు లేకపోయినా కూడా ఆ పోస్టల్ బ్యాలెట్లను ఆమోదించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులు వివక్షాపూరితమని సింఘ్వీ తెలిపారు. ఈ ఉత్తర్వులు చాలా కొత్తగా ఉన్నాయన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఉత్తర్వులను దేశంలో ఇతర ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయడం లేదని, కేవలం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే అమలు చేస్తోందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు దేశం మొత్తానికి వర్తిస్తాయని, కానీ విస్మయకరంగా తాజా ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే వర్తింప చేస్తోందని వివరించారు. ఇంత కన్నా అన్యాయం ఏమీ ఉండదన్నారు. తాజా ఉత్తర్వులు ఎన్నికల కమిషన్ స్వీయ నిబంధనలకు విరుద్ధమన్నారు. లేఖలు, సర్కులర్లు, మెమోల ద్వారా చట్టబద్ధ నిబంధనలను మార్చలేరన్నారు. అది పార్లమెంట్ పని అని తెలిపారు. పార్లమెంట్లో ఎలాంటి సవరణ చేయకుండా తాజా ఉత్తర్వులు తీసుకురావడానికి వీల్లేదని, అందువల్ల అవి ఎంత మాత్రం చెల్లుబాటు కావని ఆయన స్పష్టం చేశారు.కౌంటింగ్‌కు నాలుగు రోజుల ముందు ఎందుకిలా?రాష్ట్రంలో 5.39 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ అయ్యాయని, ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ఇవి సరిపోతాయని సింఘ్వీ అన్నారు. ఎన్నికల నిర్వహణ నిబంధనల్లో రూల్స్ 27ఎఫ్, 54ఏ, 13 ఏ లకు విరుద్ధంగా ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులు అమల్లోకి తెచ్చిందన్నారు. అటెస్టేటింగ్ అధికారి పేరు, హోదా వివరాలు లేకుండా ఆ పోస్టల్ బ్యాలెట్‌ను ఎవరో ధృవీకరించారో తెలియదని, దీని వల్ల అక్రమాలకు ఆస్కారం ఉంటుందన్నారు. అసలు పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫాంపై ఎవరైనా సంతకం చేయవచ్చన్నారు. తప్పుడు, నకిలీ ఓట్లను కూడా ఆమోదించేందుకు తాజా ఉత్తర్వులు అవకాశం కల్పిస్తున్నాయని తెలిపారు. ఎప్పుడో ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయితే, ఇప్పుడు కౌంటింగ్‌కు నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండగా, కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ఈ తాజా ఉత్తర్వుల వల్ల నష్టం జరుగుతుందన్నారు. ఎన్నికల కమిషన్ తీరు సందేహాస్పదంగా ఉందని తెలిపారు. ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్ ఇలాంటి ఉత్తర్వుల ద్వారా నిష్పాక్షికతకు అర్థం లేకుండా చేస్తోందన్నారు. ఏకపక్షంగా జారీ చేసిన ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు. ఎన్నికల ఫలితాలపై అభ్యంతరం ఉంటేనే ఎన్నికల పిటిషన్ (ఈపీ) దాఖలు చేసుకోవాల్సి ఉంటుందని, కానీ ఇక్కడ ఆ పరిస్థితి కాదని, అందువల్ల తమ వ్యాజ్యానికి విచారణార్హత ఉందని వివరించారు.పరిధి దాటి వ్యవహరిస్తున్న ఎన్నికల సంఘంసీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమేనన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘామే చెబుతోందని, అలాంటిది 5.39 లక్షల ఓట్ల విషయంలో మాత్రం బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తోందని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో తమ ఆందోళనను గానీ, తామిచ్చిన వినతి పత్రాన్ని గానీ ఎన్నికల సంఘం కనీస స్థాయిలో కూడా పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. తాము హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత హడావుడిగా తాజా ఉత్తర్వులిచ్చిందన్నారు. అతి కొద్ది రోజుల్లో కౌంటింగ్ జరగబోతుండగా, ఇప్పటికిప్పుడు ఈ ఉత్తర్వులను తీసుకు రావాల్సిన అవసరం ఏముందో ఎన్నికల సంఘం చెప్పడం లేదన్నారు. ఎన్నికల సంఘం చర్యల్లో నిజాయితీ ఉండి ఉంటే, ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే ఈ ఉత్తర్వులు అమల్లోకి తెచ్చి ఉండేదని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వివాదంపై ఎన్నికల పిటిషన్లు వేయాలంటే 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో దాఖలు చేయాల్సి ఉంటుందని, ఇది ఆచరణ సాధ్యం కాదన్నారు. ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా తన పరిధి దాటి వ్యవహరించిందని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో గత ఏడాది జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని, బ్యాలెట్ ఫాంపై పేరు, హోదా వివరాలు, సీలు లేకుంటే ఆ ఓటును తిరస్కరించాల్సిందేనన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రక్రియ సాగుతున్నప్పుడు అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చని వీరారెడ్డి తెలిపారు.తాజా ఉత్తర్వులు ఆ ఉద్యోగులకే వర్తింపుకేంద్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల విధుల్లో ఉండి ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ఉద్యోగులకే తమ తాజా ఉత్తర్వులు వర్తిస్తాయన్నారు. ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద అటెస్టేటింగ్ అధికారిని సంబంధిత రిటర్నింగ్ అధికారే నియమిస్తారని.. అందువల్ల డిక్లరేషన్ ఫాంపై ఆ అధికారి సంతకం ఉంటే చాలని చెప్పారు. పేరు, హోదా వివరాలు, సీలు ఉండాల్సిన అవసరం లేదని తెలిపారు. ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను మొత్తం నిబంధనలకు అనుగుణంగా వీడియోగ్రఫీ చేశారని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో పిటిషనర్ అనవసరంగా ఆందోళన చెందుతున్నారన్నారు. ఎన్నికల ప్రక్రియను సవాలు చేయడానికి వీల్లేదని, ఒకవేళ పిటిషన్లు దాఖలు చేసినా అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని తెలిపారు. పిటిషనర్ పరోక్షంగా ఎన్నికల ఫలితాల గురించే మాట్లాడుతున్నారని, అందువల్ల వారు ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ఎన్నికల ఫలితాల వ్యవహారంలో ఈపీ దాఖలు చేసుకోవాలన్న వాదన సరైందేనని, అయితే పిటిషనర్ తన వ్యాజ్యంలో లేవనెత్తిన అంశాలు పూర్తిగా వేరని వ్యాఖ్యానించింది. ఇదేమీ వ్యక్తిగత కేసు కాదని స్పష్టం చేసింది. అనంతరం వైఎస్సార్సీపీ వ్యాజ్యంలో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, న్యాయవాది పదిరి రవితేజ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా వారు ఎన్నికల నిర్వహణ నిబంధనలను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల సంఘం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులు సబబేనన్నారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు తెలిపింది. శనివారం సాయంత్రం 6 గంటలకు నిర్ణయాన్ని వెలువరిస్తామంది. -
సీఈవో గుప్పెట్లో చట్టం
చిలకలపూడి (మచిలీపట్నం): రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనా చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. గురువారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో అధికారి సీలు లేకున్నా చెల్లుతుందని సీఈఓ జారీ చేసిన సర్క్యులర్ చట్ట విరుద్ధమన్నారు. సీలు, హోదా(డిజిగ్నేషన్) లేకపోయినా ఫర్వాలేదని, స్పెసిమెన్ సిగ్నేచర్ అనుమానం వస్తే జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో ధ్రువీకరిస్తే సరిపోతుందని చెప్పారని, ఈ లెక్కన ప్రతి జిల్లా నుంచి వెయ్యికి పైగా స్పెసిమెన్ సిగ్నేచర్లను ధృవీకరించుకోవడం సాధ్యమేనా అని ప్రశి్నంచారు.13 ఏ, 13 బి పోస్టల్ బ్యాలెట్లు ఇస్తారని, దానికి గెజిటెడ్ ఆఫీసర్ సరి్టఫికెట్ ఇస్తారని, ఫారం 12 ఏ అనేది ఎక్కడ నుండి వచి్చందని ప్రశి్నంచారు. ఎంతో బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న సీఈవో ఎవరికి మేలు చేకూర్చాలని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో చెప్పాలన్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తే కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఓకే చెప్పిందని, దేశంలో ఒకలా.. రాష్ట్రంలో మరోలా నిబంధన ఎలా అమలు చేస్తారని ప్రశి్నంచారు. చివరికి కోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ వేస్తే ఆ మెమోను సీఈఓ వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారన్నారు.ఆయన తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు దీనిద్వారా స్పష్టమైందని, ఎవరి కోసం ఆ తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని నిలదీశారు. చంద్రబాబు బీజేపీతో కలిసి ఎన్ని కుట్రలు చేసినా ఫలించవని చెప్పారు. టీడీపీ ఎన్డీఏతో కలిసి చట్టాలను చుట్టాలుగా మార్చుకుందని, ప్రజలు దీనిని గమనించాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అంగీకారంపైనా పోరాటం చేస్తామని, చివరకు న్యాయమే గెలుస్తుందనే నమ్మకం తమకుందని వెల్లడించారు. న్యాయ వ్యవస్థతో సమానంగా బాధ్యతగా మెలగాల్సిన హోదాలో, ఎన్నికల సంఘంలో ప్రమాణం చేసి, ఇలాంటి సొంత నిర్ణయాలు తీసుకోవడం అంటే ఒక పార్టీ వైపు మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోందన్నారు.రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, వేధింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. టీడీపీ తప్పులను ఎత్తి చూపిస్తున్నప్పటికీ పట్టించుకోని సీఈవో.. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వార్తలు వస్తే వెంటనే స్పందించి తమ పార్టీ నాయకులపై కేసులు పెట్టడం అన్యాయమని అన్నారు. టీడీపీ, బీజేపీ నేతలపై కేసులు పెట్టొద్దని కలెక్టర్లు, ఆర్వోలను బెదిరిస్తున్నారని, వైఎస్సార్సీపీ నాయకులపై సాధ్యమైనంత వరకు కేసులు ఎక్కువ పెట్టాలని ఆదేశాలు ఇస్తున్నారని చెప్పారు. -
కుట్రపూరితం! పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై ఈసీ కొత్త నిబంధనలు ఎందుకు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో వేటిని ఆమోదించాలి, వేటిని తిరస్కరించాలని స్పష్టమైన నిబంధనలు కేంద్ర ఎన్నికల సంఘం తన నిబంధనల పుస్తకంలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ వాటిని సవరిస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా మారనున్నాయంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తాజా సవరణల వల్ల దొంగ ఓట్లకు ఆస్కారం కల్పించడమే కాకుండా నిజమైన ఓట్లు చెల్లకుండా పోయే అవకాశం ఉందంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘ నిబంధనల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటున్న ఓటరు తన వివరాలు, బ్యాలెట్ నంబర్‌తో డిక్లరేషన్ ఫాం13ఏ సమర్పించాలని, ఈ ఓటరు తనకు తెలుసని ఒక గెజిటెడ్ అధికారి ధృవీకరించి సంతకం చేస్తూ.. పొడి అక్షరాలతో ఆ అధికారి పేరు, హోదా వివరాలు, చిరునామాతో పాటు సీల్ వేయాలని స్పష్టంగా ఉంది. మన రాష్ట్రం విషయానికి వస్తే గెజిటెడ్ అధికారి సంతకం ఉండి, అధికారి హోదా వివరాలు లేదా సీల్.. ఏదో ఒకటి ఉన్నా.. ఆ ఓట్లను పరిగణనలోకి తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా టీడీపీ అడిగిన వెంటనే మోమో జారీ చేయడం తెలిసిందే. దాన్ని ఎండార్స్ చేయడంతో పాటు మరికొంత సడలింపు ఇస్తూ గెజిటెడ్ అధికారి హోదా వివరాలు, సీల్ లేకపోయినా.. కేవలం సంతకం ఉంటే చాలు ఓట్లను పరిగణనలోకి తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ సీఈవోకు లేఖ రాయడం వెంట వెంటనే జరిగిపోవడం గమనార్హం. పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటు విషయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జారీ చేసిన ఆదేశాలను ఉన్నత న్యాయస్థానంలో ఉపసంహరించుకోవడం అంటే.. ఆ ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లుగా అంగీకరించినట్లే. ఈ కేసులో టీడీపీ ఇంప్లీడ్ పిటీషన్ వేయడం ద్వారా పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారాన్ని మరింత గందరగోళ పరచాలనే ఉద్దేశం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.సంతకంలో వ్యత్యాసాలుంటే..టీడీపీ వినతికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం, ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసి దొంగ ఓట్ల బెడదను సృష్టించిన సీఈవో ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం తందానా అనడం అనుమానాలకు తావిస్తోందని ప్రజాస్వామ్యవాదుల్లో ఆందోళన నెలకొంది. ఈ వ్యవహారం లెక్కింపు సమయంలో తీవ్ర గందరగోళ పరిస్థితులకు దారితీస్తుందని మాజీ ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, కేవలం సంతకంతో అతను అటెస్టేషన్ అధికారే అని నిర్ధారించడం ఎలా సాధ్యమవుతుందని వీరు ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయం దొంగ ఓట్లను ప్రోత్సహించే విధంగా ఉందని కేంద్ర ఎన్నికల సంఘానికి సలహాదారునిగా వ్యవహరించిన అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. వివరాలు లేకుండా కేవలం సంతకంతో రిటర్నింగ్ ఆఫీసర్ ఎలా ఆమోదం తెలుపుతారని, అధికారుల సంతకాల్లో వ్యత్యాసాలు ఉండటం అత్యంత సహజమని వివరించారు. ఈ నేపథ్యంలో స్పెసిమెన్ సంతకంతో సరిపోల్చి చూడటం ఎలా సాధ్యమని రిటైర్డ్ ఆర్డీవో ఒకరు ప్రశ్నిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన గెజిటెడ్ అధికారుల సంతకాలు అన్నీ కౌంటింగ్ సెంటర్లలోని ఆర్వోలకు పంపిస్తామని, సంతకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తే వాటితో సరిపోల్చి చూసుకొని నిర్ణయం తీసుకోవాలనడం విడ్డూరంగా ఉందంటున్నారు. ఇన్ని స్పెసిమెన్ అధికారుల సంతకాలతో వాటిని ఆ సమయంలో సరిపోల్చి చూడటం సాధ్యమయ్యే పనేనా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి లబ్ధి కోసం ఆగమేఘాల మీద ఇటువంటి నిర్ణయాలు తీసకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు.ఈసీ నిష్పాక్షికతపై అనుమానాలకు మరింత బలంపోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన అటెస్టింగ్ ఆఫీసర్లు కొంత మంది సీల్ వేయకుండా కేవలం సంతకాలు మాత్రమే చేశారని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని తమ ఓట్లను తిరస్కరించకుండా ఆమోదించేలా చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నుంచి ఇలా విజ్ఞాపనలు రాగానే ఎన్నికల సంఘం వెంటనే పలు నిర్ణయాలు తీసుకుంటూ మొత్తం పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియనే పూర్తి గందరగోళంగా మార్చింది. టీడీపీ ఫిర్యాదు చేయగానే ముఖేష్ కుమార్ మీనా ఈ నెల 25న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం డిక్లరేషన్ ఫారం మీద అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం, పేరు, హోదా (డిజిగ్నేషన్) పూర్తి వివరాలు తప్పనిసరిగా ఉండాలని.. ఇవి ఉండి స్టాంప్ లేకపోయినా వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చని ఉంది. ఒకవేళ ఏమైనా అనుమానం వస్తే దాన్ని రిటర్నింగ్ ఆఫీసర్, జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉన్న సంబంధిత అటెస్టింగ్ ఆఫీసర్ సంతకంతో సరిపోల్చుకుని పోస్టల్ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. తాజాగా గురువారం కేంద్ర ఎన్నికల సంఘం మీనాకు రాసిన లేఖలో మరో ముందడుగు వేసి అటెస్టింగ్ ఆఫీసర్ సీల్ వేయకపోయినా, అతని హోదా వివరాలు లేకపోయినా సంతకం ఉంటే చాలు అని పేర్కొంది. ఎవరి ప్రయోజనాల కోసం ఎన్నికల సంఘం ఇలాంటి గందరగోళ నిర్ణయాలు తీసుకుంటోందని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటి నుంచో అనుసరిస్తున్న నిబంధనలను ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే సడలింపునిస్తూ సీఈవో ఆదేశాలు జారీ చేయడమే విడ్డూరమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ మరో అడుగు ముందుకేసి వివరాలు రాయకపోయినా, సీల్ వేయకపోయినా పోస్టల్ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలనడం తొలి నుంచి ఈసీ నిష్పాక్షికతపై వ్యక్తమవుతున్న అనుమానాలకు మరింత బలం చేకూర్చినట్లయిందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఆ ముగ్గురు అధికారులపై వెంటనే నిర్ణయం తీసుకోండి
సాక్షి, అమరావతి: మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అధికార విధుల నుంచి గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట్ త్రిపాఠీ, ఎస్పీ మలికా గార్గ్, కారెంపూడి ఇన్స్పెక్టర్ నారాయణ స్వామిని దూరంగా ఉంచేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సమర్పించిన వినతిపత్రంపై రేపటికల్లా (శుక్రవారంలోగా) నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, డీజీపీని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈ పోలీసు అధికారులపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నందున, పిన్నెల్లి వినతిపై వెంటనే తగిన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని ధర్మాసనం స్పష్టంచేసింది.త్రిపాఠీ, గార్గ్, నారాయణ స్వామిలపై చర్యలు తీసుకోవాలని, వారు పని చేస్తున్న స్థానాల నుంచి మార్చాలంటూ తానిచ్చిన వినతిపత్రంపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోకపోవడాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గురించి పిన్నెల్లి తరఫు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి గురువారం కోర్టు విచారణ మొదలు కాగానే న్యాయమూర్తులు జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ధర్మాసనం ముందు ప్రస్తావించారు.లంచ్‌మోషన్ రూపంలో అత్యవసర విచారణకు అభ్యర్థించారు. లంచ్‌మోషన్ అవసరం లేదని ధర్మాసనం మొదట చెప్పింది. అయితే నిరంజన్‌రెడ్డి అత్యవసరాన్ని వివరించారు. ఈ ముగ్గురు అధికారులు పిన్నెల్లికి వ్యతిరేకంగా ఉన్నారని, ఆయన్ని కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనకుండా చేసేందుకు కోర్టుకు సైతం తప్పుడు సమాచారం ఇచ్చి, తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. ఈవీఎంల కేసులో పిన్నెల్లికి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తరువాత తిరిగి హత్యాయత్నం కేసులు పెట్టిన విషయాన్ని వివరించారు.ఈ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషనర్ ఇచ్చిన వినతిపత్రంపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్న ఈ అధికారులను పిటిషనర్‌పై నమోదు చేసిన కేసుల దర్యాప్తు నుంచి దూరంగా ఉంచాలన్నారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు వారిని విధుల నుంచి దూరంగా ఉంచితే సరిపోతుందని వివరించారు. దీంతో ధర్మాసనం లంచ్‌మోషన్ ద్వారా అత్యవసర విచారణకు అనుమతినిచ్చింది.ఏబీ వెంకటేశ్వరరావు చెప్పినట్లే ఐజీ చేస్తున్నారుగురువారం సాయంత్రం ఈ వ్యాజ్యం విచారణకు రాగా, పిన్నెల్లి తరఫు న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఐజీ త్రిపాఠీ, ఇన్స్పెక్టర్ నారాయణస్వామిలపైనే తమకు అభ్యంతరం ఉందన్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు సర్వశ్రేష్ట త్రిపాఠీ అత్యంత సన్నిహిత మిత్రుడుని, ఆయన చెప్పినట్లే చేస్తున్నారని తెలిపారు. అలాగే నారాయణ స్వామి ఓ పార్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని చెప్పారు.వీరిద్దరూ పిన్నెల్లి పట్ల దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తూ తప్పుడు కేసులతో వేధిస్తున్నారని, కోర్టును సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని, దీనిని తీవ్రంగా పరిగణించాలని కోరారు. ఈ నెల 4 వరకు పిటిషనర్‌పై ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు చేయకుండా, ఆ కేసుల దర్యాప్తులో వీరు భాగం కాకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఎన్నికల సంఘం, పోలీసుల తీరును చూస్తుంటే రాష్ట్రంలో న్యాయ పాలన ఉందా అన్న సందేహం కలుగుతోందన్నారు. కోర్టు మాత్రమే తమకు రక్షణగా ఉందని, అందుకే మరోసారి కోర్టును ఆశ్రయించామని నిరంజన్‌రెడ్డి వివరించారు.ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. పిన్నెల్లి వినతిపత్రంపై మీరేం చేస్తున్నారని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. దీనికి ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ స్పందిస్తూ.. తగిన నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచిస్తానన్నారు. వినతిపత్రం తమకు ఇవ్వలేదని, డీజీపీకి ఇచ్చారని చెప్పారు. దీంతో ధర్మాసనం హోంశాఖ న్యాయవాదిని వివరణ కోరింది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున డీజీపీ కూడా ఎన్నికల సంఘం పరిధిలోనే పని చేస్తుంటారని తెలిపారు. నిర్ణయం తీసుకోవాల్సింది ఎన్నికల సంఘమేనన్నారు.పిన్నెల్లి తన పిటిషన్లో కొందరు పోలీసు అధికారులపై తీవ్రమైన ఆరోపణలు చేశారని, అందువల్ల ఆయన వినతిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. రేపటికల్లా తగిన నిర్ణయం వెలువరించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, ఎన్నికల ప్రధాన అధికారిని, డీజీపీని ఆదేశించింది. పిన్నెల్లి దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని వినతి పత్రంగా పరిగణించాలని ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది. -
కౌంటింగ్ పై సమీక్ష: ఏపీలో ఓట్ల లెక్కింపుపై కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష
-
మధ్యాహ్నం 2 గంటలకే 111 అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాల వెల్లడి
సాక్షి, అమరావతి: వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనా కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపారు. సత్వరమే ఫలితాల ప్రకటనకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని మొత్తం 175 శాసన సభ నియోజకవర్గాల్లో 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్ల లోపు లెక్కింపు జరుగుతుందని, వీటి ఫలితాలు మధ్యాహ్నం 2 గంటల్లోపే ఇచ్చేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. 61 నియోజకవర్గాల్లో 21 నుండి 24 రౌండ్లు లెక్కింపు జరుగుతుందని, వీటి ఫలితాలు సాయంత్రం 4 గంటల్లోపు వస్తాయన్నారు. మిగిలిన 3 నియోజకవర్గాల్లో 25 రౌండ్లకు పైబడి ఓట్ల లెక్కింపు జరుగుతుందని, సాయంత్రం 6.00 గంటల్లోపు వీటి ఫలితాలు రావొచ్చని వివరించారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు టేబుళ్లను పెంచి సకాలంలో పూర్తి చేస్తామన్నారు. రాత్రి 8 – 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటించేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. న్యూఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ బుధవారం రాష్ట్ర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సమీక్షించారు. లెక్కింపు ప్రక్రియలో అనుసరించాల్సిన విధానాలు, శాంతిభద్రతల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో కౌంటింగ్‌కు చేపట్టిన ఏర్పాట్లను సీఈవో మీనా వివరించారు. ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనలు జరిగిన జిల్లాల్లో ఓట్ల లెక్కింపు రోజు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 144 సెక్షన్ అమలుతో పాటు ఆ జిల్లాల్లో సీనియర్ అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. డిజీపీతో పాటు తాను కూడా పల్నాడు జిల్లాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను పరిశీలించామని, అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. ఓట్ల లెక్కింపులో లోపాలు జరగకూడదు ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనలో ఎటువంటి లోపాలు, జాప్యం జరగడానికి వీల్లేదని, అందుకోసం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, త్వరితగతిన కచ్చితమైన ఫలితాలను ప్రకటించాలని సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ రాష్ట్ర అధికారులకు చెప్పారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపును విజయవంతంగా పూర్తి చేయాలని అన్ని నియోజకవర్గాల ఆర్వోలు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సీపీలకు సూచించారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం–21 సీ, 21ఈలను అదే రోజు ఫ్లైట్‌లో ఈసీకి పంపాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు సమయంలో అభ్యర్థులు, ఏజెంట్లు ఎటువంటి అవాంతరాలు కలిగించకుండా లెక్కింపు ప్రక్రియపై వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని చెప్పారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్ రూముల్లో కూలీల విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులను ఎవ్వరినీ అందుకు వినియోగించొద్దని చెప్పారు. గుర్తింపు కార్డులు ఉన్నవారినే లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతించాలన్నారు. ఎన్నికల అనంతరం పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు జరిగినందున, ఈ జిల్లా అధికారులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, ఓట్ల లెక్కింపు రోజు ఎటువంటి ఘటనలకు తావు లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్, అడిషనల్ డీజీ ఎస్ బాగ్చీ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలను, సీపీలను అప్రమ్తతం చేశామని, శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాట్లు, త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాల ప్రకటనకు చేపడుతున్న చర్యలు, శాంతి భద్రతల పరిరక్షణకు చేస్తున్న బందోబస్తు ఏర్పాట్లను ఆర్వోలు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు నితీష్ వ్యాస్‌కు వివరించారు. ఈ సమావేశంలో అదనపు సీఈవో హరేంధిర ప్రసాద్, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ఆర్వోలు, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు తదితరులు వారి నియోజకవర్గాల నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. -
‘సడలింపు’ని సరిదిద్దండి
సాక్షి, అమరావతి: పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నిబంధనలను ఏపీలో సడలిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్ మీనా ఈనెల 25న జారీచేసిన ఉత్తర్వులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపించింది. అటెస్టింగ్ అధికారుల స్పెసిమెన్ సంతకాల సేకరణ గతేడాది జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన నిబంధనలకు విరుద్ధమని గుర్తుచేసింది. ఇది పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఓట్ల తిరస్కరణకు కారణమవుతుందని.. పైగా తీవ్ర వివాదాలకు సైతం దారితీస్తుందని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్‌కు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు ఎస్. నిరంజన్‌రెడ్డి బుధవారం ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్ మీనా నిబంధనలను సడలిస్తూ జారీచేసిన ఉత్తర్వులను తక్షణం సమీక్షించి.. సముచిత నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.దేశవ్యాప్తంగా ఒకలా.. రాష్ట్రంలో మరోలా..నిజానికి.. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారంపై అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం చేసి, స్టాంప్ లేకపోయినా.. తన పేరు, డిజిగ్నేషన్ పూర్తి వివరాలను చేతితో రాస్తే ఆమోదించాలని గతేడాది జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇవే మార్గదర్శకాలు అమలవుతున్నాయి. కానీ.. రాష్ట్రంలో టీడీపీ నేతల విజ్ఞప్తి మేరకు ఈ మార్గదర్శకాలను సడలిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్ మీనా ఈనెల 25న ఉత్తర్వులు జారీచేశారు. నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి (ఆర్వో) నిర్దేశించిన అటెస్టింగ్ ఆఫీసర్ సంతకాలు (స్పెసిమెన్) సేకరించి.. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఆర్వోలకు పంపాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం ఉంటే చాలు.. డిజిగ్నేషన్ పూర్తి వివరాలను చేతితో రాయకపోయినా సరే.. ఆ సంతకంపై ఏమైనా అనుమానం వస్తే రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్వో), జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉన్న సంబంధిత అటెస్టింగ్ అధికారి సంతకం (స్పెసిమెన్)తో సరిపోల్చుకుని పోస్టల్ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకునేలా సడలింపు ఇచ్చారు. గోప్యతకు.. శాంతిభద్రతలకు విఘాతం..ఇక పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సమయంలో స్పెసిమెన్ సంతకంపై రాజకీయ పక్షాల ఏజెంట్ల మధ్య భేదాభిప్రాయాలు వ్యక్తమవుతాయి. ఇది చినికిచినికి పెను వివాదంగా మారి శాంతిభద్రతల సమస్యగా పరిణమించే ప్రమాదం ఉంది. ఈ నిబంధనలవల్ల ఓటు గోప్యత ఉండదని రాజకీయ పక్షాలు, ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో టీడీపీ నేతలు విజ్ఞప్తి చేయగానే.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై నిబంధనలను సడలిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనా ఉత్తర్వులు జారీచేయడంపై నివ్వెరపోతున్నారు.నిబంధనల సడలింపుపై న్యాయపోరాటం..ఇదిలా ఉంటే.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను సడలిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్ మీనా జారీచేసిన ఉత్తర్వులపై దుమారం రేగుతోంది. వాటిని సమీక్షించి.. సముచిత నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్‌కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం సముచిత నిర్ణయం తీసుకోని పక్షంలో.. మీనా సడలింపు ఉత్తర్వులపై న్యాయపోరాటం చేసేందుకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. -
సీఈవో మెమోపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, ఢిల్లీ: సీఈఓ మీనా ఇచ్చిన మెమోపై కేంద్ర ఎన్నికల సంఘానికి వై ఎస్సార్ కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఈసీఐ కార్యదర్శి రాజీవ్ కుమార్‌కి ఆ పార్టీ ఎంపీ నిరంజన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఇచ్చిన మెమో ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధమని వైఎస్సార్సీపీ పేర్కొంది.అటెస్టేషన్ అధికారుల స్పెసిమెన్ సంతకాల సేకరణ ఈసీఐ నిబంధనలకు విరుద్ధమని.. ఇది పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తిరస్కరించేందుకు దారితీసేలా ఉందని ఫిర్యాదు చేశారు. సీఈఓ ముఖేష్‌కుమార్ మీనా ఇచ్చిన మెమోను తక్షణమే సమీక్షించి, పునరాలోచన చేయాలని వైఎస్సార్సీపీ విజ్ఞప్తి చేసింది. -
ఈ సడలింపులు.. ‘పచ్చ’సిరాతో!
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల సందర్భంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఒక నిబంధనావళి రూపొందించిందంటే అది దేశవ్యాప్తంగా అమలు జరగాలి. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో నిబంధన అంటూ ఏమీ ఉండదు. అలాగే, గత ఎన్నికల్లో లేని నిబంధన.. అదే విధంగా దేశంలో ఎక్కడాలేని నియమం ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే అమలు చేస్తున్నారంటే ఏమనుకోవాలి? పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో ఇప్పుడు రాష్ట్రంలో ఇదే జరుగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు భిన్నంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన సడలింపులు ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఎందుకంటే.. ఈ సడలింపులు టీడీపీ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగా ఇచ్చిందని స్పష్టంగా తెలిసిపోతోంది కాబట్టి. గత ఎన్నికల్లో లేని సడలింపుల్ని.. పైగా ఇంకెక్కడా లేని మినహాయింపులను ఇక్కడే అమలుచేయడం.. అది కూడా టీడీపీ చెప్పింది చెప్పినట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం తలూపుతూ చేయడం చూస్తుంటే.. రాష్ట్రంలో ఎన్నికల సంఘం.. టీడీపీ సంఘంలా వ్యవహరిస్తోందని కాక ఇంకేమనాలి?కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు భిన్నంగా..నిజానికి.. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారంపై అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం చేసి, స్టాంప్ లేకపోయినా.. తన పేరు, డిజిగ్నేషన్ వివరాలను చేతితో రాస్తే ఆమోదించాలని గతేడాది జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) మార్గదర్శకాలు జారీచేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇవే మార్గదర్శకాలు అమలవుతున్నాయి. కానీ.. రాష్ట్రంలో టీడీపీ నేతల విజ్ఞప్తి మేరకు ఈ మార్గదర్శకాలను సడలిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌కుమార్ మీనా ఈనెల 25న ఉత్తర్వులు జారీచేశారు. అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం ఉంటే చాలు.. డిజిగ్నేషన్ పూర్తి వివరాలను చేతితో రాయకపోయినా సరే.. ఆ సంతకంపై ఏమైనా అనుమానం వస్తే రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్వో), జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉన్న సంబంధిత అటెస్టింగ్ అధికారి సంతకంతో సరిపోల్చుకుని పోస్టల్ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకునేలా సడలింపు ఇవ్వడంపై రాజకీయ పక్షాలు నివ్వెరపోతున్నాయి. ఎన్నికల సంఘం పచ్చపాతం మరోసారి బహిర్గతమైందని విమర్శిస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు సందర్భంగా ఇది వివాదాలకు దారితీస్తుందని.. శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.మరీ ఇంత ‘పచ్చ’పాతమా?..పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఎన్నికల సంఘం ఏర్పాటుచేసిన అటెస్టింగ్ ఆఫీసర్లు కొంతమంది సీల్ వేయకుండా కేవలం సంతకాలు మాత్రమే చేశారని.. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని తమ ఓట్లను తిరస్కరించకుండా ఆమోదించేలా చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్ మీనాకు టీడీపీ నుంచి పలు విజ్ఞాపనలు వచ్చాయి. వాటిని పరిగణనలోకి తీసుకున్న ఆయన.. 2023, జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన మార్గదర్శకాలను ఉటంకిస్తూ ఈనెల 25న ఉత్తర్వులు జారీచేశారు. వాటి ప్రకారం.. డిక్లరేషన్ ఫారం మీద అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం, పేరు, హోదా (డిజిగ్నేషన్) పూర్తి వివరాలు తప్పనిసరిగా ఉండాలి. ఇవి ఉండి స్టాంప్ లేకపోయినా వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చు. ఈ నిబంధన దేశవ్యాప్తంగా అమలవుతోంది. కానీ.. అటెస్టింగ్ ఆఫీసర్ స్టాంప్ లేకపోయినా.. పేరు, డిజిగ్నేషన్ వివరాలను చేతితో రాయకపోయినా.. సంతకం ఉంటే చాలు.. దానిపై ఏమైనా అనుమానం వస్తే దాన్ని రిటర్నింగ్ ఆఫీసర్, జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉన్న సంబంధిత అటెస్టింగ్ ఆఫీసర్ సంతకంతో సరిపోల్చుకుని పోస్టల్ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలంటూ సడలింపు ఇవ్వడం గమనార్హం.పోస్టల్ బ్యాలెట్ ఆమోదానికి ఇతర నిబంధనలివీ..⇒ పోస్టల్ బ్యాలెట్ పేపర్ వెనుక రిటర్నింగ్ ఆఫీసరుగానీ లేదా ఫెసిలిటేషన్ సెంటర్ ఇన్‌ఛార్జి సంతకం తప్పనిసరిగా ఉండాలి. ⇒ బ్యాలెట్ పేపర్ వెనుక సంతకం విషయంలో ఏమైనా సందేహాలొస్తే సీరియల్ నెంబర్ ప్రకారం కౌంటర్ ఫైల్‌ను పరిశీలించి అది నిజమైన బ్యాలెట్ అవునా కాదా అని నిర్థారించుకోవాలి. ఒకవేళ సందేహం ఉంటే వాటిని తిరస్కరించాలి.⇒ ఓటరు కవర్–బీ మీద సంతకంలేదన్న కారణంతో కూడా ఓటును తిరస్కరించకూడదు. డిక్లరేషన్ ఫాం–13ఏ ప్రకారం ఓటరును గుర్తించవచ్చు. ఇవికాక.. బ్యాలెట్ పేపర్ ఉండే ఇన్నర్ కవర్ ఫారం–13బీని తెరవకుండానే ఈ సమయాల్లో ఓటును తిరస్కరించవచ్చు.⇒ కవర్–బీని తెరవగానే, ఓటరు డిక్లరేషన్ ఫారం లేకపోతే, డిక్లరేషన్ ఫారంపై గెజిటెడ్ లేదా అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం లేకపోయినా, ఫారం–13ఏ, ఫారం–13బీలో బ్యాలెట్ సీరియల్ నెంబర్లు వేర్వేరుగా ఉంటే బ్యాలెట్ పేపర్ తెరవకుండానే తిరస్కరించొచ్చు.⇒ ఈ విధానం అంతా పూర్తయి బ్యాలెట్ పేపరు తెరిచిన తర్వాత.. ఎవరికీ ఓటు వేయకపోయినా.. ఒకరి కంటే ఎక్కువ మందికి ఓటువేసినా.. అనుమానాస్పద బ్యాలెట్ పేపరుగా గుర్తించినా.. బ్యాలెట్ పేపరు చిరిగిపోయినా.. అది నిజమైన బ్యాలెట్ అని నిర్థారించడానికి అవకాశంలేని సమయంలో.. రిటర్నింగ్ ఆఫీసరు ఇచ్చిన కవర్–బీ లేకపోయినా.. ఓటరు ఎవరో గుర్తించే విధంగా ఏమైనా గుర్తులు, లేక రాతలున్న సందర్భాల్లో తిరస్కరింవచ్చు. -
ఈసీ నోరుమెదపదేం?!
కోట్లాదిమంది పౌరులు నచ్చినవారిని, సమర్థులనుకున్నవారిని తమ ప్రతినిధులుగా ఎంపిక చేసుకునే అసాధారణ ప్రక్రియ ఎన్నికలు. ఆ ప్రక్రియను ఎంత పారదర్శకంగా...ఎంత వివాదరహితంగా...ఎంత తటస్థంగా నిర్వహిస్తే అంతగా ప్రజాస్వామ్యం వర్థిల్లుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి ఆదినుంచీ ఇందుకు విరుద్ధమైన పోకడలు చోటుచేసుకున్నాయి. ఎన్నికల షెడ్యూల్ వెలువడింది మొదలు చిత్ర విచిత్ర ధోరణులు కనబడ్డాయి. పోలింగ్ రోజైన ఈనెల 13న, ఆమర్నాడు రాష్ట్రంలో జరిగిన ఉదంతాలు వీటికి పరాకాష్ఠ. వివిధ జిల్లాల్లో చెదురుమదురుగా చోటుచేసుకున్న ఘటనలు ఒక ఎత్తయితే నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో జరిగిన ఉదంతాల పరంపర మరో ఎత్తు. టీడీపీ రౌడీ మూకలు పోలింగ్ కేంద్రాల్లోకి జొరబడి వైఎస్సార్ కాంగ్రెస్ ఏజెంట్లపై దౌర్జన్యం సాగించి వెళ్లగొట్టడం, వోటేయడానికి క్యూలో నించున్న బలహీనవర్గాలవారినీ, మహిళలనూ కొట్టి వెనక్కిపంపడం వంటి ఉదంతాలపై ఫిర్యాదు చేసినా అరణ్యరోదనే అయింది. అసాంఘిక శక్తులు చొరబడి పోలింగ్ ప్రక్రియను దెబ్బతీయకుండా చూడటానికీ, అవసరమైనప్పుడల్లా కిందిస్థాయి అధికారులకు తగిన ఆదేశాలివ్వడానికీ, సమస్యాత్మక ప్రాంతాలకు బలగాలు తరలించటానికీ వీలుంటుందని ఏర్పాటుచేసిన వెబ్‌కాస్టింగ్‌ను ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు. దాని నియంత్రణ టీడీపీ చేతుల్లోకి పోయింది. ఆ తర్వాత రెండురోజులూ పచ్చమూకలు తెగబడి రోడ్లపై స్వైరవిహారం చేశాయి. వైఎస్సార్ కాంగ్రెస్‌కు వోటేశారనుకున్నవారి ఇళ్లను లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించాయి. ఈ మూకలకు భయపడి వందలమంది ఇళ్లూ వాకిళ్లూ వదిలి వేరేచోట తలదాచుకోవాల్సివచ్చింది. ఇదంతా చానెళ్లలో ప్రసారం అవుతున్నా రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు బాధ్యతవహించాల్సిన అధికారులకుగానీ, శాంతిభద్రతలు పర్యవేక్షించాల్సిన పోలీసు అధికారులకుగానీ చీమకుట్టినట్టయినా లేదు. ఎన్నికలకు రెండురోజుల ముందు త్రికూటమి సౌజన్యంతో విధుల్లో చేరిన ఉన్నతాధికారులు ఈ విధ్వంసకాండ సాగుతున్న సమయంలో మౌనదీక్షలో మునిగిపోయారు. పరువు బజార్నపడిందనుకున్నదో ఏమో కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని నివేదిక తెప్పించుకుని ముగ్గురు ఎస్పీలనూ, ఒక కలెక్టర్‌నూ బదిలీచేసింది. మూడు జిల్లాల్లో 12 మంది పోలీస్ అధికారులను సస్పెండ్ చేసింది. సిట్ ఏర్పాటుచేసి దర్యాప్తు చేయించింది. ఇంత జరిగినా కారంపూడి సీఐగా ఉంటూ టీడీపీ విధ్వంసకాండకు కొమ్ముకాసిన నారాయణస్వామికి మాత్రం ఏం కాలేదు. ఐజీ త్రిపాఠి సరేసరి. వీరు కొత్త కొత్త కేసులు బనాయిస్తూ స్వామిభక్తిని చాటుకుంటున్నారు.త్రికూటమి ఆడించినట్టల్లా ఆడటానికి ఎన్నికల సంఘం రెడీ అయిపోయిందని ఉన్నతాధికారుల ఏకపక్ష బదిలీలు మొదలైనప్పుడే అందరికీ అర్థమైపోయింది. ఎవరిని ఎక్కడ నియమించాలో ఆదేశిస్తూ కూటమి ఇచ్చిన ఆదేశాలకు ‘జీ హుజూర్’ అంటూ కొత్త అధికారులను దించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఉద్దేశపూర్వకంగా కొందరు అధికారులను నియమించటంతో మొదలైన కుట్రపై లోతుగా దర్యాప్తు చేస్తే తప్ప ఎన్నికల రోజునా, ఆ తర్వాతా కొనసాగిన హింస, విధ్వంసకాండ వెనక ఏయే శక్తులున్నాయో వెల్లడి కాదు. మన దేశంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియను చూసి ముచ్చటపడి అనేక దేశాలు దాన్ని అనుసరించటం మొదలెట్టాయి. ఎప్పటికప్పుడు అభివృద్ధి అవుతున్న కొత్త సాంకేతికతలతో ఎన్నికల ప్రక్రియ మరింత మెరుగ్గా, సాఫీగా సాగేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటున్నది. మరి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఏమైంది? ఈ ఉదంతాల సమయంలో ఎందుకాయన మౌనంగా ఉండిపోయారు? కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకునేవరకూ తన వంతుగా చేసిందేమిటి? ఎన్నికల రోజున మాచర్ల వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 8 గ్రామాల్లో టీడీపీ రిగ్గింగ్ చేస్తున్న వైనం గురించి వరసగా రెండు లేఖలు రాసినా, అలాంటిచోట్ల రీపోలింగ్ నిర్వహించాలని డిమాండు చేసినా మీనా ఎందుకు జవాబీయలేదు? ఈవీఎం పగలగొట్టినట్టు టీడీపీ ఒక వీడియో విడుదల చేసేవరకూ ఆ ఉదంతం తెలియనట్టే ఎందుకున్నారు? 23 గంటల నిడివికిపైగా ఉన్న ఆ వీడియోలో ముందూ వెనకా ఏం జరిగిందో అసలు ఎన్నికల సంఘం చూసిందా? చూస్తే ఎందుకు మౌనం వహించింది? అన్నిటికన్నా చిత్రమేమంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న పిన్నెల్లి అదే రోజు రీ పోలింగ్ కోసం డిమాండ్ చేయగా నాలుగైదు రోజుల తర్వాత ఆ వీడియో బయటపెట్టిన టీడీపీ ఇంతవరకూ రీపోలింగ్ కోరనేలేదు. వెబ్‌కాస్టింగ్ మొత్తం టీడీపీ ముఠా నియంత్రణలో ఉందన్న ఆరోపణలపై ఎన్నికల సంఘం నోరు మెదపటం లేదు.ఇంత బరితెగింపుతో దేశంలో ఎక్కడా ఎప్పుడూ ఎన్నికలు జరగలేదు. తన బాధ్యతేమిటో, కర్తవ్యవేమిటో మరిచి తోకపట్టుకుని పోయే చందంగా నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్న ఎన్నికల సంఘం ఇప్పటికైనా మౌనం వీడాలి. నర్సరావుపేట పరిధిలోనే కాదు... ఇతర నియోజకవర్గాల్లోనూ ఈవీఎంలు ధ్వంసం చేసిన ఉదంతాలు వెల్లడయ్యాయి. మంత్రి అంబటి రాంబాబు కొన్నిచోట్ల రీపోలింగ్ కోరారు. వీటన్నిటికీ జవాబు రావాలి. సంజాయిషీ ఇవ్వాల్సిన స్థానంలోవున్నవారు మూగనోము పడితే అనుమానాలు మరింత బలపడతాయి. కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా సాగుతుందా అన్న సందేహాలు తలెత్తుతాయి. కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని ఈ తలకిందుల వ్యవస్థను నిటారుగా నిలబెట్టాలి. ప్రజాస్వామ్యంపై ప్రజలకుండే విశ్వసనీయతను కాపాడాలి. -
Lok Sabha Election 2024: ఓటింగ్... ప్చ్!
సార్వత్రిక ఎన్నికల సమరంలో పారీ్టలన్నీ హోరాహోరీగా తలపడుతున్నా ఓటర్లలో మాత్రం అంత ఆసక్తి కనబడటం లేదు. మండుటెండలు ఇతరత్రా కారణాలు ఎన్నున్నా దేశవ్యాప్తంగా చాలాచోట్ల ఓటింగ్ తగ్గుముఖం పట్టడం పార్టీలు, అభ్యర్థుల్లో గుబులు పుట్టిస్తోంది. ఏడు విడతల సుదీర్ఘ ఎన్నికల షెడ్యూల్లో ఏప్రిల్ 19 నుంచి మే 25 దాకా ఆరు విడతలు పూర్తయ్యాయి. తొలి ఐదు విడతలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కచి్చతమైన ఓటింగ్ గణాంకాలను విడుదల చేసిన నేపథ్యంలో ఓటింగ్ ట్రెండ్‌లో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి...ఓటర్లు పెరిగినా ఓట్లు తగ్గాయి తొలి ఐదు విడతల పోలింగ్‌లో దేశవ్యాప్తంగా 428 లోక్‌సభ స్థానాల పరిధిలో ఓటర్లు తమ నిర్ణయాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఆ స్థానాల్లో 50.7 కోట్ల ఓట్లు పోలైనట్లు ఈసీ తెలిపింది. గత ఎన్నికల్లో తొలి ఐదు విడతల్లో 426 స్థానాల్లో ఏకంగా 70.1 కోట్ల మంది ఓటేయడం విశేషం. అప్పుడు 68 శాతం ఓటింగ్ నమోదైతే ఈసారి 66.4 శాతానికి పరిమితమైంది. వాస్తవానికి 2019 ఎన్నికల్లో దేశంలో మొత్తం ఓటర్లు 89.6 కోట్లుండగా ఈసారి 96.8 కోట్లకు పెరిగారు. 7.2 కోట్ల మంది కొత్త ఓటర్లు జతైనా ఓటింగ్ మాత్రం పడిపోవడం గమనార్హం. ఈసారి తొలి విడత నుంచే ఓటింగ్‌లో తగ్గుదల ధోరణి కొనసాగుతోంది. చివరి రెండు విడతల్లోనూ ఇదే ట్రెండ్ ఉంటే మొత్తం ఓటింగ్ గత ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నమోదైన 67.4 శాతానికి చాలాదూరంలో నిలిచిపోయేలా కనిపిస్తోంది. (ప్రాథమిక డేటా ప్రకారం ఆరో విడతలో 63.36 శాతం పోలింగ్ నమోదైంది. 2019లో ఇది 64.73 శాతం). 20 రాష్ట్రాలు, యూటీల్లో డౌన్... ఐదు విడతల పోలింగ్‌ను పరిశీలిస్తే ఏకంగా 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటింగ్ తగ్గింది. నాగాలాండ్‌లో పలుచోట్ల ఎన్నికల బహిష్కరణ పిలుపుల నేపథ్యంలో ఓటింగ్ బాగా తగ్గింది. గత ఎన్నికల్లో 82.9 శాతం నమోదు కాగా ఈసారి ఏకంగా 57.7 శాతానికి పడిపోయింది. మిజోరం, కేరళల్లో పోలింగ్ 6 శాతం మేర తగ్గింది. మణిపూర్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్‌ల్లో 4 శాతం పైగా తగ్గింది. షాదోల్, రేవా, ఖజురహో, సిద్ధి (మధ్యప్రదేశ్), పథనంతిట్ట (కేరళ), మథుర (యూపీ) లోక్‌సభ స్థానాల్లోనైతే 10 శాతానికి పైగా పడిపోయింది. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్‌లో 2019తో పోలిస్తే 6.76 శాతం తగ్గింది! కశీ్మర్లో పోటెత్తారు... దేశవ్యాప్తంగా ట్రెండ్‌కు భిన్నంగా కొన్ని రాష్ట్రాలు, నియోజకవర్గాల్లో ఓటర్లు పోటెత్తారు. ముఖ్యంగా జమ్మూ కశ్మీర్, మేఘాలయ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, కర్నాటకల్లో ఓటింగ్ బాగా పెరిగింది. జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా, శ్రీనగర్ నియోజకవర్గాల్లో గత ఎన్నికల కంటే ఏకంగా 24 శాతం అధిక ఓటింగ్ నమోదైంది. మేఘాలయలోని షిల్లాంగ్‌లో 8.31 శాతం పెరిగింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఈసీ కీలక ఆదేశాలు
సాక్షి, విజయవాడ: కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు కలెక్టర్లకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఈసీ మెమో జారీ చేసింది. పోస్టల్ బ్యాలెట్‌పై అటెస్టేషన్ అధికారి అధికారిక ముద్ర లేకపోయినా ఆ బ్యాలెట్‌ను తిరస్కరించవద్దని ఈసీ స్పష్టం చేసింది. ఫాం 13ఏ పై రిటర్నింగ్ అధికారి తన సంతకం సహా పూర్తి వివరాలు నింపి ఉంటే అధికారిక ముద్ర లేకపోయినా ఆ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందని తెలిపింది.పోస్టల్ బ్యాలెట్‌పై సదరు రిటర్నింగ్ అధికారి సంతకం సహా బ్యాలెట్‌ను ధృవీకరించేదుకు రిజిస్టర్‌తో సరిపోల్చుకోవాలని ఈసీ వెల్లడించింది. పోస్టల్ బ్యాలెట్ కవర్ ఫాం సి పై ఎలెక్టర్ సంతకం లేదని సదరు బ్యాలెట్‌ను తిరస్కరించరాదని ఈసీ స్పష్టం చేసింది. ఫాం 13ఏ లో ఓటర్ సంతకం లేకపోయినా, రిటర్నింగ్ అధికారి అటెస్టేషన్ సంతకం లేకపోయినా, బ్యాలెట్ సీరియల్ నెంబరు లేకపోయినా సదరు బ్యాలెట్ తిరస్కరించ వచ్చని స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్ పేపరుపై నిబంధనల ప్రకారం ఓటు నమోదు చేయక పోయినా సదరు ఓటు తిరస్కరణకు గురి అవుతుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. -
ఓట్ల లెక్కింపు ఇలా
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే ఓట్ల లెక్కింపు సమయం దగ్గర పడుతోంది. జూన్ 4న ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను కల్పించనున్నారు. మే 13న పోలింగ్ అనంతరం పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే 25 కంపెనీల బలగాలను రాష్ట్రానికి పంపింది. మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియలో 25 వేల మందికిపైగా ఉద్యోగులు పాల్గొననున్నారు. వీరందరికీ రెండు రోజుల శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత ర్యాండమైజేషన్ ద్వారా ఉద్యోగులను నియోజకవర్గాలకు కేటాయిస్తారు. మొత్తం ఈ ఓట్ల ప్రక్రియను నిశితంగా పరిశీలించడానికి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఒక్కొక్కరు చొప్పున మొత్తం 200 మంది కేంద్ర పరిశీలకులతోపాటు 200 మంది రిటరి్నంగ్ ఆఫీసర్లను నియమించారు. ఈవీఎంల తరలింపు మే 13న పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి ఈవీఎంలను, వీవీ ప్యాట్లను స్ట్రాంగ్ రూమ్‌ల్లో భద్రపర్చారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు మొదలయ్యే అరగంట ముందు స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి ఈవీఎంలను ఓట్ల లెక్కింపు కేంద్రాలకు తరలిస్తారు. ముందుగా ఆర్వో టేబుల్ వద్ద పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలవుతుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలైన అరగంట తర్వాత కూడా ఆ ప్రక్రియ కొనసాగుతుంటే అప్పుడు ఇక ఈవీఎంల లెక్కింపును మొదలుపెట్టడం మొదలు పెడతారు. అసెంబ్లీ, పార్లమెంట్‌కు ఒకేసారి ఎన్నికలు జరగడంతో ఈవీంఎలు తారుమారు కాకుండా ఉండటం కోసం స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి తీసుకువచ్చే సిబ్బందికి వేర్వేరు రంగుల్లో యూనిఫామ్ కేటాయించి ఈవీఎంలను తరలిస్తారు. వీరు ఈవీఎంల సీరియల్ నంబర్ ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి కౌంటింగ్ టేబుళ్లపైకి చేరుస్తారు. కౌటింగ్ సమయంలో కేవలం ఈవీఎం కంట్రోల్ యూనిట్ మాత్రమే తీసుకువస్తారు. ఓటు వేసిన ఈవీఎం మెషీన్‌తో అవసరం లేదు. కౌంటింగ్ హాల్లో టేబుళ్లు ఎన్ని ఉంటే అన్ని ఈవీఎంలను మాత్రమే తీసుకురావాలి. ఒక రౌండ్ పూర్తయిన తర్వాతే మరుసటి రౌండ్‌కు సంబంధించిన కంట్రోల్ యూనిట్‌ను తీసుకురావాల్సి ఉంటుంది. పోలైన ఓట్ల ఆధారంగా ఎన్ని రౌండ్లు కౌంటింగ్ అన్నది లెక్కించి.. దాని ప్రకారం టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. ఈవీఎంలో నమోదైన ఓట్లు, వీవీ ప్యాట్‌లో నమోదైన ఓట్లు సరిగా ఉన్నాయా.. లేదా.. అన్నదాన్ని పరిశీలించడం కోసం ర్యాండమ్‌గా మూడు వీవీప్యాట్లు ఎంపిక చేసి మూడింటిని లెక్కిస్తారు. ఇది కూడా ఈవీఎంల లెక్కింపు పూర్తయిన తర్వాత మాత్రమే చేస్తారు. పోలింగ్ ముగిసిన తర్వాత క్లోజ్ బటన్ నొక్కకుండా ఉన్న (క్లోజ్ రిజల్ట్ క్లియర్–సీఆర్సీ) ఓటింగ్ యంత్రాలతో పాటు మాక్ పోలింగ్ ఓట్లను తీసివేయకుండా అలాగే ఉంచిన ఓటింగ్ యంత్రాలను పక్కకు పెట్టి వాటిని చివర్లో మాత్రమే లెక్కిస్తారు. అది కూడా పోటీ హోరాహోరీగా ఉంటేనే. మెజార్టీ భారీగా ఉంటే ఇలా అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఓటింగ్ యంత్రాలను లెక్కించకుండా పక్కకు పెట్టేస్తారు. ప్రతీ రౌండ్ ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకొచ్చిన సువిధ యాప్‌లో నమోదు చేసిన తర్వాతనే ఆర్వో ఫలితాలను ప్రకటించాల్సి ఉంటుంది. -
21 లోక్‌సభ స్థానాల్లో విజేతలను నిర్ణయించేది మహిళలే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 21 లోక్‌సభ స్థానాల్లో విజేతలను నిర్ణయించేది మహిళా ఓటర్లేనని స్పష్టమైంది. ఈ నెల 13న జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలకు గాను 21 స్థానాల్లో పురుషులు కన్నా మహిళలే ఎక్కువ మంది ఓటేశారని కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ గణాంకాలు పేర్కొన్నాయి. అమలాపురం, ఒంగోలు, కర్నూలు, హిందూపురం లోక్‌సభ స్థానాల్లో మాత్రమే మహిళలు కన్నా పురుషులు స్వల్పంగా ఎక్కువగా ఓటేశారు. కాకినాడ, అనంతపురం లోక్‌సభ స్థానాల్లో పురుషులు కన్నా మహిళలే ఎక్కువగా ఓటేసినా.. తేడా మాత్రం స్వల్పంగానే ఉంది.మిగతా లోక్‌సభ స్థానాల్లో 11 వేల నుంచి 47 వేల వరకు మహిళల ఓట్లు ఎక్కువ ఉన్నాయి. మహిళా ఓట్లు ఎక్కువగా నమోదయ్యాయంటే సహజంగానే వైఎస్సార్సీపీకే మొగ్గు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలనలో మహిళల కోసం అనేక పథకాలను అమలు చేయడమే కాకుండా వారి జీవనోపాధిని మెరుగుపరచడమే కారణమని వారు విశ్లేíÙస్తున్నారు. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మహిళల పేరిట పథకాలు మంజూరు చేయడంతో మహిళా ఓటింగ్ పెరిగిందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక స్పష్టం చేసిన విషయం తెలిసిందే.రాష్ట్రంలోని మహిళలందరూ మళ్లీ వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే గట్టి పట్టుదలతో పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేశారని సీనియర్ రాజకీయ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. మహిళల ఓట్లు ఎక్కువగా నమోదైన 21 పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు ఆ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో మహిళల ఓట్లన్నీ వైఎస్సార్సీపీకే పడ్డాయని, పోలింగ్ రోజు ఇది స్పష్టంగా కనిపించిందని ఆ రాజకీయ నాయకులు చెబుతున్నారు.హైదరాబాద్ అపార్ట్మెంట్లలో ఇస్త్రీ పనికి వెళ్లిన వారితో పాటు వివిధ రకాల చిన్న చిన్న పనులు చేసుకునేందుకు వెళ్లిన మహిళలందరూ కూడా ఏపీ వెళ్లి వైఎస్సార్సీపీకే ఓటు వేశామని చెబుతున్నారు. ప్రభుత్వం వల్ల మేలు పొందిన వారందరూ ఎక్కడున్నా సరే పోలింగ్ రోజున రాష్ట్రానికి వచ్చి వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో ఓటు వేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ఓటెత్తిన చైతన్యం.. గడచిన 4 దశల్లో 2019 కన్నా అత్యధికంగా పోలైన ఓట్లు
దేశంలో ఇప్పటివరకూ లోక్‌సభకు జరిగిన నాలుగు దశల ఎన్నికల్లో ఓటర్ల చైతన్యం వెల్లువెత్తింది. 2019లో జరిగిన నాలుగు దశల ఎన్నికలతో పోలిస్తే ఈ సారి(పోస్టల్ బ్యాలెట్లు మినహాయించి) 1.9 కోట్ల మంది ఓటర్లు పెరిగినట్టు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక స్పష్టం చేసింది. సాక్షి, అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం 2019 నాలుగు దశల్లో 42.6 కోట్ల మంది ఓటేస్తే ఈసారి నాలుగు దశల్లో 45.1 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే 2.5 కోట్ల మంది ఓటర్లు పెరిగినట్లు ఎస్బీఐ స్పష్టం చేసింది. 4 దశల్లో పెరిగిన ఓటర్లలో మహిళా ఓటర్లే 93.6 లక్షల మంది ఉండగా పురుష ఓటర్లు 84.7 లక్షల మంది ఉన్నట్లు ఆ నివేదిక పేర్కొంది. 2019 కంటే 2024లో అత్యధికంగా ఓట్లు వేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 19.5 లక్షల ఓట్లతో నాలుగో స్థానంలో ఉంది. కర్నాటకలో అత్యధికంగా 35.5 లక్షల ఓటర్లతో తొలి స్థానంలో, తెలంగాణలో 31.9 లక్షల ఓటర్లతో రెండో స్థానంలోనూ, మహారాష్ట్ర 20 లక్షల ఓటర్లతో మూడో స్థానంలో ఉన్నట్లు నివేదికలో వివరించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓటేసిన వారి కన్నా 2024లో కేరళలో 5.3 లక్షల ఓటర్లు తగ్గారని, మణిపూర్‌లో 3.4 లక్షల ఓటర్లు తగ్గినట్టు ఎస్బీఐ నివేదిక తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలే మహిళా ఓటింగ్ పెరగడానికి దోహదపడిందని వివరించింది. ఏపీలో 2019 లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే ఈ సారి ఎన్నికల్లో 8.4 లక్షల మహిళా ఓటర్లు అధికంగా ఓటు వేసినట్టు తెలిపింది. -
అనంత్‌నాగ్–రాజౌరీలో... అంతుపట్టని ఓటరు నాడి
జమ్మూ కశీ్మర్లో అనంత్‌నాగ్–రాజౌరీ స్థానంలో పోటీ ఈసారి ఆసక్తి రేపుతోంది. ఉమ్మడి రాష్ట్ర చివరి సీఎం, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ చీఫ్ మెహబూబా ముఫ్తీ బరిలో దిగడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ పోలింగ్ మే 7న మూడో విడతలో జరగాల్సింది. బీజేపీ, ఇతర పారీ్టల విజ్ఞప్తి మేరకు ఆరో విడతలో భాగంగా మే 25కు కేంద్ర ఎన్నికల సంఘం మార్చింది... 2022 పునర్విభజనలో అనంత్‌నాగ్ లోక్‌సభ స్థానం కాస్తా అనంత్‌నాగ్–రాజౌరీగా మారింది. విపక్ష ఇండియా కూటమి భాగస్వాములైన నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ కశీ్మర్ లోయలో మాత్రం పరస్పరం పోటీ పడుతున్నాయి. లోయలోని 3 లోక్‌సభ స్థానాలూ 2014లో పీడీపీకే దక్కాయి. 2019లో వాటన్నింటినీ ఎన్సీ కైవసం చేసుకుంది. సిట్టింగ్ ఎంపీ హస్నాయిన్ మసూదీ కేవలం 6,676 ఓట్లతో గట్టెక్కారు. ఎన్సీ ఈసారి వ్యూహాత్మకంగా గుజ్జర్ బకర్వాల్ మత నాయకుడు, పార్టీ సీనియర్ నేత మియా అల్తాఫ్‌ను బరిలో దింపింది. ఆయనకు పూంచ్, రాజౌరిలో గట్టి మద్దతుంది. ఇది ఇతర పారీ్టల ఓట్లను చీల్చే అవకాశముంది. మోదీ ప్రభుత్వం ఫిబ్రవరిలో పహాడీ జాతి సమూహాలకు షెడ్యూల్డ్ తెగ హోదా ఇచ్చాక సమీకరణాలు మారాయి. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి వేరు కుంపటి పెట్టుకున్న గులాం నబీ ఆజాద్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) నుంచి మహమ్మద్ సలీమ్ పారే, అప్నీ పార్టీ నుంచి జాఫర్ ఇక్బాల్ మన్హాస్ బరిలో ఉన్నారు. ఆరి్టకల్ 370 రద్దు నేపథ్యంలో బల్దేవ్ కుమార్ రూపంలో జమ్మూకశీ్మర్‌లో తొలిసారిగా ఓ స్థానికేతరుడు పోటీ చేస్తుండటం విశేషం. ఆయన స్వస్థలం పంజాబ్. లెక్కలు మార్చేసిన డీలిమిటేషన్! 2022కు ముందు జమ్మూలో రెండు (జమ్మూ, ఉధంపూర్), కశ్మీర్లో మూడు (శ్రీనగర్, బారాముల్లా, అనంత్‌నాగ్), లద్దాఖ్‌లో ఒక లోక్‌సభ స్థానముండేవి. డీలిమిటేషన్ తర్వాత జమ్మూలో రెండు స్థానాలు కొనసాగినా అక్కడి పూంచ్, రాజౌరి జిల్లాల్లో చాలా భాగాన్ని కశీ్మర్లోని అనంత్‌నాగ్ లోక్‌సభ స్థానంతో కలిసి అనంత్‌నాగ్–రాజౌరీగా చేశారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలో 18 అసెంబ్లీ సీట్లున్నాయి. మొత్తం 18.3 లక్షల ఓటర్లున్నారు. 10.94 లక్షల మంది కశీ్మర్ ప్రాంతంలో, 7.35 లక్షల మంది జమ్మూలో ఉన్నారు. మెజారిటీ కశీ్మరీలు ముస్లింలు. జమ్మూలో 3 లక్షల మేర గుర్జర్లు, బేకర్వాల్ సామాజిక వర్గం ఉంది. మిగతా జనాభా పహాడీలు (హిందువులు, సిక్కులు ఇతరత్రా). వారిని ఎస్టీ జాబితాలోకి చేర్చడం వంటి చర్యల ద్వారా బీజేపీ నెమ్మదిగా లోయలో పాగా వేయజూస్తోంది. ఈసారి పోటీ చేయకున్నా వేరే పారీ్టలకు మద్దతిస్తోంది. బీజేపీ నేతలు తీవ్రంగా ప్రచారమూ చేస్తున్నారు. ఎన్సీ, కాంగ్రెస్, పీడీపీలపై సభలు పెట్టి మరీ విమర్శలు గుప్పిస్తున్నారు! ఆ మూడింటికి కాకుండా ఎవరికైనా ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.కశీ్మరీ పండిట్ ఒంటరి పోరు కశీ్మరీ పండిట్లు. 1980ల్లో పెచ్చరిల్లిన హింసాకాండకు తాళలేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వలసపోయిన ప్రజలు. ఏళ్ల కొద్దీ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఈ వర్గానికి చెందిన దిలీప్ కుమార్ పండిత (54) ఈసారి అనంత్‌రాగ్–రాజౌరి నుంచి స్వతంత్ర అభ్యరి్థగా పోటీ చేస్తున్నారు! ముఫ్తి, మియా అల్తాఫ్ అహ్మద్‌లకు గట్టి సవాల్ విసురుతున్నారు. పౌర చర్చల ద్వారా పండిట్లు, ముస్లింలతో పాటు కశ్మీరీలందరినీ ఏకం చేస్తానన్నది ఆయన హామీల్లో ప్రధానమైనది. నిజాయితీగా ఆయన చేస్తున్న ప్రయత్నం స్థానికులను ఆకర్షిస్తోంది. ప్రతి గడపకూ వెళ్లి ఓట్లడుగుతున్నారు. స్థానికులతో భేటీ అవుతున్నారు. ఐదు వలస శిబిరాల్లో ఉన్న 35,000 మంది పండిట్లను తనకే ఓటేయాలని కోరారు. ‘‘35 ఏళ్లుగా ఇంటికి దూరంగా బతుకుతున్నాం. మాకిప్పటికీ న్యాయం జరగలేదు. కశీ్మరీ పండిట్లకు న్యాయం కోసం, వారు లోయలోకి సురక్షితంగా తిరిగొచ్చే పరిస్థితులను నెలకొల్పడం కోసం పోరాడుతున్నాను’’ అని మీడియాకు తెలిపారు పండిత.బీజేపీ అడ్డుకుంటోంది: ముఫ్తీ తాము ప్రజలను కలవకుండా మోదీ సర్కారు అడ్డుకుంటోందని ముఫ్తీ ఆరోపిస్తున్నారు. ‘‘ఆరి్టకల్ 370 రద్దుతో వారు నెలకొల్పామంటున్న శాంతి నిజానికి శ్మశాన వైరాగ్యం. మాకది ఆమోదయోగ్యం కాదు. జమ్మూ కశ్మీర్ యంత్రాంగం దన్నుతో దక్షిణ కశీ్మర్లో ఎన్కౌంటర్లు మొదలయ్యాయి’’ అని మండిపడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు.. మంత్రివర్గ భేటీ నిర్వహణ కోసం పలు షరతులతో కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాశ్ కుమార్ ఆదివారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్‌కు లేఖ రాశారు.అత్యవసరమైన అంశాలు మాత్రమే..లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు.. అత్యవసరమైన, నిర్ణీత గడువులోగా అమలు చేయాల్సిన అంశాలను మాత్రమే కేబినెట్ భేటీలో చర్చించాలని ఈ లేఖలో ఈసీ స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్న నేపథ్యంలో.. అప్పటి వరకు నిరీక్షించడం సాధ్యం కాని, అత్యవసరమైన అంశాలను మాత్రమే మంత్రివర్గ సమావేశం ఎజెండాలో చేర్చాలని పేర్కొంది. మంత్రివర్గ సమావేశం ఎజెండాలో ప్రతిపాదించిన రుణమాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని వంటి అంశాలను లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు వాయిదా వేసుకోవాలని సూచించింది. ఇక ఎన్నికల నిర్వహణలో పాలుపంచుకున్న రాష్ట్ర ప్రభుత్వ అధికారులెవరినీ సమావేశానికి హాజరుకావాలని కోరరాదని ఆదేశించింది.కాళేశ్వరం బ్యారేజీలకు రిపేర్లు, పంటల సాగుపై నిర్ణయాలు!వాస్తవానికి గత శనివారమే కేబినెట్ భేటీ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఈసీ అనుమతి కోరింది. ఈసీ నుంచి స్పందన రాకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేసుకుంది. సోమవారంలోగా ఈసీ అనుమతించకుంటే మంత్రులతో కలసి ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు కూడా. కానీ తాజాగా ఈసీ అనుమతి ఇవ్వడంతో ప్రభుత్వం అత్యవసర అంశాలపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవడానికి అడ్డంకి తొలగిపోయింది. ఈ భేటీలో కాళేశ్వరం బ్యారేజీలకు అత్యవసర మరమ్మతులు, ధాన్యం కొనుగోళ్లు, వర్షాకాలం పంటల సాగు, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం వంటి అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. -
నేడే ఐదో దశ పోలింగ్
ముంబై/లక్నో: లోక్‌సభ ఎన్నికల్లో ఐదో దశ పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 49 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, స్మృతి ఇరానీ, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, తదితర కీలక నేతలు పోటీచేస్తున్న నియోజకవర్గాల్లోనూ ఈరోజే పోలింగ్ చేపడుతున్నారు. ఏడు దశలను చూస్తే ఈ ఐదో దశలోనే అత్యంత తక్కువ(49) స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ 49 స్థానాల్లో 2019 ఎన్నికల్లో బీజేపీ 40కిపైగా చోట్ల విజయం సాధించడం విశేషం. దీంతో ఈ దశ బీజేపీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. ఈసారైనా మెరుగైన ఓటింగ్ సాధించేలా ఓటర్లు పోలింగ్ ప్రక్రియలో భారీగా పాలుపంచుకోవాలని ముంబై, థానె, లక్నో నగర ఓటర్లకు ఈసీ ఆదివారం విజ్ఞప్తి చేసింది. బరిలో కీలక నేతలుకేంద్ర మంత్రులు రాజ్‌నాథ్(లక్నో), పియూశ్ గోయల్( నార్త్ ముంబై), కౌశల్ కిశోర్(మోహన్‌లాల్‌గంజ్), సాధ్వి నిరంజన్ జ్యోతి(ఫతేపూర్), శంతను ఠాకూర్ (పశ్చిమబెంగాల్లోని బంగావ్), ఎల్జేపీ(రాంవిలాస్) నేత చిరాగ్ పాశ్వాన్ (బిహార్‌లోని హాజీపూర్), శివసేన శ్రీకాంత్ షిండే(మహారాష్ట్రలోని కళ్యాణ్), బీజేపీ నేత రాజీవ్ ప్రతాప్ రూఢీ, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య( బిహార్‌లోని సరణ్), ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్(ముంబై నార్త్ సెంట్రల్)ల భవితవ్యం సోమవారమే ఈవీఎంలలో నిక్షిప్తం కాబోతోంది. విపక్షాలు అధికారంలోకి వస్తే అయోధ్య బాలరామాలయం పైకి బుల్డోజర్లను పంపిస్తారని మోదీ తీవ్ర విమర్శలు, ఎన్డీఏ 400 చోట్ల గెలిస్తే రాజ్యాంగాన్ని ఇష్టమొచ్చినట్లు మారుస్తుందని, రిజర్వేషన్లు తీసేస్తుందని కాంగ్రెస్ విమర్శలతో ఐదో దశ ప్రచారపర్వంలో కాస్తంత వేడి పుట్టించింది. ఒడిశాలో ఐదు లోక్‌సభ స్థానాలతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దశ కింద 35 ఎమ్మెల్యే స్థానాల్లోనూ సోమవారం పోలింగ్ జరగనుంది. బిజూ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ పోటీచేస్తున్న హింజీలీ అసెంబ్లీ స్థానంలో ఈరోజే పోలింగ్ ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో నాలుగోదశ ముగిశాక 543 స్థానాలకుగాను 23 రాష్ట్రాలు,యూటీల్లో ఇప్పటిదాకా 379 స్థానాల్లో పోలింగ్ పూర్తయింది. ఆరో దశ పోలింగ్ మే 25న, ఏడో దశ జూన్ ఒకటిన జరగనుంది. -
కచ్చితంగా ‘పచ్చ’ కుట్రే!
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటమే ఏకైక లక్ష్యంగా పోలింగ్ సందర్భంగా టీడీపీ విధ్వంస కాండకు బరి తెగించిందని పూర్తి ఆధారాలతో బట్టబయలైంది. వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతోపాటు మహిళలు, వృద్ధులను ఓటింగ్‌కు దూరం చేసేందుకు టీడీపీ పక్కా పన్నాగంలో దాడులకు తెగబడి విధ్వంసం సృష్టించిందని స్పష్టమైంది. అందుకు సంబంధించి వీడియో రికార్డింగులు, ఫొటోలతో సహా కీలక ఆధారాలను సిట్ సేకరించింది. పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలో యథేచ్ఛగా సాగిన టీడీపీ గూండాగిరీపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వరుసగా రెండో రోజు ఆదివారం విచారణ నిర్వహించింది. సిట్ ఇన్చార్జ్గా ఉన్న అదనపు డీజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలోని బృందం అనంతపురం జిల్లా తాడిపత్రితో పర్యటించగా, ఇతర బృందాలు పల్నాడు, తిరుపతి జిల్లాల్లో పర్యటించి విచారణ నిర్వహించాయి. దాడులు, దౌర్జన్యాలతో భీతిల్లిన ప్రాంతాలను పరిశీలించాయి. పోలీసులు నమోదు చేసిన కేసుల వివరాలను పరిశీలించడంతోపాటు బాధితుల అభిప్రాయాలు తెలుసుకున్నాయి. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు టీడీపీ ఎంత పక్కాగా పన్నాగాన్ని అమలు చేసిందన్న దానిపై సిట్ అధికారులు ఓ అంచనాకు వచ్చినట్టు సమాచారం. దాడులను అరికట్టడంలో పోలీసుల వైఫల్యంపై కూడా సిట్ అధికారులు ఓ నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. బాధితులతో మాట్లాడి దాడులు ఎలా జరిగాయన్నది తెలుసుకోవడంతోపాటు కీలకమైన వీడియో, ఫొటో ఆధారాలను సేకరించారు. ప్రధానంగా పల్నాడు, అనంతపురం జిల్లాల్లో పోలీసులు టీడీపీకి కొమ్ము కాసినట్టు.. బాధితులు ఫోన్లు చేసినా సరే స్పందించకుండా ఉదాసీనంగా వ్యవహరించినట్టు నిగ్గు తేలింది. పోలింగ్ రోజున, తరువాత హింసాత్మక ఘటనలపై విచారణ ప్రక్రియను రెండు రోజుల్లో ముగించాలని ఈసీ స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ రెండు రోజుల విచారణ ద్వారా తాము గుర్తించిన అంశాలతో ప్రాథమిక నివేదికను సిట్ ఇన్చార్జ్ వినీత్ బ్రిజ్‌లాల్ ఈసీకి సోమవారం సమర్పించనున్నారు. పూర్తి స్థాయి విచారణకు మరింత సమయం కావాలని ఆయన కోరే అవకాశం ఉంది.అక్రమాలకు పాల్పడటమే లక్ష్యంగా విధ్వంసంపక్కా పన్నాగంతో దాడులకు తెగబడి ఎన్నికల అక్రమాలకు పాల్పడాలన్నదే టీడీపీ కుట్రన్నది బట్టబయలైంది. అందుకోసమే పల్నాడు నుంచి అనంతపురం జిల్లా వరకు వరుస దాడులతో టీడీపీ శ్రేణులు బీభత్సం సృష్టించాయి. ప్రశాంతమైన తిరుపతి జిల్లాలో టీడీపీ ఏ విధంగా దాడులకు తెగబడిందీ వెలుగులోకి వచ్చింది. చిత్తూరు నుంచి రప్పించిన 2 వేల మంది రౌడీలతో చంద్రగిరి నియోజకవర్గంలోని కూచువారిపల్లెలో టీడీపీ విధ్వంసం.. రామిరెడ్డిపాలెం సర్పంచ్ చంద్రశేఖర్‌రెడ్డిని హత్య చేసేందుకు బరితెగించి దాడులకు పాల్పడిన కుతంత్రం.. అనంతరం తిరుపతిలోని ఎస్వీయూ, శ్రీపద్మావతి విశ్వవిద్యాలయాల ప్రాంతాల్లో దాడులు, ప్రతిదాడులకు సంబంధించిన కీలక ఆధారాలను సిట్ సేకరించింది. తిరుపతి రూరల్ మండలం ఎం ఆర్పల్లి సీఐపై టీడీపీ నేతలు రాడ్లతో దాడి చేస్తే, ఎందుకు కేసు నమోదు చేయలేదని సిట్ అధికారులు ప్రశ్నించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ దాడిపై కూడా కేసు నమోదు చేసి బాధ్యులను అరెస్ట్ చేయాలని ఆదేశించింది. రెండు కేసుల్లో కూడా నిందితులు అందరినీ అరెస్ట్ చేయాలని స్పష్టం చేసింది. తాడిపత్రిలో అయితే టీడీపీ గుండాగిరికి ఏకంగా పోలీసులే దన్నుగా నిలవడం.. పోలీసులే దాడులకు పాల్పడి ఆస్తులు ధ్వంసానికి పాల్పడిన వీడియో, ఫొటో ఆధారాలను సిట్ సేకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.– పల్నాడు జిల్లా పమిడిపాడు గ్రామంలోని వైఎస్సార్సీపీ పోలింగ్ బూత్ ఏజంట్ షేక్ మాబుపై టీడీపీ వర్గీయుల దాడి, ఉప్పలపాడులో ఇరువర్గాల దాడులు, ప్రతిదాడులు, దొండపాడు గ్రామంలో వాహనాలపై దాడి ఘటనల వెనుక టీడీపీ పక్కా పన్నాగం కూడా బట్టబయలైంది. ఈ ఘటనల వీడియోలను పరిశీలించి దాడుల తీవ్రతపై సిట్ అధికారులు ఓ అంచనాకు వచ్చారు. మాచర్ల నియోజకవర్గం కారెంపూడిలో బీసీ వర్గీయులపై టీడీపీ గుండాలు యథేచ్చగా సాగించిన దాడులు, దాచేపల్లిలో టీడీపీ వర్గీయులు తెగబడి సృష్టించిన విధ్వంసకాండ వెనుక కుట్ర వెలుగులోకి వచ్చింది. పోతురాజుగుట్టలో బేడ బుడగ జంగాల కాలనీపై జరిగిన దాడిని ఆ తర్వాత 14వ తేదీ ఉదయం నుంచి రాత్రి వరకు కారెంపూడిలో వరుసగా టీడీపీ రౌడీ మూకలు సాగించిన విధ్వంసాలకు సంబంధించిన వీడియో ఆధారాలను సేకరించారు.ఇవిగో ఆధారాలు..– పోలింగ్ రోజున పక్కా పన్నాగంతోనే టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని బాధితులు సిట్‌కు తమ గోడు వెళ్లబోసుకున్నారు. కేవలం ఫిర్యాదులు చేయడమే కాకుండా అందుకు సంబంధించిన వీడియో రికార్డులు, ఫొటోలను సాక్షంగా సిట్ అధికారులకు సమర్పించారు. చంద్రగిరి నియోజకవర్గంలో విధ్వంసకాండకు నాంది పలికిన కూచువారిపల్లిలో టీడీపీ సృష్టించిన బీభత్సం గురించి బాధితులు సిట్ అధికారులకు వివరించారు. – రామిరెడ్డిపల్లి సర్పంచ్ కొటాల చంద్రశేఖర్‌రెడ్డిని అంతమొందించే కుట్రలతోనే టీడీపీ వర్గీయులు దాడులకు పాల్పడ్డారని స్థానికులు సిట్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కారును తగలబెట్టిన ఘటన మొదలు సర్పంచ్ కొటాల చంద్రశేఖర్‌రెడ్డి ఇల్లు, కారు ధ్వంసం చేసి, నిప్పటించడం వరకు విధ్వంసకాండ కొనసాగిన తీరును విడమరచి చెప్పారు. సర్పంచ్ ఇంట్లోని వృద్ధురాలిని బలవంతంగా బయటకు ఈడ్చుకొచ్చారన్నారు. ఇంట్లోని వస్తువులన్నింటినీ ధ్వంసం చేసి, విలువైన వస్తువులను దోచుకెళ్లడంతో పాటు పెట్రోల్ బాంబులతో ఇంటిని దగ్ధం చేశారని చెప్పారు. సమాచారం తెలుసుకున్న సర్పంచ్, గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారని తెలిపారు. అప్పటికే సిద్ధం చేసుకున్న రాళ్లు, కర్రలతో టీడీపీ వర్గీయులు దాడులకు తెగబడ్డారన్నారు. – రామిరెడ్డిపల్లి పోలింగ్ బూత్ వద్ద టీడీపీ వర్గీయులు ఎలా దాడులకు తెగబడిందీ బాధితులు వివరించారు. ఇప్పటికీ టీడీపీ నాయకుల బెదిరింపులు ఆగడం లేదని, రామిరెడ్డిపల్లిలో ఎవరినీ వదలమని.. చంపేస్తామంటూ బెదిరించారని.. మీరే రక్షణ కల్పించాలని మొరపెట్టుకున్నారు. టీడీపీ గుండాల బెదిరింపులకు గ్రామంలో పది కుటుంబాలు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లి పోయాయని సిట్ అధికారుల దృష్టికి తెచ్చారు. – అనంతపురం జిల్లా తాడిపత్రిలోని విధ్వంసకాండపై సిట్ ఇన్చార్జ్ అదనపు డీజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో అధికారుల బృందానికి బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి సతీమణి కేతిరెడ్డి రమాదేవి, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ సభ్యులు సిట్ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. దాడులు అరికట్టడంలో పోలీసుల వైఫల్యం, బాధితులపై తిరిగి పోలీసులు దౌర్జన్యానికి దిగడం, ఆస్తులు ధ్వంసం చేయడంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటో ఆధారాలను సమర్పించారు.– పల్నాడు జిల్లాలోని నరసారావుపేట, మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో టీడీపీ హింసాకాండపై బాధితులు సిట్ అధికారుల వద్ద తమ ఆవేదన వెళ్లగక్కారు. మంత్రి అంబటి రాంబాబు సిట్ అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల రోజున పలు గ్రామాల్లో వైఎస్సార్సీపీ ఏజెంట్లపై టీడీపీ వర్గీయుల దాడి, రూరల్ సీఐ రాంబాబు వ్యవహరించిన తీరుపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు.– పల్నాడు జిల్లా కారెంపూడిలో ఈ నెల 14న ఉదయం నుంచి రాత్రి వరకు టీడీపీ గుండాలు సాగించిన దౌర్జన్యకాండను బాధితులు సిట్ అధికారులకు వివరించి కన్నీటి పర్యంతమయ్యారు. జిల్లాలోని దాచేపల్లి నగర పంచాయతీలో ఇరికేపల్లి, కేసానుపల్లి, తంగెడ, మాదినపాడు, దాచేపల్లిలో టీడీపీ రౌడీ మూకలు తెగబడి బీభత్సం సృష్టించిన తీరును బాధితులు వివరించారు. -
Election Commission of India: 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
సాక్షి, న్యూఢిల్లీ: గత రెండు నెలల్లో సీ–విజిల్ యాప్ ద్వారా ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ప్రకటించింది. ఎన్నికల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో ప్రారంభించిన సీ–విజిల్ యాప్‌ను ప్రజలు పెద్ద సంఖ్యలో వినియోగిస్తున్నారని ఈసీ తెలిపింది. మార్చి 16 నుంచి మే 15వ తేదీ వరకు ఈసీకి (4,24,317) ఫిర్యాదులు అందగా.. ఇందులో 99.9%, 4,23,908 ఫిర్యాదులను పరిష్కరించామని శనివారం ఈసీ ఒక ప్రకటనలో వివరించింది. నగదు, మద్యం, ఉచితాల పంపిణీకి సంబంధించి 7,022 ఫిర్యాదులు అందగా అనుమతి లేకుండా పోస్టర్లు, బ్యానర్ల ప్రదర్శనపై 3,24,228 ఫిర్యాదులు వచి్చనట్లు తెలిపింది. అదేవిధంగా, ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శించడంపై 2,430, అనుమతి లేని వాహన కాన్వాయ్‌లపై 2,697, నిషేధ సమయంలో ప్రచారంపై 4,742 ఫిర్యాదులు వచ్చాయి. స్పీకర్ల వినియోగం, మతపరమైన ప్రసంగాలకు సంబంధించి 2,883 ఫిర్యాదుల అందగా ఇతరత్రా 66,293 కేసులొచ్చాయని ఈసీ వివరించింది. -
సిట్ దర్యాప్తు ముమ్మరం
సాక్షి, అమరావతి/నరసరావుపేట/రెంటచింతల/తాడిపత్రి: రాష్ట్రంలో పోలింగ్ అనంతరం హింసాత్మక సంఘటనలపై కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో దాడులు, అల్లర్ల పూర్వాపరాలు విచారిస్తూ ఆ ఘటనలపై కేసులు నమోదు చేసిన తీరును విశ్లేíÙస్తోంది. ఎన్నికల ముందు టీడీపీ, బీజేపీ ఒత్తిడితో ఈసీ హడావుడిగా డీఐజీలు, ఎస్పీలు, ఇతర పోలీసు అధికారులను బదిలీ చేసిన పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లోనే పోలింగ్ రోజున, అనంతరం భారీగా విధ్వంసకాండ చెలరేగడం తెలిసిందే. వీటిపై ఏర్పాటైన సిట్‌కు నేతృత్వం వహిస్తున్న అదనపు డీజీ వినీత్ బ్రిజ్‌లాల్ తమ అధికారులను మూడు బృందాలుగా విభజించి శనివారం ఉదయానికే పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలకు పంపారు. మరోవైపు ఆయన డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాతో శనివారం సమావేశమై సిట్ కార్యాచరణ గురించి చర్చించారు. అనంతరం ఆ మూడు జిల్లాల్లో విచారణ చేపట్టిన పోలీసు అధికారుల బృందాలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఏఏ అంశాలపై దృష్టి సారించాలనే అంశాన్ని వారికి స్పష్టం చేశారు. దాంతో పల్నాడు, అనంతపురం జిల్లాల్లో దాడులు సంభవించిన ప్రాంతాల్లో సిట్ సభ్యులు పర్యటించారు. గురజాల, మాచర్ల, నరసారావుపేట, సత్తెనపల్లి, తాడిపత్రి పోలీసు స్టేషన్లల్లో పోలీసు అధికారులను విచారించారు. దాడులు సంభవించిన తీరు, సమాచారం అందిన వెంటనే పోలీసు అధికారులు స్పందించిన తీరు, నమోదు చేసిన కేసులు, అందులో పేర్కొన్న సెక్షన్లు తదితర అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు. ఎఫ్ఐఆర్ కాపీలు, కేసు ఫైళ్లు, దాడుల వీడియో రికార్డింగులను పరిశీలించారు. దాడుల తీవ్రతను అంచనా వేసి, ఆ మేరకు తగిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారా.. లేక తూతూ మంత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులిపేసుకున్నారా.. అనే కోణాల్లో కూడా విచారణ కొనసాగిస్తున్నారు. దాదాపు అన్నీ నాన్ బెయిలబుల్ సెక్షన్లే ఆయా జిల్లాల్లో జరిగిన దాదాపు అన్ని సంఘటనల్లోనూ హత్యాయత్నం, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసం, ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం తదితర నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు సిట్ బృందాలు గుర్తించినట్టు సమాచారం. 144 సెక్షన్ అమలులో ఉన్నా సరే అంత మంది ఎలా గుమిగూడగలిగారు? మాచర్ల నియోజకవర్గంలో పక్కా పన్నాగంతో దారి కాచి మరీ ఎలా దాడులు చేయగలిగారు? ఎలా వెంటపడి తరమగలిగారు? తాడిపత్రిలో వందలాది మంది ఒకేసారి వచ్చి ఎలా రాళ్ల దాడి చేయగలిగారు..? అనే కోణాల్లో సిట్ అధికారులు విచారిస్తున్నట్టు సమాచారం. సత్తెనపల్లి, గురజాల నియోజకవర్గాల్లో దాడుల బాధితులు రాత్రంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గుడిలో ఆశ్రయం పొందాల్సినంత పరిస్థితి ఎందుకు ఏర్పడింది.. దీనిపై పోలీసులకు సమాచారం ఉందా లేదా.. పోలీసులు ఆ బాధితులకు అండగా నిలబడేందుకు వెంటనే గుడి వద్దకు ఎందుకు వెళ్లలేకపోయారు.. అనే కోణాల్లో సిట్ అధికారులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది. సమస్యాత్మక, అతి సమస్యాత్మకంగా గుర్తించిన పోలింగ్ కేంద్రాల వద్ద ఈసీ మార్గదర్శకాల మేరకు బందోబస్తుపై సిట్ అధికారులు సమీక్షించారు. ఆ కేంద్రాల వద్ద తగినంతగా కేంద్ర బలగాలను మోహరించలేదనే విషయాన్ని సిట్ అధికారులు గుర్తించినట్టు సమాచారం. కాగా, ఎన్నికల సందర్భంగా హింసాత్మక సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందుగానే నేర చరిత్ర కలిగిన వారిపై చేపట్టిన చర్యల గురించి సిట్ అధికారులు ప్రశి్నంచినట్లు తెలుస్తోంది. పీడీ యాక్ట్ కింద కేసుల నమోదులో నిర్లక్ష్యంగా వ్యవహరించారా.. అనే కోణంలోనూ విచారిస్తున్నారు. దాడులు అరికట్టడంలో వైఫల్యం చెందారని ఈసీ సస్పెండ్ చేసిన, బదిలీ చేసిన అధికారులను కూడా సిట్ అధికారులు ప్రశి్నంచనున్నారు. వారి వివరణను కూడా నమోదు చేస్తారు. ఈసీ బదిలీ చేసినా ఆయనదే పెత్తనమా!? హింసాత్మక సంఘటనలను కట్టడి చేయడంలో విఫలమయ్యారని ఈసీ బదిలీ చేసిన కొందరు ఉన్నతాధికారులు ఇంకా ఆ జిల్లాలో ప్రభావం చూపిస్తుండటం విస్మయ పరుస్తోంది. అనంతపురం జిల్లాల్లో ఈసీ సస్పెండ్ చేసిన ఓ అధికారే ప్రస్తుతం సిట్ దర్యాప్తు కోసం సమరి్పంచిన రికార్డుల వ్యవహారాలను పర్యవేక్షిస్తుండటం గమనార్హం. పోలీసు రికార్డుల విభాగంలో అత్యంత వివాదాస్పద డీఎస్పీ స్థాయి అధికారి అందుకు సహకరిస్తుండటం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. దాడులను అరికట్టడంలో ఎవరైతే విఫలమయ్యారని ఈసీ భావించిందో.. ఆ అధికారి కనుసన్నల్లోనే సిట్ పరిశీలనకు అవసరమైన రికార్డులు సమర్పిస్తే పారదర్శకత, నిష్పాక్షికత ఎక్కడ ఉంటుందని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. తాడిపత్రిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసంపై పోలీసులే దాడి చేయడం, ఆస్తులను ధ్వంసం చేయడం, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై విచక్షణారహితంగా విరుచుకుపడటం గమనార్హం. దీన్ని ఈసీ తీవ్రంగా పరిగణించి, అందుకు బాధ్యులైన అధికారిని బదిలీ చేసి.. సిట్ విచారణకు ఆదేశించింది. కాగా ఆ అధికారే సిట్ దర్యాప్తునకు అవసరమైన రికార్డులను పరోక్షంగా రూపొందిస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది. మరి దీనిపై సిట్, ఈసీ ఎలా స్పందిస్తాయన్నది చూడాలి. ఇదిలా ఉండగా సిట్ అధికారులు ఆదివారం తిరుపతిలో పర్యటించనున్నారు. అల్లర్లు సంభవించిన ప్రాంతాల్లో పర్యటిస్తారు. దాడులు చెలరేగినప్పుడు పోలీసులు తీసుకున్న చర్యలను సమీక్షిస్తారు. రేపు ప్రాథమిక నివేదిక ఇంతటి సున్నితమైన అంశంపై కేవలం రెండు రోజుల్లోనే ప్రాథమిక నివేదిక సమరి్పంచాలని ఈసీ ఆదేశించడంతో సిట్‌కు సమయం చాలా తక్కువగా ఉంది. దాంతో సోమవారం ఉదయం తొలుత ప్రాథమిక నివేదికను ఈసీకి సమర్పించాలని భావిస్తోంది. దాడులు జరిగిన తీరు, వాటిపై పోలీసులు తీసుకున్న చర్యల గురించి ఈ ప్రాథమిక నివేదికలో పొందు పరచనుంది. పూర్తి స్థాయిలో విచారణకు మరింత సమయం కావాలని కోరే అవకాశాలున్నాయి. సిట్ ప్రాథమిక నివేదిక పరిశీలించిన అనంతరం ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్ని కేసులు.. ఎంత మంది అరెస్ట్?ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలోని సిట్ బృందం శనివారం నరసరావుపేటలో పర్యటించింది. మధ్యాహ్నం మూడు గంటలకు నరసరావుపేట చేరుకున్న బృందం నేరుగా టూ టౌన్ పోలీసు స్టేషన్‌ను సందర్శించింది. ఆ స్టేషన్ పరి«దిలో నమోదైన ఐదు కేసుల వివరాలను అధికారులు పరిశీలించారు. సీఐ భాస్కర్‌తో చర్చించారు. ఎవరెవరిపై కేసులు నమోదు చేశారు.. ఎవరిని అరెస్టు చేశారు.. దర్యాప్తు ఎంతవరకు వచి్చంది.. అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గృహంపై దాడిచేసి ఇద్దరిని గాయపర్చి మూడుకార్లు ధ్వంసంపై నమోదైన కేసు, బాలికోన్నత పాఠశాలలో ఏజెంట్లుగా కూర్చున్న వైఎస్సార్సీపీ నాయకులు గంటెనపాటి గాబ్రియేలు, గోపిరెడ్డి డ్రైవర్ హరిపై టీడీపీ అభ్యర్థి అరవిందబాబు, అతని అనుచరులు చేసిన దాడి కేసు, అరవిందబాబు కారుపై జరిగిన దాడి కేసు, మల్లమ్మసెంటర్‌లో బొలేరో వాహనాన్ని తగులపెట్టిన కేసు, రూరల్ పోలీసుస్టేషన్ పరిధిలో పమిడిపాడు, దొండపాడు గ్రామాల్లో జరిగిన సంఘటనలపై నమోదైన కేసుల వివరాలను ఆయా స్టేషన్ పోలీసుల నుంచి సేకరించారు. రబ్బరు బుల్లెట్లతో ఎందుకు ఫైరింగ్ చేయాల్సి వచి్చందో వివరణ తీసుకున్నట్లు తెలిసింది. కాగా, ఇద్దరు సిట్ బృందం అధికారులు శనివారం రాత్రి రెంటచింతల పోలీసు స్టేషన్‌కు వచ్చి రికార్డులను పరిశీలించారు. మండల పరిధిలోని తుమృకోట, రెంటచింతల, పాలువాయిగేటు, రెంటాల, జెట్టిపాలెం గ్రామాలలో చోటుచేసుకున్న పరిణామాల గురించి ఆరా తీశారు. ఆయా ఘటనల్లో నిందితులుగా ఉన్న వారు స్వచ్ఛందంగా లొంగిపోయి, గ్రామాలలో ప్రశాంత వాతావరణానికి సహకరించాలని అడిషనల్ ఎస్పీ రమణమూర్తి కోరారు. సిట్ బృందం తాడిపత్రిలో కూడా విచారించింది. ఏసీబీ డీఎస్పీ వి.శ్రీనివాసరావు, గుంటూరు రేంజ్ ఇన్స్పెక్టర్ వి.భూషణం, ఏసీబీ ఇన్స్పెక్టర్ జీఎల్ శ్రీనివాస్‌లు తాడిపత్రి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని కేసుల గురించి ఆరా తీశారు. డీఐజీ షిమోసీ వాజ్‌పాయ్‌తో మాట్లాడిన తర్వాత స్థానిక పోలీసులతో కలసి తాడిపత్రిలో అల్లర్లు జరిగిన ఓంశాంతి నగర్, టీడీపీ నేత సూర్యముని నివాసం, జూనియర్ కళాశాల మైదానం, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం, మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి నివాసం తదితర ప్రాంతాలను పరిశీలించారు. -
కేబినెట్ భేటీ వాయిదా
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ, తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణ, మేడిగడ్డ బ్యారేజీకి అత్యవసర మరమ్మతుల నిర్వహణ వంటి పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవడా నికి వీలుగా శనివారం ప్రభుత్వం నిర్వహించతల పెట్టిన మంత్రివర్గ సమావేశం అనివార్య పరిస్థి తుల్లో వాయిదా పడింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో కేబినెట్ భేటీ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిని రాష్ట్ర సర్కారు కోరింది. కానీ ఈసీ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో సమావేశాన్ని వేయిదా వేసినట్టు శనివారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పాలనపై దృష్టి పెడతామన్న సీఎంరాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు ఈ నెల 13న పోలింగ్ ముగియగా, వచ్చే నెల 4న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. మార్చి 15న లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన మరుక్షణమే దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇది జూన్ 6తో ముగియనుంది. అయితే ఎన్నికల కోడ్ కారణంగా రాష్ట్రంలో రెండు నెలలుగా పాలన వ్యవహారాలు స్తంభించిపోయాయి. సీఎం, మంత్రుల రోజువారీ అధికారిక సమీక్షలు, సమావేశాలు బంద్ అయ్యా యి. ఈ నేపథ్యంలో 13న పోలింగ్ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పాలన వ్యవహారాలపై మళ్లీ పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే కేబినెట్ భేటీ నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రచారానికి వెళ్లిన రాష్ట్ర మంత్రులు కేబినెట్ భేటీ కోసం హైదరాబాద్‌కు తిరిగి వచ్చేశారు. ఒడిశా నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ముంబై నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాయ్‌బరేలి నుంచి సీతక్క నగరానికి చేరుకున్నారు. ఏక్షణంలోనైనా ఈసీ అనుమతి లభించవచ్చనే ఉద్దేశంతో శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సచివాలయంలో వేచిచూశారు. రాత్రి 7 గంటల వరకు ఎలాంటి స్పందన రాకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వం మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేసింది. ఒకపక్క ఈసీ అనుమతి కోసం నిరీక్షిస్తూనే సీఎం రేవంత్‌రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత సీఎం, మంత్రులు సచివాలయం నుంచి వెళ్లిపోయారు. ఎజెండాలో కీలక అంశాలుజూన్ 2తో రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తికా నున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణల మధ్య అపరిష్కృతంగా ఉండి పోయిన విభజన వివాదాలు, ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీకి అవసరమైన నిధుల సమీకరణ, ధాన్యం కొను గోళ్లు, రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి గాను మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అలాగే కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీతో పాటు అన్నారం బ్యారేజీల మరమ్మ తులు, ఈ విషయమై నిపుణుల కమిటీ సమర్పించిన మధ్యంతర నివేదికలోని సిఫారసుల అమలుపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోవాలని అనుకుంది. స్కూళ్లు, కాలేజీల ప్రారంభానికి ముందే అవసరమైన సన్నాహక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కానీ ఈసీ అనుమతించకపోవడంతో ఇందుకు అవకాశం లేకుండా పోయింది. అవసరమైతే ఈసీని కలుస్తాం: సీఎం రేవంత్ఎన్నికల సంఘం నుంచి ఎప్పుడు అనుమతి వస్తే అప్పుడు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. సోమవారం వరకు ఈసీ నుంచి అనుమతి రానిపక్షంలో, అవసరమైతే మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామని ఆయన తెలిపారు. అప్పటికీ ఈసీ సానుకూలంగా స్పందించని పక్షంలో జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే కేబినెట్ భేటీ నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది. ఈసీ నుంచి స్పందన లేకపోవటంతో రైతుల సంక్షేమం, ఇతర అత్యవసర అంశాలపై చర్చించలేకపోయామని సీఎం పేర్కొన్నారు. -
పల్నాడు, అనంత ఎస్పీలపై వేటు
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలను తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు అధికారులపై వేటు వేసింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలు బిందు మాధవ్, అమిత్ బర్దర్‌లను సస్పెండ్ చేయగా తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్‌ను బదిలీ చేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. పల్నాడు కలెక్టర్ శివశంకర్‌ను సైతం బదిలీ చేసి శాఖాపరమైన విచారణ చేపట్టాలని సూచించింది. అలాగే పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలకు చెందిన 12 మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణ నిర్వహించాలని పేర్కొంది. హింస చెలరేగేందుకు కారకులను గుర్తించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసి రెండు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఆదేశించింది. బాధ్యులపై ఎన్నికల ప్రవర్తనా నియామవళి ప్రకారం చార్జీషీట్ నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఈసీ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా గురువారం ఢిల్లీ వెళ్లి ఎన్నికల వేళ చెలరేగిన హింసపై స్వయంగా వివరణ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని, కౌంటింగ్ రోజు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై తీసుకోవాల్సిన క్రమశిక్షణ చర్యలు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఆరు ప్రతిపాదనలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఓట్ల లెక్కింపు అనంతరం 15 రోజులపాటు బందోబస్తు విధులు నిర్వహించేందుకు 25 కంపెనీల అదనపు బలగాలను పంపాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ కేంద్ర హోంశాఖకు ఆదేశాలు జారీ చేసింది.ఈసీ సస్పెండ్ చేసిన పోలీసులు వీరేతిరుపతి జిల్లాఎ.సురేందర్‌రెడ్డి డీఎస్పీ–తిరుపతికె.రాజశేఖర్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ఎం.భాస్కర్ రెడ్డి స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీఒ.రామచంద్రారెడ్డి ఇన్స్పెక్టర్–అలిపిరిపల్నాడు జిల్లాఎ.పల్లపురాజు ఎస్డీపీవో–గురజాలవీఎస్ఎన్ వర్మ ఎస్డీపీవో–నరసరావుపేటకె.ప్రభాకర్‌రావు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ఇ.బాలనాగిరెడ్డి స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ఎం.రామాంజినేయులు ఎస్సై–కారంపూడిడి.వి.కొండారెడ్డి ఎస్సై–నాగార్జునసాగర్అనంతపురం జిల్లాసి.ఎం. గంగయ్య డీఎస్పీ–తాడిపత్రిఎస్. మురళీకృష్ణ ఇన్స్పెక్టర్–తాడిపత్రి -
కాకిస్‌నూరు.. ఓటింగ్‌లో సూపర్..
అది బాహ్య ప్రపంచంతో సంబంధం లేని ఓ కుగ్రామం. ఏలూరు జిల్లా కేంద్రానికి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గూడేనికి చేరుకోవడమే ఓ ప్రహసనం. ఎలాంటి రహదారి సౌకర్యం లేని అక్కడి పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలంటే కొయిదా గ్రామం నుంచి గోదావరి‡ నదిగుండా బోట్లో ప్రయాణించి, ఆవలి ఒడ్డు నుంచి సుమారు మూడు కిలోమీటర్లు గుట్టల నడుమ కాలినడకన ప్రయాణించాల్సి ఉంటుంది. అక్కడ మొత్తం 472మంది కొండరెడ్ల ఓటర్లున్నారు. సోమవారం జరిగిన ఎన్నికల్లో 440 ఓట్లు పోల్ కాగా 93.22శాతం ఓటింగ్ నమోదు చేసుకుని ఎలక్షన్ కమిషన్ దృష్టిని ఆకర్షించింది. అంతేనా... అధికారుల ప్రశంసలను కూడా అందుకుని దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఆ గ్రామమే పోలవరం నియోజకవర్గం పరిధిలోని కాకిస్‌నూరు.వేలేరుపాడు: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని అత్యంత మారుమూల, దట్టమైన అటవీ ప్రాంత గ్రామమైన కాకిస్‌నూరు గ్రామం ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షించింది. సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 93.22 ఓటింగ్ శాతం నమోదు చేసుకుని ఆదర్శంగా నిలిచింది. అక్కడ ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు ఈ నెల 12వ తేదీ రాత్రి వెళ్లిన అధికారులకు గ్రామ కొండరెడ్లు సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. అధికారులను పూలమాలలతో సన్మానించారు. వారి సహృదయతకు ముచ్చటపడిన భారత ఎన్నికల సంఘం ‘ఎక్స్’ వేదికగా అధికారులకు స్వాగతం పలికిన ఫొటోను అప్లోడ్ చేసి, వివరాలతో ట్విట్ చేశారు. దీనికి దేశవ్యాప్తంగా విశేష స్పందన లభించింది. బోటుపై వచ్చి ఓటు హక్కు వినియోగందట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న కాకిస్‌నూరు పోలింగ్ కేంద్రం పరిధిలోని పేరంటపల్లి, టేకుపల్లి, చినమకోలు, పెదమంకోలు గ్రామాల ఓటర్లు 440 మంది గోదావరిలో బోటుపై వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 16,37,430 ఓటర్లున్న ఏలూరు జిల్లాలోని 1,744 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ సకల ఏర్పాట్లు చేశారు. కాకిస్‌నూరు గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించి అక్కడ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. విద్యుత్ సౌకర్యం లేని ఆ గ్రామంలో జనరేటర్ సమకూర్చి, తాత్కాలికంగా లైట్లు ఏర్పాటు చేయించారు.ఫోన్ కవరేజ్ లేకపోవడంతో ఈ గ్రామంలో శాటిలైట్ ఫోన్ ఏర్పాటు చేశారు. ఓటర్లు వచ్చేందుకు బోటు సౌకర్యం కల్పించడమే కాకుండా ఓటింగ్‌కు ఒక రోజు ముందు వారికి ఓటింగ్‌పై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకున్నారు. ఎన్నికల అధికారులు 12న కాకిస్‌నూరు గ్రామానికి చేరుకొని, ఇంటింటికీ తిరిగి ప్రతిఒక్కరూ ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువను వివరించారు. ఫలితంగా ఓటింగ్ శాతం పెరిగింది. తమ గ్రామానికి దే«శస్థాయిలో గుర్తింపు రావడంపై భారత ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్‌కుమార్ మీనా, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్‌కు గ్రామ కొండరెడ్లు కృతజ్జతలు తెలిపారు.మా ఓటు వల్లనే ఊరికి మంచి పేరుమేమంతా ఓటు వేయడం వల్లనే మా ఊరికి మంచి పేరొచ్చింది. మా ఊరు దేశ ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లింది. మాకు చాలా సంతోషంగా ఉంది. –సిద్ది శ్రీనివాసరెడ్డిసానా సంతోషంగా ఉందయ్యామేమంతా ఓటెయ్యడం వల్ల ఊరికే పేరు రావడం నాకు సానా సంతోషంగా ఉందయ్యా.. పెద్ద సార్లకు కృతజ్ఞతలు చెబుతున్నా. – కోళ్ల కన్నమ్మ -
ఎన్నికల హింసపై ఈసీ సీరియస్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తరువాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవటాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. దీనిపై స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె.ఎస్.జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తాను ఆదేశించింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ ఢిల్లీ వెళ్లి గురువారం మధ్యాహ్నం వివరణ ఇవ్వనున్నారు. పోలింగ్ అనంతరం పల్నాడు, కారంపూడి, చంద్రగిరి, తాడిపత్రిలో ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి హెచ్చరించినా స్థానిక పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించటాన్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. కొంత మంది పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని, ప్రేక్షక పాత్ర పోషించారని కేంద్ర పరిశీలకులు ఈసీకి నివేదిక ఇచ్చారు. ఆకస్మిక బదిలీలతో సమస్యలు..సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి బందోబస్తు ఏర్పాట్లు చేసినా అక్కడ పోలీసు ఉన్నతాధికారులను ఈసీ హఠాత్తుగా బదిలీ చేయడంతోనే సమస్యలు ఉత్పన్నమైనట్లు అధికార యంత్రాంగం భావిస్తోంది. కొత్త అధికారులకు క్షేత్రస్థాయి పరిస్థితులపై సమగ్ర అవగాహన లేకపోవడంతో కొన్ని చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నట్లు పేర్కొంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా బుధవారం సచివాలయంలో సమావేశమై చర్చించారు. విధి నిర్వహణలో ఏకపక్షంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్చించారు. వీరిని ఇప్పటికే గుర్తించామని, వారిపై తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. -
రాష్ట్రంలో 81.3% పోలింగ్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సోమవారం జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 81.3% పోలింగ్ జరిగింది. పోస్టల్ బ్యాలెట్ 1.2 శాతాన్ని కలుపుకొంటే ఇది 82.5 శాతమని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈవో) కార్యాలయం వర్గాలు మంగళవారం రాత్రి వెల్లడించాయి. ఈ వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) ధృవీకరించాల్సి ఉంది. 2019 ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ 0.6 శాతంతో కలుపుకొని 79.8 శాతం నమోదైంది. ఈసారి ఎన్నికల్లో రాత్రి 12 గంటల వరకు 79.40 శాతం నమోదైనట్లు మంగళవారం మధ్యాహ్నం సీఈవో ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 2 గంటల వరకు ఓటింగ్ జరిగినందున ఎక్కడ ఎంత ఓటింగ్ జరిగిందో పూర్తి వివరాలు రావడానికి ఆలస్యమవుతోందని వివరించారు. మంగళవారం రాత్రి అందిన సమాచారం ప్రకారం జిల్లాలవారీగా పోలింగ్ (శాతాల్లో)డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ : 83.19అల్లూరి సీతారామరాజు : 63.19ఏలూరు : 83.04సత్యసాయి : 82.77చిత్తూరు : 82.65ప్రకాశం : 82.40బాపట్ల : 82.33కృష్ణా : 82.20అనకాపల్లి : 81.63పశ్చిమ గోదావరి : 81.12నంద్యాల : 80.92విజయనగరం : 79.41తూర్పు గోదావరి : 79.31అనంతపురం : 79.25ఎన్టీఆర్ : 78.76కడప : 78.72పల్నాడు : 78.70నెల్లూరు : 78.10తిరుపతి : 76.83కాకినాడ : 76.37అన్నమయ్య : 76.12కర్నూలు : 75.83గుంటూరు : 75.74శ్రీకాకుళం : 75.41మన్యం : 75.24విశాఖ : 65.50 -
Lok Sabha Election 2024: నాలుగో దశలో 67.70% పోలింగ్
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్ స్వల్ప ఘర్షణ ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. సోమవారం 10 రాష్ట్రాల్లోని 96 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రాత్రి 11.45 గంటల వరకు 67.70 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నిరీ్ణత పోలింగ్ సమయంలోపు పోలింగ్ కేంద్రాల వద్ద వరసల్లో నిల్చున్న ఓటర్లను పోలింగ్‌కు అనుమతించారు. దీంతో పోలింగ్ శాతం పెరిగే అవకాశముందని ఈసీ పేర్కొంది. పశి్చమబెంగాల్లో అత్యధికంగా 78.37 శాతం పోలింగ్ నమోదైంది. ‘‘శ్రీనగర్ నియోజకవర్గంలో 37.98 శాతం పోలింగ్ రికార్డయింది. ఆరి్టకల్ 370 రద్దుతర్వాత కశీ్మర్ లోయలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడం ఇదే మొదటిసారి. శ్రీనగర్‌లో 36 శాతం స్థాయిలో పోలింగ్ నమోదవడం ఇటీవలి దశాబ్దాల్లో ఇదే తొలిసారి’’ అని ఈసీ ప్రకటించింది. ఈసారి లోక్‌సభ ఎన్నికలు ఏడుదశల్లో జరుగుతుండగా తొలి దశలో 66.14, రెండో దశలో 66.71, మూడో దశలో 65.68% పోలింగ్ నమోదైంది. నాలుగో దశలో 96 స్థానాలతో కలిపి ఇప్పటిదాకా 543 స్థానాలకుగాను 23 రాష్ట్రాలు,యూటీల్లో 379 స్థానాలకు పోలింగ్ ముగిసింది. వీటితోపాటు అరుణాచల్ ప్ర దేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం అసెంబ్లీ స్థానాలకు, ఒడిశాలో 28 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. 2019 ఎన్నికల్లో నాలుగో దశలో 71 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా 65.51% పోలింగ్ నమోదైంది. పశి్చమబెంగాల్లో ఘర్షణలు పశి్చమబెంగాల్‌లోని 8 నియోజకవర్గాల పరిధిలోని కొన్ని చోట్ల తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ నేతలు ఘర్షణలకు దిగారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట దాకా ఈవీఎంల మొరాయింపు, పోలింగ్ ఏజెంట్ల అడ్డగింత తదితరాలకు సంబంధించి దాదాపు 1,700 ఫిర్యాదులు ఈసీకి అందాయి. ఓటర్లను మభ్యపెట్టారని, ఏజెంట్లపై దాడులు చేశారని టీఎంసీ, కాంగ్రెస్, బీజేపీ పరస్పరం వందలాది ఫిర్యాదులు చేశాయి. బర్ధమాన్‌లో బీజేపీ సీనియర్ నేత దిలీప్ ఘోష్‌పై రాళ్ల దాడి ఘటనలో ఇద్దరు సీఐఎస్ఎఫ్ జవాన్లు గాయపడ్డారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నారని ఒడిశాలో ఇద్దరు పోలింగ్ అధికారులను ఈసీ సస్పెండ్ చేసింది. ఒడిశాలో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. జార్ఖండ్‌లో మారుమూల గ్రామాల ప్రజలు ఓట్లేయకుండా మావోయిస్టులు రోడ్లపై చెట్లు నరికి పడేయగా భద్రతాసిబ్బంది సమయానికి అన్నీ తొలగించారు. ఐదో దశ మే 20, ఆరో దశ మే 25, ఏడో దశ జూన్ ఒకటోతేదీన జరగనుంది. అన్నింటి ఓట్ల లెక్కింపు జూన్ 4న చేపడతారు. -
మోదీ ‘ఉల్లంఘన’లపై వివరణ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నిర్వహించిన బహిరంగసభలు, రోడ్‌షోల్లో చేసిన ప్రసంగాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. అయితే, ప్రధాని మోదీకి బదులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి నుంచి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. ప్రధాని మోదీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన అంశంపై 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. గడువు పొడిగించాలని బీజేపీ కోరగా, ఈసీ మరింత సమయం ఇచ్చిది. మోదీ ఏమన్నారంటే..: నారాయణపేట, ఎల్బీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనగా, చిన్నపిల్లలతో ప్లకార్డులు ప్రదర్శింపజేశారని కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేకి అని, ఆ పార్టీ భారత దేశ ఎన్నికల్లో గెలవాలని పాకిస్థాన్ కోరుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాలపై ఈసీకి ఫిర్యాదు చేసినట్టు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ ‘సాక్షి’కి తెలిపారు.కాగా, రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కోడ్ ఉల్లంఘన, విద్వేషకర ప్రసంగాల విషయంలో వివిధ రాజకీయ పార్టీల నుంచి వివరణ కోరుతూ మొత్తం 13 నోటీసులను జారీచేసినట్టు అధికారవర్గాలు తెలిపాయి. జాతీయ పార్టీలైతే ఆయా పార్టీల రాష్ట్ర అధ్యక్షులకు నోటీసులు జారీచేయగా, ప్రాంతీయ పార్టీలైతే వాటి అధ్యక్షులకు నేరుగా నోటీసులిచ్చారు. -
రైతు భరోసాకు ఈసీ బ్రేక్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రైతు భరోసా పథకం కింద నిధుల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. మే 13న ఎన్నికలు ముగిసి న తర్వాతే పంపిణీ చేయాలని ఆదేశించింది. నిధుల విడుదలపై ఆంక్షలు విధించింది. రైతు భరో సా విషయంలో రాష్ట్రానికి చెందిన ఎన్.వేణుకుమార్ సోమవారం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యా దు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతు భరోసా పథకం చెల్లింపులపై చేసిన వ్యాఖ్యలను ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.ఫిర్యాదును పరిశీలించిన ఈసీ, ముఖ్యమంత్రి ఎన్నికల కోడ్ ఉల్లఘించారని పేర్కొంది. రైతు భరోసా నిధుల విడుదలపై ఆంక్షలు విధిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు మంగళవారం సాయంత్రం 5 గంటల లోపు సమ్మతిని తెలుపుతూ నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోలింగ్ పూర్తయిన తర్వాతే.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతుబంధు నిధులు విడుదలకు సంబం«ధించి ఎన్నికల కమిషన్ విధించిన షరతులను ఉత్తర్వుల్లో ప్రస్తావించింది. అప్పటి ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన నేపథ్యంలో.. అంతకుముందు రైతు బంధు పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకున్న (నవంబరు 27, 2023న) విషయం గుర్తు చేసింది. ఎన్.వేణుకుమార్ ఫిర్యాదు, తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నివేదిక పరిశీలించిన తర్వాత.. నిధుల విడుదలకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడటం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడం గానే భావించినట్లు ఈసీ వివరించింది. రాష్ట్రంలో పోలింగ్ పూర్తయిన తర్వాత 2023 రబీ సీజన్ నిధులు విడుదల చేయాలని ఆదేశిస్తున్నట్లు తెలిపింది.ఈసీ ఆదేశాలతోనే రైతు భరోసా ఆగింది: భట్టివిక్రమార్క చౌటుప్పల్, మునుగోడు: రాష్ట్రంలోని రైతులందరికీ పూర్తిస్థాయిలో రూ.7,624 కోట్ల రైతు భరోసా సాయాన్ని అందించాలని నిర్ణయించామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. అందులో భాగంగా ఇప్పటికే ఐదు ఎకరాల వరకు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశామని తెలిపారు. ఐదెకరాలకు పైగా భూమి ఉన్న రైతులకు సైతం సాయం అందించాలని భావించినప్పటికీ కొంతమంది ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారని, దాంతో ఈసీ ఆదేశాలతో నిధులు జమచేసే ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో మంగళవారం రాత్రి కార్నర్ మీటింగ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దాంతో స్థానికంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
Lok Sabha Election 2024: నేడే మూడో దశ పోలింగ్
అహ్మదాబాద్/బెంగళూరు: పరస్పర వివాదాస్పద ఆరోపణలు, ఈసీకి ఫిర్యాదు లతో రాజకీయ పార్టీలు పెంచిన ప్రచారవేడి చల్లారాక నేడు కేంద్ర ఎన్నికల సంఘం మూడో దశ పోలింగ్‌కు సిద్ధమైంది. 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ దశతో గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లోని అన్ని స్థానా లకూ పోలింగ్ పూర్తి కానుంది. ఈ రాష్ట్రాల్లో 2019 ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగిన విష యం తెల్సిందే. ఈసారి మూడో దశలో 120 మంది మహిళలుసహా 1,300కు పైగా అభ్యర్థులు పోటీపడు తున్నారు.బరిలో అగ్రనేతలు, ప్రముఖులుకేంద్రమంత్రులు అమిత్ షా(గాంధీనగర్), జ్యోతిరాదిత్య సింధియా(గుణ), మన్సుఖ్ మాండవీయ(పోర్బందర్), పురుషోత్తం రూపాలా(రాజ్‌కోట్), ప్రహ్లాద్ జోషి (ధార్వాడ్), ఎస్పీ సింగ్ బఘేల్(ఆగ్రా), మధ్యప్రదేశ్ మాజీ సీఎంలు శివరాజ్‌సింగ్ చౌహాన్(విదిశ), దిగ్విజయ్‌సింగ్(రాజ్‌గఢ్), ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్, కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై (హవేరీ), బారామతిలో వదినా, మరదళ్లు సునేత్రా పవార్, సుప్రియా సూలే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.283 చోట్ల పోలింగ్ పూర్తిఇప్పటికే గుజరాత్‌లోని సూరత్ నియోజక వర్గంలో బీజేపీ ఏకగ్రీవంగా గెల్చింది. గతంలో వాయిదాపడిన బైతుల్ నియోజ కవర్గంలో ఈరోజే పోలింగ్ నిర్వహిస్తు న్నారు. మూడోదశలో 11 కోట్లకుపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పశ్చిమబెంగాల్లో ఈరోజు పోలింగ్ ఉన్న నాలుగు స్థానాల్లోనూ ముస్లిం ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. కర్ణాటకలో ఈరోజు పోలింగ్ ఉన్న 14 స్థానాలనూ 2019 ఎన్నికల్లో బీజేపీ క్వీన్‌స్వీప్ చేసింది. మూడో దశ ముగిస్తే మొత్తం 543 స్థానాలకుగాను ఇప్పటిదాకా పోలింగ్ పూర్తయిన స్థానాల సంఖ్య 283కి చేరుకుంటుంది. నాలుగో దశ మే 13న, ఐదో దశ మే 20న, ఆరో దశ మే 25న, ఏడో దశ జూన్ ఒకటో తేదీన నిర్వహిస్తారు. అన్ని స్థానాలకు ఓట్ల లెక్కింపును జూన్ 4న చేపడతారు.రాష్ట్రం సీట్లుగుజరాత్ 25కర్ణాటక 14మహారాష్ట్ర 11ఉత్తరప్రదేశ్ 10మధ్యప్రదేశ్ 9ఛత్తీస్‌గఢ్ 7బిహార్ 5అస్సాం 4బెంగాల్ 4గోవా 2దాద్రానగర్, హవేలీ, డయ్యూడామన్ 2 -
Lok sabha elections 2024: నాలుగో విడత బరిలో 1,717 మంది: ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభకు నాలుగో విడతలో ఈ నెల 13వ తేదీన జరగనున్న పోలింగ్‌లో 1,717 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 సీట్లకు మొత్తం 4,264 నామినేషన్లు అందాయి. నామినేషన్ పత్రాల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలు ముగిసిన తర్వాత 1,717 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఈ దశలో ఒక్కో స్థానానికి సగటున 18 మంది పోటీ పడుతున్నట్లు శుక్రవారం న్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో 979 మంది.. తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలకు అత్యధికంగా 1,488 నామినేషన్లు దాఖలయ్యాయి. పరిశీలన అనంతరం 625 ఆమోదం పొందగా 525 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో మల్కాజ్గిరి స్థానానికి అత్యధికంగా 177 నామినేషన్లు, నల్గొండ, భువనగిరి స్థానాలకు 144 చొప్పున నామినేషన్లు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లోని 25 ఎంపీ స్థానాలకు 1,103 నామినేషన్లు అందాయి. పరిశీలన అనంతరం 503 నామినేషన్లు ఆమోదం పొందగా మొత్తం 454 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మిగతా రాష్ట్రాల్లో .. నాలుగో విడత పోలింగ్ జరిగే బిహార్‌లోని 5 పార్లమెంట్ స్థానాలకు 55 మంది పోటీలో ఉన్నారు. జమ్మూకశీ్మర్‌లోని ఒక్క సీటుకు 24 మంది, జార్ఖండ్‌లోని 4 నియోజకవర్గాలకు 45 మంది, మధ్యప్రదేశ్‌లోని 8 సీట్లకుగాను 74, మహారాష్ట్రలోని 11 స్థానాలకు 298 మంది, ఒడిశాలోని 4 సీట్లకు 37 మంది, ఉత్తరప్రదేశ్‌లోని 13 స్థానాల్లో 130 మంది, పశి్చమబెంగాల్‌లోని 8 సీట్లకు 75 మంది బరిలో నిలిచారు. -
గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
సాక్షి, అమరావతి: వచ్చే ఐదేళ్లలో మీకు వ్యక్తిగతంగా ఇంత లబ్ధి చేకూరనుంది అంటూ గ్యారంటీలు, ష్యూరిటీల పేరిట ప్రచారం చేస్తున్న రాజకీయ పార్టీలపై తక్షణం చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. తాము ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ద్వారా వ్యక్తిగతంగా ఇంత లభిస్తుందంటూ గ్యారంటీ కార్డులు ఇవ్వడం, ఫోన్ల ద్వారా సమాచారం ఇవ్వడాన్ని ఎన్నికల సంఘం తప్పుబట్టింది. ఈ విధంగా ప్రచారం చేస్తున్న రాజకీయ పార్టీలపై నిబంధనలకు అనుగుణంగా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులకు తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. పలు రాజకీయ పార్టీలు ఈ విధమైన ప్రచారానికి ఒడిగడుతున్నాయంటూ పెద్దఎత్తున ఆరోపణలు రావడంతో ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ టీడీపీ మేనిఫెస్టో డాట్ కామ్ పేరిట ప్రత్యేకంగా ఒక వెబ్‌లింక్, యాప్‌ను డెవలప్‌చేసి అందులో వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి బాబు ఆరు ష్యూరిటీల పేరిట మీ కుటుంబానికి ఇంతమొత్తం లబ్ధిచేకూరుతుందంటూ గ్యారంటీ కార్డులు, మెసేజ్‌లు పంపుతుండటంపై కేంద్ర ఎన్నికల సంఘానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. వీటిని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఈ విధంగా మార్గదర్శకాలు జారీ చేసింది. 1. ఓటర్లు మిస్డ్ కాల్, మొబైల్ నంబర్, టెలిఫోన్ నంబర్లను ఇవ్వడం ద్వారా నమోదు అవ్వండి అంటూ పత్రికా ప్రకటనలివ్వరాదు. 2. కరపత్రాల రూపంలో గ్యారంటీ కార్డులను పంచుతూ ఓటర్ల నుంచి పేరు, వయసు, మొబైల్ నంబర్, ఎపిక్ నంబర్, నియోజకవర్గం పేరు సేకరించరాదు. 3. ప్రభుత్వ పథకాల లబ్ధి పేరుతో రేషన్‌కార్డు, బూత్ నంబర్, బ్యాంకు అకౌంట్ నంబర్, నియోజకవర్గం పేరు వంటి వివరాలు తీసుకోరాదు. 4. రాజకీయ పారీ్టలు వెబ్ ప్లాట్‌ఫాం, యాప్‌ల ద్వారా వ్యక్తిగత సమాచారం సేకరించరాదు. 5. ప్రస్తుతం లబ్ధి పొందుతున్న పథకాల వివరాలతో పత్రికా ప్రకటనలు, కరపత్రాలు ఇవ్వరాదు. -
నేటి నుంచి మళ్లీ కేసీఆర్ ప్రచారం..
సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం విధించిన 48 గంటల నిషేధం శుక్రవారం రాత్రి 8 గంటలకు ముగియనుంది. ఆ తర్వాత వెంటనే బస్సుయాత్ర తిరిగి ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించారు. గతంలో బీఆర్ఎస్ రూపొందించిన షెడ్యూల్ మేరకు శుక్రవారం రాత్రి రామగుండంలో రోడ్ షోకు కేసీఆర్ హాజరవుతారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బుధవారం రాత్రి 8 గంటలకు ప్రచారం నిలిపివేసిన కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోని తన నివాసానికి చేరుకున్న విషయం తెలిసిందే. కాగా ఎన్నికల ప్రచారాన్ని తిరిగి ప్రారంభించేందుకు గాను శుక్రవారం మధ్యాహ్నం బయలుదేరనున్న కేసీఆర్ రాత్రికి రామగుండం చేరుకుని రోడ్ షోలో పాల్గొంటారు. రాత్రికి అక్కడే బస చేసి శనివారం సాయంత్రం మంచిర్యాలలో, ఆదివారం జగిత్యాలలో జరిగే రోడ్ షోల్లో పాల్గొంటారు. ఈ నెల 10వ తేదీ వరకు గతంలో నిర్ణయించిన షెడ్యూలుకు అనుగుణంగానే కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగుతుందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 10న సిరిసిల్లలో రోడ్‌షో, సిద్దిపేటలో బహిరంగ సభతో కేసీఆర్ పార్లమెంటు ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. గురువారం జమ్మికుంట, వీణవంకలో రోడ్ షోలు నిర్వహించాల్సి ఉండగా, ఈసీ ఆదేశాలతో నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రజా స్పందన ఎలా ఉంది? బుధవారం రాత్రి ఫామ్‌హౌస్‌కు చేరుకున్న కేసీఆర్ గురువారం పార్టీ అభ్యర్థులు, నేతలతో ఫోన్ ద్వారా మాట్లాడి పార్టీ ఎన్నికల ప్రచార సరళిని సమీక్షించారు. ఇప్పటివరకు బస్సుయాత్ర, రోడ్ షోలు జరిగిన ప్రాంతాల్లో ప్రజల నుంచి వస్తున్న స్పందనపై ఆరా తీశారు. రాబోయే వారం రోజుల పాటు చేయాల్సిన ప్రచారంపై దిశా నిర్దేశం చేశారు. ప్రచార లోపాలను సరిదిద్దుకుని పార్టీ యంత్రాంగంతో మరింత సమన్వయం చేసుకోవాలని సూచించారు. తాజా సర్వేల ప్రకారం బీఆర్ఎస్కు 10 నుంచి 12 సీట్లు వచ్చే అవకాశముందని వెల్లడించారు. పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపాలని, కాంగ్రెస్, బీజేపీ విధానాలతో జరిగే నష్టాన్ని మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. -
కేసీఆర్ ప్రచారంపై నిషేధం.. మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వొద్దని సూచన
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు 48 గంటల పాటు లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. మే ఒకటో తేదీ బుధవారం రాత్రి 8 గంటల నుంచి మే 3వ తేదీ శుక్రవారం రాత్రి 8 గంటల వరకు రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. బహిరంగ సభలు, ఊరేగింపులు, ర్యాలీలు నిర్వహించరాదని, మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వకూడదని స్పష్టం చేసింది. బస్సు యాత్రలో భాగంగా మానుకోటలో ఉన్న కేసీఆర్‌కు అధికారులు ఈసీ ఆదేశాలను అందజేశారు. దీంతో మహబూబాబాద్ రోడ్ షోలో రాత్రి 7.45 గంటలలోపు ప్రసంగాన్ని ముగించిన కేసీఆర్.. ఈసీ ఆదేశాల మేరకు రెండు రోజుల పాటు ప్రచారాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. అక్కడి నుంచి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోని తన నివాసానికి వెళ్లిపోయారు. ఈసీ విధించిన గడువు ముగిశాక కేసీఆర్ తిరిగి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ ఫిర్యాదు నేపథ్యంలో.. ఎండిన పంట పొలాలను పరిశీలించేందుకు కేసీఆర్ ఏప్రిల్ 5న ‘పొలం బాట’పేరిట కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా సిరిసిల్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో.. నేత కార్మీకులను ఉద్దేశించి స్థానిక కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ కేసీఆర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. వరి ధాన్యానికి క్వింటాల్ రూ.500 చొప్పున బోనస్ ఇవ్వకుంటే కాంగ్రెస్‌ను వేటాడతామంటూ మాట్లాడారు. ఇలా సిరిసిల్లలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్.. ఏప్రిల్ 6న కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌పై కేసీఆర్ అవమానకర, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విచారణ జరిపి ఏప్రిల్ 10న నివేదిక సమర్పించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆ నివేదిక ఆధారంగా వివరణ ఇవ్వాలంటూ కేసీఆర్‌కు ఏప్రిల్ 16న షోకాజ్ నోటీసు జారీ చేసింది. ‘‘విలేకరుల సమావేశంలో మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలను మాత్రమే కాంగ్రెస్ ప్రత్యేకంగా పేర్కొంటూ ఫిర్యాదు చేసింది. తెలంగాణ, సిరిసిల్ల ఎన్నికల ఇన్చార్జులుగా పనిచేస్తున్న అధికారులకు తెలంగాణ మాండలికం పూర్తిగా అర్థం కాదు. నేను చేసిన వ్యాఖ్యలను ఇంగ్లిషులోకి తప్పుగా అనువదించడంతోపాటు వక్రీకరించారు. కేవలం కాంగ్రెస్ పార్టీ విధానాలు, పథకాలను మా త్రమే విమర్శించాను’’అని కేసీఆర్ ఈసీకి సమా ధానం ఇచ్చారు. కానీ ఈ సమాధానంతో సంతృప్తి చెందని ఈసీ.. 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కరీంనగర్లో, 2023 అక్టోబర్‌లో బాన్సువాడ సభలో చేసిన వ్యాఖ్యలపైనా హెచ్చరికలు చేశామని గుర్తు చేసింది. రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశించింది. సీఎం రేవంత్‌పై బీఆర్ఎస్ ఫిర్యాదు సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి నకిలీ పత్రాలను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారని, ఆయనపై చ ర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ కోరింది. ఈ మేరకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి బుధవారం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లు, మెస్‌ల మూసివేతకు సంబంధించి గతేడాది మే 12న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌లోని అంశాలను వక్రీకరిస్తూ.. నకిలీ సర్క్యులర్‌ను ఉద్దేశపూర్వకంగా ‘ఎక్స్’లో పోస్ట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ను బద్నాం చేసేందుకు, ఓటర్లను ప్రభావితం చేసేందుకు రేవంత్‌రెడ్డి తప్పుడు సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ చేస్తున్న అబద్ధపు ప్రచారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. బస్సుయాత్ర రీ షెడ్యూల్‌పై కసరత్తు లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 24 నుంచి మే 10 వరకు 17 రోజుల బస్సుయాత్రను కేసీఆర్ చేపట్టారు. మిర్యాలగూడలో మొదలైన యాత్ర వరుసగా 8 రోజుల పాటు సాగి బుధవారం రాత్రి మహబూబాబాద్‌కు చేరుకుంది. కానీ ఈసీ ఆదేశాలతో రెండు రోజులపాటు బస్సుయాత్రను నిలిపివేశారు. షెడ్యూల్ ప్రకారం.. కేసీఆర్ బుధవా రం రాత్రి వరంగల్‌లో బస చేసి.. గురువారం జమ్మి కుంట, వీణవంకలలో, శుక్రవారం రామగుండంలో రోడ్ షోలు నిర్వహించాల్సి ఉంది. ఈసీ నిషేధం నేపథ్యంలో కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని రీషెడ్యూల్ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. మార్పులపై గురువారం స్పష్టత ఇస్తామని ప్రకటించింది.తెలంగాణ గొంతుపై నిషేధమా?: కేటీఆర్కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేధాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తప్పుపట్టారు. ‘ఎక్స్’వేదికగా తన స్పందనను పోస్ట్ చేశారు.‘‘ఇదెక్కడి అరాచకం? తెలంగాణ గొంతు కేసీఆర్‌పైనే నిషేధమా? ప్రధాని మోదీ విద్వేష వ్యాఖ్యలు ఎన్నికల కమిషన్‌కు కమిషన్‌కు వినిపించలేదా? వేలాది మంది పౌరులు ఆయనకు వ్యతిరేకంగా ఫిర్యాదు లు చేస్తున్నా ఎలాంటి చర్యలు లేవు. రేవంత్ బూతులు ఎన్నికల కమిషన్‌కు ప్రవచనాల్లా అనిపించాయా? అసభ్య పదజాలం వాడుతున్న తెలంగాణ సీఎం రేవంత్‌పై ఎలాంటి చర్యలూ ఉండవా? బడే భాయ్.. చోటే భాయ్ కలసి చేసిన కుట్ర కాదా ఇది. కేసీఆర్ పోరుబాటతో బీజేపీ, కాంగ్రెస్ ఎందుకు వణికిపోతున్నాయి? మీ అహంకారానికి, వ్యవస్థల దుర్వి నియోగానికి తెలంగాణ ప్రజలు దీటైన సమాధానం ఇస్తారు’’అని కేటీఆర్ పేర్కొన్నారు.ప్రశ్నిస్తే ప్రచారం వద్దంటున్నారు: హరీశ్‌రావు‘‘కాంగ్రెస్, బీజేపీల మీద కేసీఆర్ గట్టిగా కొట్లాడుతున్నారనే రెండు రోజులు ప్ర చారం ఆపారు. మోదీ మత విద్వేషాలు రెచ్చ గొడితే.. రేవంత్ బూతులు మాట్లాడితే ఎన్ని కల కమిషన్‌కు కనిపించవా? ప్రశ్నించే కేసీఆర్‌ను మాత్రం ప్రచారం చేయొద్దు అంటు న్నారు. రెండు రోజులు కేసీఆర్ ప్రచారం ఆగినంత మాత్రం జరిగేదేంటి?’’అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెలో ఉంటారని చెప్పా రు. కేసీఆర్ బస్సుయాత్ర చేస్తుంటే బీజేపీ, కాంగ్రెస్ గజగజ వణుకుతున్నాయన్నారు. కేసీఆర్ అంతటి వ్యక్తిని దుర్భాషలు ఆడుతున్న రేవంత్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఎన్నికలు జరుగు తున్న 17 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ సమయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పెంచింది. ఎండల తీవ్రత దృష్ట్యా పోలింగ్ సమయాన్ని పెంచాలంటూ పలు రాజకీయ పార్టీలు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు బుధవారం జారీ చేసిన ఆదేశాల్లో వెల్లడించింది. ఒక గంట పాటు అదనపు సమయం ఇస్తున్నట్టు తెలిపింది. సవరించిన సమయం ప్రకారం.. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని వివరించింది. రాష్ట్రంలోని 12 లోక్‌సభ స్థానాల పరిధిలో పూర్తిగా.. మిగతా 5 లోక్‌సభ సీట్ల పరిధిలోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రమే ఈ సమయం పెంపు ఉంటుందని ప్రకటించింది.పోలింగ్ సమయం పెరిగే ఎంపీ స్థానాలివీకరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ (ఎస్సీ), నల్లగొండ, భువనగిరి లోక్‌సభ స్థానాలుకొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో సమయం పెంచిన స్థానాలివే.. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానంలోని ఖానాపూర్ (ఎ స్టీ), ఆదిలాబాద్, బోథ్(ఎస్టీ), నిర్మల్, ముథోల్. పెద్దపల్లి లోక్‌సభ స్థానంలోని ధర్మపురి (ఎస్సీ), రామగుండం, పెద్దపల్లి. వరంగల్ లోక్‌సభ స్థానంలోని స్టేషన్ ఘన్పూర్ (ఎస్సీ), పాలకుర్తి, పరకాల, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, వర్థన్నపేట్. మహబూబాబాద్ లోక్‌సభ స్థానంలోని డోర్నకల్ (ఎస్టీ), మహబూబాబాద్ (ఎస్టీ), నర్సంపేట్. ఖమ్మం లోక్‌సభ స్థానంలోని ఖమ్మం, పాలేరు, మధిర, వైరా (ఎస్టీ), సత్తుపల్లి (ఎస్సీ). -
అప్పుడలా.. ఇప్పుడిలా..
పింఛను లబ్ధిదారుల్లో ఇప్పటికే బ్యాంకు ఖాతా ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ పింఛను డబ్బులు నేరుగా వారి ఖాతాల్లోకి జమచేయాలి. సచివాలయాల దాకా వెళ్లి పింఛన్లు తీసుకోలేని వారికి మినహాయింపులు ఇవ్వొచ్చు. అలాంటి వారికి ఇంటి దగ్గరకు వెళ్లి ఇవ్వడానికి మా సిటిజన్ ఫర్ డెమోక్రసీకి అభ్యంతరంలేదు. ఇక బ్యాంకు అకౌంట్లులేని వారు సచివాలయంలో పింఛను డబ్బులు తీసుకునే అవకాశం కల్పించాలని ఈసీ అధికారులను కోరాం.– చంద్రబాబు నమ్మినబంటు మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ 20 రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసిన తర్వాత మీడియాతో అన్న మాటలు.తాము 2024 మార్చి 30న పేర్కొన్న ఆదేశాల ప్రకారం.. బ్యాంకు ఖాతాలున్న లబ్ధిదారులకు డీబీటీ (బ్యాంకు ఖాతాలో జమచేసే) విధానంలో పింఛన్ల పంపిణీకే ప్రాధాన్యత ఇవ్వండి. లేదంటే శాశ్వత ఉద్యోగుల ద్వారా పంపిణీ చేపట్టండి. – ఏప్రిల్ 26న కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జారీచేసిన ఆదేశాల సారాంశం ఇది. ఏప్రిల్‌లో దివ్యాంగులకు ఇళ్లవద్దే.. మిగిలిన వారికి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పంపిణీ కొనసాగించడంపైనా టీడీపీ–బీజేపీ–జనసేన నేతలు 20 రోజులుగా రోజూ ఫిర్యాదులు చేయడంతో ఈసీ జారీచేసిన ఆదేశాలివి.టీడీపీ–బీజేపీ–జనసేన నేతల వరుస ఫిర్యాదులతో మే ఒకటి నుంచి చేపట్టే పింఛన్ల పంపిణీ డీబీటీ విధానంలో అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘమే స్పష్టంగా ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో బ్యాంకు ఖాతాలున్న 75 శాతం మంది పింఛనర్లకు బ్యాంకు ఖాతాల్లోనే పింఛన్ల జమకు అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత 58 నెలలుగా ప్రతినెలా ఠంఛన్‌గా ఒకటో తేదీనే వలంటీర్ల ద్వారా కొనసాగుతున్న పింఛన్ల పంపిణీని నెలరోజుల క్రితం అడ్డుకున్న విషయం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల వద్ద కూడా ఆ పంపిణీ కొనసాగకూడదంటూ రోజూ అదేపనిగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసి, మళ్లీ అవ్వాతాతలు తనపై ఎక్కడ ఆగ్రహం చూపుతారోనని భయంతో ‘పండుటాకులను బ్యాంకుల చుట్టూ తిప్పిస్తారా’ అంటూ చంద్రబాబు ఎప్పటిలాగే ప్లేటు ఫిరాయించారు. నిజానికి.. మొదటినుంచీ చంద్రబాబుది ఇదే తరహా రాజకీయం. ఏ అంశంపైనైనా ముందు తప్పుచేసేసి దాన్ని సరిదిద్దుకునేందుకు ఎదుటివారిపై బురదజల్లుతూ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తారు. రాష్ట్ర విభజన సమయంలో.. ప్రత్యేక హోదా తదితర అంశాల విషయంలో ఆయన అనేకమార్లు బొక్కబోర్లాపడినా తనదే పైచేయి అని బిల్డప్ ఇచ్చే రకం. ఎన్నికల కోడ్‌ను అడ్డంపెట్టుకుని వలంటీర్లపై చంద్రబాబు అవలంబించిన వైఖరి కూడా అచ్చం ఇలాంటిదే. నెలరోజుల క్రితం..నిజానికి.. నాలుగున్నరేళ్లకు పైగా రాష్ట్రంలో వలంటీర్ల ఆధ్వర్యంలో ప్రతినెలా ఠంఛనుగా లబ్ధిదారుల ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీ కొనసాగగా.. ఈ వర్గానికి చెందిన ఓట్లు టీడీపీకి దక్కవేమోనన్న దుగ్థతో ఎన్నికల నేపథ్యంలో ఈ విధానంపై పచ్చముఠా ఇప్పుడు వరుసపెట్టి ఫిర్యాదులు చేసింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వయంగా ఈ ఏడాది మార్చి ఒకటిన ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అలాగే, చంద్రబాబు జేబులోని మనిషి, ఆయన సొంత సామాజికవర్గానికి చెందిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అయితే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ పేరుతో అచ్చం ఇదే పనిమీద ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23, 25 తేదీల్లో పింఛన్ల పంపిణీలో వలంటీర్లను దూరంగా ఉంచాలని రెండుసార్లు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటివరకు ఇళ్లవద్దే ఇస్తున్న పింఛన్ల పంపిణీకి బ్రేకులు పడ్డాయి. ఫలితంగా.. ఏప్రిల్ నెల దివ్యాంగులు, కదలలేని స్థితిలో ఉండే అవ్వాతాతలకు ఇబ్బందిలేకుండా వారికి ఇంటివద్దే పింఛన్లను పంపిణీ చేసి, మిగిలిన వారికి సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పంపిణీ చేశారు. ఈ నిర్ణయంపై పింఛనర్లు తీవ్రస్థాయిలో రగిలిపోయారు. చంద్రబాబు, ఆయన ముఠా తీరుపై బహిరంగంగానే విరుచుకుపడ్డారు. ఆగని ఫిర్యాదులు..చంద్రబాబు ముఠా కోరుకున్నట్లుగా తీసుకున్న ఈ పింఛన్ల పంపిణీ నిర్ణయం ఆయనకే బెడిసికొట్టింది. అనుకున్నదొకటి.. అయినదొక్కటి బోల్తాకొట్టిందిరో బాబు పిట్ట అన్నట్లుగా తయారైంది ఆయన పరిస్థితి. దీంతో తన సహజ లక్షణమైన యూటర్న్‌ను తీసేసుకున్నారు. అంతే.. మళ్లీ గత నెలరోజులుగా టీడీపీ–జనసేన–బీజేపీతో కూడా పచ్చబ్యాచ్ ఉమ్మడిగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుల పరంపర కొనసాగించింది. ఇందులో భాగంగానే నిమ్మగడ్డ 20 రోజుల క్రితం మళ్లీ ఎన్నికల సంఘం అధికారులను కలిసి, పింఛన్ల పంపిణీ సచివాలయాల వద్ద కాకుండా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమచేయాలని కోరారు. ఇలా దాదాపు రోజు మార్చి రోజు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. మరోపక్క.. తమ అనుకూల మీడియాలో రాష్ట్ర ఉన్నతాధికారులను బ్లాక్మెయిల్ చేసేలా నిత్యం కథనాలు రాయించి బ్యాంకుల ద్వారా పింఛన్లను పంపిణీ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. సెలవైనా ఒకటినే బ్యాంకులో పింఛను..మేడే కారణంగా బ్యాంకులకు సెలవు అయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా 65,49,864 మంది లబ్ధిదారులకు ఒకటో తేదీనే పింఛను డబ్బులను అందుబాటులో ఉంచుతూ రాష్ట్ర ప్రభుత్వం రూ.1,945.39 కోట్లు విడుదలచేసింది. విభిన్న దివ్యాంగ వర్గానికి చెందిన లబ్ధిదారులతో పాటు తీవ్రమైన అనారోగ్యాల కారణంగా పింఛన్లు పొందుతున్న వారు, మంచం లేదా వీల్చైర్లకు పరిమితమయ్యే 16,57,361 మందికి ఒకటో తేదీ (బుధవారం) ఉదయం నుంచే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు పంపిణీ చేపట్టేలా మంగళవారమే వారికి సంబంధించిన రూ.474.17 కోట్లను గ్రామ, వార్డు సచివాలయాల వారీగా బ్యాంకు ఖాతాల్లో జమచేసినట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన 48,92,503 మంది లబ్ధిదారుల పింఛన్ డబ్బులు బుధవారం బ్యాంకులకు సెలవు అయినప్పటికీ అదేరోజు ఉ.8 గంటల నుంచి వారి ఖాతాల్లో జమయ్యేలా అన్ని బ్యాంకులు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.– సాక్షి, అమరావతి -
మే నెల పింఛన్ బ్యాంకు ఖాతాలో జమ
సాక్షి, అమరావతి: మే, జూన్ నెలల పింఛన్ డబ్బును ఈసారి లబ్ధిదారులకు నేరుగా నగదు రూపంలో కాకుండా డీబీటీ విధానంలో వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) విధానంలో లబ్ధిదారుల ఆధార్ నంబరు అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతాలో నేరుగా పింఛను డబ్బు జమ చేస్తుంది. అయితే, విభిన్న దివ్యాంగ లబ్ధిదారులు, తీవ్రమైన అనారోగ్య కారణాలతో పింఛన్లు పొందుతున్న వారు, మంచం లేదా వీల్‌చైర్‌కు పరిమితమైన వారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న యుద్ధవీరుల వృద్ధ వితంతువులకు మాత్రం గత నెలలో మాదిరిగానే గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇంటి వద్దకే వచ్చి పింఛను డబ్బు ఇస్తారు. ఈ రెండు నెలల్లోనూ ఒకటో తేదీ నుంచే పింఛను డబ్బు పంపిణీ చేస్తారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సూచనలకు అనుగుణంగా పింఛన్ల పంపిణీ విధానంలో మార్పులు చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఆదివారం ఆదేశాలు చేశారు. అనంతరం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘మే ఒకటో తేదీ నుంచి పంపిణీ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 65,49,864 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి నిధులు విడుదల చేస్తుంది. అందులో 48,92,503 మంది (74.70 శాతం) లబ్ధిదారుల పింఛన్ డబ్బులు ఆధార్ నంబర్‌తో అనుసంధానమై ఉన్న వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతాయి. లబ్ధిదారులకు ఒకటో తేదీనే డీబీటీ విధానంలో డబ్బులు జమ చేయగానే, ఆ సమాచారం బ్యాంకు నుంచి ఎస్ఎంఎస్ రూపంలో అందుతుంది. విభిన్న దివ్యాంగ వర్గానికి చెందిన లబ్ధిదారులు, తీవ్రమైన అనారోగ్యాల కారణంగా పింఛన్లు పొందుతున్న వారు, మంచం లేదా వీల్‌చైర్‌కు పరిమితమైన వారు దాదాపు 16,57,361 మంది (25.30 శాతం)కి మే ఒకటి నుంచి ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీ జరుగుతుంది. పింఛన్ లబ్ధిదారులలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా సకాలంలో వారికి డబ్బు అందేలా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, బ్యాంకులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఎవరికి పింఛను డబ్బులు బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తారు, ఎవరికి ఇంటి వద్దే పంపిణీ చేస్తారన్న వివరాలతో కూడిన జాబితాలను సోమవారం సాయంత్రం లేదా మంగళవారం ఉదయం గ్రామ, వార్డు సచివాలయాల్లో నోటీసు బోర్డులో కూడా ఉంచనున్నట్టు అధికారులు చెబుతున్నారు. -
నవతరం కదలాలి.. పోలింగ్ పెరగాలి...
యువతరమే ముందు యుగం దూతలు..పావన నవజీవన, బృందావన నిర్మాతలు... అని శ్రీశ్రీ ఒక పాటలో అభివర్మించారు.. వారు తల్చుకుంటే సమాజాన్ని అత్యద్భుతంగా ముందుకు తీసుకెళ్లగలరని కొనియాడారు. అది నూరు శాతం వాస్తవం. ముఖ్యంగా ఎన్నికల్లో వారి పాత్ర కీలకం... యువత ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి రావాలే కానీ రాజకీయ తీరుతెన్నులే మారిపోతాయి. సంక్షేమానికి పట్టం కడుతున్నదెవరో, ఓట్ల కోసం మేనిఫెస్టోలనే బుట్టదాఖలు చేస్తున్నదెవరో యువత ఇట్టే గ్రహిస్తుంది.అణగారిన వర్గాలను ఉన్నత స్థానానికి తీసుకువెళ్లాలనే తపన పడేదెవరో– ఆ వర్గాల వంచకులెవరో గుర్తించే శక్తియుక్తులు వారికే ఉన్నాయి...దేశంలో ఈ సారి తొలిసారిగా ఓటుహక్కు వినియోగించుకోబోతున్న యువత 1.85 కోట్ల మంది. ఆంధ్రప్రదేశ్నే తీసుకుంటే మొత్తం ఓటర్లలో 20 శాతం 30 ఏళ్లలోపు యువతే ఉంది...ఎన్నికల సంఘం ఈ యువతను పోలింగ్ కేంద్రాలకు రప్పించే దిశగా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సాక్షి, అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికల ఫలితాలను యువ ఓటర్లు దిశా నిర్దేశం చేయనున్నారు. దేశవ్యాప్తంగా 96.88 కోట్ల మంది ఓటర్లు ఉండగా, అందులో 30 ఏళ్లలోపు ఓటర్ల సంఖ్య 20 కోట్లుగా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అందులో 18 నుంచి 19 ఏళ్లు ఉండి తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారి సంఖ్య 1.85 కోట్లు. దీంతో ఈ సారి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ యువ ఓటర్లను ఆకర్షించే దిశగా అడుగులు ముందుకేస్తున్నాయి. మన రాష్ట్ర విషయానికి వస్తే మొత్తం 4.10 కోట్ల ఓటర్లలో సుమారు 20 శాతం మంది 30 ఏళ్లలోపే ఉన్నారు.18 నుంచి 30 ఏళ్లలోపు మొత్తం 79.03 లక్షల మంది ఉంటే అందులో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న 18–19 ఏళ్ల వారు 8.25 లక్షల మంది ఉన్నారు. ఈ సారి ఎన్నికల్లో యువ ఓటర్ల సంఖ్య అధికంగా ఉండటంతో వీరంతా విధిగా తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువను తెలియచేసే విధంగా సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పారి్టసిపేషన్ (స్వీప్) పేరిట కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సెలబ్రెటీలతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వయోవృద్ధులకు ఇంటి వద్దే.. రాష్ట్రంలో తొలిసారిగా 85 ఏళ్లు దాటిన వయోవృద్ధులు పోలింగ్ బూతులకు రావాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్ద నుంచే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయలేమనుకున్న వారు ముందుగా నమోదు చేసుకుంటే అధికారులు ఇంటి వద్దకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తారు. రాష్ట్రంలో 2.12 లక్షల మంది ఓటర్లు 85 ఏళ్లు దాటిన వారు ఉన్నారని, వీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని ఎన్నికల సంఘ అధికారులు వెల్లడిస్తున్నారు.దివ్యాంగులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా నేరుగా పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద ర్యాంపులు ఏర్పాటు చేయాల్సిందిగా ఇప్పటికే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 5.17లక్షల దివ్యాంగ ఓటర్లు ఉండటంతో వారు ఓటు హక్కు వినియోగించుకునే పోలింగ్ కేంద్రాలను గుర్తించి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో 79.77 శాతం ఓటింగ్ నమోదు కాగా, ఇప్పుడు ఈ మొత్తాన్ని 83 శాతం దాటించాలని కేంద్ర ఎన్నికల సంఘం లక్ష్యంగా నిర్దేశించుకుంది. -
కేటీఆర్‌పై వ్యాఖ్యలు.. మంత్రి కొండా సురేఖకు ఈసీ వార్నింగ్..
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్ కేటీఆర్‌పై ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెను ఈసీ హెచ్చరించింది. ఎన్నికల వేళ జాగ్రత్తగా మాట్లాడాలని సూచించింది. ఆరోపణలు చేసే సమయంలో బాద్యతగా వ్యవహరించాలని, స్టార్ క్యాంపెయినర్‌గా, మంత్రిగా మరింత బాధ్యతగా ఉండాలని హితవు పలికింది.కాగా ఈనెల ఒకటవ తేదీన వరంగల్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ విమర్శలు గుప్పించారు. ఫోన్ టాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్‌తో ఎంతోమంది హీరోయిన్లను బ్లాక్ మెయిల్ చేశారని, అధికారులను బదిలీ చేశారని, అనేకమందిని ఉద్యోగాలు కోల్పోయి జైలుకు వెళ్లేలా చేశారన్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఈసీకి ఫిర్యాదు చేసిన క్రమంలో నేడు మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టింది ఎన్నికల సంఘం.చదవండి: చూస్తూ ఊరుకోం.. యుద్ధం చేస్తాం: కేసీఆర్ -
వలంటీర్ చెప్పినవారికి ఓటేసేంత బలహీనంగా ఓటర్లు లేరు
సాక్షి, అమరావతి: వలంటీర్ల మాటలు విని.. వారు చెప్పినవారికి ఓటు వేసేంత బలహీనంగా ఓటర్లు లేరని హైకోర్టు వ్యాఖ్యానించింది. వలంటీర్, లబ్దిదారు మధ్య ఉన్న అనుబంధం వలంటీర్ రాజీనామాతో తెగిపోతుందని స్పష్టం చేసింది. అలాంటప్పుడు వలంటీర్ చెప్పినట్టు ఓటరు ఎందుకు చేస్తారని ప్రశ్నిం చింది. వలంటీర్లు తమ జేబులో నుంచి తీసి డబ్బేమీ ఇవ్వడం లేదని, అలాంటప్పుడు వారి మాటలను ఓటరు ఎందుకు వింటారని పిటిషనర్‌ను నిలదీసింది. ఎవరైనా కూడా ఓటరును పోలింగ్ బూత్ వద్దకు వెళ్లేంత వరకే ప్రభావితం చేయగలిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. పోలింగ్ బూత్‌లోకి వెళ్లాక ఓటరు తనకు నచ్చినవారికే ఓటు వేస్తారని తెలిపింది. రాజీనామా చేశాక ఎవరైన వలంటీర్ ఏదైనా ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నిం చింది. మొత్తం వలంటీర్లు ఎందరు? ఎంతమంది పనిచేస్తున్నారు? రాజీనామా చేసినవారెందరు? తదితర వివరాలను తమ ముందుంచాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు వలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ విచారణ జరిపారు. రాజీనామా చేశాక మేమేం చేయలేం.. కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది శివదర్శన్ వాదనలు వినిపిస్తూ.. వలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కారన్నారు. ఎన్నికల్లో విధుల్లో పాల్గొనకుండా, పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరించకుండా వలంటీర్లను నియంత్రిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఒకవేళ వలంటీర్ రాజీనామా చేస్తే వారిపై ఎన్నికల సంఘానికి ఎలాంటి నియంత్రణ ఉండదన్నారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేమని స్పష్టం చేశారు. వారికి సైతం ప్రాథమిక హక్కులున్నాయని.. ఇష్టానుసారం రాజీనామా చేసే హక్కు వారికి సైతం ఉందన్నారు. వలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు పిటిషనర్ ఎలాంటి ఉదంతాలను పొందుపరచలేదని చెప్పారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి.. విచారణను బుధవారానికి వాయిదా వేశారు. ప్రత్యక్ష పరిచయాలతో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు.. పిటిషనర్ రామచంద్ర యాదవ్ తరఫు న్యాయవాది పీవీజీ ఉమేష్ వాదనలు వినిపిస్తూ.. అధికార పార్టీకి సహకరిస్తున్నారన్న ఆరోపణలతో వలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచుతూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఆ ఆదేశాల నుంచి తప్పించుకునేందుకు వలంటీర్లు ఇప్పుడు రాజీనామాలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్దిదారులతో వలంటీర్లు ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నారన్నారు. ఇప్పుడు రాజీనామాలు చేసి ఎన్నికల్లో లబ్దిదారులను అధికార పార్టీ వైపు తిప్పడానికి వారిని ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. అందువల్ల వలంటీర్ల రాజీనామాల విషయంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థించారు. మరి సెలబ్రిటీలు కూడా ప్రచారం చేస్తున్నారుగా.. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలపై న్యాయమూర్తి స్పందిస్తూ.. వలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేసి, ఆయా పార్టీల అభ్యర్థుల అవకాశాలను ప్రభావితం చేయడం సాధ్యమా? అని ప్రశ్నిం చారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఒకరు పెద్ద ధనవంతుడు, మరొకరు పేద వ్యక్తి అయి ఉంటే, ఆ పేద వ్యక్తి.. తాను ఎన్నికల్లో తలపడేందుకు సమాన అవకాశాలు కల్పించాలని ఎన్నికల సంఘాన్ని కోరగలడా? అని నిలదీశారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు సెలబ్రిటీలు కూడా ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ఊహల ఆధారంగా పిటిషనర్ ఈ పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. రాజీనామాలు చేశాక వలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు ఎక్కడా కూడా పిటిషన్లో పేర్కొనలేదన్నారు. వలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కారని, వరుసగా వారు మూడు రోజుల పాటు విధులకు హాజరు కాకుంటే వారిని విధుల నుంచి తొలగించవచ్చన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందజేసేందుకే వలంటీర్లను నియమించామని చెప్పారు. వారు కేవలం గౌరవ వేతనం మాత్రమే అందుకుంటున్నారని గుర్తు చేశారు. కొందరు తాము అధికారంలోకి వస్తే వలంటీర్లకు గౌరవ వేతనం పెంచుతామంటూ ఎన్నికల ప్రచారంలో వాగ్దానాలు చేస్తున్నారని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. ఈ రోజుల్లో ఐఏఎస్ అధికారులు కూడా తమ ఉద్యోగానికి రాజీనామా చేసి, నచ్చిన పార్టీల తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నారన్నారు. కాబట్టి రాజీనామా చేశాక ఎవరినీ నియంత్రించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. -
Supreme Court of India: ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా జరగాలి
న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా జరగాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా నిర్వహించడానికి తీసుకున్న చర్యలను వివరించాలని ఎన్నికల సంఘానికి సూచించింది. ఎన్నికల విధానంలో పవిత్రత ఉండాలని, ఎటువంటి అనుమానాలు, అపోహలకు ఆస్కారం ఉండొద్దని పేర్కొంది. ఎన్నికల వ్యవస్థలో ఓటర్ల సంతృప్తి, విశ్వాసం అనేవి చాలా ముఖ్యమని వెల్లడించింది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎంలు) నమోదైన ఓట్లను వీవీ ప్యాట్ స్లిప్పులతో క్రాస్–వెరిఫికేషన్ చేయాలని కోరుతూ అసోసియేసన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్)తోపాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఏడీఆర్ తరపున సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ఈవీఎంలు, వీవీప్యాట్లపై అనుమానాలు వ్యక్తం చేశారు. ధర్మాసనం స్పందిస్తూ.. అన్నింటికీ అనుమానించవద్దని సూచించింది. పిటిషన్లపై తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. -
ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: రాజకీయాలకు అతీతంగా.. అత్యంత పారదర్శకంగా.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్రపతి, శాసనసభ ఎన్నికలకు గవర్నర్ గురువారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ మొదలయిందని తెలిపారు. సచివాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ రాజకీయ పార్టీల నుంచి అత్యధికసంఖ్యలో ఫిర్యాదులు వస్తుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నామనడానికి.. షెడ్యూల్ విడుదల అయినప్పటి నుంచి ఇప్పటివరకు టీడీపీకి చెందిన 126 మందిపైన, వైఎస్సార్సీపీకి చెందిన 136 మందిపైన కేసులు నమోదు చేయడమే నిదర్శనమని చెప్పారు. 12,459 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో తొలిసారిగా పోలింగ్ గది లోపల, వెలుపల క్యూలైన్ల వద్ద వెబ్‌కెమెరాలు బిగించినట్లు తెలిపారు. అభ్యర్థులు ఇంకా సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను తమ దృష్టికి తీసుకొస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో 30,111 పోలింగ్ స్టేషన్లలో వెబ్‌టెలికాస్టింగ్ ద్వారా నిరంతరం పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో అక్రమ మద్యం సరఫరాను అరికట్టడానికి దేశంలోనే తొలిసారిగా జియోట్యాగింగ్‌తో రోజూ పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. మద్యం సరఫరా కేంద్రాల వద్ద వినియోగిస్తున్న ముడిపదార్థాల నుంచి ఉత్పత్తి గోడౌన్లు, అక్కడినుంచి షాపులు, బార్లకు వెళ్లేవరకు వాహనాలను నిరంతరం ట్రాక్‌చేసే విధంగా జియోట్యాగింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. జప్తు నుంచి సాధారణ ప్రజలకు ఊరట ఎన్నికల నిఘా సందర్భంగా జప్తుచేస్తున్న నగదు, వస్తువుల విషయంలో సాధారణ ప్రజలపై ఎఫ్ఆర్ఐలు నమోదు చేయడంపై ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. రాజకీయపార్టీలు, చట్టవ్యతిరేక కార్యక్రమాలతో సంబంధంలేని నగదు, వస్తువులు జప్తుచేసినప్పుడు సరైన ఆధారాలు చూపిస్తే 24 గంటల్లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా వెనక్కి ఇస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గ్రీవెన్స్ సెల్ రోజూ రెండుసార్లు సమావేశమై ఇటువంటి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు రూ.121.91 కోట్ల విలువైన నగదు, వస్తువులను జప్తు చేశామన్నారు. దీన్లో రూ.31.75 కోట్ల నగదు ఉందని, సరైన ఆధారాలు చూపించిన రూ.18 కోట్లను వెనక్కి ఇచ్చేశామని చెప్పారు. వీఐపీల భద్రతపై ప్రత్యేక మార్గదర్శకాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు దర్యాప్తు కేంద్ర పోలీస్ అబ్జర్వర్ల పర్యవేక్షణలో కొనసాగుతోందని మీనా తెలిపారు. దర్యాప్తు వివరాలను రోజూ ఎన్నికల సంఘానికి అందజేస్తున్నారన్నారు. ఈ సంఘటన తర్వాత వీఐపీల ఎన్నికల ప్రచారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక ప్రణాళికను రూపొందించి ఎస్పీలకు ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ఉన్నతాధికారులపై వచ్చిన ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తోందని, ఈసీఐ ఆదేశాల మేరకు ఆ ఉద్యోగుల వివరణ తీసుకుని పంపామని చెప్పారు. రాజీనామా చేసిన ప్రభుత్వ ఉద్యోగులు, వలంటీర్లపై ఎటువంటి ఆంక్షలు ఉండవన్నారు. వారిని ఎన్నికల ఏజెంట్లుగా కూర్చోనీయకూడదంటూ రాజ్యాంగంలో ఎక్కడా నిబంధన లేదని చెప్పారు. రాజీనామా చేసిన వలంటీర్లను ఏజెంట్లుగా అనుమతించకూడదంటూ ఇప్పటికే అందిన ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించినట్లు తెలిపారు. ‘అరకు’లో పోలింగ్ సమయం కుదింపు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 25 లోక్‌సభ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలకు మే 13వ తేదీ పోలింగ్ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. అందుకనుగుణంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా తెలుగు, ఇంగ్లిషుల్లో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలో అరకు లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ సమయం కుదించారు. మిగతా అన్ని నియోజకవర్గాలకు మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అరకు లోక్‌సభ పరిధిలో కొండ ప్రాంతాలున్నందున పాలకొండ, కురుపాం, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తారు. ఈ ప్రాంతాలకు పోలింగ్ సామగ్రి, సిబ్బంది తరలింపునకు హెలికాప్టర్లను వినియోగించనున్నారు. చీకటిపడితే హెలికాప్టర్లో ఈవీఎంలను, సిబ్బందిని తిరిగి స్ట్రాంగ్‌రూమ్‌లకు చేర్చడం కష్టమవుతుందని పోలింగ్ సమయాన్ని కుదించారు. మిగతా అన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లో ఉన్న ఓటర్లందరికీ ఎంత సమయమైనా ఓటువేసే అవకాశం కల్పిస్తారు. మే 5 నుంచి 10 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఈసారి పోస్టల్ బ్యాలెట్లను పోస్టు ద్వారా కాకుండా ఫెసిలిటేషన్ సెంటర్లో వినియోగించుకోవాల్సి ఉంటుందని ముఖేష్‌కుమార్ మీనా చెప్పారు. పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్నవారు గతంలో వలే పోస్టు ద్వారా పంపడం కాకుండా స్థానికంగా ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటుహక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కేవలం సర్విసు ఓటర్లు మాత్రమే పోస్టల్ ద్వారా బ్యాలెట్‌ను వినియోగించుకోవాల్సి ఉంటుందన్నారు. బ్యాలెట్ పత్రాల ముద్రణ పూర్తయిన తర్వాత మే 2వ తేదీ నుంచి మే 10 వరకు ఇంటివద్ద ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకునే విధంగా జిల్లా అధికారులు తేదీలను నిర్ణయిస్తారని చెప్పారు. 85 ఏళ్లు దాటిన వృద్ధులు, అంగవైకల్యం 40% దాటినవారు ఇంటివద్దే ఓటుహక్కును మే 2 నుంచి మే 10వ తేదీలోగా, పోస్టల్ బ్యాలెట్‌ను మే 5 నుంచి మే 10వ తేదీ వరకు వినియోగించుకోవచ్చని తెలిపారు. ఒక్కసారి ఇంటివద్ద ఓటుహక్కు వినియోగించుకునేందుకు దరఖాస్తు చేసుకుంటే వారు ఇంటివద్దే ఓటుహక్కు వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. 10వ తేదీలోగా ఇంటింటి ఓటింగ్ ప్రక్రియను పూర్తిచేసే విధంగా ఎన్నికల సిబ్బంది రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుని ముందస్తు సమాచారం అందిస్తారని చెప్పారు. ఇద్దరు పోలింగ్ సిబ్బంది, వీడియోగ్రాఫర్, భద్రతా సిబ్బంది ఇంటి దగ్గరకు వచ్చి ఓటింగ్ ప్రక్రియను పూర్తిచేస్తారని తెలిపారు. రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ కోసం సుమారు 5.50 లక్షలమంది సిబ్బందిని వినియోగిస్తున్నామని, వీరందరికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పించామని చెప్పారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న డ్రైవర్లు, వీడియోగ్రాఫర్లు వంటి బయట వ్యక్తులకు కూడా పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
Lok Sabha elections 2024: 21 రాష్ట్రాల పరిధిలో పోలింగ్ @ 102 నేడే!
సాక్షి, న్యూఢిల్లీ: అతిపెద్ద ప్రజాస్వామ్య పండగ అయిన లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోరుకు సర్వం సిద్ధమైంది. తొలి విడత ఎన్నికల్లో భాగంగా శుక్రవారం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని మొత్తం 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. వీటితోపాటే అరుణాచల్ ప్రదేశ్‌లోని మొత్తం 60, సిక్కింలోని మొత్తం 32 అసెంబ్లీ స్థానాలకూ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. స్థానిక పరిస్థితులను బట్టి పోలింగ్ వేళల్లో మార్పులుచేర్చే అవకాశముంది. గురువారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానే‹Ùకుమార్ సుఖ్బీర్సింగ్ సంధూ పోలింగ్ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఈసీ రాజీవ్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. తొలి దశలో బరిలో నిల్చిన నేతలు.. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ(నాగ్‌పూర్ నియోజకవర్గం), కిరెన్ రిజిజు(అరుణాచల్ వెస్ట్), సంజీవ్ భలియా(ముజఫర్‌నగర్), జితేంద్ర సింగ్(ఉధమ్‌పూర్), అర్జున్ రామ్ మేఘ్వాల్(బికనీర్), ఎల్.మురుగన్(నీలగిరి), శర్బానంద సోనోవాల్(దిబ్రూగఢ్), భూపేంద్ర యాదవ్(అల్వార్) శుక్రవారం నాటి పోరులో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, అరుణాచల్ మాజీ సీఎం నబాం టుకీ, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్‌కుమార్ దేవ్, కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్, డీఎంకే నాయకురాలు కనిమొళి, బీజేపీ తమిళనాడు చీఫ్ కె.అన్నామలై, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ తనయుడు నకుల్‌నాథ్, లోక్ జనశక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్, బీజేపీ నేత జితిన్ ప్రసాద, నితిన్ ప్రామాణిక్, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం, కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం, ఏఎంఎంకే చీఫ్ టీటీవీ దినకరన్ పోటీచేస్తున్న స్థానాల్లోనూ శుక్రవారమే పోలింగ్ జరుగుతోంది. భారీగా ఏర్పాట్లు తొలి దఫా పోలింగ్ కోసం 18 లక్షల మంది ఎన్నికల సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. పోలింగ్, భద్రతా సిబ్బందిని తరలించేందుకు 41 హెలికాప్లర్లు, 84 ప్రత్యేక రైళ్లు, లక్ష వాహనాలు సమకూర్చారు. తప్పకుండా ఓటేయాలి: సీఈసీ రాజీవ్ ప్రతి ఓటరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోసందేశం విడుదలచేశారు. ‘‘ భారత ప్రజాస్వామ్యానికి ఎన్నికలు అనేవి అత్యంత రమణీయమైన భావన. ఇందులో ఓటింగ్‌కు మించింది లేదు. భారతీయ ఓటర్ల ప్రజాస్వామ్య స్ఫూర్తి ఈ ఎండ వేడిమినీ అధిగమిస్తుంది. ఎన్నికలు మీవి. ఎవరిని ఎన్నుకోవాలనేది మీ ఇష్టం. మీ ప్రభుత్వాన్ని మీరే నిర్ణయించుకోండి. మీ కుటుంబం, పిల్లలు, పల్లె, గ్రామం.. అంతెందుకు దేశం కోసం మీరు వేస్తున్న ఓటు ఇది’ అని రాజీవ్ వ్యాఖ్యానించారు. 85 ఏళ్లు పైబడినవారు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. నాడు ఈ 102 సీట్లలో 45 చోట్ల యూపీఏ గెలుపు 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ 102 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 45 చోట్ల యూపీఏ కూటమి విజయం సాధించింది. 41 స్థానాలను ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంది. ఈ 41లో బీజేపీ గెలిచినవే 39 ఉన్నాయి. సమస్యాత్మక బస్తర్‌లోనూ.. మావోల దాడులు, పోలీసు బలగాల ఎదురుకాల్పుల మోతలతో దద్దరిల్లే ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలోనూ శుక్రవారమే పోలింగ్ జరుగుతోంది. బస్తర్‌లోని కాంకేర్ జిల్లాలో ఈనెల 16న జరిగిన భారీ ఎన్కౌంటర్లో 29 మంది నక్సల్స్ మరణించిన నేపథ్యంలో ఈసీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఎన్నికలు నిర్వహిస్తోంది. బస్తర్‌లో 61 పోలింగ్‌బూత్‌లు సున్నితమైన ప్రాంతాల్లో, 196 బూత్‌లను సమస్యాత్మక ప్రాంతాల్లో ఏర్పాటుచేశారు. బస్తర్ నుంచి కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ నేత కవాసి లఖ్మా బరిలో నిలిచారు. ఈయనకు పోటీగా మహేశ్ కశ్యప్‌ను బీజేపీ నిలిపింది. భద్రతా కారణాల రీత్యా కొన్ని బూత్‌లలో పోలింగ్‌ను మధ్యా హ్నం మూడు గంటలవరకే అనుమతిస్తారు. 191 ‘సంఘ్వారీ’ బూత్‌లను మహిళా సిబ్బంది నిర్వహిస్తారు. 42 ‘ఆదర్శ్’, 8 ‘దివ్యాంగ్జన్’, 36 యువ బూత్‌లనూ ఏర్పాటుచేశారు. -
కోడ్ ఉల్లంఘిస్తే చర్యలే
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకుంటోందని, ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఇప్పటికే పలువురు నేతలపై నిషేధాన్ని విధించిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ చెప్పారు. రాష్ట్రంలో సైతం కోడ్ ఉల్లంఘనకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన సందర్భంగా ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ పట్ల అన్ని పార్టీలకు అవగాహన కల్పించామని, ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. కోడ్ ఉల్లంఘన ఆరోపణలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఈసీ జారీ చేసిన నోటీసులకు వివరణ ఇచ్చే గడువు గురువారంతో ముగిసిందని, ఆయన మరో వారంపాటు గడువు పొడిగించాలని కోరారన్నారు. కేసీఆర్ విజ్ఞప్తిని ఈసీకి పంపించామని చెప్పారు. శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఊరేగింపులో ఓ వర్గం ప్రజలను రెచ్చగొట్టేలా బీజేపీ ఎమ్మెల్యే టి.రాజాసింగ్, ఆ పార్టీ హైదరాబాద్ అభ్యర్థి మాధవీలత చేసిన విద్వేషకర ప్రసంగాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. కోడ్ ఉల్లంఘనకి సంబంధించి ఇప్పటి వరకు వివిధ పార్టీల నుంచి 28 ఫిర్యాదులు వచ్చాయని, ఇప్పటివరకు 4099 ఎఫ్ఐఆర్లను నమోదు చేశామన్నారు. ఓ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే మరో పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయడానికి అనుమతించే విషయమై చట్టాలను పరిశీలించాల్సిన అవసరముందని తెలిపారు. సికింద్రాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పోటీకి దిగుతున్న విషయం తెలిసిందే. ఆన్లైన్లో నామినేషన్ వేయొచ్చు ఆన్లైన్లో సైతం నామినేషన్ దాఖలు చేయొ చ్చని, అయితే ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటల్లోపు అభ్యర్థులు సంతకం చేసిన నామినేషన్ పత్రాల ప్రింట్ కాపీని సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుందని వికాస్‌రాజ్ తెలిపారు. నామినేషన్ ఫారంతోపాటు అఫిడవిట్‌లోని అన్ని ఖా ళీలను పూరించాలని, తమకు వర్తించని విష యాలను సైతం ‘నాట్ అప్లికేబుల్’అని రా యాల్సి ఉంటుందన్నారు. ఒక్క ఖాళీ పూరించకపోయినా పరిశీలనలో నామినేషన్లు తిరస్కరిస్తారని చెప్పారు. ఎన్నికల ఖర్చుల కోసం అభ్యర్థులు కొత్త బ్యాంక్ ఖాతాను తెరవాల్సి ఉంటుందని, రాష్ట్రంలోని ఏ బ్యాంక్ నుంచైనా ఖాతా తెరవచ్చన్నారు. తొలి రోజు రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో మొత్తం 42 మంది అభ్యర్థులు మొత్తం 48 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారని వికాస్‌రాజ్ వెల్లడించారు. 23లోగా పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు చేసుకోవాలి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోసం వికలాంగు లు, 85 ఏళ్లుపైబడిన వయోజనులు, అత్యవసర సేవల ఉద్యోగులు/జర్నలిస్టులు ఈ నెల 23లోగా ఫారం–12డీ దరఖాస్తులను సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి సమర్పించాలని సీఈఓ వికాస్‌రాజ్ సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందిలో ఇంకా 40వేల మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదని, తక్షణమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. మే 3 నుంచి 6 వరకు తొలి విడత పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. ఈ నెల 26 నుంచి ఓటర్లకు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పుల పంపిణీ చేస్తామన్నారు. పాత ఓటరు గుర్తింపుకార్డులు కలిగిన 46 లక్షల మంది ఓటర్లకు వారి కొత్త ఓటరు గుర్తింపుకార్డు నంబర్లను తెలియజేస్తూ లేఖలు పంపినట్టు తెలిపారు. పాత నంబర్లతో ఓటు ఉండదని, కొత్త నెంబర్లతోనే ఉంటుందన్నారు. మహిళా ఓటర్లే అధికం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,31,48,527కి చేరిందని వికాస్‌రాజ్ తెలిపారు. 1000 మంది పురుషులకు రాష్ట్రంలో 1010 మంది మహిళా ఓటర్లు ఉన్నారన్నారు. కొత్త ఓటర్ల నమోదుకు మొత్తం 1,00,178 దరఖాస్తులొచ్చాయని, వీటిని ఈనెల 25లోగా పరిష్కరిస్తామని చెప్పారు. 2022–24 మధ్యకాలంలో రాష్ట్రంలో 60.6 లక్షల కొత్త ఓటర్ల నమోదు, 32.84 లక్షల ఓటర్ల తొలగింపు, 30.68 లక్షల ఓటర్ల వివరాల సవరణ జరిగిందన్నారు. -
తెలుగు తేజం రమాదేవి...
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా 25 మంది చీఫ్ ఎలక్షన్ కమిషనర్లుగా పనిచేశారు. వీరిలో ఒకే ఒక్క మహిళ ఉన్నారు! ఆమె తెలుగువారు కావడం విశేషం. ఆమే వి.ఎస్.రమాదేవి. అయితే ఆమె కేవలం 16 రోజులే ఆ పదవిలో కొనసాగారు. ఏలూరు జిల్లా చేబ్రోలుకు చెందిన రమాదేవి సివిల్ సర్వెంట్‌గా కేంద్రంలో పలు శాఖల్లో పని చేసి సత్తా చాటారు. కేంద్ర న్యాయ శాఖ స్పెషల్ సెక్రటరీగా, లా కమిషన్ మెంబర్ సెక్రటరీగా, రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గా పలు హోదాల్లో పని చేశారు. అనంతరం 1990 నవంబర్ 26న 9వ సీఈసీగా బాధ్యతలు చేపట్టారు. 16 రోజుల అనంతరం డిసెంబర్ 11న రిటైరయ్యారు. ఆమెకు ముందు గానీ, తర్వాత గానీ మరో మహిళ సీఈసీ కాలేదు. అలా ఏకైక మహిళా సీఈసీగా రమాదేవి రికార్డు నెలకొల్పారు. పదవీ విరమణ తర్వాత ఆమె హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక గవర్నర్‌గా చేశారు. కర్ణాటకకు తొలి మహిళా గవర్నర్ కూడా రికార్డు నెలకొల్పారు. ► కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా అత్యధిక కాలం పదవిలో ఉన్న రికార్డు రెండో సీఈసీ కె.వి.కె.సుందరానిది. ఆయన 8 ఏళ్ల 284 రోజులు పదవిలో కొనసాగారు. ► ఆ తర్వాతి స్థానంలో తొలి సీఈసీ సుకుమార్ సేన్ ఉన్నారు. ఆయన 8 ఏళ్ల 273 రోజులు పదవిలో ఉన్నారు. -
టెక్నాలజీ.. ఈసీ ఈజీ..
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించే క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం సాంకేతికతకు పెద్దపీట వేస్తోంది. ఎన్నికల ప్రక్రియలో పౌరులకు అవసరమైన ప్రతి సమాచారాన్నీ, అవసరమైతే స్పందించే సౌకర్యాన్నీ అందుబాటులో ఉంచింది. ఆన్లైన్ ద్వారా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అవకాశం కల్పించింది. అభ్యర్థుల గుణగణాలు తెలుసుకునేందుకు ‘కేవైసీ’, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు ‘సీ విజిల్’, బరిలో నిలిచే అభ్యర్థులు నామినేషన్లు, ప్రచార అనుమతుల కోసం ‘సువిధ’.. ఇలా ఎన్నో యాప్‌లు, వైబ్సైట్లు. వీటి ద్వారా ఓటరు నమోదు నుంచి మొదలుపెడితే ఫిర్యాదులు, నామినేషన్లు, ప్రచార అనుమతులు, కౌంటింగ్, ఫలితాల వరకూ ప్రతీదీ ఇంట్లోనే కూర్చుని తెలుసుకునే వీలుండటం గమనార్హం. ఓటు నమోదు చేసుకోండి కొత్త ఓటు నమోదు, ఓటు బదిలీ, తప్పులు సరి చేసుకునేందుకు ‘ఓటర్ హెల్ప్‌లైన్’ఉపయోగపడుతుంది. ఓటరు గుర్తింపు కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. నియోజకవర్గాల వారీగా ఓటరు జాబితాలను పొందవచ్చు. అభ్యర్థులెవరో తెలుసుకోండి నో యువర్ క్యాండిడేట్ (కేవైసీ) ద్వారా ఏ నియోజకవర్గంలో ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారో తెలుసుకోవచ్చు. అభ్యర్థుల పూర్తి వివరాలతో పాటు నామినేషన్ల సమయంలో అభ్యర్థులు దాఖలు చేసే అఫిడఫిట్లు ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం దీన్ని రూపొందించింది. ఇందులో అభ్యర్థి విద్యార్హతలు, నేర చరిత్ర, స్థిరచరాస్తులు వంటి సమాచారం ఉంటుంది. ‘సువిధ’తో సులభం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ వేయడం, ప్రచార అనుమతులు పొందడం ‘సువిధ’తో సులభతరం అవుతుంది. అభ్యర్థులు ఇంట్లో కూర్చొని తొలుత ఆన్లైన్లోనే నామినేషన్ పత్రాలను దాఖలు చేయవచ్చు. ఎన్నికల కమిషన్ సూచించిన పత్రాలు ఆన్లైన్లో పొందుపర్చాల్సి ఉంటుంది. ఆస్తుల ఆఫిడవిట్ పత్రాలు, నామినేషన్‌ను బలపరిచేందుకు పది మంది ఇతరుల వివరాలను నమోదు చేయాలి. కావాల్సిన పత్రాలు సమర్పించిన తర్వాత నామినేషన్ దాఖలు చేసేందుకు నిర్ణీత సమయంలో స్లాట్ బుక్ చేసుకోవాలి. ‘సక్షం’తో చేయూత పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయలేని వారు ‘సక్షం’యాప్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఆయా ఓటర్ల వివరాలను అధికారులు పరిశీలించి పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చేందుకు రవాణా సదుపాయం కల్పిస్తారు. వారికి ప్రత్యేకంగా ఒక స్వచ్చంధ సహాయకుడిని కూడా అందుబాటులో ఉంచుతారు. దివ్యాంగులకు మూడు చక్రాల కుర్చీ వంటి సదుపాయాలను సమకూరుస్తారు. అబ్జర్వర్, ఈఎస్ఎంఎస్ పోలీసులు, వ్యయ పరిశీలకుల కోసం అభివృద్ధి చేసిన యాప్ ‘అబ్జర్వర్’. ఎన్నికల పరిశీలకులు నివేదికలు సమర్పించడానికి, నియోజకవర్గానికి సంబంధించిన సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. సీ విజిల్ కేసులను రిపోర్ట్ చేయడానికి అనుమతిస్తుంది. ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఈఎస్ఎంఎస్) యాప్‌లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కేసుల వివరాలు, సీజ్ చేసిన నగదు, మద్యం, ఇతరత్రా వస్తువుల డేటాను డిజిటల్ రూపంలో పొందవచ్చు. ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయండి ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండాక్ట్) ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు సీ విజిల్ ఉపయోగపడుంది. పార్టీలకు అతీతంగా ఎవరు అవినీతికి పాల్పడినా ఈ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి భిన్నంగా ఉన్న దేనిపైనైనా ఫిర్యాదు చేయవచ్చు. డబ్బు పంపకాలు, ఉచితాలు, బహుమతుల అందజేత, రెచ్చగొట్టే ప్రకటనలు, మద్యం, మత్తు పదార్థాల పంపిణీ, ఓటర్లను ప్రభావితం చేయడం, ఎన్నికల రోజున ఓటర్లను వాహనాలలో తరలించడం లాంటివి ఫొటో, వీడియో లేదా ఆడియో రూపంలో రికార్డ్ చేసి అప్లోడ్ చేయాలి. ఫిర్యాదు చేసిన 5 నిమిషాల్లో ఎన్నికల అధికారులు రంగంలోకి దిగుతారు. దీనిపై విచారణ చేపట్టి 100 నిమిషాల్లో సదరు ఫిర్యాదులపై కచ్చితమైన చర్యలు తీసుకుంటారు. ఎప్పటికప్పుడు ‘ఓటర్ టర్నౌట్’ కేంద్ర ఎన్నికల సంఘం అభివృద్ధి చేసిన యాప్‌లలో ఈ ‘ఓటర్ టర్నౌట్’కీలకమైంది. రియల్ టైం డేటా ఆధారంగా రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం వారీగా సుమారు ఓటింగ్ శాతాన్ని అంచనా వేస్తారు. ఈ డేటాను సోషల్ మీడియాలో పంచుకోవడానికి వినియోగదారులకు అనుమతి ఉంది. నిర్దిష్టమైన ప్రాంతంలో ఓటింగ్ శాతాన్ని అంచనా వేసే వీలుండటంతో ఇది అభ్యర్థులకు, మీడియా సంస్థలకు ఉపయుక్తకర సాధనం. అయితే ఇది కేవలం శాసనసభ, లోకసభ, ఉప ఎన్నికల సమయాలలో మాత్రమే యాక్టివేట్ అవుతుంది. ‘నోడల్’ మేడ్ ఈజీ ఎన్నికల సమయంలో నోడల్ అధికారులు అనుమతుల ప్రక్రియను సులభతరంగా, సమర్థవంతంగా నిర్వహించడానికి ‘ఎన్కోర్ నోడల్’యాప్ ఉపయోగపడుతుంది. ఈ యాప్ ద్వారా అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రచారానికి సంబంధించి వివిధ కార్యకలాపాలను, ర్యాలీలు, బహిరంగ సభలు వంటి వాటికి సంబంధించిన అనుమతులు జారీ చేయవచ్చు. అభ్యంతరాలు తెలపొచ్చు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల స్థితిగతులు, సమర్పించాల్సిన పత్రాలకు సంబంధించి అభ్యర్థులకు నోటిఫికేషన్ పంపవచ్చు. -
4వ విడత ఎన్నికలకు నేడు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల సమరం ఊపందుకోనుంది. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలతో పాటు ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్(4వ విడత) జారీ చేయనుంది. రాష్ట్రంలో 12 జనరల్, 3 ఎస్సీ, 2 ఎస్టీ రిజర్వుడు లోక్‌సభ సీట్లకు నోటిఫికేషన్‌తో పాటు ఇటీవల ఖాళీ అయిన కంటోన్మెంట్ అసెంబ్లీ (ఎస్సీ రిజర్వుడు) స్థానానికి ఉప ఎన్నికల నోటిఫికేషన్ కూడా జారీ కానుంది. రాష్ట్రంలో 3.3 కోట్ల ఓటర్లు సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలోని 3,30,13,318 మంది ఓటర్లు ఓటు హక్కువినియోగించుకోనున్నారు. 1,64,14,693 మంది పురుషులు, 1,65,95,896 మంది మహిళలు, 2,729 మంది ట్రాన్స్జెండర్లు వీరిలో ఉన్నారు. ఈ నెల 15 వరకు కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరించారు.వీరిలో అర్హులైన వారికి ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించనున్నారు. రాష్ట్రంలో సర్వీసు ఓటర్లు 15,472 మంది, 18–19 ఏళ్ల యువ ఓటర్లు 8,72,116 మంది, 85 ఏళ్లు ఆపై వయస్సు ఓటర్లు 1,93,489 మంది, దివ్యాంగ ఓటర్లు 5,26,286 మంది, ప్రవాస ఓటర్లు 3,409 మంది ఉన్నారు. -
Rahul Gandhi: రాజ్యాంగ సంస్థలు మోదీ సొత్తు కాదు
వయనాడ్/నీలగిరి: సీబీఐ, ఈడీ మొదలుకుని కేంద్ర ఎన్నికల సంఘం దాకా ప్రతి రాజ్యాంగబద్ద సంస్థల్లోకి తమ వారిని జొప్పిస్తూ ప్రధాని మోదీ వాటిని తన సొంత ఆస్తులుగా భావిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహల్ గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేరళలోని సొంత ఎంపీ నియోజకవర్గం వయనాడ్‌లో ప్రచారంలో భాగంగా సోమవారం వల్లిమండలో రోడ్‌షో నిర్వహించి అక్కడి పార్టీ కార్యకర్తలు, ఓటర్లనుద్దేశించి రాహుల్ ప్రసంగించారు. ‘‘ రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటనీ బీజేపీ హస్తగతం చేసుకుంటున్న తీరు మీకందరికీ అర్థమయ్యే ఉంటుంది. న్యాయవ్యవస్థ, ఎలక్షన్ కమిషన్, సీబీఐ, ఈడీ, ఆదాయ పన్ను శాఖ ఇలా ప్రతి రాజ్యాంగబద్ధ విభాగంలోనూ తమ అస్మదీయులను జొప్పించడంలో ఆర్ఎస్ఎ‹స్, బీజేపీ బిజీగా ఉన్నాయి. అవే రాజ్యాంగబద్ధ సంస్థల పరిరక్షణ కోసం విపక్షాల ‘ఇండియా’ కూటమి పాటుపడుతోంది. ఇవి ఎవరి సొంత సంస్థలుకావు. ప్రధాని మోదీ వ్యక్తిగత ఆస్తులు అస్సలు కావు. ఇవి ప్రతి ఒక్క భారతీయ పౌరుడివి. రాజ్యాంగాన్ని సవరించబోతున్నట్లు ఒక బీజేపీ ఎంపీ ఇటీవలే ప్రకటించారు. రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఆర్ఎస్ఎస్కు కాంగ్రెస్ పార్టీ ఇవ్వదు. రాజ్యాంగాన్ని తమకు నచి్చనట్లు మార్చేసి జాతి సమున్నత ఆశయాలను సమాధిచేయాలని చూస్తున్నారు’ అని ఆరోపించారు. ‘‘ కేరళను నాగ్‌పూర్(ఆర్ఎస్ఎస్ ప్రధానకేంద్రం) పాలించకూడదు. సొంత పట్టణాలు, పల్లెల నుంచే పరిపాలన సాగాలి. కేరళ ప్రజలకు ఏం కావాలో, వాళ్లేం ఆశిస్తున్నారో ఢిల్లీ(మోదీ సర్కార్)కి ఎలా తెలుస్తుంది?’’ అని ప్రశ్నించారు. ‘‘ఎంతోకాలంగా డిమాండ్‌చేస్తున్నా సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్డీఎఫ్ సర్కార్ వయనాడ్ జిల్లాలో ఇంతవరకు ఒక్క వైద్యకళాశాలను ఏర్పాటుచేయలేదు. యూడీఎఫ్ ప్రభుత్వం వస్తేగానీ కాలేజీ రాదేమో’’ అని విమర్శించారు. ‘ఇంతటి అందమైన ప్రదేశం వయనాడ్‌లో ఓ వారం పది రోజులు గడపమని మా అమ్మ(సోనియా)కు చెప్పా. ఆమెకు అతి ఉక్కబోత పడదు. భువిపైనే అందమైన ప్రదేశాన్ని మిస్ అవుతున్నావని గుర్తుచేశా’’ అని రాహుల్ అన్నారు. రాహుల్ హెలికాప్టర్లో తనిఖీలు ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులోని నీలగిరి ప్రాంతానికి రాహుల్ వచ్చినపుడు ఆయన ప్రయాణించిన హెలీకాప్టర్‌లో ఎన్నికల అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫ్లైయింగ్ స్వా్కడ్ తనిఖీల్లో ఎలాంటి చట్టవ్యతిరేక వస్తువులు లభించలేదు. -
ఈసీ తీరుపై సీఐసీ విస్మయం
న్యూఢిల్లీ: సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద ఈవీఎం, వీవీప్యాట్ల పనితీరు, విశ్వసనీయతను ప్రశ్నిస్తూ అడిగిన సమాచారాన్ని ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేంద్ర ఎన్నికల సంఘాన్ని కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) తీవ్రంగా తప్పుబట్టింది. చట్టాన్ని ఉల్లంఘించినందుకు లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఈసీని సీఐసీ ఆదేశించింది. ఈవీఎంల పనితీరు, ఓట్ల లెక్కింపు ప్రక్రియపై తాము లేవనెత్తిన అనుమానాలను నివృత్తిచేసేలా సమాచారం ఇవ్వాలని మాజీ ఐఏఎస్ అధికారి ఎంజీ దేవసహాయం సహా ప్రముఖ సాంకేతికవిద్యా నిపుణులు, ఐఐటీ, ఐఐఎంలలోని విద్యావేత్తలు, మాజీ ప్రభుత్వ ఉన్నతాధికారులు 2022 మే రెండో తేదీన ఈసీకి ఆర్టీఐ చట్టంకింద దరఖాస్తు పెట్టుకోవడం తెల్సిందే. తమ ఆర్టీఐ దరఖాస్తుపై ఈసీ ఏ మేరకు చర్యలు తీసుకుందని 2022 నవంబర్ 22న దేవసహాయం మరోసారి ఆర్టీఐ కింద సమాచారం అడిగారు. 30 రోజుల్లోపు సమాధానం ఇవ్వాల్సి ఉన్నా ఈసీ సమాధానం ఇవ్వలేదు. దీంతో ఆయన సీఐసీను ఆశ్రయించారు. దేవసహాయానికి ఎందుకు మీ స్పందన తెలపలేదు? అని ఈసీలోని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌కు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ హీరాలాల్ సమరియా అడగ్గా ఆయన సమాధానం ఇవ్వలేదు. ‘‘ ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానం ఇవ్వకుండా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్(పీఐఓ) వ్యవహరించిన తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. దీనిపై 30 రోజుల్లోగా పాయింట్లవారీగా వివరణ ఇవ్వండి’ అని ఈసీని సీఐసీ ఆదేశించింది. -
నోటిఫికేషన్ వచ్చిన 5 రోజుల్లో ఇంటి వద్ద ఓటుకు దరఖాస్తు
సాక్షి, అమరావతి: పోలింగ్ కేంద్రం వరకు రాలేని వృద్ధులు, దివ్యాంగులకు ఈ ఎన్నికల్లో ఇంటి వద్దే ఓటు వేసే సౌకర్యం కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) నిర్ణయం తీసుకుంది. దేశంలో 85 ఏళ్లు పైబడిన ఓటర్లు, 40 శాతం, అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగ ఓటర్లు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ఈమేరకు రాష్ట్రాల వారీగా ఇంటి వద్దే ఓటు వేసేందుకు అర్హత ఉన్న ఓటర్ల సంఖ్యను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధు శుక్రవారం ప్రకటించారు. వీరికి ఇంటి వద్దే ఓటు వేయాలనేది తప్పనిసరి కాదని, ఇది ఐచ్ఛికం మాత్రమేనని చెప్పారు. ఇటువంటి ఓటర్లు దేశవ్యాప్తంగా 1.70 కోట్లకు పైగా ఉన్నట్లు సీఈసీ తెలిపింది. ఇందులో 85 ఏళ్లు పైబడిన వారు 81 లక్షలకు పైగా, దివ్యాంగులు 90 లక్షలకుపైగా ఉన్నారు. 85 ఏళ్లు పైబడిన ఓటర్లలో మహిళలు ఎక్కువ ఉన్నారు. వీరిలో 33.84 లక్షల మంది పురుషులు కాగా, 47.27 లక్షల మంది మహిళా ఓటర్లు, 18 మంది థర్డ్ జెండర్లు ఉన్నారు. 40 శాతం వైకల్యం ఉన్న ఓటర్లలో 53.64 లక్షల మంది పురుషులు, 36.42 లక్షల మంది మహిళలు, 442 మంది థర్డ్ జెండర్లు ఉన్నారు. ఈ వర్గాల వారికి ఇంటి వద్దే ఓటు వేసే సదుపాయం కల్పించడం ప్రగతిశీల చర్యగా ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ వర్గాలకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసే సమయంలో ఇబ్బందులు కలగకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఈ సదుపాయాన్ని పొందే విధానం సరళంగా, సమగ్రంగా, పారదర్శకంగా కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించింది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన ఐదు రోజుల్లోగా అర్హులైన ఓటర్లు ఇంటి వద్ద ఓటు వేసేందుకు 12 డి ఫారమ్‌ను పూర్తి చేసి రిటర్నింగ్ అధికారికి ఇవ్వాలి. దివ్యాంగులు 12 డి ఫామ్‌తో పాటు వైకల్య ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. వీరి నుంచి 12 డి ఫామ్‌ను బూత్ లెవల్ ఆఫీసర్ సేకరిస్తారు. జవాబుదారీ, పాదర్శకత కోసం ఇంటి వద్ద ఓటు వేసే వారి వివరాలను అభ్యర్ధులకు అందుబాటులో ఉంచుతారు. అవసరమైతే అభ్యర్థులు ఈ ప్రక్రియను పర్యవేక్షించుకోవచ్చు. ఈ ఓటర్ల ఇళ్లకు భద్రతా అధికారులతో పాటు ప్రత్యేక పోలింగ్ బృందం వెళ్తుంది. ఎప్పుడు ఇంటికి వస్తారో ముందుగానే ఆ ఓటర్లకు తెలియజేస్తారు. ఇంటి వద్ద ఓటు వేసే పూర్తి ప్రక్రియను వీడియో తీస్తారు. ఓటు ఎవరికి వేశారో తెలియకుండా గోప్యతను పాటిస్తారు. ఇంటి వద్ద ఓటు వేసిన తరువాత ఆ బ్యాలెట్లను భద్రంగా బ్యాక్సుల్లో ఉంచి తిరిగి రిటర్నింగ్ అధికారికి స్వాధీనం చేస్తారు. రాష్ట్రంలో 85 ఏళ్లు పైబడిన ఓటర్లు మొత్తం ఓటర్లు 2,11,088 పురుషులు 84,155 మహిళలు 1,26,927 థర్డ్ జెండర్ 6 రాష్ట్రంలో 40 శాతం వైకల్యం గల ఓటర్లు మొత్తం ఓటర్లు 5,18,193 పురుషులు 3,02,374 మహిళలు 2,15,795 థర్డ్ జెండర్ 24 -
SBI: ఆర్టీఐ కింద ఎలక్టోరల్ బాండ్ల వివరాలు ఇవ్వలేం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను సమాచార హక్కు చట్టం(ఆరీ్టఐ) కింద బహిర్గతం చేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నిరాకరించింది. ఇది వ్యక్తిగత సమాచారమని పేర్కొంది. సంబంధిత రికార్డులు ఎన్నికల సంఘం వెబ్సైట్ అందరికీ అందుబాటులో ఉన్నప్పటికీ ఆర్టీఐ కింద ఈ వివరాలు ఇవ్వడం సాధ్యం కాదని తేలి్చచెప్పింది. ఈ బాండ్లకు సంబంధించిన పూర్తి డేటాను డిజిటల్ రూపంలో ఇవ్వాలని కోరుతూ సమాచార హక్కు చట్టం కార్యకర్త లోకేశ్ బాత్రా మార్చి 13న దరఖాస్తు చేశారు. -
Election Commission: హోర్డింగులు, పోస్టర్లపై ప్రింటర్, పబ్లిషర్ పేర్లు ముద్రించాల్సిందే
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు నియమ నిబంధనలు కచి్చతంగా పాటించాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. హోర్డింగులు సహా ఎన్నికల ప్రచారంలో ఉపయోగించే ఇతర సామగ్రిపై ప్రింటర్, పబ్లిషనర్ పేర్లు స్పష్టంగా కనిపించేలా ముద్రించాలని ఆదేశించింది. ఎన్నికల ప్రచారంలో జవాబుదారీతనం, పారదర్శకత కోసమే ఈ నిబంధన విధించినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసిన హోర్డింగులపై ప్రింటర్, పబ్లిషర్ పేర్లు లేవంటూ ఆమ్ ఆద్మీ పార్టీ సహా పలువురు ఇటీవల ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హోర్డింగుల సహా కరపత్రాలు, పోస్టర్లపై ప్రింటర్, పబ్లిషర్ పేర్లను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. -
శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా, అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. ఈ బాధ్యత జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలపైనే ఉందన్నారు. ఓర్పు, సమన్వయంతో వ్యవహరించాలని, సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు చేయాలన్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి శనివారం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల ఏర్పాట్లు, నిర్వహణకు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎటువంటి హింసకు, రీపోలింగ్‌కు తావులేకుండా పటిష్ట భద్రతా చర్యలను చేపట్టాలన్నారు. గంజాయి, మద్యం, నగదు, ఉచితాల అక్రమ రవాణాపై పటిష్ట నిఘా ఉంచాలని ఆదేశించారు. రాష్ట్రాలు, జిల్లాల సరిహద్దుల్లో ఉండే చెక్ పోస్టుల్లో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. గోవా, హరియాణాల నుంచి అక్రమ మద్యం రాష్ట్రంలోకి రాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, వ్యక్తులు రూ.50 వేలకు మించి నగదు కలిగి ఉంటే వెంటనే జప్తు చేయాలని ఆదేశించారు. వ్యాపారులు, సాధారణ పౌరుల విషయంలో ఆచితూచి అడుగేయాలని, వారిని ఎలాంటి ఇబ్బందులకు గురిచేయొద్దన్నారు. నగదు జప్తు కేసులను 24 గంటల్లోనే పరిష్కరించాలని సూచించారు. ఇందుకోసం రాష్ట్రమంతా ఒకే విధానాన్ని అనుసరించేలా త్వరలో నిర్దిష్ట నిబంధనలను (ఎస్వోపీ) ప్రకటించనున్నామని తెలిపారు. 10 లక్షలు దాటితే ఐటీకి సమాచారం ఇవ్వండి.. రాష్ట్ర పోలీస్ నోడల్ అధికారి, అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్) శంఖబ్రత బాగ్చీ మాట్లాడుతూ ప్రత్యేక సాధారణ పరిశీలకులు రాష్ట్ర పర్యటన సందర్భంగా చేసిన పలు సూచనలను డీఈవో, ఎస్పీలకు వివరించారు. రూ.10 లక్షలకు పైబడి జప్తు చేసిన నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆదాయపన్ను (ఐటీ) శాఖ అధికారులకు తెలియజేయాలన్నారు. మద్యం, గంజాయి రవాణా చేసే కింగ్పిన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అదనపు సీఈవో పి.కోటేశ్వరరావు మాట్లాడుతూ అదనంగా ఏఆర్వోలు కావాల్సినవారు సంబంధిత జాబితాలను మూడు రోజుల్లో సీఈవో కార్యాలయానికి పంపిస్తే, వాటిని కన్సాలిడేట్ చేసి ఈసీ ఆమోదం కోసం పంపిస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు సీఈవో హరేందిరప్రసాద్, అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, జాయింట్ సీఈవో ఎ.వెంకటేశ్వరరావు, డిప్యూటీ సీఈవో కె.విశ్వేశ్వరరావు, అసిస్టెంట్ సీఈవో తాతబ్బాయి తదితరులు పాల్గొన్నారు. ఉల్లంఘనలపై తక్షణమే చర్యలు చేపట్టాలి.. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇంటింటా ప్రచారానికి ముందుగా పొందాల్సిన అనుమతి విషయంలో మరింత స్పష్టత కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపామని మీనా చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి తగిన వివరణ అందేలోపు ఇంటింటా ప్రచారానికి అభ్యర్థులు సంబంధిత ఆర్వో, పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇస్తే సరిపోతుందన్నారు. ఈ విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలకు తెలియజేయాలని కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిందని, వీరే ఈసీకి కళ్లు, చెవులు వంటి వారని తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు విషయంలో ప్రత్యేక సాధారణ పరిశీలకులు, ప్రత్యేక వ్యయ పరిశీలకులు సంతృప్తి చెందేలా చూసుకోవాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన ఫిర్యాదులపై తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తమ కార్యాలయం నుంచి పంపించే ఫిర్యాదులపై జిల్లా స్థాయిలోనే సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకున్నాకే నివేదిక పంపాలని సూచించారు. -
కోడ్ ఉల్లంఘిస్తే కొరడా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు, రీపోలింగ్ వంటివి లేకుండా పూర్తి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అందుకోసం కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ఏపీలో ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానప్పటికీ షెడ్యూల్ విడుదలైన మార్చి 16 నుంచే ఈసీ కొరడా ఝుళిపిస్తోంది. అప్పటినుంచే రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలుచేస్తోంది. షెడ్యూల్ విడుదలైన 20 రోజుల్లోనే కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి 4,584 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. ఇందులో 4,337 ఎఫ్ఐఆర్లు నగదు, వస్తువుల జప్తుకు సంబంధించినవి కాగా, అనుమతుల్లేకుండా నియమావళికి విరుద్ధంగా ప్రచారం చేస్తున్న వారిపై 247 కేసులు నమోదు చేశారు. నేరుగా ఫిర్యాదుకు నిర్దేశిత సమయం రోజు సా.4–5 గంటల మధ్య స్వీకరణ సాధారణ ఎన్నికల ప్రక్రియపై ఎన్నికల సంఘాన్ని నేరుగా కలిసి ఫిర్యాదు లేదా విజ్ఞాపనపత్రం ఇవ్వాలనుకనే వారికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల కార్యాలయం నిర్దేశిత సమయాన్ని కేటాయించింది. ప్రతిరోజు సా.4–5 గంటల మధ్య తమకు నేరుగా అందజేయవచ్చని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఒక ప్రకటనలో తెలిపారు. కార్యాలయ పనిదినాలతో పాటు ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా తాము కార్యాలయంలో అందుబాటులో ఉంటే అందజేయవచ్చన్నారు. తాను కార్యాలయంలో అందుబాటులో లేని పక్షంలో అదనపు ప్రధాన ఎన్నికల అధికారులకు లేదా సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారికి అందజేయవచ్చన్నారు. ప్రభుత్వ సెలవు దినాల్లో ఫిర్యాదులివ్వడానికి వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం గ్రౌండ్ ఫ్లోర్ రూమ్ నెం.129 లోని ఫిర్యాదు సెల్లో అందుబాటులో ఉంటుందని ముకే‹Ùకుమార్ పేర్కొన్నారు. రూ.47.49 కోట్లు జప్తు.. ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఏప్రిల్ 5 వరకు రూ.47.49 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ప్రకటించింది. ఇందులో.. ♦ నిబంధనలకు విరుద్ధంగా తీసుకెళ్తున్న రూ.17.85 కోట్ల నగదు, రూ.8.82 కోట్ల విలువైన మద్యం, రూ.1.63 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు, రూ.12.36 కోట్ల విలువైన బంగారం వంటి విలువైన లోహాలను స్వాదీనం చేసుకున్నారు. ♦ ఇవికాక.. ఓటర్లను ప్రలోభాలు పెట్టేందుకు సిద్ధంచేసిన రూ.1.56 కోట్ల విలువైన వివిధ వస్తువులతో పాటు రూ.5.24 కోట్ల విలువైన ఇతర సామగ్రిని స్వాదీనం చేసుకున్నట్లు పేర్కొంది. ♦ ఎన్నికల వేళ లైసెన్స్‌లు కలిగిన ఆయుధాలను పోలింగ్ స్టేషన్లో సమర్పించాల్సి ఉండగా ఇప్పటివరకు 8,681 ఆయుధాలను డిపాజిట్ చేయగా ఇంకా 17 చేయాల్సి ఉంది. ♦మరోవైపు.. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో 32 హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి. అలాగే, ఎన్నికల సందర్భంగా సమస్యలను సృష్టించడానికి అవకాశమున్న 432 మందిని గుర్తించామని ఇంకా 21 మందికి నాన్ బెయిలబుల్ వారెంట్స్ జారీచేయాల్సి ఉందని ఈసీ పేర్కొంది. ♦ సీ–విజిల్ యాప్ ద్వారా 7,838 ఫిర్యాదులు రాగా అందులో 90 శాతం కేసులను నిర్దేశిత 100 నిమిషాల్లోనే పరిష్కరించినట్లు తెలిపింది. ♦ రాష్ట్రంలోను, రాష్ట్ర సరిహద్దుల వద్ద నిఘా కోసం 298 చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ♦ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులపై ఏర్పాటుచేసిన 5,07,561 బ్యానర్లు, హోర్డింగులు తొలగించారు. -
చంద్రబాబు కోసం బరితెగించొద్దు!
సాక్షి, అమరావతి: ‘‘వీళ్లా ఎస్పీలు?’’ అంటే అర్థమేంటి రామోజీరావ్? ఎస్పీలు మీరు ఊహించినట్లు ఉండాలా? మీకు కావాల్సినట్లు ఉండాలా? ఇదెక్కడి దుర్మార్గం!. అత్యున్నత సర్వీసుల్లో పని చేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు అవినీతి అంటగట్టడం, ఎవరెవరు ఎక్కడెక్కడ పని చేయాలో కూడా మీరే నిర్దేశించటం.. ఆఖరికి ఎన్నికల కమిషన్ ఎవరిని నియమించాలో కూడా మీరే సిఫారసు చేయటం ఇదెక్కడి దౌర్భాగ్యం? అసలిది పత్రికేనా? ‘‘వీళ్లా ఎస్పీలు?’’ అంటూ శుక్రవారం ‘ఈనాడు’ పతాక స్థాయిలో ప్రచురించిన హీనాతిహీనమైన కథనంపై అటు ఐఏఎస్ అధికారులు, ఇటు ఐపీఎస్ అధికారులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఈనాడు’ ‘ఆంధ్రజ్యోతి’ హద్దులు మీరుతున్నాయని, ఆ పార్టీల నేతలు నోటికొచ్చినట్లు వాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈసీకి ఇప్పటికే ఫిర్యాదు చేశామని తెలిపారు. అందరిపైనా చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తూ ‘పచ్చ’ మందకు ఐపీఎస్ అధికారులు వార్నింగ్ ఇచ్చారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదిగా నిలుస్తున్న రాజ్యాంగబద్ధ సంస్థ కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) ప్రతిష్టకు భంగం కలిగిస్తూ ఈనాడు పత్రిక దు్రష్పచారపూరిత కథనాన్ని ప్రచురించడం దారుణం అని ఇంకో వైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి మండిపడ్డారు. ఈసీ రాజ్యాంగ నిబంధనలను పాటిస్తూ కొత్తగా ఒక ఐజీ, ఐదుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్లను నియమిస్తే ‘వీళ్లా.. కొత్త ఎస్పీలు’ అంటూ ప్రశ్నించే హక్కు రామోజీకి ఎక్కడిదని ప్రశ్నించారు. నిరాధార ఆరోపణలతో ఈనాడు పత్రిక ఈసీ ప్రతిష్టకు భంగం కలిగించడంతోపాటు యావత్ ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐపీఎస్ అధికారులంటే.. రామోజీ తన ఫిల్మ్ సిటీలో పని చేస్తున్న గార్డులుగా భావిస్తున్నట్లుందని పౌర సంఘాలు సైతం తీవ్రంగా తప్పు పట్టాయి. ఎలక్షన్ కమిషన్ నియామకాలను తప్పు పడుతున్నారంటే రామోజీ తనకు తాను రాజ్యాంగేతర శక్తిగా భావిస్తున్నట్లుందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఒక వర్గానికి కొమ్ము కాసేలా, రెండు ప్రభుత్వ వ్యవస్థల మధ్య అపోహలు కల్పించేలా ఈనాడు, దాని తోక పత్రిక, కొంత మంది టీడీపీ నేతలు నిత్యం పనిగట్టుకుని దు్రష్పచారం చేస్తున్నారని నిప్పులు చెరిగాయి. అది రాజకీయ దురుద్ధేశమే ఎన్నికల విధులు నిర్వహిస్తున్న రాష్ట్ర అధికార యంంత్రాంగం నిబద్ధత, మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఈనాడు పత్రిక దురుద్దేశపూరిత కథనాన్ని ప్రచురించడం ఏ మాత్రం భావ్యం కాదని సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. అధికారుల ప్రతిష్టకు భంగం కలిగిస్తూ వారిని అవమానపరిచే రీతిలో రాసిన కథనాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఒక్కో పోస్టుకు మూడేసి పేర్లతో పంపిన జాబితాను పరిశీలించి ఈసీ తన విచక్షణాధికారాల మేరకు నిర్ణయం తీసుకుంటుందన్నారు. తాము పంపించే జాబితాపై సందేహాలు ఉంటే దాన్ని తిరస్కరిస్తూ కొత్తగా మరికొందరు అధికారుల పేర్లతో మరో జాబితాను పంపించమని ఈసీ ఆదేశిస్తుందన్నారు. గుంటూరు ఐజీ పోస్టు కోసం తాము పంపిన జాబితాను ఈసీ వెనక్కి పంపడంతో మరో జాబితాను పంపించామని తెలిపారు. కీలకమైన ఎన్నికల తరుణంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అఖిల భారత సర్వీసు అధికారుల ప్రతిష్టకు భంగకరంగా ఈనాడు తప్పుడు కథనాన్ని ప్రచురించడం వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని భావిస్తున్నామన్నారు. పాత్రికేయ ప్రమాణాలు, విలువలకు విరుద్ధంగా ఈనాడు పత్రిక వ్యవహరించిందని చెప్పారు. ఈనాడు కథనంపై తన అభిప్రాయాన్ని సైతం బ్యానర్‌గా ప్రచురించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. లేదంటే న్యాయపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని స్పష్టం చేశారు. సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటాం పోలీసు అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ఈనాడు పత్రిక దు్రష్పచారం చేస్తోందని రాష్ట్ర ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా విమర్శించింది. ప్రజల భద్రత, ఎన్నికల సక్రమ నిర్వహణ కోసం రాష్ట్రంలోని పోలీసు యంత్రాంగం మొత్తం సమష్టిగా కృషి చేస్తోందని స్పష్టం చేసింది. తమ విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వహిస్తున్న పోలీసు అధికారులకు ఈనాడు పత్రిక దురుద్దేశాలు ఆపాదించడాన్ని తీవ్రంగా ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ దురుద్దేశంతోనే అవాస్తవ కథనాలను ప్రచురించారని మండి పడింది. దుష్ప్రచారం చేస్తున్న వారికి వ్యతిరేకంగా సంబంధిత ఐపీఎస్ అధికారులు వ్యక్తిగతంగా, సమష్టిగా సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటారని కూడా తెలిపింది. ఈ మేరకు ఐపీఎస్ అధికారుల సంఘం తరపున ఆ సంఘం కార్యనిర్వాహక సభ్యుడు క్రాంతిరాణా టాటా శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పలువురు ఐఏఎస్ అధికారులు సైతం ఈనాడు వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. తామంతా ఓ వర్గానికి అనుకూలంగా వ్యవహరించాలన్నట్లు రామోజీ వైఖరి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదని, రామోజీ తన హద్దులెరిగి ప్రవర్తించాలన్నారు. ఈసీ, ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు ఈనాడు దినపత్రికలో శుక్రవారం పతాక శీర్షికన ప్రచురితమైన కథనం ఒక వర్గానికి కొమ్ము కాసేలా, రెండు ప్రభుత్వ వ్యవస్థల మధ్య అపోహలు కల్పించేదిగా ఉందంటూ ఎన్నికల సంఘానికి రెండు పౌర సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఏపీ ఇంటిలెక్చువల్ అండ్ సిటిజన్స్ ఫోరం, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం సచివాలయంలోని ఎన్నికల కార్యాలయంలోని ఫిర్యాదుల విభాగానికి ఈ మేరకు ఒక లేఖను అందజేశారు. అనంతరం ఇంటిలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు పి.విజయబాబు మాట్లాడుతూ.. ఈనాడులో ‘వీళ్ళా కొత్త ఎస్పీలు.. సగానికి పైగా వైకాపా విధేయులే’ అన్న కథనం ఎటువంటి ఆధారాలు లేని అర్ధరహిత కథనంగా ఉందన్నారు. ఒక రాజకీయ పార్టీపై వ్యతిరేకతతో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి పై అసత్య ఆరోపణలు చేసే విధంగా వార్తను ప్రచురించారని, అందువల్ల ఆ పత్రిక యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈనాడు పత్రిక కథనాలు సత్య దూరంగా ఉంటున్నాయని, అందువల్ల దీనిపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కూడా ఫిర్యాదు చేయబోతున్నామని ఆయన తెలిపారు. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు మాట్లాడుతూ.. కొత్త ఎస్పీల నియామకం నిబంధనల ప్రకారమే జరిగినప్పటికీ జవహర్ రెడ్డి పై అనవసర విమర్శలు చేశారన్నారు. జవహర్ రెడ్డి ఒక్కో పోస్టుకు ముగ్గురు అభ్యర్థుల పేర్లను మాత్రమే సూచించారని వారిలో ఒకరి పేరు నిర్ధారించే అధికారం ఎన్నికల సంఘానికే ఉందని కృష్ణంరాజు వివరించారు. ఎస్పీల నియామకాన్ని తప్పు పట్టడం అంటే ఎన్నికల సంఘాన్ని తప్పు పట్టడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉన్నంతకాలం వివిధ పత్రికల్లో వస్తున్న అసత్య, అర్ధసత్య వార్తలను ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు పరిశీలించి వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయవాది ఎం విఠల్ రావు, పలువురు ప్రముఖులు ఎన్నికల సంఘాన్ని కలిసిన వారిలో ఉన్నారు. రాజ్యాంగేతర శక్తి అనుకుంటున్నారు.. చింత చచ్చినా పులుపు చావలేదు అంటే ఇదేనేమో.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు ఛీకొట్టి నిర్ద్వందంగా తిరస్కరించి ఐదేళ్లు అవుతున్నా ఈనాడు రామోజీరావు మాత్రం తాను ఇంకా రాజ్యాంగేతర శక్తినేనని భావిస్తున్నారు. తాను చెప్పిందే శాసనం.. తన మాటే వేదం అన్నట్టుగా సాగాలని అనుకుంటున్నారు. అందుకోసం ఏకంగా రాజ్యంగబద్ధ సంస్థ ఎన్నికల కమిషన్ (ఈసీ)నే తూలనాడుతున్నారు. ఈసీ అంటే తన జేబు సంస్థ అన్నట్టుగా... తన ఆదేశాలే పాటించాలని, ఈనాడు ఉద్యోగుల్లా తన మనసెరిగి మసలుకోవాలని హకుం జారీ చేస్తున్నారు. తమ బాబుకు అనుకూలంగా జరిగితే ఆహా ఓహో అంటామని, అలా కాకుండా రాజ్యాంగ నిబంధనల మేరకు నిక్కచ్చిగా వ్యవహరిస్తామంటే మాత్రం ఎవరినైనా సరే బురదజల్లి బజారుకీడుస్తామని రామోజీరావు పాత్రికేయ వీరంగం వేస్తున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కొందరు ఎస్పీలను ఈసీ నియమిస్తే.. ‘వీళ్లా కొత్త ఎస్పీలు..?’అంటూ ఈనాడు పతాక శీర్షికన కథనాన్ని అచ్చేయడం రామోజీరావు పెత్తందారి పోకడలకు నిదర్శనం. ఎస్పీలు అంటే అఖిల భారత సర్వీసు అధికారులు కాదు.. తన ఇంటి నౌకర్లు.. ఫిలింసిటీ గార్డులు అన్నట్టుగా రామోజీరావు తన ఈనాడు పత్రిక నిండా విషాక్షరాలు కక్కడం పాత్రికేయ నైచత్వానికి పరాకాష్ట. ఈనాడు పాత్రికేయ దుర్మార్గంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది వంటి రాజ్యాంగబద్ధ సంస్థ ఎన్నికల కమిషన్ ప్రతిష్టకు భంగకరంగా ఈనాడు పత్రిక దు్రష్పచారం చేసిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి మండిపడ్డారు. అసలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నప్పుడు అధికారుల పోస్టింగుల ప్రక్రియ ఎలా సాగుతుందన్న కనీస పరిజ్ఞానం ఈనాడు పత్రికకు ఉందా అని ఆయన నిలదీశారు. నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్న ఐపీఎస్ అధికారుల మనో స్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు ఈనాడు పత్రిక కుట్ర పన్నిందని రాష్ట్ర ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ధ్వజమెత్తింది. అటువంటి దుష్ప్రచారానికి పాల్పడుతున్న వారిపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు వెనుకడామని కూడా స్పష్టం చేసింది. ఈనాడు రామోజీరావు రాజ్యాంగబద్ధ సంస్థల ప్రతిష్టను దెబ్బతీస్తూ అప్రజస్వామికంగా వ్యవహరిస్తున్నారని పౌర సమాజం తీవ్రంగా దుయ్యబట్టింది. ఈనాడు పత్రిక రాజకీయ కుట్రలపై ఈసీకి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామని ఏపీ ఇంటిలెక్చువల్ అండ్ సిటిజన్స్ ఫోరం, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ తెలిపాయి. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగబద్ధ సంస్థ ఈసీనీ, యావత్ అధికార యంత్రాంగంపై ఈనాడు రామోజీరావు దు్రష్పచారం చేయడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. పరాజయానికి సాకులు త్వరలో నిర్వహించనున్న ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ మరోసారి దారుణంగా ఓడిపోనుందన్నది ఇప్పటికే స్పష్టమైంది. ‘జై జగన్’ అనే జన నినాదాలతో ‘సిద్ధం’ సభలు మార్మోగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ‘వన్స్ మోర్ జగన్’ అని ముక్తకంఠంతో నినదిస్తున్నారని జాతీయ చానళ్ల సర్వేలు పదే పదే వెల్లడిస్తున్నాయి. దాంతో బెంబేలెత్తిన చంద్రబాబు, రామోజీరావులు తమకు అలవాటైన రీతిలో కుట్ర రాజకీయాలకు తెరతీశారు. అందులో భాగంగా అధికార యంత్రాంగం మనోస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు పన్నాగం పన్నారు. మరిది మనసెరిగి మసలుకుంటున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, చంద్రబాబు దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ ఈ కుట్రలో భాగస్వాములయ్యారు. దాంతో ఈ ఎల్లో గ్యాంగ్ దురుద్దేశపూరితంగా రాష్ట్రంలోని ఎస్పీలు, కలెక్టర్లు, ఇతర అఖిల భారత సర్వీసు అధికారులపై నిరాధార ఆరోపణలతో హడావుడి చేస్తోంది. సమర్థ పనితీరు, చిత్తశుద్ధితో నిమిత్తం లేకుండా శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు మొత్తం ఎస్పీలు, కలెక్టర్లు, డీఐజీలు, డీజీ స్థాయి అధికారుల వరకు ఓ జాబితా తయారు చేసి వారందరినీ బదిలీ చేయాలని ఈసీకి విజ్ఞప్తులపై విజ్ఞప్తులు చేశారు. ఓ వైపు చంద్రబాబు, లోకేశ్.. మరోవైపు పురందేశ్వరి, పవన్ కల్యాణ్.. దీనికి తోడు టీడీపీ అనుకూల ఎల్లో మీడియా రాష్ట్రంలోని ఉన్నతాధికారులపై అవాకులు చవాకులు పేలుతూ ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి, వ్యవస్థలను ప్రభావితం చేసేందుకు యత్నించారు. తద్వారా రానున్న ఎన్నికల్లో తమ ఓటమికి ఇప్పటి నుంచే సాకులు వెతుక్కునే పనలో పడింది పచ్చ ముఠా. బదిలీ చేస్తే ఈసీ ఆహా ఓహో అంటారా... ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న చిలకలూరిపేట సభను అవకాశంగా చేసుకుని అసత్య ఆరోపణలతో ఎల్లో మీడియా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. వాహనాలు సమకూర్చినా, డబ్బులు ఇస్తామన్నా సరే సభకు ఆశించిన స్థాయిలో జనం హాజరు కాకపోవడంతో ఆ సభ అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. తమ వైఫల్యాన్ని అంగీకరించలేక చంద్రబాబు రాష్ట్రంలోని అధికారులపై సాకు నెట్టేసేందుకు యత్నించారు. అందుకే పలువురు అధికారుల జాబితాను రూపొందించి వారిని బదిలీ చేయాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు తానా అంటే పురందేశ్వరి, పవన్ కల్యాణ్ తందానా అన్నారు. పోనీ.. సక్రమంగా ఎన్నికల నిర్వహణకు ప్రతిపక్షాలు సహకరిస్తాయనే ఉద్దేశంతో ఈసీ.. ఒక ఐజీ, ఐదుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్లను బదిలీ చేసింది. తమ దు్రష్పచార కుట్ర ఫలించడంతో రామోజీ ‘ఈడ్చి కొట్టిన ఈసీ’ అంటూ ఈనాడు పత్రికలో బ్యానర్ వార్త రాశారు. ఆ అధికారులను బదిలీ చేయడాన్ని అధికార వైఎస్సార్సీపీ ఏమీ తప్పుపట్ట లేదు. ఈసీ తన విచక్షణాధికారాలతో తీసుకున్న నిర్ణయాన్ని హుందాగా స్వీకరించి గౌరవించింది. కొత్త అధికారులను నియమిస్తే తూలనాడుతారా? బదిలీ చేసిన ఐజీ, ఐదుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్ల స్థానంలో ఈసీ కొత్త అధికారులను నియమించింది. అందుకోసం రాజ్యాంగ నిబంధనలను పక్కాగా పాటించింది. కానీ ఈనాడు రామోజీరావుకు మాత్రం ఆ నిర్ణయం రుచించ లేదు. అధికారులను నియమించే ముందు ఈసీ హైదరాబాద్ శివార్లలో ఉన్న ఫిల్మ్ సిటీలో తాను అక్రమంగా నిర్మించిన తన బంగ్లాకు వచ్చి.. తాను మెట్లు దిగేవరకు వేచి చూసి.. ఎవరెవర్ని ఎస్పీలుగా, కలెక్టర్లుగా నియమించాలని తనను అడిగి.. తాను ఇచ్చిన జాబితాను మహా ప్రసాదంగా తీసుకుని వెళ్లి.. వారికి పోస్టింగులు ఇవ్వాలని రామోజీరావు భావించినట్టు ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అలానే చేసేవారన్నది ఆయన ఉద్దేశం. పాపం.. ఈసీకి ఆ విషయం తెలియదు కదా! రాజ్యాంగ నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకుని గుంటూరు ఐజీ, ఐదుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్లను నియమించింది. అందుకోసం ముందుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)ని ప్రతిపాదనలు పంపమని ఆదేశించింది. ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటిస్తూ సీఎస్ ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున మొత్తం మీద 27 మంది అధికారుల పేర్లను ప్రతిపాదిస్తూ ఈసీకి జాబితా సమర్పించారు. ఆ జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా, సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, అదనపు డీజీ (శాంతి, భద్రతలు) ఎస్.ఎస్. బాగ్చీలతో కూడిన కమిటీ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నివేదించింది. ఆ జాబితాపై కేంద్ర ఎన్నికల కమిషన్ సమగ్రంగా సమీక్షించింది. ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున ప్రతిపాదించిన అధికారుల సీనియారిటీ, పనితీరు, ట్రాక్ రికార్డ్‌ను కూలంకుషంగా పరిశీలించింది. సీఎస్ పంపిన జాబితాకే ఈసీ కట్టుబడాలని లేదు. స్వయం ప్రతిపత్తిగల ఈసీ తన విచక్షణాధికారాలతో నిర్ణయం తీసుకుంటుంది. సీఎస్ తన జాబితాలో పేర్కొన్న ప్యానళ్లలో అధికారుల సమర్థత, నిబద్ధతపై ఈసీకి సందేహాలు ఉంటే వారి పేర్లను తిరస్కరించవచ్చు. కొత్త ప్యానళ్లతో అధికారుల పేర్లను పంపించమని ఆదేశించవచ్చు. తాజాగా గుంటూరు ఐజీ పోస్టు కోసం సీఎస్ పంపిన మూడు పేర్లతో కూడిన ప్యానల్‌పై ఈసీ సంతృప్తి చెందలేదు. దాంతో మరో ముగ్గురు అధికారుల పేర్లతో కొత్త ప్యానల్‌ను సీఎస్ పంపారు. అనంతరం ఆ జాబితా నుంచి కొత్త ఐజీ, ఐదుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్లను ఈసీ నియమించింది. ఈ ప్రక్రియ అంతా పక్కాగా నిబంధన మేరకు సాగింది. రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఈసీ సక్రమంగా వ్యవహరించడంతో రామోజీరావుకు పిచ్చి నాషాళానికి ఎక్కింది. ‘వీళ్లా ఎస్పీలు...’ అంటూ అధికారులను తూలనాడుతూ, అవమానపరుస్తూ, ఈసీ అధికారాలను ప్రశ్నిస్తూ విద్వేషపు విషం చిమ్మారు. కాదనడానికి మీరెవరు రామోజీ? దేశంలో అత్యంత ఉన్నతమైన అధికార వ్యవస్థ అఖిల భారత సర్వీసులు. ఏటా దేశంలో అత్యంత ప్రతిభావంతులైనవారే ఈ సర్వీసులకు ఎంపికవుతారు. అటువంటి అత్యున్నత వ్యవస్థను ఉద్దేశించి ‘వీళ్లా కొత్త ఎస్పీలు’ అని రామోజీరావు తూలనాడారంటే చంద్రబాబుకు మేలు చేయడం కోసం ఆయన ఎంతగా బరితెగించారో తెలుస్తోంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తన ఇంట్లో నౌకర్ల మాదిరిగా.. తన మోచేతి నీళ్లు తాగేవారి మాదిరిగా చిత్రీకరిస్తూ హేళన చేయడం రామోజీ పెత్తందారి పోకడలను నిదర్శనం. ఆ అధికారులేమీ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నియమించిన వారు కాదు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అఖిల భారత సర్వీసులకు ఎంపికైన వారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు నుంచి రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న వారే. టీడీపీ ప్రభుత్వంలో కూడా వివిధ హోదాల్లో నిబద్ధతతో విధులు నిర్వర్తించిన అధికారులేనని అఖిల భారత అధికారుల సంఘం గుర్తు చేస్తోంది. కానీ అప్పుడు తప్పుబట్టని చంద్రబాబు, రామోజీ.. ప్రస్తుతం మాత్రం వారు అధికారులు కాదు.. నౌకర్లు అన్నట్టుగా అవమాన పరచడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం. అసలు ఈసీ నియమించిన ఎస్పీలను కాదని అనడానికి మీరెవరు రామోజీ? ఆనాడు ఎన్టీ రామారావును కుట్రతో కూలదోసిన కుట్రలో చంద్రబాబు భాగస్వామి కాబట్టి.. ఆయనకు మీరు ఇంద్రుడు.. చంద్రుడిగా కనిపిస్తారేమో. అందుకే మీరు వేలాది ఎకరాలు కొల్లగొట్టడానికి ఆయన సహకరించి ఉండొచ్చు. టీడీపీ ప్రభుత్వంలో మీరు రాజ్యాంగేతర శక్తిగా చెలరేగిపోయినా సహించి ఉండొచ్చు. కానీ రాజ్యాంగ బద్ధ సంస్థ ఈసీకి మీరు ఓ సాధారణ వ్యక్తే. మీ ఉడత ఊపులకు బెదిరి పోవాల్సిన అగత్యం ఈసీకి లేదు. ఇక అఖిల భారత సర్వీసులకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మీకు జీ హుజూర్ అని ఎందుకు అంటారు? మిమ్మల్ని చూసి బెంబేలెత్తిపోయి దాసోహం కావాల్సిన గతి పట్టలేదు. రామోజీ.. ఇక చంద్రబాబును మీరు నెత్తిన పెట్టుకుని ఊరేగితే ఊరేగండి. మీరిద్దరూ కలసి ఏ ఏట్లో దూకినా ఎవరికీ పట్టదు. కానీ నిరంకుశుడు, ప్రజాకంటకుడు, అవినీతి చక్రవర్తి అయిన చంద్రబాబును మోయాల్సిన అగ్యతం రాష్ట్ర ప్రజలకు ఏమాత్రం లేదు. ఆ విషయాన్ని కుండబద్దలుగొడుతూ 2019లోనే ఇచ్చిన విస్పష్టమైన తీర్పును 2024 ఎన్నికల్లోనూ పునరావృతం చేయాలని ప్రజలు ఇప్పటికే డిసైడయ్యారు. ఆ నిజాన్ని భరించేందుకు మీరు, మీ చంద్రబాబు సిద్ధంగా ఉండాలని సిద్ధం సభలే స్పష్టం చేస్తున్నాయి. టీడీపీ ఘోర పరాజయాన్ని జీర్ణించుకోగలిగితే సరి. లేకపోతే మీ చంద్రబాబు, మీరు కలసి ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేరేందుకు అంబులెన్స్‌ను సిద్ధం చేసుకోండి. -
ప్రశాంత ఎన్నికల నిర్వహణే లక్ష్యం
సాక్షి, అమరావతి: ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుత, హింసారహిత ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించింది. ఇందుకోసం గట్టి చర్యలు తీసుకోవాలని రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులు, కేంద్ర ఏజెన్సీ అధికారులను ఆదేశించింది. ఓటర్లు నిర్భయంగా స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాలు ఉండాలని సూచించింది. ఎన్నికల తనిఖీల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అన్ని పార్టీలకు వివిధ అంశాల్లో సమాన అవకాశాలు ఇవ్వాలని సూచించింది. సాధారణ ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం ఢిల్లీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్, కమిషనర్లు జ్ఞానేష్‌కుమార్, సుఖ్బీర్సింగ్ సంధు రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు, కేంద్ర ఏజెన్సీ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోక్‌సభతో పాటు వివిధ రాష్ట్రాల శాసనసభలకు జరగనున్న ఎన్నికల నిర్వహణలో భాగస్వాములైనవారందరూ సమన్వయంతో చర్యలు తీసుకోవడంపై దిశానిర్దేశం చేశారు. మద్యం, నగదు, మత్తుపదార్థాలు, ఆయుధాల అక్రమ రవాణా, తాయిలాల పంపిణీపై కఠినమైన నిఘా ఉంచాలని ఆదేశించారు. భద్రతా దళాల తరలింపు, సున్నిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలు, రాష్ట్రాల సరిహద్దుల్లో చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలిచ్చారు. పోలింగ్ రోజున అంతర్రాష్ట్ర సరిహద్దుల్ని మూసేయాలని సూచించారు. నేరస్తులు, సంఘవిద్రోహ శక్తులపై నిఘా ఉంచాలని చెప్పారు. లైసెన్స్డ్ ఆయుధాలను సకాలంలో డిపాజిట్ చేయించుకోవాలని, నాన్‌బెయిలబుల్ వారెంట్లను వెంటనే అమలు చేయాలని సూచించారు. ముప్పు ఎదుర్కొంటున్న నేతలు, అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని నిర్దేశించారు. వ్యయ పర్యవేక్షణ కట్టుదిట్టంగా ఉండాలని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ మాట్లాడుతూ ఎక్కడా రీ పోలింగ్‌కు అవకాశం లేని విధంగా ఎన్నికలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. పోలింగ్‌కు 48 గంటల ముందు (సైలెంట్ పీరియడ్) ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బు, మద్యం వంటి తాయిలాల పంపిణీకి ప్రయత్నాలు జరుగుతాయని, వాటిని సమర్థంగా అడ్డుకోవాలని చెప్పారు. కట్టుదిట్టంగా కోడ్ అమలు: సీఎస్ జవహర్‌రెడ్డి ఈ వీడియో సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుండి ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటివరకు రూ.258 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, ఇతర విలువైన వస్తువులను స్వా«దీనం చేసుకున్నట్టు వివరించారు. రాష్ట్ర సరిహద్దుల్లో 150 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో 132 ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులు, 632 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు. పటిష్ట భద్రత: డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ సరిహద్దు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి మావోయిస్టుల సమస్య ఉండే 91 పోలింగ్ కేంద్రాలను గుర్తించి కట్టుదిట్టమైన భద్రతాచర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇటీవల మహారాష్ట్రకు పంపిన 10 కంపెనీల పోలీసు బలగాలను తిప్పి పంపడమేగాక అదనపు బలగాలను పంపాలని ఆయన కోరారు. ఏపీసీఈవో ముఖేశ్‌కుమార్ మీనా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు నీరబ్‌కుమార్‌ప్రసాద్, రజత్‌భార్గవ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్‌కుమార్ గుప్త, అదనపు డీజీపీ బాగ్చి, పన్నుల చీఫ్ కమిషనర్ గిరిజాశంకర్, ఎక్సైజ్ కమిషనర్ వివేక్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
దిగ్విజయంగా పింఛన్ల పంపిణీ
సాక్షి, అమరావతి: సంకల్పం ఉంటే ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా లక్ష్యం నెరవేరుతుంది. ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం. సంక్షేమ పథకాల అమలులో చంద్రబాబు అండ్ కో ఎన్ని అడ్డంకులు సృష్టించినా, దిగ్విజయంగా ముందుకు సాగుతున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. పింఛన్ల విషయంలోనూ పచ్చ గ్యాంగు కుట్రలకు ఏమాత్రం వెరవకుండా అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతువులకు ఠంఛన్‌గా పింఛన్లు అందజేసింది. ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపి చంద్రబాబు అండ్ కో వలంటీర్లను పింఛన్ల పంపిణీ నుంచి తప్పించి ఆటంకాలు సృష్టించినా.. ప్రభుత్వం అవ్వాతాతలకు ఠంఛన్‌గా పింఛన్ డబ్బులను అందజేసింది. బుధవారం మధ్యాహ్నం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిణీని ప్రారంభించి, కేవలం ఆరు గంటల్లోనే 26,00,064 మంది లబ్దిదారులకు రూ. 785.25 కోట్లు అందజేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక గత నాలుగున్నరేళ్లకు పైగా రాష్ట్రంలో వలంటీర్ల ఆధ్వర్యంలో ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంఛన్‌గా అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతువులకు ఇంటి వద్దే పింఛన్లు అందజేస్తున్నారు. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడు, రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమే‹Ùకుమార్ నేతృత్వంలోని సిటిజన్ ఫర్ డెమొక్రసీ సంస్థ చేసిన ఫిర్యాదుల మేరకు మార్చి 30న కేంద్ర ఎన్నికల సంఘం ఇ చ్చిన ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం వలంటీర్లను ఈ కార్యక్రమం నుంచి పక్కన పెట్టాల్సి వచ్చింది. దీంతో ప్రశాంతంగా సాగుతున్న పింఛన్ల పంపిణీలో హఠాత్తుగా గందరగోళం నెలకొంది. అయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల్లోనే ప్రత్యామ్నాయ పద్ధతులను రూపొందించింది. మంగళవారం రాత్రికే రాష్ట్రంలోని అన్ని సచివాలయాలకు వాటి పరిధిలోని లబ్దిదారుల సంఖ్యకు అనుగుణంగా పింఛన్ల నిధులను విడుదల చేసినట్లు అధికారులు చెప్పారు. సచివాలయాల సిబ్బంది బుధవారం బ్యాంకులు తెరిచిన తర్వాత డబ్బులు డ్రా చేసి, మధ్యాహ్నం 12.30 నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభించారు. రాత్రి ఏడు గంటల వరకు పింఛన్ల పంపిణీ కొనసాగిందని అధికారులు తెలిపారు. 39.58 శాతం మేర పంపిణీ పూర్తి ఏప్రిల్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 66 లక్షల మందికి పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం రూ. 1,951.69 కోట్లు విడుదల చేయగా, బుధవారం రాత్రి వరకు 26,00,064 మందికి రూ. 785.25 కోట్లను సచివాలయాల సిబ్బంది పంపిణీ చేశారు. మొత్తం 39.58 శాతం మందికి పింఛన్లు అందాయి. మరో మూడు రోజులు సచివాలయాల వద్ద ఈ పంపిణీ కొనసాగుతుంది. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యాల కారణంగా పింఛన్లు పొందుతున్న వారు, మంచం లేదా వీల్ చైర్‌కు పరిమితమైన వారికి తప్పనిసరిగా వారి ఇంటి వద్దనే పంపిణీ చేసేలా అన్ని ఏర్పాట్లు చేసినట్టు అధికారులు చెప్పారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బుధవారమే 54.82 శాతం పింఛన్లు పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు ఆ జిల్లాలో 3,16,492 మంది లబ్ధిదారులు ఉండగా, బుధవారం రాత్రి వరకు 1,73,485 మందికి పంపిణీ పూర్తయింది. ఆ తర్వాత విశాఖపట్నం జిల్లాలోనూ 52.13 శాతం, వైఎస్సార్ కడప జిల్లాలో 50.42 శాతం, ఏలూరు జిల్లాలో 48.88 శాతం, ప్రకాశం జిల్లాలో 46.60 శాతం, తిరుపతి జిల్లాలో 46.26 శాతం చొప్పన పంపిణీ పూర్తయినట్టు అ«ధికారులు వివరించారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఎక్కువ భాగం ఆఫ్‌లైన్ విధానంలో పంపిణీ జరుగుతున్నందున, ఆ వివరాలు అందాల్సి ఉందని అధికారులు వివరించారు. నేడు ఉదయం 7 గంటల నుంచే పింఛన్ల పంపిణీ వేసవి, వేడి గాలుల నేపథ్యంలో నేటి (గురువారం) నుంచి ఉదయం 7 గంటల నుంచే సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ ప్రారంభమవుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉన్న వృద్ధులు, దివ్యాంగులు వంటి వారికి తప్పనిసరిగా ఇంటి వద్దే పింఛను అందించేలా నిబంధనలు సవరించినట్లు చెప్పారు. ఈ విభాగాల పింఛన్‌దారులు సచివాలయాలకు రానవసరం లేదని, వారికి ఇంటి వద్దే పింఛను ఇస్తారని స్పష్టం చేశారు. ఈ మేరకు కలెక్టర్లందరికీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. బంధం తెంచిన బాబుబుధవారం మధ్యాహ్నం తర్వాత పింఛన్ల పంపిణీ ప్రారంభమవుతుందని కొత్త మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. వలంటీర్లు ఉండి ఉంటే ఈ సమాచారం వెంటనే లబ్ధిదారులకు తెలిసి ఉండేది. వలంటీర్లు లేకపోవడంతో వారికి సరైన సమాచారం అందలేదు. తాజా మార్గదర్శకాల గురించి ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసినా, ఎక్కువగా ఇంటికే పరిమితమయ్యే అవ్వాతాతలకు స్పష్టంగా తెలియలేదు. దీంతో లబ్దిదారులు బుధవారం నుంచే గ్రామ, వార్డు సచివాలయాల వద్దకు చేరుకోవడంతో కొంత గందరగోళం నెలకొందని అధికారులు చెప్పారు. 2019 ఆగస్టులో రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థ ఏర్పడిన తర్వాత.. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల వివరాలను నేరుగా వలంటీర్ల ద్వారా సంబంధిత లబ్దిదారులకు సకాలంలో, స్పష్టంగా అందుతుండేదని అధికారులు చెప్పారు. లబ్దిదారులకు ఏదైనా సహకారం అవసరమైనా వలంటీర్లు అందించేవారని తెలిపారు. హఠాత్తుగా వలంటీర్లను పింఛన్ల పంపిణీ సహా అన్ని ప్రభుత్వ కార్యక్రమాల నుంచి తప్పించడంతో ఇప్పుడు వారి ద్వారా సమాచారం తెలిసే పరిస్థితి కూడా లేకుండా పోయిందని, ఆ కారణంగా పింఛన్ల పంపిణీ బుధవారం మధ్యాహ్నం నుంచి మొదలవుతుందన్న ప్రభుత్వ సమాచారం కూడా లబ్దిదారులకు తెలియలేదని అధికారులు వివరించారు. నాలుగున్నరేళ్లకు పైగా ప్రభుత్వానికీ ప్రజలకు మధ్య వారధిగా ఉన్న వలంటీర్ల బంధాన్ని చంద్రబాబు అండ్ కో తెంచడంతో పేదలకు ఈ ఇబ్బందులు వచ్చాయని రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి. -
‘ఫాం–26’పై వివరాలివ్వండి
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సమ ర్పించే ఆస్తులు, కేసులకు సంబంధించిన అఫిడవిట్ (ఫాం–26)ను తెలుగులో కూడా అందుబాటులో ఉంచే వ్యవహారంలో పూర్తివివరాలను తమ ముందుంచాలని హైకోర్టు బుధవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మే మొదటి వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ఫాం–26ను తెలుగులో కూడా అందుబాటులో ఉంచేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ కృష్ణాజిల్లా మాచవరానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు, తెలుగు భాషోద్యమ సమాఖ్య గౌరవాధ్యక్షుడు డాక్టర్ సామల రమేశ్ బాబు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే ధర్మాసనం విచారించింది. పిటిషనర్ న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల గురించి తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు సైతం స్పష్టమైన తీర్పునిచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ఫాం–26 ఇంగ్లి‹Ùలో మాత్రమే అందుబాటులో ఉందన్నారు. రాష్ట్రంలో 83 శాతం మందికి తెలుగు మాత్రమే తెలుసని, అందువల్ల ఫాం–26ను తెలుగులో కూడా అందుబాటులో ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో పూర్తి వివరాలు తెలుసుకుని తమ ముందుంచాలని ఎన్నికల సంఘం న్యాయవాది శివదర్శన్ను ధర్మాసనం ఆదేశించింది. ఓటర్లు చాలా తెలివిగలవాళ్లని, స్థానిక అభ్యర్థుల గురించి వారికి అన్నీ తెలుసని ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
రూల్‌బుక్‌ను మార్చి రాయాలా?!
ఎన్ ఫోర్స్మెంట్ ఏజెన్సీలు కనివిని ఎరుగని విధంగా చేపడుతున్న చట్టపరమైన చర్యల పరంపరపై రచ్చ నడుస్తోంది. ఈ చర్యలు ఏమైనా ‘ఆరోగ్యకర మైన ప్రజాస్వామ్య పద్ధతి’ ఉల్లంఘనకు దారితీస్తున్నాయా అనే విషయాన్ని ఎన్నికల సంఘం నిర్ధారించవలసిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రజాస్వామ్య ప్రక్రియల సమగ్రతను, నైతికతను కాపాడుకోవటానికి ‘అందరికీ సమానావకాశాలు’ (ఎల్.పి.ఎఫ్.) అనే భావన కీలకం అవుతోంది. అలాంటి ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల తరుణంలో ఎల్.పి.ఎఫ్, ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ – ఎం.సి.సి.) అమలుపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించి వివిధ అంశాలను విశ్లేషించడం అవసరమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికలను ప్రకటించిన రోజున భారత ఎన్నికల సంఘం, మీడియాకు వివరాలు అందిస్తూ తెలిపిన మంచి అంశాలలో ఒకటి ఏమిటంటే, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్... ఆటలో అందరికీ సమానావకాశాలు (ఎల్పీఎఫ్)కి ఈసీ ఇస్తున్న ప్రాధాన్యం. అన్ని రాజకీయ పార్టీలకూ ప్రవర్తనా నియమావళిని ఈసీ పంపిందనీ, దానిని ఆ యా పార్టీలు తమ స్టార్ క్యాంపెయినర్ల దృష్టికి తీసుకెళ్లాలనీ అభ్యర్థించినట్లు కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈసీ) రాజీవ్ కుమార్ తెలిపారు. ఎల్పీఎఫ్కు భంగం కలిగించే చర్యలకు సంబంధించిన ఫిర్యాదులపై నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం జరుగుతుందన్నారు. ఎల్పీఎఫ్ అనేది క్రీడలు లేదా యుద్ధాల విషయంలో వర్తించని వ్యక్తీకరణ. సమవుజ్జీలైన రెండు జట్లు మాత్రమే ఒకదానితో ఒకటి ఆడాలి అనేది ఉండదు. క్రికెట్లో, స్వదేశీ జట్లు పిచ్‌ను తమకు అను కూలంగా మార్చుకుంటాయి, అయితే ఈ ‘అన్యాయమైన అభ్యాసం’ మన్నించబడింది ఎందుకంటే పాల్గొనే జట్లు తమ వంతు కోసం ఎదురు చూస్తుంటాయి. అదేవిధంగా, ఒక శక్తిమంతమైన సైన్యం పోరాటంలో ఒక చిన్న ప్రతిపక్షాన్ని దెబ్బతీస్తే దాన్ని అన్యాయంగా పరిగణించరు. ప్రేమలో, యుద్ధంలో అంతా న్యాయమైనదే అంటారు. ఎల్పీఎఫ్ అనేది స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికలకు ఒక పవిత్రమైన సూత్రం. ప్రజాస్వామ్యంలో ఎన్నికలనేవి యుద్ధం లేదా ప్రేమ పోటీ కానే కాదు. వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఒకరితో ఒకరు పోటీపడి ప్రతినిధుల సభలో ప్రాతినిధ్యం వహించడానికి ఓటర్ల ఆదేశాన్ని పొందడం ప్రజాస్వామ్యంలో కీలకమైన సంఘటన. ఓటు అనేది విశ్వాసంపై, వాస్తవాలపై ఆధారపడిన సామాజిక ఒప్పందం. ఈ పోటీ నిష్పక్షపాతంగా ఉండాలంటే, పోటీదారులు సమానంగా ఉండకపోవచ్చని అంగీకరించినప్పటికీ, ఎన్నికల సమయంలో ఎల్పీఎఫ్ లభ్యత ఒక తప్పనిసరి షరతుగా పరిగణించబడుతుంది. స్వాభావిక అసమానతను ఆటలో భాగంగా గుర్తిస్తే, ఎన్నికల సమ యంలో వారు ఓటర్లను తమకు అనుకూలంగా ప్రభావితం చేయడా నికి ప్రయత్నించినప్పుడు ఎల్పీఎఫ్ ఉండేలా చూసుకోవడమనేది ప్రక్రియ నియంత్రణాధికారి బాధ్యత. ఎల్‌పీఎఫ్‌కి చెందిన ఈ సూత్రాన్ని నిశితంగా పరిశీలిస్తే, ప్రతిపక్ష అభ్యర్థులతో పోలిస్తే అధికార పక్షం పొందే ప్రయోజనానికి ‘సమం చేయడం’ నిర్దిష్టమైనదని చూపిస్తుంది. క్రీడలలో బలహీనమైన జట్టు బలమైన వారితో పోటీపడవచ్చు. వాస్తవానికి, టెన్నిస్ వంటి ఆటలలో పోటీ ప్రారంభ రౌండ్లలో, బలహీనమైన అన్ సీడెడ్ ఆటగాళ్లు ర్యాంకింగ్ పట్టికలను శాసించే ఆటగాళ్లతో తలపడతారు. అత్యున్న తమైన నైపుణ్యాలు, పరాక్రమాలు కలిగిన వారి చేతుల్లో ఓడిపోయి నప్పుడు కన్నీళ్లు కూడా రావు. ఎందుకంటే క్రీడలు తాము ప్రజాస్వా మికమని చెప్పుకోలేవు. అయితే నిజమైన ప్రజాస్వామ్యంలో ఎన్నికలు మాత్రం అందుకు భిన్నమైన ఆట అనే చెప్పాలి. సాధారణ సమయాల్లో సాధారణ పౌర ప్రవర్తనను నియంత్రించడానికి సాధారణ చట్టాలు ఉన్నప్పటికీ, రాజకీయ పార్టీల వారు, అభ్యర్థులు ఎన్నికల సమయంలో ఒక నిర్దిష్ట వైఖరిని పాటించాలని భావిస్తున్నారు, దీనిని వారు ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలోనే స్వచ్ఛందంగా అంగీకరించారు. అయితే సూచించిన నిబంధనలన్నీ నిర్దిష్టంగా చట్టంలో లేవు. కొన్నిసార్లు ఇది మంచి ప్రజా ప్రవర్తన పట్ల వారి నిబద్ధతకు గుర్తు. ఈసీ పాటించే సమతూకం విధానానికి చెందిన ప్రదర్శన. ఎన్నికల సమయంలో ఈసీ అమలు చేయాలని భావిస్తున్న ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్)కి ఆవిర్భావం ఇది. ఎంసీసీని పరిశీలిస్తే కోడ్ పరిధిలో నలుగురు ప్రధాన ఆటగాళ్లు ఉన్నారని అర్థమవుతుంది. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, అధికార పార్టీ, బ్యూరోక్రసీ. చివరి రెండూ పాలక వ్యవస్థలో భాగమే కానీ వాటికి కూడా విడిగా కోడ్ వర్తిస్తుంది. కోడ్‌లో ఎక్కువ భాగం ఇప్పటికే ఉన్న విభేదాలను తీవ్రతరం చేయడం, లేదా పరస్పర ద్వేషాన్ని పాదుకొల్పటం, లేదా వివిధ కులాలు, వర్గాల మధ్య ఉద్రిక్తతలను సృష్టించటం, లేదా ధ్రువీకరించలేని ఆరోపణలు చేయడం, చట్టంలో పొందుపరచబడిన ఉల్లంఘనల చుట్టూ ఉంటుంది. ఓట్లను పొందడం కోసం కులం లేదా మతపరమైన భావాలను ప్రేరేపించరాదనీ, పార్టీలు, అభ్యర్థులు అవినీతి విధానాలను ఆశ్రయించరాదనీ, పార్టీలు, వారి కార్యకర్తలు ప్రత్యర్థి పార్టీల కార్యకలాపాలకు అంతరాయం కలిగించరాదనీ కోడ్ నిర్దేశిస్తుంది. ప్రచార సభలు, ఊరేగింపులు, పోలింగ్ బూత్‌లు, మేనిఫెస్టోలపై కూడా ఇలాంటి సెక్షన్లు ఉన్నాయి. అయితే, గమనించదగ్గ విషయం ఏమిటంటే, ‘కేంద్రంలో,రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ’ కోసం ఎంసీసీ ఒక ప్రత్యేక విభా గాన్ని కేటాయించింది. ‘అధికారిక పదవిని ఉపయోగించినట్లు ఎటు వంటి ఫిర్యాదు రాకుండా, ఎటువంటì ఫిర్యాదుకూ కారణం చూపే అవకాశం లేకుండా చూసుకోవా’లని కోడ్ ఆజ్ఞాపించింది. కోడ్ పరిధిలోకి వచ్చిన దుర్వినియోగమంటే... అతిథి గృహాలు, రవాణా వంటి ప్రభుత్వ సౌకర్యాల వినియోగానికి సంబంధించినవి. అలాగే ప్రకటనల్ని జారీ చేయడానికి లేదా కొత్త ఆంక్షలను మంజూరు చేయ డానికి ప్రభుత్వ నిధులను వినియోగించడం, అందుకు అధికారాన్ని ఉపయోగించడం కూడా! ఎంసీసీ వీటిని దాటి వెళ్లదు. రాష్ట్ర యంత్రాంగం, న్యాయ వ్యవస్థ సాధారణ పని తీరు ప్రస్తుత ఎంసీసీ ద్వారా ఏ విధంగానూ పరిమితమై పోదు. న్యాయస్థాన విచా రణల వంటి న్యాయ ప్రక్రియలో ఈసీ జోక్యం చేసుకోవడం, లేదా చట్టాన్ని అమలు చేసే సంస్థల సాధారణ విచారణ ఈసీ ఆదేశాలకు లోబడి ఉండాలా వద్దా అనేది చర్చనీయాంశం. బహుశా, ప్రారంభంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముసాయిదాను రూపొందించినప్పుడు ప్రభుత్వ ఎన్ఫోర్స్మెంట్ సంస్థల అధికార దుర్వినియోగం అనేది ఊహకైనా రాలేదు. అయితే, ఎంసీసీ అనేది మానవ ప్రవర్తన లాగా కాలగతిలో మారుతూ వచ్చే పురోగమన పత్రం. 2009లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో, ఈసీ 2009 మార్చి 19 నాటి తన లేఖను పరిశీలించి,ఎంసీసీ వర్తింపు చట్టబద్ధమైన స్వయంప్రతిపత్తి గల ఎలక్ట్రిసిటీ రెగ్యు లేటరీ కమిషన్ ల వంటి కమిషన్ లకు విస్తరించిందని స్పష్టం చేసింది. బడ్జెట్ సమర్పణపై ఎంసీసీ వర్తింపు గురించి ఆ నాటి ఈసీ లేఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం నెలకొన్న వాతావరణం, ప్రభుత్వ సంస్థల జోరు ఫలితంగా అన్ని పక్షాలకూ సమాన అవకాశాలు లేని స్థితి చూశాక ఎన్నికల సంఘం రంగంలోకి దిగాల్సిందేనేమో! తాజా ఫిర్యాదులకు దారితీసిన పరిస్థితులను పరిశీలించాలేమో!! గతంలో ఇలాంటి పరిస్థి తుల్లోనే 2019లో ఎన్నికల సంఘం రెవెన్యూ డిపార్ట్మెంట్కు ఒక సలహాను జారీ చేసింది. ఇప్పుడు మళ్ళీ ఆ విధంగానే ఎన్ ఫోర్స్మెంట్ ఏజెన్సీల అపూర్వమైన చర్యల పరంపర ఏదైనా ‘ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య అభ్యాసాన్ని’ ఉల్లంఘిస్తున్నదేమో ఈసీ నిర్ధారించాలి. ఇప్పుడు ఎన్నికల సంఘానికి ఉన్న ప్రధానమైన సందిగ్ధత ఏమిటంటే... ‘స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు’ నిర్వహించే తన ఏకైక బాధ్యతకు కట్టుబడి రూల్ బుక్‌ను అనుసరించాలా, లేక ‘స్క్రిప్టు’ను తిరిగి రాయాలా అనేది! ‘స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్ని కలు’ అనే పదం రాజ్యాంగంలో పేర్కొన లేదు కానీ ఈసీ ‘పర్యవేక్షణ, దిశానిర్దేశం’ అనే మాటలోనే ఆ స్ఫూర్తి నిండి ఉంటుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అనేది కూడా మనం సాధారణంగా అర్థం చేసుకునే దానికంటే చాలా పెద్దది. సంపూర్ణంగా గ్రహించి, అమలు చేయాల్సిన న్యాయమైన స్ఫూర్తి అందులో ఉంటుంది. అశోక్ లావాసా వ్యాసకర్త మాజీ ఎన్నికల కమిషనర్ -
పేదలపై పంతం
సాక్షి, అమరావతి: చరిత్రను సమాజం ఎన్నటికీ మరువదు! మానవత్వం లేని మనిషిని నాయకుడిగా ఎన్నడూ అంగీకరించదు! దేశంలోనే తొలిసారిగా సంక్షేమ ఫలాలను ఇంటింటికీ చేరవేసి ప్రజాభిమానం పొందిన వలంటీర్ వ్యవస్థపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అక్కసు అంతాఇంతా కాదు. ఆవిర్భావం నుంచి దీనిపై చంద్రబాబు అండ్ కో విషం చిమ్ముతూనే ఉంది. ఇక జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ వలంటీర్లను సంఘ విద్రోహ శక్తులుగా, మహిళలను అక్రమ రవాణా చేసే కిరాతకులుగా చిత్రీకరించి ఆ వ్యవస్థను విచ్ఛినం చేసే కుట్రకు తెరదీశారు. ప్రభుత్వానికి మంచి పేరు రావడంతో వలంటీర్లను టార్గెట్ చేశారు. ఈ క్రమంలో ఎన్నికల వేళ వలంటీర్ల సేవలు నిలిచిపోయేలా చంద్రబాబు కుట్ర రాజకీయాలకు తెగబడ్డారు. తన సన్నిహితుడు, మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ సంస్థ ద్వారా వలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి పదేపదే ఫిర్యాదు చేయించారు. వలంటీర్లను విధుల నుంచి తప్పించడంతో నాలుగున్నరేళ్లకుపైగా సజావుగా సాగిన ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఆగిపోయింది. దీంతో లక్షల మంది అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతు అక్కచెల్లెమ్మలు మండుటెండల్లో రోడ్లపై నిలబడాల్సి వచ్చింది. ఈ ఉదంతంతో పేదలంటే చంద్రబాబుకు ఎంత వ్యతిరేకత ఉందో మరోసారి స్పష్టమైంది. కోవిడ్ సంక్షోభంలోనూ ఆగని పింఛన్ల పంపిణీ చంద్రబాబు కారణంగా నిలిచిపోవడం తీవ్ర ప్రజా వ్యతిరేకతకు దారితీస్తోంది. దీంతో ఉలిక్కిపడ్డ చంద్రబాబు తన రివర్స్ డ్రామా మొదలెట్టారు. వలంటీర్ల సేవలను తానే అడ్డుకుని.. మళ్లీ ఇంటింటికీ పింఛన్లు పంచాలంటూ ఎన్నికల కమిషన్‌కు, ప్రభుత్వానికి దొంగ లేఖలు రాస్తూ డ్రామాను రక్తి కట్టిస్తున్నారు. యూటర్న్ తీసుకోవడంలో చంద్రబాబుకు ఏమాత్రం మొహమాటాలు ఉండవని అనేకసార్లు రుజువైంది. వాటిల్లో కొన్ని మచ్చుతునకలు ఇవే..! ♦ 2019 సెప్టెంబర్ 27: టీడీపీ కేంద్ర కార్యాలయం వేదికగా చంద్రబాబు వలంటీర్లను అత్యంత దారుణంగా కించపరిస్తూ వ్యాఖ్యలు చేశారు. ‘వలంటీర్లతో ఏంటి లాభం? 5 వేల రూపాయలతో ఏం ఉద్యోగం అది..? గోనె సంచులు మోసే ఉద్యోగమా? బియ్యం సంచులు మోస్తూ ఎప్పుడంటే అప్పుడు ఇళ్లకు వెళ్లడం డిస్ట్రబ్ చేయడం. డే టైం మగవాళ్లు ఉండరు.. వీళ్లు (వలంటీర్లు)పోయి తలుపులు కొట్టడం... ఎంత నీచం...’ అంటూ వలంటీర్లపై తన అక్కసు వెళ్లగక్కారు. ♦ 2021, అక్టోబర్ 30న కుప్పం రోడ్‌షోలోనూ చంద్రబాబు వలంటీర్లనే టార్గెట్ చేశారు. ‘ఊర్లలో వలంటీర్లు పెద్ద న్యూసెన్స్ అయ్యారు. బ్రిటీష్ వాళ్లకు ఏజెంట్లులా వీరు ప్రభుత్వానికి ఏజెంట్లుగా మారారు. ప్రజలను బెదిరిస్తూ అవినీతికి పాల్పడుతున్నారు. రేపు ఎన్నికలకు కూడా వీరే వస్తారు’ అంటూ వలంటీర్ల సేవలను నిలిపివేసేలా కుట్రలకు అప్పుడే బీజం వేశారు. ఉత్తమ వలంటీర్లను గుర్తించి ప్రభుత్వం ప్రోత్సహిస్తే కూడా ఓర్వలేకపోయారు. 2022 ఏప్రిల్ 07న ‘వలంటీర్లు సాధించింది ఏంటి? సన్మానం పేరుతో కోట్లు తగలేస్తున్నారు’ అంటూ పెత్తందారీ కుళ్లును వెళ్లగక్కారు. ♦ టీడీపీ మహిళా నాయకులు వలంటీర్లను ఇష్టానుసారంగా తూలనాడారు. 2023, జూలై 14న టీడీపీ మహిళా సదస్సులో ‘వలంటీర్లు కొంపలు కూల్చే పనులు చేస్తున్నారు. ఇంటి లోపలికి వస్తున్నారు. వీళ్లు ఎవరండీ ఇళ్లలోకి రావడానికి? వచ్చి మీ వివరాలు కనుక్కొంటున్నారు. మీ ఆయనకు ఏమైనా వేరే సంబంధాలు ఉన్నాయా? ఏమైనా అనుమానం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. అంటే కొంపల్ని కూల్చే మార్గం ఇది. మగవాళ్ల దగ్గరకు వెళ్లి మీ ఆడబిడ్డలు ఏమైనా బయట తిరుగుతున్నారా? అని అడుగుతున్నారు. చెప్పుతో కొట్టేవారు లేకపోతే సరి. ఈ వివరాలతో వలంటీర్ల కేంటి సంబంధం’ అంటూ నోటికొచ్చిన అబద్ధాలను ఆపాదించి పైశాచిక ఆనందాన్ని పొందారు. సేవకులపై ఉన్మాదం.. వలంటీర్లను అవమానించడంతో పాటు వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అన్నీఇన్నీ కావు. 2023, అక్టోబర్ 7న వారాహి యాత్రలో భాగంగా ఏలూరు పాత బస్టాండ్ వద్ద నిర్వహించిన రోడ్ షోలో మహిళల అదృశ్యానికి వలంటీర్లే కారణం అంటూ హేయంగా మాట్లాడారు. ‘ వలంటీర్లు ఒంటరి అతివల సమాచారాన్ని సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారు. ప్రతి గ్రామంలో వలంటీర్లు కుటుంబంలో ఎంత మంది ఉన్నారు? వారిలో మహిళలు ఎందరు? వితంతువులున్నారా? అని ఆరా తీస్తున్నారు. మహిళల అదృశ్యం వెనుక వలంటీర్ల హస్తం ఉంది’ అంటూ ఉన్మాదాన్ని ప్రదర్శించారు. ♦ 2023 జూలై 11న ఏలూరులో పార్టీ నాయకులతో సమావేశంలోనూ వలంటీర్లే అజెండాగా పవన్ బురద రాజకీయం చేశారు. ‘ప్రజాసేవ కోసం పంచాయతీరాజ్, రెవెన్యూతో పాటు కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, తహసీల్దార్లు ఉన్నప్పటికీ.. వలంటీర్లు అనే మరో సమాంతర వ్యవస్థ ఎందుకు? ప్రజలను నియంత్రించడం.. ఎవరైనా ఎదురు తిరిగితే భయపెట్టడానికి, సోషల్ మీడియాలో టీడీపీ వాళ్లు విమర్శిస్తే ఇబ్బందులు పెట్టడానికి వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. జనసైనికులు, నాయకులు వలంటీర్లపై ఓకన్నేసి ఉంచండి. ఆడబిడ్డలున్న తల్లిదండ్రులు, ఒంటరి, వితంతువులు అప్రమత్తంగా ఉండండి. వలంటీర్లకు సమాచారం ఇవ్వకండి’ అని వలంటీర్ వ్యవస్థను ఉగ్రవాద చర్యలతో పోల్చారు. ♦ సినిమా డైలాగులతో రాజకీయ ప్రసంగాలు చేసే పవన్‌కళ్యాణ్ వలంటీర్ల నడుం విరగొట్టి తీరుతాం అంటూ 2023, జూలై 12న వారాహి రెండో విడత యాత్రలో ఊగిపోయారు. ‘వలంటీర్ వ్యవస్థ లేనప్పుడు దేశం ఆగిందా? ఇప్పుడు ప్రజల వ్యక్తిగత సమాచారమంతా వారి వద్దే ఉంది. ఓ ప్రభుత్వ ఉద్యోగి వల్ల సమాచారం దుర్వినియోగమైతే నిలదీయవచ్చు. వలంటీర్ వ్యవస్థ తొండ ముదిరి ఊసరవెల్లిలా మారింది. బ్రిటీష్ వాళ్లు మన దేశాన్ని ఆక్రమిస్తే ఆరు కోట్ల మందిని వలంటీర్లు నియంత్రిస్తున్నారు. సేవ చేయడానికి వచ్చిన వలంటీర్లకు దాడి చేసే హక్కు ఉందా? వలంటీర్లు బాలికలపై అఘాయిత్యాలు చేస్తున్నారు’ అంటూ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. అదేరోజు తన ట్విట్టర్లోనూ ‘వలంటీర్లు జగన్ అధికారిక పెగాసస్. ప్రభుత్వ నిధులను వలంటీర్ల కోసం దుబారాగా ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వ యాప్‌లో ప్రజల సమాచారాన్ని తీసుకుని వారి భద్రతకు భంగం కలిగిస్తున్నారు’ అంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. బెదిరించి.. నాలుక మడత 2021 మార్చి 29న తిరుపతిలో టీడీపీ ఆవిర్భావ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు వలంటీర్ల కథ చూస్తామని బెదిరింపులకు దిగారు. ‘వలంటీర్ల వ్యవస్థ దండగ. వలంటీర్ల లోపాలను గుర్తించి టీడీపీ కార్యకర్తలు సమాచారం ఇస్తే వారి కథ చూసుకుంటాం. రూ.10వేల పారితోషికం ఇస్తాం’ అంటూ ప్రకటించారు. ఎల్లో మీడియాలో వలంటీర్లను దుర్మార్గులుగా చిత్రీకరిస్తూ కథనాలు వండి వర్చేశారు. కానీ ప్రజల్లో వలంటీర్లపై, ప్రభుత్వంపై బలంగా నాటుకుపోయిన నమ్మకాన్ని చూసి చంద్రబాబు అండ్ కో కంగుతిన్నారు. వలంటీర్ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ ఉంటే.. ఆ ఇంటి సభ్యుల్లోని వ్యక్తే వలంటీర్‌గా సేవలందిస్తున్నారు. నిత్యం తమ కళ్లముందు తిరిగే తమ బిడ్డలనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు నోటికొచ్చినట్టు తూలనాడుతుంటే ప్రజలు ఆగ్రహంతో రగిలిపోయారు. ఇది గ్రహించిన బాబు అండ్‌కో తమకు రాజకీయంగా పుట్టగతులు ఉండవని భావించి వలంటీర్ల సేవలు గొప్పవంటూ కొత్త పల్లవి అందుకున్నారు. వలంటీర్ ఉద్యోగం దండగ అన్న చంద్రబాబే ఇప్పుడు మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామంటూ కపట హామీలు గుప్పిస్తున్నారు. వలంటీర్ వ్యవస్థ ఎందుకని ప్రశ్నించిన పవన్‌కళ్యాణ్ వారి పొట్ట కొట్టాలని అనుకోవట్లేదని నాలిక మడతేశారు. ఇప్పుడు గుర్తొచ్చిందా? చంద్రబాబు ఒక్క వలంటీర్ వ్యవస్థపైనే కాదు.. దానికి కీలకమైన, గ్రామ స్వరాజ్యానికి ప్రతీకగా నిలిచిన సచివాలయ వ్యవస్థపైనా ముప్పేట దాడి చేశారు. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగాలు ఊడతాయంటూ గద్దించారు. అదే చంద్రబాబు ఇప్పుడు వలంటీర్లకు బదులు.. సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయాలంటూ ఉచిత సలహాలు ఇవ్వడం గమనార్హం. స్వత్రంత్ర భారతంలో ఇంటింటికీ ప్రభుత్వ సేవలను తీసుకెళ్లిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుంది. పంచాయ తీరాజ్, రెవెన్యూ, కలెక్టర్లు వ్యవస్థలు దశాబ్దాలుగా పని చేస్తున్నా చిట్టచివరి వ్యక్తికి లబ్ధి చేకూర్చడంలో తీవ్ర జాప్యం జరిగేది. ఇది గమనించిన సీఎం జగన్ సచివాలయ వ్యవస్థతో పాటు అనుబంధంగా వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టారు. దాదాపు నాలుగు లక్షల మంది యువతకు సొంత గ్రామాల్లోనే ప్రభుత్వ సేవకులుగా ఉద్యోగ, ఉపాధి అవకాశం కల్పించారు. అందుకే సమర్థవంతంగా, అవినీతికి తావులేకుండా పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఆ దుస్థితిని తొలగించి.. వలంటీర్ వ్యవస్థ రాకమునుపు వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు కాళ్లు అరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి అరకొర పింఛన్ తెచ్చుకునేవారు. ప్రభుత్వ పథకాలు వాల్‌పోస్టర్ల రూపంలో గోడలపై కనిపించేవి కానీ అర్హులైన లబ్ధిదారులకు అందేవి కాదు. నాడు ప్రభుత్వ సాయం అందాలంటే జన్మభూమి కమిటీలను దేహీ అనాల్సిన దుస్థితి. సచివాలయాలు, వలంటీర్లు వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాలే పేదల ఇళ్లకు నడుచుకుంటూ వెళ్తున్నాయి. అలాంటిది నాలుగున్నరేళ్ల తర్వాత వలంటీర్ల సేవలు నిలిచిపోవడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. మళ్లీ మండుటెండల్లో రోడ్లపై నిలబడి పింఛన్ తీసుకోవాల్సి రావడం చంద్రబాబు దుర్మార్గ చర్యలకు ప్రతీకగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు స్వతంత్ర సంస్థ ముసుగులో.. మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వతంత్ర సంస్థ ముసుగులో చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం పని చేస్తున్నారన్నది స్పష్టమైంది. ‘సిటిజన్ ఫర్ డెమోక్రసీ’ సంస్థ ముసుగులో కుహనా మేధావులతో టీడీపీకి అనుంగు సంస్థగా వ్యవహరిస్తూ వలంటీర్ల వ్యవస్థను అడ్డుకుని పేదలను పరోక్షంగా దెబ్బకొట్టారు. నిమ్మగడ్డ సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరి 23, 25న వలంటీర్లను పింఛన్ల పంపిణీ నుంచి తప్పించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి రెండుసార్లు ఫిర్యాదు చేసింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సైతం వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయకూడదంటూ ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రత్యక్షంగా ఇంత దారుణానికి ఒడిగట్టిన చంద్రబాబు ఇప్పుడు తమకేమీ సంబంధం లేదని, ఇంటింటికీ వెళ్లి పింఛన్ పంచాల్సిందేనంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. గతంలోనూ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కోర్టుల్లో ఆయన కేసులు వేయించడంతోపాటు సెంటు స్థలం సమాధికి కూడా సరిపోదంటూ అనుచిత వ్యాఖ్యలతో తన పెత్తందారీ అహంకారాన్ని చాటుకున్నారు. -
ప్రత్యేక పరిశీలకుల నియామకం
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ/గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): వచ్చే నెలలో లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలకులను నియమించింది. ఎన్నికల్లో డబ్బు, కండ బలం, అక్రమ మద్యం, ఉచితాల పంపిణీపై పకడ్బందీగా నిఘా పెట్టేందుకు ఏపీ సహా బిహార్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌కు ఈ ప్రత్యేక పరిశీలకులు నియమితులయ్యారు. మంచి ట్రాక్ రికార్డు కలిగిన రిటైర్డ్ సివిల్ సర్విసు అధికారులను నియమించడమే కాక ఆయా రాష్ట్రాల్లో పర్యవేక్షించాల్సిన అంశాలను సీఈసీ వివరించింది. ఆంధ్రప్రదేశ్‌కు సాధారణ ప్రత్యేక పరిశీలకునిగా రిటైర్డ్ ఐఏఎస్ రామ్మోహన్ మిశ్రా, పోలీసు ప్రత్యేక పరిశీలకునిగా దీపక్ మిశ్రా, వ్యయ పరిశీలకునిగా రిటైర్డ్ ఐఆర్ఎస్ నిగమ్‌ను నియమించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న తీరుపై వీరు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ నిఘా ఉంచుతారని పేర్కొంది. అలాగే.. ♦ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జిల్లాల్లో నియమించిన ఇతర ఎన్నికల పరిశీలకుల పనికి ఇబ్బంది కలిగించకుండా ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారాన్ని పొందవచ్చు. సమన్వయ విధానంలో ఉమ్మడి లక్ష్యాల కోసం పనిచేయాల్సి ఉంటుంది. ♦ ప్రాంతీయ అధిపతులు, పర్యవేక్షణ కార్యకలాపాల్లో పాల్గొన్న వివిధ ఏజెన్సీలు, నోడల్ అధికారులతో సమస్వయం చేసుకుని అవసరమైన సమాచారాన్ని పొందే అధికారం కలిగి ఉంటారు. ♦ ఎన్నికల సందర్భంగా సరిహద్దు ప్రాంతాలు ఎదుర్కొనే సున్నితమైన సమస్యలు, ప్రజల ఇబ్బందులను పరిష్కరించాలి. ♦ ఎన్నికల ప్రక్రియలో కమిషన్ మార్గదర్శకాల అమలు, ఇంటర్ ఏజెన్సీ సమన్వయం, తప్పుడు సమాచారంపై అధికారుల ప్రతిస్పందన కోసం వెచి్చస్తున్న సమయం, ఎన్నికలకు 72 గంటల ముందు చేయకూడని.. చేయాల్సిన పనులను పర్యవేక్షించడం, స్వేచ్ఛగా.. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూడాలి. ♦ ఇక ఎన్నికల సంఘం లేదా జోనల్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు, డీసీఈఓలు, ఎస్పీలు, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు నిర్వహించే సమావేశాల్లో కూడా పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తంచేస్తారు. ♦ ఎన్నికలు నిష్పాక్షికత, విశ్వసనీయతను నిర్ధారించడానికి కీలకమైన పూర్తి బాధ్యతలను, అధికారాలను ఈ పరిశీలకులకు అప్పగించారు. జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు భేష్ ఇక సాధారణ ఎన్నికల నిర్వహణకు జిల్లా ఎన్నికల అధికారి, పోలీస్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు సమన్వయంతో చేపట్టిన ఏర్పాట్లు భేషుగ్గా ఉన్నాయని రామ్మోహన్ మిశ్రా అభినందించారు. ఇదే పంథాను చివరివరకు కొనసాగించాలని సూచించారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల ఇంటెగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూంను, ఎంసీఎంసీ, సోషల్ మీడియా విభాగాలను మంగళవారం ఆయన పరిశీలించారు. కంట్రోల్ రూమ్‌లోని సీ–విజిల్, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఐటీ, బ్యాంకింగ్, కమర్షియల్ టాక్స్, ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఈఎస్ఎంఎస్), కస్టమ్స్ తదితర విభాగాల కార్యకలాపాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. ఎన్నికల నిర్వహణకు చేపట్టిన చర్యలను జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ టీకే రాణా వివరించారు. జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓటర్ల వివరాలు, గత ఎన్నికల్లో పోలింగ్ శాతం వంటి వివరాలను చెప్పారు. ఈ ఎన్నికల్లో జిల్లాలో 85 శాతం ఓటింగ్ లక్ష్యంగా విస్తృత ఓటరు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల 13, 14 తేదీల్లో ఈ కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లుచేసినట్లు తెలిపారు. అదేవిధంగా పోలీస్ కమిషనర్ టీకే రాణా జిల్లాలో ఎలక్షన్ సీజర్లను, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకున్న చర్యలను వివరించారు. కంట్రోల్ రూమ్ పనితీరుపట్ల కూడా రామ్మోహన్ సంతృప్తి వ్యక్తంచేశారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చే డేటాను సరైన విధంగా విశ్లేíÙంచి సరైన కార్యాచరణ దిశగా అడుగులేయాలన్నారు. అనంతరం గూడవల్లి ఇంటర్ డి్రస్టిక్ట్ బోర్డర్ చెక్‌పోస్టును ఆయన సందర్శించి సిబ్బందికి సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్‌కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, డీఆర్వో వి.శ్రీనివాసరావు, విజయవాడ ఆర్డీఓ బీహెచ్ భవానీశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
Election Commission of India: ‘విజిల్’ ఊదేస్తున్నారు
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక సమరం వేళ ఎన్నికల ప్రవర్తనా నిబంధనావళి ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చిన ‘సీ విజిల్’ యాప్‌ను ప్రజలు సమర్థవంతంగా వినియోగిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి శుక్రవారం ఉదయం వరకు ప్రజల నుంచి 79,000కు పైగా ఫిర్యాదులు అందాయి. ఇందులో 99 శాతానికిపైగా ఫిర్యాదులు పరిష్కరించామని కేంద్ర ఎన్నికల తెలిపింది. వీటిలో 89 శాతం ఫిర్యాదులను 100 నిమిషాల్లో పరిష్కరించినట్లు ఈసీ పేర్కొంది. 58,500 కంటే ఎక్కువ ఫిర్యాదులు (73శాతం) అక్రమ హోర్డింగ్‌లు, బ్యానర్లకు సంబంధించినవి కాగా.. 1400కు పైగా ఫిర్యాదులు నగదు, బహుమతులు, మద్యం పంపిణీకి సంబంధించినవి ఉన్నాయి. -
ఏపీకి ముగ్గురు పరిశీలకుల నియామకం
సాక్షి, విజయవాడ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ జనరల్ అబ్జర్వర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ రామ్ మోహన్ మిశ్రా, స్పెషల్ పోలీస్ అబ్జర్వర్‌గా రిటైర్డ్ ఐపీఎస్ దీపక్ మిశ్రా, స్పెషల్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్‌గా రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి నీనా నిగమ్ నియమితులయ్యారు. వచ్చే వారం నుంచి ప్రత్యేక ప్రతినిధులు రాష్ట్రంలో పర్యటించనున్నారు. -
Lok sabha elections 2024: 88 స్థానాలకు నేడు నోటిఫికేషన్
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక పోరులో రెండో విడత ఎన్నికల ప్రక్రియకు రంగం సిద్ధమైంది. రెండో విడతలో భాగంగా దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాలతో పాటు ఔటర్ మణిపూర్‌లోని ఒక స్థానానికి ఏప్రిల్ 26న పోలింగ్ జరుగనుంది. ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 4 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. జమ్మూకశీ్మర్ మినహా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 5న జరుగనుంది. జమ్మూ కశ్మీర్లో మాత్రం నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 6న జరుగుతుంది. రెండో విడతలో అస్సాం, బిహార్, ఛత్తీస్‌గఢ్, జమ్మూకశీ్మర్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్తాన్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశి్చమ బెంగాల్, మణిపూర్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. వీటితోపాటు మహారాష్ట్రలోని అకోలా పశి్చమ అసెంబ్లీ నియోజకవర్గం, రాజస్తాన్‌లోని భాగిడోరా అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతాయి. -
తగ్గిన ‘జాతీయ’ ప్రభ
ఎన్నికల కుంభమేళాలో దేశవ్యాప్తంగా వేలాది రాజకీయ పార్టీలు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 2,500కు పైగా రాజకీయ పార్టీలున్నాయి. కానీ 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 53 పార్టీలు బరిలో నిలిచాయి. అందులో 14 మాత్రమే జాతీయ పార్టీలు. మిగతావి రాష్ట్ర పార్టీలు. దేశవ్యాప్తంగా కోట్లాది ఓటర్లను ఆకర్షించి అత్యంత ప్రజాదరణ పొందిన పార్టీలుగా ఖ్యాతికెక్కిన జాతీయ పార్టీలు నెమ్మదిగా ప్రభ కోల్పోతున్నాయి. సత్తా చాటలేక చతికిలపడుతూ తమ ‘జాతీయ’ హోదాను కోల్పోతున్నాయి. అలా ఈ ఏడు దశాబ్దాల కాలంలో ఎనిమిది పార్టీలు ‘జాతీయ’ హోదా కోల్పోయాయి. డెభై ఏళ్లలో కొన్ని జాతీయ పార్టీలు విలీనం కాగా కొత్తవి ఉద్భవించాయి. తాజాగా 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి జాతీయ పార్టీల సంఖ్య ఆరుకు పరిమితమైంది. దేశంలో ఎన్నికల పర్వాన్ని అక్షరబద్దం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రచురించిన ‘లీప్ టు ఫెయిత్’ పుస్తకంలో పలు ఆసక్తికర విషయాలున్నాయి. జాతీయ పార్టీ ట్యాగ్‌లైన్ తమకూ కావాలని 1951 లోక్‌సభ ఎన్నికలకు ముందు 29 రాజకీయ పార్టీలు పట్టుబట్టాయి. అయితే వాటిలో 14 పార్టీలకే ఆ హోదా దక్కింది. అయితే మెజారిటీ పార్టీలు దాన్ని నిలబెట్టుకోలేకపోయాయి. కేవలం నాలుగు పార్టీలు.. కాంగ్రెస్, ప్రజా సోషలిస్ట్ పార్టీ, సీపీఐ, జనసంఘ్ ఆ హోదాను నిలుపుకున్నాయి. అఖిల భారతీయ హిందూ మహాసభ, ఆలిండియా భారతీయ జనసంఘ్, రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, ఆలిండియా షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫెడరేషన్, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్(మార్కిస్ట్), ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్(రూకర్), కృషికార్ లోక్‌పార్టీ, బొల్‡్షవిక్ పార్టీ ఆఫ్ ఇండియా, రెవల్యూషనరీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ హోదా కోల్పోయాయి. దీంతో 1957 ఎన్నికలనాటికి పార్టీల సంఖ్య 15కు పడిపోయింది. వాటిలో నాలుగింటికే జాతీయ హోదా కొనసాగింది. అయితే 1962 ఎన్నికలనాటికి జాతీయ పార్టీల సంఖ్య ఆరుకు, అన్ని పార్టీల సంఖ్య 29కి పెరిగింది. సోషలిస్ట్ (ఎస్ఓసీ), స్వతంత్ర (ఎస్‌డబ్ల్యూఏ) పార్టీలు జాతీయ హోదా పొందాయి. 1951 ఎన్నికల తర్వాత సీపీఐ ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగి పుష్కర కాలం ఆ హోదాలో కొనసాగింది. కానీ 1964లో పార్టీలోని సోవియట్, చైనా కమ్యూనిస్ట్ వర్గాలు వేరు కుంపటి పెట్టాయి. దీంతో సీపీఐ (మార్కిస్ట్) పురుడుపోసుకుంది. 1992లో 7 జాతీయ పార్టీలు 1992 లోక్‌సభ ఎన్నికల్లో ఏడు నేషనల్ పార్టీలు.. బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, జనతాదళ్, జనతా పార్టీ, లోక్‌దళ్ పోటీలో ఉన్నాయి. 1996 సాధారణ ఎన్నికల్లో మొత్తం 209 పార్టీలు అధికారం కోసం పోటీపడ్డాయి. కాంగ్రెస్, ఆలిండియా కాంగ్రెస్ (తివారీ), బీజేపీ, సీపీఐ, సీపీఎం, జనతా పార్టీ, సమతా పార్టీ, జనతాదళ్ రూపంలో ఎనిమిది పార్టీలకు జాతీయ హోదా దక్కింది. 1998 ఎన్నికలకొచ్చేసరికి పార్టీల సంఖ్య 176కు పడిపోయింది. ఈ దఫా కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, జనతాదళ్, సీపీఐ, సీపీఎం, సమతా పార్టీ జాతీయ హోదాతో పోటీపడ్డాయి. 1999లో పార్టీల సంఖ్య 160కి పడిపోయింది. బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, జేడీ(ఎస్), జేడీ(యూ) జాతీయ పార్టీలుగా అదృష్టం పరీక్షించుకున్నాయి. 2014లో 464 పార్టీలు 2014 ఎన్నికల్లో ఏకంగా 464 పార్టీలు రంగంలోకి దూకాయి. జాతీయ పార్టీల సంఖ్య ఆరుకు తగ్గింది. ఆనాడు బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, బీఎస్పీలకు మాత్రమే జాతీయ హోదా ఉంది. 2016లో మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా జాతీయ హోదా సాధించి ఎన్నికల్లో పోటీ చేసింది. 2019లోనూ ఎక్కువ సీట్లు సాధించేందుకు శ్రమించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 674 పార్టీలు పోటీ చేయగా వాటిలో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, తృణమూల్ రూపంలో ఏడు జాతీయ పార్టీలుగా నిలిచాయి. తర్వాత తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఐ జాతీయ హోదా కోల్పోయాయి. జాతీయ హోదా ఇలా... నిబంధనావళి ప్రకారం కనీసం మూడు రాష్ట్రాల నుంచి కనీసం రెండు శాతం ఎంపీ సీట్లను గెలిచిన పార్టీకే జాతీయ పార్టీ హోదా దక్కుతుంది. లేదంటే నాలుగు రాష్ట్రాల్లో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లు ఆ పార్టీకి పడాలి. కనీసం నాలుగు రాష్ట్రాల్లో అప్పటికే రాష్ట్ర పార్టీ హోదా ఉండాలి. ► జాతీయ పార్టీ దేశవ్యాప్తంగా పోటీ చేస్తే ఆ పార్టీ అభ్యర్థులకు ఒకే ఎన్నికల గుర్తును కేటాయిస్తారు. ► దేశ రాజధానిలో పార్టీ కార్యాలయం ఏర్పాటుకు ప్రత్యేకంగా స్థలం కేటాయిస్తారు. జేపీ.. జనతా ప్రయోగం జయప్రకాశ్ నారాయణ్ (జేపీ), రామ్ మనోహర్ లోహియా, ఆచార్య నరేంద్ర దేవ్ ఏర్పాటుచేసిన సోషలిస్ట్ పార్టీ మూలాలు కాంగ్రెస్ వామపక్ష విభాగమైన కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ (సీఎస్పీ)లో ఉన్నాయి. జేపీ సోషలిస్ట్ పార్టీని జేబీ కృపలానీ సారథ్యంలోని కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీలో విలీనం చేసి ప్రజా సోషలిస్ట్ పార్టీ (పీఎస్పీ)ని ఏర్పాటుచేశారు. ఆ తర్వాత పీఎస్పీ నుంచి జేపీ బయటికొచ్చారు. ► 1975లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించడంతో జేపీ మళ్లీ జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. జేపీతో పాటు విపక్షాలు నేతలందరూ జైలు పాలయ్యారు. ► జేపీ విడుదలయ్యాక కొందరు పీఎస్పీ నేతలతో కలిసి భారతీయ లోక్‌దళ్‌ను స్థాపించారు. ► ఎమర్జెన్సీకారణంగా దేశంలోని విపక్ష పార్టీలపై నిషేధం కత్తి వేలాడటంతో ఇందిరను ఢీకొట్టేందుకు అంతా కలిసి జనతా పార్టీకి ప్రాణం పోశారు. 1977లో ఇందిరను ఓడించి జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచి్చంది. జాతీయ పార్టీగా ఆప్ తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఐ జాతీయ పార్టీ హోదాను కోల్పోయాక గతేడాది కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ హోదా సాధించడం విశేషం. ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఎం, నేషనల్ పీపుల్స్ పార్టీ, ఆప్ మాత్రమే జాతీయహోదాలో తలపడుతున్నాయి. 543 లోక్‌సభ స్థానాలకు మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నగదు లావాదేవీల సమాచారమివ్వండి: ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ..అక్రమ డబ్బు రవాణాను అరికట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఖాతాదారులు ఎవరైనా రూ.లక్ష కంటే ఎక్కువ డిపాజిట్, విత్ డ్రా చేస్తే జిల్లా ఎన్నికల అధికారికి సమాచారం ఇవ్వాలని సూచించింది. ఏదైనా బ్యాంకు ఖాతా నుంచి రూ.10 లక్షలకు పైగా నగదును ఖాతాదారుడు తీసుకున్నా జిల్లా ఎన్నికల అధికారికి, ఆదాయపు పన్ను శాఖ నోడల్ అధికారికి తెలపాలని ఆదేశించింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల ఖర్చు కోసం తన పేరుతో లేదా ఏజెంట్ పేరుతో కలిపి బ్యాంకు, పోస్టాఫీసుల్లో ప్రత్యేకంగా అకౌంట్ లేదా ఉమ్మడి అకౌంట్ తెరవవచ్చని సూచించింది. ఇందుకోసం ప్రత్యేక కౌంటర్లు తెరవాలని అన్ని బ్యాంకులకు ఈసీఐ ఆదేశాలు జారీ చేసింది. -
‘వికసిత్ భారత్’ సందేశాలను ఆపండి: ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక కూడా కేంద్ర ప్రభుత్వ విజయాలను ప్రచారం చేసే వికసిత్ భారత్ సంకల్ప్ సందేశాలు ఓటర్ల ఫోన్లకు వాట్సాప్‌లో పంపడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తప్పుబట్టింది. వెంటనే ‘వికసిత్ భారత్’ గంపగుత్త మెసేజ్‌లను వాట్సాప్ ద్వారా పంపడం ఆపేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శికి గురువారం ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం నెలకొనడమే తమ ఉద్దేశమని ఈసీ పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల ప్రవర్తనా నిబంధనావళి అమల్లోకి వచ్చాక సామాజిక మాధ్యమాల వేదికగా ప్రభుత్వ పథకాలు, విజయాలను ప్రచారం చేయడం నిషేధమని ఈసీ పేర్కొంది. -
‘మోదీ’ ప్రకటనలపై ఈసీకి ఫిర్యాదు
న్యూఢిల్లీ: ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేస్తూ బీజేపీ ‘మోదీకీ పరివార్’, ‘మోదీ కీ గ్యారెంటీ’ ప్రకటనలను గుప్పిస్తోందని, వీటిని వెంటనే తొలగించి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదుచేసింది. ముకుల్ వాస్నిక్, సల్మాన్ ఖుర్షీద్‌ల కాంగ్రెస్ ప్రతినిధి బృందం గురువారం ఈసీని కలిసి ఎన్నికల కోడ్‌ను బీజేపీ ఎలా ఉల్లంఘించిందో వివరించింది. సుప్రీంకోర్టు గతంలోనే క్లీన్చిట్ ఇచ్చినా 2జీ స్ప్రెక్టమ్ కేసులో అభూత కల్పనలతో బీజేపీ తప్పుడు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిందని ఈసీకి ఫిర్యాదుచేసింది. -
Lok sabha elections 2024: విరాళాల సమస్త వివరాలు బహిర్గతం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ) నుంచి ఎలక్టోరల్ బాండ్ల వివరాలన్నీ వాటి నంబర్లతో సహా పూర్తి స్థాయిలో కేంద్ర ఎన్నికల సంఘానికి చేరాయి. దీంతో ఆ సమస్త వివరాలను ఈసీ వెంటనే తన వెబ్సైట్లో పొందుపరిచింది. ఆల్ఫా–న్యూమరిక్ నంబర్లతోసహా దాతలు, వాటిని అందుకున్న గ్రహీతల(రాజకీయ పార్టీలు) జాబితాను విడివిడిగా ఈసీ పొందుపరిచింది. ఆల్ఫా–న్యూమరిక్ నంబర్లను బట్టి ఏ ఎలక్టోరల్ బాండ్ మొత్తాన్ని ఈ రాజకీయ పార్టీ విరాళంగా పొందిందో సులభంగా తెల్సుకోవచ్చు. సుప్రీంకోర్టు గత ఆదేశాల సమయంలో ఈ ఆల్ఫా–న్యూమరిక్ నంబర్లు లేకుండానే బాండ్లు, వాటి గ్రహీతల జాబితాను ఈసీకి ఎస్బీఐ ఇచ్చింది. ఏ వ్యక్తి/సంస్థ బాండ్లను ఏ పార్టీకి విరాళంగా ఇచ్చారని తెలిపే ఈ నంబర్లు లేకపోవడంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం బ్యాంకు తీరుపై అసహనం వ్యక్తంచేసింది. సమస్త వివరాలను ఈసీకి ఇవ్వాలని ఆదేశించడంతో దిద్దుబాటు చర్యలకు దిగిన ఎస్బీఐ గురువారం ఆల్ఫా–న్యూమరిక్ నంబర్లతో కూడిన పూర్తి వివరాలను ఈసీకి అందజేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. రిలయన్స్ సంబంధ సంస్థ నుంచి బీజేపీకి రూ.395 కోట్లు ఈసీ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో సంబంధం ఉన్న క్విక్ సప్లై చైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బీజేపీకి రూ.395 కోట్ల విరాళాలు ఇచ్చింది. 2022లో శివసేన పార్టీకి రూ.25 కోట్ల విరాళాలు అందజేసింది. 2021–22, 2023–24కాలంలో బాండ్లు కొని విరాళంగా ఇచి్చన మూడో అతిపెద్ద దాతగా క్విక్ సప్లై చైన్ నిలిచింది. ఈకాలంలో ఈ సంస్థ రూ.410 కోట్ల బాండ్లను కొనుగోలుచేసింది. అత్యధికంగా ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ సంస్థ రూ.1,368 కోట్ల బాండ్లను కొనుగోలుచేయడం తెల్సిందే. ఈ సంస్థ 2022 అక్టోబర్ వరకు మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీపార్టీకి రూ.540 కోట్లు విరాళంగా ఇచ్చింది. ఈ సంస్థ నుంచి అత్యధిక విరాళాలు పొందిన పార్టీగా టీఎంసీ నిలిచింది. ఫ్యూచర్ గేమింగ్ అండ్‌హోటల్ సర్వీసెస్ నుంచి బీజేపీ రూ.100 కోట్ల విరాళాలు పొందింది. ఈ సంస్థ కాంగ్రెస్‌కు రూ.50 కోట్ల విరాళం ఇచ్చింది. సిక్కిం క్రాంతికారీ మోర్చా సైతం ఈ సంస్థ నుంచి విరాళాలు స్వీకరించింది. తమిళనాడులోని డీఎంకేకు ఈ సంస్థ ఏకంగా రూ.509 కోట్ల విరాళాలు ఇచ్చింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో సంబంధం ఉన్న హానీవెల్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ సైతం రూ.30 కోట్ల బాండ్లను కొని మొత్తం బీజేపీకే విరాళంగా ఇచ్చింది. ఈసీకి ఇచ్చేశాం: ఎస్బీఐ ఎలక్టోరల్ బాండ్ల వివరాలన్నీ వాటి నంబర్లతో సహా ఎన్నికల సంఘానికి అందజేశామని ఎస్బీ ఐ స్పష్టం చేసింది. ఈ మేరకు ఎస్బీఐ చైర్మన్ దినేశ్‌కుమార్ ఖరా గురువారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. దాతలు ఇచ్చిన బాండ్లను నగదుగా మార్చుకున్న రాజకీయ పార్టీల బ్యాంక్ ఖాతాల నెంబర్లు, కేవైసీ వివరాలను బయటపెట్టడం లేదని వెల్లడించారు. -
తొలి విడత నోటిఫికేషన్ జారీ.. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు
సాక్షి, న్యూఢిల్లీ: తొలి విడత సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19న తొలి విడత ఎన్నికలు జరుగనున్నాయి. వీటితోపాటు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలు, తమిళనాడులోని విలవన్కోడ్, త్రిపురలోని రామ్‌నగర్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ను సైతం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో తొలి విడత ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 27వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 28న నామినేషన్లను పరిశీలిస్తారు. ఈ నెల 30వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. బిహార్‌లో మాత్రం స్థానిక వేడుక నేపథ్యంలో నామినేషన్లకు ఈ నెల 28వ తేదీ వరకు గడువు విధించారు. ఈసారి లోక్‌సభ ఎన్నికలు మొత్తం ఏడు విడతల్లో జరుగనున్న సంగతి తెలిసిందే. తొలి విడతలో అత్యధికంగా తమిళనాడులో 39 స్థానాలు, రాజస్తాన్‌లో 12, ఉత్తరప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 6, అసోం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఐదు స్థానాల చొప్పున, బిహార్‌లో 4, పశ్చిమ బెంగాల్లో 3, మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో రెండు స్థానాల చొప్పున, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, నాగా లాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూకశ్మీర్, లక్షదీ్వప్, పుదుచ్చేరిల్లో ఒక్కో స్థానానికి ఏప్రిల్ 19న పోలింగ్ జరుగనుంది. -
ఎన్నికల కమిషన్ చేతిలో డీఎస్సీ భవితవ్యం
రాష్ట్రంలో 144 సెక్షన్ రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉందని, ప్రతి అభ్యర్థి ప్రచారానికి, ర్యాలీలకు అనుమతి తీసుకోవాలని ఇందుకోసం సవిధ యాప్‌ను వినియోగించుకోవాలని చెప్పారు. ఇప్పటికే 398 అభ్యర్థనలు వచ్చాయన్నారు. అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి ఎన్నికల వ్యయం అమల్లోకి వస్తుందన్నారు. 85 ఏళ్లు దాటిన వారు ఇంటి వద్దే ఓటేసే అవకాశం ఉన్నా, ఇటీవలి తెలంగాణ ఎన్నికల్లో 2 శాతం మందే వినియోగించుకున్నారని, చాలామంది పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయడానికే ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. సాక్షి, అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి లభించిన తర్వాతే డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. అంతవరకు టెట్ పరీక్షల ఫలితాలను కూడా ప్రకటించవద్దని ఆదేశించినట్లు తెలిపారు. బుధవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డీఎస్సీలో 6,100 పోస్టులకు 4.72 లక్షల మంది పోటీపడుతున్నట్లు తెలిపారు. డీఎస్సీ నిర్వహించాలని కొందరు, వాయిదా కోరుతూ మరికొందరు మెయిల్స్, ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేయడంతో ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. డీఎస్సీ పరీక్ష నిర్వహించడానికి అనుమతి కోరుతూ ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో లేఖ రాయనుందని, ఇందుకోసం సీఎస్ ఆధ్వర్యంలో ఒక స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం డీఎస్సీ నిర్వహించమంటే నిర్వహిస్తామని, లేదంటే వాయిదా వేస్తామని స్పష్టం చేశారు. పటిష్టంగా ఎన్నికల నియమావళి అమలు రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. గత మూడు రోజుల్లో రూ.3.39 కోట్ల విలువైన నగదు, వస్తువులు జప్తు చేశామన్నారు. కోడ్ ఉల్లంఘించిన వారిపై 385 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని, 46 మందిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇందులో 40 మంది వలంటీర్లు ఉన్నారని, వారిని విధుల నుంచి తొలగించామని చెప్పారు. మరో ఇద్దరు రెగ్యులర్ ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలపై ఉన్న గోడ రాతలు, బ్యానర్లు, ఇతర వస్తువులు మొత్తం 1,99,000 తొలగించగా, ప్రైవేటు స్థలాల్లో 1,15,000 తొలగించినట్లు తెలిపారు. అనుమతి లేకుండా ప్రచారం కోసం ఆస్తులను వినియోగించిన వారిపై 94 కేసులు, ప్రభుత్వ వాహనాలను దుర్వినియోగం చేసినవారిపై 37 కేసులు నమోదు చేశామన్నారు. కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రోజూ డిస్టిలరీల నుంచి మద్యం ఉత్పత్తి, గొడౌన్ల నుంచి మద్యం నిల్వల వివరాలు తెప్పించి, గతేడాది గణాంకాలతో పోల్చి చూస్తున్నామని, ఎక్కడా మద్యం అమ్మకాలు పెరగలేదన్నారు. ఇంతవరకు అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలు కనిపించలేదన్నారు. ప్రధాని భద్రత కేంద్ర హోంశాఖ అంశం ప్రధాని భద్రత కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, ఎస్పీజీ పరిధిలోనికి వస్తుందని, సీఈవో పరిధిలోకి రాదని స్పష్టం చేశారు. ప్రధాని సభ భద్రతా వైఫల్యాలపై వివిధ రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపామన్నారు. రాష్ట్రంలో ఎటువంటి హింసాత్మక ఘటనలు రీపోలింగ్ వంటివి లేకుండా ఎన్నికలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కోడ్ వచ్చిన తర్వాత గిద్దలూరు, ఆళ్లగడ్డ, మాచర్లల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై గురువారం స్వయంగా వచ్చి నివేదిక ఇవ్వాలని ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాల ఎస్పీలను ఆదేశించినట్లు తెలిపారు. వారి వివరణ ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక ఇస్తామన్నారు. సీవిజిల్‌తో సత్వర పరిష్కారం ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఓటరు సీవిజిల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని ఎన్నికల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ఆయన పిలుపునిచ్చారు. సీవిజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే 100 నిమిషాల్లోనే చర్యలు తీసుకుంటామని, అదే నేరుగా తమకు ఫిర్యాదు చేస్తే సంబంధిత అధికారికి పంపి వివరణ తీసుకొని చర్యలు చేపట్టడానికి చాలా సమయం పడుతుందన్నారు. కోడ్ ఉల్లంఘన అంశాలు వీడియో తీసి యాప్‌లో అప్లోడ్ చేస్తే వాటిపై తక్షణం స్పందించడానికి 1,173 ప్లైయింగ్ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు సీవిజిల్ యాప్ ద్వారా 1,307 ఫిర్యాదులు వస్తే అందులో 40 తప్ప అన్నీ పరిష్కరించినట్లు తెలిపారు. -
బెంగాల్ డీజీపీ తొలగింపు
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం భారీ కసరత్తుకు తెరతీసింది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, బిహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ హోం శాఖ కార్యదర్శులతోపాటుగా, పశ్చిమబెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్‌ను తొలగించాలని ఆదేశా లు జారీ చేసింది. మిజోరం, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల సాధారణ పరిపాలన విభాగాల కార్యదర్శులను కూడా తొలగించింది. గతంలోనూ చర్యలు 2016 అసెంబ్లీ ఎన్నికలతోపాటు 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ పశ్చిమబెంగాల్ డీజీపీకి ఎన్నికల విధుల నుంచి ఈసీ తొలగించడం గమనార్హం. తాత్కాలికంగా డీజీపీ రాజీవ్ కుమార్‌కు ఎన్నికలతో సంబంధం లేని బాధ్యతలను అప్పగించాలని బెంగాల్ చీఫ్ సెక్రటరీకి ఈసీ సూచించింది. ఆయనకు జూనియర్‌గా ఉన్న మరో అధికారికి డీజీపీ బాధ్యతలివ్వాలని కోరింది. డీజీపీ పోస్టుకు అర్హులైన ముగ్గురు అధికారుల పేర్లను తమకు పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. వీరికి రెండు విధులు గుజరాత్, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల హోం శాఖ కార్యదర్శులు సంబంధిత రాష్ట్రాల సీఎం కార్యాలయాల బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారని, దీనివల్ల ఎన్నికల సంబంధ విధుల అమలులో ఎంతో కీలకమైన నిష్పా క్షికత, తటస్థత కొరవడే ప్రమాదముందని ఈసీ పేర్కొంది. ముఖ్యంగా శాంతిభద్రతలు, బలగాల మోహరింపుపై ఇది ప్రభావం చూపొచ్చని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే వీరిని విధుల నుంచి తప్పించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. బీఎం కమిషనర్ తొలగింపు ఎన్నికల సమయంలో మూడేళ్లు ఒకే చోట బాధ్యతలు నిర్వహిస్తున్న వారిని, సొంత జిల్లాల్లో విధుల్లో ఉన్న వారిని ఎన్నికల సంబంధ విధుల నుంచి బదిలీ చేయడం ఆనవాయితీ. అయితే, మహారాష్ట్ర ప్రభుత్వం తమ సూచనలను పాటించకపోవడంపై ఈసీ అసంతృప్తిగా ఉంది. దీంతో, బృహన్ముంబై మున్సిపల్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చహల్తోపాటు అదనపు కమిషనర్లు, ఉప కమిషనర్లను విధుల నుంచి తప్పించాలని ఆదేశాలిచ్చింది. ఇతర కార్పొరేషన్ల మున్సిపల్ కమిషనర్లు, అదనపు, ఉప కమిషనర్లను కూడా బదిలీ చేయాలని కోరింది. -
fact check: అది మీ బాబు రూటు
సాక్షి, అమరావతి: పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్న చందంగా... కళ్లకు పచ్చ పసరు రాసుకున్న రామోజీకి అంతా తన ‘బాబు’ లాగే కనిపిస్తున్నారు. తన బాబు దొంగ ఓట్లతో గెలిచాడు కాబట్టి మిగతా వారూ అలానే ఉంటారని భావిస్తూ ‘‘ఓటు హక్కుపై వేటు.. అదే జగన్ రూటు’’ అంటూ జగన్‌పై ఉన్న అక్కసును బయటపెట్టుకున్నారు. అసలు దొంగఓట్లకు ఆద్యుడు చంద్రబాబేనని, తమిళనాడుకు చెందిన వలస కూలీలను చేర్పించడం ద్వారా ఇన్నాళ్లూ కుప్పంలో గెలుస్తూ వచ్చాడని, ఇప్పుడు ఆ భాగోతం బయటపడటంతో సొంత నియోజకవర్గంలో తన బాబు’ ఓడిపోతాడనే భయంతోనే ఇటువంటి వార్తలు రాస్తున్నారంటూ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సేవామిత్ర యాప్ పేరుతో వైఎస్సార్సీపీ మద్దతుదార్ల ఓట్ల తొలగింపు రాష్ట్రంలో 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత డేటాను చౌర్యం చేసి ప్రైవేటు సంస్థలకు చంద్రబాబు అప్పగించారు. వాటిని సేవా మిత్ర యాప్‌తో అనుసంధానం చేసి, వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించారు. 2015లో 22,76,714, 2016లో 13,00,613, 2017లో 14,46,238 వెరసి 50,23,565 ఓట్లను చంద్రబాబు తొలగింపజేశారు. తద్వారా తనకు అలవాటైన రీతిలో దొడ్డిదారిన అధికారంలోకి వచ్చేందుకు కుట్ర చేశారు. ఈ కుట్రను ప్రజాసంఘాలు బహిర్గతం చేశాయి. దీనిపై వైఎస్సార్సీపీ చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. అర్హుల ఓట్లను కూడా తొలగించినట్లు తేలి్చన ఎన్నికల అధికారులు.. 2019 ఎన్నికల నాటికి 31,97,473 ఓట్లను జాబితాలో అదనంగా చేర్చారు. దాంతో ఆ ఎన్నికల్లో 50 శాతంపైగా ఓట్లు సాధించి.. 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించింది. ఈసీ స్పష్టం చేసినా వినపడలేదా! అత్యంత పారదర్శకంగా ఓటర్ల జాబితాను రూపొందిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ ఇటీవల ఓ సమీక్షలో స్పష్టం చేశారు. రాష్ట్రంలో దొంగ ఓట్ల నమోదు, గంపగుత్తగా ఓట్ల తొలిగింపు, జీరో ఇంటి నెంబర్‌పై ఓటర్ల నమోదు అంటూ తెలుగుదేశం పార్టీ, పచ్చ మీడియా చేసిన బోగస్ ప్రచారంలో వీసమెత్తు నిజం లేదన్న విషయాన్ని ఆయన విస్పష్టంగాచెప్పారు. 2023 జనవరి 6 నుంచి ఆగస్టు 30 మధ్య కాలంలో తొలగించిన 21 లక్షల ఓట్లను సమీక్షిస్తే అందులో కేవలం 13,061 ఓట్లలోనే తప్పులు దొర్లాయని ఆయన తేల్చారు. అంటే తొలగించిన మొత్తం ఓట్లల్లో ఇది కేవలం 0.61 శాతం మాత్రమే. వాటిని తిరిగి సవరించారు. మృతి చెందిన, ఇంటి మార్పు, డూప్లికేట్ ఓటర్ల నమోదుపై 14.48 లక్షల దరఖాస్తులు వస్తే అందులో 5.65 లక్షల ఓటర్లు చనిపోవడం లేదా శాశ్వతంగా వేరే చోటికి వెళ్లిపోవడం, ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉండటాన్ని గుర్తించి వాటిని తొలగించారు. ఒకే ఇంటి నంబర్‌పై పది మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న కేసులను పరిశీలించడానికి 1.57 లక్షల ఇళ్లకు ఎన్నికల సిబ్బంది వెళ్లారు. ఇంటింటి సర్వే నిర్వహించి 20 లక్షల ఓట్లను పరిశీలించారు. జీరో ఇంటి నెంబర్‌తో 2.52 లక్షల ఓట్లు ఉండగా వాటిలో 97 శాతం అసలైన చిరునామా నమోదు చేసి సరిదిద్దారు. ఎన్నికల సంఘం ఇంత కచి్చతంగా వ్యవహరించినా రామోజీ కళ్లకు ఇవేవీ కనిపించలేదు. నామినేషన్ల దాఖలు చివరి రోజు వరకు ఓటరుగా నమోదు చేసుకోవడానికి అనుమతిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ఒకపక్క చెపుతున్నా.. పదేపదే అదే అబద్ధాన్ని రామోజీ ప్రచారం చేస్తున్నారు. దొంగ ఓట్లతో గెలిచిన బాబు 2014లో దొంగఓట్లతో గెలిచిన చంద్రబాబు నాయుడు 2019లో కూడా అదే దారిలో వెళ్లి భంగపడ్డారు. సేవామిత్ర యాప్ ద్వారా వైఎస్ఆర్సీపీ మద్దతుదార్ల ఓట్ల తొలగింపునకు కుట్ర పన్నారు. ఇప్పుడు 2024లో కూడా ఇదే విధంగా దొంగ ఓట్లను చేర్పించడానికి తెలుగుదేశం పార్టీ నుంచి భారీ సంఖ్యలో గంపగుత్తగా ఫారం–6లను దాఖలు చేస్తూ పచ్చ మీడియా ద్వారా అధికారపార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలో 99% స్వచ్ఛతతో ఓటర్ల జాబితా తయారు చేయడమే కాకుండా పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తున్నా రామోజీ పత్రిక మాత్రం ఓటర్ల జాబితాపై పదేపదే తప్పుడు ఆరోపణలతో విషకథనాలను ప్రచురిస్తోంది. 2014 ఎన్నికల నాటికి ఓటర్ల జాబితాలో సుమారు 35 లక్షలకు పైగా దొంగ ఓట్లు ఉన్నట్లు అప్పట్లో ప్రజా సంఘాలు గుర్తించాయి. ఆ ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో టీడీపీ అధికారంలోకి రావడానికి కూడా అదే కారణమని తేల్చాయి. -
ఏపీలో పోలింగ్ శాతం పెంచండి: కేంద్ర ఎన్నికల సంఘం
సాక్షి, అమరావతి: త్వరలో జరగనున్న లోక్‌సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని వీలైనంత ఎక్కువగా పెంచేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో దేశంలోని పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు, యువత పోలింగ్‌కు రాకుండా ఉదాసీనంగా వ్యహరించడంతో ఆ ప్రాంతాల్లో కేవలం 67.4 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఇప్పుడు జరగనున్న ఎన్నికల్లో ఆయా ప్రాంతాల్లో పోలింగ్ శాతం పెంచడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం సవాల్‌గా తీసుకుంది. ఇందులో భాగంగా.. తీసుకోవాల్సిన చర్యలపై అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు, జిల్లాల ఎన్నికల అధికారులకు పలు ఆదేశాలు జారీ చేసింది. గత ఎన్నికల్లో తక్కువ శాతం పోలింగ్ నమోదైన పోలింగ్ కేంద్రాలు, అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలను గుర్తించాలని సూచించింది. తక్కువ శాతం పోలింగ్ నమోదవడానికి కారణాలను విశ్లేషించి పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల భాగస్వామ్యం పెంచేలా చర్యలను చేపట్టాలని సూచించింది. అలాగే, వికలాంగులు, ట్రాన్స్జెండర్లు, నిరాశ్రయులైన వివిధ అట్టడుగు వర్గాలు, సంచార సమూహాలు, సెక్స్ వర్కర్లు, క్లిష్ట పరిస్థితుల్లోని మహిళలు మొదలైన వారిని గుర్తించి వారందరినీ పోలింగ్‌లో భాగస్వామ్యం చేయడానికి అట్టడుగుస్థాయి నుంచి చర్యలు చేపట్టాలని తెలిపింది. ఇందుకోసం క్షేత్రస్థాయి నుంచి ప్రణాళికలను అమలుచేయాల్సిందిగా సీఈఓలు, డీఈఓలను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఏ ఒక్క ఓటరును వదిలేయకూడదనే లక్ష్యంగా చర్యలు ఉండాలని స్పష్టంచేసింది. ఇందుకోసం ఎన్నికలను ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగగా ప్రచారం చేయడంతో పాటు ఒక వ్యక్తి ఓటు వేయడం ద్వారా దేశం గర్విస్తుందనే భావనతో ప్రచారం నిర్వహించాలని కోరింది. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో ప్రతీ ఓటరు ఓటు వేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. ఈ నినాదాలతో ప్రచారం చేయండి.. ఇక ఓటర్ల భాగస్వామ్యం పెంచడానికి ‘‘చునావ్ కా పర్వ్ దేశ్ కా గర్వ్’’.. అలాగే, మొదటిసారి ఓటర్లను పోలింగ్‌లో పాల్గొనేలా ప్రోత్సహించడానికి ‘‘మేరా పెహలే ఓట్ దేశ్కే లియే’’ నినాదాలతో ప్రచారాలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ప్రభావితం చేసే వ్యక్తులు, సెలబ్రిటీల ద్వారా ఓటర్లలో అవగాహన కల్పించేందుకు స్మార్ట్ ఫిల్మ్‌ల ద్వారా ‘నా ఓటు నా డ్యూటీ’ అంటూ కూడా ప్రచారం కల్పించాలని తెలిపింది. ఎన్నికల ప్రక్రియ మరింత సమ్మిళితంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది. రాష్ట్రంలో 83 శాతం పోలింగ్ లక్ష్యం ఇదిలా ఉంటే.. 2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 79 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి 83 శాతం లక్ష్యంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం చర్యలు చేపడుతోంది. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 70 శాతంలోపే పోలింగ్ నమోదైంది. ఇప్పుడు ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు. 85 ఏళ్ల పైబడిన ఓటర్లు, అంగవైకల్యం వారికి పోస్టల్ బ్యాలెట్ ఇక రాష్ట్రంలో మే 13న జరగనన్ను ఎన్నికల్లో 85 పైబడిన వారు, శారీరక వైకల్యం ఉన్న ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ జారీకి కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ జారీచేసింది. అలాగే, కోవిడ్ సోకిన వారికి కూడా పోస్టల్ బ్యాలెట్ జారీకి కూడా మరో నోటిఫికేషన్ జారీచేసింది. రాష్ట్రంలో 85 ఏళ్లు దాటిన ఓటర్లు 2,12,237 మంది ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా హోం ఓటింగ్ అనేది వీరికి ఐచ్ఛికం. పోలింగ్ కేంద్రానికి వచ్చి కూడా ఓటు వేయవచ్చు. ఒకసారి పోస్టల్ బ్యాలెట్ కోసం ఫాం–12 పూరించి రిటర్నింగ్ అధికారికి ఇచ్చాక, ఆయన పోస్టల్ బ్యాలెట్‌కు అనుమతించిన తరువాత అలాంటి వారు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయడానికి అవకాశం ఉండదు. అలాగే, శారీరక వైకల్యం ఉన్న ఓటర్లు కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా హోం ఓటింగ్‌కు చేసేందుకు అవకాశం ఉంటుంది. శారీక వైకల్యం నిర్ధారించిన మేరకు ఉంటేనే రిటర్నింగ్ అధికారి పోస్టల్ బ్యాలెట్ జారీకి అనుమతిస్తారు. ఇక పోస్టల్ బ్యాలెట్‌కు అనుమతి పొందిన వారు పోలింగ్ తేదీకి పది రోజుల ముందే వారి ఇంటి వద్దే ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు. వీడియోగ్రాఫర్‌తో సహా ఐదుగురు పోలింగ్ సిబ్బంది వారి ఇంటికి వెళ్లి ఓటు వేయిస్తారు. ఆ బ్యాలెట్‌ను రెండు కవర్లలో ఉంచి పోలింగ్ బ్యాక్సులో వేస్తారు. -
ఎన్నికల బృహత్ పర్వం!
ప్రజాస్వామ్యానికి పండుగ లాంటి ఎన్నికల సమయం వచ్చింది. దేశవ్యాప్త సార్వత్రిక ఎన్నికలకూ, అదే విధంగా మరో 4 రాష్ట్రాల శాసనసభల ఎన్నికలకూ శనివారం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ ప్రకటించడంతో ఒక బృహత్ యజ్ఞానికి అంకురార్పణ జరిగింది. ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యంలో మరో నెల రోజుల పైచిలుకులో తొలి దశతో సుదీర్ఘ ఎన్నికల పర్వం ఊపందు కోనుంది. ఇదే ఏడాది అమెరికా సహా పలు భారీ ప్రజాస్వామ్య దేశాలు ఎన్నికలకు సిద్ధమవుతుండగా, 96.9 కోట్ల మంది రిజిస్టర్డ్ ఓటర్లతో మన దేశం సంఖ్యాపరంగా అన్నిటి కన్నా ముందు వరుసలో ఉంది. అలాగే, మిగిలిన దేశాలతో పోలిస్తే సుదీర్ఘంగా ఈ ప్రక్రియ సాగనుంది. దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలు సైతం ఇలాగే సుదీర్ఘంగా సాగాయి. 489 స్థానాలకు గాను మొత్తం 68 దశల్లో అప్పట్లో ఎన్నికలు జరిగాయి. ఆ తరువాత మళ్ళీ అంత సుదీర్ఘంగా సాగుతున్నవి ఈ సార్వత్రిక ఎన్నికలే. ఈ ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 44 రోజుల వ్యవధిలో ఈ హంగామా కొనసాగుతుంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. దాంతో రానున్న రెండున్నర నెలలు వేసవి వేడితో పాటు దేశమంతటా ఎన్నికల ఉష్ణోగ్రతలు పెరిగిపోనున్నాయి. ఇవి యువతరం ఎన్నికలు కావడం విశేషం. ఓటర్లలో 29 శాతం మంది 18 నుంచి 29 ఏళ్ళ మధ్యవయసు యువతరమే. 2660 రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు పాల్గొనే ఈ ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి కూడా! అధికారికంగా అభ్యర్థులకు ఎన్నికల వ్యయ పరిమితులు విధించారన్న మాటే కానీ, పార్టీల ప్రచారం సహా ఈ ఎన్నికల తతంగం మొత్తం ఖర్చు దాదాపు రూ. 1.2 లక్ష కోట్లు దాటుతుందని లెక్క. ఏకంగా 15,256 అడుగుల ఎత్తైన ప్రాంతంలోనూ పోలింగ్ కేంద్రం నిర్వహిస్తున్న బృహత్తర ప్రక్రియ ఇది. వెబ్సైట్లు, సోషల్ మీడియా, ఫోన్–ఇన్ ప్రచార సాధనాలతో వర్చ్యువల్ ప్రచారం ప్రబలిన ఆధునిక కాలమిది. ఓటింగ్‌కు 48 గంటల కన్నా ముందే ప్రచారం ఆపాలి, అంశాల ప్రాతిపదికన – కులమతాలకూ, విద్వేషానికీ దూరంగా ప్రచారం సాగాలి లాంటి నిబంధనల్ని ఆచరణలో పెట్టించడం ఈసీకి కష్టమే. అలాగే 1999లో 29 రోజులతో మొదలై గత 2019లో 39, ఈసారి 44 రోజులకూ వ్యాపిస్తూ పోతున్న ఎన్నికల ప్రక్రియ ప్రభుత్వ యంత్రాంగం చేతిలో ఉండే పాలకపక్షాలకు వాటంగా మారుతుందని ఆరోపణలొస్తున్నాయి. షెడ్యూల్ ప్రకటన ఫలితంగా తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రావడంతో ఈసీ క్రియాశీలక పాత్ర మొదలైంది. తాజాగా సోమవారం గుజరాత్, యూపీ సహా అరడజనుల రాష్ట్రాల్లో హోమ్‌శాఖ కార్యదర్శులను తొలగిస్తూ ఈసీ కౌరడా జుళిపించింది. పశ్చిమ బెంగాల్లో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడైన డీజీపీపై వేటు వేసింది.ఎన్నికలు నిష్పక్ష పాతంగా సాగాలంటే, ఆయా ప్రాంతాల్లో పాలకపక్ష అనుకూలురని పేరుబడ్డ అధికారులకు చెక్ చెప్పడం సమంజసమే, స్వాగతించాల్సిందే. అయితే, అనేక సందర్భాల్లో కేంద్రంలోని పాలక వర్గాల చేతిలోని సంస్థగా ఈసీ వ్యవహరిస్తోందని ఆరోపణలు వింటూనే ఉన్నాం. అవన్నీ నిరాధారమని మాటలతో కన్నా చేతల ద్వారా తేల్చడమే ఈసీ ముందున్న మార్గం. ఈసీ స్వతంత్ర ప్రతిపత్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఒకప్పటి కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్‌ను ఆదర్శంగా నిలుపుకోవాలి. పాలకుల కన్నా ప్రజలకు జవాబుదారీగా ఈసీ నిలబడాలి. డబ్బు, అధికారం లేనివారు సైతం ఎన్నికల బరిలో స్వేచ్ఛగా పోటీ చేసే ఆరోగ్యకర వాతావరణం కల్పించాలి. దురదృష్టవశాత్తూ పరిస్థితులన్నీ ఆ ఆదర్శాలకు తగ్గట్టు ఉన్నాయన్న భరోసా ఇప్పటికీ పూర్తిగా కలగడం లేదు. ఈ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్న సమయంలోనే దేశంలో ఒకటికి రెండు కీలక పరిణామాలు సంభవించాయి. రహస్యమయమైపోయిన ఎన్నికల బాండ్లలో దాతలు, గ్రహీతల (పార్టీల) వివరాలు వెల్లడించాలని సర్వోన్నత న్యాయస్థానం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)ని ఆదేశించాల్సి వచ్చింది. మరోపక్క మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలోని కమిటీ ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ అంశంపై వేలకొద్దీ పేజీల నివేదిక సమర్పిస్తూ, లోక్‌సభకూ, రాష్ట్రాల శాసనసభలకూ ఏకకాలంలో ఎన్నికలు జరగాలని సిఫార్సు చేసింది. ఇంకొకపక్క కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామక విధానంలో సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి భాగం లేకుండా ప్రభుత్వం ఆ మధ్య చేసిన మార్పులు సైతం మరోసారి తెర మీదకు వచ్చాయి. ఈ పరిణామాలన్నీ ఒక రకంగా భారత ప్రజాస్వామ్య ప్రస్థానం నునుపైన జారుడు శిఖరం మీద సాగుతున్న అంశాన్ని పట్టిచూపాయి. రానున్న కాలంలో ఈ ప్రయాణం ఇంకెంత సంక్లిష్టం కానున్నదో చెప్పకనే చెప్పాయి. బాండ్ల సాక్షిగా పారిశ్రామిక వర్గాలకూ, రాజకీయాలకూ మధ్య రహస్యబంధం అంతకంతకూ బలపడుతున్న వేళ, దేశమంతా ఒకేసారి ఎన్నికలతో సమస్తం కేంద్ర పాలకుల కనుసన్నల్లోకి మార్చాలని చూస్తున్న వేళ... రానున్న ఎన్నికల్లో ప్రజలెన్నుకొనే ప్రభుత్వాలు కీలకం కానున్నాయి. ‘‘చరిత్ర కూడలిలో నిల్చొని, ఏ మార్గంలో వెళ్ళాలో ఎంచుకోవాల్సిన పరిస్థితి ప్రతి జాతికీ ఒకానొక దశలో వస్తుంది’’ అని భారతదేశానికి రెండో ప్రధాన మంత్రి అయిన లాల్‌బహదూర్ శాస్త్రి ఒక సందర్భంలో అన్నారు. ఆ మార్గాన్ని బట్టే భవితవ్యం ఉంటుంది. ప్రజాస్వామ్య భారతావని తన ప్రయాణంలో ఇప్పుడు సరిగ్గా అదే స్థితిలో ఉంది. ఈ ఎన్నికలలో ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా ఎంచు కొనే మార్గం పౌరుల మొదలు న్యాయవ్యవస్థ, ప్రభుత్వ అధికార వ్యవస్థ, మీడియా దాకా సమస్తాన్నీ ప్రభావితం చేయనుంది. అందుకే, సరైన మార్గాన్ని ఎంచుకోవడం అత్యవసరం. సరైన ఎంపిక సాగాలంటే, అలక్ష్యం చేయకుండా విలువైన ఓటుహక్కును వినియోగించుకోవడమే సాధనం. -
ఫెడ్ నిర్ణయాలు కీలకం
ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య పరపతి నిర్ణయాలు, ప్రపంచ పరిణామాలు ఈ వారం స్టాక్ మార్కెట్ దిశానిర్దేశం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆయా దేశాల స్థూల ఆర్థిక గణాంకాలు, విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి అంశాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల తేదీ ప్రకటన తర్వాత ఇన్వెస్టర్లు సార్వత్రిక ఎన్నికల పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలింవచ్చు. వీటితో పాటు రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. ‘‘స్మాల్, మిడ్ క్యాప్ ఫండ్ల నిర్వహణ సామర్థ్యాలను పరీక్షించేందుకు స్ట్రెస్ టెస్ట్ నిర్వహించాలని సెబీ ఆదేశాలు జారీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు లార్జ్ క్యాప్, రక్షణాత్మక షేర్ల పట్ల ఆసక్తి చూపొచ్చు. సాంకేతికంగా నిఫ్టీ బలహీనంగా ఉంది. నిర్ణయాత్మక తక్షణ మద్దతు 21,850 స్థాయిని కోల్పోతే దిగువ స్థాయిలో 21,450 స్థాయిని పరీక్షించవచ్చు’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ రిటైల్ హెడ్ సిద్ధార్థ ఖేమా తెలిపారు. ఇంధన, రియలీ్ట, ఫైనాన్స్ రంగాలకు చెందిన చిన్న, మధ్య స్థాయిలకు షేర్లలో భారీ ఎత్తున అమ్మకాలు జరగడంతో సూచీలు గతవారంలో 2% మేర నష్టపోయాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 1476 పాయింట్లు, నిఫ్టీ 470 పాయింట్లు పతనమయ్యాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 2,641 పాయింట్లు, మిడ్ క్యాప్ ఇండెక్స్ 1602 పాయింట్లు చొప్పున క్షీణించాయి. ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయ ప్రభావం అగ్ర రాజ్యం అమెరికా సెంట్రల్ బ్యాంక్ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం మంగళవారం(మార్చి 19న) ప్రారంభమవుతుంది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ బుధవారం(20న)రోజున ప్రకటిస్తారు. ఫిబ్రవరి అమెరికా కన్జూమర్ ఇండెక్స్, ద్రవ్యోల్బణం అంచనాలకు మించి నమోదుకావడంతో ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్ల(5.25 – 5.5%) యథాతథంగా ఉంచొచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అయితే బాండ్ల కొనుగోలు, ఆర్థిక వ్యవస్థ పనితీరుపై పావెల్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనని ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు ఆసక్తి ఎదురుచూస్తున్నాయి. ఫెడ్ రిజర్వ్ ద్రవ్య విధాన వైఖరికి ముందు కొందరు ట్రేడర్లు తమ పొజిషన్లను వెనక్కి తీసుకోవచ్చు. ప్రపంచ పరిణామాలు అమెరికా ఫెడ్ రిజర్వ్ తో పాటు బ్యాంక్ ఆఫ్ జపాన్(మార్చి 19), బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్(మార్చి 21) ద్రవ్య విధానాలు వెల్లడి కానున్నాయి. అలాగే చైనా ఐదేళ్ల రుణ పరపతి రేటు ప్రకటించనుంది. దీంతో ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవచ్చు. బ్రిటన్ ప్రొడక్టర్ ప్రైస్ ఇండెక్స్, తయారీ, సేవారంగ పీఎంఐ గణాంకాలు వెల్లడి కానున్నాయి. యూరోజోన్ ద్రవ్యోల్బణం, వాణిజ్య లోటు, చైనా రిటైల్ సేల్స్, నిరుద్యోగ డేటాలు ఇదే వారంలో వెల్లడి కానున్నాయి. మార్చి ప్రథమార్థంలో రూ.40 వేల కోట్ల పెట్టుబడులు విదేశీ ఇన్వెస్టర్లు ఈ మార్చి ప్రథమార్థంలో రూ.40,710 కోట్ల భారత ఈక్విటీలు కొన్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటం, దేశీయ స్థూల ఆర్థిక వృద్ధి సానుకూల అంచనాలు ఇందుకు ప్రధాన కారణాలని మార్కెట్ నిపుణులు తెలిపారు. అమెరికా బాండ్లపై రాబడులకు అనుగుణంగా విదేశీ ఇన్వెస్టర్లు తమ వ్యూహాన్ని మార్చుకుంటున్నారు. తాజాగా ద్రవ్యోల్బణ పెరగడంతో బాండ్లపై రాబడులు స్వల్పంగా పెరుగుతున్నాయి. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ నికర విక్రయదారులుగా మారే అవకాశం ఉంది. -
బాండ్లతో బీజేపీకి రూ.6,986 కోట్లు
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్లతో అధికార బీజేపీ అత్యధికంగా లబ్ధి పొందినట్లు వెల్లడయ్యింది. కమలం పార్టికి ఈ బాండ్ల ద్వారా ఏకంగా రూ.6,986.5 కోట్లు అందినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేసింది. ఎన్నికలబాండ్లపై పార్టిలు గత నవంబర్‌లో ఇచి్చన సమాచారాన్ని ఆదివారం తన వెబ్సైట్లో అందుబాటులోకి తెచి్చంది. పశి్చమ బెంగాల్లో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌కు రూ.1,397 కోట్లు, కాంగ్రెస్‌కు రూ.1,334 కోట్లు, భారత రాష్ట్ర సమితికి రూ.1,322 కోట్లు, బిజూ జనతాదళ్‌కు రూ.944.5 కోట్లు, డీఎంకేకు రూ.656.5 కోట్లు బాండ్ల రూపంలో అందినట్లు ఈసీ డేటాను బట్టి తెలుస్తోంది. బాండ్ల కొనుగోలుదార్లలో ఫ్యూచర్ గేమింగ్, హోటల్ సరీ్వసెస్ సంస్థ అధినేత, లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ అగ్రస్థానంలో నిలిచాడు. రూ.1,368 కోట్ల విలువైన బాండ్లు కొనుగోలు చేశాడు. ఇందులో 37 శాతానికిపైగా, అంటే రూ.509 కోట్లను డీఎంకేకు అందజేశాడు. డీఎంకేకు మేఘా ఇంజనీరింగ్ రూ.105 కోట్లు, ఇండియా సిమెంట్స్ రూ.14 కోట్లు, సన్ టీవీ నెట్వర్క్ రూ.100 కోట్లు సమరి్పంచుకున్నాయి. అన్నాడీఎంకేకు ఇండియా సిమెంట్స్ యాజమాన్యంలోని ఐపీఎల్ టీం చెన్నై సూపర్ కింగ్స్; జేడీ(ఎస్)కు ఆదిత్య బిర్లా గ్రూప్, ఇన్ఫోసిస్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్, మేఘా ఇంజనీరింగ్, ఎంబసీ గ్రూప్; ఆప్‌కు బజాజ్, కేఎంజెడ్ ఇన్వెస్ట్మెంట్స్, ఎన్‌జేకే, బీజీ షిర్కే, టొరెంట్ ఫార్మా; జేడీ(యూ)కు భారతీ ఎయిర్టెల్, శ్రీ సిమెంట్స్; ఎన్సీపీకి నియోటియా ఫౌండేషన్, భారతీ ఎయిర్టెల్, సైరస్పూనావాలా, బజాజ్ ఫిన్సర్వ్, ఒబెరాయ్ రియాల్టీ తదితర సంస్థలు విరాళాలిచ్చాయి. బాండ్ల రూపంలో తమకు ఏయే సంస్థ/వ్యక్తుల నుంచి ఎంతెంత విరాళాలు వచ్చాయో బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ ఈసీకి తెలియజేయలేదు. ఏడీఆర్ గణాంకాల ప్రకారం బీజేపీకి మొత్తం 7,700 కోట్ల విరాళాలు అందాయి. బాండ్ల ద్వారా తమకెలాంటి నిధులూ రాలేదని సీపీఎం, బీఎస్పీ, మజ్లిస్ ప్రకటించాయి. ఈసీ డేటా ప్రకారం బాండ్ల ద్వారా అత్యధిక నిధులు అందుకున్న పారీ్టలు పార్టీ నిధులు బీజేపీ రూ.6,986.5 కోట్లు టీఎంసీ రూ.1,397 కోట్లు కాంగ్రెస్ రూ.1,334 కోట్లు బీఆర్ఎస్ రూ.1,322 కోట్లు -
తేలు కుట్టిన దొంగ రామోజీ
కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించడానికి తీసుకున్న గడువు చూస్తే, మన దేశం ఇంకా ఎంతో వెనుకబడి ఉందన్న భావన కలుగుతుంది. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్‌లో ఎన్నికల ప్రక్రియ సుమారు రెండునర్నర నెలలు తీసుకుంటే ప్రజలకు వచ్చే ఇబ్బందులు, కష్టనష్టాల గురించి ఆలోచించినట్లు అనిపించదు. మండుటెండలో ప్రజలు నీటి కోసం బాగా ఇబ్బంది పడే రోజుల్లో ఎన్నికలు పెట్టడానికి ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ఇవ్వడం అంత బాగోలేదని చెప్పాలి. అంతా కలిపి మహా అయితే నెలన్నరలో పూర్తి చేసే విధంగా ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించకపోవడం కమిషన్ వైఫల్యం అనిపిస్తుంది. లేదా రాజకీయ జోక్యం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందేమోనన్న అభిప్రాయం కలుగుతుంది. ఒక ఎన్నికల కమిషనర్ పోస్టు ఖాళీగా ఉండటం, మరో కమిషనర్ రాజీనామా చేయడం, కేంద్ర ప్రభుత్వం హడావుడిగా ఇద్దరు కమిషనర్లను నియమించడం.. వీటన్నిటిని చూస్తే ఎన్నికల కమిషన్‌లో పరిస్థితి సవ్యంగా ఉన్నట్లు అనిపించదు. గతంలో ఒకప్పుడు ఒకరే ఎన్నికల కమిషనర్ ఉండేవారు. శేషన్ ఎన్నికల కమిషనర్‌గా ఉన్నప్పుడు అప్పటి పీవీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను త్రిసభ్య కమిషన్‌గా మార్చింది. శేషన్ అందరిలోనూ దడ పుట్టించారంటే అతిశయోక్తి కాదు. ఆ సంగతి ఎలా ఉన్నా, కొత్త కమిషనర్లు వచ్చే వరకు షెడ్యూల్‌ను ప్రకటించకుండా ఆపవలసిన అవసరం ఏమిటో అర్ధం కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని వివిధ ప్రాంతాలలో పర్యటించిన తర్వాత కానీ షెడ్యూల్ ప్రకటించరన్న అభిప్రాయం ఉంది. అలాగే ఆయన సదుపాయార్దం సాధ్యమైనంత ఎక్కువ చోట్ల ప్రచార ప్రసంగాలు చేయడానికి కూడా వెసులుబాటుగా ఇలా ఏడు దశలలో నిర్ణయిస్తున్నారని విపక్షం విమర్శిస్తోంది. దీనిని ఎన్నికల కమిషన్ ఒప్పుకోకపోయినా, ప్రజలకు సందేహాలు రావడానికి అవకాశం ఉంది. ఒక రకంగా ఇది రాజకీయమే అని అనుకోవచ్చు. దానికి తగినట్లుగానే షెడ్యూల్‌ను వారం రోజులు లేటు చేయడం, మండుటెండల్లో ఎన్నికలు నిర్వహించడం రాజకీయ పార్టీలకు పెద్ద సమస్యే అని చెప్పాలి. ఎన్నికలకు సిద్దమైన అభ్యర్ధులకు మరో నెల అదనంగా వ్యయ ప్రయాసలకు సిద్దం కావాలి. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. ఏపీలో 2019లో ఏప్రిల్ పదకొండో తేదీన ఎన్నికలు జరిగిపోయాయి. తొలి దశలో ఎన్నికలు పూర్తి అయితే, ఈసారి మాత్రం నామినేషనే ఏప్రిల్ 18న మొదలు కాదు. గతానికి భిన్నంగా నాలుగో దశలో ఏపీ శాసనసభ, పార్లమెంటు ఎన్నికలను, తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలను నిర్వహిస్తున్నారు. అంటే ఇప్పటి నుంచి రెండు నెలలపాటు రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం చేసుకోవలసి ఉంటుంది. దీనిపై కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. బీజేపీతో కూటమి కట్టాక, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఏమైనా మేనేజ్ చేసి ఈ ఎన్నికలను నాలుగో దశలో పెట్టించారా? అన్న సందేహాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో ఆయనకు ఉన్న నైపుణ్యం మరెవరికి లేకపోవడమే ఈ డౌటుకు కారణం. టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడి చాలా రోజులైనా, బీజేపీ కొద్ది రోజుల క్రితమే క్లియర్ చేసింది. టీడీపీ, జనసేనల క్యాడర్ మధ్య ఏర్పడిన అంతరం, గొడవలు సర్దుబాటు చేసుకోవడమే సమస్యగా ఉంది. బీజేపీ కూడా కలిశాక ఈ వివాదాలు మరింత పెరిగాయి. ఏపీ బీజేపీ సీనియర్ నేతలు కొందరు పార్టీ అధిష్టానానికి లేఖ రాస్తూ, బీజేపీకి టీడీపీ మళ్లీ వెన్నుపోటు పొడుస్తోందని విమర్శించారు. ఈ గొడవలన్నీ సెటిల్ కావడానికి మరికొంత టైమ్ పట్టవచ్చు. ప్రధాని మోదీ 17వ తేదీన చంద్రబాబు, పవన్‌తో కలిసి చిలకలూరిపేట వద్ద సభ జరిపే రోజుకు కూడా అసలు బీజేపీ అభ్యర్ధులనే ప్రకటించలేదు. ఈ నేపధ్యంలో చంద్రబాబు లేదా బీజేపీ పెద్దలు ఏపీలో ఎన్నికలను నాలుగోదశకు మార్చేలా చూశారా అన్న ప్రశ్నను కొందరు సంధిస్తున్నారు. ఏది ఏమైనా ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం వల్ల ఏపీ, తెలంగాణలలో రాజకీయ పార్టీలకే కాక, ప్రజలకు కూడా ఈ ఎన్నికలు ఒక పరీక్షగా మారతాయి. ప్రభుత్వాలు ముఖ్యమైన ప్రతీ పనికి ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవలసి ఉంటుంది. అది కూడా ఇబ్బందిగానే ఉండవచ్చు. పార్టీలపరంగా చూస్తే ముఖ్యమంత్రి, వైఎఎస్సార్సీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సింపుల్‌గా ఎన్నికల తేదీ పేర్కొని సిద్దం అని రాసి హుందాగా కామెంట్ చేస్తే, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం యధాప్రకారం వైఎస్సార్సీపీపై విమర్శలు గుప్పించారు. ఏదో స్వాతంత్ర్య పోరాటమని, ప్రజల కోసమని, రాష్ట్ర విముక్తి అంటూ ఏవేవో వ్యాఖ్యలు చేశారు. గతసారి ప్రజలు తెలుగుదేశంను తిరస్కరించారని అంటే చంద్రబాబును వదలించుకోవాలని అనుకున్నారని ఎవరైనా అంటే చంద్రబాబు ఒప్పుకుంటారా అన్న ప్రశ్న వస్తుంది. తాను ఏది చేసినా ఒప్పు అయినట్లు మాట్లాడడంలో, ఎదుటివారు ఏది చేసినా తట్టెడు బురద వేయడంలో చంద్రబాబు దిట్ట అని చెప్పాలి. తాజాగా ఒంగోలు వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డిలను టీడీపీలో చేర్చుకుని స్వాగతం చెప్పారు. విశేషం ఏమిటంటే డిల్లీ లిక్కర్ స్కామ్‌లో వీరిద్దరి పాత్ర ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభియోగం మోపింది. రాఘవరెడ్డి కొన్ని నెలలపాటు జైలులో కూడా ఉన్నారు. మాగుంటకు వైఎస్సార్సీపీ టిక్కెట్ ఇవ్వరాదని నిర్ణయించుకుంది. ఈయన వైఎస్సార్సీపీలో ఉన్నప్పుడు తెలుగుదేశం మద్దతు పత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియాలలో వారిపై ఎన్ని వ్యతిరేక వార్తలు రాశారో గుర్తు చేసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. వీరికి వైఎస్సార్సీపీ టిక్కెట్ ఇచ్చి ఉంటే చంద్రబాబు విరుచుకుపడేవారు. స్కామ్‌లు చేసినవారికి టిక్కెట్లు ఇచ్చారని ద్వజమెత్తేవారు. కానీ, ఇప్పుడు ఆయనే పార్టీలో చేర్చుకున్నారు. ఒంగోలు ఎంపీ టికెట్ కూడా ఇస్తారేమో చూడాలి. దీనిని బట్టి ఏమి అర్ధం అవుతుంది. తాము చేస్తే సంసారం, ఎదుటివారు చేస్తే వ్యభిచారం అని చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటివారు ప్రచారం చేస్తారని తేలుతుంది. మాగుంట ఈడీ విచారణ ఎదుర్కుంటున్న రోజుల్లో ఈనాడులో ఎన్నో వ్యతిరేక కథలు రాసిన రామోజీ ఇప్పుడు తేలు కుట్టిన దొంగ మాదిరి కిక్కురుమనడం లేదు. ఏపీలో ఒక నెల రోజులు ఆలస్యం అయినా అధికార పార్టీకి పెద్ద ఇబ్బంది ఉండదు. చంద్రబాబు వంటివారు ఏదో భయపడి ఒకవేళ ఎన్నికలను జాప్యం చేయించినా, దాని ప్రభావం టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్ధులపై కూడా పడుతుంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా సిద్దం అని సీఎం జగన్ ప్రకటించి విపక్షాలకు సవాలు విసిరారని చెప్పాలి. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
సగం బాండ్ల నిధులు బీజేపీకే
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకంతో అధికార బీజేపీకి అత్యధికంగా నిధులు సమకూరినట్లు వెల్లడయ్యింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరెవరు ఎంతెంత బాండ్లు కొన్నారు? ఏ పార్టీలకు ఎంతెంత వచ్చింది? అనే వివరాలను ఎన్నికల కమిషన్‌కు తెలియజేసింది. ఈసీ ఈ జాబితాలను తమ వెబ్సైట్లో పెట్టి బహిరంగపరచింది. దీని ప్రకారం మొత్తంగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకూ ఎన్నికల బాండ్ల రూపంలో రూ.12,999 కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో అందాయి. దీన్లో 46.7 శాతం... అంటే దాదాపుగా సగం అధికార బీజేపీ ఖాతాలోకే వచ్చాయి. రూ.6,060 కోట్ల విలువైన బాండ్లు బీజేపీ ఖాతాలోకి రాగా... ఆ తరవాతి స్థానాల్లో రూ.1,609 కోట్లతో తృణమూల్ కాంగ్రెస్, రూ.1,421 కోట్లతో కాంగ్రెస్ పార్టీ, రూ.1,214 కోట్లతో బీఆర్ఎస్, రూ.775 కోట్లతో బిజూ జనతా దళ్, రూ.639 కోట్లతో డీఎంకే వరుసగా నిలిచాయి. సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు మేరకు గురువారం సాయంత్రం ఈసీ తమ అధికారిక వెబ్సైట్లో రెండు భాగాలుగా ఈ వివరాలను పొందుపరిచింది. మొదటి భాగంలో బాండ్లు కొనుగోలు చేసినవారి వివరాలు, వాటి విలువ, రెండో భాగంలో ఆయా బాండ్లను నగదుగా మార్చుకున్న పార్టీల వివరాలు తేదీలతో సహా ఉన్నాయి. తమిళనాడుకు చెందిన ఫ్యూచర్ గేమింగ్, హోటల్ సరీ్వసెస్ అనే సంస్థ అత్యధిక విలువైన బాండ్లు కొనుగోలు చేసి టాప్–1గా నిలిచింది. కోయంబత్తూరుకు చెందిన ఈ సంస్థ రూ.1,368 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేయగా... హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా సంస్థ రూ.966 కోట్లు, దాని అనుబంధ సంస్థ వెస్టర్న్ యూపీ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ లిమిటెడ్ రూ.220 కోట్లు కలిపి మొత్తం రూ.1,186 కోట్ల విలువైన బాండ్లను కొని రెండో స్థానంలో నిలిచింది. రూ.వెయ్యి కోట్లను దాటి బాండ్లు కొనుగోలు చేసిన కంపెనీలు ఈ రెండే కాగా... వందల కోట్ల మేర భారీగా బాండ్లు కొనుగోలు చేసిన కంపెనీల జాబితాలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్, పిరమల్ ఎంటర్ప్రైజెస్, టోరెంట్ పవర్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, డీఎల్ఎఫ్ కమర్షియల్ డెవలపర్స్, ఎక్సెల్ మైనింగ్, వేదాంత లిమిటెడ్, అపోలో టైర్స్, లక్ష్మీ నివాస్ మిట్టల్, పీవీఆర్, సూలా వైన్స్, వెల్స్పన్, సన్ ఫార్మా తదితర ప్రఖ్యాత సంస్థలున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన యశోద హాస్పిటల్స్, నవయుగ ఇంజినీరింగ్, దివీస్ ల్యా»ొరేటరీస్, ఎన్సీసీ, నాట్కో ఫార్మా, అరబిందో ఫార్మా కూడా బాండ్లు కొనుగోలు చేసిన సంస్థల్లో ఉన్నాయి. ఎలక్టోరల్ బాండ్ల పథకం 2018లో అమల్లోకి వచ్చింది. వ్యక్తులు, వ్యాపార/వాణిజ్య సంస్థలు ఈ బాండ్లను కొనుగోలు చేసి, రాజకీయ పార్టీలకు అందజేశాయి. 2019 ఏప్రిల్ 1 నుంచి 2024 ఫిబ్రవరి 15వ తేదీ దాకా జారీ చేసిన బాండ్ల వివరాలను సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ఎస్బీఐ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
ఇన్ని రోజులు ఏం చేశారు?
సాక్షి, న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టిలు పొందిన విరాళాల వివరాలను మంగళవారం సాయంత్రంకల్లా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)కి సమరి్పంచాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం తేలి్చచెప్పింది. దీంతో మరింత గడువు కావాలంటూ కోర్టు మెట్లెక్కిన భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ)కి న్యాయస్థానంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ‘‘రాజకీయ పార్టిలు పొందిన విరాళాల సమగ్ర వివరాలను 12వ తేదీ పనిగంటలు ముగిసేలోగా ఈసీకి వెల్లడించాలి. తర్వాత అందరికీ బహిర్గతం చేయాలి’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ జేబీ పారి్ధవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల రాజ్యాంగ ధర్మాసనం ఎస్బీఐను ఆదేశించింది. మరోవైపు, మార్చి 15వ తేదీ సాయంత్రం ఐదు గంటలలకల్లా తమ అధికారిక వెబ్సైట్లో సమగ్ర వివరాలను పొందుపరచాలని ఈసీకి కోర్టు సూచించింది. బ్యాంక్‌కు ఆదేశాలు, గడువుకు సంబంధించి ఫిబ్రవరి 15వ తేదీన ఇచి్చన ఉత్తర్వుల ఉల్లంఘనకు బ్యాంక్ పాల్పడితే బ్యాంక్‌పై చర్చలు తీసుకునేందుకు వెనకాడబోమని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎలక్టోరల్ బాండ్ల విధానం రాజ్యాంగవిరుద్ధమని పేర్కొంటూ ఆ పద్దతిని రద్దుచేస్తూ ఐదుగురు సభ్యుల రాజ్యాంగధర్మాసనం ఫిబ్రవరిలో చరిత్రాత్మక తీర్పునివ్వడం తెల్సిందే. 2019 ఏప్రిల్ 12వ తేదీ నుంచి ఎస్బీఐ ద్వారా జరిగిన ఎలక్టోరల్ బాండ్ల అధికారిక కొనుగోలు, డిపాజిట్ లావాదేవీల వివరాలను మార్చి ఆరో తేదీలోపు ఈసీకి ఇవ్వాలని కోర్టు గతంలోనే ఆదేశించడం తెల్సిందే. దీంతోజూన్ 30వ తేదీకా గడువు పొడిగించాలని ఎస్బీఐ కోర్టును కోరడం, అలా గడవు కోరడాన్ని కోర్టు ధిక్కారణగా పరిగణించాలంటూ కోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలవడం తెల్సిందే. ఎస్బీఐ తరఫున సీనియర్ లాయర్ హరీశ్ సాల్వే వాదించారు. ‘‘ బాండ్లను కొనుగోలు చేసిన వారు, డిపాజిట్ చేసుకున్న వారి వివరాలు వేర్వేరుగా ఉన్నాయి. వాటిని సరిపోల్చి నివేదించాల్సిఉంది. వేర్వేరు చోట ఉన్న బ్రాంచీల్లో నిక్షిప్తమైన డేటాను సరిపోల్చేందుకు చాలా సమయంపడుతుంది. అందుకే గడువు పెంచండి’ అని కోరారు. ‘‘ విరాళాల దాతలు, గ్రహీతల వివరాలను సరిపోల్చి మ్యాచింగ్ వివరాలని ఇవ్వాలని మేం అడగలేదు. మీ దగ్గర ఉన్నది ఉన్నట్లుగా సీల్డ్ కవర్ లోంచి తీసి ఈసీకిస్తే చాలు’’ అని ఆదేశించింది. ‘‘ ఫిబ్రవరి 15న తీర్పు ఇచ్చాం. అంటే ఈ 26 రోజుల నుంచి ఏం చేసినట్లు? ఇంతకాలం మౌనంవహించి ఇప్పుడొచ్చి గడువు పెంచమంటారా? కోర్టు ఉత్తర్వులపై ఇంత నిర్లక్ష్యమా?’’ అని దుయ్యబట్టింది. స్వాగతించిన కాంగ్రెస్ సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్ స్వాగతించింది. భారీ కాంట్రాక్టులను సంపాదించేందుకు బీజేపీకి భారీగా విరాళాల విరాళాలిచ్చిన వారి వివరాలూ బయటికొచ్చేలా ఉత్తర్వులిస్తే బాగుండేదని పేర్కొంది. ‘‘స్విస్ ఖాతాల నుంచి కోట్ల నల్లధనం తెస్తామన్న వాళ్లే తమ సొంత ఖాతాల వివరాలు సుప్రీం కంటబడకుండా దాచేస్తున్నారు’’ అని ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. -
13 తర్వాత ఏ క్షణమైనా షెడ్యూల్!
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 13వ తేదీ తర్వాత ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎన్నికల సంసిద్ధతను పరిశీలించడానికి ఈసీ బృందం ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో పర్యటిస్తోంది. ఈ నెల 12, 13వ తేదీల్లో జమ్మూకశీ్మర్‌లో పర్యటించనుంది. ఈ పర్యటన ముగిసిన వెంటనే ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని ఈసీ వర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు, ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల తరలింపు, భద్రతా బలగాల మోహరింపు, సరిహద్దుల్లో పటిష్ట నిఘా వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో ఎన్నికల కమిషన్ సమీక్షలు పూర్తి చేసింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై ఎన్నికల సంఘం అధికారులు కేంద్రం హోం శాఖ అధికారులతో శుక్రవారం చర్చలు జరిపారు. దాదాపు 97 కోట్ల మంది ఓటర్ల కోసం దేశమంతటా దాదాపు 12.5 లక్షల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేలా కసరత్తు జరుగుతోంది. ఆరు నుంచి ఏడు విడతల్లో లోక్‌సభ ఎన్నికలను నిర్వహించేలా షెడ్యూల్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
నేడు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన!
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. ఈ ప్రక్రియలో కీలకమైన కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం గురువారం ఢిల్లీలో జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ భేటీలో పార్టీ మాజీ చీఫ్‌లు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అంబికా సోని పాల్గొననున్నారు. రాష్ట్రం నుంచి సీఈసీ సభ్యుడి హోదాలో రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ ఏర్పాటు చేసిన తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు హాజరు కానున్నారు. ఇప్పటికే పీసీసీల స్థాయిలో షార్ట్ లిస్ట్ అయిన ఆశావహుల జాబితా నుంచి వీలున్నన్ని పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడమే ఎజెండాగా ఈ సమావేశం జరగనుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. భేటీ అనంతరం దేశవ్యాప్తంగా 100 మందికి పైగా అభ్యర్థులతో వీలుంటే గురువారం నాడే లేదంటే శుక్రవారం తొలి జాబితా విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇక ఏకాభిప్రాయం సాధ్యమైతే తెలంగాణలోని దాదాపు అన్ని స్థానాలకు (ఒకట్రెండు మినహా) ఒకేసారి అభ్యర్థులను ప్రకటిస్తారని, లేదంటే 8 నుంచి 10 మంది అభ్యర్థులను ప్రకటిస్తారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. సికింద్రాబాద్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, కరీంనగర్, నిజామాబాద్ స్థానాలపై ఇప్పటికే ఏకాభిప్రాయం వచ్చిందని తెలుస్తోంది. మిగిలిన స్థానాలపై కూడా సీఈసీ సమావేశంలో చర్చించిన అనంతరం పలు ప్రాతిపదికల ఆధారంగా అభ్యర్థులను నిర్ణయిస్తారని సమాచారం. రాహుల్ పోటీపైనా స్పష్టత! రాష్ట్రం నుంచి రాహుల్‌గాంధీ పోటీ చేస్తారా లేదా? అన్నదానిపై కూడా ఈ సమావేశంలోనే స్పష్టత రానుంది. ఒకవేళ రాహుల్ పోటీ చేసే పక్షంలో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఏఐసీసీ అధికారికంగా విడుదల చేసే తొలి జాబితాలోనే ప్రకటించే అవకాశం ఉందని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. కానీ ఏఐసీసీ వర్గాల కథనాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆయన తిరిగి ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, కేరళలోని వయనాడ్ రెండింటి నుంచి పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇక ప్రియాంకగాంధీ.. తల్లి సోనియాగాంధీ ఐదుసార్లు గెలిచిన రాయ్‌బరేలీ నుండి పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. హస్తినకు ఆశావహులు సీఈసీ సమావేశం నేపథ్యంలో టికెట్ ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే అంచనాలున్న స్థానాల్లో తమ అభ్యర్థిత్వాలు ఖరారవుతాయో లేదోననే ఆసక్తితో కొందరు నేతలు ఢిల్లీ చేరుకున్నట్టు సమాచారం. వివిధ సర్వేల నివేదికలు, పార్టీ విధేయత ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉండనున్నట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసే అవకాశాలున్న తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, పంజాబ్ వంటి రాష్ట్రాల నుంచి తొలి జాబితాలో ఎక్కువమందికి అవకాశం ఉంటుందని తెలుస్తోంది. -
Election Commission: కులం, మతం, భాష పేరుతో ఓట్లడగొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: కులం, మతం, భాష ప్రాతిపదికన ఓట్లు అడగవద్దని, ఇతర మతాల దేవుళ్లను, దేవతలను కించపరచరాదని పార్టీలకు, నేతలకు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ శుక్రవారం అడ్వైజరీ విడుదల చేసింది. గతంలో నియమావళిని ఉల్లంఘించి నోటీసులందుకున్న స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థులు మరోసారి తప్పిదానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవంది. ప్రచార సమయంలో మర్యాదలు, సంయమనం పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రత్యర్థులను కించపరిచడం, అవమానించడం, సదరు పోస్ట్‌లను సోషల్ మీడియాలో షేర్ చేయడం కూడదని పేర్కొంది. విద్వేషానికి వ్యాఖ్యలకు పార్టీలు దూరంగా ఉండాలని కోరింది. ‘‘స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థులు నియమావళిని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉల్లంఘించరాదు. వీటిని నిశితంగా పరిశీలిస్తుంటాం. సమాజంలో వర్గ విభేదాలను, శత్రుత్వాన్ని పెంచే మాటలు, చర్యలకు దూరంగా ఉండాలి. ఓటర్లను తప్పుదోవ పట్టించే లక్ష్యంతో తప్పుడు ప్రకటనలు లేదా నిరాధార ఆరోపణలను ప్రచారం చేయవద్దు. వ్యక్తిగత దాడులకు దూరంగా ఉండాలి. దేవాలయం, మసీదు, చర్చి, గురుద్వారా లేదా మరే ఇతర ప్రార్థనా స్థలాలను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించరాదు’’ అని స్పష్టం చేసింది. మహిళల గౌరవం, గౌరవానికి భంగం కలిగించే ఎటువంటి చర్యలు లేదా ప్రకటనలను నివారించాలని ఈసీ కోరింది. సోషల్ మీడియాలో సంయమనం పాటించాలని, ప్రత్యర్థుల ప్రతిష్టకు భంగం కలిగించేలా పోస్ట్‌లను షేర్ చేయడం మానుకోవాలని పేర్కొంది. శుక్రవారం లఖ్‌నవూలో ఎన్నికల కాఫీ టేబుల్ బుక్ విడుదల చేస్తున్న సీఈసీ రాజీవ్ కుమార్ -
తహసీల్దార్లకు మినహాయింపు..
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల బదిలీల నుంచి తహసీల్దార్లను మినహాయించనున్నారు. ఈ బదిలీల విషయంలో స్పష్టత ఇస్తూ కేంద్రఎన్నికల సంఘం మంగళవారం జారీ చేసిన తాజా ఉత్తర్వులతో కేవలం ఆర్డీఓ స్థాయి వరకే బదిలీలు జరుగుతాయని రెవెన్యూ వర్గాలంటున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మూడేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న, లేదా సొంత జిల్లాల్లో పనిచేస్తున్న రెవెన్యూ సిబ్బందిని (తహసీల్దార్ స్థాయి వరకు) బదిలీ చేయాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల మేరకు పెద్దఎత్తున తహసీల్దార్ల బదిలీలు ఈ నెలలోనే జరిగాయి. అయితే, సొంత జిల్లా కాకుండా, సొంత లోక్‌సభ సెగ్మెంట్‌ను పరిగణనలోకి తీసుకొని.. ఆ సెగ్మెంట్లో పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలని ఇటీవల మళ్లీ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు రెవెన్యూశాఖ దాదాపు కసరత్తు పూర్తి చేసింది. లోక్‌సభ నియోజకవర్గ పరిధి ప్రకారం చూస్తే.. రాష్ట్రంలోని దాదాపు 600 మంది తహసీల్దార్లను మళ్లీ బదిలీ చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు త్వరలోనే ఉత్తర్వులు వెలువడాల్సి ఉండగా, తాజాగా ఈసీ జారీ చేసిన ఆదేశాలతో తహసీల్దార్ల బదిలీలకు రెండోసారి జరిపిన కసరత్తు నిలిచిపోయే అవకాశాలున్నాయని రెవెన్యూ సంఘాలు చెబుతున్నాయి. ఈసీ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రిటర్నింగ్ అధికారులు (ఆర్ఓ), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల (ఏఆర్ఓ) స్థాయి వరకే బదిలీలు చేయాల్సి ఉంటుందని, లోక్‌సభ ఎన్నికలకు ఆర్‌ఓలుగా జిల్లా కలెక్టర్లు, ఏఆర్ఓలుగా రెవెన్యూ డివిజనల్ అధికారులు (ఆర్డీఓ) వ్యవహరిస్తారని, ఆ స్థాయి వరకే బదిలీలుంటాయని అంటున్నాయి. దీంతో తహసీల్దార్ల బదిలీలు నిలిచిపోతాయని, ప్రస్తుతం జరిగిన బదిలీల మేరకు తహసీల్దార్లు సర్దుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈసీకి సీఎస్ లేఖ కాగా, సొంత లోక్‌సభ సెగ్మెంట్లోని రెవెన్యూ సిబ్బందిని బదిలీ చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేసేందుకు తగిన సమయం ఇవ్వాలని, లేదంటే తమను ఈ బదిలీల నుంచి మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈసీకి లేఖ రాసినట్టు సమాచారం. లోక్‌సభ నియోజకవర్గ నిబంధన ప్రకారం రెవెన్యూశాఖలోని 60 శాతం మంది సిబ్బందికి బదిలీలు చేయాల్సి వస్తోందని ఆ లేఖలో ఆమె వెల్లడించినట్టు తెలిసింది. తాజాగా ఈసీ జారీ చేసిన వివరణ నేపథ్యంలో తహసీల్దార్ల మలి బదిలీల ప్రక్రియ నిలిచిపోనుండగా, దాదాపు 40 మంది ఆర్డీఓలకు స్థానచలనం కలుగుతుందని, ఈ మేరకు నేడో, రేపో ఉత్తర్వులు వెలువడుతాయని రెవెన్యూవర్గాల ద్వారా తెలిసింది. -
ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్ట
సాక్షి, అమరావతి: వచ్చే సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో ధన ప్రవాహాన్ని నిలువరించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పటిష్ట చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో బ్యాంకుల లావాదేవీలపై ఆదాయ పన్ను శాఖ (ఐటీ) డేగ కన్నేసింది. రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీకి ఏక కాలంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బ్యాంకుల్లో నగదు లావాదేవీల సమాచారాన్ని ఆదాయ పన్ను శాఖకు అందించాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ అన్ని బ్యాంకులను ఆదేశించింది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకు బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరణలు, డిపాజిట్ల సమాచారాన్ని అన్ని బ్యాంకులు వెంటనే ఐటీ శాఖకు అందజేయాలని సూచించింది. ఒక్క రోజులో రూ.10 లక్షలు అంత కన్నా ఎక్కువ ఉపసంహరణ, డిపాజిట్లు, నెలరోజుల్లో రూ. 50 లక్షలకు పైగా ఉపసంహరణ, డిపాజిట్లపై రోజువారీ నివేదికలను ఐటీ శాఖకు అందజేయాలని ఆదేశించింది. ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలవారీగా బ్యాంకులన్నీ ఈ నివేదికలు పంపాలని స్పష్టం చేసింది. రూ. 2,000 కన్నా ఎక్కువగా డిజిటల్ బదిలీల సమాచారాన్ని కూడా ఐటీ శాఖకు పంపాలని తెలిపింది. ఒక ఖాతా నుంచి పలు ఖాతాలకు డిజిటల్ చెల్లింపులు, ఒక మొబైల్ నుంచి పలు మొబైల్ నంబర్లకు నగదు బదీలీల సమాచారాన్ని కూడా ఇవ్వాలని సూచించింది. వీటిపై క్షేత్రస్థాయిలో బ్యాంకుల సిబ్బందికి అవగాహన కల్పిచాలని తెలిపింది. ఎటువంటి అనధికార కార్యకలాపాలకు పాల్పడకుండా బ్యాంకులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. నగదు తరలింపును నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం పోలీసు, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, అటవీ శాఖలతో కలిపి 105 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, నిరంతరం తనిఖీలు చేస్తోంది. -
Lok Sabha elections 2024: సొంత జిల్లాల్లో ‘నో పోస్టింగ్’
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ అధికారుల బదిలీలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒక జిల్లాలో మూడేళ్లుగా పనిచేస్తున్న వారిని బదిలీపై అదే లోక్‌సభ స్థానం పరిధిలోని మరో జిల్లాకు పంపొద్దని పేర్కొంది. వారు ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయొచ్చనే కారణంతో ఈ నిర్ణయం తీసుకుంది. బదిలీల్లో ఈ నిబంధనను విధిగా పాటించాలని ఆదేశిస్తూ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. సొంత జిల్లాల్లో అధికారులకు పోస్టింగులు ఇవ్వకూడదని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల విధుల్లో ప్రత్యక్షంగా పాల్గొనే అధికారులను సొంత జిల్లాల్లో కొనసాగించరాదని ఉత్తర్వుల్లో పేర్కొంది. మూడేళ్లకు మించి ఒకే జిల్లాలో పనిచేస్తున్న అధికారులను కొనసాగించవద్దంటూ ఆదేశాలిచి్చంది. -
Maharashtra Politics: సుప్రీంకు వెళతాం: శరద్ పవార్
బారామతి(మహారాష్ట్ర): నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం, మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం అన్యాయపూరితమని ఆ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ శనివారం పేర్కొన్నారు. దీనిపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సారథ్యంలోని చీలికవర్గమే అసలైన ఎన్సీపీ అని, పార్టీ పేరు, ఎన్నికల గుర్తును కూడా అజిత్ పవార్ వర్గానికే కేటాయిస్తూ ఈసీతోపాటు స్పీకర్ నర్వేకర్ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. -
ఓటర్ల జాబితాలపై ‘సుప్రీం’ సంతృప్తి
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితాల తయారీ విషయంలో ఎన్నికల అధికారులపై నిత్యం అడ్డగోలు ఆరోపణలు చేస్తూ నానా యాగీ చేస్తున్న ఎల్లో మీడియా నోళ్లు మూయిస్తూ సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఓటర్ల జాబితాల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) తీసుకుంటున్న చర్యలపై సుప్రీంకోర్టు పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘం చర్యలు సంతృప్తికరంగా ఉన్నందున ఈ వ్యవహారంలో తదుపరి తమ నుంచి ఎలాంటి ఆదేశాలు అవసరం లేదని తేల్చి చెప్పింది. ఒక చిరునామా నుంచి మరో చిరునామాకు మారిన ఓటర్లు లేదా మరణించిన ఓటర్లు లేదా డూప్లికేట్‌గా నమోదైన ఓటర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించే విషయంలో చట్ట నిబంధనల మేరకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఎన్నికల సంఘం లిఖితపూర్వకంగా సమర్పించిన వివరాలు సంతృప్తికరంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఓటర్ల నమోదు ప్రక్రియ మొదలు, ఓటర్ల జాబితా సవరణ, తుది ఓటర్ల జాబితా తయారీ వరకు మొత్తం ప్రక్రియను అత్యంత పారదర్శకతతో చేపడుతున్నామన్న సీఈసీ వాదనతో సుప్రీం కోర్టు ఏకీభవించింది. ఓటర్ల జాబితా నుంచి తొలగించే ముందు చట్ట ప్రకారం వారికి నోటీసు ఇచ్చి వారి వివరణ తీసుకున్న తరువాతే తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా ఎన్నికల సంఘం చెప్పిన అంశాన్ని సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఎన్నికల సంఘం పారదర్శకంగా అన్ని చర్యలు తీసుకుంటున్నప్పుడు ఇక తదుపరి ఆదేశాలతో పనేముందని విచారణ సందర్భంగా పిటిషనర్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పిటిషనర్ సందేహాలను ఎన్నికల కమిషన్ నివృత్తి చేసిందని సుప్రీం కోర్టు గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో తమ ముందున్న వ్యాజ్యంతో తదుపరి విచారణ అవసరం లేదంది. ఓటర్ల జాబితా విషయంలో అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులను ప్రతివాదులుగా చేర్చడంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యలను ప్రశ్నిస్తూ ‘సన్సద్ బాచావో ట్రస్ట్’ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు పరిష్కరించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధనుంజయ్ చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జంషేడ్ బుర్జోర్ పార్థీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన విసృ్తత ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సన్సద్ బచావో ట్రస్ట్ పిటిషన్‌పై విచారణ రాజ్యాంగంలోని అధికరణ 324 ప్రకారం సవరణ ఓటర్ల జాబితాలను తయారు చేసేలా ప్రధాన ఎన్నికల అధికారులను ఆదేశించాలని, అలాగే చిరునామా మారిన, మరణించిన, డూప్లికేట్‌గా నమోదైన ఓటర్ల విషయంలో ప్రజాప్రాతినిధ్య చట్ట నిబంధనల ప్రకారం వ్యవహరించేలా కూడా ఆదేశాలు ఇవ్వాలంటూ సన్సద్ బాచావో ట్రస్ట్ 2023లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై సీజే నేతృత్వంలోని విస్తృత ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆరోరా వాదనలు వినిపిస్తూ.. డూప్లికేట్ ఓటర్ల విషయంలో ఎన్నికల అధికారులు సరిగ్గా స్పందించడం లేదన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది అమిత్ శర్మ స్పందిస్తూ.. డూప్లికేట్ ఓటర్లతో సహా ఓటర్ల జాబితా విషయంలో తాము తీసుకుంటున్న అన్ని చర్యలనూ వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పారు. ఇందుకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది. ‘చట్టానికి లోబడే చేస్తున్నాం’ ఈ నేపథ్యంలో అమిత్ శర్మ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ సమగ్ర కౌంటర్ దాఖలు చేశారు. అలాగే ఓ నోట్ కూడా ధర్మాసనం ముందుంచారు. సోమవారం ఈ వ్యాజ్యం విచారణకు వచ్చినప్పుడు సుప్రీం ధర్మాసనం ఆ నోట్‌ను క్షుణ్ణంగా పరిశీలించింది. చిరునామాలు మారడం, మరణించడం, భౌగోళికంగా ఒకే ప్రాంతంలో ఓటర్లుగా నమోదు కావడం వంటి విషయాల్లో తీసుకుంటున్న చర్యలను ఎన్నికల సంఘం తన కౌంటర్లో వివరించింది. చట్టానికి లోబడి తాము చేస్తున్న పనులన్నింటినీ కోర్టుకు తెలియచేసింది. ఓటర్ల జాబితా నుంచి ఎవరి పేరైనా తొలగించదలచుకుంటే వారికి నోటీసులు ఇచ్చి, అభ్యంతరాలు స్వీకరించి ఆ తరువాత మాత్రమే తదుపరి చర్యలు తీసుకుంటున్న విషయాన్ని సవివరంగా అత్యున్నత న్యాయస్థానానికి నివేదించింది. ప్రతి దశలో ఏం చేస్తున్నాయో తెలియజేసింది. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తున్న విషయాన్ని కూడా చెప్పింది. లోపాలన్నింటినీ సవరించిన తరువాతే తుది జాబితాను ప్రకటిస్తున్నామని స్పష్టం చేసింది. ఎల్లో మీడియా నిత్య రాద్ధాంతం ఏపీలో ఓటర్ల జాబితాల విషయంలో పెద్దఎత్తున అక్రమాలు జరిగిపోతున్నాయని, టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఇతర నేతలు చేసిన ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదంటూ ప్రతిరోజూ ఎల్లో మీడియా పుంఖానుపుంఖాలుగా కథనాలు వండివారుస్తోంది. రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందన్న ఆందోళనను ప్రజల్లో కలిగించేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. కొంతకాలంగా ఎన్నికల అధికారులను లక్ష్యంగా చేసుకుని అసత్యాలను ప్రచారం చేస్తోంది. ఎన్నికల అధికారులపై నిరాధార ఆరోపణలు చేయడానికి కూడా ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఓటర్ల జాబితాల తయారీ విషయంలో ఎన్నికల అధికారులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారంటూ నిరాధార ఆరోపణలు చేస్తోంది. రాష్ట్రంలో ఓటర్ల జాబితా తయారీలో స్వచ్ఛత లేదని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. అడ్డగోలుగా ఓటర్ల జాబితా నుంచి తొలగింపులు చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా ఉత్తర్వులు ఎల్లో మీడియాకు గట్టిగానే షాకిచ్చేవిగా ఉన్నాయి. మొత్తం ఓటర్లు 96.85కోట్ల మంది 2024 ఫిబ్రవరి 8వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా 96,85,01,358 మంది ఓటర్లు ఉన్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తన అఫిడవిట్లో సుప్రీం కోర్టుకు తెలిపింది. ఇందులో 49.70 కోట్లు పురుషులు కాగా.. 47.13 కోట్లు మహిళా ఓటర్లు ఉన్నారని వివరించింది. 48,057 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారని, దివ్యాంగ ఓటర్లు 88.24 లక్షలు ఉన్నారని వివరించింది. 18–19 సంవత్సరాల వయసు మధ్య 1.84 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని పేర్కొంది. 80 సంవత్సరాల పైబడిన వారు 1.86 కోట్లు ఉన్నారని వివరించింది. 100 ఏళ్లు దాటిన ఓటర్లు 2.40 లక్షల మంది ఉన్నారని తెలిపింది. 2024 స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఎస్ఆర్)లో కొత్తగా 2.63 కోట్ల మంది ఓటర్లుగా చేరారని వివరించింది. ఇందులో 1.41 కోట్ల మహిళలు ఉన్నారని కోర్టుకు తెలిపింది. కొత్తగా నమోదైన వారందరికీ ఫొటో గుర్తింపు కార్డులు ఇచ్చామని వివరించింది. 2024 ఎస్‌ఎస్‌ఆర్‌లో 1.65 కోట్ల మంది ఓటర్లను తొలగించడం జరిగిందని, ఇందులో 67.82 లక్షల మంది చనిపోయారని, 75.11 లక్షల మంది శాశ్వతంగా చిరునామాలు మారారని, 22.05 లక్షలు డూప్లికేట్ ఓటర్లు ఉన్నారని తెలిపింది. ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా సుప్రీం కోర్టుకు వివరించింది. పిటిషనర్ లేవనెత్తిన సందేహాలనూ నివృత్తి చేసింది. బహుళ ఎంట్రీలు, ఏకరూప ఫొటోలు, భౌగోళికంగా ఓ ప్రాంతంలో ఓటర్లుగా నమోదు కావడం వంటి విషయాల్లో ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని సీజే ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై తదుపరి ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదంది. ఈ ఉత్తర్వులతో సన్సద్ బచావో ట్రస్ట్ దాఖలు చేసిన వ్యాజ్యంలో ప్రొసీడింగ్స్‌ను మూసివేస్తున్నట్టు తెలిపింది. -
ఎన్నికల నిబంధనల మేరకే ఐపీఎస్‌ల బదిలీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీలపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఐపీఎస్ అధికారుల సంఘం మండిపడింది. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగానే బదిలీలు జరిగినట్లు సోమవారం ఓ ప్రకటనలో స్పష్టంచేసింది. శాంతిభద్రతల పరిరక్షణలో అహర్నిశలు శ్రమించే పోలీసుల నిస్వార్థ సేవలను, ప్రతిష్టను దెబ్బతీసేలా ఎల్లో మీడియా రాసిన కథనాలను తీవ్రంగా ఖండించింది. పోలీసులు తమ విధి నిర్వహణలో భాగంగా తీసుకునే చర్యలపై ఎవరికైనా అభ్యంతరాలుంటే సంబంధిత అధికారులను సంప్రదించి వాస్తవాలు తెలుసుకోవచ్చని సూచించింది. పోలీసు అధికారులపై నిరాధార ఆరోపణలు చేయడం సరైన చర్యకాదని హితవు పలికింది. పదేపదే బాధ్యతారాహిత్య కథనాలు ప్రచురిస్తే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వానికి పరిపాలన అవసరాలకు తగ్గట్లుగా ఐపీఎస్ అధికారుల బదిలీ, పోస్టింగులు చేసుకునే అధికారం ఉంటుందని స్పష్టంచేసింది. -
ఈసీ కొత్త మార్గదర్శకాలు తప్పక పాటించాలి
సాక్షి, విశాఖపట్నం/తిరుపతి సిటీ: రానున్న ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా జారీచేసిన మార్గదర్శకాలు, సూచనలను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టంచేశారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కెమికల్ ఇంజరింగ్ బ్లాక్‌లో లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గ ఆర్వోలు, ఏఆర్వోలకు నిర్వహిస్తున్న తొలి విడత శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. మీనా మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల గురించి అధికారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో 1,000 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ ఇచ్చేందుకు జాతీయస్థాయి మాస్టర్ ట్రైనర్లు వచ్చారని, వారి నుంచి ఎన్నికల ప్రారంభం నుంచి ముగిసే వరకు కొనసాగాల్సిన ప్రక్రియపై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలని, సందేహాలను నివృత్తి చేసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం మాస్టర్ ట్రైనర్ సమీర్ అహ్మద్ జాన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లిఖార్జున ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. డీఆర్వో కె.మోహన్‌కుమార్, విశాఖ, విజయనగరం, అనకాపల్లి, పాడేరు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల జాయింట్ కలెక్టర్లు, ఏఆర్వోలు హాజరయ్యారు. -
ప్రచార కార్యక్రమాల్లో పిల్లలు వద్దు
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచార పర్వంలో పిల్లజెల్లా ముసలిముతక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి భాగస్వాములను చేసే రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరికలు పంపింది. పోస్టర్లు అతికించడం, కరపత్రాలు పంచడం, ర్యాలీల్లో నినాదాలు ఇవ్వాలంటూ పిల్లలను ఎన్నికల ప్రచారానికి వాడుకోవద్దని పార్టీలకు ఈసీ స్పష్టంచేసింది. ఎన్నికల సంబంధ పనులు, కార్యక్రమాల్లో పార్టీలు పిల్లలను వాడుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనా ఉందంటూ రాష్ట్రాల ఎన్నికల అధికారులు, పోలింగ్ సిబ్బందికి మరోసారి గుర్తుచేసింది. ఎన్నికల పర్వంలో పిల్లలు ఎక్కడా కనిపించొద్దని, వారిని ఏ పనులకూ వాడుకోవద్దని రాజకీయ పార్టీలకు ఈసీ తాజాగా ఒక అడ్వైజరీని పంపింది. ‘‘బాల కార్మిక చట్టాలు ఖచ్చితంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత జిల్లా ఎలక్షన్ ఆఫీసర్, రిటర్నింగ్ ఆఫీసర్లదే. క్షేత్రస్థాయిలో ప్రత్యేకంగా ఈ బాధ్యతలు నెరవేర్చండి’’ అని ఈసీ పేర్కొంది. ‘‘ప్రచారంలో నేతలు చిన్నారులను ఎత్తుకుని ముద్దాడటం, పైకెత్తి అభివాదంచేయడం, వాహనాలు, ర్యాలీల్లో వారిని తమ వెంట బెట్టుకుని తిరగడం వంటివి చేయకూడదు. పిల్లలతో నినాదాలు ఇప్పించడం, పాటలు పాడించడం, వారితో చిన్నపాటి ప్రసంగాలు ఇప్పించడంసహా పార్టీ ప్రచారాల్లో ఎక్కడా చిన్నారులు ఉపయోగించుకోకూడదు. వారు ప్రచార కార్యక్రమాల్లో కనిపించకూడదు’’ అని తన అడ్వైజరీలో స్పష్టంచేసింది. మరి కొద్ది వారాల్లో సార్వత్రిక ఎన్నికల మొదలుకానున్న నేపథ్యంలో ప్రచారపర్వంలో పార్టీలు ప్రజాస్వామ్య విలువలకు పట్టంకట్టాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఎన్నికల సంబంధ కార్యకలాపాల్లో మైనర్లను వినియోగించకూడదని, వినియోగిస్తే కార్మిక చట్టాలను ఉల్లంఘించినట్లేనని బాంబే హైకోర్టు 2014లో ఇచ్చిన ఇక ఉత్తర్వును రాజీవ్ కుమార్ పునరుధ్ఘాటించారు. -
పుతిన్ సంపాదన ఇంత తక్కువా?
వ్లాదిమిర్ పుతిన్ ఆరేళ్లుగా రష్యా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది మార్చిలో రష్యాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సంబంధించిన ఆదాయ వివరాలు వెల్లడి కావడం.. ఆ వివరాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఆయన తన ఎన్నికల అఫిడవిట్ పత్రాల్లో ఆదాయం, ఆస్తుల వివరాలు పొందుపరిచారు. తాజాగా ఆయన అఫిడవిట్ వివరాలు ఎన్నికల సంఘం వెబ్సైట్లో పబ్లిష్ చేసింది. గత ఆరేళ్ల నుంచి ఆయన ఆస్తుల విలువ 67.6 మిలియన్ రెబెల్స్ (7,53,000 ఆమెరికన్ డాలర్లు)గా పుతిన్ అఫిడవిట్లో పేర్కొన్నారు. 2018 నుంచి 2024 వరకు పుతిన్ సంపాధించిన ఆస్తుల విలువ కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ పత్రాల వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ డిపాజిట్లు, మిలిటరీ పెన్షన్, పలు స్థలాల అమ్మకం ద్వారా లభించిన మొత్తంగా తెలుస్తోంది. ఇక అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడి వార్షిక జీతమే 4,00,000 అమెరికన్ డాలర్లు. ఈ లెక్క ప్రకారం రష్యా అధ్యక్షుడి వార్షిక ఆదాయం అమెరికా అధ్యక్షుడి కంటే చాలా తక్కువగా ఉండటం గమనార్హం. రష్యా కేంద్ర ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం.. పుతిన్ పది వేర్వేరు బ్యాంక్ ఖాతాల్లో 54.5 మిలియన్ రెబెల్స్( 606,000 అమెరికన్ డాలర్లు) నగదు కలిగి ఉన్నారు. ఆయన ఐదు సొంత వాహనాలు కూడా ఉన్నాయి. అందులో రెండు పాతకాలం సోవియట్ యూనియన్ కార్లు GAZ M-21s ఉన్నాయి. 2009లో రష్యా తయారైన 4x4 కారు, 1987 నాటి క్యాంపింగ్ ట్రైలర్ ఉన్నాయి. పుతిన్ మాస్కోలో ఒక అపార్టుమెంట్, సెయింట్ పిరట్స్బర్గ్లో ఒక అపార్టుమెంట్, గ్యారేజ్ కలిగి ఉన్నారు. అయితే పుతిన్ ఫిన్లాండ్ సరిహద్దుల్లో రహస్య నివాసం ఉందని స్థానిక మాస్కో టైమ్స్ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ కథనం ప్రచురించిన ఒక్క రోజు తర్వాత పుతిన్ ఆదాయ, ఆస్తుల విషయాలు కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా వెల్లడికావటంపై చర్చ జరుగుతోంది. కరేలియాలోని లేక్ లడోగా నేషనల్ పార్క్‌లో పుతిన్ అత్యధునిమైన రహస్య నివాసాన్ని కలిగి ఉన్నట్లు పేర్కొంది. వివాలవంతమైన సౌకర్యాలు ఉన్నట్లు తెలిపింది. ఇక.. రష్యా అధ్యక్ష ఎన్నికలు మార్చి 15 నుండి 17 వరకు మూడు రోజుల్లో జరుగనున్నాయి. 2020లో వివాదాస్పద రాజ్యాంగ సంస్కరణను అనుసరించి పుతిన్(71) కనీసం 2036 వరకు అధికారంలో కొనసాగవచ్చు. -
56 రాజ్యసభ స్థానాలకు 27న ఎన్నికలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 56 రాజ్యసభ స్థానాలు ఏప్రిల్‌లో ఖాళీ అవుతున్నాయి. వాటికి ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ రానుంది. 15 వరకు నామినేషన్ల స్వీకరిరణ, 16న పరిశీలన, 20 వరకు ఉపసంహరణ ఉంటాయి. ఫిబ్రవరి 27న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగుతుంది. ఐదింటికి గంటలకు కౌంటింగ్ ముగించి ఫలితాలను ప్రకటిస్తారు. పదవీకాలం ముగుస్తున్న ఎంపీల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు తదితరులున్నారు. యూపీలో అత్యధికంగా 10 ఖాళీలు ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల్లో ఉత్తర్‌ప్రదేశ్ నుంచి అత్యధికంగా 10 ఉన్నాయి. బిహార్, మహారాష్ట్రల్లో చెరో 6, మధ్యప్రదేశ్, పశి్చమ బెంగాల్లో చెరో 5, కర్ణాటక, గుజరాత్లో చెరో 4, ఏపీ, తెలంగాణ, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల్లో మూడేసి, ఛత్తీస్‌గఢ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఒక్కోటి ఖాళీ అవుతున్నాయి. బీజేపీ పరం కానున్న 28 సీట్లు ఎన్నికలు జరిగే 56 రాజ్యసభ స్థానాల్లో 28 సీట్లను బీజేపీ గెలుచుకోనుంది. ప్రస్తుతం రాజ్యసభలో 93 మంది బీజేపీ సభ్యులతో కలిసి ఎన్డీఏ కూటమి బలం 114గా ఉంది. కాంగ్రెస్‌కు 30 సీట్లున్నాయి. హిమాచల్ అసెంబ్లీలో కాంగ్రెస్ సంఖ్యా బలం దృష్ట్యా అక్కడి ఒక్క రాజ్యసభ స్థానం ఆ పార్టీకే దక్కనుంది. దాన్ని ప్రియాంక గాం«దీకి కేటాయించవచ్చని సమాచారం. ప్రస్తుతం అక్కడి నుంచి ఎంపీగా ఉన్న వహిస్తున్న బీజేపీ చీఫ్ జేపీ నడ్డాను మరో రాష్ట్రం నుంచి అధిష్టానం సర్దుబాటు చేయనుంది. -
ముగ్గురు ‘పెద్దలు’ ఎవరో!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ రెండో తేదీన ఖాళీ అయ్యే మూడు రాజ్యసభ స్థానాల భర్తీకి సంబంధించిన ద్వైవార్షిక ఎన్నిక షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. బీఆర్ఎస్ తరఫున రాజ్యసభ సభ్యులుగా ఉన్న వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్‌కుమార్‌ల పదవీ కాలం పూర్తి కానుండటంతో, ఆ స్థానాల భర్తీకి ఈ ఎన్నిక జరుగుతోంది. ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ జారీ కానుండగా, 27న ఎన్నిక జరగనుంది. అయితే 15వ తేదీలోగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. దీంతో రాష్ట్ర అసెంబ్లీలో సంఖ్యాపరంగా ఎక్కువ సంఖ్యలో ఓట్లు కలిగి ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ల్లో సందడి మొదలైంది. పలువురు నేతలు పెద్దల సభలో ప్రవేశించేందుకు ఆసక్తి చూపుతుండగా, ఎవరికి చాన్స్ దక్కుతుందనే చర్చ రెండు పార్టీల్లో జరుగుతోంది. ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాల్లో.. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి కాంగ్రెస్‌కు రెండు, బీఆర్ఎస్కు ఒక స్థానం చొప్పున దక్కే అవకాశం ఉంది. అయితే రాజ్యసభ ఎన్నికల్లో విప్ వర్తించదనే నిబంధనను ఆసరాగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ మూడో అభ్యర్థిని కూడా బరిలోకి దించే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇటీవలి కాలంలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌ను కలవడం, ఇటీవలి దావోస్ పర్యటన అనంతరం లండన్‌లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీతో ముఖ్యమంత్రి భేటీ, తదితర పరిణామాలను ప్రస్తావిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం మిత్రపక్షం ఎంఐఎం సహకారంతో ఒక సభ్యుడిని సునాయాసంగా గెలిపించుకుంటామనే ధీమా వ్యక్తం చేస్తోంది. ఒకటి ఢిల్లీకి, మరొకటి స్థానికులకు రెండు రాజ్యసభ స్థానాలు ఖచ్చితంగా దక్కనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక స్థానాన్ని ఢిల్లీ కోటాలో అధిష్టానం చెప్పిన వారి కోసం రిజర్వు చేయాలని భావిస్తోంది. పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాం«దీని రాష్ట్రం నుంచి లోక్‌సభకు పోటీ చేయాల్సిందిగా కోరుతూ రాష్ట్ర కాంగ్రెస్ ఇప్పటికే తీర్మానం ఆమోదించింది. అలా వీలు కాని పక్షంలో కనీసం ఇక్కడ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించాలని పార్టీ నేతలు కోరుతున్నారు. ఇందుకు కూడా సోనియా మొగ్గు చూపని పక్షంలో ఇతర రాష్ట్రాలకు చెందిన జాతీయ స్థాయి నేతల్లో పార్టీ ఎంపిక చేసే ఒకరిని తెలంగాణ నుంచి పెద్దల సభకు పంపాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. నేడు టీపీసీసీ పీఏసీ భేటీలో చర్చ! మరో సీటుపై పార్టీ నేతలు పలువురు ఆశలు పెట్టుకున్నారు. అయితే అభ్యర్థి ఎంపికలో సామాజికవర్గ సమీకరణలు కీలకం కావడంతో ఎస్సీ మాదిగ లేదా రెడ్డి లేదా బీసీలకు చాన్స్ దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. గాంధీభవన్‌లో మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో లోక్‌సభ ఎన్నికల సన్నద్ధత, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలతో పాటు రాజ్యసభకు కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన చర్చ కూడా జరిగే అవకాశముందని చెబుతున్నారు. అరడజనుకు పైగానే ఆశావహులు రాష్ట్రం నుంచి రాజ్యసభలో అడుగు పెట్టడంపై కాంగ్రెస్ నుంచి పలువురు సీనియర్ నేతలు ఆసక్తి చూపుతున్నారు. మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, మాజీ కేంద్ర మంత్రులు బలరామ్ నాయక్, రేణుకా చౌదరి, సర్వే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి, సంపత్ కుమార్, వి.హనుమంతరావు తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. బీఆర్ఎస్ తరఫున ఎవరో? రాష్ట్రం నుంచి ఏడుగురు సభ్యులు రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తుండగా అందరూ బీఆర్ఎస్కు చెందిన వారే కావడం గమనార్హం. ప్రస్తుతం ముగ్గురు రిటైర్ కానుండగా ఒక సీటు మాత్రం తిరిగి పార్టీకి దక్కనుంది. ఈ స్థానంలో తనకు మరోమారు అవకాశం ఇవ్వాల్సిందిగా వద్దిరాజు రవిచంద్ర కోరుతున్నారు. 2018 ఏప్రిల్ 13న రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన బండా ప్రకాశ్ తన ఆరేళ్ల పదవీకాలం పూర్తి కాకుండానే 2022 మే 30న తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన ప్రకాశ్ ప్రస్తుతం మండలి వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా, ఖాళీ అయిన రాజ్యసభ సీటుకు బీఆర్ఎస్ తరఫున వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తనకు సుమారు రెండేళ్ల పాటు మాత్రమే రాజ్యసభ ఎంపీగా అవకాశం దక్కినందున మరోమారు చాన్స్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. అయితే సామాజికవర్గ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని బీసీ వర్గానికి చెందిన వారికి బీఆర్ఎస్ అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ తరఫున డాక్టర్ కె.కేశవరావు (మున్నూరు కాపు), దామోదర్ రావు (వెలమ), పార్థసారథి రెడ్డి (రెడ్డి), కేఆర్ సురేశ్‌రెడ్డి (రెడ్డి) ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మున్నూరుకాపు, ముదిరాజ్, యాదవ లేదా గౌడ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని కేసీఆర్ ఎంపిక చేస్తారననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే మాజీ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌తో పాటు మరికొన్ని పేర్లు కూడా పరిశీలనకు వచ్చే అవకాశముందని అంటున్నారు. -
రాజ్యసభకు మోగిన నగారా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే ఏప్రిల్ 2న ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూలు జారీచేసింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 8న జారీచేయనుంది. నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఫిబ్రవరి 15 కాగా.. ఫిబ్రవరి 16న నామినేషన్లను పరిశీలిస్తారు. వాటి ఉపసంహరణకు తుది గడువు ఫిబ్రవరి 20. పోలింగ్‌ను ఫిబ్రవరి 27న ఉ.9 గంటల నుంచి సా.4 గంటల వరకూ నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపును ఫిబ్రవరి 27న సా.5 గంటల నుంచి చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. గతంలో రాష్ట్ర కోటాలో రాజ్యసభకు ఎన్నిౖకైన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (వైఎస్సార్సీపీ), కనకమేడల రవీంద్రకుమార్ (టీడీపీ), సీఎం రమేష్ (బీజేపీ)ల పదవీకాలం ఏప్రిల్ 2తో పూర్తికానుంది. ఖాళీ కానున్న ఈ మూడు రాజ్యసభ స్థానాలకు ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రస్తుతం శాసనసభలో ఉన్న సంఖ్యా బలాన్ని బట్టి చూస్తే ఈ మూడు రాజ్యసభ స్థానాలూ వైఎస్సార్సీపీ ఖాతాలోకి చేరడం ఖాయం. దీంతో రాష్ట్ర కోటాలో మొత్తం 11 స్థానాలూ వైఎస్సార్సీపీ పరమవుతాయి. అంటే.. ఏప్రిల్ 2 తర్వాత రాజ్యసభలో టీడీపీ ఉనికే లేకుండాపోతోంది. ఆ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటివరకు 41 ఏళ్లలో రాజ్యసభలో టీడీపీకి ప్రాతినిధ్యం లేకుండా పోవడం ఇదే ప్రథమం అవుతుంది. అప్పట్లో ఆ ఎనిమిదీ వైఎస్సార్సీపీకే.. ఇక రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 250 లోపు ఉండాలి. ప్రస్తుతం ఆ సభ్యుల సంఖ్య 245. ఇందులో 233 మందిని దేశంలోని రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. మిగతా 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. మన రాష్ట్ర కోటాలో రాజ్యసభ సభ్యుల సంఖ్య 11. 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీకి ఇద్దరు.. టీడీపీకి 9 మంది సభ్యులు ఉండేవారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 50 శాతం ఓట్లతో 151 స్థానాల్లో ఘనవిజయం సాధించింది. టీడీపీ 23 స్థానాలకే పరిమితమైంది. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సత్సంబంధాలు నెరిపి.. అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్‌రావు, టీజీ వెంకటేష్‌లను బీజేపీలోకి ఫిరాయించేలా చంద్రబాబు చక్రం తిప్పారు. రాష్ట్ర కోటాలో ఎన్నికైన రాజ్యసభ సభ్యుల్లో 2020లో నలుగురు (టీడీపీ), 2022లో నలుగురు (ముగ్గురు టీడీపీ, ఒకరు వైఎస్సార్సీపీ) పదవీకాలం పూర్తవడంతో ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించింది. అసెంబ్లీలో వైఎస్సార్సీపీకి ఉన్న సంఖ్యాబలం ఆధారంగా ఈ ఎనిమిది స్థానాలు వైఎస్సార్సీపీకే దక్కాయి. ఇందులో నలుగురు బీసీలను రాజ్యసభకు పంపి సామాజిక న్యాయమంటే ఇదీ అని దేశానికి సీఎం జగన్ చాటిచెప్పారు. ఒక్కో స్థానం గెలవాలంటే 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు.. మరోవైపు.. రాష్ట్ర కోటాలో ఖాళీకానున్న మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తోంది. టీడీపీ సభ్యుడు గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించడంతో ప్రస్తుతం అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 174కు తగ్గింది. ఇందులో సాంకేతికంగా చూస్తే వైఎస్సార్సీపీ బలం 151.. టీడీపీ బలం 22.. జనసేనకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. వీటిని పరిగణలోకి తీసుకుంటే.. రాజ్యసభకు ఒక స్థానం నుంచి ఎన్నిక కావాలంటే 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. ప్రస్తుతం శాసనసభలో వైఎస్సార్సీపీకి ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే.. మూడు స్థానాలు ఆ పార్టీ ఖాతాలో చేరడం ఖాయం. -
AP: ఓటర్ల తుది జాబితా విడుదల.. జిల్లాల వారీగా లిస్ట్ ఇదే
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 2024 ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం జిల్లాల వారీగా విడుదల చేసింది. సీఈఓ ఆంధ్రా వెబ్సైట్(CEO Andhra)లో జిల్లాల వారీగా తుది ఓటర్ల జాబితా విడుదల చేసినట్లుగా సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ స్థానాల వారీగా ఓటర్ల జాబితాలను ఎన్నికల సంఘం ప్రచురించింది. నియోజకవర్గాల వారీగా పీడీఎఫ్ ఓటర్ల జాబితాలను సీఈఓ ఆంధ్రా వెబ్సైట్లో ఈసీ అప్ లోడ్ చేసింది. ఓటర్ల జాబితాను ఎక్కడికక్కడే విడుదల చేయాలని ఈసీ.. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఓటర్లు: 4,08,07,256 మహిళా ఓటర్లు: 2,07,37,065 పురుష ఓటర్లు: 2,00,09,275 రాష్ట్రంలో సర్వీస్ ఓటర్లు: 67,434 థర్డ్ జెండర్ ఓటర్లు: 3482. కాగా, గత 6 నెలలుగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు, అధికారులను నియమించి ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కొత్త ఓటర్ల నమోదును వేగవంతం చేశారు. ఓటు ప్రాధాన్యతపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించారు. అన్ని ప్రక్రియలు పూర్తి అయ్యాక సోమవారం అధికారికంగా తుది ఓటరు జాబితాను విడుదల చేశారు.ఏపీలో పురుషుల కంటే మహిళల ఓటర్లే అధికం ఉండటం గమనార్హం. జిల్లాల వారీగా ఓటర్ల వివరాలు జిల్లా పురుషులు స్త్రీలు ఇతరులు సర్వీస్ ఓటర్లు మొత్తం ఓటర్లు తిరుపతి 8,68,273 9,10,597 188 867 17,79,058 చిత్తూరు 7,65,90 7,88,725 84 3,379 15,58,257 ఎన్టీఆర్ 8,17,484 8,57,361 150 16,74,995 కాకినాడ 7,88,105 8,10,781 15,99,065 కృష్ణా 7,37,394 7,80,796 65 15,18,255 యువ ఓటర్ల నమోదు కోసం మళ్లీ ప్రచారం చేస్తాం ఏపీ ఓటర్ల తుది జాబితాను ప్రకటించామని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 4.08 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ముసాయిదా జాబితా తర్వాత 5.08 లక్షల ఓటర్లు పెరిగారని పేర్కొన్నారు. యువ ఓటర్లు 8.13 లక్షల ఓటర్లు నమోదయ్యారని వెల్లడించారు. యువ ఓటర్లు ఇంకా నమోదు కావాల్సి ఉందని చెప్పారు. యువ ఓటర్ల నమోదు కోసం మళ్లీ ప్రచారం చేస్తామని అన్నారు. ఒకే డోర్ నెంబర్‌పై అధిక ఓట్లు ఉన్న ఫిర్యాదులను 98 శాతం పరిష్కరించామని తెలిపారు. లక్ష 50 వేల ఇళ్లలో 10 కంటే ఎక్కువ ఓట్లు ఉన్నాయని అన్నారు. ఇప్పుడు 4వేల ఇళ్లకు తగ్గాయని, ప్రతి ఎన్నికల్లోనూ ఇలాంటి ఓట్లు ఉండేవని అన్నారు. ఫామ్ 7 ద్వారా తప్పుడు ఫిర్యాదులు చేసిన వారిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. 70 చోట్ల పోలీసు కేసులు నమోదు చేశామని అన్నారు. మళ్లీ కొత్త దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు. వికలాంగులు, 80 ఎళ్ల పైబడిన వారికి ఇంటి వద్ద ఓటింగ్‌కి అవకాశం ఇస్తామని అన్నారు. నామినేషన్ చివరి రోజు వరకు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. చదవండి: లోలోన రగిలిపోతున్న అచ్చెన్నాయుడు -
Election Commission of India: ప్రతి 15 ఏళ్లకు రూ.10 వేల కోట్లు కావాలి
న్యూఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు అవసరమైన వనరులపై కేంద్ర ఎన్నికల సంఘం అంచనాలు వేస్తోంది. ఒకే విడతలో లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరపాల్సి వస్తే కొత్త ఈవీఎంల కొనుగోలుకు ప్రతి 15 ఏళ్లకు రూ.10 వేల కోట్లు అవసరమవుతాయని లెక్కలు కట్టింది. ఒక్కో ఈవీఎం జీవిత కాలం 15 ఏళ్లు కాగా, ఒక్కో మెషీన్‌ను మూడు సార్లు వాడుకోవచ్చని తెలిపింది. ఏకకాలంలో జరిపే ఎన్నికలకు దేశవ్యాప్తంగా 11.80 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒక్కో పోలింగ్ బూత్‌లో జత ఈవీఎంలు.. ఒకటి లోక్‌సభకు, మరోటి శాసనసభ నియోజకవర్గానికి అవసరమవుతాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని బ్యాలెట్ యూనిట్(బీయూ)లు 46,75,100, కంట్రోల్ యూనిట్(సీయూ)లు 33,62,300, వీవీప్యాట్లు 36,62,600 అవసరమవుతాయని కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే తెలిపింది. కనీసం ఒక బీయూ, ఒక సీయూ, ఒక వీవీప్యాట్లను కలిపి ఒక ఈవీఎంగా పరిగణిస్తారు. ఒక బీయూ ఖరీదు రూ.7,900, ఒక సీయూ ఖరీదు రూ.9,800, ఒక వీవీప్యాట్ ఖరీదు రూ.16,000గా తాజాగా నిర్ణయించింది. అదనంగా పోలింగ్, భద్రతా సిబ్బంది, ఈవీఎంల నిర్వహణ కేంద్రాలు, మరిన్ని వాహనాలు అవసరమవుతాయని కూడా ఎన్నికల సంఘం పేర్కొంది. కొత్తగా ఈవీఎల తయారీ, ఇతర సౌకర్యాలను సమకూర్చుకున్నాక 2029లో మాత్రమే మొదటి జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు అవకాశం ఉందని స్పష్టం చేసింది. -
బల్క్ ఫిర్యాదులు చంద్రబాబు కుట్రే
సాక్షి, అమరావతి: విపక్ష నేత చంద్రబాబునాయుడి జీవితమంతా మోసం, కుట్ర, కుతంత్రాలతో నిండిపోయిందని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. లక్షల ఓట్లను తొలగించాలంటూ కోనేరు సురేష్ ద్వారా ఎన్నికల కమిషన్‌కు బల్క్ ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. కోనేరు సురేష్ ఇచ్చిన అబద్ధపు బల్క్ ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని తాము డిమాండ్ చేశామన్నారు. టీడీపీ ఉద్దేశపూర్వకంగానే వైఎస్సార్సీపీ ఓట్లను టార్గెట్ చేసిందన్నారు. మరోవైపు దొంగ ఓట్ల చేర్పునకూ టీడీపీ పాల్పడుతోందన్నారు. ‘మై పార్టీ డ్యాష్‌బోర్డ్ డాట్‌కామ్’ పేరుతో చంద్రబాబు మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. అక్రమంగా అర్హుల ఓట్లు తొలగించేందుకు, దొంగ ఓట్ల చేర్పుకు చంద్రబాబు భారీ కుట్ర చేశారని చెప్పారు. ఓటరు కులం, రాజకీయ ప్రాధాన్యత అడిగే హక్కు బాబుకెవరిచ్చారు? అని నిలదీశారు. ‘వన్ సిటిజన్.. వన్ ఓట్’ అనేది తమ పార్టీ సిద్ధాంతం అని తెలిపారు. ఓటర్ ప్రొఫైల్ సర్వే పేరిట అభ్యంతరకర ప్రశ్నలపై సీఈసీకి ఫిర్యాదు చేశాం అని చెప్పారు. మొత్తం ఆరు అంశాలపై సీఈసీని కలిశామన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ సభ్యులను కలిసిన అనంతరం మంగళవారం విజయవాడలోని నోవోటెల్ హోటల్ వద్ద ఆయన ఎంపీ మార్గాని భరత్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... గుర్తింపులేని జనసేనకు అవకాశమా? గుర్తింపులేని పార్టీ జనసేన. సాధారణంగా గుర్తింపు ఉన్న పార్టీలకే ఎన్నికల సంఘాన్ని కలిసి వారి అభ్యంతరాల్ని చర్చించే అవకాశం ఉంటుంది. టీడీపీతో పాటు జనసేన పార్టీకి కూడా సీఈసీని కలిసే అవకాశమిచ్చారు. ఎన్నికల నిబంధనల ప్రకారం గుర్తింపులేని జనసేనకు సీఈసీని కలిసే అవకాశం ఎలా ఇవ్వగలిగారని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాము. తెలుగుదేశం పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరిన అపాయింట్మెంట్ రిక్వెస్టులో జనసేన పార్టీ తమ అలయెన్స్‌గా చెప్పి ఆపార్టీని కూడా అనుమతించాలని కోరింది. ఇప్పటి వరకు జనసేన పార్టీ బీజేపీ అలయెన్స్ పార్టీ అని అందరికీ తెలిసిన విషయమే. జనసేన బీజేపీకి పార్టనరా? టీడీపీకి పార్టనరా? అనేది స్పష్టం చేయాల్సిన అవసరముందని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరాం. రెండు వేర్వేరు పార్టీలతో అలయెన్స్ పెట్టుకున్న గుర్తింపులేని పార్టీ జనసేనను ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు ఎలా అనుమతించారనేదే మా వాదన. జనసేన పార్టీ రాష్ట్రంలోని 175 స్థానాల్లో కేవలం కొన్ని స్థానాల్లో మాత్రమే పోటీకి దిగుతోంది. అలాంటి, గుర్తింపు లేని పార్టీకి కామన్ సింబల్‌గా ఉన్న గాజుగ్లాసు గుర్తును కేటాయించడం కూడా చట్టవిరుద్ధం. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌కు రెండో అంశంగా నివేదించాం. బోగస్ ఫిర్యాదుదారుడు కోనేరు సురేష్‌పై చర్యలేవి? టీడీపీకి చెందిన కోనేరు సురేష్ ఆపార్టీ ఎలక్టోరల్ విభాగంలో పనిచేస్తున్నాడు. అతను డూప్లికేటింగ్, డబుల్ ఎంట్రీస్, నాన్ లోకల్, బోగస్ ఓట్లంటూ ఓ బల్క్ కంప్లయింట్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పంపాడు. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 10 లక్షల పైచిలుకు ఓట్లు బోగస్‌గా ఉన్నాయని, వాటిపై విచారణ చేయాలని సీఈసీకి కూడా ఫిర్యాదు చేశాడు. ఒకే వ్యక్తి రాష్ట్రంలోని 175 స్థానాల్లో 10 లక్షల ఓట్లకు సంబంధించి బల్క్ కంప్లయింట్ ఎలా ఇవ్వగలుగుతారు? దాన్ని ఎన్నికల కమిషన్ ఏ విధంగా స్వీకరిస్తుందని మేము ప్రశ్నిస్తున్నాం. టీడీపీ వ్యక్తి ఇచ్చిన బల్క్ కంప్లయింట్ ఆధారంగా ఎన్నికల అధికార యంత్రాంగం మొత్తం పనిచేస్తుందా? అని మేము అడుగుతున్నాం. ఆ ఫిర్యాదుపై విచారణ చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలొచ్చాయి. అయితే, ఆ ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్లు చాలా సమయాన్ని వెచ్చించి పరిశీలిస్తే ఏమాత్రం నిజం లేదని తేలింది. దీన్నిబట్టి కోనేరు సురేష్ ఎన్నికల కమిషన్ సమయాన్ని ఎంతగా వృథా చేశాడో అర్థం చేసుకోవాలి. ఈ రకంగా టీడీపీ అబద్ధపు ఫిర్యాదులిచ్చి, విలువైన ఎన్నికల సంఘం సమయాన్ని వృథా చేయడం చట్టవ్యతిరేక చర్యగా పరిగణించాలని సీఈసీ దృష్టికి తీసుకెళ్లాం. కోనేరు సురేష్ ఫిర్యాదు బోగస్ అని తేలింది కాబట్టి అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సీఈసీని కోరాం. ఓటర్ ప్రొఫైలింగ్ మాల్‌ప్రాక్టీస్ తీరిది ఎన్నికల కమిషన్ డ్యాష్‌బోర్డులో ఉన్న డేటాను ఆధారంగా చేసుకుని టీడీపీకి చెందిన ‘మై పార్టీ డ్యాష్‌బోర్డ్ డాట్‌కామ్’లో ఓటర్ పేరు, ఊరు, ఇతర చిరునామా, జెండర్, వయసు, కులంతో పాటు అతను సపోర్టు చేసే పొలిటికల్ పార్టీ, మొబైల్ నంబర్ వంటి వివరాలున్నాయి. రాజకీయ పార్టీల వారీగా ఓటర్లను వేరుచేయడమనేది చట్టవిరుద్ధ చర్యగా ఎన్నికల కమిషన్ దృష్టికి తెచ్చాం. టీడీపీ సేకరించిన ఓటర్ డేటా అమెరికాలోని న్యూయార్క్‌లో ఒక సర్వర్ వద్ద స్టోర్ చేస్తున్నారు. అచ్చంగా ఇలాంటి మాల్‌ప్రాక్టీస్ గతంలోనూ టీడీపీ సేవామిత్ర యాప్ ద్వారా సేకరించడం, అప్పట్లో ఆ యాప్‌పై ఎన్నికల సంఘం ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం తెలిసిందే. అప్పట్లో టీడీపీకి వ్యతిరేకంగా నమోదైన ఎఫ్ఐఆర్ నంబర్ 174–2019పై కూడా ఎలాంటి పురోగతి లేదన్న విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తెచ్చాం. ఇప్పుడు ‘మైపార్టీ డ్యాష్‌బోర్టు డాట్‌కామ్’ ద్వారా ఆ పార్టీ చేస్తున్న కార్యక్రమంపై 120(బి), 379, 420, 188 (ఐపీసీ), 72, 66 (ఐటీఏ 2000 యాక్ట్) కింద యాక్షన్ తీసుకోవాలని ప్రధాన ఎన్నికల సంఘాన్ని కోరాం. ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌కు గ్యారెంటీ’పై ఫిర్యాదు రాబోయే ఐదేళ్లలో టీడీపీ పథకాల ద్వారా ఓటరు ఎంత మేలు పొందుతాడనే లెక్కలేసి ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌కు గ్యారెంటీ ’ అనే ప్రమాణపత్రంతో కూడిన కార్డుల్ని పంపిణీ చేస్తున్నారు. ఇలా దాదాపు 2 లక్షల 40 వేల మందికి ఈ కార్డులందజేతను ఆధారాలతో సహా పట్టుకుని సీఈసీకి ఫిర్యాదు చేశాం. వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్లే టార్గెట్ ఓటర్ల జాబితాలపై టీడీపీ రోజుకో అబద్ధంతో అటు ఓటర్లనూ, ఇటు ఎన్నికల సంఘాన్ని తప్పుదోవబట్టిస్తోంది. కోనేరు సురేష్ ఫిర్యాదుపై అధికారుల క్షేత్రస్థాయి పరిశీలనకు సంబంధించి మూడు జిల్లాల సమాచారాన్ని ఆర్టీఐ ద్వారా తీసుకున్నాం. ♦ కర్నూలు జిల్లాలో సురేష్ ఫిర్యాదు ప్రకారం 67,370 బోగస్ ఓట్లు ఉన్నాయి. అయితే, వీఆర్వోలు వెరిఫై చేశాక వాటిల్లో 59,054 ఓట్లు సక్రమంగా ఉన్నట్లు తేలింది. అంటే, 87 శాతం నిజమైనవి. మిగతా ఓట్లు ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గం పరిధిలోకి మారిన వారివిగా గుర్తించారు. ♦ అన్నమయ్య జిల్లాలో 40,358 బోగస్ ఓట్లు ఉన్నట్టు ఫిర్యాదు చేస్తే, వాటిలో 25,097 మంది ఓటర్లు స్థానికంగానే నివాసం ఉంటున్నట్లు తేలింది. అంటే, 62 శాతం ఓట్లుకు సంబంధించి సురేష్ ఇచ్చిన ఫిర్యాదు అబద్ధం. ♦ విశాఖపట్నం జిల్లాలో 38,872 ఓట్లు బోగస్‌వి అని టీడీపీ ఫిర్యాదు చేస్తే.. వాటిలో 26,123 ఓట్లు జెన్యూన్‌గా ఉన్నట్లు తేలింది. అంటే 67 శాతం ఓట్లు వాస్తవమైనవే. ♦ ఒకే వ్యక్తి ఇచ్చే బల్క్కంప్లయింట్లు స్వీకరించరాదని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరాం. అసభ్య పదజాలం వాడుతున్న తండ్రీకొడుకులపై చర్యలు తీసుకోవాలి చంద్రబాబు చేపడుతున్న టీడీపీ కార్యక్రమాల్లోనూ, లోకేశ్ యువగళం పాదయాత్రలోనూ వైఎస్సార్సీపీపైన, మా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పైన అసభ్యకర పదజాలం వాడుతూ దూషించడాన్ని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకొచ్చాం. ఆ తండ్రీకొడుకులపై ఇండియన్ పీనల్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని కూడా కోరాం. లోకేశ్ ఓ ఎర్రబుక్కు చూపిస్తూ, ‘టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసే అధికారుల పేర్లు ఈ ఎర్రబుక్కు (రెడ్‌బుక్)లో ఎక్కించి.. అధికారంలోకి రాగానే వారిని జైళ్లకు పంపుతాను’ అంటూ బెదిరిస్తున్నారు. ♦నిజానికి ప్రభుత్వ అధికారులు ఏ పొలిటికల్ పార్టీకి పనిచేయరు. అధికారులెప్పుడూ బ్యాలెన్సింగ్‌గానే పనిచేస్తారు. అలాంటి అధికారులను జైళ్లకు పంపుతానంటూ భయభ్రాంతులకు గురిచేయడం చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయం. ఇదే విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం. పార్లమెంట్ ఎన్నికలు ఉభయరాష్ట్రాల్లో ఒకేరోజు జరపాలి ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలు ఒకే రోజున నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరాం. ఓటర్ల జాబితాల సవరణల్లో టీడీపీ చాలా దొంగపనులు చేస్తోంది. చంద్రబాబు అధికారంలోకొచ్చిన ప్రతీసారి మోసపూరిత, కుట్రపూరితమైన విధానాలతోనే ఎన్నికల ప్రక్రియను నడిపించారు. ఇప్పుడు అలాంటి దొంగపనులకు శ్రీకారం చుట్టాడు కాబట్టే మేం కేంద్ర ఎన్నికల సంఘాన్ని అప్రమత్తం చేస్తున్నాం. టీడీపీ ఇల్లీగల్ ఓటర్ ప్రొఫైలింగ్ వైఎస్సార్సీపీ తరఫున మేం 14 డిసెంబర్ 2023న కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక ఫిర్యాదు ఇచ్చాం. టీడీపీ ఇల్లీగల్ ఓటర్ ప్రొఫైలింగ్ చేస్తోందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాం. ఓటరు కులమేంటి? మతం ఏంటి? గతంలో ఏ రాజకీయ పార్టీకి ఓటేశావు? రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తావు? అని అడిగే హక్కు రాజ్యాంగం ప్రకారం ఎవరికీ లేదు. టీడీపీ మాత్రం ఈ విధమైన ఓటర్ ప్రొఫైలింగ్‌కు పాల్పడుతుందనే విషయాన్ని గతంలోనే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చాం. 4.36 లక్షల డూప్లికేట్ ఓట్లను గుర్తించాం ఓటర్ల పేర్లలో చిన్న అక్షరాలు మార్చి స్థానికంగా కాకుండా ఇతర ప్రాంతాల్లో నివాసమున్నట్లుగా జాబితాలో ఓట్లను చేర్చే కార్యక్రమం టీడీపీ చేస్తోంది.తండ్రిపేరు లేదా భర్త పేరు మార్చి డూప్లికేట్ ఓట్లను ఆ పార్టీ తయారు చేయడానికి తెగించింది. తెలంగాణలో ఉన్న ఓట్లను కూడా ఏపీ ఓటర్ల జాబితాలోకి తీసుకొచ్చే మాల్‌ప్రాక్టీస్ జరుగుతోంది. ఇప్పటికే దాదాపు 4,36,268 ఓట్లు తెలంగాణ ఓటర్ల జాబితాలోనూ ఆంధ్రాలోనూ డూప్లికేటింగ్ ఓట్లుగా కనిపిస్తున్నాయి. వీటి వివరాల్ని ఆధారాలతో సహా సీఈసీకి అందజేసి, వీటన్నింటినీ జాబితా నుంచి తొలగించాల్సిందిగా కోరాం. తెలంగాణ ఓట్ల నమోదుకు టీడీపీ ప్రత్యేక శిబిరాలు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయినందున, అక్కడున్న ఏపీ సెటిలర్స్‌తో ఆంధ్రా ఎన్నికల్లో ఓటు వేయించేందుకు టీడీపీ వ్యూహం పన్నింది. అందులో భాగంగా ప్రత్యేకంగా తెలంగాణలో ఓటరు నమోదు శిబిరాలను ఏర్పాటు చేసి ఆన్లైన్లో ఓట్ల చేర్పులు జరుగుతున్నాయి. టీడీపీ అనుకూల సామాజికవర్గ ఓటర్లను తెలంగాణ జాబితాలో తొలగించకుండానే ఏపీలో ఓటు హక్కు కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. -
జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నేడు సీఈసీ బృందం సమీక్ష
-
ఏపీలో కొనసాగుతున్న కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన
సాక్షి, అమరావతి : రానున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా సవరణ, సన్నద్ధత వంటి అంశాలను పరిశీలించి తగు సూచనలు ఇవ్వడానికి కేంద్ర ఎన్నికల సంఘం బృందం మంగళవారం నుంచి రెండ్రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్, కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్ గోయల్‌తో కూడిన ఉన్నతాధికారుల బృందం పర్యటిస్తున్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించింది. మధ్యాహ్నం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఆయా జిల్లాలకు సంబంధించి ఎస్ఎస్ఆర్–2024 కార్యకలాపాలు, ఎన్నికల సన్నద్ధత ప్రణాళికను సమీక్షించనున్నారు. ఓటర్ల జాబితాలో ఎటువంటి గందరగోళం లేకుండా పారదర్శకంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన 5.64 లక్షల పేర్లను అనర్హులుగా ఎన్నికల సంఘం తేల్చింది. అలాగే, రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధత కోసం తీసుకున్న చర్యలను జనవరి 10న ఉ.9.30 నుంచి 11 గంటల వరకు స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్‌తో కలిసి కేంద్ర ఎన్నికల అధికారులకు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం.. కేంద్ర, రాష్ట్రాలకు చెందిన వివిధ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు చెందిన అధికారులతో సమావేశం ఉంటుందని.. అలాగే, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వివిధ శాఖల కార్యదర్శులతో ఈసీఐ ఉన్నతాధికారులు సమావేశమవుతారన్నారు. ఆ తర్వాత.. సమావేశ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘ అధికారులు 10వ తేదీ సా.4.30కు మీడియాకు వివరిస్తారని ముఖే‹Ù కుమార్ మీనా అన్నారు. సమావేశాలకు ఏర్పాట్లు పూర్తి.. ఇక ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ–2024, ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలపై విజయవాడలో ఈనెల 9, 10 తేదీల్లో ఈసీఐ ఉన్నతస్థాయి సమావేశాలు జరగనున్నాయని.. విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఎన్టీఆర్జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు తెలిపారు. ఏర్పాట్లను పరిశీలించేందుకు ముఖేష్ కుమార్ మీనాతో కలిసి కలెక్టర్ ఢిల్లీరావు విజయవాడ నోవాటెల్ కాన్ఫరెన్స్ హాల్‌ను పరిశీలించారు. -
మూడేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో పాల్గొనే అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా తక్షణం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. సంబంధిత శాఖాధిపతులు, కార్యదర్శులు వెంటనే చర్యలు తీసుకుని ఈ నెల చివరి వారంలోగా బదిలీలు, పోస్టింగ్‌ల ప్రక్రియను పూర్తిచేయాలని సూచించారు. ఈ నెలాఖరుకల్లా బదిలీల, పోస్టింగ్‌ల నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించాల్సి ఉంటుందని తెలిపారు. మూడేళ్లు ఒకచోట, ఒకే జిల్లాలో పనిచేస్తున్న అధికారులను బదిలీలు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో పాల్గొనే అధికారులందరికీ ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపారు. ఆ ఉత్తర్వుల మేరకు.. ♦ నాలుగు సంవత్సరాల్లో.. జిల్లాలో మూడు సంవత్సరాలు పూర్తిచేసిన అధికారులు, లేదా ఈ ఏడాది జూన్ 30 లేదా అంతకుముందు 3 సంవత్సరాలు పూర్తిచేసుకున్న ఉద్యోగులను మరో జిల్లాకు బదిలీ చేయాలి. ♦ ఎన్నికలకు సంబంధం ఉన్న ఏ అధికారిని సొంత జిల్లాలో కొనసాగించడానికి వీల్లేదు. ♦ జిల్లా అధికారులతో పాటు నిర్దిష్టంగా ఎన్నికల విధులకు నియమించిన జిల్లా ఎన్నికల అధికారులు, ఉప ఎన్నికల అధికారులు, ఏఆర్వోలు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, నోడల్ అధికారులతో పాటు డిప్యూటీ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, తహసీల్దార్లు, బ్లాక్ డెవలప్మెంట్ అధికారులతో సహా ఇంకా ఎన్నికలకు సంబంధించిన అధికారులందరికీ బదిలీల నిబంధనలు వర్తిస్తాయి. మున్సిపల్ కార్పొరేషన్, డెవలప్మెంట్ అథారిటీ అధికారులకు కూడా బదిలీల నిబంధనలు వర్తిస్తాయి. ♦ పోలీసుశాఖకు కూడా బదిలీల నిబంధనలు వర్తిస్తాయి. అదనపు డీజీలు, ఐజీలు, డీఐజీలు, రాష్ట్ర ఆర్మ్డ్ పోలీసులు, ఎస్ఎస్పీలు, ఎస్పీలు, అదనపు ఎస్పీలు, సబ్ డివిజనల్ హెడ్ ఆఫ్ పోలీసు, ఎస్‌హెచ్‌వోలు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, జిల్లాస్థాయిలో ఎన్నికల బందోబస్తుకు ఉపయోగించే పోలీసు బలగాలకు వర్తిస్తాయి. ♦ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్లను వారి స్వంత జిల్లాలో నియమించకూడదు. ♦ ఒక పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ నాలుగేళ్లలో 3 సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తిచేస్తే మరో పోలీసు సబ్ డివిజన్‌కు బదిలీ చేయాలి. ఆ సబ్ డివిజన్ అంతకుముందు పనిచేసిన అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉండకూడదు. లేదంటే మరో జిల్లాకు బదిలీ చేయాలి. ♦ ఎక్సైజ్ అధికారులకు బదిలీ నిబంధనలు వర్తిసాయి. సబ్ ఇన్స్పెక్టర్, అంతకంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న రాష్ట్రంలోని ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ అధికారులకు కూడా బదిలీల నిబంధనలు వర్తిస్తాయి. ♦ఎన్నికలతో నేరుగా సంబంధం లేని వైద్యులు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు బదిలీలుండవు. అయితే వారిలో ఎవరైనా రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు వస్తే.. విచారణలో రుజువైతే.. అటువంటి అధికారిని బదిలీ చేయమని ఆదేశించడంతోపాటు శాఖాపరమైన చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సు చేస్తుంది. ♦ గతంలో కేంద్ర ఎన్నికల సంఘం క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేసి పెండింగ్‌లో ఉన్న అధికారులు లేదా గతంలో ఎన్నికలకు సంబంధించి ఏదైనా తప్పుపట్టిన, అభియోగాలు మోపిన అధికారులకు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి విధులను అప్పగించకూడదు. గతంలో ఎన్నికల సమయంలో బదిలీ చేసిన అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు. ♦ అధికారిక పనితీరుకు సంబంధించిన క్రిమినల్ కేసు ఏదైనా న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉంటే అలాంటి అధికారులు ఎన్నికల సంబంధిత విధుల్లో ఉండకూడదు. ♦ ఆరునెలల్లో పదవీ విరమణ చేయనున్న అధికారులు ఎవరైనా ఎన్నికల సంబంధిత పోస్టులో ఉంటే ఆ వ్యక్తిని ఆ విధుల నుంచి తప్పించాలి. అలాంటి వారిని బదిలీ చేయాల్సిన అవసరం లేదు. ♦ పదవీ విరమణ తరువాత వివిధ హోదాల్లో తిరిగి నియమించిన, పొడిగింపులపై ఉన్న అధికారులు ఎన్నికల సంబంధిత విధుల్లో ఉండకూడదు. ♦ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఉన్న అధికారులకు సంబంధించిన బదిలీ ఉత్తర్వులు ఏమైనా ఉంటే సంబంధిత ప్రధాన ఎన్నికల అధికారిని సంప్రదించి ఓటర్ల జాబితా తుది ప్రచురణ తర్వాత మాత్రమే బదిలీలు అమలు చేయాలి. ఏదైనా అసాధారణ కారణాల వల్ల బదిలీ చేయాల్సి వస్తే కేంద్ర ఎన్నికల సంఘం ముందస్తు అనుమతి తీసుకోవాలి. బదిలీలపై ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని సంప్రదించడంతో పాటు బదిలీ ఉత్తర్వులను ఆయనకు ఇవ్వాలి. ♦ ఎన్నికల సంబంధిత అధికారులందరూ ప్రస్తుత ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో ఎవరికీ దగ్గర బంధువు కానని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. క్రిమినల్ కేసుల వివరాలను నిర్ధారించిన నమూనాపత్రంలో సమర్పించాలి. ఏ అధికారి అయినా తప్పుడు సమాచారం ఇస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. ఈనెల 9న రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల సంఘం సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్, కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్ గోయల్ ఈ నెల 9వ తేదీన ఏపీకి రానున్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియతో పాటు ఈవీఎంల సన్నద్ధత, ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇతర ఏర్పాట్లపై 9, 10 తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, కమిషనర్లు సమీక్షిస్తారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు, కలెక్టర్లు, ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షలు నిర్వహించనుంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు తీసుకోవాల్సిన చర్యలు, చెక్‌పోస్టుల ఏర్పాటు, మద్యం, నగదు పంపిణీలను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ఉన్నతాధికారులకు మార్గనిర్దేశం చేయనుంది. -
రెండు రోజులు ఏపీలో పర్యటించిన ఈసీ బృందం
-
టీడీపీ అక్రమాలపై చర్యలు తీసుకోండి
సాక్షి అమరావతి: రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో టీడీపీ భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అధికారుల బృందానికి ఫిర్యాదు చేశారు. మైపార్టీ డ్యాష్ బోర్డు.కామ్ వెబ్సైట్ ద్వారా ఓటర్ల వ్యక్తిగత వివరాలను టీడీపీ అక్రమంగా సేకరిస్తోందన్నారు. ఆ పార్టీకి మద్దతు తెలపని ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇందుకోసం తప్పుడు సమాచారంతో భారీ ఎత్తున ఫామ్–7లను ఎన్నికల సంఘానికి సమర్పిస్తోందన్నారు. పైగా దొంగే దొంగ అన్నట్లు టీడీపీ నేతలే ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడుతూ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతపై విజయవాడలోని నోవాటెల్ హోటల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ అధికారుల బృందం శనివారం కూడా సమీక్ష నిర్వహించింది. ఈ నేపథ్యంలో సీఈసీ బృందాన్ని మంత్రులు జోగి రమేశ్, మేరుగు నాగార్జున, ఎమ్మెల్యేలు పేర్ని నాని, కొఠారు అబ్బయ్య చౌదరి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఫైబర్ నెట్ చైర్మన్ గౌతంరెడ్డి, నవరత్న పథకాల అమలు వైస్ చైర్మన్ నారాయణమూర్తిలతో కూడిన వైఎస్సార్సీపీ బృందం కలిసింది. ఈ సందర్భంగా ఢిల్లీలో ఈ నెల 14న సీఈసీకి చేసిన ఫిర్యాదులను మరోసారి వైఎస్సార్సీపీ నేతలు సీఈసీ బృందం దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఓటర్ల జాబితాలో టీడీపీ అక్రమాలపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశామని చెప్పారు. ఈ సందర్భంగా ఇంకా ఆయన ఏమన్నారంటే.. తెలంగాణలో ఓట్లున్నవారిని ఏపీలో చేరుస్తోంది.. తెలంగాణలో ఓట్లు ఉన్న వారిని రాష్ట్రంలోనూ ఓటర్లుగా చేర్పించడానికి టీడీపీ ఆ రాష్ట్రంలో భారీ ఎత్తున శిబిరాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో ఒక ఓటు.. రాష్ట్రంలో మరో ఓటు ఉన్నవారు రాష్ట్రంలో 4.30 లక్షల మంది ఉన్నారు. వారి ఓట్లను తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశాం. ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించాలని తప్పుడు సమాచారంతో పది లక్షలకుపైగా ఫామ్–7లను దాఖలు చేసిన టీడీపీ ఎన్నికల సెల్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ కోనేరు సురేశ్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరాం. మేనిఫెస్టో పేరుతో వచ్చే ఐదేళ్లలో ఒక్కో కుటుంబానికి ఏ మేరకు లబ్ధి చేకూరుతుందో వివరిస్తూ ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో ప్రమాణపత్రాలను ఓటర్లకు ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశాం. టీడీపీ, జనసేన చట్టవ్యతిరేక కార్యకలాపాలు.. గతంలో సేవా మిత్ర యాప్ తరహాలోనే ఇప్పుడు మై పార్టీ డ్యాష్ బోర్డ్.కామ్ అనే వెబ్సైట్ ద్వారా ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీ అక్రమంగా సేకరిస్తోంది. టీడీపీ, జనసేన చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయి. మేనిఫెస్టో రూపంలో కాకుండా వ్యక్తిగతంగా ఇంటింటికీ వెళ్లి టెక్నాలజీని ఉపయోగించి ప్రలోభాలకు గురిచేస్తున్నాయని ఎన్నికల అధికారుల బృందానికి వివరించాం. వైఎస్సార్సీపీ ఓటర్లను గుర్తించి వారి ఓట్లను తొలగించడానికి టీడీపీ నేతలు దరఖాస్తు చేస్తున్నారు. తెలంగాణలో ఓట్లు ఉన్నవారిని సోషల్ మీడియా ద్వారా హోటల్స్‌కి పిలిపించుకుని రాష్ట్రంలో ఓట్లు ఎలా నమోదు చేసుకోవాలో చెబుతున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని సీఈసీ బృందానికి ఫిర్యాదు చేశాం. ఒకరికి ఒక ఓటే మా విధానం ఒకరికి ఒక ఓటు ఉండాలన్నదే వైఎస్సార్సీపీ విధానం. తెలంగాణలో ఓటు ఉన్నవారు ఏపీలోనూ ఓటు నమోదు చేసుకుంటున్నారు. ఒక వ్యక్తి రెండు చోట్లా ఓట్లు కలిగి ఉండటం నేరం. రాష్ట్ర అధికార యంత్రాంగం మొత్తం ప్రభుత్వ కార్యకలాపాలు మానేసి ఎన్నికల ఫిర్యాదులపై విచారణలో నిమగ్నం కావాలనే టీడీపీ తప్పుడు ఫిర్యాదులు చేసింది. టీడీపీకి చెందిన కోనేరు సురేశ్ 10 లక్షలకు పైబడి దొంగ ఓటర్లు ఉన్నారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం ఇందుకు నిదర్శనం. వాటిని ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లకు పంపి విచారణకు ఆదేశించింది. కోనేరు సురేశ్ తప్పుడు ఫిర్యాదు చేశారని జిల్లా కలెక్టర్లు ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చారు. కోనేరు సురేశ్ తప్పుడు ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఆశ్చర్యపోయారు. -
సమగ్ర ప్రణాళికతో ఎన్నికలు
సాక్షి, అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికే 360 డిగ్రీల సమగ్ర ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని, ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా శాంతియుత వాతావరణంలో సజావుగా ఎన్నికలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఎస్ఆర్), సాధారణ ఎన్నికల సన్నద్ధతపై శుక్రవారం నోవాటెల్‌లో ప్రారంభమైన సమీక్ష సమావేశం శనివారం కూడా కొనసాగింది. ఈ సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ కుమార్ వ్యాస్, స్వీప్ డైరెక్టర్ సంతోష్ అజ్మేరా, ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్, అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్, డైరెక్టర్ (వ్యయం) యశ్చి0ద్ర సింగ్‌తో పాటు ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా, అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎంఎన్ హరేంధిర తదితరులు హాజరయ్యారు. జిల్లాల్లోని అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలు, ఓటర్ల జాబితా స్వచ్చికరణ, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు, వారి ఫిర్యాదుల పరిష్కారం, ఇంటింటి సర్వే, స్వీప్ కార్యక్రమాల నిర్వహణ, ఎన్నికల సిబ్బంది, శిక్షణ తదితరాలపై శుక్రవారం 19 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ప్రజెంటేషన్ ఇవ్వగా, శనివారం ఇతర జిల్లాల అధికారులు వివరించారు. ఈ సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు మాట్లాడుతూ.. ఎలాంటి పొరపాట్లు, అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రస్ఫుటించేలా ప్రతి దశలో అప్రమత్తత, పారదర్శకత, జవాబుదారీతనం, నిష్పాక్షికతతో ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. ఓటర్ల జాబితాలన్నీ దోష రహితంగా ఉండాలని చెప్పారు. ఎక్కడా ఒక్క మరణించిన వ్యక్తి కానీ, డబుల్ ఎంట్రీ కానీ ఉండకుండా జాబితాల స్వచ్చికరణ జరగాలని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, పారదర్శకంగా, నిర్భయంగా, సకాలంలో పరిష్కరించాలని అన్నారు. ఈవీఎంలు, ఎన్నికలకు అవసరమయ్యే ప్రతి మెటీరియల్‌ను మైక్రో ప్లాన్‌కు అనుగుణంగా సిద్ధం చేసుకోవాలన్నారు. ఎన్నికల అధికారులు, పౌరులు, అభ్యర్థులకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేదికలపై పూర్తిస్థాయి అవగాహన అవసరమని తెలిపారు. లొకేషన్ మేనేజ్మెంట్ (డిస్పాచ్ సెంటర్, రిసీట్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాలు, ట్రైనింగ్ సెంటర్లు)కు కూడా పటిష్ట ప్రణాళిక ఉండాలన్నారు. ఎన్నికల సిబ్బందికి సమర్థవంతమైన మాస్టర్ ట్రైనర్లతో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గాల్లో శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూంలు కూడా కీలకమని చెప్పారు. ప్రతి ప్రాంతానికి ప్రత్యేక స్వీప్ ప్రణాళిక గత ఎన్నికల్లో నియోజకవర్గాలు, పోలింగ్ స్టేషన్ల వారీగా పోలింగ్ శాతాలను విశ్లేషించుకొని, దాని ఆధారంగా ప్రాంతాలనుబట్టి ప్రత్యేక సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ (స్వీప్) కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పోలింగ్ శాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక స్వీప్ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.విస్తృత ప్రజా భాగస్వామ్యంతోనే ఈ కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తాయన్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, సమస్యలకు కారణాలను గుర్తించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అధికారులు పర్యటించి, స్థానికుల్లో భయాలను పోగొట్టాల్సిందిగా చెప్పారు. సోషల్ మీడియా ఫిర్యాదుల పరిష్కారం, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ), ఎథికల్ ఓటింగ్, ఎన్నికల ప్రవర్తన నియమావళి, పోలింగ్ నిర్వహణ, ఎన్ఫోర్స్మెంట్ తదితరాలపైనా ఎన్నికల సంఘం ప్రతినిధులు మార్గనిర్దేశం చేశారు. ఈ రెండు రోజుల సమీక్షలో స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన, సమ్మిళిత ఎన్నికల నిర్వహణకు సాధ్యమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం చేసిన ఏర్పాట్లు భేష్ రెండు రోజుల సమీక్ష సమావేశాలకు మంచి ఏర్పాట్లు చేసి, విశిష్ట ఆతిథ్యమిచ్చిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు నేతృత్వంలోని అధికార యంత్రాంగానికి కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ కుమార్ వ్యాస్ బృందం ధన్యవాదాలు తెలిపింది. ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అయిన ఎన్నికలపై ఈసీఐ అధికారుల నేతృత్వంలో విజయవంతంగా జరిగిన నిర్మాణాత్మక సమీక్ష సమావేశాలు స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు మార్గదర్శిగా నిలిచాయని కలెక్టర్ డిల్లీరావు చెప్పారు. ఈ సందర్భంగా ఈసీఐ అధికారులను జిల్లా అధికార యంత్రాంగం ఘనంగా సత్కరించింది. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్, వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, సబ్ కలెక్టర్ అదితి సింగ్, డీఆర్వో ఎస్వీ నాగేశ్వరరావు పాల్గొన్నారు. సరిహద్దుల్లో నిఘా పెంచాలి సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున రాష్ట్ర, జిల్లా సరిహద్దుల్లో నిఘా పెంచాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్) కేఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డికి సూచించారు. వారు శనివారం సీఎస్, డీజీపీ, ఇతర అధికారులతో సమావేశమై సార్వత్రిక ఎన్నికల సన్నద్దతలో భాగంగా రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లు, శాంతి భద్రతలపై చర్చించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి, ఎన్నికలకు అవసరమైన సిబ్బంది, పోలింగ్ మౌలిక సదుపాయాలపై చర్చించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి రాష్ట్రంలో చేపడుతున్న చర్యలను వివిధ ప్రభుత్వ శాఖలు, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించాయి. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘ అధికారులు పలు సూచనలు చేశారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, మద్యం సరఫరా వంటివి నిరోధించడానికి ఎక్సైజ్ శాఖ, సెబ్ సంయుక్తంగా చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని స్థాయిల్లో సమాచారం నిరంతరాయంగా వెళ్లేలా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఈ వ్యవస్థ ద్వారా ఇంటెలిజెన్స్ సహాయంతో సకాలంలో చర్యలు తీసుకోగలమని తెలిపారు. దుర్గమ్మ సేవలో కేంద్ర డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ శర్మ ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను కేంద్ర డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్, ప్రత్యేక అధికారి ధర్మేంద్ర శర్మ శనివారం దర్శించుకున్నారు. ధర్మేంద్ర శర్మకు ఆలయ ఏఈఓ ఎన్.రమేష్ బాబు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవ్రస్తాలను అందజేశారు. ధర్మేంద్రశర్మ వెంట జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్‌కుమార్, వెస్ట్ ఏసీపీ హనుమంతరావు ఉన్నారు. -
ఏపీలో రెండోరోజు కొనసాగుతున్న సీఈసీ పర్యటన
-
AP: రెండో రోజు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ బృందం భేటీ
సాక్షి, విజయవాడ: జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రెండో రోజు సీఈసీ బృందం సమావేశం కొనసాగుతోంది. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ధర్మేంద్ర శర్మ ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల బృందం సమీక్ష జరుపుతోంది. మొదటి రోజు ఎన్నికల సన్నద్దతపై 18 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. నేడు సీఈసీ బృందానికి ఎన్నికల సన్నద్దతపై నంద్యాల, కర్నూలు, సత్యసాయి, అనంత, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. జిల్లాల వారీగా ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణ సన్నద్ధత, రీపోలింగ్ కేంద్రాల పరిస్ధితి, భద్రతా చర్యలు, బందోబస్తు తదితర వాటిపై సమీక్ష చేయనున్నారు. చెక్ పోస్టులు.. తనిఖీ కేంద్రాల ఏర్పాటుపై సీఈసీ బృందం ఆరా తీస్తోంది. సమస్యాత్మక.. సున్నిత ప్రాంతాల్లో భద్రతాపై సమీక్ష చేపట్టారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఎక్కువగా ఉన్న జిల్లాలపై నిరంతరం పర్యవేక్షణ పెట్టాలని సీఈఓకు కేంద్ర బృందం సూచించింది. ఓటర్ల జాబితాలో అవకతవకలను చాలా సీరియస్‌గా తీసుకుంటామని తొలి రోజు సమావేశంలో సీఈసీ బృందం హెచ్చరించింది. రాజకీయ పార్టీల ఫిర్యాదులపైనా సమీక్షించిన కేంద్ర ఎన్నికల బృందం.. బోగస్ ఓట్లు, డబుల్ ఎంట్రీలపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనే దానిపై వివరాలు తెలుసుకుంది. మధ్యాహ్నం సీఎస్, డీజీపీలతో పాటు ఎన్నికలతో సంబంధం ఉండే కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులతోనూ ఈసీ బృందం భేటీ కానుంది. -
రాష్ట్ర సార్వత్రిక ఎన్నికలపై సీఈసీ కసరత్తు
సాక్షి, అమరావతి: వచ్చే సంవత్సరం రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్‌కు జరిగే సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ–2024, ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన ఉన్నతాధికారులు రెండు రోజులు పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐ) నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు, డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు సహా మొత్తం ఏడుగురు శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు విజయవాడలోని నోవాటెల్ హోటల్లో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహిస్తారు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు, 23వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు సమీక్షిస్తారు. తదనంతరం 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్రంలోని అంశాలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులతో ఈసీఐ బృందం చర్చించనుంది. ఎస్ఎస్ఆర్–2024 కార్యకలాపాలు, ఎన్నికల నిర్వహణ ప్రణాళిక తదితరాలపై జిల్లా కలెక్టర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇందుకోసం చేసిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావుతో కలసి పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలిచ్చారు. -
పూర్తి ఆధారాలతో టీడీపీపై ఈసీకి ఫిర్యాదు: విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు వి. విజయసాయి రెడ్డి నాయకత్వంలో పార్టీ ఎంపీల బృందం ఈరోజు ఢిల్లీలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)ని కలిసింది. పీపుల్స్ రిప్రెజెంటేషన్ యాక్టును ఉల్లంఘిస్తూ ఎన్నికల సంఘం డేటాను దుర్వినియోగం చేస్తూ టీడీపీ మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్న ఘటనలను వైఎస్ఆర్సీపీ ఎంపీలు సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు. సీఈసీ భేటీ అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే...ఓటర్ల జాబితాల సమాచారంతో లబ్ధి పొందాలనే తెలుగుదేశం పార్టీ ప్రయత్నాల్ని వైఎస్ఆర్సీపీ పసిగట్టింది. ‘మై పార్టీ డ్యాష్‌బోర్డ్ డాట్ కామ్’ పేరిట ఆ పార్టీ వెబ్సైట్ కుట్రల్ని...సెక్షన్ 123(3) పీపుల్స్ రిప్రెజెంటేషన్ యాక్ట్‌ను ఉల్లఘిస్తున్న విషయానికి సంబంధించి ఎన్నికల కమిషన్‌ను ఈరోజు మేము కలిశాము. వైఎస్ఆర్సీపీ తరఫున మేము వినతిపత్రం అందించాం. చంద్రబాబు హయాంలో జరిగిన దొంగ ఓట్ల మాల్‌ప్రాక్టీస్‌పై అనేక అంశాల్ని కమిషన్‌తో సుదీర్ఘంగా చర్చించాం. వన్ సిటిజన్ .. వన్ ఓట్ అనే మాపార్టీ సిద్ధాంతాన్ని తెలియపరిచాం. ప్రధానంగా ఓటర్ల కులాల వివరాలు సేకరణ, పొలిటికల్ పార్టీ ప్రయార్టీపై తెలుగుదేశం చేస్తున్న డేటా సేకరణను ఆధారాలతో సహా సీఈసీకి చెప్పాం. వాటన్నింటిపై కమిషన్ అధికారులు పాజిటివ్‌గా స్పందించారు. ‘మైపార్టీ డ్యాష్‌బోర్డ్ డాట్‌కామ్’తో మాల్‌ప్రాక్టీస్... ఎన్నికల కమిషన్ డ్యాష్‌బోర్టులో ఉన్న డేటాను ఆధారంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ రూపొందించిన ‘మై పార్టీ డ్యాష్‌బోర్డ్ డాట్‌కామ్’లో ఓటరు పేరు, ఊరు, చిరునామా, జెండర్, వయసు, కులంతోపాటు అతను సపోర్టు చేసే పొలిటికల్ పార్టీ, మొబైల్ నెంబర్ వంటి వివరాలున్నాయి. అంటే, రాజకీయ పార్టీల వారీగా ఓటర్లను వేరు చేయడమనేది చట్టవిరుద్ధ చర్యగా మేము ఎన్నికల కమిషన్ దృష్టికి తెచ్చాం. తెలుగుదేశం పార్టీ సేకరించిన ఈ ఓటర్ డేటా మొత్తాన్ని అమెరికాలోని న్యూయార్క్‌లో ఒక సర్వర్ పాయింట్ వద్ద స్టోర్ చేస్తున్నారు. అచ్చంగా ఇలాంటి మాల్‌ప్రాక్టీస్ గతంలోనూ టీడీపీ సేవామిత్ర యాప్ ద్వారా సేకరించడం...అప్పట్లో ఆ యాప్‌పై తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం తదనంతరం దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం తెలిసిందే. అప్పట్లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా నమోదైన ఎఫ్ఐఆర్ నెంబర్ 174–2019పై కూడా ఎలాంటి పురోగతి లేదన్న సంగతిని ఎన్నికల కమిషన్ దృష్టికి తెచ్చాం. ఇప్పుడు ‘మైపార్టీ డ్యాష్‌బోర్టు డాట్‌కామ్’ ద్వారా టీడీపీ చేపట్టిన చట్టవిరుద్ధమైన కార్యక్రమంపై 120(బి), 379,420,188 (ఐపీసీ), 72, 66 (ఐటీఏ 2000 యాక్ట్) కింద చర్యలు తీసుకోవాలని మేము ప్రధాన ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాము. టీడీపీ మ్యానిఫెస్టో డాట్‌కామ్‌తో మరో కుట్ర… ఓటరు అంగీకారంతో సంబంధంలేకుండా ఓట్లను ఉంచాలా.. తొలగించాలా అనే సమాచారం కోసం తెలుగుదేశం పార్టీ మరో వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసుకుంది. మైపార్టీ డ్యాష్‌బోర్టు డాట్‌కామ్ ద్వారా సేకరించిన డేటా మొత్తం న్యూయార్క్ సర్వర్‌లో దాస్తుంటే.. టీడీపీ మ్యానిఫెస్టో డాట్‌కామ్ వెబ్సైట్ డేటా మొత్తాన్ని లండన్‌లోని మరో సర్వర్‌లో స్టోర్ చేస్తూ ఉన్నారు. టీడీపీ మ్యానిఫెస్టో డాట్‌కామ్ పేరిట ఎన్నికల కమిషన్ డ్యాష్ బోర్టులో ఇమేజ్ ఫార్మేట్లో ఉన్న సమాచారాన్ని ఎక్సెల్ ఫార్మేట్లోకి మార్చి ప్రతీ 30 ఓట్లకు తమ పార్టీకి చెందిన ఒక ఏజెంట్‌కు అప్పగిస్తారు. అతను ఒక ప్రభుత్వ ఉద్యోగిలా, ఎన్నికల సంఘం సిబ్బంది మాదిరిగా తనకు కేటాయించిన 30 మంది ఓటర్ల ఇళ్లకు వెళ్లి వాళ్ల కులమేంటి..? వాళ్ల పొలిటికల్ గుర్తింపేంటి..? వారు ఏ రకమైన బెనిఫిట్స్ పొందుతున్నారు..? వారు ఆరాధించే మతమేంటనే వివరాలతో ఓటర్ల వ్యక్తిగతమైన డేటాను సేకరించడమనేది చట్టవిరుద్ధమని మేము ఎన్నికల సంఘానికి ఆధారాలతో సహా వివరించాము. ‘బాబు ష్యూరిటీ...భవిష్యత్‌కు గ్యారెంటీ’పై ఫిర్యాదు... తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో ఓటర్ల నుంచి చట్టవిరుద్ధంగా సమాచారాన్ని సేకరించడం ఆ పార్టీ మాల్‌ప్రాక్టీస్‌లో ఒకభాగమైతే.. 2024 నుంచి రాబోయే ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ పథకాల ద్వారా ఓటరు ఎంత మేలు పొందుతాడనేది లెక్కలేసి ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌కు గ్యారెంటీ ’ అనే ప్రమాణపత్రంతో కూడిన కార్డుల్ని పంపిణీ చేస్తున్నారు. ఇలా దాదాపు 2 లక్షల 40 వేల మందికి ఈ కార్డులు అందచేసినట్లు మేము ఆధారాలతో సహా పట్టుకుని సీఈసీకి ఫిర్యాదు చేశాము. 4.36 లక్షల డూప్లికేట్ ఓట్లను గుర్తించాం... ఓటర్ల పేర్లలో ఒకటో రెండో అక్షరాలను మార్పు చేసి వారు స్థానికంగా కాకుండా ఇతర ప్రాంతాల్లో నివాసమున్నట్లు పేర్కొంటూ ఓట్లు చేర్పించే కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ఒడిగట్టింది. తండ్రి పేరు మార్చడమో లేదంటే భర్తకు భార్య పేరు మార్చడమో ఇలాంటి చిన్నచిన్న మార్పులతో డూప్లికేట్ ఓట్లను తయారు చేసుకునేందుకు ఆ పార్టీ తెగించిందనేది తెలుసుకున్నాము. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఓట్లను కూడా ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాలోకి తీసుకొచ్చే మాల్‌ప్రాక్టీస్ జరుగుతుంది. ఇప్పటికే దాదాపు 4 లక్షల 36 వేల 268 ఓట్లు తెలంగాణ ఓటర్ల జాబితాలోనూ ఆంధ్రాలోనూ డూప్లికేటింగ్ ఓట్లుగా కనిపిస్తున్నాయి. వీటి వివరాల్ని కూడా ఆధారాలతో సహా సీఈసీకి అందజేసి.. వీటన్నింటినీ జాబితా నుంచి తొలగించాల్సిందిగా కోరాము. తెలంగాణలో ఓటరు నమోదుకు ప్రత్యేక శిబిరాలు... తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయినందున...అక్కడున్న ఆంధ్రప్రదేశ్ సెటిలర్స్ రేపటి ఆంధ్రా ఎన్నికల్లో పాల్గొనేందుకు తెలుగుదేశం పార్టీ వ్యూహం పన్నింది. అందులో భాగంగా ప్రత్యేకంగా తెలంగాణలో ఓటరు నమోదు శిబిరాలను ఏర్పాటు చేసి ఆన్లైన్లో ఓటర్ల చేర్పులు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అనుకూల సామాజికవర్గ ఓటర్లను తెలంగాణ జాబితాలో తొలగించకుండానే ఆంధ్రప్రదేశ్‌లో వారికి ఓటు హక్కు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని కూడా మేము ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడే వ్యక్తుల్ని ప్రోత్సహించరాదు... తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ అయిన కోనేరు సురేష్ అనే వ్యక్తి డూప్లికేటింగ్, డబుల్ ఎంట్రీస్, నాన్ లోకల్ కింద ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 10 లక్షల ఓట్లు ఉన్నట్లు...వాటిపై ఎంక్వైరీ చేయాలని గతంలో సీఈసీకి ఫిర్యాదు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అక్కడి నుంచి జిల్లా కలెక్టర్లకు ఆ ఫిర్యాదుపై ఎంక్వైరీలు చేయాలని ఆదేశాలొచ్చాయి. అయితే, సదరు ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్లు చాలా సమయాన్ని వెచ్చించి పరిశీలిస్తే ఫిర్యాదులో నిజం లేదని తేలింది. దీనినిబట్టి కోనేరు సురేష్ అనే వ్యక్తి ఎన్నికల సంఘం సమయాన్ని ఎంతగా వృథా చేశాడో అర్ధం చేసుకోవాలి. దీనిపై వైఎస్ఆర్సీపీ తరఫున మేము ఒకటే అడుగుతున్నాం. ఎవరైనా ఒక వ్యక్తి పది లక్షల మంది ఓటర్ల తరఫున మా ఓట్లు ఒరిజినలా... బోగస్‌వా వెరిఫై చేయండని కోరగలరా? అని అడుగుతున్నాము. ఈ రకంగా తెలుగుదేశం పార్టీ అబద్ధపు ఫిర్యాదులిచ్చి...విలువైన ఎన్నికల సంఘం అధికారులు, జిల్లా కలెక్టర్లు, సిబ్బంది సమయాన్ని వృథాపరచడం చట్టవ్యతిరేక చర్యగా పరిగణించాల్సిందిగా సీఈసీకి వివరించాం. చదవండి: మార్చిలోనే ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షలు: మంత్రి బొత్స -
లోక్‌సభ ఎన్నికలకు కొత్త ఓటర్ల జాబితా
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం కొత్త ఓటర్ల జాబితా రూపకల్పన ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే జనవరి 1 అర్హత తేదీగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం–2024 షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. ఈ కార్య క్రమంలో భాగంగా 2024 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండనున్న యువతతో పాటు ప్రస్తుత ఓటరుజాబితాలో పేరు లేని వారి నుంచి సైతం దరఖాస్తులను స్వీకరించ నున్నారు. జనవరి 6 నుంచి సవరణ ప్రారంభం కానుండ గా, అంతకు ముందు పోలింగ్ కేంద్రాల పునర్వ్య వస్థీక రణ, సెక్షన్ల ఏర్పాటు, ఓటర్ల జాబితా/ఫొటో ఓటరు గు ర్తింపు కార్డుల్లో లోపాల దిద్దుబాటు, ఓటర్ల జాబితాలో స రైన ఫొటోలు ముద్రించడం, పోలింగ్ కేంద్రాల సరిహ ద్దుల వారీగా సెక్షన్లు/పార్టుల పునర్విభజన తదితర చర్య లను జనవరి 5 వరకు పూర్తి చేయనున్నారు. జనవరి 6న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. నాటి నుంచి జనవరి 22 వరకు కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తు లు, ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తా రు. ముసాయిదా జాబితాలో తప్పులు/లోపాల దిద్దుబా టు, ఓటరు చిరునామా మార్పు కోసం సైతందరఖాస్తు చే సుకోవడానికి వీలు కల్పించనున్నారు. ఫిబ్రవరి 2లోగా ద రఖాస్తులు, అభ్యంతరాలను పరిష్కరిస్తారు. ఫిబ్రవరి 6న తుది ఓటర్ల జాబితా నాణ్యతను పరిశీలించడంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆమోదముద్ర తీసుకుంటారు. ఫిబ్రవరి 8న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. డోర్ టూ డోర్ సర్వే బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) తమ వద్ద ఉన్న ప్రస్తుత ఓటర్ల జాబితాను తీసుకుని ఇంటింటికీ తిరిగి కుటుంబ పెద్దను కలవడం ద్వారా సంబంధిత ఓటర్లు ఉన్నారా? లేదా? అన్న విషయంపై పరిశీలన జరపను న్నారు. 2024 జనవరి 1తో పాటు ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండనున్న యువత సైతం కొత్త ఓటర్లుగా నమోదు కావడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే 18 ఏళ్లు నిండిన తర్వాతే వారికి ఓటు హక్కు కల్పిస్తారు. -
జడ్జిమెంట్ డే..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఏమిటో మరికొన్ని గంటల్లో వెల్లడికానుంది. దాదాపు రెండు నెలల ఉత్కంఠకు కాసేపట్లో తెరపడనుంది. ఆదివారం ఉదయం 8 గంటలకు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. రాష్ట్రంలోని మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాల్లో పోటీపడిన 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమవుతాయా? అందుకు భిన్నంగా ఫలితాలు వస్తాయా? ఎవరెవరు గెలుస్తారు? ఎవరికి దెబ్బపడుతుంది? అధికారంలోకి వచ్చేది ఎవరన్న దానిపై రాష్ట్ర ప్రజల్లో ఉత్కంఠ కనిపిస్తోంది. ఈ ఓట్ల కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ శనివారం ప్రకటించారు. 49 ప్రాంతాల్లో లెక్కింపు కేంద్రాలు రాష్ట్రంలో 31 జిల్లా కేంద్రాల్లోని 31 ప్రాంతాల్లో, హైదరాబాద్‌లో 14, రంగారెడ్డి జిల్లాలో నాలుగు ప్రాంతాల్లో కలిపి మొత్తం 49 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇందులో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 కౌంటింగ్ సెంటర్లలో ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలు, పోలైన ఓట్ల సంఖ్య ఆధారంగా ఒక్కో సెంటర్లో కౌంటింగ్ టేబుళ్లను సిద్ధం చేశారు. దీని ప్రకారం అతి తక్కువగా షాద్‌నగర్ స్థానానికి సంబంధించి 12 టేబుళ్లనే ఏర్పాటు చేశారు. 99 స్థానాలకు 14 టేబుళ్లు చొప్పున, 4 స్థానాలకు 16 టేబుళ్ల చొప్పున, 6 స్థానాలకు 18 టేబుళ్ల చొప్పున, మూడు స్థానాలకు 30 టేబుళ్ల చొప్పున.. 500కిపైగా పోలింగ్ కేంద్రాలున్న 6 నియోజకవర్గాలకు సంబంధించి 28 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి టేబుళ్లకు అదనంగా.. రిటర్నింగ్ అధికారి (ఆర్వో) కోసం మరో టేబుల్ ఉంటుంది. మొత్తం 1,798 టేబుల్స్ ఏర్పాటు కాగా.. వాటిలో ఆర్వో, పోస్టల్ బ్యాలెట్ల కోసం 131 టేబుల్స్ వినియోగిస్తారు. తొలి ఫలితం.. భద్రాచలం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యధికంగా 26 రౌండ్లలో, భద్రాచలం నియోజకవర్గంలో అతి తక్కువగా 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. అంటే భద్రాచలం నియోజకవర్గం ఫలితాలు తొలుత వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. మొత్తంగా 119 స్థానాల్లో కలిపి 2,417 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ప్రతి రౌండ్ కౌంటింగ్ ముగిశాక.. ఆ రౌండ్లో ప్రతి అభ్యర్థికి పడిన ఓట్లను నోట్ చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది. అధిక పోలింగ్ జరిగిన నియోజకవర్గాలు, ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉన్న స్థానాల్లో ఓట్ల లెక్కింపునకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. కౌంటింగ్ సమయంలో ఈవీఎంలకు ఏవైనా సాంకేతిక సమస్యలు వస్తే పరిష్కరించడం కోసం 119 మంది ఇంజనీర్లను నియమించారు. మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణలో.. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక సూక్ష్మ పరిశీలకుడు (మైక్రో అబ్జర్వర్), సూపర్వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు. ప్రతి రౌండ్ ఓట్ల లెక్కింపును మైక్రో అబ్జర్వర్ పర్యవేక్షిస్తారు. ఒక నియోజకవర్గానికి సంబంధించిన టేబుళ్లపై ఏక కాలంలో జరిపే లెక్కింపును ఒక రౌండ్‌గా లెక్కిస్తారు. ఆ రౌండ్లో అభ్యర్థులకు పోలైన ఓట్ల సంఖ్యను నమోదు చేస్తారు. ఓట్ల సంఖ్యను మరోసారి పరిశీలించి నిర్ధారించుకుంటారు. తర్వాత మైక్రో అబ్జర్వర్ పరిశీలనకు పంపుతారు. మైక్రో అబ్జర్వర్ ఆమోదించాక.. తదుపరి రౌండ్ లెక్కింపు ప్రారంభిస్తారు. ఒక్కో రౌండ్ పూర్తయిన కొద్దీ స్థానిక ఆర్వో/ఏఆర్వో మీడియా రూమ్ వద్దకు వచ్చి ఆ ఫలితాన్ని ప్రకటిస్తూ ఉంటారు. మూడంచెల భద్రత లెక్కింపు కేంద్రాల వద్ద కేంద్ర సాయుధ బలగాలు, రాష్ట్ర ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు, రాష్ట్ర పోలీసులతో మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, పరిశీలకులు, అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు, పాసులు కలిగిన మీడియా ప్రతినిధులను మాత్రమే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తారు. కాలిక్యులేటర్లు, సెల్ఫోన్లు, ఇతర ఎల్రక్టానిక్ పరికరాలను కౌంటింగ్ కేంద్రాల్లోకి తీసుకెళ్లడానికి వీలుండదు. అధికారంపై ఎవరి ధీమా వారిదే.. శాసనసభ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ సాధించి అధికారంలోకి వస్తామని అధికార బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మళ్లీ గెలిచి హాట్రిక్ కొడతామని బీఆర్ఎస్.. తెలంగాణలో తొలిసారి అధికారం చేపడతామని కాంగ్రెస్ అంటున్నాయి. హంగ్ ఏర్పడితే ప్రభుత్వంలో భాగస్వామ్యం లభిస్తుందని బీజేపీ, ఎంఐఎం ఆశలు పెట్టుకున్నాయి. తుది ఫలితాలు ఎలా ఉన్నా తొలి రెండు స్థానాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌లే ఉంటాయని.. మూడో స్థానం కోసం ఎంఐఎం, బీజేపీ తలపడనున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ సీట్లలో బీఆర్ఎస్ పోటీ చేయగా.. కాంగ్రెస్ 118 చోట్ల, పొత్తులో సీపీఐ ఒక స్థానంలో బరిలో ఉన్నాయి. మరో కూటమిలో బీజేపీ 111, జనసేన 8 స్థానాల్లో పోటీచేశాయి. బీఎస్పీ 107, ఎంఐఎం 9, సీపీఎం 19, సీపీఐఎల్ (న్యూడెమోక్రసీ) ఒక స్థానంలో బరిలో ఉన్నాయి. ఆ స్థానాలపైనే అందరి దృష్టి! సీఎం కేసీఆర్ ఈసారి గజ్వేల్, కామారెడ్డి స్థానాల నుంచి పోటీలో ఉండగా.. ఆయనపై గజ్వేల్‌లో బీజేపీ తరఫున ఈటల రాజేందర్, కామారెడ్డిలో కాంగ్రెస్ తరఫున టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బరిలోకి దిగి సవాల్ విసిరారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఈ రెండు నియోజకవర్గాల ఫలితం ఎలా ఉంటుందన్నది ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు మంత్రులు కేటీఆర్ (సిరిసిల్ల), హరీశ్‌రావు (సిద్దిపేట), ఎర్రబెల్లి దయాకర్‌రావు (పాలకుర్తి), సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి(వనపర్తి), ఇంద్రకరణ్‌రెడ్డి (నిర్మల్), స్పీకర్ పోచారంశ్రీనివాస్‌రెడ్డి (బాన్సువాడ)ల ఎంపికపైనా అంతటా ఆసక్తి నెలకొంది. ► కాంగ్రెస్ తరఫున సీఎం ఆశావాహులు/సీనియర్లు అయిన టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి (కొడంగల్), భట్టి విక్రమార్క (మధిర), ఉత్తకుమార్‌రెడ్డి(హుజూర్నగర్), దామోదర రాజనర్సింహ (ఆందోల్), కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (నల్లగొండ), టి.జీవన్‌రెడ్డి (జగిత్యాల), దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (మంథని), సీతక్క (ములుగు), తుమ్మల నాగేశ్వర్రావు (ఖమ్మం)ల జయాపజయాలపై చర్చ నడుస్తోంది. ► బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ (కరీంనగర్), ఈటల రాజేందర్ (హుజూరాబాద్), బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్(సిర్పూర్) తదితరులు సాధించనున్న ఫలితాలపైనా ఆసక్తి కనిపిస్తోంది. ► నిరుద్యోగుల ప్రతినిధిగా కొల్లాపూర్ నుంచి పోటీచేస్తున్న శిరీష (బర్రెలక్క) ఎన్నికల్లో గెలిచే అవకాశాలు పెద్దగా లేవని, అయినా ఆమెకు ఎన్ని ఓట్లు పడతాయి, అక్కడ ఎవరు విజయం సాధిస్తారన్న దానిపై చర్చ జరుగుతోందని రాజకీయ నిపుణులు చెప్తున్నారు. ఉదయం 10.30కల్లా ఆధిక్యతపై స్పష్టత ఆదివారం ఉదయం 8 గంటలకు తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. అరగంట తర్వాత అంటే 8.30 గంటలకు ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు మొదలుపెడతారు. ఒకవేళ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఎక్కువ సమయం కొనసాగినా, ఈవీఎం ఓట్ల లెక్కింపును సమయానికే ప్రారంభిస్తారు. చాలా నియోజకవర్గాల్లో ఉదయం 10.30 గంటలకల్లా ఏ అభ్యర్థి ఆధిక్యతలో ఉన్నదీ దాదాపుగా స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకల్లా పోలింగ్ సరళి ద్వారా పార్టీల గెలుపోటములపై స్పష్టత రావొచ్చని పేర్కొంటున్నారు. ఎక్కడైనా పోటీ ఎక్కువగా ఉండి, రౌండ్ రౌండ్‌కు ఆధిక్యతలు మారిపోతూ ఉంటే.. లెక్కింపు పూర్తయ్యేదాకా ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతుందని అంటున్నారు. ఓట్ల లెక్కింపు సరళిని కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ https:// results.eci.gov.in ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!
-
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల 'పోలింగ్ 70.66 శాతం'!
గడప దాటని సిటీ చెంతనే పోలింగ్ కేంద్రం.. అయినా సిటీ ఓటరు గడప దాటలేదు. సెలవును సరదాగా గడిపేశారు. ఓటేసేందుకు కదల్లేదు. క్రితంసారితో పోలిస్తే 5% పోలింగ్ తగ్గింది. పట్నమిలా..హైదరాబాద్ భరత్‌నగర్‌లోని పోలింగ్ కేంద్రం 16 కి.మీ. నడిచొచ్చి.. ఓటేసి వీరంతా ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల పంచాయతీ పరిధిలోని పెనుగోలు ఆదివాసీలు. మూడు గుట్టలు ఎక్కి దిగి, మధ్యలో మూడు వాగులు దాటి 16 కిలోమీటర్లు నడిచి వచ్చి మరీ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ గోడు పట్టించుకోవడం లేదని వారు గోడు వెళ్లబోసుకున్నారు. ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండాలనుకున్నా.. రాజ్యాంగం కల్పించిన హక్కును ఉపయోగించుకోవాలనే ఇంతదూరం నడిచి వచ్చామని చెప్పారు. – వాజేడు పల్లె ఇలా.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో (ఈవీఎం) నిక్షిప్తమైంది. గురువారం రాత్రి వరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 70.66 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం అంచనా వేసింది. కచ్చితమైన గణాంకాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ శుక్రవారం ప్రకటిస్తారని ఆయన కార్యాలయం తెలిపింది. రాష్ట్ర శాసనసభకు 2014లో జరిగిన ఎన్నికల్లో 69.5 శాతం, 2018 ఎన్నికల్లో 73.2 శాతం పోలింగ్ నమోదైంది. తాజా పోలింగ్‌లో కడపటి వార్తలు అందేసరికి 70.66 శాతంగా నమోదైంది. ఇది మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నెల 3న (ఆదివారం) ఓట్ల లెక్కింపు నిర్వహించి, ఫలితాలను ప్రకటించనున్నారు. అత్యధికంగా జనగామలో.. గురువారం సాయంత్రానికల్లా అత్యధికంగా.. మునుగోడు 91.51, ఆలేరు 90.16, భువనగిరి 89.9 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా యాకూత్‌పురలో 39.69 శాతం, మలక్‌పేట 41, నాంపల్లిలో 42.76, చార్మినార్‌లో 43.26 శాతం పోలింగ్ నమోదైంది. ► జిల్లాల వారీగా పోలింగ్ శాతాలను పరిశీలిస్తే.. అత్యధికంగా యాదాద్రి భువనగిరిలో 90.03 శాతం, మెదక్‌లో 86.69శాతం జనగామలో 85.74, నల్లగొండలో 85.49శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా హైదరాబాద్‌లో 46.65 శాతం, రంగారెడ్డిలో 59.94 శాతమే ఓట్లు వేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం తగ్గిపోయినట్టు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ►మొత్తం 119 నియోజకవర్గాలకుగాను 13 వామ పక్ష తీవ్రవాద ప్రభావిత స్థానాల్లో సాయంత్రం 4 గంటలకు, మిగతా 106 చోట్ల సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. అయితే పోలింగ్ ముగిసే సమ యానికల్లా.. పోలింగ్ కేంద్రాలకు చేరుకుని, క్యూలైన్లలో ఉన్న ఓటర్లందరికీ ఓటేసే అవకాశం కల్పించారు. కొన్నిచోట్ల ఇలా రాత్రి వరకు పో లింగ్ సాగింది. ఈ క్రమంలోనే పోలింగ్ శాతాలపై శుక్రవారం ఉదయమే స్పష్ట త వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. పలుచోట్ల ఆలస్యంగా.. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 5.30 గంటలకే మాక్ పోలింగ్ నిర్వహించారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ మొదలుకావాలి. అ యితే పలుచోట్ల ఈవీఎంలు, ఓటర్ వెరిఫయబుల్ ఆడిట్ ట్రయల్ (వీవీ ప్యాట్) యంత్రాలు మొరాయించడంతో గంట నుంచి రెండు గంటలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని పోలింగ్ కేందాల్లో ఈవీఎంలు మొరాయించాయి? ఎన్నింటిని రిప్లేస్ చేశారన్న అంశంపై సీఈఓ కార్యాలయం ప్రకటన జారీ చేయలేదు. ఉదయమే బారులు తీరిన ఓటర్లు రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల ఓటర్లు ఉదయమే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. దీనితో వడివడిగా ఓటింగ్ సాగింది. మధ్యాహ్నం కొంత మందగించినా తర్వాత పుంజుకుంది. ఉదయం 9 గంటల వరకు 7.78 శాతం, 11 గంటల వరకు 20.64 శాతం, మధ్యాహ్నం 3 గంటల సమయానికి 51.89 శాతం, సాయంత్రం 5 గంటలకు 64.42 శాతం పోలింగ్ నమోదైంది. కడపటి వార్తలు అందేసరికి 70.66 శాతంగా నమోదైంది. రాత్రి వరకు పలుచోట్ల ఓటింగ్ కొనసాగిన నేపథ్యంలో ఆ లెక్క లన్నీ క్రోడీకరించాల్సి ఉంది. దీనితో ఓటింగ్ శాతం పెరగనుందని ఎన్నికల సంఘం అంచనా వేసింది. తగ్గిన ఓట్ల గల్లంతు ఫిర్యాదులు గత శాసనసభ ఎన్నికల సందర్భంగా భారీ సంఖ్యలో ఓట్లు గల్లంతైనట్టు ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా హైదరాబాద్ జంట నగరాల్లో లక్షల ఓట్లు తొలగించినట్టు విమర్శలు వచ్చాయి. అయితే ఈసారి ఎన్నికల్లో ఓట్ల గల్లంతుపై ఫిర్యాదులు నామమాత్రంగానే వచ్చాయి. వివరాలు వెల్లడించని ఎన్నికల ప్రధానాధికారి శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధిగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) విలేకరుల సమావేశం నిర్వహించి.. వివరాలను వెల్లడించడం ఆనవాయితీ. అంతేకాదు.. పోలింగ్ కొనసాగుతున్న సమయంలోనూ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేవారు. అయితే సీఈఓ వికాస్‌రాజ్ గురువారం శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిశాక ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. దీంతో మీడియా ప్రతినిధులు సీఈఓ కార్యాలయం ప్రజాసంబంధాల విభాగం అధికారులను సంప్రదించారు. పోలింగ్ తీరుపై విలేకరుల సమావేశం నిర్వహించాలని కోరారు. కానీ సీఈఓ వికాస్‌రాజ్ అంగీకరించలేదని అధికారులు బదులిచ్చారు. కేవలం పోలింగ్ శాతంపై ప్రాథమిక అంచనాలు మినహా ఎలాంటి ఎలాంటి సమాచారాన్ని సీఈఓ కార్యాలయం వెల్లడించలేదు. ఈవీఎంల తరలింపుపై ఉద్రిక్తత సూర్యాపేట జిల్లా నాగారం మండలం పేరబోయినగూడెంలో అధికారులు ఎస్కార్ట్ లేకుండా ఈవీఎంలను తరలిస్తున్నారని, ఈవీఎంలను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి సర్దిచెప్పడంతో గ్రామస్తులు వెనక్కి తగ్గారు. అయితే ఖాళీ ఈవీఎంలను కారులో తరలిస్తున్న సెక్టోరియల్ అధికారిని అడ్డుకుని అద్దాలను ధ్వంసం చేశారు. ఇంటింటికీ ఓటింగ్‌కు భారీ స్పందన: సీఈసీ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 80ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు కలిపి 25,400 మంది తొలిసారిగా ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తొలిసారి కల్పించిన ఈ అవకాశాన్ని ఓటర్లు సది్వనియోగం చేసుకున్నారని ఒక ప్రకటనలో తెలిపింది. బందోబస్తుతో ప్రశాంతం రాష్ట్రవ్యాప్తంగా పోలీసుశాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి, అనుక్షణం పర్యవేక్షించడంతో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాల్లో పలుచోట్ల చెదురుమదురు ఘటనలు జరిగి, ఉద్రిక్తత నెలకొన్నా అక్కడి పోలీసు సిబ్బంది వేగంగా స్పందించి పరిస్థితిని చక్కదిద్దారు. రాష్ట్ర పోలీస్‌శాఖ నుంచి 45వేల మంది పోలీసు సిబ్బంది, 375 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, కర్నాటక, ఏపీ, మహారాష్ట్రల నుంచి 23,500 మంది హోంగార్డులు బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు. మావోయిస్టులు ఎన్నికల బహిష్కరణ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో.. ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు. కూంబింగ్, ఏరియా డామినేషన్ సెర్చ్ చేపట్టారు. ఓటెత్తని హైదరాబాద్! సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లా పరిధిలో రాష్ట్రంలోనే తక్కువగా పో లింగ్ నమోదైంది. అధికారులు ఎంతగా అవగాహన కల్పించే ప్రయత్నం చేసినా.. ఎప్పటిలాగే హైదరాబాద్ జనం ఓటు వేసేందుకు తరలివెళ్లలేదు. పోలింగ్ కేంద్రాల్లో ఎంత క్యూ ఉందో, ఎంత సమయంలో ఓటేయవచ్చో ఆన్లైన్లో ముందే తెలుసుకునే సదుపాయం కల్పించినా ఫలితం రాలేదు. చాలా వరకు సెలవురోజుగానే భావించి విశ్రాంతి తీసుకునేందుకు, వినోద కార్యక్రమాల్లో మునిగిపోయి ఉండటమే దీనికి కారణమని అధికారవర్గాలు చెప్తున్నాయి. అంతేగాకుండా ఒకటి కంటే ఎక్కువచోట్లా ఓట్లున్నవారూ ఇక్కడ గణనీయంగా ఉండటం, వారంతా స్వస్థలాలకు తరలడం కూడా పోలింగ్ తగ్గడానికి మరో కారణమని పేర్కొంటున్నాయి. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి వెల్లడించిన సమాచారం మేరకు.. జిల్లాలో కడపటి వార్తలు అందేసరికి 46.65 శాతమే పోలింగ్ నమోదైంది. గత అసెంబ్లీ ఎన్నికల (50.51 శాతం)తో పోలిస్తే ఐదు శాతం తగ్గడం గమనార్హం. జిల్లాల్లో ఓటింగ్ తీరు ఇదీ.. ఉమ్మడి ఆదిలాబాద్.. గిరిజన ప్రాంతాల్లో ధాటిగా ఓటింగ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని మారుమూల, గిరిజన ప్రాంతాల్లో అధికంగా పోలింగ్ నమోదైంది. ఆసిఫాబాద్, సిర్పూర్, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి తదితర స్థానాల్లో పలుచోట్ల రాత్రిదాకా ఓటింగ్ జరిగింది. కాగజ్‌నగర్ పట్టణంలోని 90వ పోలింగ్ కేంద్రం వద్ద బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, సిర్పూర్ బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్‌బాబు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, బీఎస్పీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. వారిని అదుపు చేసే క్రమంలో డీఎస్పీ శ్రీనివాస్‌రావు, ఎస్సై గంగన్న, కానిస్టేబుల్ రత్నాకర్, మరికొందరికి గాయాలయ్యాయి. ఇక్కడ రీపోలింగ్ నిర్వహించాలని ప్రవీణ్‌కుమార్ రిటరి్నంగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. మంచిర్యాల జిల్లా వరిపేట, ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం కొత్తపల్లిలలో ప్రజలు తమ సమస్యలు తీర్చలేదంటూ నిరసన వ్యక్తం చేయగా.. అధికారులు నచ్చజెప్పడంతో ఓటేశారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గొల్లఘాట్ గ్రామస్తులు.. తమ ఊరిగి రోడ్డు, మంచినీటి సౌకర్యం కల్పించాలంటూ ఓటు వేయలేదు. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లో నిలబడి ఇద్దరు మృతి చెందారు. ఉమ్మడి ఖమ్మం.. గ్రామాల్లో పోలింగ్ బహిష్కరణ ఖమ్మం ఉమ్మడి నియోజకవర్గాల్లో పలుచోట్ల రాత్రి 8వరకు కూడా పోలింగ్ జరిగింది. కొత్తగూడెం రూరల్, ఏన్కూరు, సత్తుపల్లి మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదంటూ పోలింగ్‌ను బహిష్కరించారు. అధికారులు ఆయా గ్రామాలకు వెళ్లి సర్దిచెప్పడంతో మధ్యాహ్నం ఓట్లు వేశారు. కూసుమంచి, ఎర్రుపాలెం, తల్లాడ, బోనకల్, కొనిజర్ల, తిరుమలాయపాలెం, అశ్వారావుపేట, మణుగూరు, పినపాక మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణలు జరిగాయి. పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితిని చక్కదిద్దారు. ఖమ్మం రూ రల్ మండలంలోని గోళ్లపాడులో ఏనుగు సీతారాంరెడ్డి(75) ఓటు వేసి పోలింగ్ బూత్ నుంచి బయటికి వస్తూ కుప్పకూలి కన్నుమూశాడు. ఉమ్మడి రంగారెడ్డి.. బాగా తగ్గిన పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. గత ఎన్నికల కంటే ఈసారి ఓటింగ్‌శాతం తగ్గింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఖానాపూర్‌లో, రాజేంద్రనగర్ నియోజకవర్గం మణికొండలో, మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లిలో స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఉమ్మడి నల్లగొండ.. పలుచోట్ల లాఠీచార్జి నల్లగొండ జిల్లా ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల లాఠీచార్జిలు, చెదురుమదురు ఘటనలు జరిగాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఆలేరు మండలం కొలనుపాకలో టీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత భర్త మహేందర్‌రెడ్డి గులాబీ కండువాతో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడంపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం చెప్పారు. ఈసమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. కొందరు రాళ్లు రువ్వడంతో మహేందర్‌రెడ్డి కారు అద్దాలు పగిలాయి. పోలీసులు లాఠీచార్జి చేసి అందరినీ చెదరగొట్టారు. హుజూర్నగర్లోనూ గులాబీ కండువా వేసుకుని పోలింగ్ కేంద్రంలోకి వెళ్తున్న ఎమ్మెల్యే సైదిరెడ్డిని పోలీసులు ఆపడంతో వాగ్వాదం జరిగింది. నారాయణపురం మండల కేంద్రంలో ఇద్దరు వ్యక్తులు టెండర్ ఓట్లు వేశారు. ఉమ్మడి కరీంనగర్.. డబ్బుల కోసం నిరసనలతో.. కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో పెద్దగా అవాంఛనీయ ఘటన లు జరగలేదు. కరీంనగర్ జిల్లాలో రేకుర్తిలో కాంగ్రెస్ ఎన్నికల ఏజెంట్ వాహనాన్ని బీఆర్ఎస్ నాయకులు అడ్డగించారని పోలీసులకు ఫిర్యా దు అందింది. మానకొండూర్ బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ గులాబీ చొక్కా ధరించి పోలింగ్ కేంద్రాలకు వచ్చారంటూ మొగిలిపాలెం, గన్నేరువరం గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం చెప్పడంతో వాగ్వాదం జరిగింది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండ లం గంగారంలో అధికార పార్టీ అభ్యర్థి పంచిన డబ్బులు తమకు అందలేదంటూ కొందరు ఓటర్లు రోడ్డుపై బైఠాయించారు. రాజన్న సిరిసి ల్ల జిల్లా లింగంపేటలో తమకు డబ్బులు ఇవ్వలేదంటూ బీజేపీ నాయకుడి ఇంటి వద్ద మహిళా గ్రూపు సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్.. ప్రశాంతంగా పోలింగ్.. పాలమూరు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో రాత్రి 9 గంటల వరకు పోలింగ్ జరిగింది. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. అచ్చంపేట నియోజకవర్గం పదర మండలం వంకేశ్వరంలో డబ్బులు పంచుతున్నారంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పలుచోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య, మరికొన్నిచోట్ల బీఆర్ఎస్–బీజేపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం వర్కూర్లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య గొడవ చోటు చేసుకుంది. ఉమ్మడి నిజామాబాద్.. మందకొడిగా మొదలై.. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పోలింగ్ మందకొడిగా ప్రారంభమై మధ్యాహ్నానికి పుంజుకుంది. పలుచోట్ల రాత్రిదాకా ఓటర్లు క్యూలలో ఉన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని పలుచోట్ల గుమిగూడిన పార్టీల కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. పలువురికి గాయాలయ్యాయి. కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డిని నాన్‌లోకల్ అంటూ బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. ఉమ్మడి వరంగల్.. బీఆర్ఎస్–కాంగ్రెస్ జగడం వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. మహబూబాబాద్ జిల్లా పరిధిలో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడం, మరికొన్ని చోట్ల తమ గ్రామాలను అభివృద్ధి చేయలేదంటూ జనం రాకపోవడంతో ఓటింగ్ జరగలేదు. దంతాలపల్లి బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. మంగపేటలో బీఆర్ఎస్ నేత మాజీ జెడ్పీటీసీ వైకుంఠం ఓట్లకు డబ్బులిస్తానని మోసం చేశారంటూ పలువురు ఓటర్లు నిరసన వ్యక్తం చేశారు. జనగామ నియోజకవర్గ కేంద్రంలోని ఓ పోలింగ్ స్టేషన్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి సతీమణి నీలిమ, కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి కుమారుడు ప్రశాంత్‌రెడ్డి, కోడలు దివ్యల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రెండు పార్టీల కార్యకర్తలు గొడవకు దిగడంతో పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. జనగామ మండలం శామీర్‌పేట పోలింగ్ కేంద్రంలో ఎదురుపడిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పరుష పదజాలంతో దూషించుకున్నారు. ఇక్కడా బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు పరస్పర దాడులకు దిగడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఉమ్మడి మెదక్.. స్వల్ప ఘర్షణల మధ్య.. మెదక్ ఉమ్మడి జిల్లాలో పోలింగ్ సందర్భంగా పలుచోట్ల స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాటలు జరగడంతో పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. మునిపల్లి మండలం పెద్దగోకులారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య, సదాశివపేట ఎంపీడీఓ కార్యాలయం వద్ద, పటాన్చెరులో మూడుచోట్ల బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఎన్నికల విధుల్లో గుండెపోటుతో ఉద్యోగి మృతి పటాన్‌చెరుటౌన్/కైలాస్‌నగర్: ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం జరిగిన ఈ సంఘటనపై ఎస్ఐ సురేందర్ రెడ్డి కథనం ప్రకారం.. కొండాపూర్ మండలం గొల్లపల్లికి చెందిన నీరడి సుధాకర్ (43) కొండాపూర్‌లో వెటర్నరీ విభాగంలో సహాయకునిగా పని చే స్తున్నారు. బుధవారం పటాన్చెరు మండలం ఇస్నా పూర్ గ్రామం (248) పోలింగ్ బూత్‌లో ఎన్నికల విధులు నిర్వహించేందుకు వచ్చారు. ఈ క్రమంలో అర్ధరాత్రి గుండెపోటు రావడంతో సీపీఆర్ చేసి ప టాన్‌చెరు ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే చెందినట్లు వెల్లడించారు. ఓటు వేయడానికి వచ్చి మృతి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్ కాలనీకి చెందిన చంద్రగిరి రాజన్న (65) ఓటు వేసేందుకు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. క్యూలో నిల్చున్న సమయంలో కళ్లు తిరిగి కింద పడ్డాడు. వెంటనే స్థానికులు హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వృద్ధుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. -
‘రైతు బంధు’ ఆపండి
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ముందు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. యాసంగి సీజన్‌కు సంబంధించి రైతుబంధు సొమ్మును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో రైతుబంధు పంపిణీకి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం సీఈసీని కోరడం.. ఈ పథకం గురించి ప్రచార సభల్లో ఎలాంటి ప్రస్తావన చేయకూడదన్న అంశంతోపాటు పలు షరతులను విధిస్తూ సీఈసీ ఈ నెల 25న అనుమతి ఇవ్వడం తెలిసిందే. అయితే పోలింగ్‌కు ముందే రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు సాయం జమకానుందని మంత్రి హరీశ్‌రావు ఈ నెల 25న పాలకుర్తిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు. దీనిపై పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. దీనిని సీఈసీ తీవ్రంగా పరిగణించింది. మంత్రి హరీశ్‌రావు ఎన్నికల ప్రచారంలో రైతుబంధుకు సంబంధించి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఎన్నికల కోడ్‌ను, షరతులను ఉల్లంఘించారని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రైతుబంధు పంపిణీకి సంబంధించి ఇచ్చిన అనుమతిని ఉపసంహరిస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాశ్ కుమార్ సోమవారం ఉదయం లేఖ రాశారు. రబీ పంటల కోసం రైతుబంధు కింద గత ఐదేళ్లుగా అక్టోబర్–జనవరి మధ్యకాలంలో నగదు సాయం అందిస్తున్నారని, ఇందుకు నిర్దిష్టమైన తేదీలేమీ లేవని సీఈసీ అందులో అభిప్రాయపడింది. నవంబర్ నెలలోనే పంపిణీ చేయాలన్న ప్రాముఖ్యత ఏదీ లేదని పేర్కొంది. ఈ క్రమంలో తెలంగాణలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసే వరకు రైతుబంధు పథకాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. ఈసీ విధించిన షరతులివే.. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల సందర్భంగా రైతుబంధు అమలుకు అనుమతిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం పలు షరతులను విధించింది. పథకంలోకి కొత్త లబ్ధిదారులను చేర్చరాదని, నగదు బదిలీపై ఎలాంటి ప్రచారం చేయవద్దని పంపిణీ ప్రక్రియలో రాజకీయ నేతలెవరూ భాగస్వాములు కావొద్దని స్పష్టం చేసింది. తాజాగా బీఆర్ఎస్ సర్కారు యాసంగికి సంబంధించిన రైతుబంధు సొమ్మును ఈ నెల 24 నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని, దీనికి అనుమతి ఇవ్వాలని ఈ నెల 18న కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. 2018 నాటి షరతులకు లోబడి నగదు జమ చేస్తామని పేర్కొంది. అయితే సీఈసీ పాత షరతులకు తోడుగా మరిన్ని నిబంధనలు విధిస్తూ అనుమతినిచ్చింది. పోలింగ్‌కు 48గంటల ముందే నగదు జమ పూర్తికావాలని.. దీనిపై ఎన్నికల ప్రచారంలో ఎలాంటి ప్రస్తావన చేయవద్దని ఆదేశించింది. మీ వల్లే ఆగింది.. కాదు మీరే ఆపారు! ఎన్నికల ప్రచారంలో రైతుబంధు రచ్చరచ్చ జరుగుతోంది. సీఈసీ రైతుబంధును ఆపేయడానికి కారణం మీరంటే.. మీరంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఒకదానిపై మరొకటి దుమ్మెత్తిపోస్తున్నాయి. సోమవారం సాగిన ఎన్నికల ప్రచారంలో దాదాపు అన్నిచోట్లా ఈ అంశంపైనే విమర్శలు, ప్రతివిమర్శలు చోటు చేసుకున్నాయి. రైతులకు సాయం అందడం కాంగ్రెస్ పారీ్టకి ఇష్టం లేదని, ఆ పార్టీ ఫిర్యాదు చేయడం వల్లే ఎన్నికల సంఘం రైతుబంధును ఆపిందని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్వన్నీ అబద్ధాలని కాంగ్రెస్ దీటుగా స్పందించింది. ముందుగానే ఆర్థికసాయం పంపిణీ చేయాలని మేం సూచించామని, కానీ బీఆర్ఎస్ కావాలని జాప్యం చేస్తూ ఎన్నికల స్టంట్ చేసిందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. మరోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ పారీ్టలు రెండూ రైతులను అడ్డుపెట్టుకుని ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని బీజేపీ నేతలు విమర్శించారు. -
ఒక్క బీఆర్ఎస్పైనే చర్యలు అవాస్తవం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం ఒక్క బీఆర్ఎస్ నేతలపైనే చర్యలు తీసుకుంటోందని.. ఇతర పార్టీల నేతలపై ఫిర్యాదులొచ్చినా చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు అవాస్తవమని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు వివిధ రాజకీయ పార్టీల నుంచి 72 ఫిర్యాదులురాగా.. రెండు మినహా అన్నింటిపై విచారణ జరిపి, కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికలను పంపామని తెలిపారు. కొన్ని ఫిర్యాదుల ఆధారంగా ఎఫ్ఐఆర్లు సైతం నమోదు చేశామన్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఏర్పాట్లపై ఆదివారం ఆయన బీఆర్కేఆర్ భవన్‌లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ పాటించాలంటూ సీఎం కేసీఆర్‌కు ఎన్నికల సంఘం జారీ చేసిన అడ్వైజరీ అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పథకాలు, కార్యక్రమాల అమలు కోసం 10 రకాల అనుమతులు కోరగా, సీఈసీ 9 అనుమతులు ఇచ్చిందని, కేవలం ఒకే విజ్ఞప్తిని తిరస్కరించిందని వివరించారు. బీఆర్ఎస్ నేత, రిటైర్డ్ ఐఏఎస్ ఏకే గోయల్ ఇంట్లో ఐటీశాఖ జరిపిన తనిఖీల్లో ఏమీ లభించలేదని తెలిపారు. టీ–వర్క్స్ ప్రభుత్వ భవనంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన ఘటనపై ఈసీ ఇచ్చిన షోకాజ్ నోటీసులకు మంత్రి కేటీఆర్ నుంచి ఆదివారం మధ్యాహ్నం నాటికి వివరణ అందలేదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి సైలెన్స్ శాసనసభ ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రం 5 గంటలతో ముగుస్తుందని.. అప్పటి నుంచి పోలింగ్ ముగిసేవరకు 48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్ అమల్లోకి ఉంటుందని వికాస్‌రాజ్ చెప్పారు. ఈ సమయంలో టీవీ చానళ్లు, సోషల్ మీడియాలో సైతం ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) ఆమోదించిన ప్రకటనలను మాత్రం వార్తాపత్రికల్లో జారీ చేయవచ్చని చెప్పారు. నిబంధనలను ఉల్లంఘించి ఎవరైన ప్రచారం చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వివిధ నియోజకవర్గాలకు వచ్చిన బయటి వ్యక్తులు సైలెన్స్ పీరియడ్ ప్రారంభమయ్యే సరికి వెళ్లిపోవాలన్నారు. ఎన్నికల కోసం ఈవీఎంలను సిద్ధం చేశామని, ఇతర ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. పోలింగ్ సమీపించిన నేపథ్యంలో మద్యం అక్రమ నిల్వలపై దాడులను మరింత ఉధృతం చేయాలని ఎక్సైజ్ శాఖను ఆదేశించమన్నారు. శాసనసభ ఎన్నికల ప్రక్రియ వివరాలివీ.. ♦ శనివారం నాటికి 1,24,239 మంది ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. గత శాసనసభ ఎన్నికల్లో మొత్తంగా 1,00,135 పోస్టల్ బ్యాలెట్లే నమోదుకాగా.. ఈసారి భారీగా పెరుగుతున్నాయి. ∙కొత్త ఓటర్ల కోసం ఓటరు గుర్తింపు కార్డుల ముద్రణ పూర్తయింది. ఈ ఏడాది 54.39 లక్షల కార్డులను ముద్రించారు. ఇంకా 3 లక్షల కార్డులను బూత్ స్థాయి అధికారుల (బీఎల్ఓ) ద్వారా పంపిణీ చేయాల్సి ఉంది. ∙119 శాసనసభ నియోజకవర్గాల్లో మొత్తం 2,290 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. అందులో 2,068 మంది పురుషులు, 221 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. ♦ మొత్తం 49 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. 31 జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నాలుగు చొప్పున కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ∙ఎన్నికల్లో 1.85 లక్షల మంది పోలింగ్ సిబ్బంది, 22 వేల మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. బీఎల్ఓలను కలుపుకొంటే మొత్తం 2.5లక్షల మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ♦ ఎన్నికల బందోబస్తు కోసం 45వేల మంది రాష్ట్ర పోలీసులు, 3 వేల మంది అటవీ, ఎౖMð్సజ్‌శాఖ సిబ్బందితోపాటు 50 కంపెనీల టీఎస్ఎస్పీ, 375 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించనున్నారు. ♦ కర్ణాటక, ఏపీ, మహారాష్ట్రల నుంచి 5 వేల మంది చొప్పున, మధ్యప్రదేశ్, తమిళనాడుల నుంచి 2 వేల చొప్పున, ఛత్తీస్‌గఢ్ నుంచి 2,500 మంది కలిపి.. మొత్తంగా 23,500 మంది హోంగార్డులు రాష్ట్ర ఎన్నికల బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు. -
డీఏపై నిర్ణయం రాలేదు!
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు, రుణ మాఫీ పథకాలకు నిధుల విడుదల, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ) మంజూరుకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయంవెలువడాల్సి ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్‌రాజ్ చెప్పారు. తమను ఈసీ కోరిన వివరణలను పంపించామని తెలిపారు. గురువారం బీఆర్కేఆర్ భవన్‌లోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటరు గుర్తింపు కార్డులు, స్లిప్పుల పంపిణీ ‘ఈ ఏడాది 51 లక్షల ఓటరు గుర్తింపు కార్డులను ముద్రించామని, పోస్టు ద్వారా వీటి పంపిణీ చివరి దశకు చేరుకుంది. గురువారం నాటికి 86 శాతం అనగా 2.81 కోట్ల ఓటర్లకు ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్పులను పంపిణీ చేశాం. శనివారంలోగా మిగిలిన స్లిప్పుల పంపిణీ పూర్తి చేస్తాం. ఓటర్లకు అవగాహన కోసం ఓటర్ గైడ్ బుక్, సీ–విజిల్‌పై కరత్రాలను సైతం పంపిణీ చేశాం. 4,70,287 పోస్టల్ బ్యాలెట్ పత్రాలు, 8,84,584 ఈవీఎం బ్యాలెట్ పత్రాలను ముద్రించాం. టెండర్ ఓట్లు, చాలెంజ్ ఓట్లను సేకరించడం కోసం అధిక సంఖ్యలో ఈవీఎం బ్యాలెట్ పత్రాలు ముద్రించాం. ఇప్పటివరకు 32,730 మంది ఎన్నికల సిబ్బంది, 253 మంది అత్యవసర సేవల ఓటర్లు ఫెసిలిటేషన్ కేంద్రాల్లో ఓటేశారు. బుధవారం నాటికి 9,386 మంది వయోజన ఓటర్లు, 522 మంది దివ్యాంగులు ఇంటి నుంచే ఓటేశారు. 9,813 మంది సర్వీసు ఓటర్లు ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్‌ను డౌన్లోడ్ చేసుకోగా, గురువారం నాటికి 275 మంది ఓటేసి వాటిని తిరిగి పంపించేందుకు తపాలా శాఖలో బుకింగ్ చేశారు..’అని సీఈఓ వెల్లడించారు. గడువులోగా ఫామ్ 12డీ సమర్పించినా తమకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించలేదని పలువురు జర్నలిస్టులు చెప్పగా..పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి రౌండ్‌కు పరిశీలకుడి నిర్ధారణ ‘ఈసారి ప్రతి శాసనసభ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పరిశీలకుడి సమక్షంలో జరగనుంది. ప్రతి రౌండ్ లెక్కింపును పశీలకుడు నిర్ధారించిన తర్వాతే తదుపరి రౌండ్‌కి వెళ్తారు. ప్రతి కౌంటింగ్ కేంద్రంలో 14+1 టేబుళ్లను ఏర్పాటు చేసి ఓట్లను లెక్కిస్తారు. 500కి మించి పోలింగ్ కేంద్రాలున్న 6 కేంద్రాల్లో మాత్రం టేబుళ్ల సంఖ్య రెట్టింపుగా ఉంటుంది. ఈ నెల 30న పోలింగ్ జరగనుండగా, 29న పోలింగ్ సిబ్బంది డిస్త్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఈవీఎంలను తీసుకుని పోలింగ్ కేంద్రాలకు వెళతారు. జీపీఎస్ ద్వారా వాహనాల ట్రాకింగ్ రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. అందులో 299 అనుబంధ పోలింగ్ కేంద్రాలు కూడా ఉన్నాయి. ఎన్నికల్లో మొత్తం 59,779 బ్యాలెట్ యూనిట్లను వాడుతున్నాం. అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉన్న ఓ పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా నాలుగు బ్యాలెట్ యూనిట్లను వాడుతుండగా, మరికొన్ని చోట్ల రెండు, మూడు బ్యాలెట్ యూనిట్లను వినియోగించనున్నాం. ఈవీఎంలను తరలించే వాహనాలను జీపీఎస్ ద్వారా ట్రాక్ చేస్తాం..’అని సీఈఓ వివరించారు. ఆ నగదు ఎవరిదో దర్యాప్తులో తేలుతుంది ‘హైదరాబాద్‌లో రూ.కోట్లలో పట్టుబడిన నగదు ఏ పార్టీకి చెందిందో అన్న అంశం పోలీసుల దర్యాప్తులో తేలుతుంది. ఇప్పటివరకు రూ.669 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులను జప్తు చేయగా, ఇందుకు సంబంధించి 10,106 ఎఫ్ఐఆర్లు నమోదు చేశాం. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి మరో 777 కేసులు పెట్టాం. పెద్ద ఎత్తున ఎన్నికల ప్రలోభాలను పట్టుకున్నాం. వాటిని క్లెయిమ్ చేసుకోవడానికి ఏ రాజకీయ పార్టీ, అభ్యర్థి ముందుకు రావడం లేదు..’అని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఓటేయాలి ‘అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటేసేందుకు రావాలి. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, నిర్భయంగా, నైతికంగా, ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి. 40 వేల మంది రాష్ట్ర పోలీసు బలగాలు, 25 వేల మంది పొరుగు రాష్ట్రాల పోలీసు బలగాలు, 375 కంపెనీల కేంద్ర బలగాలను మోహరిస్తున్నాం. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరిస్తాం..’అని సీఈఓ తెలిపారు. అదనపు సీఈఓ లోకేశ్‌కుమార్, జాయింట్ సీఈఓ సర్ఫరాజ్ అహ్మద్, డిప్యూటీ సీఈఓ సత్యవాణి పాల్గొన్నారు.