Transfer of officials
-
భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఏకంగా 37 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ నుంచి డెప్యుటేషన్‌పై రాష్ట్రానికి వచ్చిన ఎల్. సుబ్బారాయుడును తిరుపతి ఎస్పీగా నియమించారు.ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్‌ఫోర్స్ ఎస్పీగా కూడా ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన వద్ద సుబ్బారాయుడు ఓఎస్డీగా పనిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో కేంద్రం ఆయన్ని డెప్యుటేషన్‌పై రాష్ట్రానికి పంపింది. బదిలీ చేసిన వారిలో 28 మందికి ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. మిగిలిన 9 మందిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. -
Lok Sabha elections 2024: సొంత జిల్లాల్లో ‘నో పోస్టింగ్’
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ అధికారుల బదిలీలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒక జిల్లాలో మూడేళ్లుగా పనిచేస్తున్న వారిని బదిలీపై అదే లోక్‌సభ స్థానం పరిధిలోని మరో జిల్లాకు పంపొద్దని పేర్కొంది. వారు ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయొచ్చనే కారణంతో ఈ నిర్ణయం తీసుకుంది. బదిలీల్లో ఈ నిబంధనను విధిగా పాటించాలని ఆదేశిస్తూ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. సొంత జిల్లాల్లో అధికారులకు పోస్టింగులు ఇవ్వకూడదని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల విధుల్లో ప్రత్యక్షంగా పాల్గొనే అధికారులను సొంత జిల్లాల్లో కొనసాగించరాదని ఉత్తర్వుల్లో పేర్కొంది. మూడేళ్లకు మించి ఒకే జిల్లాలో పనిచేస్తున్న అధికారులను కొనసాగించవద్దంటూ ఆదేశాలిచి్చంది. -
మళ్లీ ఇక్కడికే..!
కమిషనరేట్‌ను వీడని పలువురు ఏసీపీలు అధికార పార్టీ నేతల సిఫారసులతో పోస్టింగ్‌లు తాజా బదిలీలపై పోలీసు శాఖలో చర్చ వరంగల్ : మూడు రోజుల క్రితం జరిగిన డీఎస్పీ స్థాయి అధికారుల బదిలీలపై పోలీసు శాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది. జనవరి 21న రాష్ట్ర వ్యాప్తంగా 13 మంది డీఎస్పీల బదిలీలు జరిగాయి. వరంగల్ కమిషరేట్ పరిధిలో నలుగురు డీఎస్పీ(ఏసీపీ)ల పోస్టింగ్‌లు మారాయి. డీఎస్పీ స్థాయి అధికారులకు సాధారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పోస్టింగ్‌లు ఇస్తారు. మన జిల్లాలో కొందరు ఏసీపీలు మాత్రం వరంగల్ కమిషరేట్ పరిధిలోనే పనిచేస్తున్నారు. ప్రభుత్వం అవసరం కొద్దీ ఇతర జిల్లాల్లో పోస్టింగ్ ఇచ్చినా వీరు మళ్లీ ఇక్కడికే వస్తున్నారు. తాజాగా జరిగిన బదిలీల్లో ఇదే స్పష్టమైంది. ఇన్నాళ్లు వరంగల్ కమిషరేట్‌లోనే పనిచేసిన పలువురు మళ్లీ ఇక్కడిక్కడే పోస్టింగ్‌లు పొందారు. ఇతర జిల్లాలకు బదిలీ చేస్తే... నెలల్లోనే మళ్లీ ఇక్కడికి వచ్చారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ‘అంగీకారం’తోనే తాజా డీఎస్పీల బదిలీలు జరిగినట్లు పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది. అధికార పార్టీ నేతలకు, పోలీసు వర్గాలకు మధ్య పలువురు వ్యాపార వర్గాలు అనుసంధానకర్తలుగా వ్యవహరించారనే చర్చ సైతం జరుగుతోంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఎక్కువ కాలం పనిచేసిన పలువురు డీఎస్పీలను ప్రభుత్వం జిల్లాల పునర్విభజన సమయంలో ఇతర జిల్లాలకు బదిలీ చేసింది. ఇలా బదిలీ అయిన వారు తాజాగా మళ్లీ ఇక్కడికే చేరుకున్నారు. డీఎస్పీల తాజా బదిలీల్లో ఎస్.ఎం.సురేంద్రనాథ్ వరంగల్ ట్రాఫిక్ ఏసీపీగా పోస్టింగ్ పొందారు. నెల క్రితం వరకు సురేంద్రనాథ్ వరంగల్‌లోనే పనిచేశారు. సరేంద్రనాథ్ 2014 నవంబరులో వరంగల్ డీఎస్పీ(ఏసీపీ)గా నియమితులయ్యారు. ఆయనను డీజీపీకి అటాచ్ చేస్తూ 2016 నవంబరులో ఉత్తర్వులు జారీ అయ్యాయి. అప్పటి నుంచి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. తాజాగా మళ్లీ వరంగల్ ట్రాఫిక్ ఏసీపీగా పోస్టింగ్ పొందారు. సురేంద్రనాథ్ పోస్టింగ్ కోసం మరో డీఎస్పీని మూడు రోజుల్లోనే బదిలీ చేశారు. వరంగల్ ట్రాఫిక్ ఏసీపీగా పి.సంజీవరావును నియమిస్తూ ప్రభుత్వం ఈ నెల 18న ఉత్తర్వులు జారీ చేసింది. సురేంద్రనాథ్ కోసం తాజాగా సంజీవరావును మూడు రోజుల్లోనే స్టేషన్‌ఘన్‌పూర్ ఏసీపీగా బదిలీ చేసింది. సంజీవరావు అంతకుముందు వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే పరకాల డీఎస్పీగా ఎక్కువ కాలం పనిచేశారు. తాజా బదిలీల్లో మామునూరు ఏసీపీగా పోస్టింగ్ పొందిన పి.శోభన్‌కుమార్ సర్వీసు మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే సాగుతోంది. 2013లో డీఎస్పీగా పదోన్నతి పొంది మహబూబాబాద్ ఎస్డీపీవోగా పోస్టింగ్ పొందారు. 2014 సాధారణ ఎన్నికల తర్వాత హన్మకొండ డీఎస్పీ(ఏసీపీ)గా నియమితులయ్యారు. జిల్లాల పునర్విభజన జరిగిన సమయంలో ప్రభుత్వం శోభన్‌కుమార్‌ను కొత్తగూడెం జిల్లా ఓఎస్డీగా నియమించింది. త్వరలో పదోన్నతి పొందనున్న భోభన్కుమార్ను ప్రభుత్వం ముందుగానే అడిషనల్ ఎస్పీ స్థాయి పోస్టింగ్ ఇచ్చింది. మూడున్నర నెలల్లోనే శోభన్‌కుమార్ మళ్లీ బదిలీపై వరంగల్ కమిషరేట్ పరిధిలోకే వచ్చారు. వరంగల్ కమిషరేట్‌లో క్రైం విభాగం డీఎస్పీ(ఏసీపీ)గా పనిచేసే ఈశ్వరరావును ప్రభుత్వం డిసెంబరులో బదిలీ చేసి నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట డీఎస్పీగా పోస్టింగ్ ఇచ్చింది. ఈశ్వరరావు అక్కడ విధుల్లో చేరి సెలవు పెట్టారు. తాజా బదిలీల్లో మళ్లీ వరంగల్ కమిషరేట్ పరిధిలో పోస్టింగ్ పొంది వర్ధన్నపేట ఏసీపీగా నియమితులయ్యారు. -
జైలుకైనా వెళ్తా... బదిలీ చేయను: మమతా బెనర్జీ
ఎన్నికల కమిషన్‌పై మమత ఆగ్రహం కోల్‌కతా: ఎన్నికల అధికారుల బదిలీ అంశం పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి.. కేంద్ర ఎన్నికల సంఘానికి మధ్య చిచ్చు రాజేసింది. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఐదుగురు ఎస్పీలు, ఒక జిల్లా మేజిస్ట్రేట్‌ను వెంటనే విధుల నుంచి తొలగించాలని ఈసీ సోమవారం పశ్చిమబెంగాల్ సర్కారును ఆదేశించింది. అయితే తాను సీఎంగా ఉన్నంత వరకూ ఒక్క అధికారిని కూడా బదిలీ చేసే ప్రసక్తే లేదని, అవసరమైతే తాను జైలుకెళ్లేందుకు సైతం సిద్ధంగా ఉన్నానని మమతాబెనర్జీ తేల్చిచెప్పారు. ఆదివారం పశ్చిమబెంగాల్లో ఎన్నికల ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం పరిశీలించింది. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించారంటూ కొందరు అధికారులపై ఈసీకి ఫిర్యాదులందాయి. దీంతో మాల్దా, ముర్షిదాబాద్, బుర్ద్వాన్, వెస్ట్ మిడ్నాపూర్, జార్గ్రామ్ ఎస్పీలు, ఉత్తర 24 పరగణాల జిల్లా మేజిస్ట్రేట్లను విధుల నుంచి తప్పించాలని, వారికి ఎన్నికలతో సంబంధం లేని విధులను అప్పగించాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఓ జిల్లా ఎన్నికల అధికారిని, ఓ ఏడీఎంను, ఓ రిటర్నింగ్ అధికారిని కూడా బదిలీ చేసింది. దీనిపై మమత స్పందిస్తూ.. ‘‘మీరు(ఈసీ) శాంతి, భద్రతలు నియంత్రిస్తానంటే నాకు అభ్యంతరం లేదు. ఏదైనా సమస్య వస్తే మమతా బెనర్జీని నిందించవద్దు. అయితే మమతా బెనర్జీ శాంతిభద్రతలను పర్యవేక్షించాలి. లేదా ఎన్నికల సంఘం పర్యవేక్షించాలి. సోనియాగాంధీ పోటీ చేస్తున్న నియోజకవర్గంలోనో.. నరేంద్రమోడీ రాష్ట్రం లోనో మీరు వెళ్లి ఇలాంటి చర్యలు తీసుకోగలరా అని నేను ఎన్నికల కమిషన్‌కు సవాల్ చేస్తున్నా. ఆ తర్వాతే మాపై చర్యలకు రావాలి’’ అని అన్నారు.