21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరగనున్న ఎన్నికలు
102 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఏప్రిల్ 19న పోలింగ్
అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలకు సైతం నోటిఫికేషన్ జారీ
సాక్షి, న్యూఢిల్లీ: తొలి విడత సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19న తొలి విడత ఎన్నికలు జరుగనున్నాయి. వీటితోపాటు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలు, తమిళనాడులోని విలవన్‌కోడ్, త్రిపురలోని రామ్‌నగర్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ను సైతం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో తొలి విడత ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 27వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 28న నామినేషన్లను పరిశీలిస్తారు.
ఈ నెల 30వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. బిహార్‌లో మాత్రం స్థానిక వేడుక నేపథ్యంలో నామినేషన్లకు ఈ నెల 28వ తేదీ వరకు గడువు విధించారు. ఈసారి లోక్‌సభ ఎన్నికలు మొత్తం ఏడు విడతల్లో జరుగనున్న సంగతి తెలిసిందే. తొలి విడతలో అత్యధికంగా తమిళనాడులో 39 స్థానాలు, రాజస్తాన్‌లో 12, ఉత్తరప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 6, అసోం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఐదు స్థానాల చొప్పున, బిహార్‌లో 4, పశ్చిమ బెంగాల్‌లో 3, మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో రెండు స్థానాల చొప్పున, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, నాగా లాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూకశ్మీర్, లక్షదీ్వప్, పుదుచ్చేరిల్లో ఒక్కో స్థానానికి ఏప్రిల్ 19న పోలింగ్ జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment