Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Kutami Atrocities No confidence motion against Vizag Mayor Live Updates1
GVMC: అవిశ్వాసంపై అనుమానాలు.. వీడియో రికార్డింగ్‌కు వైఎస్సార్సీపీ పట్టు

బలం లేకున్నా కుట్రలు, కుతంత్రాలతో విశాఖ మేయర్‌పై నేడు అవిశ్వాస తీర్మానం పెడుతున్న కూటమి ప్రభుత్వం. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లకు గాలం వేసేందుకు చివరి నిమిషం దాకా ఎడతెరిపి లేకుండా ప్రయత్నిస్తున్న కూటమి నేతలు. డబ్బులు, బెదిరింపులు.. ప్రలోభాలకు లొంగకుండా తాము వైఎస్‌ జగన్‌ వెంటే ఉంటామంటూ తేల్చి చెబుతుండడంతో తోక ముడిచారు. ఈ క్రమంలో.. భారీ భద్రత నడుమ ఓటింగ్‌ నిర్వహించాలని కలెక్టర్‌కు ఇప్పటికే లేఖ రాసిన వైఎస్సార్‌సీపీ.భారీ బందోబస్తులో జీవీఎంసీఅవిశ్వాసానికి ముందు ప్రత్యేక కౌన్సిల్‌ సమావేశంకార్పొరేటర్లు, ఎక్స్‌ అఫీషియోభ్యులకే మాత్రమే లోపలికి అనుమతిఅవిశ్వాసంపై వైస్సార్సీపీ అనుమానాలుబలం లేకున్నా కూటమి అడ్డదారులుఅవిశ్వాసానికి అనుకూలంగా ఓటేయాలని బెదిరింపులుకౌన్సిల్‌ సమావేశాన్ని బహిష్కరించిన వైఎస్సార్‌సీపీ ఓటింగ్‌ పటిష్టంగా నిర్వహించాలని ఇప్పటికే కలెక్టర్‌కు లేఖఓటింగ్‌ ప్రక్రియ వీడియో రికార్డింగ్‌ చేయాలని వైఎస్సార్‌సీపీ అభ్యర్థన జీవీఎంసీ కార్పొరేటర్ల వాస్తవ బలాబలాలువైఎస్సార్సీపీ 58 టీడీపీ 29జనసేన 3బీజేపీ 1సీపీఐ 1సీపీఎం 1ఇండిపెండెన్స్ 4.ఖాళీలు 1.జీవీఎంసీలో 98 మంది కార్పొరేటర్లుజీవీఎంసీలో 14 మంది ఎక్స్ ఆఫీషియో సభ్యులుటీడీపీకి 11 మంది సభ్యులు ఉన్నారు.. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఒక ఎమ్మెల్సీ..వైఎస్ఆర్సిపికి ముగ్గురు ఎక్స్ అఫీషియ సభ్యులు.ఎంపీ గొల్ల బాబురావు, ఇద్దరు, ఎమ్మెల్సీలు పండుల రవీంద్రబాబు, కుంభ రవిబాబు..ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం జీవీఎంసీ సభ్యుల సంఖ్య బలం 97+14= 111అవిశ్వాసం నెగ్గేందుకు 2/3 మెజారిటీ అంటే 74 మంది సభ్యులు అవసరం..ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి వైఎస్సార్‌సీపీ మొత్తం బలం 61ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి కూటమి మొత్తం బలం 48ఎన్నికకు దూరంగా ఇద్దరు సీపీఎం, సీపీఐ సభ్యులు. బలం లేకపోయిన బరిలోకినేడు విశాఖ మేయర్ పై అవిశ్వాస తీర్మానంఉదయం 11 గంటలకు అవిశ్వాస తీర్మానం.అవిశ్వాస తీర్మాణంలో నెగ్గేందుకు అడ్డదారులు.వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ బలవంతంగా తీసుకువచ్చేందుకు రౌడీలు.వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లకు ప్రలోభాలు బెదిరింపులు..పార్టీ మారకపోతే కేసులు పెడతామని బెదిరింపులు.వ్యాపారాలు దెబ్బతీస్తామని హెచ్చరిక పార్టీ మారిన కార్పొరేటర్లలో పునరాలోచనకూటమి శిబిరం నుంచి తప్పుకుంటున్న మహిళా కార్పొరేటర్లుమేయర్ గా యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళకు వైఎస్ జగన్ అవకాశం.యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళను పదవి నుంచి దించే కుట్రలు చేస్తున్న కూటమిమహిళను పదవి నుంచి దించడంపై అసంతృప్తి..అవిశ్వాసంపై వైఎస్ఆర్సిపి అనుమానం..భారీ భద్రత నడుమ అవిశ్వాస నిర్వహించాలని కలెక్టర్ కు లేఖ కూటమి నేతల దౌర్జన్యంప్రత్యేక విమానంలో కేరళ వెళ్ళిన వీఎంఆర్డివో చైర్మెన్ ప్రణవ్ గోపాల్, సీతంరాజు సుధాకర్..వైస్సార్‌సీపీ కార్పొరేటర్లు బస చేసిన హోటల్ వద్ద హంగామాప్రత్యేక విమానంలో విశాఖ రావాలని బెదిరింపుఅవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయాలని గుండాయిజంఅవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయకపోతే మీ భర్త ఉద్యోగం తీయస్తామని వార్నింగ్.టీడీపీ నేతల బెదిరింపుకు తలోగ్గని కార్పొరేటర్ శశికళ.టీడీపీ నేతలతో ప్రత్యేక విమానంలో రావడానికి ఒప్పుకొని కార్పోరేటర్ శశికళటీడీపీ నేతలు దౌర్జన్యం పై మండిపడ్డ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ శశికళమీరెవరు నన్ను రమ్మండానికి అంటూ టీడీపీ నేతలపై ఎదురు తిరిగిన కార్పొరేటర్ శశికళ.అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పోలీసులతో హోటల్ కి వచ్చి దౌర్జన్యం చేసే హక్కు మీకు ఎవరిచ్చారన్న శశి కళదౌర్జన్యాన్ని ప్రశ్నించడంతో తోక ముడిచిన టీడీపీ నేతలుకేరళ పోలీసులతో హోటల్ వద్దకు చేరుకున్న టీడీపీ నేతలుతమ కార్పొరేటర్లను తీసుకువెళ్లేందుకు వచ్చామని కేరళ పోలీసులకు చెప్పిన టీడీపీ నేతలుకార్పొరేటర్ శశికళ ఎదురు తిరగడంతో కేరళ పోలీసులతో కలిపి పలాయానం చిత్తగించిన టీడీపీ నేతలు

Delhi Mustafabad Building Collapse Rescue Live Updates2
ఢిల్లీలో కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద పలువురు

న్యూఢిల్లీ, సాక్షి: రాజధాని రీజియన్‌లో గత అర్ధరాత్రి ఘోరం జరిగింది. నాలుగు అంతస్తుల భవనం ఒకటి కుప్పకూలడంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని భావిస్తున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.ANI న్యూస్‌ ఏజెన్సీ కథనం ప్రకారం.. అర్ధరాత్రి 3గం. ప్రాంతంలో ముస్తాఫాబాద్‌లో ఓ భవనం కుప్పకూలినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎన్డీఆర్‌ఎఫ్‌​ సాయంతో రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. ఉదయం కల్లా నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. మరో డజను మందికి పైనే శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. అయితే.. ఆ భవనంలో ఒక పోర్షన్‌లో ఒకే కుటుంబానికి చెందిన పది మంది నివాసం ఉంటున్నారని, అందులో ఆరుగురు చిన్నపిల్లలే ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. వాళ్ల జాడ ఇంకా తెలియరాలేదు. ఇదిలా ఉంటే.. ఢిల్లీలో శుక్రవారం ఒక్కసారిగా వాతావరణం మారింది. ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. ఈ ప్రభావంతోనే భవనం కూలి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతవారం కూడా ఢిల్లీలో ఇలాంటి ఘటనే జరిగింది. భారీ వర్షం, ఈదురు గాలుల ధాటికి నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలి ఓ వ్యక్తి మరణించగా..ఇద్దరు గాయపడ్డారు.#WATCH | Delhi: Mustafabad building collapse caught on camera. As per Delhi Police, "Among the 10 people who were taken out, 4 succumbed. Rescue operations still underway"(Source - local resident) https://t.co/lXyDvOpZ3q pic.twitter.com/NlknYWODRR— ANI (@ANI) April 19, 2025#WATCH | Delhi: 4 people died after a building collapsed in the Mustafabad area; rescue and search operation is underway 8-10 people are still feared trapped, said Sandeep Lamba, Additional DCP, North East District pic.twitter.com/qFGALhkPv3— ANI (@ANI) April 19, 2025

Telugu Students Pass In JEE Mains 2025 Results3
జేఈఈ మెయిన్‌లో తెలుగు తేజాలు

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్‌)లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 24 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌ సాధించగా వారిలో నలుగురు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉన్నారు. తెలంగాణకు చెందిన హర్షి ఎ. గుప్తా, వంగల అజయ్‌రెడ్డి, బనిబ్రత మజీతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాయి మనోజ్ఞ గుత్తికొండ 100 పర్సంటైల్‌ సాధించారు. అలాగే టాప్‌–100 ర్యాంకుల్లో 15 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. 99 పర్సంటైల్‌లో వంద మందికిపైగా చోటు సాధించారు. జేఈఈ మెయిన్‌ ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) శుక్రవారం అర్ధరాత్రి విడుదల చేసింది. రాజస్తాన్‌కు చెందిన ఎండీ అనాస్, ఆయుష్‌ సింగల్‌ తొలి రెండు ర్యాంకులు సాధించారు. జేఈఈ మొదటి విడత పరీక్ష జనవరిలో జరిగింది. రెండో సెషన్‌ను ఏప్రిల్‌ 2, 3, 4, 7, 8 తేదీల్లో నిర్వహించారు. దేశవ్యాప్తంగా 10,61,849 మంది ఈ పరీక్షకు రిజిస్టర్‌ చేసుకున్నారు. వారిలో 9,92,350 మంది పరీక్ష రాశారు. తెలుగు రాష్ట్రాల నుంచి 2 లక్షల మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. జేఈఈ మొదటి, రెండో విడత పరీక్ష ఫలితాలను ఆధారంగా చేసుకొని ర్యాంకులు ప్రకటించారు. వాటి ల్లో 2.50 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేశారు. ఈ పరీక్షకు ఈ నెల 23 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 2న పరీక్ష ఉంటుంది.

Illegal case against YSRCP governments liquor policy4
భేతాళ కుట్రే.. బాబు స్క్రిప్టే

సాక్షి, అమరావతి: రెడ్‌బుక్‌ కుట్రలతో చంద్రబాబు ప్రభుత్వం వెర్రితలలు వేస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసుతో బరితెగిస్తోంది. లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేందుకు పచ్చగణంతో కూడిన ‘సిట్‌’ ద్వారా దర్యాప్తు పేరిట అరాచకాలకు తెగబడుతోంది. అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించేందుకు.. తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు.. వేధింపులు, బెదిరింపులు, కిడ్నాపులు, దాడు­లతో పోలీసులు గూండాగిరీకి తెగిస్తున్నారు. బెవరేజస్‌ కార్పొరేషన్‌ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, మరో ఇద్దరు ఉద్యోగులను వెంటాడి వేధించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించారు. తనను వేధిస్తున్నారని కోర్టును ఆశ్రయించిన వాసుదేవరెడ్డి.. అనంతరం సిట్‌ చెప్పినట్టుగా వాంగ్మూలం ఇవ్వడం గమనార్హం. ఆ వాంగ్మూలానికి ఏం విశ్వసనీయత ఉంటుందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇక డిస్టిలరీల ప్రతినిధులపై దాడులు చేస్తూ బెంబేలెత్తిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంతో నిమిత్తం లేని ఐటీ సలహాదారు రాజ్‌ కసిరెడ్డి చుట్టూ దర్యాప్తును కేంద్రీకృతం చేస్తున్నారు. ఏమాత్రం సంబంధంలేని ఎంపీ మిథున్‌రెడ్డి, తదితరులను అక్రమ కేసులో ఇరికించడమే లక్ష్యంగా కుట్రలకు పదును పెడుతున్నారు.వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసిన విజయ సాయిరెడ్డిని అందుకే తెరపైకి తెచ్చారు. ఇలా చంద్రబాబు పక్కా పన్నాగంతో ఓ భేతాళ కథ అల్లుతున్నారు. ఇంతటి కుట్రలు, అరాచకానికి చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు తెగబడుతోందంటే... సమాధానం ఒక్కటే. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానం పారదర్శకంగా అమలు చేయడమే. లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేందుకే కూటమి ప్రభుత్వం ఇంతటి కుతంత్రాలకు పాల్పడుతోందన్నది సుస్పష్టం.దర్యాప్తు ముసుగులో సిట్‌ అరాచకంవైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అసలు జరగని కుంభకోణాన్ని జరిగినట్టుగా చూపించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు తెగిస్తోంది. అందుకోసం అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేసేందుకు బెదిరింపులకు పాల్పడుతోంది. బెవరేజస్‌ కార్పొరేషన్‌ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, ఆ సంస్థలో ఉద్యోగులు సత్య ప్రసాద్, అనూష ఉదంతమే ఇందుకు తార్కాణం. కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన ఆయన డెప్యుటేషన్‌ ముగిసినప్పటికీ రిలీవ్‌ చేయలేదు. తాము చెప్పినట్టుగా సీఆర్‌పీపీ 164 సెక్షన్‌ కింద అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని వాసుదేవరెడ్డిని పోలీసులు తీవ్ర స్థాయిలో వేధించారు. తాము చెప్పినట్టు చేస్తేనే రిలీవ్‌ చేస్తామని, లేకపోతే ఎప్పటికీ సర్వీసులో చేరలేరని హెచ్చరించారు. ఆయన్ను అపహరించుకునిపోయి మూడు రోజులపాటు గుర్తు తెలియని ప్రదేశంలో ఉంచి బెదిరించారు. కుటుంబ సభ్యులను సైతం బెదిరించారు. పోలీసుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా వాసుదేవరెడ్డి న్యాయస్థానాన్ని మూడుసార్లు ఆశ్రయించారు కూడా. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం తన కుతంత్రాలను కొనసాగించింది. ఆయన్ను తీవ్ర స్థాయిలో రోజుల తరబడి బెదిరించి లొంగదీసుకుంది. వాసుదేవరెడ్డితో అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించింది. ఆ వెంటనే ఆయన్ను రాష్ట్ర సర్వీసుల నుంచి రిలీవ్‌ చేస్తూ కేంద్ర సర్వీసుల్లో చేరేందుకు ఢిల్లీ వెళ్లేందుకు అనుమతించడం గమనార్హం. అంటే చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసు కోసం ఎంతగా బరితెగిస్తోందన్నది స్పష్టమవుతోంది. అదే రీతిలో బెవరేజస్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులు సత్య ప్రసాద్, అనూషలను కూడా తీవ్ర స్థాయిలో వేధించారు.అబద్ధపు వాంగ్మూలం ఇస్తే ఈ కేసులో సాక్షులుగా పేర్కొంటామని.. లేకపోతే అక్రమ కేసుల్లో దోషులుగా ఇరికించి వేధిస్తామని బెదిరించారు. దాంతో వారిద్దరు కూడా సిట్‌ అధికారులు చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేశారు. ఈ విధంగా బెదిరించి, వేధించి నమోదు చేసే వాంగ్మూలాలకు ఏం విశ్వసనీయత ఉంటుంది.. ఏం ప్రామాణికత ఉంటుంది..? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.బరితెగిస్తున్న సిట్‌ఈ కేసులోదర్యాప్తు ముసుగులో సిట్‌ అధికారులు చేస్తున్న అరాచకాలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో డిస్టిలరీల ప్రతినిధుల నివాసాల్లో సోదాల పేరుతో సిట్‌ అధికారులు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. డిస్టిలరీల ప్రతినిధులను బలవంతంగా విజయవాడకు తీసుకువచ్చి విచారణ పేరుతో వేధించారు. ఒకర్ని తీవ్రంగా కొట్టారు కూడా. వృద్ధులని కూడా చూడకుండా శార్వాణీ ఆల్కో బ్రూ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్లు ఇ.చంద్రారెడ్డి, ఠాకూర్‌ కాళీ మహేశ్వర్‌ సింగ్‌లను సిట్‌ అధికారులు కొట్టి, అసభ్య పదజాలంతో దూషించారు. దాంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమను ఇంటి వద్దే విచారించేట్టుగా ఆదేశించాలని కోరారు. ఇ.చంద్రారెడ్డి, ఠాకూర్‌ కాళీ మహేశ్వర్‌ సింగ్‌ను వారి ఇంటి వద్దే న్యాయవాదుల సమక్షంలో విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది. అబద్ధపు వాంగ్మూలాల నమోదు కోసం సిట్‌ పాల్పడుతున్న అరాచకాలకు ఈ ఉదంతం ఓ మచ్చుతునక మాత్రమే.అందుకే తెరపైకి విజయ సాయిరెడ్డి అక్రమ కేసు కుట్రను కొనసాగిస్తూ చంద్రబాబు పక్కా పన్నాగంతోనే మాజీ ఎంపీ విజయ్‌ సాయిరెడ్డిని తెరపైకి తెచ్చారు. ఇప్పటికే వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసిన ఆయనతో తాము లక్ష్యంగా చేసుకున్నవారి పేర్లు చెప్పించాలన్నదే ప్రభుత్వ కుతంత్రం. మూడున్నరేళ్లు పదవీ కాలం ఉన్నా రాజ్యసభలో కూటమికి ప్రయోజనం కలిగించేందుకే ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తాజాగా సిట్‌ విచారణకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడిన మాటలు అసలు కుట్రను బయట పెట్టాయి. మద్యం విధానంపై కొందరు తన ఇంట్లో నిర్వహించిన సమావేశంలో కొందరు పాల్గొన్నారు.మరికొందరు పాల్గొన్నారో లేదో గుర్తు లేదని విజయ్‌ సాయిరెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. గుర్తుకు వచ్చాక ఆ విషయం చెబుతానన్నారు. అంటే భవిష్యత్‌లో చంద్రబాబు ఏం చెప్పమంటే అది చెబుతా అని పరోక్షంగా స్పష్టం చేశారు.మద్యం విధానంతో రాజ్‌ కసిరెడ్డికి ఏం సంబంధం!?మాజీ ప్రభుత్వ సలహాదారు రాజ్‌ కసిరెడ్డి కేంద్ర బిందువుగా దర్యాప్తు కొనసాగిస్తుండటం కూడా సిట్‌ కుట్రలో భాగమే. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మద్యం విధానంతో అసలు రాజ్‌ కసిరెడ్డికి ఏం సంబంధం? ప్రభుత్వంలో ఎందరో సలహాదారుల్లో ఆయన ఒకరు. సలహాదారుగా ఆయన పదవీ కాలాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రెన్యువల్‌ కూడా చేయనే లేదు. ఇక రాజ్‌ కసిరెడ్డికి బెవరేజస్‌ కార్పొరేషన్‌ వ్యవహారాలతో సంబంధమే లేదు. ఆయనకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తే బెవరేజస్‌ కార్పొరేషన్‌కు చైర్మన్‌గానే నియమించి ఉండేవారు కదా.. కానీ ఆయనకు అంతా తెలుసని విజయ సాయిరెడ్డి చెప్పడం వెనుక చంద్రబాబు కుట్ర ఉందన్నది తేటతెల్లమవుతోంది. తద్వారా మునుముందు మరిన్ని అబద్ధపు వాంగ్మూలాల నమోదు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధపడుతోందని స్పష్టమవుతోంది.అవినీతి లేదు.. కుంభకోణం అసలే లేదు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా మద్యం విధానంచట్టాలను ఉల్లంఘిస్తూ.. న్యాయ స్థానాలను బేఖాతరు చేస్తూ మరీ చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ఇంతగా బరితెగిస్తోందన్నది ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసింది అక్రమ కేసు కాబట్టి. అసలు మద్యం విధానంలో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టిందే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం. అంతకు ముందు 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా సాగిన మద్యం సిండికేట్‌ దోపిడీని నిర్మూలించింది. ప్రైవేటు మద్యం దుకాణాలను రద్దు చేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని ప్రవేశ పెట్టింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న 4,380 మద్యం దుకాణాల సంఖ్యను 2,934 కు తగ్గించింది. చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న 43 వేల బెల్ట్‌ దుకాణాలను పూర్తిగా తొలగించింది. 2019 వరకు మద్యం దుకాణాలకు అనుబంధంగా అనధికారిక బార్లుగా కొనసాగిన 4,380 పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేసింది. చంద్రబాబు ప్రభుత్వం 14 డిస్టిలరీలకు అనుమతులు ఇవ్వగా... వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఒక్క కొత్త డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మద్యం దుకాణాల వేళలను కుదించింది. మద్యం ధరలను షాక్‌ కొట్టేలా పెంచి మద్యం వినియోగాన్ని నిరుత్సాహ పరిచింది. ఈ విప్లవాత్మక చర్యలతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మద్యం అమ్మకాలు తగ్గితే డిస్టిలరీలకు లాభాలు తగ్గుతాయన్నది అందరికీ తెలిసిన విషయమే. మరి లాభాలు తగ్గితే డిస్టిలరీలు ప్రభుత్వానికి ఎందుకు కమీషన్లు ఇస్తాయని ఎవరైనా ప్రశ్నిస్తారు. మద్యం అమ్మకాలను పెంచితే.. తద్వారా లాభాలు పెరిగితే అందుకు ప్రతిగా ప్రభుత్వానికి కమీషన్లు ఇస్తారు. కానీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన విధానాలతో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయని ఎక్సైజ్‌ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్న వాస్తవం. మరి డిస్టిలరీలు.. కమీషన్లు ఇవ్వవవన్నది నిగ్గు తేలిన నిజం. అయినా సరే కేవలం రెడ్‌బుక్‌ కుట్రతోనే చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేసింది. అందుకోసమే అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు కుతంత్రాలకు తెగబడుతోందన్నది సుస్పష్టం. వాస్తవంగా కుంభకోణమే జరిగితే.. దర్యాప్తు పేరిట ఇంతటి అరాచకాలకు పాల్పడాల్సిన అవసరం లేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మద్యం విధానంలో ఎలాంటి అవకతవకలు, అవనీతి జరగలేదని తెలుసు కాబట్టే అబద్ధపు సాక్ష్యాలు సృష్టించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలకు తెగబడుతోందన్నది సుస్పష్టం.

Kejriwal Tuns into Pushpa Raj Mode Dance With Wife At Daughter Wedding Event5
పుష్ప పాటకు సతీమణితో కేజ్రీవాల్‌ స్టెప్పులు

న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇంట శుభకార్యం జరిగింది. కేజ్రీవాల్‌ కూతురు హర్షిత తన ఐఐటీయన్‌ స్నేహితుడిని వివాహమాడారు. కుటుంబ సభ్యులు, కొద్ది మంది రాజకీయ సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. అయితే ఈ వేడుకలో కేజ్రీవాల్‌ చేసిన సందడి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఢిల్లీలోని షాంగ్రీ లా ఎరోస్‌ హోటల్‌లో గురువారం కేజ్రీవాల్‌ కూతురి నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, ఆప్‌ నేత మనీశ్‌ సిసోడియాలు హాజరయ్యారు. ఈ వేడుకలో పుష్ప 2 చిత్రంలోని ‘అంగారో కా అంబర్‌ సె’ పాటకు సతీమణి సునీతతో కలిసి కేజ్రీవాల్‌ హుషారుగా స్టెప్పులేశారు. #arvindkejriwal #dancevideo #delhiaap pic.twitter.com/1hObFExoGU— Khushbu Goyal (@kgoyal466) April 18, 2025జనాల గోల మధ్య కేజ్రీవాల్‌ వేసిన స్టెప్పులు ఇప్పుడు నెట్టింట వైరల్‌ అయ్యాయి. సుకుమార్‌ డైరెక్షన్‌లో పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్‌ దేశవ్యాప్తంగా ఎంతటి ఆదరణ దక్కించుకున్నారో తెలియంది కాదు. ఈ చిత్రంలోని పాటలు, డైలాగులు, ఆఖరికి పుష్ప మేనరిజం కూడా జనాలకు బాగా ఎక్కేసింది. మరోవైపు.. వివాహ కార్యక్రమానికి హాజరైన పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ కూడా పంజాబీ స్టైల్లో చిందులేసి ఆకట్టుకున్నారు. Punjab CM Bhagwant Mann performing at the engagement ceremony of Kejriwal's daughter in Delhi.#Bhagwantmann #ArvindKejriwal pic.twitter.com/Vy9PqA4Teu— Raajeev Chopra (@Raajeev_Chopra) April 18, 2025పీటీఐ కథనం ప్రకారం.. అరవింద్‌ కేజ్రీవాల్‌ కూతురు హర్షిత ఢిల్లీ ఐఐటీలో చదివారు. కాలేజీ రోజుల్లో స్నేహితుడైన సంభవ్‌ జైన్‌ ఇష్టపడి వివాహమాడారు. ఇంతకు ముందు ఈ ఇద్దరూ కలిసి బసిల్‌ హెల్త్‌ అనే స్టార్టప్‌ను కూడా నడిపిస్తున్నారు. శుక్రవారం కుటుంబ సభ్యుల సమక్షంలో కపుర్తలా హౌజ్‌లో వీళ్ల వివాహం జరిగింది. ఈ వేడుకకు కొందరు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. ఏప్రిల్‌ 20వ తేదీన రిసెప్షన్‌ కార్యక్రమం నిర్వహించనున్నారు.

Bengal BJP Dilip Ghosh Marries Rinku Majumdar6
60 ఏళ్ల వయసులో బీజేపీ దిలీప్‌ ఘోష్‌ వివాహం.. IPL మ్యాచ్‌తో ప్రేమ!

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బెంగాల్‌ బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ దిలీప్‌ ఘోష్ 60 ఏళ్ల వయసులో బ్రహ్మచర్యాన్ని వీడి పెళ్లి చేసుకున్నారు. బీజేపీకి చెందిన మాహిళా నేతను ఆయన వివాహమాడారు.వివరాల ప్రకారం.. మాజీ ఎంపీ దిలీప్‌ ఘోష్‌(60) వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. బెంగాల్‌లో పార్టీకి చెందిన బీజేపీ మహిళా మెర్చా నాయకురాలు రింకూ మజుందార్‌ (51)తో శుక్రవారం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య శుక్రవారం వివాహం జరిగింది. ఈ సందర్బంగా దిలీప్‌ ఘోష్‌ మాట్లాడుతూ.. వివాహం తన అమ్మ కోరిక అని చెప్పుకొచ్చారు. అయితే, మజుందార్‌కు ఇది రెండో వివాహం. అంతకుముందు మరో వ్యక్తితో వివాహం జరగ్గా.. విడాకులు తీసుకున్నారు.Dilip Ghosh, the ultimate wild card of Bengal politics today, united both TMC-BJP on occasion of his marriage. For all the best wishes, he thanks everyone from the bottom of his heart. pic.twitter.com/UCGOmOg8LT— Sudhanidhi Bandyopadhyay (@SudhanidhiB) April 18, 2025 ఇదిలా ఉండగా.. వీరిద్దరి పెళ్లికి ఐపీఎల్‌ మ్యాచ్‌ కారణం కావడం విశేషం. ఇంతకీ ఏం జరిగిందంటే.. మజుందార్‌తో దిలీప్‌కు నాలుగేళ్లుగా పరిచయం ఉంది. అయితే, ఈ నెల మొదటి వారంలో కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌లో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌ను ఇద్దరూ కలిసి చూసిన సందర్భంగా పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. దీంతో​, కొద్దిరోజుల వ్యవధిలోనే ఇలా వివాహం చేసుకోవడం విశేషం. ఇక, ఇద్దరి వివాహం నేపథ్యంలో బెంగాల్‌కు చెందిన బీజేపీ సీనియర్‌ నేతలు ఇంటికి వచ్చి దిలీప్‌ ఘోష్‌ను అభినందించారు. అలాగే, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం శుభాకాంక్షలు తెలిపారు. Ex BJP National VP Dilip Ghosh has officially tied the knot with BJP mahila morcha leader Rinku Mazumdar today in Newtown, Kolkata according to Vedic traditions . Congratulations to the power couple. pic.twitter.com/l2z89U26ay— Sourav || সৌরভ (@Sourav_3294) April 18, 2025

Good Bad Ugly Collection Record Created Now Ajith Career7
'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ' కలెక్షన్స్‌.. అజిత్‌ కెరీర్‌లో ఇదే టాప్‌

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ' (Good Bad Ugly) భారీ కలెక్షన్స్‌ సాధించింది. అజిత్‌ మూడు దశాబ్ధాల సినీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా ఈ చిత్రం నిలిచింది. ఏప్రిల్‌ 10న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్స్‌ను తాజాగా మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేసింది. దర్శకుడు అధిక్‌ రవిచంద్రన్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో అజిత్‌కు జోడీగా త్రిష మరోసారి మెరిసింది. ఈ సినిమాతో మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్‌ వారియర్‌తో పాటు సునీల్, అర్జున్ దాస్‌లకు కూడా ప్రత్యేక గుర్తింపు వచ్చింది.'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ' చిత్రం తొమ్మిదిరోజుల్లోనే రూ. 200 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ సాధించి అజిత్‌ కెరీర్‌లోనే టాప్‌ చిత్రంగా నిలిచింది. బాక్సాఫీస్‌ షేకింగ్‌ కలెక్షన్స్‌ అంటూ చిత్ర నిర్మాణ సంస్థ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. కలెక్షన్స్‌ పరంగా అజిత్‌ కెరీర్‌లో రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరిన ఏకైక చిత్రంగా గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ నిలిచింది. అయితే, ఇప్పటి వరకు అజిత్‌ కెరీర్‌లో టాప్‌-5 కలెక్షన్స్‌ సాధించిన చిత్రాలు ఇవే.. తెగింపు (రూ. 194 కోట్లు), విశ్వాసం (రూ.180 కోట్లు), వలిమై (రూ.152 కోట్లు), వివేకం (రూ. 121 కోట్లు), వేదాళం (రూ.119 కోట్లు) ఉన్నాయి. ఇప్పుడు 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ' రూ. 200 కోట్లు రాబట్టడంతో ఆయన కెరీర్‌లోనే టాప్‌ చిత్రంగా నిలిచింది. మూడు దశాబ్దాల అజిత్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ ఇచ్చిన దర్శకుడు అధిక్‌ రవిచంద్రన్‌కు ఆయన ఫ్యాన్స్‌ అభినందనలు తెలుపుతున్నారు.అజిత్‌ నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌అజిత్‌ ప్రస్తుతం మరోసారి అంతర్జాతీయ స్థాయిలో కార్‌ రేసులో పాల్గొనడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో తన తదుపరి చిత్రాన్ని ఈ ఏడాది చివరిలో ప్రారంభించి 2026లో దీపావళి సందర్భంగా విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రాన్ని ఏ నిర్మాణ సంస్థ తీయనుంది.. ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాటేమిటి అన్నది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. కాగా నటుడు తాను ఎంతగా అభిమానిస్తున్నాను అన్న విషయాన్ని తెలిపేలా గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ చిత్రం చివర్లో ఒక మేకింగ్‌ వీడియోను దర్శకుడు అదిక్‌ రవిచంద్రన్‌ విడుదల చేశారు. అందులో ఈయన నటుడు అజిత్‌ కాళ్లకు నమస్కరించడం, ఆయన చేతుల్ని పట్టుకొని ముద్దాడడం వంటి దృశ్యాలు చోటుచేసుకున్నాయి. దీంతో నటుడు అజిత్‌ మళ్లీ అదిక్‌ రవిచంద్రన్‌కు అవకాశం ఇవ్వడం ఖాయం అనే టాక్‌ సినీ వర్గాల్లో వైరల్‌ అవుతోంది.The MASS SAMBAVAM is shaking the box office ❤‍🔥#GoodBadUgly hits 200 CRORES WORLDWIDE GROSS 💥💥Book your tickets for #GoodBadUgly now!🎟️ https://t.co/jRftZ6vpJD#200crGrossForGBU#BlockbusterGBU#AjithKumar @trishtrashers @MythriOfficial @Adhikravi @gvprakash… pic.twitter.com/CUrTW1NB2D— Mythri Movie Makers (@MythriOfficial) April 18, 2025

Mother of four Youth Love with Daughter father-in-law In UP8
వావి వరసలు మరచి.. కూతురి మామతో ప్రేమాయణం..

ఈరోజుల్లో బంధాలకు విలువ లేకుండా పోతోంది. వావివరుసలు మరిచి విపరీత పోకడలకు పోతున్నారు కొందరు. తనకు కాబోయే అల్లుడితో అత్త జంప్‌ అయిన ఘటన మరువక ముందే.. అలాంటి దరిద్రపు ఘటనే యూపీ బదౌన్‌లో వెలుగుచూసింది. ఓ మహిళ.. తన కూతురి మామతోనే సంబంధం పెట్టుకుంది. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన వారిద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం.. డేటాగంజ్ కొత్వాలి ప్రాంతానికి చెందిన సునీల్, మమత(43)కు 2002లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా, తన పెద్ద కుమార్తెను బదౌన్ సదర్ కొత్వాలి ప్రాంతానికి చెందిన శైలేంద్ర కుమారుడికి 2022లో వివాహం చేశాడు. ఇక, సునీల్‌ ట్రక్క్‌ నడుపుతూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు.అయితే, తన కూతురికి వివాహం చేసిన అనంతరం కూతురు మామ అయిన శైలేంద్రతో మమత ప్రేమలో పడింది. దాదాపుగా రెండేళ్ల నుంచి వీరి మధ్య సంబంధం నడిచింది. సునీల్‌ ట్రక్క్‌ నడుపుతున్న కారణంగా నెలలో కొద్దిరోజులు మాత్రమే ఇంట్లో ఉండేవాడు. సునీల్‌ లేని సమయంలో శైలేంద్ర.. మమత ఇంటికి వచ్చేవాడు. ఇద్దరూ వరుసకు అన్నాచెల్లెలు కావడంతో ఎవరికీ అనుమానం రాలేదు. ఈ క్రమంలో ప్రేమాయణం నడిపిన మమత, శైలేంద్ర.. తాజాగా ఇంటి నుంచి పారిపోయారు. దీంతో, వీరి సంబంధం గురించి బయటి ప్రపంచానికి తెలిపింది.భర్త ఆవేదన..ఈ నేపథ్యంలో బాధితుడు, భర్త సునీల్.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా సునీల్‌ మాట్లాడుతూ.. నేను వేరే ఊరిలో ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాను.. అయినప్పటికి నా భార్యకు సమయానికి డబ్బు పంపిస్తున్నాను. కుటుంబ ఖర్చులకు డబ్బు ఇచ్చేవాడిని. నా భార్య నేను లేనప్పుడు.. శైలేంద్రకు ఫోన్‌ చేసి మాట్లాడింది. అతడిని ఇంటికి రావాలని చెప్పింది. ఇప్పుడు అతనితో పారిపోయింది. ఆమె ఇంట్లో ఉన్న నగలు, డబ్బు అంతా తీసుకుని పారిపోయింది అని ఆవేదన వ్యక్తం చేశారు.బిడ్డల ముందే..మరోవైపు.. మమత కుమారుడు మాట్లాడుతూ.. మా తండ్రి ఇంట్లో లేనప్పుడు మామ శైలేంద్ర మా ఇంటికి వచ్చేవారు. మా తండ్రి ఇంట్లో లేనప్పుడు అమ్మ ప్రతి మూడు రోజులకు ఒకసారి ఆయనకు ఫోన్ చేసేది. మామ.. మా ఇంటికి వచ్చిన ప్రతీసారి మమ్మల్ని వేరే గదికి పంపించారు. ఆమె తన మామతో కలిసి టెంపోలో పారిపోయిందని చెప్పారు. అలాగే, ఈ ఘటనపై స్థానికులు స్పందిస్తూ.. సునీల్ వేరే చోట్ల ట్రక్ డ్రైవర్‌గా పని చేస్తుండే వాడు. నెలలో రెండు మూడుసార్లు మాత్రమే ఇంటికి వచ్చేవాడు. భర్త దూరంగా ఉండటంతో మమత.. శైలేంద్రను ఆహ్వానించేది. అతను రాత్రి 12 గంటలకు ఇంటికి వచ్చి తెల్లవారుజామున వెళ్లిపోయేవాడని చెప్పారు. అతనే మమతను తీసుకెళ్లాడని చెబుతున్నారు.

Punjab Kings beat RCB by 5 wickets9
చాలెంజర్స్‌పై పంజా...

ముందు వాన... తర్వాత హైరానా! శుక్రవారం రాత్రి బెంగళూరులో రాయల్‌ చాలెంజర్స్‌ (ఆర్‌సీబీ) పరిస్థితి ఇది. ఆలస్యమైన ఆటలో వికెట్ల వేటను చకచకా మొదలుపెట్టిన పంజాబ్‌ కింగ్స్‌ ప్రత్యర్థిథని వారి సొంతగడ్డపై కుదేల్‌ చేసింది. కుదించిన ఓవర్లలో విదిల్చిన పంజాతో ఎదురైన స్వల్ప లక్ష్యాన్ని ఎంచక్కా ఛేదించిన కింగ్స్‌ ఈ ఐపీఎల్‌లో ఐదో విజయాన్ని నమోదు చేసింది. ఈ సీజన్‌లో మూడోసారి బెంగళూరు ప్రేక్షకులకు నిరాశ తప్పలేదు. చిన్నస్వామి స్టేడియంలో ఆడిన మూడో మ్యాచ్‌లోనూ రాయల్‌ చాలెంజర్స్‌ బోణీ కొట్టలేకపోయింది. బెంగళూరు: పంజాబ్‌ కింగ్స్‌ బౌలింగ్‌ గర్జించింది. బెంగళూరును వణికించింది. కింగ్స్‌ను విజేతగా నిలబెట్టింది. శుక్రవారం జరిగిన ఈ పోరులో శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలోని పంజాబ్‌ కింగ్స్‌ 5 వికెట్ల తేడాతో ఆర్‌సీబీపై గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 14 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. టిమ్‌ డేవిడ్‌ (26 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒక్కడే మెరిపించాడు. పంజాబ్‌ బౌలర్లలో అర్ష్ దీప్ , మార్కో యాన్సెన్, యజువేంద్ర చహల్, హర్‌ప్రీత్‌ బ్రార్‌ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్‌ 12.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసి గెలిచింది. నేహల్‌ వధేరా (19 బంతుల్లో 33 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. హాజల్‌వుడ్‌ 3, భువనేశ్వర్‌ 2 వికెట్లు తీశారు. బెంగళూరు తమ తుదిజట్టును మార్చలేదు. పంజాబ్‌ మాత్రం రెండు మార్పులు చేసింది. మ్యాక్స్‌వెల్, సుర్యాంశ్‌ షెడ్గే స్థానాల్లో స్టొయినిస్, హర్‌ప్రీత్‌ బ్రార్‌ బరిలోకి దిగారు. అందరూ తొందరగానే... వర్షం వల్ల మ్యాచ్‌ చాలా ఆలస్యంగా ఆరంభమైంది. దీంతో మ్యాచ్‌ను 14 ఓవర్లకు కుదించారు. కోహ్లి, సాల్ట్, లివింగ్‌స్టోన్‌లాంటి హిట్టర్లున్న జట్టులో ఏ నలుగురో, ఐదుగురో ఆడాల్సిన 14 ఓవర్లను ఏకంగా 11 మంది ఆడేశారు. టాపార్డర్, మిడిలార్డర్, లోయర్‌ ఆర్డర్‌ అందరూ తొందర, తొందరగా వికెట్లను పారేసుకోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. సాల్ట్‌ (4), కోహ్లి (1), రజత్‌ పాటీదార్‌ (23), లివింగ్‌స్టోన్‌ (4), జితేశ్‌ శర్మ (2), కృనాల్‌ పాండ్యా (1) చేతులెత్తేశారు. డేవిడ్‌ ఒక్కడి మెరుపులతోనే... జట్టు స్కోరు 95/9. అంటే 11 మంది క్రీజులోకి వచ్చారన్నమాటే! అందరూ బ్యాటింగ్‌కు దిగినా... స్కోరులో సగంకంటే ఎక్కువ స్కోరు ఒక్కడే టిమ్‌ డేవిడ్‌ చేశాడు. ఏడో వరుసలో, ఏడో ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చిన డేవిడ్‌ అండగా నిలిచేవారే కరువైనా... ఆఖరి రెండు ఓవర్లలోనే అంతా మార్చాడు. 12 ఓవర్లలో బెంగళూరు 9 వికెట్లకు 63 పరుగులు చేసింది. డేవిడ్‌ స్కోరు 19 కాగా... జేవియర్‌ 13వ ఓవర్లో 2 బౌండరీలు సహా 11 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్‌ బ్రేక్‌కు ముందు... చివరి 14వ ఓవర్లో తొలి మూడు బంతులు వరుసగా... 0, 0, 0 పరుగే రాలేదు. తర్వాత మూడు బంతుల్ని డేవిడ్‌ భారీ సిక్సర్లు బాదడంతో 18 పరుగులొచ్చాయి. 48 పరుగులు చేసిన డేవిడ్‌ సహా అంతా ఇన్నింగ్స్‌ బ్రేక్‌ కావడంతో మైదానం వీడుతున్నారు. కానీ అంపైర్‌ చాలా ఆలస్యంగా నోబాల్‌ సిగ్నలిచ్చాడు. సహచరులతో కబుర్లాడుతూ డగౌట్‌ చేరుతున్న ఆటగాళ్లను వెనక్కి పిలిచి ఫ్రీ హిట్‌ ఆడించడంతో 2 పరుగులు తీసిన డేవిడ్‌ 26 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. నేహల్‌ మెరిపించాడు... సులువైన లక్ష్యం కావడంతో పంజాబ్‌కు ఛేదనలో పెద్దగా కష్టం ఎదురవలేదు. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (16), ప్రభ్‌సిమ్రాన్‌ (13), కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌ (7) ఇలా టాపార్డర్‌ వికెట్లు రాలినా... మిడిలార్డర్‌లో నేహల్‌ భారీ షాట్లతో విరుచుకు పడి జట్టును గెలిపించాడు. దీంతో ఒకే ఓవర్లో హాజల్‌వుడ్‌ అయ్యర్, ఇన్‌గ్లిస్‌ (14) వికెట్లను పడగొట్టినా... నేహల్‌ బ్యాటింగ్‌ బెంగళూరును మ్యాచ్‌లో పట్టుబిగించకుండా చేసింది. 11 బంతులు మిగిలుండగానే పంజాబ్‌ విజయాన్ని అందుకుంది. స్కోరు వివరాలురాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి) ఇన్‌గ్లిస్‌ (బి) అర్ష్ దీప్ ‌ 4; కోహ్లి (సి) యాన్సెన్‌ (బి) అర్ష్ దీప్ ‌ 1; పాటీదార్‌ (సి) జేవియర్‌ (బి) చహల్‌ 23; లివింగ్‌స్టోన్‌ (సి) ప్రియాన్‌‡్ష (బి) జేవియర్‌ 4; జితేశ్‌ (సి) నేహల్‌ (బి) చహల్‌ 2; కృనాల్‌ (సి అండ్‌ బి) యాన్సెన్‌ 1; టిమ్‌ డేవిడ్‌ (నాటౌట్‌) 50; మనోజ్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) యాన్సెన్‌ 1; భువనేశ్వర్‌ (సి) జేవియర్‌ (బి) హర్‌ప్రీత్‌ 8; యశ్‌ దయాళ్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్‌ప్రీత్‌ 0; హజల్‌వుడ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (14 ఓవర్లలో 9 వికెట్లకు) 95. వికెట్ల పతనం: 1–4, 2–21, 3–26, 4–32, 5–33, 6–41, 7–42, 8–63, 9–63. బౌలింగ్‌: అర్శ్‌దీప్‌ 3–0–23–2, జేవియర్‌ 3–0–26–1, యాన్సెన్‌ 3–0–10–2, చహల్‌ 3–0–11–2, హర్‌ప్రీత్‌ బ్రార్‌ 2–0–25–2. పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రియాన్ష్ (సి) డేవిడ్‌ (బి) హాజల్‌వుడ్‌ 16; ప్రభ్‌సిమ్రాన్‌ (సి) డేవిడ్‌ (బి) భువనేశ్వర్‌ 13; అయ్యర్‌ (సి) జితేశ్‌ (బి) హాజల్‌వుడ్‌ 7; ఇన్‌గ్లిస్‌ (సి) సుయశ్‌ (బి) హాజల్‌వుడ్‌ 14; నేహల్‌ (నాటౌట్‌) 33; శశాంక్‌ (సి) సాల్ట్‌ (బి) భువనేశ్వర్‌ 1; స్టొయినిస్‌ (నాటౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (12.1 ఓవర్లలో 5 వికెట్లకు) 98. వికెట్ల పతనం: 1–22, 2–32, 3–52, 4–53, 5–81. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 3–0–26–2, యశ్‌ దయాళ్‌ 2.1–0–18–0, హాజల్‌వుడ్‌ 3–0–14–3, కృనాల్‌ 1–0–10–0, సుయశ్‌ 3–0–25–0. ఐపీఎల్‌లో నేడుగుజరాత్‌ X ఢిల్లీ వేదిక: అహ్మదాబాద్‌ , మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి రాజస్తాన్‌ X లక్నో వేదిక: జైపూర్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

PE Investments in Real Estate Declined Amid Global Challenges10
రియల్‌ఎస్టేట్‌లో తగ్గిన ‘పీఈ’ పెట్టుబడులు

సాక్షి, సిటీబ్యూరో: దేశీయ స్థిరాస్తి రంగంలోకి వచ్చిన ప్రైవేట్‌ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు కాస్త తగ్గాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన పెట్టుబడులు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 3 శాతం మేర తగ్గినట్లు రియల్టీ కన్సల్టెంట్‌ అనరాక్‌ క్యాపిటల్‌ వెల్లడించింది.2024–25లో ఈ పెట్టుబడులు 3.7 బిలియన్‌ డాలర్లకు పరిమితమైనట్లు తెలిపింది. అంతకుముందు ఏడాది ఇవి 3.8 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఆఫీసు భవనాలకు ఇన్వెస్ట్‌మెంట్స్‌ తగ్గడమే ఈ క్షీణతకు కారణం. 2020–21లో అత్యధికంగా 6.4 బిలియన్‌ డాలర్ల పీఈ పెట్టుబడులు రాగా.. 2021–22లో ఇవి 4.3 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి.అయితే 2022–23 కల్లా 4.4 బిలియన్‌ డాలర్లకు పెరిగినప్పటికీ.. తర్వాత తగ్గుముఖం పట్టాయి. ఐదేళ్లుగా దేశీ రియల్టీలో పీఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ తగ్గుతూ వచ్చాయి. 6.4 బిలియన్‌ డాలర్ల నుంచి 3.7 బిలియన్‌ డాలర్లకు అంటే 43 శాతం మేర క్షీణించాయి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement