టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆరుగురు ఎమ్మెల్సీలు షాకిచ్చారు. ఆదివారం నిర్వహించిన శాసనసభాపక్ష సమావేశానికి వారు గైర్హాజరయ్యారు. మండలి రద్దవుతుందనే ప్రచారం నేపథ్యంలో తీవ్ర ఆందోళనలో ఉన్న ఎమ్మెల్సీలను బుజ్జగించేందుకు మంగళగిరి పార్టీ కార్యాలయంలో టీడీపీ శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీలంతా కచ్చితంగా సమావేశానికి రావాలని చంద్రబాబే స్వయంగా పిలిచినా ఆరుగురు డుమ్మా కొట్టారు.