దేవీపట్నంలో జరిగిన లాంచీ ప్రమాదం దురదృష్టకరమని వైస్సార్ సీపీ నేత కొలుసు పార్థసారధి విచారం వ్యక్తం చేశారు. దేవిపట్నం సంఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. 8 నెలల కిందట కృష్ణా జిల్లాలో ఇటువంటి ప్రమాదమే జరిగిందని గుర్తు చేశారు. అయినప్పటికీ ఎటువంటి అనుమతులు లేని బోటు యజమానుల నుంచి ముడుపులు తీసుకుని మరిన్ని ప్రమదాలకు ప్రభుత్వం కారణమవుతోందని ఆరోపించారు