ప్రత్యేక హోదాపై కలిసి పోరాడదామని, ఎంపీలందరితో రాజీనామా చేయిద్దామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరింత ఆత్మరక్షణలో పడ్డారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజునుంచి ఇప్పటివరకూ నోరెత్తకుండా లీకులతో కాలం గడుపుతున్న టీడీపీ అధినేత.. జగన్ ప్రకటనతో షాక్ తిన్నారు. దీంతో అసలు విషయాన్ని పక్కదారి పట్టించేందుకు కుయుక్తులు పన్నుతున్నారు.