
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ అధికారుల బదిలీలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒక జిల్లాలో మూడేళ్లుగా పనిచేస్తున్న వారిని బదిలీపై అదే లోక్‌సభ స్థానం పరిధిలోని మరో జిల్లాకు పంపొద్దని పేర్కొంది. వారు ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయొచ్చనే కారణంతో ఈ నిర్ణయం తీసుకుంది.
బదిలీల్లో ఈ నిబంధనను విధిగా పాటించాలని ఆదేశిస్తూ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. సొంత జిల్లాల్లో అధికారులకు పోస్టింగులు ఇవ్వకూడదని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల విధుల్లో ప్రత్యక్షంగా పాల్గొనే అధికారులను సొంత జిల్లాల్లో కొనసాగించరాదని ఉత్తర్వుల్లో పేర్కొంది. మూడేళ్లకు మించి ఒకే జిల్లాలో పనిచేస్తున్న అధికారులను కొనసాగించవద్దంటూ ఆదేశాలిచి్చంది.
Comments
Please login to add a commentAdd a comment