సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న ఇద్దరు విద్యార్థినులు పరారయ్యారు.
హైదరాబాద్: ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న ఇద్దరు విద్యార్థినులు పరారయ్యారు. ఈ సంఘటన గౌలిగూడలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో బుధవారం వెలుగుచూసింది. స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని, ఎనిమిదో తరగతి చదువుతున్న మరో విద్యార్థిని వసతి గృహం నుంచి పారిపోయినట్లు హాస్టల్ అధికారులు గుర్తించారు. దీంతో వసతి గృహ సిబ్బంది విద్యార్థినుల తల్లిదండ్రులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు విద్యార్థినుల కోసం గాలిస్తున్నారు.