సిట్‌ దర్యాప్తు ముమ్మరం | Sakshi
Sakshi News home page

సిట్‌ దర్యాప్తు ముమ్మరం

Published Sun, May 19 2024 5:34 AM

తాడిపత్రిలో టీడీపీ నాయకుడి ఇంటి వద్ద విచారణ జరుపుతున్న సిట్‌ అధికారులు

అనంతపురం, పల్నాడు, తిరుపతి జిల్లాలకు సిట్‌ బృందాలు 

దాడులు జరిగిన తీరు, పోలీసులు చేపట్టిన చర్యలపై సమీక్ష  

సాక్షి, అమరావతి/నరసరావుపేట/రెంటచింతల/తాడిపత్రి:  రాష్ట్రంలో పోలింగ్‌ అనంతరం హింసాత్మక సంఘటనలపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ) నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) రంగంలోకి దిగింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో దాడులు, అల్లర్ల పూర్వాపరాలు విచారిస్తూ ఆ ఘటనలపై కేసులు నమోదు చేసిన తీరును విశ్లేíÙస్తోంది. ఎన్నికల ముందు టీడీపీ, బీజేపీ ఒత్తిడితో ఈసీ హడావుడిగా డీఐజీలు, ఎస్పీలు, ఇతర పోలీసు అధికారులను బదిలీ చేసిన పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లోనే పోలింగ్‌ రోజున, అనంతరం భారీగా విధ్వంసకాండ చెలరేగడం తెలిసిందే. వీటిపై ఏర్పాటైన సిట్‌కు నేతృత్వం వహిస్తున్న అదనపు డీజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ తమ అధికారులను మూడు బృందాలుగా విభజించి శనివారం ఉదయానికే పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలకు పంపారు. 

మరోవైపు ఆయన డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తాతో శనివారం సమావేశమై సిట్‌ కార్యాచరణ గురించి చర్చించారు. అనంతరం ఆ మూడు జిల్లాల్లో విచారణ చేపట్టిన పోలీసు అధికారుల బృందాలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఏఏ అంశాలపై దృష్టి సారించాలనే అంశాన్ని వారికి స్పష్టం చేశారు. దాంతో పల్నాడు, అనంతపురం జిల్లాల్లో దాడులు సంభవించిన ప్రాంతాల్లో సిట్‌ సభ్యులు పర్యటించారు. గురజాల, మాచర్ల, నరసారావుపేట,  సత్తెనపల్లి, తాడిపత్రి పోలీసు స్టేషన్లల్లో పోలీసు అధికారులను విచారించారు. 

దాడులు సంభవించిన తీరు, సమాచారం అందిన వెంటనే పోలీసు అధికారులు స్పందించిన తీరు, నమోదు చేసిన కేసులు, అందులో పేర్కొన్న సెక్షన్లు తదితర అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు. ఎఫ్‌ఐఆర్‌ కాపీలు, కేసు ఫైళ్లు, దాడుల వీడియో రికార్డింగులను పరిశీలించారు. దాడుల తీవ్రతను అంచనా వేసి, ఆ మేరకు తగిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారా.. లేక తూతూ మంత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులిపేసుకున్నారా.. అనే కోణాల్లో కూడా విచారణ కొనసాగిస్తున్నారు. 

దాదాపు అన్నీ నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్లే 
ఆయా జిల్లాల్లో జరిగిన దాదాపు అన్ని సంఘటనల్లోనూ హత్యాయత్నం, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసం, ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం తదితర నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు సిట్‌ బృందాలు గుర్తించినట్టు సమాచారం. 144 సెక్షన్‌ అమలులో ఉన్నా సరే అంత మంది ఎలా గుమిగూడగలిగారు? మాచర్ల నియోజకవర్గంలో పక్కా పన్నాగంతో దారి కాచి మరీ ఎలా దాడులు చేయగలిగారు? ఎలా వెంటపడి తరమగలిగారు? తాడిపత్రిలో వందలాది మంది ఒకేసారి వచ్చి ఎలా రాళ్ల దాడి చేయగలిగారు..? అనే కోణాల్లో సిట్‌ అధికారులు విచారిస్తున్నట్టు సమాచారం. 

సత్తెనపల్లి, గురజాల నియోజకవర్గాల్లో దాడుల బాధితులు రాత్రంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గుడిలో ఆశ్రయం పొందాల్సినంత పరిస్థితి ఎందుకు ఏర్పడింది.. దీనిపై పోలీసులకు సమాచారం ఉందా లేదా.. పోలీసులు ఆ బాధితులకు అండగా నిలబడేందుకు వెంటనే గుడి వద్దకు ఎందుకు వెళ్లలేకపోయారు.. అనే కోణాల్లో సిట్‌ అధికారులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది. సమస్యాత్మక, అతి సమస్యాత్మకంగా గుర్తించిన పోలింగ్‌ కేంద్రాల వద్ద ఈసీ మార్గదర్శకాల మేరకు బందోబస్తుపై సిట్‌ అధికారులు సమీక్షించారు. 

ఆ కేంద్రాల వద్ద తగినంతగా కేంద్ర బలగాలను మోహరించలేదనే విషయాన్ని సిట్‌ అధికారులు గుర్తించినట్టు సమాచారం. కాగా, ఎన్నికల సందర్భంగా హింసాత్మక సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందుగానే నేర చరిత్ర కలిగిన వారిపై చేపట్టిన చర్యల గురించి సిట్‌ అధికారులు ప్రశి్నంచినట్లు తెలుస్తోంది. పీడీ యాక్ట్‌ కింద కేసుల నమోదులో నిర్లక్ష్యంగా వ్యవహరించారా.. అనే కోణంలోనూ విచారిస్తున్నారు. దాడులు అరికట్టడంలో వైఫల్యం చెందారని ఈసీ సస్పెండ్‌ చేసిన, బదిలీ చేసిన అధికారులను కూడా సిట్‌ అధికారులు ప్రశి్నంచనున్నారు. వారి వివరణను కూడా నమోదు చేస్తారు.  

ఈసీ బదిలీ చేసినా ఆయనదే పెత్తనమా!? 
హింసాత్మక సంఘటనలను కట్టడి చేయడంలో విఫలమయ్యారని ఈసీ బదిలీ చేసిన కొందరు ఉన్నతాధికారులు ఇంకా ఆ జిల్లాలో ప్రభావం చూపిస్తుండటం విస్మయ పరుస్తోంది. అనంతపురం జిల్లాల్లో ఈసీ సస్పెండ్‌ చేసిన ఓ అధికారే ప్రస్తుతం సిట్‌ దర్యాప్తు కోసం సమరి్పంచిన రికార్డుల వ్యవహారాలను పర్యవేక్షిస్తుండటం గమనార్హం. పోలీసు రికార్డుల విభాగంలో అత్యంత వివాదాస్పద డీఎస్పీ స్థాయి అధికారి అందుకు సహకరిస్తుండటం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. దాడులను అరికట్టడంలో ఎవరైతే విఫలమయ్యారని ఈసీ భావించిందో.. ఆ అధికారి కనుసన్నల్లోనే సిట్‌ పరిశీలనకు అవసరమైన రికార్డులు సమర్పిస్తే పారదర్శకత, నిష్పాక్షికత ఎక్కడ ఉంటుందని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. 

తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసంపై పోలీసులే దాడి చేయడం, ఆస్తులను ధ్వంసం చేయడం, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై విచక్షణారహితంగా విరుచుకుపడటం గమనార్హం. దీన్ని ఈసీ తీవ్రంగా పరిగణించి, అందుకు బాధ్యులైన అధికారిని బదిలీ చేసి.. సిట్‌ విచారణకు ఆదేశించింది. కాగా ఆ అధికారే సిట్‌ దర్యాప్తునకు అవసరమైన రికార్డులను పరోక్షంగా రూపొందిస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది. మరి దీనిపై సిట్, ఈసీ ఎలా స్పందిస్తాయన్నది చూడాలి. ఇదిలా ఉండగా సిట్‌ అధికారులు ఆదివారం తిరుపతిలో పర్యటించనున్నారు. అల్లర్లు సంభవించిన ప్రాంతాల్లో పర్యటిస్తారు. దాడులు చెలరేగినప్పుడు పోలీసులు తీసుకున్న చర్యలను సమీక్షిస్తారు.  

రేపు ప్రాథమిక నివేదిక  
ఇంతటి సున్నితమైన అంశంపై కేవలం రెండు రోజుల్లోనే ప్రాథమిక నివేదిక సమరి్పంచాలని ఈసీ ఆదేశించడంతో సిట్‌కు సమయం చాలా తక్కువగా ఉంది. దాంతో సోమవారం ఉదయం తొలుత ప్రాథమిక నివేదికను ఈసీకి సమర్పించాలని భావిస్తోంది. దాడులు జరిగిన తీరు, వాటిపై పోలీసులు తీసుకున్న చర్యల గురించి ఈ ప్రాథమిక నివేదికలో పొందు పరచనుంది. పూర్తి స్థాయిలో విచారణకు మరింత సమయం కావాలని కోరే అవకాశాలున్నాయి. సిట్‌ ప్రాథమిక నివేదిక పరిశీలించిన అనంతరం ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.  

ఎన్ని కేసులు.. ఎంత మంది అరెస్ట్‌?
ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలోని సిట్‌ బృందం శనివారం నరసరావుపేటలో పర్యటించింది. మధ్యాహ్నం మూడు గంటలకు నరసరావుపేట చేరుకున్న బృందం నేరుగా టూ టౌన్‌ పోలీసు స్టేషన్‌ను సందర్శించింది. ఆ స్టేషన్‌ పరి«­దిలో నమోదైన ఐదు కేసుల వివరాలను అధికారులు పరిశీలించారు. సీఐ భాస్కర్‌తో చర్చించారు. ఎవరెవరిపై కేసులు నమోదు చేశారు.. ఎవరిని అరెస్టు చేశారు.. దర్యాప్తు ఎంతవరకు వచి్చంది.. అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. 

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గృహంపై దాడిచేసి ఇద్దరిని గాయపర్చి మూడుకార్లు ధ్వంసంపై నమోదైన కేసు, బాలికోన్నత పాఠశాలలో ఏజెంట్లుగా కూర్చున్న వైఎస్సార్‌సీపీ నాయకులు గంటెనపాటి గాబ్రియేలు, గోపిరెడ్డి డ్రైవర్‌ హరిపై టీడీపీ అభ్యర్థి అరవిందబాబు, అతని అనుచరులు చేసిన దాడి కేసు, అరవిందబాబు కారుపై జరిగిన దాడి కేసు, మల్లమ్మసెంటర్‌లో బొలేరో వాహనాన్ని తగులపెట్టిన కేసు, రూరల్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో పమిడిపాడు, దొండపాడు గ్రామాల్లో జరిగిన సంఘటనలపై నమోదైన కేసుల వివరాలను ఆయా స్టేషన్‌ పోలీసుల నుంచి సేకరించారు. 

రబ్బరు బుల్లెట్లతో ఎందుకు ఫైరింగ్‌ చేయా­ల్సి వచి్చందో వివరణ తీసుకున్నట్లు తెలిసింది. కాగా, ఇద్దరు సిట్‌ బృందం అధికారులు శనివారం రాత్రి రెంటచింతల పోలీసు స్టేషన్‌కు వచ్చి రికార్డులను పరిశీలించారు. మండల పరిధిలోని తుమృకోట, రెంటచింతల, పాలువాయిగేటు, రెంటాల, జెట్టిపాలెం గ్రామాలలో చోటుచేసుకున్న పరిణా­మాల గురించి ఆరా తీశారు. ఆయా ఘటనల్లో నిందితులుగా ఉన్న వారు స్వచ్ఛందంగా లొంగిపోయి, గ్రామాలలో ప్రశాంత వాతావరణానికి సహకరించాలని అడిషనల్‌ ఎస్పీ రమణమూర్తి కోరారు. 

సిట్‌ బృందం తాడిపత్రిలో కూడా విచారించింది. ఏసీబీ డీఎస్పీ వి.శ్రీనివాసరావు, గుంటూరు రేంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.భూషణం, ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ జీఎల్‌ శ్రీనివాస్‌లు తాడిపత్రి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని కేసుల గురించి ఆరా తీశారు. డీఐజీ షిమోసీ వాజ్‌పాయ్‌తో మాట్లాడిన తర్వాత స్థానిక పోలీసులతో కలసి తాడిపత్రిలో అల్లర్లు జరిగిన ఓంశాంతి నగర్, టీడీపీ నేత సూర్య­ముని నివాసం, జూనియర్‌ కళాశాల మైదానం, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం, మునిసిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి నివాసం తదితర ప్రాంతాలను పరిశీలించారు.    

Advertisement
 
Advertisement
 
Advertisement