Social Welfare Department
-
హాస్టల్ కష్టాలు.. @ఒంగోలు
-
హాస్టల్... హడల్! సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న సర్కారీ హాస్టళ్లు
వసతి గృహంకాదు.. ‘శిథిల’ గృహంనల్లగొండ జిల్లా మునుగోడులోని ఎస్సీ బాలుర హాస్టల్ దుస్థితి ఇది. భవనం శిథిలావస్థకు చేరడంతో తరచూ స్లాబ్‌పై పెచ్చులు ఊడిపడుతున్నాయి. భారీ వర్షం వస్తే కుప్పకూలే ప్రమాదం పొంచి ఉందని స్థానికులు అంటున్నారు. హాస్టల్ పరిస్థితి బాగోలేక విద్యార్థులసంఖ్య తగ్గిందని.. గతంలో 60 మందికిపైగా ఉంటే.. ఇప్పుడు 40 మందే ఉన్నారని పేర్కొంటున్నారు.సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో పాఠ శాలలు పునఃప్రారంభమై దాదాపు నెల రోజులు కావస్తోంది. చాలామంది విద్యార్థులు తిరిగిసంక్షేమ హాస్టళ్లకు చేరుతున్నారు. కానీ హాస్టళ్లు మాత్రం వసతుల లేమి, అపరిశుభ్రత, ఇతర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. విరిగిన కిటికీలు, పగిలిన తలుపులు, చెత్తాచెదారం, పిచి్చమొక్కలతో నిండిన పరిసరాలు, పాములు, తేళ్లు, విషపురుగులు, అపరిశుభ్రంగా మారిన టాయిలెట్లతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. నిజానికి వేసవి సెలవుల్లో దాదాపు నెలన్నర పాటు వసతి గృహాలన్నీ మూసి ఉన్నాయి. తిరిగి తెరిచే నాటికి వాటిని చక్కదిద్దాల్సిన సంక్షేమ శాఖలు ఏమాత్రం పట్టించుకోకపోవడం సమస్యగా మారింది. మరోవైపు హాస్టళ్లలో వంట కోసం టెండర్లు పూర్తిగాకపోవడం, డైట్ చార్జీలు సరిపోకపోవడంతో విద్యార్థులకు సరైన ఆహారం అందని దుస్థితి నెలకొంది. విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా.. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో 2,020 వసతిగృహాలు ఉన్నాయి. అందులో 497 పోస్టుమెట్రిక్, 1,523 ప్రీమెట్రిక్ హాస్టళ్లు. వీటిలో సుమారు 3.30 లక్షల మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ప్రస్తుతం ఈ హాస్టళ్లలో విద్యార్థుల ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ప్రీమెట్రిక్ హాస్టళ్లలో పదోతరగతి పూర్తయిన విద్యార్థులు వెళ్లిపోవడం, కింది తరగతుల్లో కొత్త చేరికలు నమోదవడం జరుగుతోంది. పోస్టుమెట్రిక్ హాస్టళ్లలో కూడా చేరికలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం వృత్తి విద్యా కోర్సులైన పాలిటెక్నిక్, ఫార్మసీ, ఇంజనీరింగ్ తదితర ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు అడ్మిషన్లు కొనసాగనున్నాయి. ఇలా వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. వసతుల లేమి మాత్రం సమస్యగా మారింది. పారిశుధ్యానికి బడ్జెట్ ఏదీ? శాశ్వత భవనాలున్న సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతుల సమస్య తీవ్రంగా ఉంది. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి వసతిగృహాల్లో పారిశుధ్య పనులు, మరమ్మతుల కోసం కొంతమేర నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. కానీ ఆ నిధులు రాకపోవడంతో అధికారులు మరమ్మతులు చేపట్టలేదు. కనీసం హాస్టళ్ల పరిసరాలను సైతం శుభ్రం చేయలేదు. చాలా వసతిగృహాల పరిసరాలు చెత్తాచెదారం, పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. వాటిలో పాములు, తేళ్లు, విష పురుగులు చేరుతున్నాయి. వానలు కురుస్తుండటంతో ఆవరణలోకి, గదుల్లోకి వస్తున్నాయి. దీంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. విరిగిన కిటికీలు, తలుపులతో వాన నీళ్లు గదుల్లోకి పడుతున్నాయి. డైట్ చార్జీలు సరిపోక.. సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు పదేళ్ల కిందటి డైట్ చార్జీలే కొనసాగుతున్నాయి. మూడో తరగతి నుంచి ఏడో తరగతి విద్యార్థులకు నెలకు రూ.950.. ఎనిమిది నుంచి పదో తరగతి విద్యార్థులకు రూ.1,100, ఇంటర్ నుంచి డిగ్రీ విద్యార్థులకు రూ.1,500 చొప్పున ప్రభుత్వం డైట్ చార్జీల కింద చెల్లిస్తోంది. అడ్డగోలుగా పెరిగిన నిత్యావసరాల ధరలతో ఈ చార్జీలు ఏ మూలకూ సరిపోవడం లేదని వసతిగృహాల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డైట్ చార్జీలను కనీసం 25శాతం పెంచాల్సిన అవసరం ఉందని గత ఏడాది మంత్రుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిందని.. కానీ ఇప్పటివరకు చార్జీలు పెంచలేదని గుర్తు చేస్తున్నారు. కూరగాయలు, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో.. విద్యార్థులకు తగిన పోషకాహారం అందే పరిస్థితి లేకుండా పోయిందని అంటున్నారు. అద్దె భవనాలతో మరింత గోస రాష్ట్రంలో 858 సంక్షేమ హాస్టళ్లు అద్దె భవనాల్లోనే ఉన్నాయి. ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేక, కొత్తవి నిర్మించక ఏళ్లకేళ్లు అలాగే కొనసాగుతున్నాయి. వాటికి చెల్లించాల్సిన అద్దె బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తంగా సుమారు రూ.12 కోట్ల మేర బకాయిలున్నట్లు అధికారిక గణాంకాలే చెప్తున్నాయి. కొన్ని హాస్టల్ భవనాలకు ఏడాదికిపైగా బిల్లులు రావడం లేదని అధికారులు అంటున్నారు. నెలల తరబడి అద్దె చెల్లించకపోవడంతో ఖాళీ చేయాలంటూ యజమానులు ఒత్తిడి చేస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఈ పరిస్థితి ఉందని పేర్కొంటున్నారు. మరికొన్ని కేస్ స్టడీలుపాములు, తేళ్ల సమస్యతో.. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థి మొల్లం శ్యాంకుమార్ గత వారం అనుమానాస్పదంగా మరణించాడు.టాయిలెట్ కోసం రాత్రిపూట బయటికి వెళ్లి, వచి్చన శ్యాంకుమార్.. వాంతులు చేసుకుని, అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కాసేపటికే కన్నుమూశాడు. టాయిలెట్ సమీపంలోని పొదల్లో తరచూ పాములు, తేళ్లు కనిపించేవని.. అవి కుట్టడం వల్లే శ్యాం మరణించి ఉంటాడని విద్యార్థులు అంటున్నారు. ఈ చిత్రంలో అపరిశుభ్ర వాతావరణంలో కనిపిస్తున్నది పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని మార్కండేయకాలనీలో ఉన్న ఎస్సీ బాలుర వసతి గృహం. అద్దె భవనంలో కొనసాగుతున్న ఈ వసతి గృహంలో 30మంది విద్యార్థులు ఉంటున్నారు. బాత్రూంలు, భవనాన్ని క్లీన్ చేయడానికి మనుషుల్లేక అంతా అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. ఇక్కడ వంటకు సంబంధించిన టెండర్లు ఇంకా పూర్తికాలేదని, వంట చేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగికి 10 నెలలుగా జీతం రాక కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతోందని.. దాంతో తామే రోజూ రూ.300 ఖర్చుపెట్టి కూరగాయలు తెప్పిస్తూ, వంట కూడా చేస్తూ.. విద్యార్థులకు తిండి పెడుతున్నామని హాస్టల్ వార్డెన్ డప్పు రవికుమార్ చెప్తున్నారు. ప్రభుత్వం త్వరగా స్పందించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తే విద్యార్థులకు సరైన భోజనం దొరుకుతుందని అంటున్నారు. -
విజయవాడలో ఏసీబీ సోదాలు
సాక్షి, విజయవాడ: నగరంంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. బృందావన కాలనీలో సోషల్ వెల్ఫేర్ జాయింట్ డైరెక్టర్ ప్రసాద్ ఇంటితో పాటు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు అందిన సమాచారం మేరకు ప్రసాద్ ఇంట్లో సోదాలు చేపట్టారు. సోదాల్లో భారీగా ఆస్తులు గుర్తించారు. 1991లో హైదరాబాద్‌లో ఐటీబీపీ కానిస్టేబుల్‌గా.. ఎస్పీఎఫ్లో హెడ్ కానిస్టేబుల్‌గా ఎస్ఐ, సీఐగా పదోన్నతి పొందారు. 2007లో ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్-I అధికారిగా ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఏటీవోగా చేరారు. గతంలో భువనగిరి జిల్లా ఏటీవోగా ట్రెజరీ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ (DRDA) కృష్ణా, డివిజనల్ ట్రెజరీ అధికారి విజయవాడ, అనంతరం డిప్యూటేషన్‌పై కృష్ణా, ఎస్ఎస్ఏ ప్రాజెక్టు డైరెక్టర్‌గా పనిచేశారు. -
ఎస్సీ గురుకుల ఉపాధ్యాయుల వేతనాలు పెంపు
సాక్షి, అమరావతి: ఎస్సీ గురుకులాల్లో పనిచేస్తున్న 1,791 మంది పార్ట్ టైమ్ టీచర్ల వేతనాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినట్టు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. టీచర్లతో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు, హెల్త్ సూపర్ వైజర్ల వేతనాలు కూడా పెంచినట్టు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ అంబేడ్కర్ ఎస్సీ గురుకులాల్లో పనిచేస్తున్న జూనియర్ లెక్చరర్లు, పీజీటీలు, టీజీటీలు, పీఈటీలు, హెల్త్ సూపర్ వైజర్ల వేతనాలు పెంచాలంటూ ఉపాధ్యాయులు చేసిన విజ్ఞప్తి మేరకు బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. గతంలో జూనియర్ లెక్చరర్ల(జేఎల్)వేతనం రూ.18 వేలు ఉండగా.. దీనిని రూ.24,150కు పెంచినట్టు తెలిపారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ల(పీజీటీ) వేతనం రూ.16,100 నుంచి రూ.24,150కు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ల(టీజీటీ) వేతనం రూ.14,800 నుంచి రూ.19,350కు, వ్యాయామ ఉపాధ్యాయుల (పీఇటీ) వేతనం రూ.10,900 ఉండగా.. దానిని రూ.16,350కు పెంచినట్టు చెప్పారు. వీరితో పాటు హెల్త్ సూపర్ వైజర్, స్టాఫ్ నర్స్‌ల వేతనం రూ.12,900 ఉండగా దాన్ని రూ.19,350కు పెంచామన్నారు. కాగా, తమ కష్టాలను గుర్తించి తమ వేతనాలను పెంచినందుకు గురుకుల విద్యాలయాల సంస్థ ఉద్యోగుల జేఏసీ నేతలు, టీచర్లు మంత్రి మేరుగు నాగార్జునను శుక్రవారం సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ నాగభూషణం మాట్లాడుతూ తాము కోరిన వెంటనే న్యాయం చేశారని కొనియాడారు. -
ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు..
సాక్షి, అమరావతి: ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. బీసీ సంక్షేమ శాఖ స్పెషల్ సీఎస్‌గా అనంతరాము బాధ్యతలు నిర్వహించనున్నారు. సాంఘిక సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా జి.జయలక్ష్మి, ఎక్సైజ్ శాఖ స్పెషల్ సీఎస్‌గా రజత్ భార్గవ బదిలీ అయ్యారు. పర్యాటక, సంస్కృతికశాఖ అదనపు బాధ్యతలు కూడా రజత్ భార్గవకు అప్పగించారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ బాధ్యతలను సీఎస్ పర్యవేక్షించనున్నారు. మైనారిటీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇంతియాజ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. చదవండి: స్థూల జాతీయ వృద్ధి రేటులో దేశంలోనే ఏపీ అగ్రగామి -
త్వరలో ఎస్సీ సదస్సు
సాక్షి, అమరావతి: దళితుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి జగన్ నిరంతరం కృషి చేస్తున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. దళితులకు సంక్షేమ పథకాల అమలుపై తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం సమీక్ష జరిగింది. పార్టీ ఎస్సీ విభాగాన్ని మరింత పటిష్టం చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకునేలా చైతన్యం చేయడంపై చర్చించారు. దళితుల్లో నాయకత్వాన్ని పెంపొందించేలా చురుకైన కార్యకర్తలు, నేతలను గుర్తించి ప్రోత్సహించాలని నిర్ణయించారు. సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్, ఎంపీ నందిగం సురేష్, ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకరరావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి నాగార్జున మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ ప్రభుత్వంలో దళితులకు జరుగుతున్న మేలు, చేకూరుతున్న ప్రయోజనాలను వివరిస్తూ త్వరలో రాష్ట్రస్థాయి ఎస్సీ సదస్సు నిర్వహిస్తామని ప్రకటించారు. దళితులను మోసగించేందుకు టీడీపీ పన్నుతున్న కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ సూచించారు. చంద్రబాబు హయాంలో ఎస్సీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఎంపీ నందిగం సురేష్ పేర్కొన్నారు. ఎస్సీ విభాగానికి సంబంధించి అన్ని కమిటీలను బలోపేతం చేస్తామని సామాజిక న్యాయ సలహాదారుడు జూపూడి ప్రభాకరరావు తెలిపారు. సీఎం జగన్ అమలు చేస్తున్న కార్యక్రమాలను జగనన్న సందేశం పేరుతో ఇంటింటికీ తీసుకు వెళ్తామని చెప్పారు. -
TS: సంక్షేమ శాఖల్లో 581 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: వివిధ సంక్షేమ శాఖల్లో 581 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. వసతిగృహ సంక్షేమాధికారి గ్రేడ్–1, గ్రేడ్–2, మ్యాట్రన్ గ్రేడ్–1, గ్రేడ్–2, వార్డెన్ గ్రేడ్–1, గ్రేడ్–2 శిశు గృహాల్లో మహిళా సూపరింటెండెంట్ పోస్టులకు ఉమ్మడి ప్రకటన విడుదల చేసింది. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటనను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు వివరించింది. అభ్యర్థుల నుంచి దరఖాస్తులను 2023 జనవరి 6 నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నట్లు వెల్లడించింది. చదవండి: ఆదిలోనే అడ్డంకులు!.. వాయిదా పడ్డ గ్రూప్-4 ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ -
మీతో చెప్పించుకునే దుర్గతి మాకు లేదు: మంత్రి మేరుగు నాగార్జున
సాక్షి, తాడేపల్లి: తెలంగాణ మంత్రి హరీష్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున. మీకేదైనా ఉంటే మీ రాష్ట్రంలో తేల్చుకోండని, మా ప్రభుత్వం, మా నాయకుడి గురించి మాట్లాడే అర్హత మీకు లేదని తేల్చి చెప్పారు. హరీష్ రావు దుష్టచతుష్టయం చెందన చేరారని, రామోజీ రావు, రాధాకృష్ణలకు అమ్ముడు పోయారని ఆరోపించారు. ‘వాళ్ళ మామకి ఆయనకి ఏమైనా విభేదాలు ఉన్నాయేమో మాకు తెలియదు. బుల్లెట్ ఒకరికి గురిపెడితే వేరే వారికి తగులుతుంది అనుకుంటున్నారేమో. హరీష్ రావు దుష్ట చతుష్టయం చెంతన చేరాడు. రామోజీ, రాధాకృష్ణకు అమ్ముడు పోయాడు. మీకేదైనా ఉంటే మీ రాష్ట్రంలో తేల్చుకోండి. మా ప్రభుత్వం, మా నాయకుడి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. అన్నీ రాష్ట్రాలకు మా రాష్ట్రము ఆదర్శంగా నిలుస్తోంది. మీతో చెప్పించుకునే దుర్గతి మాకు లేదు. మా రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యలపై మీకెందుకు? మేము విద్యావ్యవస్థను ఏ విధంగా అభివృద్ది చేస్తున్నామో దేశమంతా చూస్తోంది. రాబోయే రోజుల్లో మా టీచర్లకు ఇంకా మంచి జరగనుంది. ఈయన వాఖ్యలు వల్ల రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని నేను అనుకోను. కేసీఆర్ ఆలా ఆలోచిస్తారని నేనైతే అనుకోను. మేము ఏ రోజు కేసీఆర్... చివరికి హరీష్ రావు గురించి కూడా మాట్లాడలేదు. వాళ్ళ రాష్ట్రము బాగుండాలి... మా రాష్ట్రము బాగుండాలని మేము కోరుకుంటాం. నిన్నటి వరకూ వారితో కలిసే బతికాం... అందరం బాగుండాలనేది మా ఆశ.’ అని పేర్కొన్నారు మంత్రి మేరుగు నాగార్జున. ఇదీ చదవండి: కేసీఆర్‌కు హరీష్‌రావుకు గొడవలుంటే వాళ్లలో వాళ్లు చూసుకోవాలి: మంత్రి అమర్నాథ్ -
గురుకులాల్లో 317 గుబులు! జోనల్ ఉద్యోగుల్లో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీల్లోని ఉద్యోగుల్లో జీఓ 317 గుబులు మొదలైంది. రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి రావడంతో ఆమేరకు అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులను కేడర్ల వారీగా కేటాయించే ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది. తాజాగా సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీల్లో నూతన జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపులు జరపాలని ప్రభుత్వం ఆయా సొసైటీల కార్యదర్శులను ఆదేశించింది. దీంతో కేడర్ల వారీగా ఉద్యోగుల కేటాయింపుపై సొసైటీలు కసరత్తు మొదలుపెట్టాయి. ఇందులోభాగంగా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఎంఆర్ఈఐఎస్)లు జీఓ 317 అమలుకు ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ మేరకు క్షేత్రస్థాయి అధికారులకు మార్గదర్శకాలు ఇవ్వగా... అధికారులు చర్యలు వేగవంతం చేశారు. అతి త్వరలో తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూ ఆర్ఈఐఎస్), మహాత్మా జ్యోతిభా ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీఆర్ఈఐఎస్)ల పరిధిలోనూ కొత్త జోన్ల వారీగా ఉద్యోగ కేటాయింపు ప్రక్రియ మొదలు కానుంది. నూతన జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపులు పూర్తయితేనే కొత్తగా నియామకాలు, పోస్టింగులు ఇవ్వడానికి మార్గం సుగమం కానుంది. వివరాల సేకరణ షురూ ఎస్సీ, మైనార్టీ గురుకుల సొపైటీల్లో ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియ వేగవంతమైంది. ఉద్యోగుల నుంచి నిర్దేశించిన ఫార్మాట్లో వివరాలను సేకరించే పనిలో రీజినల్ కోఆర్డినేటర్లు బిజీ అయ్యారు. ఇప్పటికే దాదాపు సమాచారం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. వీటిని పరిశీలించాక సీనియారిటీ జాబితాను రూపొందించిన అనంతరం కేటాయింపులు జరుపుతారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఇతరత్రా నిర్దేశించిన కేటగిరీల్లోని ఉద్యోగులకు ప్రాధాన్యత ఇస్తారు. జోనల్ ఉద్యోగుల్లో గందరగోళం కొత్త జోనల్ విధానం ప్రకారం విభజన అంశం జోనల్ స్థాయి ఉద్యోగుల్లోనే ఎక్కువ గుబులు పుట్టిస్తోంది. ఇదివరకు రాష్ట్రంలో రెండు జోన్లు మాత్రమే ఉండేవి. కొత్త విధానంతో జోన్ల సంఖ్య ఏడుకు పెరిగింది, ఇందులో జోన్ పరిధి తగ్గింది. ఈ క్రమంలో జోనల్ స్థాయి ఉద్యోగుల స్థానికత ఆధారంగా కేటాయింపులు జరిపితే సగానికి పైగా ఉద్యోగులకు స్థానచలనం అనివార్యం కానున్నట్లు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో ఈ పరిస్థితుల్లో ఉద్యోగుల స్థానచలనం జరిగితే పిల్లల చదువులు, ఇతరత్రా అంశాల్లో ఇబ్బందులు తలెత్తుతాయనే వాదన ఉద్యోగ సంఘాల నుంచి వినిపిస్తోంది. కేడర్ల వారీగా ఉద్యోగుల విభజన ఇలా... జిల్లా స్థాయి: జూనియర్ అసిస్టెంట్, స్టోర్ కీపర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, ల్యాబ్ అటెండర్ జోనల్ స్థాయి: టీజీటీ, సూపరింటెండెంట్, ఫిజికల్ డైరెక్టర్ (గ్రేడ్ 2), లైబ్రేరియన్, సీనియర్ అసిస్టెంట్, స్టాఫ్ నర్స్, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్, వార్డెన్, పీఈటీ, ల్యాబ్ అసిస్టెంట్, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్, ప్లంబర్/ఎలక్ట్రీషియన్ మల్టీ జోనల్ స్థాయి: ప్రిన్సిపల్ (గ్రేడ్ 2), డిగ్రీ కాలేజీలోని లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్లు, హెల్త్ సూపర్వైజర్లు, జూనియర్ లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్ (గ్రేడ్ 1), పీజీటీలు. జిల్లా, మల్టీ జోన్లలో కొందరు జిల్లాస్థాయి, మల్టీ జోనల్ స్థాయి కేడర్ ఉద్యోగుల్లోనూ కొన్ని మార్పులు తప్పవని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జిల్లాల పరిధి కుదించుకోపోవడం, ఇదివరకు మల్టీ జోన్ లేకుండా రాష్ట్రస్థాయి పోస్టులుండగా... ఇప్పుడు ఆయా కేడర్లలోని ఉద్యోగుల్లో కొందరికి మార్పు తప్పదని తెలుస్తోంది. ప్రస్తుతం వివరాల సేకరణలో ఉన్న అధికారులు.. వారంలోగా సీనియారిటీ ఆధారంగా కేటాయింపులపై ప్రాథమిక జాబితాలు రూపొందిస్తే కొంత స్పష్టత రానుంది. మరోవైపు ఉద్యోగుల కేటాయింపులు మాత్రమే ఇప్పుడు జరిపి, స్థానచలనం జరిగితే కొంత సమయం ఇవ్వాలనే ఉద్యోగుల వినతులను ప్రభుత్వం పరిశీలిస్తోందని విశ్వసనీయ సమాచారం. చదవండి: Telangana: ఊరూరా గోదారే!.. కనీవినీ ఎరుగని జలవిలయం -
మంత్రిగా మేరుగ నాగార్జున బాధ్యతలు
సాక్షి, అమరావతి: సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా మేరుగ నాగార్జున సచివాలయంలోని తన ఛాంబర్లో బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దళితుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నమ్మకాన్ని వమ్ము చేయనని.. అంబేద్కర్ ఆలోచన, జగ్జీవన్‌రావు కాన్సెఫ్ట్‌తో ఆయన పాలన చేస్తున్నారని పేర్కొన్నారు. దళితులు ఎవ్వరికీ అన్యాయం జరగకూడదని సీఎం ఆలోచన అని మంత్రి అన్నారు. చదవండి: డిప్యూటీ సీఎంగా నారాయణ స్వామి బాధ్యతలు రాజకీయ నేపథ్యం: ఆంధ్రా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశీస్సులతో ఉమ్మడి 2007–09లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా పనిచేశారు. వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం అధ్యక్షుడుగా పనిచేశారు. 2009, 2014 ఎన్నికల్లో వేమూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2019లో ఇదే నియోజకవర్గం నుంచి నక్కా ఆనందబాబుపై గెలుపొందారు. -
సీఎం జగన్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తా..
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ విప్లవాన్ని తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో నేను సైతం భాగస్వామినవుతా. ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తా. వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తోంది. తాజా మంత్రివర్గ కూర్పుతో సామాజిక మహా విప్లవానికి సీఎం వైఎస్ జగన్ నాంది పలికారు. కీలకమైన ఉప ముఖ్యమంత్రి నుంచి, హోం, రవాణా, సాంఘిక సంక్షేమ, పురపాలక, ఎక్సైజ్ వంటి శాఖలను బహుజనులకు కట్టబెట్టారు. ఇతర రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రైనా ఇంత సామాజిక న్యాయంతో పాలన సాగించారా? బహుజనులకు ఇంతటి ప్రాధాన్యమిచ్చారా? దటీజ్ జగన్మోహన్రెడ్డి.’ అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున కొనియాడారు. ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ‘సాక్షి’తో మంగళవారం ముచ్చటించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. వైఎస్సార్‌తో విద్యార్థి దశ నుంచీ పరిచయం. నాకు సామాజికంగా, రాజకీయంగా ఏ బ్యాక్ గ్రౌండ్ లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డితో విద్యార్థి దశ నుంచే పరిచయం. అందుకే ఆంధ్రా యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా చేస్తున్న నన్ను ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా నియమించారాయన. ఆ తర్వాత 2009లో బాపట్ల ఎంపీ అభ్యర్థిగా నిర్ణయించారు. అనివార్య కారణాల వల్ల చివరి నిమిషంలో ఆ సీటును పనబాక లక్ష్మికి కేటాయించి నాకు వేమూరు అసెంబ్లీ సీటు ఇచ్చారు. వైఎస్సార్‌పై నమ్మకంతో నా కుటుంబంతో సంప్రదించకుండానే ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఆ ఎన్ని కల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడా. వైఎస్సార్ మరణానంతరం నా భవిష్యత్ అగమ్యగోచరమైంది. ఒత్తిళ్లు వచ్చినా వైఎస్ జగన్ వెంటే.. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని భారీగా ఒత్తిళ్లు వచ్చాయి. అయినా నేను జగన్మోహన్రెడ్డితోనే నడవాలని నిర్ణయించుకున్నా. పార్టీలోకి వచ్చిన వెంటనే నన్ను పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షునిగా చేశారు. 2014లో సీటు ఇచ్చారు. ఓడిపోయాను. అయినా పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షునిగా నన్ను కొనసాగించారు. 2019లో మళ్లీ సీటు ఇచ్చి గెలిపించారు. రెండుసార్లు ఓడిపోయిన ఎస్సీ వ్యక్తికి మళ్లీ సీటు ఇచ్చి గెలిపించడం ఒక్క వైఎస్ జగన్మోహన్రెడ్డికే సాధ్యం. ఇప్పుడు ఏకంగా మంత్రిని చేశారు. ఏమిచ్చినా ఆ కుటుంబం రుణం తీర్చుకోలేను. అందరినీ కలుపుకుని ముందుకెళ్తా.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలన్నదే నా ఆకాంక్ష. ఆయన ఆశయాలు నెరవేర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తా. ఎస్సీ సామాజిక వర్గం అభివృద్ధికి పాటుపడతా. ఎస్సీలలోని అన్ని ఉపకులాలనూ కలుపుకుని ముందుకెళ్తా. వైఎస్ జగన్మోహన్రెడ్డి భారతదేశ రాజకీయాల్లో చిరకాలం కొనసాగాలని, ఆయన కింద నేను పనిచేయాలని కోరుకుంటున్నా. నాకు ఓటు వేసిన నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటా. సంక్షేమ రేడు సారథ్యమే మహాభాగ్యం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినవ అంబేడ్కర్. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగానే రాష్ట్రంలో పాలన సాగుతోంది. గతంలో చంద్రబాబునాయుడిని అంబేడ్కర్ విగ్రహం పెట్టాలని కోరితే ఎక్కడో తుప్పల్లో ఒక మూలన పెట్టే యత్నం చేశారు. దాన్నీ పూర్తి చేయలేదు. అదే వైఎస్ జగన్మోహన్రెడ్డి మేం అడగకుండానే విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల విగ్రహం పెడుతున్నారంటే ఆయనకు అంబేడ్కరిజంపై ఎంత అభిమానం ఉందో అర్థమవుతోంది. సీఎం రాష్ట్రంలో సంక్షేమ విప్లవం సృష్టించారు. దీనిలో నేను సైతం భాగస్వామినవుతా. ఆ వరాల రేడు సారథ్యంలో పనిచేయడమే మహాభాగ్యం. జన సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తా. చంద్రబాబు గ్యాంగ్‌వి దొంగ డ్రామాలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. విద్య, వైద్యం, ప్రాథమిక రంగాల్లో విప్లవాత్మక మార్పులొచ్చాయి. ఇది ఎవరూ కాదనలేని సత్యం. ఈ విజన్‌తో చంద్రబాబునాయుడు ఎప్పుడైనా ఆలోచన చేశారా? పేదలకు సంక్షేమ ఫలాలు అందుతుంటే కోర్టుల ద్వారా అడ్డుకునేందుకు యత్నిస్తున్నారు. ఇది న్యాయమా? గతంలో దళితుల స్వాధీనంలో ఉన్న అసైన్డ్ భూములు లాగేసుకుని వాటినే రాజధాని కోసమంటూ ప్రభుత్వానికి ఇచ్చి తెలుగుదేశం పార్టీ నేతలు దోచుకున్నారు. ఇప్పుడు ఆ పచ్చదండు దొంగ డ్రామాలు ఆడుతోంది. దీనిని ప్రజలు గమనిస్తున్నారు. వారికి సరైన సమయంలో బుద్ధిచెబుతారు. -
బ్రజేశ్ ఠాకూర్ దోషే
న్యూఢిల్లీ: బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని ఒక షెల్టర్ హోంలో బాలికలపై జరిగిన లైంగిక దాడికి సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడు బ్రజేశ్ ఠాకూర్‌ను ఢిల్లీలోని పోక్సో కోర్టు సోమవారం దోషిగా తేల్చింది. ఠాకూర్, మరో 18 మంది దోషులేనని స్పష్టం చేసింది. అత్యాచారం, సామూహిక అత్యాచారం, లైంగిక దాడి, లైంగిక వేధింపులు, బాలికలకు డ్రగ్స్ ఇవ్వడం, సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వకపోవడం.. తదితర నేరారోపణలపై బ్రజేశ్ ఠాకూర్, ఆ వసతి గృహం సిబ్బంది, బిహార్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోని పలువురు ఉద్యోగులపై ఈ కేసు నమోదైంది. ముజఫర్‌పూర్‌లో ఠాకూర్ నిర్వహిస్తున్న వసతి గృహంలో జరిగిన ఈ దారుణాన్ని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెన్ 2018లో వెలుగులోకి తెచ్చింది. బాలికలపై అత్యాచారం, సామూహిక అత్యాచారం తదితర నేరాలకు సంబంధించి పోక్సో (లైంగిక నేరాల నుంచి చిన్నారులను రక్షించే చట్టం), భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని పలు సెక్షన్ల కింద ఆయనను న్యాయమూర్తి సౌరభ్ కులశ్రేష్ట దోషిగా నిర్ధారించారు. ఏ శిక్ష విధించాలనే విషయమై ఈ నెల 28న వాదనలు వింటామని న్యాయమూర్తి ప్రకటించారు. పైన పేర్కొన్న నేరాలకు యావజ్జీవం పడే అవకాశముంటుంది. ముజఫర్‌పూర్‌లోని చైల్డ్ ప్రొటెక్షన్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ రోజీ రాణిని కూడా కోర్టు దోషిగా పేర్కొంది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జిల్లా చైర్మన్ దిలీప్ కుమార్ వర్మ, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ రవి రోషన్ సహా మిగతా 17 మందిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ తీర్పును పై కోర్టులో సవాలు చేస్తామని ఠాకూర్ తరఫు న్యాయవాదులు తెలిపారు. ఈ కేసులో సీబీఐ హాజరుపర్చిన 69 మంది సాక్ష్యులను కోర్టు విచారించింది. వేధింపులకు గురైన 44 మంది బాలికల వాంగ్మూలాలను తీసుకుంది. ఆ బాలికల్లో 13 మంది మానసికంగా సరైన ఎదుగుదల లేనివారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రోజువారీ విచారణ చేపట్టి ఆర్నెల్లలో విచారణను కోర్టు ముగించింది. బ్రజేశ్‌తో తన భర్తకు సంబంధాలున్నాయన్న ఆరోపణ రావడంతో బిహార్ మంత్రి మంజు వర్మ పదవికి రాజీనామా చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2019లో ఈ కేసును ముజఫర్‌పూర్ కోర్టు నుంచి ఢిల్లీలోని పోక్సో కోర్టుకు బదిలీ చేశారు. -
భారత్ వ్యతిరేక ఎన్జీవోల కట్టడికి నేపాల్ నిర్ణయం
కఠ్మాండు: భారత్, చైనాలతో సంబంధాలను దెబ్బతీసే కార్యకలాపాలను సాగించే ప్రభుత్వేతర సంస్థ(ఎన్జీవో)లను కట్టడి చేసేందుకు నేపాల్ నడుం బిగించింది. ఇటువంటి సంస్థల కారణంగానే సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని భారత్...సరిహద్దుల గుండా టిబెటన్ల కదలికలు ఎక్కువైనట్లు చైనా... నేపాల్‌కు అనేక పర్యాయాలు ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలోనే కీలకమైన రెండు దేశాలతో సంబంధాలు సవ్యంగా సాగేందుకు ఎన్జీవోల రిజిస్ట్రేషన్ నిబంధనలను కఠినతరం చేయనున్నట్లు సోషల్ వెల్ఫేర్ కౌన్సిల్ తెలిపిందని ‘కఠ్మాండు పోస్ట్’ తెలిపింది. ముఖ్యంగా సరిహద్దుల్లో పెద్ద సంఖ్యలో ఉన్న మదరసాలు, ప్రార్థనా మందిరాలకు ఖతర్, సౌదీ అరేబియా, టర్కీల నుంచి నిధులు అందుతున్నట్లు భారత్ తెలిపిందని పేర్కొంది. అందుకే వీటికి అందే నిధులు, చేపట్టే కార్యక్రమాలపై పర్యవేక్షణ జరిపేందుకు వీలు గా కొత్త చట్టాన్ని తేనున్నట్లు తెలిపింది. సరిహద్దుల్లోని మదరసాల్లో ఉగ్రవాద కార్యక లాపాలు అంతర్గత భద్రతకు ప్రమాదమంటూ గతంలో నేపాల్‌కు భారత్ హెచ్చరికలు చేసిందని కూడా కౌన్సిల్ వివరించింది. -
సాంఘిక సంక్షేమంలో శాడిస్ట్ అధికారి
సాక్షి, కర్నూలు : జిల్లా సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన ఓ అధికారి ప్రవర్తన వివాదాస్పదమైంది. మహిళా వార్డెన్లతో సెల్ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడుతూ మానసిక వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అలాగే తనిఖీల పేరుతో మహిళా వార్డెన్లు ఉన్న వసతి గృహాలకు ప్రత్యేకంగా వెళ్తూ వారి పట్ల వెకిలి చేష్టలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మనసులో దురుద్దేశాన్ని పెట్టుకొని ఏకవచనంతో సంభాషించడం, రికార్డులు సక్రమంగా లేవంటూ కోపగించుకోవడం, కార్యాలయానికి వచ్చి కలవాలని ఆదేశాలు జారీ చేయడం ఆయనకు పరిపాటిగా మారింది. తాజాగా ఆదోని డివిజన్లోని ఓ మహిళా వార్డెన్ పట్ల ఆయన ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది. తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. దీంతో ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు మాజీ ఎంపీ బుట్టా రేణుక ద్వారా కలెక్టర్‌కు తెలియజేయాలనే భావించారు. ఈ విషయం సహచర వార్డెన్లకు తెలియడంతో సదరు అధికారిని కాపాడేందుకు రంగంలోకి దిగారు. బాధితురాలి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి.. పత్తికొండ నియోజకవర్గంలోని ఓ వసతి గృహంలో ఈ నెల 2వ తేదీన పంచాయితీ పెట్టించారు. ఈ పంచాయితీకి ఆదోని డివిజన్‌కు చెందిన పలువురు వసతి గృహ సంక్షేమాధికారులు, సదరు అధికారితో పాటు ఒకరిద్దరు అధికారులు కూడా హాజరైనట్లు సమాచారం. ఈ సందర్భంగా మహిళా వార్డెన్ భర్త.. వేధింపులకు గురి చేసిన అధికారిపై చేయి చేసుకునే ప్రయత్నం చేయడంతో అక్కడున్న వారు వారించినట్లు తెలిసింది. ఇక మీదట ఎలాంటి తప్పు చేయబోనని, మహిళా వార్డెన్లను ఏకవచనంతో పిలవనంటూ సదరు అధికారి క్షమాపణ కోరినట్లు తెలిసింది. ఈ విషయంపై జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు యు.ప్రసాదరావును వివరణ కోరగా.. తనకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదని, ఒకవేళ ఫిర్యాదు అందితే విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
‘సంక్షేమ’ పండుగ!
సాక్షి, అమరావతి: ఐదేళ్ల టీడీపీ పాలనలో నీరసించిన సంక్షేమ విద్యకు వైఎస్సార్ సీపీ జీవం పోస్తుందనే ఆశాభావం అధికార యంత్రాంగంలో వ్యక్తమవుతోంది. నూతన సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీల్లో సంక్షేమానికే పెద్దపీట వేశారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు జవసత్వాలు కల్పిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి పెడతారని అధికారులు భావిస్తున్నారు. 648 హాస్టళ్లను రద్దు చేసిన టీడీపీ రాష్ట్రంలో సంక్షేమ శాఖల ద్వారా సగం బడ్జెట్ విద్యకే ఖర్చు చేస్తున్నారు. సంక్షేమ హాస్టళ్లు, సంక్షేమ గురుకుల విద్యాలయాలు, బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు, కార్పొరేట్ స్కూళ్లు, సివిల్స్ కోచింగ్, విదేశీ విద్యా దీవెన పథకాల ద్వారా సంక్షేమ విద్యా బోధన జరుగుతోంది. సాంఘిక సంక్షేమ శాఖలో 648 హాస్టళ్లను రద్దు చేసిన టీడీపీ వాటి స్థానంలో కొత్త గురుకుల స్కూళ్లను మాత్రం ఏర్పాటు చేయకుండా అలక్ష్యం ప్రదర్శించింది. ప్రస్తుతం ఉన్న స్కూళ్లలోనే వీటిని విలీనం చేయడంతో అరకొర వసతి, తరగతి గదులు చాలక విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. విద్యాసంస్థల మరమ్మతులకు వెచ్చించాల్సిన నిధులు పచ్చ చొక్కాల జేబుల్లోకి చేరిపోయాయి. పైపైన రంగులు వేసి నిధులు దోచేశారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిధుల వ్యయం జరుగుతోంది. టీడీపీ పాలనలో రాష్ట్ర స్థాయిలో పనులన్నీ ఒకే కాంట్రాక్టర్‌కు ఇవ్వడంతో సప్లై, నాణ్యతలో లోపాలు తలెత్తాయి. గతేడాది బకాయిలు రూ.8 వేల కోట్లు విద్యా సంస్థలకు పైసా కూడా బకాయిలు లేకుండా సంక్షేమ విద్యను అందించడం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ద్వారానే సాధ్యం అవుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో ఒక్క ఏడాది కూడా స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తి స్థాయిలో చెల్లించలేదు. గత విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటికీ ఇంకా రూ.8 వేల కోట్ల బకాయిలు కాలేజీలకు విడుదల కాకుండా పెండింగ్‌లోనే ఉన్నాయి. గిరిజన సంక్షేమ విద్యలో పూర్తి స్థాయి మార్పులు గిరిజన సంక్షేమ విద్యలో పూర్తి స్థాయి మార్పులు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గురుకుల విద్య, ప్రాథమిక విద్య, సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి గిరిజన సంక్షేమ శాఖ ఇప్పటికే ఓ నివేదిక తయారు చేసింది. నూతన ముఖ్యమంత్రి దీన్ని ఆమోదించిన తరువాత అమలు చేయాలనే ఆలోచనలో ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉన్నారు. గత ప్రభుత్వం గిరిజన సంక్షేమ హాస్టళ్లను పూర్తిగా రద్దు చేసింది. దీంతో అటు గురుకుల విద్య అందక, సంక్షేమ హాస్టళ్లు లేక విద్యార్థులు అల్లాడుతున్నారు. రద్దు చేసిన కొన్ని హాస్టళ్లనైనా తిరిగి పునరుద్ధరించాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఆశ్రమ పాఠశాలలను పూర్తి స్థాయిలో గురుకులాలుగా మారిస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదన కూడా ఉంది. ఈ అంశాలపై అధికారులు నూతన ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. సబ్సిడీ రుణ పథకాలను నీరుగార్చిన చంద్రబాబు పేదల జీవన ప్రమాణ స్థాయిని పెంచేందుకు ఉద్దేశించిన సబ్సిడీ రుణాల పథకాల కింద ఏటా ఐదు లక్షల మందికి కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇప్పించాల్సి ఉంది. అయితే గత ప్రభుత్వం సంవత్సరానికి కనీసం 50 వేల మందికి కూడా పూర్తి స్థాయిలో సబ్సిడీ రుణాలను ఇవ్వలేకపోయింది. సంక్షేమ రంగాన్ని చంద్రబాబు పూర్తిగా విస్మరించారనేందుకు ఇది నిదర్శనం. గిరిజనులు, ఎంబీసీల గృహాలకు 100 యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వాల్సిన విద్యుత్ హామీ కూడా సక్రమంగా అమలు కాలేదు. ఎంబీసీలకు ఒక్కరికి కూడా ఉచిత విద్యుత్ అందలేదు. జీవో అమలు చేయాల్సిందిగా ప్రభుత్వం నుంచి తమకు మార్గదర్శకాలు లేవని విద్యుత్ శాఖ చెబుతోంది. గత ప్రభుత్వం కేవలం జీవోలకే పరిమితమైంది. ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేసిన దాఖలాలు లేవు. ఏఎస్‌డబ్లు్యవో కార్యాలయాల పరిధి మార్పు అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ కార్యాలయాల పరిధిలో మార్పులు తెచ్చేందుకు సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్ కార్యాలయం నివేదిక తయారు చేసింది. ప్రతి నాలుగైదు మండలాలకు ఒక ఏఎస్‌డబ్ల్యూవో ఉంటే బాగుంటుందనే యోచనలో డైరెక్టర్ ఉన్నారు. గుంటూరు లాంటి పెద్ద జిల్లాలకు ఇద్దరు అధికారులను నియమించాలని భావిస్తున్నారు. ఒక డిప్యూటీ డైరెక్టర్ జిల్లా కేంద్రంలో ఉంటున్నందున మరో ప్రధాన కేంద్రం నుంచి కూడా పర్యవేక్షించడం ద్వారా పనులు వేగంగా జరుగుతాయని పేర్కొంటున్నారు. ఈమేరకు నివేదిక రూపొందించి త్వరలో అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తం 90 మంది ఏఎస్డబ్లు్యవోలను సర్దుబాటు చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించాలని భావిస్తున్నారు. స్టడీ సర్కిళ్లకు జేడీలను ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తే నాణ్యమైన విద్యా బోధన జరుగుతుందని అధికారులు యోచిస్తున్నారు. -
కొడుకిచ్చిన డాక్టరేట్
డాక్టర్ స్రవంతి సాంఘిక సంక్షేమ శాఖలో ఉద్యోగిని. ఒక వైపు ఉద్యోగ నిర్వహణ, మరోవైపు తల్లిగా నిర్విరామ శ్రమ. రెండేళ్లకోసారి బదలీలు. ఉద్యోగరీత్యా తరచు క్షేత్రస్థాయిలో తిరగాల్సి రావడం. వీటన్నిటి ఒత్తిడిలో ఆటిజంతో బాధపడుతున్న తన కుమారుడ్ని చూసుకోవడం ఆమెకు శక్తికి మించిన బాధ్యత అయింది. అయినా కూడా ఆమె నిస్పృహ చెందలేదు. మానసిక ఎదుగుదల లేని తన బిడ్డను కంటికి రెప్పలా కాడుకుంటూ వస్తున్నారు. అంతేకాదు, తనబిడ్డలా ఇంకా ఎంతమంది ఉన్నారు, ఈ సమస్యకు పరిష్కారమేమిటి అనే అంశాలపై ఆమె పరిశోధన చేశారు. ఎస్వీయూ నుంచి డాక్టరేట్ పొందారు. ఆ వివరాలు స్రవంతి మాటల్లో..‘‘మా స్వస్థలం అనంతపురం జిల్లా. ఉద్యోగ రీత్యా తిరుపతిలో స్థిరపడ్డాం. సాంఘిక సంక్షేమ శాఖలో వివిధ ప్రాంతాల్లో పనిచేశాను. విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేసే రవికుమార్‌తో 1996లో వివాహమైంది. 1999లో బిడ్డ పుట్టాడు. పేరు చందన్. అయితే ఏడాది వయస్సు వచ్చినా వాడిలో ఎలాంటి స్పందనలు లేవు. చాలాచోట్ల చూపించాం. ఫలితంలేదు. మూడు సంవత్సరాల వయస్సు వున్నప్పుడు సికింద్రాబాద్‌లోని ఎన్ఐహెచ్ఎం సంస్థ వైద్యుల దగ్గరికి తీసుకెళ్లాం. ఆటిజం అని చెప్పారు! ఈ సమస్యతో బాదపడేవారు వారిలో మానసిక ఎదుగదల వుండదు. చూసేవాళ్లు ఎవరూ లేక చందన్‌ని వెంట పెట్టుకునే విధులకు హాజరయ్యేదాన్ని. ఓసారి చందన్ తనకు తెలియకుండా మా ఇంటికి సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ను పట్టుకున్నాడు. దాంతో శరీరమంతా షాక్‌కు గురై 16 సర్జరీలు జరిగాయి. ఆ సందర్భంలో ఎంతో ఒత్తిడికి గురయ్యాను. నా బిడ్డకు ఇలా అవుతోందేమిటి అని మనోవేదనకు గురయ్యాను. సాధారణంగా తల్లిదండ్రులు ఈ సమస్యతో బాధపడే పిల్లలను కొంత నిర్లక్ష్యం చేస్తారు. బాగా వుండే పిల్లలపై చూపే శ్రద్ధ వీరిపై చూపరు. ఆ స్థితి నా బిడ్డకు రాకూడదనే లక్ష్యంతో ఇంకో బిడ్డను వద్దనుకున్నాను. ఇలాంటి సమస్య ఉన్న పేరెంట్స్‌కి పరిష్కారం చూపాలని అనుకుని పరిశోధనకు పూనుకున్నాను. ఈ పరిశోధనకు నా అనుభవమే గ్రంథాలయమైంది. ఇల్లే ప్రయోగశాలగా మారింది. నా బిడ్డే నా పరిశోధనకు కేంద్రబిందువయ్యాడు. పదకొండేళ్ల పరిశోధన నేను 1992లో సాంఘిక సంక్షేమ శాఖలో ఉద్యోగంలో చేరాను. ఒక వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు చందన్‌ని కంటికి రెప్పలా చూసుకుంటూ వచ్చాను. ఆటిజంపై పరిశోధన కోసం 2008లో ఎస్వీయూ సైకాలజీ విభాగంలో పిహెచ్‌డీకి చేరాను. ‘హ్యాండ్లింగ్ ప్రాబ్లమ్ బిహేవియర్ ఆఫ్ ఆటిస్టిక్ మెంటల్లీ చాలెంజ్డ్ చిల్డ్రన్’ అనే అంశాన్ని తీసుకున్నాను. అలా పదకొండేళ్ల నా పరిశోధనలో అనేక విషయాలను తెలుసుకున్నాను. ఆటిజం ఉన్న పిల్లలు తమకు ఏం కావాలో చెప్పలేరు. కమ్యూనికేట్ చేయలేరు. కొంతమంది ఎక్కువగా మాట్లాడుతుంటారు. అలాంటి వారిని నియంత్రించలేం. ప్రతి చిన్నవిషయానికీ బాధపడుతుంటారు, భయపడుతుంటారు. వీళ్ల విషయంలో ఎక్కువ శ్రద్ద చూపాలి. ఆటిజం ఉన్నపిల్లలను త్వరగా గుర్తించలేం. అయితే తగినంత ప్రత్యేక పద్దతుల్లో రెండుమూడు వారాల్లోనే గుర్తించవచ్చు. ఇలా గుర్తించినప్పుడు వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకుంటేకొంత మేలు చేకూరుతుంది. రీహాబిలిటేషన్ కల్పించాలి ఆటిజంతో జన్మించిన పిల్లలు తమ తప్పులేకపోయినా తమ ప్రమేయం లేకుండానే భూమిపైకి వస్తారు. ఇలాంటి పిల్లల విషయంలో తల్లిదండ్రులు అశ్రద్ధ చేయకూడదు. బిడ్డలు లేని స్థితికన్నా ఎవరో ఒకరు ఉన్నారన్న సంతోషంతో వారిపట్ల ప్రేమానురాగాలు చూపిస్తూ పెంచాలి. వృద్ధులు, అనాథలకు ఆశ్రమాలు ఉన్నాయి. కాని ఇలాంటి వారికి ఆశ్రమాలు లేవు. ఎన్జీవోలు, కార్పొరేట్ సంస్థలు చొరవ చూపి రీహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ఇలాంటి పిల్లల విషయంలో తల్లిదండ్రులు బతికి ఉన్నంత వరకు ఎలాంటి సమస్య వుండదు. అయితే వారు చనిపోయాక ఏమిటనేదే ప్రశ్నార్థకం. నా పరిశోధనలో గరిష్టంగా అరవై సంవత్సరాల వయస్సు వున్న మానసిక ఎదుగదల లేని వ్యక్తిని కూడా గుర్తించాను. మన రాష్ట్రంలో ఈ తరహా తొలి పరిశోధన బహుశా నేను చేసిందే కావచ్చు. సైకాలజీ విభాగం ప్రొఫెసర్ డి.జమున పర్యవేక్షణలో నేను ఈ పరిశోధన చేశారు’’ అని తెలిపారు డాక్టర్ స్రవంతి. బూచుపల్లి హరిమల్లికార్జున రెడ్డి, సాక్షి, తిరుపతి ఫొటో: షేక్ మహమ్మద్ రఫీ సంగీతంతో చికిత్స నా బిడ్డ ఎలాంటి స్పందన లేకుండా వుండడం, మానసిక ఎదుగదల లేకపోవడంతో చిత్రవధ అనుభవించాను. పరిష్కారం దిశగా ప్రయత్నించాను. ఈ ప్రయాణంలో నాకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. కొన్ని పాటలకు బిడ్డ స్పందించడం గుర్తించాను. ఐదు పాటలను ఎంచుకుని ఆకలి, బాధ, దుఃఖం, సంతోషం, కోపం వీటికి.. స్పందించేలా చేశాను. అప్పుడు చందన్ తనలోని భావాలను ఈ పాటలకు ప్రతిస్పందించడం ద్వారా నాకు అర్థమయ్యేలా చేసేవాడు. -
సంక్షేమంలో అవినీతి సామ్రాట్
నెల్లూరు(అర్బన్): దళిత వర్గాల అభ్యున్నతికి పాటు పడేందుకు ఏర్పాటు చేసిన సాంఘిక సంక్షేమ శాఖ (సోషల్ వెల్ఫేర్) జిల్లాలో అవినీతికి అడ్డాగా మారింది. ఫైళ్ల క్లియరెన్స్ పేరిట భారీగా వసూళ్లు, బ్యాంక్‌ల ఖాతాల్లో నగదు తారుమారు, గురుకుల పాఠశాలల పేరుతో పెద్ద ఎత్తున నిధులు గోల్మాల్ చేయడం వంటివి పెద్ద ఎత్తున జరిగాయి. జిల్లా సాంఘిక సంక్షేమశాఖ డీడీగా పనిచేస్తూ ఇటీవల బదిలీ అయిన డీడీ మధుసూదన్ ఇంటిపై ఏసీబీ అధికారులు శనివారం దాడి చేశారు. బహిరంగ మార్కెట్లో సుమారు రూ.10 కోట్ల విలువైన ఆస్తులను కనుగొన్నారు. దీంతో సాంఘిక సంక్షేమ శాఖలో జరుగుతున్న అవినీతి కంపు మరోసారి గుప్పుమంది. జిల్లాలో సోషల్ వెల్ఫేర్ డీడీగా మధుసూదన్‌రావు 2015 డిసెంబర్లోబాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ఆయనపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లాలో 81 వరకు సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. వసతి గృహ అధికారుల నుంచి ప్రతి నెలా వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఆయనకు ముడుపులు ఇచ్చుకునేందుకు వసతి గృహ అధికారులు విద్యార్థుల మెనూకు కోత వేసి తమ అధికారిని సంతృప్తి పరిచేవారనే ఆరోపణలు లేకపోలేదు. వసూళ్లకు శ్రీకారం ఆ శాఖకు చెందిన బ్యాక్లాగ్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తున్నారని నమ్మించి పలువురు నిరుద్యోగుల నుంచి భారీ మొత్తాల్లో వసూళ్లు చేశారనే ప్రచారం జరుగుతోంది. నాయుడు పేటలో దళిత వర్గాల కోసం స్ఫూర్తి గురుకుల పాఠశాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇక్కడ కళాశాల ప్రారంభించక ముందే ప్రారంభించినట్టు చూపి రూ.కోటి వరకు నిధులు పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. 17 బ్యాంక్‌ల్లో రూ. 86.90 లక్షలు డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. ఇందులో ఏసీబీ అధికారులు దాడులు చేసే సమయానికి రూ.42 లక్షలకే లెక్కలు చూపుతున్నట్టు సమాచారం. డీడీ కార్యాలయ కోటరీపైన ఏసీబీ దృష్టి మధుసూదనరావుకు డిప్యూటీ డైరెక్టర్ కార్యాయలంలో కొందరు ఉద్యోగులు అన్ని తామై చూసుకునే వారు. నెలవారీ మామూళ్లు మొదలుకుని అన్ని అంశాలు వీరే చక్కబెట్టేవారు. గతంలో ఎన్ని బదిలీలు జరిగినా పైరవీలు, కోర్టులకు వెళ్లి మరీ బదిలీలు నిలుపుదల చేయించుకున్నారు. తాజాగా మధుసూదనరావు నివాసంలో ఏసీబీ సోదాల నేపథ్యంలో కొందరు కార్యాలయ సిబ్బందిలో తీవ్ర అలజడి మొదలైంది. ముఖ్యంగా 8 మంది ఉద్యోగులు అన్ని తామై చక్రం తిప్పారని సమాచారంతో ఇప్పుడు ఏసీబీ అధికారులు వారిపై దృష్టి సారించినట్లు సమాచారం. బదిలీ జరిగినా వారాల తరబడి ఇక్కడే అక్టోబర్ 12వ తేదీన సాంఘిక సంక్షేమ శాఖ అధికారుల బదిలీలు జరిగాయి. అందులో భాగంగా మధుసూదన్‌రావు తూర్పుగోదావరి జిల్లాకు డీడీగా బదిలీ అయ్యారు. అయితే ఆయన రెండు వారాలకు పైగా జిల్లా నుంచి రిలీవ్ కాలేదు. తన బదిలీని నిలుపుదల చేయించుకునేందుకు పైస్థాయిలోనే పైరవీలు జరిగాయనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే రిలీవ్ కాకుండానే కార్యాలయానికి వచ్చి ప్రమోషన్ల, ఇన్చార్జీ, బదిలీలకు సంబంధించిన పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ పేరిట పెద్దఎత్తున అక్రమ వసూళ్లకు తెర లేపారని సమాచారం. అంబేడ్కర్, బాబూజగ్జీవన్‌రామ్ వంటి మహానేతల జయంతులను ప్రభుత్వం రాష్ట్ర పండగలుగా గుర్తించి నిధులు మంజూరు చేసింది. అయినప్పటికీ వారి ఉత్సవాల పేరిట వసతిగృహ అధికారుల నుంచి నిధులు వసూలు చేసి ప్రభుత్వం మంజూరు చేసిన వాటిని దిగమింగారనే వార్తలు గుప్పుమన్నాయి. భారీగా ఆస్తులు గుర్తింపు ఏసీబీ అధికారులు దాడి చేసి మధుసూదనరావుకు ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఆయన నివాసంలో బహిరంగ మార్కెట్లో రూ.10 కోట్ల విలువైన ఆస్తులను కనుగొన్నారు. ఒక కిలో బంగారం నగలు, ఒకటిన్నర కిలోల వెండి, రూ.లక్ష వరకు నగదు దొరికింది. ఇవి కాక వివిధ బ్యాంక్ ఖాతాలు.. అందులో ఉన్న నగదు, చెక్కులకు సంబంధించి మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశముందని తెలుస్తోంది. డీడీ ఉద్యోగ ప్రస్థానాలు దాసరి మధుసూదనరావు నెల్లూరు జిల్లా సోషల్ వెల్ఫేర్ డీడీగా పనిచేస్తూ ఈ ఏడాది అక్టోబర్ 12వ తేదీన తూర్పు గోదావరి జిల్లాకు బదిలీ అయ్యారు. అదే నెల 29వ తేదీన ఆయన నెల్లూరు నుంచి బదిలీ అయ్యారు. ఇంత వరకూ తూర్పుగోదావరి జిల్లాలో బాధ్యతలు స్వీకరించలేదు. గుంటూరు జిల్లాకు చెందిన మధుసూదనరావు 2004 జూలై 20వ తేదీన చిత్తూరు జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి (సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్)గా విధుల్లో చేరారు. కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లాల్లో పని చేశారు. 2010 ఏప్రిల్ 6వ తేదీన డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. డీడీగా వైఎస్సార్ కడప, కృష్ణా జిల్లాలో పని చేసి 2015 డిసెంబర్లో నెల్లూరు సోషల్ వెల్ఫేర్ డీడీగా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు మూడేళ్ల పాటు జిల్లాలో పని చేసి ఇటీవల బదిలీ అయ్యారు. -
మేం చెప్పిందే ‘సెంటర్’
సాక్షి, అమరావతి: పేద విద్యార్థులు సైతం సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో నెగ్గేందుకు ఉచితంగా శిక్షణ ఇప్పించాలన్న ప్రభుత్వ సంకల్పం మసకబారుతోంది. కోచింగ్ సెంటర్ల ఎంపికలో గోల్మాల్ చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గతంలో 17 కోచింగ్ సెంటర్లను ఎంపిక చేయగా, ఈసారి వీటితోపాటు కొత్తగా మరో మూడు కేంద్రాలను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి కార్యాయలం(సీఎంవో) ఆదేశించింది. దీంతో మొత్తం 20 కోచింగ్ సెంటర్లను ఎంపిక చేశారు. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నేతల పైరవీలు ఫలించినట్లు సమాచారం. తాము సూచించిన కేంద్రాలనే ఎంపిక చేయాలంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చి, అనుకున్నది సాధించినట్లు తెలుస్తోంది. సివిల్స్ శిక్షణ నిమిత్తం ప్రభుత్వం ఇచ్చే నిధులను దిగమింగడానికి ప్రయత్నిస్తున్నట్లు విమర్శలున్నాయి. అర్హులైన విద్యార్థులకు సివిల్స్ శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన కోచింగ్ సెంటర్ల ఎంపిక కోసం ప్రభుత్వం నలుగురు సభ్యులతో కూడిన నాలుగు కమిటీలను నియమించింది. ఈ కమిటీలకు బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల డైరెక్టర్లు, కాపు కార్పొరేషన్ ఎండీ నేతృత్వం వహించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్య నగరాలతోపాటు హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లోని కోచింగ్ సెంటర్లను ఈ కమిటీలు పరిశీలించాయి. 17 సెంటర్లను ఎంపిక చేశాయి. ఈ మేరకు ప్రభుత్వానికి తమ నివేదికను అందజేశాయి. అనంతరం మరో 3 కోచింగ్ సెంటర్లను చేర్చాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో 20 కోచింగ్ సెంటర్లను అధికారులు ఎంపిక చేశారు. మొత్తం 20 సెంటర్లలో చాలావరకు అధికార పార్టీ నేతలకు బాగా కావాల్సినవేనని ప్రభుత్వ ఉన్నతాధికారి పేర్కొన్నారు. నాలుగు నెలలు వృథా సివిల్స్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయడానికి జూన్ నెలాఖరున పోటీ పరీక్ష నిర్వహించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కమిటీలు, తనిఖీలు అంటూ కాలయాపన చేశారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి, అస్మదీయ కోచింగ్ సెంటర్లను ఎంపిక చేశారు. నాలుగు నెలల సమయం వృథా అయిందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే జూన్‌లో సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు జరుగుతాయని, పరీక్షలకు సిద్ధం కావడానికి ఈ గడువు సరిపోదని వాపోతున్నారు. కోచింగ్ ఫీజు విద్యార్థులకు ఖాతాలకు.. సివిల్స్ కోచింగ్ ఫీజును నేరుగా కోచింగ్ కేంద్రాలకు ఇవ్వకుండా, విద్యార్థుల బ్యాంకు ఖాతాలకే బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం జీవో విడుదల చేసింది. కోచింగ్ సెంటర్లను 3 విభాగాలుగా విభజించారు. ఏడాదికి ప్రతి విద్యార్థికి కోచింగ్ ఫీజు కింద మొదటి విభాగం కేంద్రానికి రూ.1.30 లక్షలు, రెండో విభాగం కేంద్రానికి రూ.1.15 లక్షలు, మూడో విభాగం కేంద్రానికి రూ.లక్ష చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని నెలనెలా విద్యార్థుల ఖాతాకు జమ చేస్తారు. జ్ఞానభూమి వెబ్సైట్ ద్వారా విద్యార్థులకు ట్యూషన్ ఫీజుతోపాటు మెయింటెనెన్స్ ఫీజు జమ అవుతుంది. ట్యూషన్ ఫీజును విద్యార్థులు కోచింగ్ సెంటర్లకు చెల్లించాల్సి ఉంటుంది. మెయింటెనెన్స్ ఫీజు నెలకు రూ.10,000, ఢిల్లీలో కోచింగ్ తీసుకునే వారికి రూ.12,000 ఇస్తారు. రవాణా ఖర్చుల కింద రూ.2,000 అందజేస్తారు. నేటి నుంచి కౌన్సెలింగ్ సివిల్స్ ఉచిత కోచింగ్‌కు ఎంపికైన అభ్యర్థులు ప్రభుత్వం కేటాయించిన కోచింగ్ సెంటర్లలో నేటి నుంచి జరిగే కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. జ్ఞానభూమి వెబ్సైట్ ద్వారా ఈ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం.రామారావు తెలిపారు. -
అతడే ఒక సైన్యం
ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే సరిపోదు..సమాజం కూడా ఆరోగ్యంగా ఉండాలనుకున్నాడు ఆ వైద్యుడు. సమాజాన్ని పీడిస్తున్న రోగాలకు చికిత్స చేసేందుకు పోరాటబాట ఎంచుకున్నారు. ఓ వైపు ఉచితవైద్యశిబిరాల ద్వారా సేవలందిస్తూనే.. ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రెండేళ్లుగా పాదయాత్ర చేస్తున్నారు. ఆయనే జగిత్యాలకు చెందిన యువ వైద్యుడు సిరికొండ రవిశంకర్. – జగిత్యాలజోన్ రవిశంకర్‌కు చిన్నప్పటి నుంచి సమాజస్పృహ ఎక్కువ. ప్రజలు వేసిన ఓట్లతో గెలుపొంది వారినే నిర్లక్ష్యం చేసే ప్రజాప్రతినిధులపై పోరాడేతత్వం ఆయనది. 2002– 08 వరకు ఖమ్మంలో ఎంబీబీఎస్ చదివారు. కోర్సు అనంతరం వైద్యుడిగా పలు ఆస్పత్రుల్లో సేవలు అందించారు. 2014లో జగిత్యాలకు వచ్చిన రవిశంకర్ ఓ ఆస్పత్రిని ప్రారంభించారు. రెండేళ్లపాటు వైద్యసేవలందించారు. ఓ వైపు ఆస్పత్రి నిర్వహిస్తూనే మరో వైపు ఖాళీ సమయాల్లో గ్రామాల్లో ఉచిత వైద్యశిబిరాలు నిర్వహిచారు. ఇందుకు ఓ అంబులెన్స్ కొనుగోలు చేశారు. దాదాపు 500 వరకు ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించారు. అయినా ఆయనకు ఏదో అసంతృప్తి. అదే సమాజంలోని సమస్యలపై పోరాటలకు ప్రేరణగా నిలిచింది. ప్రజా సమస్యలపై పోరుబాట రోగులకు ఉచిత వైద్యం అందిస్తూనే... 2016 నుంచి పూర్తిస్థాయిలో ప్రజాసమస్యలపై పోరాటం ప్రారంభించారు. ఉచిత వైద్యశిబిరాల ద్వారా గ్రామీణుల వద్దకు వెళ్లి వారిని పీడిస్తున్న సమస్యల గురించి తెలుసుకున్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునే స్థోమత లేక గ్రామీణులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి.. జగిత్యాలలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ఉద్యమించారు. దాదాపు 200 రోజులుగా నిరసన దీక్షలు చేశారు. రోజుకో సమస్యపై తన ఇంటి నుంచి 4 కిలోమీటర్లు దూరంలో ఉన్న కలెక్టరేట్‌కు చేరుకొని వినతిపత్రం ఇస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 120 సమస్యలపై ఫోకస్ చేశారు. అంతేకాకుండా దాదాపు వెయ్యి వేపమొక్కలను నాటడం, ఇంకుడుగుంతలపై గ్రామీణులకు సైతం అవగాహన కల్పించారు. ముందు డాక్టర్.. వెనుక అంబులెన్స్ డాక్టర్ నిరసన వినూత్న శైలిలో ఉంటుంది. రోజుకో సమస్యపై ఫ్లెక్సీతో ముందు డాక్టర్ వెళ్తుంటే.. వెనుక అంబులెన్స్ అనుసరిస్తుంటుంది. అంబులెన్స్‌లోని స్పీకటర్ల ద్వారా వచ్చే పాటలతో ప్రజలను ఆయా సమస్యలపై ఉత్తేజితులను చేస్తుంటారు. పిచ్చోడు అన్నవారే.. మద్దతుగా.. రోజుకో సమస్యపై ఇలా పాదయాత్రగా డాక్టర్ వెళ్తుంటే..మొదట పిచ్చోడు అన్నవారే నేడు మద్దతుగా నిలుస్తున్నారు. వైద్యుడిగా పనిచేస్తే వచ్చే డబ్బులను వదులుకొని ఇలా చేయడం ఏంటని హేళనగా మాట్లాడిన వారే.. ఆయన పట్టుదల చూసి వెంట నడుస్తున్నారు. సోషల్‌మీడియా వేదికగా.. డాక్టర్ ఎప్పటికప్పుడు తాను చేసే కార్యక్రమాల వివరాలను సోషల్‌మీడియా ద్వారా ప్రజల ముందుకు తీసుకెళ్తుంటారు. తాను చేసిన కార్యక్రమాలకు మద్దతుగా ఎవరిని సాయం కోరడం కానీ, డబ్బు సాయం కానీ అడగరు. ఒంటరిగానే ముందుకెళ్తున్నారు. తాను చేసే కార్యక్రమాలకు సైతం రోజుకు రూ.100 నుంచి రూ.200లోపే ఖర్చు అవుతున్నట్లు డాక్టర్ తెలిపారు. తన పోరాటం ద్వారా ఒక్క సమస్య పరిష్కారమైన విజయంగానే భావిస్తానని రవిశంకర్ స్పష్టం చేస్తున్నారు. -
ఏసీబీ వలలో సాంఘిక సంక్షేమ డీడీ
కరీంనగర్ క్రైం: క్యాటరింగ్ కాంట్రాక్టర్ నుంచి రూ. లక్ష లంచం తీసుకుంటూ కరీంనగర్ సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరక్టర్ యాదయ్య బుధవారం ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. కరీంనగర్‌లోని మారుతి నగర్ కు చెందిన బాకం కనకయ్య 25 ఏళ్లుగా కరీం నగర్‌లోని పలు ప్రభుత్వ వసతిగృహాలకు కూరగాయలు, గుడ్లు, అరటి పండ్లు సరఫరా చేస్తున్నాడు. 2017–18 సంవత్సరానికి 2017 జూన్‌లో టెండర్లు వేయగా, కనకయ్య పాల్గొ న్నాడు. టెండర్ కనకయ్యకు రావాలంటే డీడీ యాదయ్య రూ.1.30 లక్షలు డిమాండ్ చేశాడు. అందుకు అంగీకరించిన కనుకయ్య చెక్కును డీడీకి ఇచ్చాడు. చెక్కు చెల్లకపోవడంతో గతేడాది నవంబర్‌లో దానిని వెనక్కి ఇచ్చేశాడు. అప్పటి నుంచి పది నెలల బిల్లులు చెల్లించకుండా వేధించడం ప్రారం భించాడు. తర్వాత 5 నెలల బిల్లులు మం జూరు చేసినా.. మిగిలిన రూ.2.5 లక్షల బిల్లు కోసం యాదయ్య చుట్టూ కాంట్రాక్టర్ తిరిగినా ఉద్దేశపూర్వకంగానే పెం డింగ్‌లో ఉంచాడు. చివరకు రూ.లక్ష ఇస్తేనే మిగతా బిల్లులు వస్తాయని, లేకుంటే అంతే సంగతి అని, మరోసారి తన వద్దకు రావద్దని, రాంనగర్‌లోని బాలుర వసతిగృహం వార్డెన్ శ్యాం సుందర్‌రావుతో రావాలని, లేకుంటే లేదని చెప్పాడు. కనకయ్య శ్యాంసుందర్ రావును కలవగా.. డీడీ తనకు ఫోన్ చేశాడని, ఒప్పుకున్న మేరకు రూ.లక్ష ఇవ్వాల్సిందేనని చెప్పాడు. బుధవారం కనకయ్య డబ్బులు ఇచ్చేందుకు డీడీకి ఫోన్ చేయగా, తాను అందుబాటులో లేనని.. శ్యాంసుందర్‌రావుకు ఇవ్వాలని చెప్పాడు. బుధవారం ఇద్దరూ కలసి డీడీ ఇంటికి వెళ్లి రూ. లక్ష ఇస్తుండగా.. ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ సుదర్శన్‌గౌడ్ ఆధ్వర్యంలో అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. రూ.లక్ష స్వాధీనం చేసుకుని యాదయ్యతోపాటు శ్యాంసుందర్‌రావుపై కేసు నమోదు చేశారు. గురువారం రిమాండ్‌కు తరలించనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. కాగా, డీడీ యాదయ్యపై ఆరోపణలు వెల్లువెత్తడంతో గతంలో ‘సాక్షి’ వరుస కథనాలను ప్రచురించింది. -
సోషల్ వెల్ఫేర్ అధికారి ఇళ్లల్లో ఏసీబీ సోదాలు
పులివెందుల: ప్రస్తుం కర్నూలు జిల్లా ఆత్మకూరులో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారి కార్యాలయంలో ఏవో గా పనిచేస్తున్న రాజ కుళ్లాయప్ప ఇళ్లలో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఏకకాలంలో కర్నూలు, కడప జిల్లాల్లో ఏడుచోట్ల తెల్లవారుజాము నుంచి సోదాలు కొనసాగిస్తోంది. గతంలో ఈయన పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లి బీసీ హాస్టల్ వార్డెన్‌గా పనిచేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల ఉన్నాయన్న అభియోగంపై పులివెందుల, వేంపల్లిలోని ఆయన ఇళ్లలో, ప్రైవేట్ కార్యాలయంలో సోదాలు చేపట్టారు. ఆయన స్నేహితుడు, సెరికల్చర్ ఉద్యోగి అయిన జగన్మోహన్ రెడ్డి ఇంటిపై కూడా దాడులు నిర్వహించారు. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. -
గురుకుల విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, మహబూబాబాద్: డబ్బులు పోయాయని.. తీసుకున్నవారు ఇచ్చేయాలని.. అడగటంతో అవమానభారానికి గురైన సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది. పట్టణంలోని పత్తిపాక కాలనీకి చెందిన కాగితపు శ్రీను, రాధికల పెద్ద కూతురు స్రవంతి(13) గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. కాగా, పార్ట్‌టైమ్ పీఈటీ సంధ్యారాణికి చెందిన రూ.350 చోరీకి గురయ్యాయి. దీంతో సోమవారం రాత్రి ఆమె విద్యార్థినులందరినీ పిలిచి డబ్బులు తీసిన వారు తెల్లవారే సరికి అక్కడే పెట్టాలని.. లేదంటే బాగుండదని హెచ్చరించింది. మంగళవారం ఉదయం స్రవంతి వాంతులు చేసుకొని పడిపోయింది. వెంటనే జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో కొద్దిసేపటికే స్రవంతి మృతిచెందింది. కాగా, ఆమె పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. -
గ్రూప్–2 మెయిన్స్‌కు ఉచిత కోచింగ్
కర్నూలు(అర్బన్): జిల్లాలోని ఎస్సీ, బీసీ–సీ కులాలకు చెందిన అభ్యర్థులకు గ్రూప్–2 మెయిన్స్‌కు ఉచిత కోచింగ్‌ను ఇప్పించనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ప్రకాష్‌రాజు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కోచింగ్‌కు గ్రూప్–2 ప్రిలిమ్స్ పరీక్షలో ఎంపికైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రాయలసీమలోని నాలుగు జిల్లాల నుంచి 100 మంది అభ్యర్థులను ఎంపిక చేసి ఒకటిన్నర నెలల పాటు తిరుపతిలోని డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్, శ్రీ విద్య ఐఏఎస్ అకాడమీలో శిక్షణ ఇస్తామని తెలిపారు. దరఖాస్తు ఫారాలు, పూర్తి వివరాలను http;//www.chittor.ap.gov.in వెబ్సైట్లో పొందుపరిచామని పేర్కొన్నారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా పొందిన దరఖాస్తును పూర్తి చేసి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో ఈ నెల 31వ తేదిలోగా అందించాలన్నారు. అభ్యర్థులు జిల్లాకు చెందిన వారై ఉండాలని, కుటుంబ వార్షికాదాయం రూ.2 లక్షల లోపు ఉండాలన్నారు. దరఖాస్తుకు గ్రూప్–2 ప్రిలిమ్స్ హాల్ టికెట్ నెంబర్, పొందిన మార్కుల జాబితా నకలు, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు, తెల్లరేషన్ కార్డు/ ఆదాయ ధృవీకరణ పత్రం, విభిన్న ప్రతిభావంతులైతే 40 శాతానికి పైగా అంగవైకల్యం ఉన్నట్లు ధ్రువీకరణ పత్రాలను జతచేసి అందించాలన్నారు. -
టెన్త్ ప్రశ్నపత్రం తారుమారు
తొర్రూరు(పాలకుర్తి): పదో తరగతి పరీక్షల ప్రశ్నపత్రం తారుమారు చేసి, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో శుక్రవారం జరిగింది. టెన్త్ పరీక్షల్లో శుక్రవారం గణితశాస్త్రం రెండో పేపర్ జరిగిం ది. రోజు స్థానిక పోలీస్‌స్టేషన్ నుంచి ప్రశ్నపత్రాలను సంబంధిత పరీక్షా కేంద్రానికి అరగంట ముందు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడి అధికారులు గణితం ప్రశ్నపత్రానికి బదులుగా.. సాంఘికశాస్త్ర పేపర్‌ను తీసుకెళ్లారు. పాఠశాలలో ప్రశ్నపత్రం కట్టలను పరిశీలిస్తూ సంతకాలు చేస్తున్న సమయంలో జరిగిన తప్పు గుర్తించారు. వెంటనే ఆ ప్రశ్నపత్రాలను స్థానిక జెడ్పీ హైస్కూల్‌కు తీసుకెళ్లారు. అక్కడికి వచ్చిన జిల్లా ఇన్చార్జి డీఈవో శ్రీనివాసాచారి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే జెడ్పీ హైస్కూల్లో అదనంగా ఉన్న గణితం ప్రశ్న పత్రాన్ని ఇచ్చి పంపించారు. అప్పటికే 10 నిమిషాలు ఆలస్యం కాగా, పరీక్ష ప్రశాంతంగా జరిగేలా చూశారు. కాగా, ప్రశ్నప్రతం తారుమారయ్యేందుకు నెల్లికుదురు మండలం మేతరాజుపల్లి జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు రమేష్‌బాబు, మరిపెడ మండలం సీతారాంపూర్ స్కూల్ అసిస్టెంట్ రామ్మోహన్, తొర్రూరు జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం వేణుమాధవరెడ్డి, నర్సింహులపేట మండలం పెద్దనాగారం జిల్లా పరిషత్ హెచ్ఎం కె.రమేశ్‌లను బాధ్యులను చేస్తూ.. వారిని సస్పెండ్ చేశారు. -
చంద్రబాబు కరుణ కోసం..
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడంలో, స్వామిభక్తిని ప్రదర్శించడంలో మిగతా మంత్రులందర్నీ రావెల కిశోర్‌బాబు మించిపోయారు. రాష్ట్ర స్థాయి సంక్రాంతి వేడుకలను ఇందుకు వేదిక చేసుకున్నారు. శుక్రవారం విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాలులో సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు నాలుగు చరణాలతో కూడిన ఓ పాట రాసి ఓ బాలికతో పాడించారు. ఈ పాటలో చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. పాట విన్న ముఖ్యమంత్రి తనలో తాను మురిసిపోయారు. పాటను ఫ్రేమ్ కట్టించి సీఎంకు మంత్రి రావెల అందించారు. ఈ తతంగం చూసిన మిగిలిన మంత్రులు విస్తుపోయారు. -
కల్యాణలక్ష్మికి నిధుల మోక్షం
రూ. 34.15 కోట్లు విడుదల చేసిన సాంఘిక సంక్షేమ శాఖ సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత తొలిసారిగా కల్యాణలక్ష్మి పథ కానికి నిధులు విడుదలయ్యా యి. రాష్ట్రవ్యాప్తంగా 68 రెవెన్యూ డివిజినల్ అధికా రుల ఖాతాలకు రూ.34.15 కోట్లు విడుదల చేస్తూ ఎస్సీ అభివృద్ధి శాఖ రాష్ట్ర సంచాలకులు పి.కరుణా కర్ ఉత్తర్వులు జారీ చేశారు. కల్యాణలక్ష్మి పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ బాధ్యత ను ప్రభుత్వం ఆర్డీవోకు అప్పగించిన సంగతి తెలిసిందే. ఆర్డీవోలు పీడీ అకౌంట్ ద్వారా లబ్ధిదారులకు నిధులు విడుదల చేస్తారు. ప్రస్తుతం నిధులు విడుదల చేసినప్పటికీ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ మాత్రం నత్తనడకన సాగుతోంది. దీంతో ఈ నిధులను లబ్ధిదారులకు ఇప్పట్లో పంపిణీ చేసే అవకాశం లేదు. రాష్ట్రవ్యాప్తంగా కల్యాణలక్ష్మి పథకానికి సంబంధించి 40 వేల దరఖాస్తులు పెండిం గ్లో ఉన్నాయి. వీటి పరిశీలన పూర్తికి కనిష్టంగా రెండు నెలలు పడుతుందని అధికారులు చెబుతు న్నారు. ఈలోపు నిధుల పంపిణీ మరింత నెమ్మదిం చనుంది. దీంతో ఆర్థిక సాయం కోసం లబ్ధిదారులు రెండు నెలలపాటు వేచిచూడాల్సిందే. -
ముగిసిన వార్డెన్ల కౌన్సెలింగ్
– 19 మందికి పోస్టింగ్‌లు కర్నూలు(అర్బన్): సాంఘిక సంక్షేమశాఖలో నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న 19 మంది వసతి గృహ సంక్షేమాధికారులకు ఎట్టకేలకు పోస్టింగ్‌లు ఇచ్చారు. శనివారం ఉదయం సంక్షేమభవన్‌లోని డీడీ చాంబర్లో సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు యు. ప్రసాదరావు, బీసీ సంక్షేమాధికారి డి. హుసేన్‌సాహెబ్ ఆధ్వర్యంలో వసతి గృహ సంక్షేమాధికారులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అంతుకు ముందు జరిగిన సమావేశంలో డీడీ మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశాల మేరకు తమ శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న ప్రీ మెట్రిక్, కళాశాల వసతి గృహాలతో పాటు, బీసీ సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న వసతి గృహాలకు పోస్టింగ్‌లు ఇస్తున్నామన్నారు. ఖాళీలన్నింటిని ముందుగానే తెలియజేశామని, సంబంధిత వార్డెన్లు తమకు ఇష్టమున్న హాస్టళ్లను ఎంపిక చేసుకొని ఇచ్చిన ప్రొఫార్మలో ఆప్షన్లు ఇవ్వాలన్నారు. ఇచ్చిన ఆప్షన్ల మేరకు ఉద్యోగంలో చేరిన తేదీ ఆధారంగా హాస్టళ్లను కేటాయిస్తామన్నారు. కౌన్సెలింగ్ నిర్వహించిన జాబితాను జిల్లా కలెక్టర్‌కు ఆమోదం కోసం పంపుతామన్నారు. తుది నిర్ణయం కలెక్టర్ తీసుకుంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌డబ్ల్యూఓ ప్రకాష్‌రాజు, ఎస్సీ హెచ్‌డబ్ల్యూఓస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీరామచంద్రుడు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జెడ్ దొరస్వామి, కే బాబు, కోశాధికారి రాముడు తదితరులు పాల్గొన్నారు. -
రెసిడెన్షియల్ కాలేజీలుగా ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్
ఏలూరు రూరల్ : రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ వసతిగృహాలను రెసిడెన్షియల్ కళాశాలలుగా మార్పు చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. శుక్రవారం ఏలూరు ఇండోర్ స్టేడియంలో జరిగిన చంద్రన్న దళితవాడ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ భవిష్యత్‌లో రూ.12 వేల కోట్లతో ఎస్సీ, ఎస్టీ ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ కోట్ల రూపాయలతో ఎస్సీ వాడల్లో రోడ్లను సీసీ రహదారులుగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. డీఆర్డీవో ద్వారా రూ. 6.75 కోట్లు, మెప్మా ద్వారా రూ. 5 కోట్ల విలువైన రుణాలను లబ్ధిదారులకు అందజేశారు. డుమ్మా కొట్టిన ప్రజాప్రతినిధులు మంత్రి సభకు స్థానిక ప్రజాప్రతినిధులు డుమ్మా కొట్టారు. సభ ప్రాంగణానికి మంత్రి రావెల వచ్చి గంటల పాటు వేచి చూసినప్పటికీ ఎంపీ మాగంటి బాబు, ఏలూరు, దెందులూరు ఎమ్మెల్యేలు బడేటి బుజ్జి, చింతమనేని ప్రభాకర్ రాలేదు. దీంతో ఆయన మంత్రి సుజాతతో కలిసి సభను అయ్యిందనిపించారు. ఎమ్మెల్సీ రాముసూర్యారావు, ఎమ్మెల్యేలు గన్ని వీరాంజనేయులు, వేటుకూరి శివరామరాజు, కలెక్టర్ కాటంనేని భాస్కర్, నగర మేయర్ షేక్ నూర్జ్జహాన్ తదితరులు పాల్గొన్నారు. -
అరచేతిలో సమాచారం
మణికొండ: సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు పాఠ్యాంశాలకు సంబంధించిన అదనపు సమాచారం అరచేతిలో ఉంటుందని ఆ శాఖ రాష్ట్ర కమిషనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం నార్సింగ్ గురుకుల పాఠశాలలో మూడు స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ కియోస్క్‌లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏటీఎంల తరహాలో ఇవి పాఠశాలల ఆవరణలో 24 గంటలూ అందుబాటులో ఉంటాయన్నారు. గూగుల్‌లో వెతికినట్టు వెతికితే పాఠ్యాంశానికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు, యానిమేషన్లు విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయన్నారు. ఎక్కువ సమాచార సేకరణతో పాటు... పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించేందుకు ఇవి దోహద పడతాయని పేర్కొన్నారు. టచ్సీ్క్రన్ రూపంలో ఇవి పని చేస్తాయన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో ఇలాంటివి ప్రవేశపెడతామన్నారు. పరిరక్షించుకుందాం: పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరం పాటుపడాల్సిన అవసరం ఉందని సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల రాష్ట్ర కమిషనర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం నార్సింగ్ గురుకుల పాఠశాలలో ఢిల్లీకి చెందిన టెరీ యూనివర్సిటీ విద్యార్థులు పర్యావరణంపై నిర్వహించిన అవగాహన సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవుల సంరక్షణతో పాటు వాతావరణ కాలుష్యం లేకుండా చూసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నార్సింగి, షేక్‌పేట్, మహీంద్రాహిల్స్, ఇబ్రహీంపట్నం కళాశాలలకు చెందిన 120 మంది విద్యార్థులు, గురుకుల సంస్థ ప్రాంతీయ సమన్వయకర్త ఏవీ రంగారెడ్డి, నార్సింగ్ ప్రిన్సిపాల్ ధనలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ అనిత తదితరులు పాల్గొన్నారు. -
అంటరానితనానికి విరుగుడు ఉన్నత విద్యే మార్గం
ఇప్పటికీ అనేక గ్రామాల్లో అంటరానితనం ఉందని, దీన్ని రూపుమాపాలంటే ఉన్నత విద్య అభ్యసించడమే మార్గమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు అన్నారు. అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద విదే శాల్లో విద్యనభ్యశించేందుకు ఎంపికైన విద్యార్థులతో సోమవారం విజయవాడలో నిర్వహించిన ముఖాముఖిలో మంత్రి రావెల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్, పీజీ ఇతర ప్రొఫెషనల్ కోర్సులు చదివేందుకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం మంచి అవకాశమని, దీనిని ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ పథకం ద్వారా ఉన్నతులుగా మారటమే కాకుండా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు తమ కుటుంబ నేపథ్యాలను వివరించారు. కాగా, ఇప్పటివరకు ఈ పథకం కింద 190 మంది విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లారు. ఇప్పుడు మరో 21 మంది విద్యార్థులు వెళ్లనున్నారు. ఈ పథకానికి ఎంపికైన వారిలో అత్యధికంగా కృష్ణా జిల్లా నుంచి 38 మంది, గుంటూరు నుంచి 48, ప్రకాశం నుంచి 26 మంది విద్యార్థులున్నారు. ఇంజనీరింగ్‌తో పాటు పీజీ, పీహెచ్డీ, మేనేజ్మెంట్, ఫ్యూర్ సెన్సైస్, ఆర్ట్ సెన్సైస్, సోషల్ సెన్సైస్, హ్యుమానిటీస్, ఎంబీబీఎస్, పీజీ డిప్లొమా, నర్సింగ్ సర్టిఫికెట్ కోర్సులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేశారు. -
ఏసీబీకి చిక్కిన సంక్షేమ శాఖ ఈఈ
నల్లగొండ: సాంఘీక సంక్షేమ శాఖలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్‌గా పని చేస్తున్న ఎ. నాగశేషు ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. ముందస్తు సమాచారంతో కార్యాలయానికి వచ్చిన ఏసీబీ అధికారులు.. నాగశేషు కాంట్రాక్టర్ నుంచి రూ. 27 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదనపు సమాచారం కోసం విచారణ చేపడుతున్నారు. -
రాష్ట్రంలో 259 కోట్ల నిధులతో గురుకుల పాఠశాలల అభివృద్ధి
– మంత్రి పీతల సుజాత చింతలపూడి: రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం 259 కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర స్త్రీ శిశుసంక్షేమ శాఖామంత్రి పీతల సుజాత తెలిపారు. చింతలపూడిలో 80 లక్షల వ్యయంతో నిర్మించిన సాంఘిక సంక్షేమశాఖ బాలుర వసతి గృహాన్ని మంత్రి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఈ నిధులతో గురుకుల పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగు పరిచి వసతి గృహాల్లో నివసిస్తున్న విద్యార్ధులను వాటిల్లోకి మార్పు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 17 వేల మంది పిల్లలను వసతి గృహాల నుండి గురుకులాల్లోకి మారుస్తున్నట్లు చెప్పారు. అవినీతి, అక్రమాలకు తావులేకుండ పిల్లలకు సేవలు అందించాలని సూచించారు. వసతి గృహాల పిల్లలకు నాణ్యతతో ఆహారం అందించాలని ఆదేశించారు. 12 కోట్లతో నిర్మిస్తున్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వసతిగృహాల నిర్మాణ పనులు నిలిచి పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే కాంట్రాక్టర్‌కు 4 కోట్లు చెల్లించామని మిగిలిన నిధులను విడుదల చేయించడానికి సిఎం చంద్రబాబు దష్టికి తీసుకు వెళతానని చెప్పారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి మంత్రి పూలమాలవేసి నివాళులర్పించారు. వసతి గృహం ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో సోషల్ వెల్పేర్ డిప్యూటీ డైరెక్టర్ రంగలక్ష్మీ దేవి, జంగారెడ్డిగూడెం డీఎస్పి వెంకట్రావు, జెడ్పిటీసీ టి రాధారాణి, ఎంపీపీ దాసరి రామక్క, తహశీల్దార్ మైఖేల్‌రాజ్, ఎంపీడీఓ ఎం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
‘సంక్షేమం’లో అక్రమాలు !
బదిలీ చేసినా విధుల్లో చేరని ఉద్యోగులు సంవత్సర కాలంగా పొందుతున్న వేతనాలు వర్కర్ల జీతాల్లో అధికారులకు వాటాలు అంతా ఓకే అంటున్న డీడీ... ఇదీ దళిత సంక్షేమ శాఖ పరిస్థితి హన్మకొండ అర్బన్ : అక్రమాలకు పాల్పడితే ఎలాగైనా సంపాదింవచ్చనడానికి జిల్లా సాఘిక సంక్షేమ శాఖ ఉదాహరణగా నిలిచింది. ఈ శాఖలో అధికారుల చేయి తడిపితే.. కిందిస్థాయి వార్డెన్లు ఆడింది ఆట... పాడింది పాట అన్నట్లుగా ఉంది వ్యవహారం. జిల్లాలోని కొన్ని హాస్టళ్లలో గత ఏడాదిన్నరగా పని చేయకున్నా వర్కర్లకు వేతనాలు ఇస్తున్నారు. ఇందుకు గాను ఒక్కొక్కరి నుంచి ఉన్నతాధికారులు ముందుగానే నెలకు రూ.ఐదు వేల చొప్పున వసూలు చేస్తున్నారు. వార్డెన్ల విషయంలోనూ ఇదే తంతు. అయితే ఉన్నతాధికారులు మాత్రం అలాంటిది ఏమీ లేదని, ఆంతా ఓకే అని చెప్పడం గమనార్హం. పిల్లలు లేక మూతపడిన హాస్టళ్లు.. సాంఘిక సంక్షేమ శాఖ స్టేషన్‌ఘన్‌పూర్ ఏఎస్డబ్ల్యూఓ పరిధిలోని తాటికొండ, మల్కాపూర్, స్టేషన్‌ఘన్‌పూర్, వేలేరు, ధర్మసాగర్ హాస్టళ్లను పిల్లలు లేరనే కారణంతో గత విద్యాసంవత్సరం మూసివేశారు. ఆయా హాస్లళ్లలో ఒక్కో వార్డెన్, ముగ్గురు వర్కర్ల చొప్పున ఉన్నారు. వీరందరినీ ఖాళీ ఉన్న ప్రాంతాల్లో సర్దుబాటు చేశారు. వాచ్మెన్లను మాత్రం మూసేసిన హాస్టళ్లకు రక్షణగా ఉంచి మిగతా వారిని ఇతర ప్రదేశాలకు బదిలీ చేశారు. ఇక్కడే కథ మొదలైంది.. దూర ప్రాంతాలకు బదిలీ చేయడంతో వారు విధుల్లో చేరలేదు. అయితే నెల వచ్చే సరికి జీతాల సమస్య ఏర్పడడంతో వార్డెన్లు, వర్కర్లు కలిసి ఒక అవగాహనకు వచ్చారు. కొత్త స్థానాల్లో చేరకుండానే ప్రతినెలా వేతనాలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఇందుకు ప్రతిఫలంగా ఒక్కో వర్కర్ నుంచి వార్డెన్లు నెలకు రూ.5 వేలు వసూలు చేస్తున్నారని, ఇందులో కొంత మెుత్తం ఉన్నతాధికారులకు సైతం అందుతోందని సమాచారం. ఇలా పనిచేయకుండానే మూడు హాస్టళ్లలోని ఆరుగురు వర్కర్లు ఏడాదిన్నరగా వేతనాలు తీసుకుంటున్నారు. వార్డెన్లదీ అదే పరిస్థితి... స్టేషన్‌ఘన్‌పూర్ ఏఎస్డబ్ల్యూఓ పరిధిలో మూతపడిన మల్కాపూర్, వేలేరు, ధర్మసాగర్ హాస్టళ్ల వార్డెన్లు ఖాళీగానే ఉంటున్నా ఇంతకాలం కూర్చోబెట్టి వేతనాలు ఇచ్చారు. ఇంకా ఎక్కువ కాలం అలాగే చెల్లిస్తే బాగుండదనుకున్నారో ఏమో.. నగరంలో ఇటీవలే ఏర్పాటు చేసిన కాలేజీయేట్ హాస్టళ్లలో వారికి బాధ్యతలు అప్పగించారు. ఇక స్టేషన్‌ఘన్‌పూర్‌లో మూసేసిన ఎస్సీ హాస్టల్ వార్డెన్దీ ఇదే పరిస్థితి. ఈయనను కూడా నగరంలోని ఓ హాస్టల్లో కేటాయించారు. నవాబ్‌పేట వార్డెన్‌కు ఇంతకాలం ఏపనీ లేకున్నా బీసీ సంక్షేమ శాఖ హాస్టల్‌కు ఇన్చార్జ్గా ఉన్నారని చూపిస్తూ ఎస్సీ సంక్షేమ శాఖ వేతనం ఇస్తోంది. తాజాగా ఆయనకు కూడా నగరంలో ఒక కాలేజీ హాస్టల్ అప్పగించారు. వాటాల్లో తేడాలతో వెలుగులోకి.. వర్కర్లు పని చేయకుండానే వేతనం తీసుకున్న సమయంలో ఉన్నతాధికారులకు అందులో వాటా అందింది. తాజాగా వేతనాల్లో వాటా విషంయలో వర్కర్లు, అధికారులకు మధ్య తేడాలు రావడంతో వ్యవహారం ఓ మధ్యవర్తి వద్దకు చేరింది. ఈ దందా మొత్తం బయట పడితే అసలుకే ఎసరొస్తుందని భావించిన అధికారులు.. ఆంతా కలిసి ఓ అంగీకారానికి రావాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం గత శుక్రవారం కలెక్టరేట్లోని శాఖ కార్యాలయంలో అధికారుల సమక్షంలో పంచాయితీ తీర్మానం చేసుకోవాలనుకున్నారు. అయితే అంతలోనే అధికారికి, వర్కర్లకు మధ్య నెలవారీ చెల్లింపుల విషయంలో గొడవ తీవ్రం కావడంతో విషయం రచ్చకెక్కింది. ఎక్కడివారు అక్కడే పనిచేస్తున్నారు – అంకం శంకర్, ఎస్సీ వెల్ఫేర్ డీడీ స్టేషన్‌ఘన్‌పూర్ పరిధిలోని కొన్ని హాస్టళ్లు గత సంవత్సరం మూతపడ్డాయి. వాటిలో పనిచేసే వర్కర్లను వెంటనే ఇతర ప్రాంతాల్లో ఖాళీలు ఉన్నచోటకు సర్దుబాటు చేశాం. వారంతా కొత్త ప్రదేశాల్లో చక్కగా పనిచేస్తున్నారు. ఒకరిద్దరు చేరకపోతే మెమోలు కూడా ఇచ్చినట్లు గుర్తుంది. ప్రస్తుతం ఆంతా బాగానే ఉంది. -
దరఖాస్తుకు గడువు పెంపు
కర్నూలు సిటీ: ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇబీసీ, డిజెబుల్డ్, మైనార్టీ విద్యార్థులు 2016–17 సంవత్సరానికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిపుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువు పెంచినట్లు సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే వావారికి వచ్చే నెల 15లోపు, రెన్యూవల్ చేసుకునే వారికి ఈ నెల 31 వరకు గడువు పెంచారు. దరఖాస్తూలను http://apepass.cgg.gov.in లో పొందవచ్చు. -
తెలంగాణ సచివాలయంలో ఉద్రిక్తత
-
తెలంగాణ సచివాలయంలో ఉద్రిక్తత
హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మహిళా ఉద్యోగులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, వేధింపులకు గురిచేస్తున్నాడని సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి మహేశ్ దత్ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాసరావుపై ఉద్యోగులు చేయిచేసుకున్నారు. అతడిని సీట్లో నుంచి బయటకు లాక్కొచ్చి ఆందోళన చేశారు. అవినీతికి పాల్పడటమే కాకుండా తమను వేధిస్తున్నాడని, అటెండర్ నుంచి పై స్థాయి ఉద్యోగులపైనా అతడి వేధింపులు ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. సర్వీసులు, సెలవులకు సంబంధించి కూడా ఆయన వేధిస్తున్నాడని చెప్పారు. గత కొద్ది రోజులుగా పద్దతి మార్చుకోవాలని చెబుతున్నా అతడు తీరు మార్చుకోకపోవడంతో తాము నేడు చేయిచేసుకున్నామని వారు అంటున్నారు. అయితే, ఉద్యోగుల విభజన అంశమే వివాదానికి దారి తీసిందని సచివాలయ వర్గాలు అంటున్నాయి. శ్రీనివాసరావుది ఆంధ్రప్రదేశ్ స్థానికత అని చెప్తున్నారు. -
ఫీజు రీ యింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోండి
కడప కోటిరెడ్డి సర్కిల్: అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులు 2016–17 సంవత్సరానికి ఉపకార వేతనాలు ఫీజు రీ యింబర్స్‌మెంట్ కోసం ఈ పాస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు సరస్వతి తెలిపారు. ఇప్పటి వరకు ఈ పాస్ వెబ్సైట్లో 2539 మంది రెన్యువల్ విద్యార్థులు, తాజాగా 23 మంది విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని ఆమె తెలిపారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ ఆగస్టు నెల 15వ తేదీ అన్నారు. -
కళాశాలలు రిజిస్టర్ చేసుకోవాలి
కడప కోటిరెడ్డి సర్కిల్: సాంఘిక సంక్షేమ శాఖలో ఈ పాస్ వెబ్సైట్లో 2016–17 సంవత్సరానికి కళాశాలలు రిజిస్టరు చేసుకునేందుకు ఈ నెల 31 వరకు అవకాశం కల్పించామని సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు సరస్వతి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 413 ప్రభుత్వ, ప్రయివేటు, డిగ్రీ ఇతర వృత్తి కళాశాలలు ఉన్నాయన్నారు. వాటిలో 299 కళాశాలల వారు రిజిస్టర్ చేసుకొన్నారని, ఇంకా 114 కళాశాలలు రిజిస్టర్ చేసుకోలేదని వీరంతా ఈ నెల 31వ తేదీ లోపల రిజిస్టర్ చేసుకోవాలని ఆమె కోరారు. రిజిస్టర్ చేసుకున్న హార్డ్ కాపీలను ఆమోదం కోసం ఉప సంచాలకులు సాంఘిక సంక్షేమశాఖ వారికి సమర్పించాలన్నారు. -
సందిగ్ధంలో చదువులు
నిక్షేపంలా ఉన్న హాస్టళ్లను ఎత్తేయాలని సర్కారు యోచించింది. ఇందుకోసం ఉత్తర్వులు విడుదల చేయకున్నా... మౌఖికంగా ఎవరినీ చేర్చుకోవద్దని ఆదేశాలిచ్చింది. అందులో చదువుతున్న పిల్లల్ని ఏంచేయాలన్నదానిపై స్పష్టత కనిపించలేదు. ఇప్పుడు ఆ పిల్లలు ఎక్కడ చదవాలన్నదానిపై సందిగ్ధం నెలకొంది. ఇలా పేదపిల్లల చదువులతో సర్కారు ఆటల్ని అంతా ఖండిస్తున్నారు. బొబ్బిలి : జిల్లాలోని 13 సాంఘిక సంక్షేమ వసతి గృహాలను ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఆయా హాస్టళ్లలో ఎవరినీ చేర్చుకోవద్దంటూ మౌఖికంగా ఆదేశాలిచ్చింది. కానీ ఇప్పటికీ ఉత్తర్వులైతే అధికారికంగా విడుదల కాలేదు. ఇదే ప్రస్తుతం అక్కడి విద్యార్థుల చదువులను ప్రశ్నార్థకం చేస్తోంది. హాస్టల్ మూసేస్తే ఇప్పటివరకూ అందులో ఉన్న పిల్లల్ని ఎక్కడకు తరలించాలో తెలీక వార్డెన్లు సతమతమవుతున్నారు. ఇక్కడినుంచి తరలించాక వారికి పాఠశాలలు అందుబాటులో ఉంటాయో లేవోనని పిల్లలు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. క్రమేపీ హాస్టళ్ల మూసివేత ఇప్పటికే గత ఏడాది జిల్లాలో మొత్తం 11 హాస్టళ్లను మూసివేశారు. ఈ ఏడాది 13 వసతి గృహాలను ఎత్తివేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక మిగిలిన వాటిని రెండేళ్లలో మూసేయాలని అప్పుడు సర్కారుకు ప్రతిపాదనలు కూడా వెళ్లాయి. ఈ ఏడాది ఎత్తేవేసే వసతి గృహాలకు సంబంధించి ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ఏ క్షణాన్నైనా అదేశాలు వస్తే మధ్యలో పాఠశాలలు మారినప్పుడు ఇబ్బందులు వస్తాయని విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. సందిగ్ధంలో నాలుగో తరగతి ఉద్యోగులు ప్రతీ వసతి గృహంలో నలుగురు ఉద్యోగులు ఉంటారు, వారిలో మేట్రిన్, వార్డెన్లు ఉద్యోగులు కాగా, మిగిలిన ముగ్గురు ఔట్ సోర్సింగు -
చేర్యాల గురుకులంలో ర్యాగింగ్
విద్యార్థి కిరణ్‌కు గాయాలు గొడవను ఆపబోయిన వైస్ ప్రిన్సిపాల్‌ను పక్కకు నెట్టేసిన సీనియర్లు చేర్యాల : పట్టణంలోని సాంఘిక సంక్షేమ గు రుకుల పాఠశాలలో సీనియర్ విద్యార్థులు జూ నియర్లను ర్యాగింగ్ చేసిన ఘటనలో ఓ విద్యార్థికి తీవ్ర గాయూలయ్యూరుు. స్థానికుల కథనం ప్రకారం..జూనియర్ విద్యార్థి టి.కిరణ్ పాఠశా ల ఆవరణలో నడుచుకుంటూ వెళ్తుండగా సీని యర్ విద్యార్థులు పృథ్వి, అనిల్, శ్రీధర్, శ్యాం లు పిలిచి ర్యాగింగ్ చేశారు. వీపుపై కొట్టడంతో కిరణ్‌కు గాయూలయ్యూరుు. వీరి గొడవను ఆపడానికి యత్నించిన వైస్ ప్రిన్సిపాల్ వి.శ్రీనివాస్‌ను విద్యార్థులు పక్కకు నెట్టివేశారు. కిరణ్‌ను కొట్టొదంటూ అడ్డుకోబోరుున మరో ఇద్దరు విద్యార్థులను సైతం గాయపరిచారు. గాయూలపాలైన కిరణ్‌ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేరుుంచారు. అతడిని ఎమ్మార్పీఎస్ నాయకులు మాదాసు యాదగిరి, తెలంగాణ షెడ్యూల్డ్ కులాల హ క్కుల పరిరక్షణ సమితి నాయకులు బుట్టి భిక్షపతి, కాటం శ్రీనివాస్‌లు పరామర్శించారు. విద్యార్థులను ర్యాగింగ్ పేరుతో వేధిస్తున్న సీనియర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఇదంతా రవళి చేసిందని ఎలా తెలిసింది?
గజ్జెల గజ్జి! మతాల గజ్జి... కులాల గజ్జి మనకు తెలిసినవే! కానీ... ఈ గజ్జెల గజ్జి ఏంటి? ఇది పెద్దవాళ్ల గొడవల గజ్జి... దానిని పిల్లలకూ అంటించారు. గజ్జెలకు తగిలిన ఆ అసూయ పిల్లలకూ పాకింది. వికసించే మనసులలో లయతప్పిన ఈ ధ్వనులు రాక్షస తాండవమాడాయి! అది సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల. వేసవి సెలవుల తర్వాత జూన్ నెలలో మళ్లీ పాఠశాల ప్రారంభమైంది. ఆరవ తరగతికి కొత్త బ్యాచ్ విద్యార్థుల నమోదు జరుగుతోంది. పాత పిల్లలు ఇంకా అందరూ రాలేదు. వారాంతానికి అందరూ దిగుతారు. అప్పటికే వచ్చిన వాళ్లలో కొత్త క్లాసుకెళ్తున్న ఉత్సాహం కనిపిస్తోంది. ‘‘కొత్త పుస్తకాలు ఎప్పుడిస్తారు మేడమ్’’ అని టీచర్లను అడుగుతున్నారు. ‘‘ఈ శనివారానికంతా వచ్చేస్తాయి. సోమవారం మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అప్పటి వరకు రఫ్ నోట్‌బుక్‌లో రాసుకోండి. మీ పాతటెక్ట్స్బుక్స్ పారేయకండి. మధ్యలో ఎవరైనా పుస్తకాలు పోగొట్టుకుంటే పనికొస్తాయి’’ అని టీచరు చెప్పేలోపే ‘‘కొత్త యూనిఫామ్ కూడా ఆ రోజే ఇస్తారా’’ ప్రశ్నలతో ముంచెత్తుతున్నారు. సిక్త్స్ క్లాసు నుంచి సెవెన్త్ కెళ్తున్న రూపను వాళ్ల అమ్మానాన్నలు తీసుకొచ్చారు. రూప బుగ్గల మీద కన్నీళ్లు చారికలు కడుతున్నాయి. అలాగే రూప చేయి పట్టుకుని ప్రిన్సిపల్ గదిలోకి తీసుకెళ్లారు. రిపోర్టు చేసి బయటకు వచ్చేశారు. రూప మాత్రం వాళ్ల అమ్మ కొంగు పట్టుకుని ఉంది. రూపకు కేటాయించిన గదికి వెళ్లడానికి ముందు ఓ పక్కగా నిలబడి ఉన్నారు ముగ్గురూ. ‘‘ఇక్కడ నేనుండనమ్మా’’ అని గునుస్తోంది రూప. ‘‘ఏం కాదమ్మా! చూడు అందరూ ఇక్కడ ఉండి చక్కగా చదువుకుంటున్నారు. మనూళ్లో పెద్ద బడి లేదు కద తల్లీ’’ అనునయిస్తోంది రూప తల్లి. ఇంటి నుంచి వచ్చినప్పుడు ఇదంతా మామూలే, రెండు రోజుల్లో పిల్లలు మామూలైపోతారు... అన్నట్లు అక్కడి టీచర్లు తమ వ్యాపకాల్లో నిమగ్నమయ్యారు. ఓ అరగంట గడిచిందో లేదో... రూప ఏడుపు వినిపించింది. టీచర్లు పరుగున వచ్చారు. రూప వాళ్ల అమ్మ కొంగును తన చేతికి గట్టిగా చుట్టుకుంటోంది. వదిలితే ఎక్కడ వెళ్లిపోతారేమోనన్న భయం ఆ కళ్లలో. ‘‘పిల్లలకు హోమ్‌సిక్‌నెస్ ఉంటుంది. మేము చూసుకుంటాం మీరు వెళ్లండి. దిగులు పడితే ఫోన్ చేయిస్తాం’’ అని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు టీచర్లు. అయినా వాళ్ల సంకోచం వదల్లేదు. రూప తల్లిని చుట్టేసుకుంది. ‘‘ఏమిటి ప్రాబ్లెమ్’’ అని ఓ టీచరు అడిగారు. తల్లి మెల్లగా నోరు విప్పింది... ‘‘మేడమ్! రాత్రిళ్లు పాపకు దెయ్యం కనిపిస్తోందట’’. టీచరు ఇబ్బందిగా చూసింది. ఇలాంటప్పుడు గద్దిస్తే పిల్లలు హడలిపోతారు. బుజ్జగించి నచ్చచెప్పాల్సిందే. రూపను దగ్గరకు పిలిచి... ‘‘దెయ్యం ఉందని నీకెలా తెలిసింది’’ అని అడిగారు. ‘‘నిద్రపోతుంటే పక్కనే గజ్జెల శబ్దం వినిపిస్తోంది’’ ‘‘మరి మిగిలిన వాళ్లకు వినపడదా’’ ‘‘ఉహూ... నాకు మాత్రమే మెలకువ వస్తోంది. ఎవరో కాలు మీద తట్టినట్లవుతోంది. లేచి చూస్తే ఎవరూ ఉండరు... గజ్జెల శబ్దం మాత్రం వినిపిస్తోంది’’. ఎలా నచ్చచెప్పాలా అని టీచర్ ఆలోచనలో పడ్డారు. తల్లి కొంగును గుంజుతూ ‘‘నేనుండనమ్మా’’... మళ్లీ మొదటికొచ్చింది రూప మారం. ఇంతలో మరో ఇద్దరు టీచర్లు చేరారు. ‘‘సరే, రూపా! వార్డెన్ మేడమ్ ఇక్కడే ఉంటారు. వాచ్‌మన్‌ను నీ బెడ్ దగ్గరే పడుకోమని చెప్తాను. నీకు గజ్జెల చప్పుడు వినిపించగానే అతడిని పిలువు’’ అని పాపకు ధైర్యం చెప్పి, తల్లితండ్రులకు నచ్చచెప్పి పంపించారు. అదే రోజు ఓ టీచరు అన్ని క్లాసులకెళ్లి ‘‘అందరూ కాలి పట్టీలు ఇచ్చేయండి’’ అని అడిగి తీసుకున్నారు. మరుసటి రోజు ఉదయానికి... రూప పుస్తకాలు చిందరవందరగా పడి ఉన్నాయి. కాగితాలను గట్టిగా లాగి చించినట్లున్నారెవరో. రూపకు ధైర్యం చెప్పి, ఏడుపు ఆపించి, స్కూలుకు పంపించేసరికి వార్డెన్‌కు చుక్కలు కనిపించాయి. ఆ రాత్రి రూపను క్లాస్ లీడర్ దగ్గర పడుకోబెట్టారు టీచర్లు. క్లాస్ లీడర్ ధైర్యమైన అమ్మాయి. రూపకు ధైర్యం చెప్తోంది. ఆ తర్వాతి రోజు తెల్లవారే సరికి... ‘‘రాత్రి కూడా గజ్జెల శబ్దం చెవిలో వినిపించింది’’ అని ఏడుపు లంకించుకుంది రూప. పిల్లలందరూ చుట్టూ చేరారు. రూపలో ఏదో తేడా కనిపిస్తోంది. ఏమిటా అని చూస్తే... జుట్టు కత్తిరించేసి ఉంది. అప్పటి వరకు ఆందోళన పడుతున్న ప్రిన్సిపల్కూ, టీచర్లకూ మబ్బు వీడిపోయినట్లయింది. వీలయినంత త్వరగా చెక్ పెట్టేయాలి. లేకపోతే స్కూలుకు చెడ్డపేరు వస్తుంది... అనుకున్నారు. అనుకున్నదే తడవుగా రహస్యంగా దర్యాప్తు మొదలైంది. ఎంత గుంభనంగా ఉంచాలనుకున్నా విషయం బయటకు పొక్కింది. ‘హాస్టల్లో దెయ్యం తిరుగుతోందట’ అంటూ మొదలైన పుకారు రకరకాల అనుబంధ కథనాలతో చిక్కదనం సంతరించుకుంటోంది. కొందరు తల్లిదండ్రులు పాఠశాలకొచ్చి ప్రిన్సిపల్‌తో గొడవ పడుతున్నారు. ‘ఇక ఆలస్యం కాకూడదు’ ప్రిన్సిపల్ నుంచి ఘాటుగా ఆదేశం. స్కూల్ స్టాఫ్ అంతా రంగంలోకి దిగింది. ప్రతి ఒక్కరూ తమకు తెలిసిన వారి ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. రూప గ్రామంలో తెలిసిన వారి ద్వారా కొంత ఆధారభూతమైన సంగతి తెలిసింది. దాంతో హాస్టల్లో శోధనకు ఆధారం దొరికినట్లయింది. గజ్జెల గుట్టు బయటపడింది. అప్పటి వరకు రూప చెవుల్లో మోగిన గజ్జెల చప్పుడు, స్టాఫ్ గుండెల్లో పరుగెత్తిన రైళ్ల చప్పుడు రెండూ ఆగిపోయాయి.(గోప్యత కోసం పేర్లు మార్చాం) - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఇదంతా రవళి చేసిందని ఎలా తెలిసింది? స్కూల్ స్టాఫ్ సేకరించిన సమాచారం ప్రకారం తర్జని రవళి వైపు చూపిస్తోంది. ఆ అమ్మాయి కదలికలను గమనించమని క్లాస్ లీడర్లకు చెప్పారు. రెండు రోజుల్లోనే ఆ అమ్మాయి కాలిపట్టీలు ఎక్కడ దాచిందో కనిపెట్టి తెచ్చి ఇచ్చారు. రోజూ వాటితో రూప చెవి దగ్గర, ఆమెకు మాత్రమే వినిపించేటట్లు శబ్దం చేసినట్లు రవళి ఒప్పుకుంది. ఏం జరిగిందంటే! రూప గ్రామానికి చెందిన మరొక అమ్మాయి రవళి కూడా అదే హాస్టల్లో ఉంటోంది. ఆ రెండు కుటుంబాలకు మధ్య మంచి సంబంధాలు లేవు. రవళి తల్లిదండ్రులు పిల్లల మధ్య కూడా కక్షలు పెరగడానికి కారకులయ్యారు. రూపను చదువుకోనివ్వకుండా హడలగొట్టి పంపేయాలనుకున్నారు. అందులో భాగంగానే రవళి తన కాలి పట్టీలతో రూప మంచం దగ్గర చప్పుడు చేయడం, పుస్తకాలు చించడం, జుట్టు కత్తిరించడం వంటివన్నీ చేసింది. మరి దెయ్యం భయం? పిల్లల్లో దెయ్యం భయం పోగొట్టడానికి కళాజాతాల సహకారం తీసుకున్నారు. వాళ్లు వర్క్‌షాప్ నిర్వహించి దెయ్యాలు, చేతబడులు ఉండవని కౌన్సెలింగ్ ఇచ్చారు. వెలుగుతున్న కర్పూరం నోట్లో వేసుకుని చూపించిన తర్వాత చాలా మంది అమ్మాయిలు తామూ చేస్తామని ముందుకొచ్చారు. ‘ఒక్కో బ్యాచ్‌కి కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తుంటే, మరుసటి ఏడాదికి కొత్త బ్యాచ్ మూఢవిశ్వాసాలను మూటగట్టుకుని వస్తుంటుంది. వీటికి తోడు చీకటంటే పిల్లలకు స్వతహాగానే భయం ఉంటుంది. దాంతో కనీసం రెండేళ్లకోసారైనా ఇలాంటి సందర్భం ఒకటి ఎదురవడం, ఆ పరిస్థితిని సున్నితంగా అధిగమించడానికి కత్తిమీద సాము చేయడం మాకు అలవాటే’నంటుంటారు సంక్షేమ పాఠశాలల టీచర్లు. ఏ చప్పుడు విన్నా భయపడతారు! ఈ సంఘటన నేను పుడూరులో ఉన్నప్పుడు జరిగింది. ఇది చాలా సంకట స్థితి. సంక్షేమ హాస్టళ్లకు వచ్చే వారిలో ఎక్కువ మంది అల్పాదాయ వర్గాల వాళ్లే ఉంటారు. వెనుకబాటుతనంతోపాటు వారి జీవనశైలిలో మూఢవిశ్వాసాలు కూడా పాదుకుని ఉంటాయి. దెయ్యాలు, చేతబడులు... అనే పదాలను పిల్లలు తరచు వింటుంటారు. వారు గ్రామం వదిలి హాస్టల్‌కు వచ్చినా కూడా విశ్వాసాల ప్రభావం అంత త్వరగా వదలదు. హాస్టల్ అంటే కొత్త ప్రదేశం. అమ్మానాన్నలు, సొంతవాళ్లెవరూ ఉండరు. ఆ గుబులు మనసులో గూడు కట్టుకుని ఉంటుంది. ఏం జరిగినా, ఏది విన్నా తాము నమ్ముతున్న విశ్వాసాలతో అన్వయించుకుని భయపడిపోతుంటారు. ‘‘దెయ్యం లేదు, ఏమీ లేదు, వెళ్లి పడుకోండి’’ అని గట్టిగా అంటే ఇంకా భయపడిపోతారు. అందుకే అనునయంగా చెబుతుంటాం. - తన్నీరు శశికళ, పి. జి. టి, గణితం, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, నాయుడుపేట సమన్వయం ఎలా! ఇద్దరి తల్లిదండ్రులకూ విషయం చెప్పి... పిల్లల మధ్య కక్షలు, కార్పణ్యాలు పెంచకూడదని, వారి మెదళ్లను కలుషితం చేయకూడని హితవు చెప్పారు టీచర్లు. రవళి పేరు బయటకు వస్తే ఆమెని దోషిగా చూస్తారని బయట పెట్టలేదు. స్నేహంగా ఉండకపోతే స్కూలు నుంచి పంపేస్తామని టీచర్లు భయపెట్టడంతో కొన్నాళ్లలోనే ఆ పిల్లలు కలిసిపోయారు. -
పాలన పల్లెలకు చేరాలి
రాజధానికే పరిమితం కారాదు కార్యాలయాల్లో దళారుల వ్యవస్థను నిర్మూలించండి జిల్లా ఇన్చార్జ్ కార్యదర్శులకు సీఎం సూచన బెంగళూరు: జిల్లాల ఇన్చార్జ్ కార్యదర్శులు రాజధానిలోని కార్యాలయాలకు మాత్రమే పరిమితం కాకుండా గ్రామీణుల చెంతకు సంక్షేమ కార్యక్రమాలను చేరువ చేసే దిశగా పనిచేయాలని సీఎం సిద్ధరామయ్య సూచించారు. జిల్లా స్థాయిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ అధికారుల పనితీరును పర్యవేక్షించినప్పుడే అధికారులు మరింత బాధ్యతాయుతంగా పనిచేసేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మంగళవారమిక్కడి విధానసౌధలో జిల్లాల ఇన్చార్జ్ కార్యదర్శుల సమావేశంలో సీఎం సిద్ధరామయ్య మాట్లాడారు. ‘కలెక్టర్లు, జిల్లా సీఈఓలుగా పనిచేసిన అనుభవం ఉందన్న కారణంతోనే మిమ్మల్ని జిల్లా ఇన్చార్జ్ కార్యదర్శులుగా నియమించాము. మీ అనుభవాన్ని ఉపయోగించి ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా దృష్టి సారించండి. తద్వారా పాలన వేగవంతం కావడంతో పాటు పాలనా వ్యవహరాల్లో మరింత పారదర్శకతను తీసుకురావచ్చు’ అని సూచించారు. ఇక ఇదే సందర్భంలో ప్రతి నెలా జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. సరిగ్గా విధులు నిర్వర్తించని ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేయాలని, అప్పుడే ఇతర ఉద్యోగుల్లోనూ భయం వస్తుందని పేర్కొన్నారు. ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ‘దళారుల’ ప్రాబల్యం పెరిగిపోతోందని ఆరోపణలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయని, అందులోనూ తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, సాంఘిక సంక్షేమ శాఖ, గృహ నిర్మాణ శాఖ కార్యాలయాల్లో ఇది మరింత విస్తరించిందనే ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో కార్యాలయాల్లో దళారులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయండి..... మైసూరు మహారాణి కాలేజీ హాస్టల్లోని విద్యార్థినుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్ పురుషోత్తమ్‌ను తక్షణమే సస్పెండ్‌చేయాలని ఉన్నత విద్యా శాఖ ప్రధాన కార్యదర్శి భరత్‌లాల్ మీనాను సీఎం సిద్ధరామయ్య ఆదేశించారు. ‘ఇటీవల నేను మైసూరులో పర్యటించినపుడు మైసూరు మహారాణి కాలేజీ హాస్టల్లోని ఓ విద్యార్థిని తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి కన్నీరు పెట్టుకుంది. అక్కడ నెలకొన్న అవకతవకలపై పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక అందజేయండి. మూడేళ్లలో అతను విద్యార్థినుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని రికవరీ చేసి తిరిగి విద్యార్థినులకు అందజేయండి’ అని అధికారులను ఆదేశించారు. -
సాంఘిక సంక్షేమశాఖలో బదిలీలు కరువు
► గత మూడేళ్లుగా ఇన్‌చార్జీలే దిక్కు ► కల్పించని పదోన్నతులు ఖాళీ పోస్టుల భర్తీ ఎప్పుడో చెన్నూర్ : జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖలో మూడేళ్లు నుంచి సాధారణ బదిలీలు కరువయ్యాయి. ఇన్చార్జి వార్డెన్లతోనే హాస్టళ్ల నిర్వహణ సాగుతోంది. సీనియార్టీ ఉన్న వార్డెన్లకు పదోన్నతులు లేక ఏళ్లు గడుస్తున్నాయి. వారి బదిలీల గురించి ప్రభుత్వం సైతం ఆలోచించడం లేదని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రెండేళ్లకు ఒక్కసారి సాధారణ బదిలీలు నిర్వహించాల్సిన ప్రభుత్వం మూడేళ్లుగా బదిలీలు చేయకపోవడంతో ఉద్యోగులు ఒకే చోట ఏళ్ల తరబడి పనిచేస్తున్నారు. ఖాళీగా ఉన్న వార్డెన్ పోస్టులను భర్తీ చేయకపోవడంతో జిల్లాలో 75 సాంఘిక సంక్షేమ వసతి గృహాలు ఉండగా 35 మంది సంక్షేమాధికారులు మాత్రమే ఉన్నారు. 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 56 బీసీ హస్టళ్లు ఉండగా 30 మంది వార్డెన్లు ఉన్నారు. 26 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో హాస్టళ్లలో ఇంచార్జి వార్డెన్ల పాలనే కొనసాగుతుంది. వార్డెన్లకు మెమోలు జారీ జిల్లాలో 30 వసతి గృహాలు ఇన్చార్జి వార్డెన్లతోనే నిర్వహ ణ సాగుతోంది. కొంత మంది వార్డెన్లను టౌన్‌ప్లానింగ్ అ దికారులుగా, కళ్యాణ లక్ష్మి పథకంపై సర్వే అధికారులుగా నియమించారు. దీంతో పని భారం పెరిగి వార్డెన్లు విద్యార్థులకు సరైన న్యాయం చేయలేకపోతున్నారు. ఈ ఏడాది పది పరీక్షల్లో ఆశించిన ఫలితాలు రాలేదని వార్డెన్లకు మె మోలు జారీ చేశారు. ఒక్కో వార్డెన్‌కు రెండేసి హాస్టల్స్ ఉండడంతో విద్యార్థుల బాగోగులు సక్రమంగా చూడలేకపోతున్నామని పలువురు వార్డెన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వసతి గృహ సంక్షేమాధికారిగా తాము విధులను సక్రమం గా నిర్వహిస్తున్నప్పటికి రాత్రి వేళల్లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహణ సక్రమంగా సాగకపోవడంతోనే విద్యార్థులు పది పరీక్షల్లో ఆశించిన మేరకు ఉత్తీర్ణత సాధించలేకపోయారని పలువురు వార్డెన్లు ఆరోపిస్తున్నారు. సాధారణ బదిలీలు తప్పని సరి ప్రభుత్వ శాఖల్లో సాధారణ బదిలీలు తప్పని సరిగా నిర్వహిస్తారు. గత కొంత కాలంగా బదిలీలు లేకపోవడంతో అధికారుల్లో నిరాసక్తత వ్యక్తం అవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉ న్న ఉద్యోగులు పట్టణ ప్రాంతాలకు, పట్టణ ప్రాంతాల్లో ఉ న్న ఉద్యోగులు గ్రామీణ ప్రాంతాలకు బదిలీ చేయడంతో వా రిలో విధుల పట్ల ఉత్సాహం కలుగుతుంది. ఏళ్ల కొద్ది ఒకే చోట ఉండడంతో అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ప్రభుత్వం విద్యా సంవత్సర ప్రారంభంలోనే బదిలీలు చేపట్టాలని వార్డెన్లు కోరుతున్నారు. మరో వారం రోజుల్లో వసతి గృహాలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థుల, వార్డెన్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని బదిలీలు చేపట్టి ఖాళీగా ఉన్న వార్డెన్ పోస్టులను భర్తీ చేయాలని, అర్హత, సీనియార్టీ ఉన్న వార్డెన్లకు పదోన్నతులు కల్పించాలన్నారు. సాధారణ బదిలీలు నిర్వహించాలి ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన సాధారణ బదిలీల అనంతరం నేటి వరకు బదిలీలు చేపట్ట లేదు. ఏళ్లుగా వార్డెన్లు ఒకే చో ట ఉండాల్సిన పరిస్థితి నెల కొంది. వార్డెన్ పోస్టులు భర్తీ కా కపోవడంతో ఒక్కో వార్డెన్ రెండేసి హాస్టళ్లకు ఇన్చార్జిలుగా ఉంటున్నారు. విద్యార్థులకు న్యా యం చేయలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం సాధారణ బదిలీలు చేపట్టి, ఖాళీగా ఉన్న వార్డెన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.- ఏస్కూరి జ్ఞానానందం, తెలంగాణ హాస్టల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సెంట్రల్ కమిటీ సభ్యుడు, చెన్నూర్ -
ఆ ప్రైవేటు విద్యాసంస్థలు వ్యభిచార కొంపలట
బెంగళూరు: అప్పుడప్పుడు వివాదాల్లో చిక్కుకునే కర్ణాటక సంక్షేమశాఖ మంత్రి హెచ్ ఆంజనేయ మరోసారి అనూహ్య వ్యాఖ్యలు చేసి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూ వ్యభిచార గృహాల్లా మారాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విద్యాహక్కు చట్టం లేకుంటే ఏ మధ్యతరగతి విద్యార్థికానీ, పేద విద్యార్థిగానీ ఈ విద్యాసంస్థల్లో చదవలేడని చెప్పారు. కర్ణాటక ప్రైవేటు విద్యాసంస్థల సమాఖ్యను ఈ సందర్భంగా ఆయన ఏకీపారేశారు. 'విద్య పేరిట ప్రజల నుంచి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్న ఈ ప్రైవేటు విద్యాసంస్థలన్నీ వ్యభిచార కొంపలు. అయితే, కొన్ని మంచి ప్రైవేటు స్కూల్స్ కూడా ఉన్నాయి. కొన్ని మతపరమైన విద్యాసంస్థలు కూడా చాలా గొప్పగా పనిచేస్తున్నాయి. విద్యాహక్కు చట్టం లేకుండా కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో పేదవారు అస్సలు చదువుకోలేకపోయేవారు. బలవంతంగా అధికమొత్తం ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలన్నీ వ్యభిచారం చేస్తున్నట్లే' అంటూ ఆయన మీడియాతో అన్నారు. ఈ సందర్భంగా హెచ్ ఆంజనేయ వెంటనే తమకు క్షమాపణలు చెప్పాలని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. -
కారెం నియామకంపై వివరణ ఇవ్వండి
ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా మాల మహానాడు అధ్యక్షుడు కారెం శివాజీని నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరింది. సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యదర్శులతో పాటు కారెం శివాజీకి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వీరిని ఆదేశించింది. అలాగే శివాజీ నియామకానికి సంబంధించిన రికార్డులను కోర్టు ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 7కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా శివాజీ నియామకాన్ని సవాలు చేస్తూ న్యాయవాది జె.ప్రసాద్‌బాబు, మరో నలుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని న్యాయమూర్తి జస్టిస్ సంజయ్‌కుమార్ మంగళవారం విచారించారు. ఐక్యతతోనే మాల, మాదిగల అభివృద్ధి: రావెల సాక్షి, విజయవాడ బ్యూరో: ఎస్సీల్లో ఉన్న మాల, మాదిగలు కలసి ముందుకు సాగితేనే అభివృద్ధి సాధిస్తామని, విడిపోతే పడిపోతామని మంత్రి రావెల కిశోర్‌బాబు చెప్పారు. విజయవాడలో మంగళవారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా కారెం శివాజీతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా కారెం శివాజీ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు రుణాలు ఇవ్వడానికి నిరాకరించే బ్యాంకర్లను జైళ్లో పెట్టించి రుణాలు ఇప్పిస్తానని చెప్పారు. కాగా, కారెం శివాజీ నియామకం చెల్లదని హైకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. -
డబ్బులిస్తావా.. కిడ్నాప్ చేయమంటావా?
వార్డెన్‌ను బెదిరించిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సై కోవూరు : ‘మూడు లక్షలు ఇవ్వు.. లేకుంటే హాస్టల్ విద్యార్థులకు జరిగే నష్టానికి నీదే బాధ్యత’ అని తనను ఫోన్ ద్వారా ఓ మహిళ వేధిస్తోందని నెల్లూరు జిల్లా కోవూరు సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహ వార్డెన్ టి.మహేశ్వరి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె కథనం మేరకు.. చిత్తూరు జిల్లా పుత్తూరు నుంచి లీలావతి అనే మహిళ వివిధ నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ చేస్తోంది. నీకు నీ భర్తకు మధ్య సమస్యలు ఉన్న విషయం మాకు తెలుసు అని మాట్లాడుతోంది. అడిగిన నగదు ఇవ్వకపోతే నీ భర్త శంకర్ చేత విద్యార్థులను కిడ్నాప్ చేయిస్తానని, అనంతరం ఉద్యోగం పోవడం ఖాయమని మానసికంగా వేధిస్తోంది. ఈ విషయమై సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారులుకు సైతం ఫిర్యాదు చేశాను. నా జీతాభత్యాల వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా ఆ మహిళ సేకరించింది. ఆమె వల్ల వసతి గృహ విద్యార్థులకు హాని జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని పోలీసులను కోరింది. అయితే పోలీసులు కేసు నమోదు చేయడం, దర్యాప్తు చేయడం తదితరాలపై నిరాకరించారని బాధితురాలు వాపోయింది. ఫిర్యాదు చేసినట్లు రశీదు ఇవ్వమన్నా ఎస్సై సుధాకర్‌రెడ్డి ఇవ్వనన్నారని వాపోయింది. ఆరు రోజులే కదా పాఠశాలలు ఉండేది, ఈ లోపు ఏం చేస్తారు? అని ఎస్సై నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని, ఈలోపు విద్యార్థులకు ఏదైనా జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని వార్డెన్ ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై జిల్లా ఎస్పీను కలవనున్నామని తెలిపింది. దీనిపై ఎస్సై సుధాకర్‌రెడ్డిని సంప్రదించగా వార్డెన్ స్టేషన్‌కు వచ్చిన మాట వాస్తవమేనన్నారు. సమస్యను తనతో చెప్పారని, ఫిర్యాదు రాసివ్వమని అడగ్గా మళ్లీ వస్తామని వెళ్లిపోయారని తెలిపారు -
పండగపూట పస్తులే!
► హెచ్‌డబ్ల్యూఓలకు రెండు నెలలుగా అందని జీతాలు ► ఐదు ట్రెజరీల్లో పాస్ కాని డైట్ బిల్లులు ► రూ.30 లక్షల నిధులు ల్యాప్స్ కర్నూలు(అర్బన్) : ఉగాదిని అందరు ఎంతో సంతోషంగా జరుపుకున్నా.. సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహ సంక్షేమాధికారులు మాత్రం ఇబ్బందుల మధ్య నిర్వహించుకోవాల్సి వచ్చింది. రెండు నెలలుగా వసతి గృహ సంక్షేమాధికారులకు జీతాలు అందకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలకు సంబంధించి జీతాలు విడుదల కాలేదు. ఫిబ్రవరికి సంబంధించి వ్యక్తిగత ఆదాయ పన్ను సమాచారాన్ని అందించడంలో కొందరు హెచ్‌డబ్ల్యూఓలు చేసిన జాప్యం వల్ల జీతాల విడుదలలో ఆలస్యం జరిగినట్లు తెలుస్తోంది. మార్చికి సంబంధించి జీతాల బిల్లులను ట్రెజరీకి పంపినా మంజూరు కాలేదు. దీంతో రెండు నెలలుగా జీతాలు అందకపోవడంతో వసతి గృహ సంక్షేమాధికారులు పండుగ పూట ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఐదు ట్రెజరీల్లో పాస్ కాని డైట్ బిల్లులు జిల్లాలోని కర్నూలు, ఎమ్మిగనూరు, గూడూరు, ఆళ్లగడ్డ, ఆలూరు ట్రెజరీ కార్యాలయాల్లో వసతి గృహాలకు సంబంధించిన మార్చి నెల డైట్ బిల్లులు పాస్ కానట్లు సమాచారం. సాధారణంగా ప్రతి నెలా 19 నుంచి 24వ తేదీలోగా డైట్ బిల్లులను ఆయా ట్రెజరీ కార్యాలయాలకు అందజేయాల్సి ఉంది. అందరు వసతి గృహ సంక్షేమాధికారులు నిర్ణీత సమయంలోనే ట్రెజరీలకు బిల్లులను అందజేసినా, మార్చి చివరిలో మంజూరు కావాల్సిన బిల్లులు పాస్ కాలేదు. దీంతో దాదాపు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు బడ్జెట్ ల్యాప్స్ అయినట్లు తెలుస్తోంది. సమస్యను డీడీ దృష్టికి తీసుకువెళ్లాం- శ్రీరామచంద్రుడు, హెచ్‌డబ్ల్యూఓస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జెడ్ దొరస్వామి, కే బాబు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రెండు నెలలుగా జీతాలు అందని పరిస్థితిని, ఆయా ట్రెజరీల్లో మంజూరు కానీ డైట్ బిల్లుల విషయాన్ని తమ శాఖ ఉప సంచాలకుల దృష్టికి తీసుకువెళ్లాం. కానీ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. రెండు నెలల జీతాలతో పాటు డైట్ బడ్జెట్ కూడా ల్యాప్స్ కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పెండింగ్‌లో ఉన్న జీతాలతో పాటు డైట్ బడ్జెట్‌ను ఇప్పించాలి. డైట్ బడ్జెట్ రాకుంటే వసతి గృహ సంక్షేమాధికారులు మరిన్ని ఆర్థిక ఇబ్బందులకు గురవుతారు. -
మైనార్టీలకు ఇంగ్లిష్ గురుకుల విద్య!
♦ 120 గురుకుల పాఠశాలలు మంజూరు ♦ మొదటి విడతలో 70 పాఠశాలలు.. ♦ మూడేళ్ల ఈ ప్రాజెక్టుకు రూ.1,200 కోట్ల కేటాయింపు ♦ తొలి ఏడాది 5,6,7 తరగతుల్లో ప్రవేశాలు ♦ 2016-17లో పాఠశాలలు ప్రారంభం సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో ఆర్థికంగా వెనకబడిన మైనార్టీ వర్గాల పిల్లలకు ఆంగ్ల మాధ్యమంలో ఉచిత గురుకుల విద్య అందుబాటులో రానుంది. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ వర్గాలను విద్యా పరంగా పోత్సహించేందుకు 120 మైనార్టీ రె సిడెన్షియల్ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లను మంజూరు చేసి మొదటి విడతగా 70 పాఠశాలలు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. పాఠశాలల నిర్వహణ కోసం ప్రత్యేకంగా తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల సంస్థల సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్) కూడా ఏర్పాటైంది. దీన్ని మూడేళ్ల ప్రాజెక్టుగా తీసుకుని.. సొం త భవనాలు, మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.1,200 కోట్లు వెచ్చించనున్నారు. మొదటి విడతగా ఈసారి బడ్జెట్లో రూ. 350 కోట్లు కేటాయించారు. పాఠశాల నిర్వహణ కోసం బోధన, బోధనేతర సిబ్బంది భర్తీ కోసం రెగ్యులర్ ప్రాతిపదికన 1,960 పోస్టులు, పొరుగు సేవల కింద 280 పోస్టులు మంజూరయ్యాయి. రెగ్యులర్ పోస్టులను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టారు. మొదటి ఏడాది పాఠశాలల నిర్వహణ బాధ్యతలను సాంఘిక సంక్షేమ శాఖకు అప్పగించారు. 16,800 మంది విద్యార్థులకు ప్రవేశాలు రాష్ట్రంలో తొలి విడతగా 2016-17 విద్యాసంవత్సరంలో 70 పాఠశాలలు ప్రారంభించి 16,800 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో 38 బాలుర, 32 బాలికల పాఠశాలలు ఉన్నాయి. మొదటి ఏడాది అద్దె భవనాల్లో పాఠశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి 5, 6, 7 తరగతులలో మాత్రమే విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు. ప్రతి పాఠశాలలో 240 చొప్పున ప్రతి తరగతిలో 80 మంది విద్యార్థులకు రెండే సెక్షన్లలో ప్రవేశం కల్పిస్తారు. మొత్తం సీట్లలో 75 శాతం మైనార్టీ వర్గాలకు, 25 శాతం ఇతరులకు రిజర్వ్ చేసి ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశం పొం దిన ప్రతి విద్యార్థికి ఉచితంగా సుమారు రూ. 80 వేల విలువగల విద్య, వసతి, ఆహారం, ఆరోగ్య సదుపాయాలు కల్పిస్తారు. ప్రవేశాల కోసం గ్రామీణ ప్రాంతాలకు వార్షికాదాయం రూ.1.5 లక్షలోపు, పట్టణ ప్రాంతాలకు రూ. 2 లక్షలు మించని కుటుంబాల పిల్లలు అర్హులను నిర్ణయించారు. అర్హులైన విద్యార్ధుల నుంచి ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించి జూన్‌లో పాఠశాలలు ప్రారంభించేందుకు మైనార్టీ సం క్షేమ శాఖ అధికారులు ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి శ్రీకా రం చుట్టారు. విద్యార్థుల ప్రవేశాల కోసం స్వచ్ఛంద సంస్థలు, ముస్లిం మత గురువులను భాగస్వాములుగా చేస్తున్నారు. బాలికలకు పూర్తిగా భద్రత షఫీ ఉల్లా, కార్యదర్శి, టీఎంఆర్ఈఐఎస్ బాలికలకు పూర్తిగా భద్రతతో కూడిన విద్య, బోధన, వసతి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. బాలికల కోసం ప్రత్యేకంగా 32 పాఠశాలలు ప్రారంభిస్తున్నాం. రెగ్యులర్ టీచర్లను భర్తీ చేస్తున్నాం. కార్పొరేట్‌కు దీటుగా స్కూల్ భవనాలు, విద్యా బోధన ఉంటుంది. ఇది సువర్ణ అవకాశం సయ్యద్ బందగి బాషా రియాజ్ ఖాద్రీ, మొహిసిన్-ఏ-ఇన్సానియత్, హైదరాబాద్ మైనార్టీలకు ఇంగ్లిష్ మీడియం గురుకుల స్కూల్స్ వర ప్రసాదం లాంటివి. ఆంగ్ల మాధ్యమం లో ఉచిత విద్య, వసతి సువర్ణ అవకాశం, బాలికలకు కూడా పూర్తిగా భద్రతతో కూడిన బోధన, వసతి ఉంటుంది. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. -
50 యూనిట్ల వరకూ ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్
♦ ఆపై వాడే విద్యుత్‌కే ఛార్జీ వసూలు ♦ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు గృహవినియోగ విద్యుత్‌ను 50 యూనిట్ల వరకూ ఉచితంగా అందించే పథకంలో మార్పులు చేసి.. మరింత మందికి లబ్ధి చేకూర్చుతామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం నెలకు 51 యూనిట్ల విద్యుత్ వినియోగించే ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకం వర్తించడం లేదన్నారు. ఇకపై 50 యూనిట్ల వరకూ విద్యుత్‌ను ఉచితంగానూ.. ఆపైన వినియోగించే విద్యుత్‌కు మాత్రమే ఛార్జీలు వసూలు చేసేలా పథకంలో మార్పులు చేశామని వివరించారు. దీని వల్ల ఆరు లక్షల ఎస్సీ, 90 వేల ఎస్టీ కుటుంబాలు లబ్ధి పొందుతాయన్నారు. గృహాలకు ఉచితంగా విద్యుత్ అందించే పథకానికి రూ.76 కోట్లను ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నాలుగు ఎల్ఈడీ బల్బుల చొప్పున పంపిణీ చేస్తామని.. తద్వారా ఆ కుటుంబాలు నెలకు 50 యూనిట్ల లోపే విద్యుత్ వినియోగించే అవకాశం ఉంటుందన్నారు. -
నియంత పాలన
ఆ నలుగురు చెప్పిందే శాసనం రాతపూర్వక ఆదేశాలుండవు మామూళ్ల మత్తులో ఉన్నతాధికారులు సంక్షేమశాఖలో రాజ్యమేలుతున్న అవినీతి నెల్లూరు: సాంఘిక సంక్షేమశాఖలో అవినీతి రాజ్యమేలుతోంది. ఆ నలుగురు చెప్పిందే శాసనంలా ఉద్యోగులు నడుచుకోవాలి. అలా వినకపోతే ఆ అధికారికి చుక్కలు చూపిస్తారు. జిల్లా సాంఘిక సంక్షేమశాఖలో అయినవారికి ఆకుల్లో.. కానివారికికంచాల్లోఅన్నచందంగా సాగిపోతోంది. వారి గురించి వేలెత్తి చూపించే వారికి నోట్ల కట్టలు విసిరేస్తారు. అందుకే కొందరు ఉన్నతాధికారులు ఆ నలుగురు ఇచ్చే మామూళ్లకు కక్కుర్తిపడి సంక్షేమశాఖను నిర్వీర్యం చేస్తున్నారనే విమర్శలున్నాయి. జిల్లా సంక్షేమశాఖ కార్యాలయంలో పనిచేసే నలుగురు ఫెవికాల్ వీరులు నియంతలా వ్యవహరిస్తూ ఉద్యోగులను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అడ్డుగా ఉన్న కొందరు ఉద్యోగులను డిప్యుటేషన్‌పై బదిలీ చేసి అవసరం లేకపోయినా మరి కొందరిని తెచ్చిపెట్టుకున్నారు. బాధ్యతాయుతంగా పనిచేసే కొందరు ఉద్యోగులను డిప్యుటేషన్లపై బదిలీ చేసి ఉన్నారు. జిల్లా కార్యాలయంలో 10 మంది గుమస్తాలు ఉండాలి. అయితే ప్రస్తుతం ఏడుగురే ఉన్నారు. అటెండర్లు ఆరుగురు ఉండాల్సి ఉంటే.. ప్రస్తుతం 13 మంది పనిచేస్తున్నారు. దీంతో ఒకరు చేసే పనిని ఇద్దరు, ముగ్గురు చేస్తున్నారు. ఫెవికాల్ వీరులకు ఎవరు అధికంగా మామూళ్లు సమర్పించుకుంటే వారికి కోరుకున్న చోటుకు పోస్టింగ్ వేస్తారు. అది కూడా రాతపూర్వకంగా కాదు. కేవలం మౌఖిక ఆదేశాలతోనే. ఇలా జిల్లా వ్యాప్తంగా సాంఘిక సంక్షేమశాఖలో పనిచేసే అనేక మంది ఉద్యోగులను మౌఖిక ఆదేశాలతో బదిలీచేసి పనిచేయించుకున్నారు. -
ఇద్దరు హాస్టల్ విద్యార్థినుల పరారీ
హైదరాబాద్: ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న ఇద్దరు విద్యార్థినులు పరారయ్యారు. ఈ సంఘటన గౌలిగూడలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో బుధవారం వెలుగుచూసింది. స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని, ఎనిమిదో తరగతి చదువుతున్న మరో విద్యార్థిని వసతి గృహం నుంచి పారిపోయినట్లు హాస్టల్ అధికారులు గుర్తించారు. దీంతో వసతి గృహ సిబ్బంది విద్యార్థినుల తల్లిదండ్రులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు విద్యార్థినుల కోసం గాలిస్తున్నారు. -
ఒకే ఎగ్జామ్ కేలండర్‌ను అమలు చేయాలి
సాక్షి, విజయవాడ బ్యూరో/ఏలూరు: రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్నట్లుగానే మిగిలిన తరగతుల విద్యార్థులకు ఒకే సమయంలో పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఇందుకు సంబంధించి విద్యాశాఖ రూపొందించే ఎగ్జామ్ కేలండర్‌ను బీసీ, ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా తప్పనిసరిగా అనుసరించాలని ఆయన స్పష్టం చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ పనితీరుపై ముఖ్యమంత్రి గురువారం రాత్రి విజయవాడలోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వైఫల్యాన్ని అధిగమించేందుకు నిపుణుల బృందాన్ని నియమించి, మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. సమస్యల్లో ఉన్నాం... ఆదాయం లేదు ప్రస్తుతం రాష్ర్ట ప్రభుత్వం సవాలక్ష సమస్యల్లో ఉందని, ఆదాయం కూడా లేదని దాని వల్ల సంక్షేమ పథకాలు ఆలస్యమవుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆయన గురువారం పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో జనచైతన్య యాత్రలో, అంతకు ముందు విజయవాడలో టెలీ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. తర్వాత దెందులూరు హైస్కూల్లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. సాక్షి పత్రిక చదివి మనసులు పాడుచేసుకోవద్దంటూ విమర్శలు గుప్పించారు. జనచైతన్యయాత్రలకు గ్రేడింగ్ హైదరాబాద్: తెలుగుదేశం నిర్వహిస్తున్న జనచైతన్యయాత్రల తీరును పరిశీలించి గ్రేడింగ్ ఇవ్వనున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తెలిపారు. ఆయన సుమారు ఏడు వేల మంది పార్టీ నేతలు, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు మీడియా కమిటీ జాతీయ సమన్వయకర్త ఎల్వీఎస్సార్కే ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. వరద ప్రాంతాలైన చిత్తూరు, నెల్లూరు తదితర జిల్లాల్లోని పార్టీ కార్యకర్తలు, నేతలు వరద సహాయ, పునరావాస చర్యల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు. మార్క్ జుకర్ బర్గ్ (ఫేస్బుక్), బిల్‌గేట్స్ (మైక్రోసాఫ్ట్), వారెన్ బఫెట్ (వ్యాపారవేత్త) స్ఫూర్తితో యువత, కార్పొరేట్ వర్గాలు ఏపీ అభివృద్ధికి తోడ్పాటునందించాలని కోరారు. కాగా, చంద్రబాబు శనివారం ఉదయం తెలంగాణ రాష్ట్ర పార్టీ నేతలతో సమావేశం అవుతారు. ఆదివారం చంద్రబాబును తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు దంపతులు కలిసే అవకాశం ఉంది. ఈ నెలాఖరులో మెదక్ జిల్లాలోని తన ఫాంహౌస్‌లో నిర్వహిస్తున్న అయుత చండీయాగంలో పాల్గొనాల్సిందిగా వారు ఆహ్వానించనున్నారు. అదేరోజు రాత్రి ఎన్టీఆర్ పెద్ద కుమార్తె లోకేశ్వరి మనుమరాలి వివాహ రిసెప్షన్లో బాబు పాల్గొంటారు. జల సంరక్షణపై కలసి పనిచేస్తాం జల సంరక్షణ, నీటి యాజమాన్య పద్ధతులపై రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు యూరోపియన్ బిజినెస్ అండ్ టెక్నాలజీ సెంటర్(ఈబీటీసీ) సంసిద్ధత వ్యక్తం చేసింది. విజయవాడ సీఎం కార్యాలయంలో బాబుతో ఈబీటీసీ ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. -
నో మెనూ.. పెట్టిందితిను
విద్యార్థులకు అందని పోషకాహారం దోమలతో సహవాసం ఇతర వ్యాపకాల్లో వార్డెన్లు బిజీ సంక్షేమ వసతి గృహాల్లో సమస్యల మోత మచిలీపట్నం : జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యాన 119 వసతి గృహాలు ఉండగా వాటిలో 9,876 మంది, బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 96 వసతి గృహాలు ఉండగా వాటిలో 6705 మంది విద్యార్థులు ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 19 వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో 1288 మంది విద్యార్థులు చదువుతున్నారు. కాకులను కొట్టి గద్దలకు పెట్టిన చందంగా వసతి గృహాల్లోని విద్యార్థులకు పోషకాహారం అందించాల్సిన వార్డెన్లు నెలవారీ మామూళ్ల పేరుతో ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకునే అంశంపైనే అధికంగా దృష్టిసారించి పిల్లలను అర్ధాకలితో ఉంచుతున్నారనే ఆరోపణలొస్తున్నాయి. వారంలో ఐదు రోజుల పాటు వసతి గృహాల్లో గుడ్డు వడ్డించాలి. మూడు రోజులు మాత్రమే ఇస్తున్నారు. అదేమని ప్రశ్నిస్తే పాఠశాలలో ఇస్తున్నారు కదా అని ఎదురుప్రశ్నిస్తున్నారు. తలకు రాసుకునే కొబ్బరినూనె ఖర్చులు కూడా రెండు నెలలుగా ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోంది. పిల్లల సంరక్షణ బాధ్యతలను చూడాల్సిన వార్డెన్లు ఇతర పనుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. దీంతో పిల్లలకు ఏం పెడుతున్నారో, వారేం తింటున్నారో, ఏం చదువుతున్నారో పట్టించుకునే వారే కరువయ్యారు. వసతి గృహాల్లో పదో తరగతి విద్యార్థులకు ప్రైవేటు చెప్పే ట్యూటర్లకు గత ఎనిమిది నెలలుగా గౌరవవేతనం ఇవ్వని పరిస్థితి. ఇలా ఎన్నో సమస్యలను సాక్షి బృందం గుర్తించింది. పామర్రు నియోజకవర్గం పెదపారుపూడి బీసీ బాలుర వసతి గృహంలో మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా లేదు. తోట్లవల్లూరు ఎస్సీ బాలుర వసతి గృహంలో పిల్లలే లేరు. పామర్రు బీసీ బాలికల వసతి గృహంలో 25 మంది పిల్లలున్నట్లు లెక్కల్లో ఉన్నా అక్కడ ఐదుగురే ఉన్నారు. పామర్రు ఎస్సీ బాలికల వసతి గృహానికి రెగ్యులర్ వార్డెన్ లేరు. గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు వసతి గృహం వార్డెన్ ఇక్కడ ఇన్చార్జిగా ఉన్నారు. ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళతారో తెలియని పరిస్థితి. బాలికల వసతి గృహంలో వరండాలోనే బాలికలు నిద్రిస్తున్నారు. ఫ్లెక్సీలను అడ్డుగా పెట్టుకున్నా దోమలబెడద వీరిని వెంటాడుతోంది. మైలవరం బీసీ బాలుర వసతి గృహంలో 150 మంది పిల్లలకుగాను ఐదు మరుగుదొడ్లే ఉన్నాయి. దీంతో ఇబ్బందులు పడుతున్నారు. కూరగాయలు, నిత్యావసరాల ధరలు పెరగడంతో పోషకాహారంతో కూడిన భోజనం పెట్ట డం లేదు. జి.కొండూరు మండలం వెలగలేరులోని హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరింది. గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు వసతి గృహం ప్రైవేటు భవనంలో ఉంది. వసతులు సక్రమంగా లేకపోవడంతో పిల్లలు ఇబ్బందులపాలవుతున్నారు. గన్నవరం పట్టణంలోని ఎస్సీ, బీసీ బాలుర వసతి గృహాల భవనాలు శిథిలావస్థకు చేరాయి. శ్లాబు పెచ్చలూడి పడతున్నాయి. ఈ రెండు వసతి గృహాల భవనాల్లో కిటికీలకు రెక్కలు లేకపోవడంతో దోమలతోనే విద్యార్థులు సహవాసం చేస్తున్నారు. జగ్గయ్యపేటలోని ఎస్సీ వసతి గృహంలో మూడు జతల యూనిఫాం మాత్రమే ఇచ్చారు. వత్సవాయి ఎస్సీ హాస్టల్లో భోజ నం సుద్దగా పెడుతుండడంతో పిల్లలు తినలేని పరిస్థితి. పెనుగంచిప్రోలు బీసీ, ఎస్సీ వసతి గృహాల్లో పిల్లలు తక్కువగా ఉన్నా ఎక్కువగా చూపుతున్నారు. చిల్లకల్లు ఎస్టీ హాస్టల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నందున దీన్ని రద్దుచేయాలని ప్రతిపాదనలు పంపారు. జగ్గయ్యపేటలోని బాలికల ఇంటిగ్రేటెడ్ హాస్టల్ చుట్టూ ప్రహరీ లేకపోవడంతో రక్షణ లేకుండా పోయింది. నందిగామ నియోజకవర్గంలో రెండు వసతి గృహాలు ఉండగా వార్డెన్లు కుక్‌లకు బియ్యం, సరుకులు ఇచ్చి వెళ్లిపోతున్నారు. ఇక నైట్ వాచ్మెన్లు కూడా బయట పనుల్లో బిజీగా ఉంటున్నారు. దీంతో పిల్లలపై అజమాయిషీ కొరవడింది. అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు బీసీ బాలుర వసతి గృహంలో వార్డెన్, నైట్ వాచ్‌మన్ లేరు. హాస్టల్ ఆవరణ అంతా పిచ్చిమొక్కలతో నిండి ఉంది. మెనూ సక్రమంగా అమలుచేయడం లేదు. అవనిగడ్డ బీసీ బాలుర వసతి గృహం డ్రెయిన్ పక్కనే ఉండడంతో నిత్యం దుర్గంధం వెదజల్లుతోంది. వాచ్‌మన్ లేరు. మోపిదేవి ఎస్సీ బాలుర వసతి గృహంలో సరిపడినన్ని గదులు లేవు. పిల్లలు వరండాలోనే చదువుకుని అక్కడే నిద్రపోతున్నారు. ట్యూటర్లు కూడా లేరు. నాగాయలంక బీసీ బాలికల వసతి గృహం అద్దె భవనంలో నడుస్తోంది. సరిపడినన్ని గదులు లేక పిల్లలు అవస్థలు పడుతున్నారు. గుడ్లవల్లేరు కళాశాల వసతి గృహంలో 138 మంది విద్యార్థులు ఉన్నారు. వసతులు సక్రమంగా లేకపోవటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. నూజివీడు నియోజకవర్గంలోని వసతి గృహాల్లో తాగునీటి సమస్య వేధిస్తోంది. బోరు నీటినే తాగునీటిగా వినియోగిస్తున్నారు. నాలుగు జతల యూనిఫాం ఇవ్వాల్సి ఉండగా రెండు జతలు మాత్రమే ఇచ్చారు. కాస్మొటిక్ చార్జీలు మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి. పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరులో ఆరు సంక్షేమ హాస్టళ్లలోనూ రక్షిత నీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉప్పునీటినే తాగునీటిగా వాడుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఉయ్యూరు బస్టాండ్ ప్రాంతంలో, మండలంలోని ఆకునూరులో అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న ఎస్సీ బాలుర హాస్టల్ భవనాలు శిథిలావస్థలో ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. కంకిపాడు హాస్టల్లో మరుగుదొడ్లు మరమ్మతులకు నోచుకోలేదు. ధరలు మండిపోతుండటంతో దాదాపు అన్ని హాస్టళ్లలో మెనూ అమలుకు ఇబ్బందులు పడుతున్నారు. పెనమలూరు ఎస్సీ బాలికల హాస్టల్లో లోఓల్టేజీ సమస్యతో రాత్రివేళ లైట్లు వెలగటం లేదు. బీసీ హాస్టల్ భవనం శ్లాబు లీకవటంతో శిథిలావస్థకు చేరింది. విజయవాడ దేవీనగర్ బీసీ బాలికల హాస్టల్లో 25 మంది విద్యార్థినులకు గాను విజిట్ సందర్భంగా ఏడుగురే కనిపించారు. 15 మంది స్థానికులేనని, భోజనాల అనంతరం ఇంటికి వెళ్లిపోతారని సిబ్బంది తెలిపారు. తాగునీటికి పబ్లిక్ కుళాయే వీరికి ఆధారం. బాలుర హాస్టల్లో దోమల బెడద ఎక్కువగా ఉందని, దుప్పట్లు ఇచ్చినా ఇబ్బంది పడుతున్నామని, దోమతెరలు ఇస్తే బాగుంటుందని విద్యార్థులు పేర్కొంటున్నారు. మాంటిస్సోరి విద్యా సంస్థల ప్రాంగణంలోని ఎస్టీ బాలికల హాస్టల్లో 110 మంది విద్యార్తులు ఉండగా, వారికి సరిపడినన్ని గదులు లేవు. ఒక్కో గదిలో 15 నుంచి 20 మంది ఇరుక్కుని పడుకోవాల్సి వస్తోంది. మరుగుదొడ్లు కూడా నాలుగే ఉండటంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కస్తూరిబాయిపేట ఎస్సీ మోడల్ హాస్టల్లో 175 మంది విద్యార్థినులకు గాను ఒకే ట్యాంకర్ నీళ్లు ఉండటంతో విద్యార్థినులు ఒక్కోరోజు స్నానం చేయకుండానే పాఠశాలలు, కళాశాలలకు వెళ్లాల్సి వస్తోంది. -
ఇద్దరు విద్యార్థినులు అదృశ్యం
ఆందోల్ (మెదక్) : హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. మెదక్ జిల్లా ఆందోల్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో ఉంటూ ఇంటర్మీడియట్ చదువుతున్న సౌజన్య, ప్రవల్లిక అనే ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. విద్యార్థినులు శుక్రవారం నుంచి కనిపించడంలేదు. దీంతో ప్రిన్సిపాల్ శనివారం జోగిపేట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. -
‘సంక్షేమం’ మూత!
మూతపడనున్న 26 హాస్టళ్లు ఆగస్టు 7 డెడ్‌లైన్ జిల్లాలో బాలబాలికలకు తప్పని ఇబ్బందులు గురుకులంలో ఖాళీ లేని సీట్లు ప్రశ్నార్థకంగా మారిన విద్యార్థుల భవితవ్యం తల్లిదండ్రుల్లో ఆందోళన మచిలీపట్నం : జిల్లాలో సాంఘిక సంక్షేమ వసతిగృహాలను కుదించేందుకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ ఆదేశాలతో 26 హాస్టళ్లను మూసివేసేందుకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గురువారం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఆగస్టు ఏడో తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 50 మందిలోపు పిల్లలు ఉన్న, అద్దె భవనాల్లో నడుస్తున్న వసతి గృహాలన్నింటినీ వెంటనే మూసివేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెల 10వ తేదీనే దీనికి సంబంధించి జీవో నంబరు 45ను ప్రభుత్వం జారీ చేయగా, తాజా ఆదేశాలతో అధికారులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 146 హాస్టళ్లు ఉన్నాయి. వాటిలో 81 బాలురు, 65 బాలికల వసతి గృహాలు. మొత్తంగా 10,376 మంది విద్యార్థులు చదువుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వం సాంఘిక సంక్షేమ వసతి గృహాలను ుదించేందుకు రంగం సిద్ధం చేయటంతో జిల్లాలో 15 బాలుర, 11 బాలికల వసతి గృహాలను మూసివేస్తున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు సూచనప్రాయంగా చెబుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 134 మంది బాలురు, 221 మంది బాలికలను ప్రభుత్వ వసతి గృహాల నుంచి బయటకు పంపే ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. గురుకులాల్లో సీట్లు ఏవీ? ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏదైనా ప్రాంతంలోని వసతి గృహాన్ని మూసివేస్తే సమీపంలోని గురుకుల పాఠశాలలో ఆ విద్యార్థులను చేర్చాల్సి ఉంది. పాఠశాలలు జూన్ 15న ప్రారంభం కాగా ఇప్పటికే దాదాపు 45 రోజులు గడిచాయి. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులను చేర్చాలంటే ముందస్తుగా ప్రవేశ పరీక్ష నిర్వహించి అనంతరమే చేర్చుకుంటారు. ఇవేమీ పట్టించుకోకుండా గుడ్డిగా నిర్ణయం తీసుకున్నారని విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో మొత్తం 14 గురుకుల పాఠశాలలు ఉండగా వాటిలో నాలుగు బాలుర, 10 బాలికల పాఠశాలలు. తిరువూరు, నూజివీడు ప్రాంతాల్లో పది గురుకుల పాఠశాలలు ఉన్నాయి. గురుకుల పాఠశాలల్లో సీట్ల భర్తీ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులను గురుకుల పాఠశాలల్లో చేర్చడానికి వీలు లేకుండా పోయిందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకటి, రెండు గురుకుల పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించినా ఎంతమంది అక్కడ ఉంటారనే అంశంపై అనుమానాలు ఉన్నాయి. మూతబడే హాస్టళ్లు ఇవే... జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహాలకు సంబంధించి పెడన, మచిలీపట్నం నంబర్-8, 10, చల్లపల్లి-3, మానికొండ, పామర్రు, అడ్డాడ, ఆరుతెగలపాడు, పమిడిముక్కల, సింగ్‌నగర్, గుడివాడ-10, తాడంకి, తెన్నేరు, పెనమలూరు, వేలేరులలోని వసతి గృహాలను ఇప్పటికే మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆయా విద్యార్థులను దగ్గరలోని రుద్రవరం, పామర్రు, తిరువూరు, కృష్ణారావుపాలెం గురుకుల పాఠశాలల్లో చేరాలని కోరుతున్నారు. ఈ గురుకులాల్లో సీట్లు లేకపోవటంతో 134 మంది బాలురలో అధిక శాతం మంది పాఠశాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. బాలికల విభాగంలో ప్రకాష్‌నగర్, క్రీస్తురాజుపురం, గొల్లనపల్లి, మోటూరు, గుడివాడ-3, 11, నందిగామ జనరల్, వెలగలేరు, నందివాడ, చెన్నూరు, పునాదిపాడు వసతిగృహాలను మూసివేస్తున్నామని, దగ్గరలోని గురుకులాలు, ప్రత్యేక హాస్టళ్లలో చేర్చుతామని చెప్పటమే తప్ప కార్యాచరణకు నోచుకోలేదు. దీంతో వసతి గృహాల్లో ఉన్న 231 మంది బాలికల విద్య ప్రశ్నార్థకంగా మారింది. స్థానికంగా ఉన్న వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా ప్రభుత్వం వసతి గృహాలను మూసివేయాలని నిర్ణయం తీసుకోవటం, ప్రస్తుతం వసతి గృహాల్లోని విద్యార్థులను గురుకులాల్లో చేర్చేందుకు అవకాశం లేకపోవటం తదితర కారణాలతో అధికారులు సతమతమవుతున్నారు. ఉన్న వసతి గృహాలను తొలగిస్తే పేద విద్యార్థులు విద్యకు దూరమవుతారని ప్రజాసంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రుణం..ఇదేమి విడ్డూరం!
- గత ఏడాది లబ్ధిదారులకు అందని రుణం - ఈ ఏడాది కొత్తగా దరఖాస్తు ఆహ్వానం - మండిపడుతున్న గత లబ్ధిదారులు కర్నూలు(అర్బన్): జిల్లా సాంఘిక సంక్షేమ శాఖలో రుణ పంపిణీ వ్యవహారం ప్రహసనంగా మారింది. గత ఏడాది లబ్ధిదారులకు ఇప్పటి వరకు రుణాలు పంపిణీ చేయకుండా ఈ ఏడాది కొత్తగా మళ్లీ దరఖాస్తులు ఆహ్వానించడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదేమి విడ్డూరం అంటూ లబ్ధిదారులు మండిపడుతున్నారు. గత ఏడాది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా జిల్లాలోని 4,495 మంది లబ్ధిదారులకు రూ. 37.06 కోట్లను రుణాలుగా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే లబ్ధిదారులు అష్టకష్టాలకోర్చి ఆన్లైన్లో దరఖాస్తు కూడా చేసుకున్నారు. అంతకు ముందు సంవత్సరంలో మిగిలిపోయిన దరఖాస్తులను కలుపుకొని మొత్తం 4,979 మందికి రుణాలను మంజూరు చేశారు. అయితే వీరిలో ఇప్పటి వరకు 1,370 మందికి మాత్రమే రూ. 13.86 కోట్లు రుణం మంజూరైనట్లు అధికారుల లెక్కలు తెలియజేస్తున్నాయి. ఇంకా గత ఏడాదికి సంబంధించి 3,609 మంది లబ్ధిదారులకు రూ.23.19 కోట్లను విడుదల చేయాల్సి ఉంది. వీరిలో దాదాపు 2,900 మంది బ్యాంకు వ్యక్తిగత ఖాతా, లోన్ ఖాతా నంబర్లను కూడా అందజేశారు. ఖాతా నంబర్లను అప్లోడ్ చేయని వారు దాదాపు 700 మంది దాకా ఉన్నారు. కోరిన ధ్రువీకరణ పత్రాలన్నీ సమర్పించి ఉన్నతాధికారి కార్యాలయానికి అప్లోడ్ చేసిన వారికి కూడా నేటికీ నయాపైసా సబ్సిడీ విడుదల కాలేదు. గత ఏడాదికి సంబంధించి వేల మందికి రుణాలు అందించాల్సి ఉన్నప్పటికీ, తిరిగి 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రుణాలు పొందేందుకు ఆగస్టు 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలనడంపై ఎస్సీ వర్గాలకు చెందిన ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది 6,615 మంది లబ్ధిదారులకు రూ.87.54 కోట్ల మేరకు రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే గత ఏడాదికి సంబంధించిన రుణాలన్నింటినీ విడుదల చేసిన అనంతరం ఈ ఆర్థిక సంవత్సరానికి చెందిన ప్రక్రియను ప్రారంభిస్తే బాగుండేదనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. బీసీ కార్పొరేషన్లో.... వెనుకబడిన తరగతుల ఆర్థిక సేవా సహకార సంస్థలో కూడా ఇదే తంతు నడుస్తోంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 50 శాతం సబ్సిడీతో జిల్లాలోని 8,193 మంది బీసీ లబ్ధిదారులకు 22.50 కోట్ల మేర సబ్సిడీ విడుదల చేయాలని లక్ష్యాన్ని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే అందిన దరఖాస్తులను జల్లెడ పట్టి 5,727 మంది లబ్ధిదారులకు రూ.21.17 కోట్ల మేర సబ్సిడీ విడుదల చేసేందుకు ప్రొసీడింగ్స్ అందించారు. అయితే వీరిలో 3,189 మంది మాత్రమే బ్యాంకు జీరో బ్యాలెన్స్ ఖాతా, లోన్ ఖాతా నంబర్లను అందించారు. వీరికి రూ.11.70 కోట్ల సబ్సిడీ విడుదల కాలేదు. అయితే బీసీ కార్పొరేషన్ అధికారులు కూడా 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 5209 మంది లబ్ధిదారులకు రూ.28.50 కోట్ల రుణాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకొని దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. రుణాలు అందించేందుకు చర్యలు గత ఏడాది బ్యాంకు ఖాతా నంబర్లు అప్లోడ్ చేసిన వారందరికీ తప్పక రుణాలు అందుతాయి. పెన్షన్ కమిటీలను తొలగించాలని వైఎస్సార్ జిల్లాకు చెందిన కొందరు హైకోర్టును ఆశ్రయించడం, అంతలోపే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం వల్ల సబ్సిడీ విడుదలో జాప్యం జరిగింది. ఇంకా బ్యాంకు ఖాతా నంబర్లు అప్లోడ్ చేయని వారికి ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలి. - పులిచేరి సారయ్య, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్ -
100 మంది విద్యార్థినులకు అస్వస్థత
నల్లగొండ : ఆహారం వికటించి 100 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా అయిటిపాములలోని సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్లో మంగళవారం చోటుచేసుకుంది. విద్యార్థినులను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటం
అనంతపురం సిటీ : కార్పొరేట్ విద్య పథకం కింద దరఖాస్తు చేసుకున్న ప్రతిభావంతుల భవిష్యత్‌తో అధికారులు చెలగాటమాడుతున్నా రు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రతిభావంతులకు కార్పొరేట్ విద్య పథకం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. దీం తో జిల్లా నలుమూలల నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 15వ తేదీకి గడువు ముగిసింది. పలువురు విద్యార్థులకు ‘కళాశాలలో మీకు సీటు వచ్చింది, కంగ్రాట్యులేషన్స్’ అని ఒక మెసేజ్, ఒరిజినల్ సర్టిఫికెట్లతో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని మరో మెసేజ్ వచ్చాయి. తీరా ఇక్కడికి వస్తే కేటగిరీ తప్పు దరఖాస్తు చేసుకున్న కారణంగా సీట్లు ఇవ్వలేమంటూ అధికారులు చేతులెత్తేశారు. కొంప ముంచిన మెసేజ్ సీటు వచ్చిందని తన సెల్‌ఫోన్‌కు వచ్చిన మెసేజ్ ఓ విద్యార్థి భవిష్యత్‌ను ప్రశ్నార్థకంలో పడేసింది. బుక్కరాయసముద్రం మండలం బొమ్మలాటపల్లికి చెందిన పి.కళ్యాణ్‌కుమార్ బి.పప్పూరులోని ఏపీఎస్‌డబ్ల్యూఓ గురుకుల పాఠశాలలో 10 తరగతి చదివాడు. 9.5 శాతం జీపీ సాధిం చాడు. ప్రతిభావంతుల కోటాలో చైతన్య కళాశాలలో సీటు వచ్చినట్లు డెరైక్టరేట్ ద్వారా మెసేజ్ వచ్చింది. అయితే ఇప్పటికే ప్రవేశ పరీక్ష ద్వారా కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు మ్యాగ్నెట్ కళాశాలలో ఉచితంగా సీటు సంపాదించాడు. అయితే సొంత జిల్లాలో సీటు వచ్చిందన్న ఆనందంతో అక్కడి యాజమాన్యం ఒ ప్పుకోకపోయినా అష్టకష్టాలూ పడి అడ్మిషన్ ఫీజు చెల్లించి టీసీ తీసుకుని వచ్చా డు. తీరా ఇక్కడికి వస్తే కేటగిరీ తప్పు అంటూ సీటు ఇవ్వలేదు. అసలే తన తండ్రి వికలాంగుడని అక్కడా సీటు లేక, ఇక్కడా ఇవ్వకుంటే ఎక్కడికి వెళ్లాలని కన్నీటి పర్యంతమయ్యాడు. ఇలా కళ్యాణ్‌కుమార్, జెస్సికా తదితర 15 మంది విద్యార్థులు ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. తప్పంతా డెరైక్టరేట్ అధికారులదే..! సాంఘిక సంక్షేమ శాఖ డీడీ బదిలీల విషయమై కలెక్టరేట్లో ఉండగా విద్యార్థులు, తల్లిదండ్రులు సిబ్బందిని ఈ విషయమై ప్రశ్నించారు. అందుకు సీనియర్ అసిస్టెంట్ సమాధానమిస్తూ తప్పంతా డెరైక్టరేట్ అధికారులదేనన్నారు. అక్కడ వారు జాబితా చూడకుండా సీరియల్ ప్రకారం మెసేజ్‌లు పంపారంటూ పోలీసులను పిలిపించి విద్యార్థులను గెంటేయించారు. దరఖాస్తు చేసుకున్న అనంతరం కార్యాలయంలో అందించినప్పుడైనా పరిశీలించారా అని ప్రశ్నిస్తే నీళ్లు నమిలారు. డెరైక్టరేట్‌కు పంపి రెండో జాబితాలో న్యాయం చేస్తాం:డీడీ బదిలీల విషయమై బిజీగా ఉన్నానని, వినతి పత్రాన్ని రాసి ఇస్తే డెరైక్టరేట్‌కు పంపి రెండవ జాబితాలో సీట్లు వచ్చేలా చూస్తామని ఆ శాఖ డీడీ బి.జీవపుత్రకుమార్ తెలిపారు. విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనీయమన్నారు. -
ఏసీబీకి చిక్కిన సాంఘిక సంక్షేమ శాఖ అధికారి
కర్నూలు (అర్బన్) : ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడి నుంచి రూ.20 వేల లంచం తీసుకుంటూ కర్నూలు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయ సూపరింటెండెంట్ కె.శేఖప్ప సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. వివరాల్లోకి వెళ్తే.. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ నియామకానికి సంబంధించిన ఫైలును కలెక్టర్‌కు పంపే విషయంలో కర్నూలుకు చెందిన గ్రీన్ యానిమల్ సేవర్ సొసైటీ నిర్వాహకుడు టి.ధర్మరాజు నుంచి శేఖప్ప రూ.50 వేలు డిమాండ్ చేశారు. ముందుగా రూ.20 వేలు, పని పూర్తయ్యాక రూ.30 వేలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. కాగా ధర్మరాజు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు సోమవారం ఉదయం కార్యాలయానికి వెళ్లిన ధర్మరాజు రూ.20 వేల నగదును శేఖప్పకు అందించారు. ఆ మరుక్షణమే ఏసీబీ డీఎస్పీ మహబూబ్‌బాషా శేఖప్పను రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. దాడిలో ఏసీబీ ఇన్స్పెక్టర్లు సీతారామారావు, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన సోషల్ వెల్ఫేర్ అధికారి
కరీంనగర్ : కల్యాణలక్ష్మి పథకం కోసం వచ్చిన ఒక జంట వద్ద నుంచి రూ. 10వేలు లంచం తీసుకుంటూ సోషల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్‌కు చెందిన సీనియర్ అసిస్టెంట్ మల్లయ్య ఏసీబీకి చిక్కారు. ఈ సంఘటన శుక్రవారం కరీంనగర్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని సుభాష్‌నగర్‌కు చెందిన సుబేర్ అనే యువకుడు మతాంతర వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. దీంతో కల్యాణలక్ష్మి పథకం కోసం వెల్ఫేర్ అధికారి మల్లయ్యను సంప్రదించారు. అయితే ఈ పథకం అమలు కోసం అతను రూ. 10వేలు డిమాండ్ చేశాడు. దీంతో సుబేర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు పథకం ప్రకారం.. సుబేర్ నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటుండగా మల్లయ్యను పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బదిలీలలు
జోరుగా పైరవీలు రంగంలోకి దళారులు సాంఘిక సంక్షేమ శాఖలో అదో జాతర అనంతపురం సిటీ : సాంఘిక సంక్షేమ శాఖలో బదిలీల జాతర నెలకొంది. దరఖాస్తులు సమర్పించడం పూర్తయినా ఉద్యోగులు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మూడేళ్లు పైబడిన వారందర్నీ బదిలీ చేయాలని జీవో విడుదల చేయడంతో ఉద్యోగులు తాము ఉన్న చోటే ఉండాలని పైరవీలకు దిగుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని దళారులు రంగప్రవేశం చేసి ఉద్యోగులను మభ్య పెట్టే పనిలో పడ్డారు. అవసరమైన మేర అన్ని నిబంధనలను ఉపయోగించుకుని తమకు కావాల్సిన చోటుకు వెళ్లేందుకు, నిబంధనలను తుంగలో తొక్కి ఉన్న చోటే ఉండేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. బదిలీలను సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలోని కొందరు ఉద్యోగులు తమకు వరంగా మార్చుకున్నట్లు సమాచారం. ఇందుకు ఆ శాఖలోని ఓ ముఖ్య ఉద్యోగి ద్వారా పైరవీలు సాగిస్తున్నట్లు తెల్సింది. ముఖ్యంగా నాలుగవ తరగతి ఉద్యోగుల బదిలీల విషయంలో లక్షలాది రూపాయలు చేతులు మారాయని కార్యాలయ వర్గాల్లో బహిరంగ చర్చ నడుస్తోంది. బదిలీలు కావాలంటూ వచ్చిన దరఖాస్తులు ఇందుకు ఊతమిస్తున్నాయి. జీవో ప్రకారం హార్ట్ సర్జరీ, బుద్ది మాంద్యత, వికలత్వం కలిగిన పిల్లలు ఉన్నా, అంగవైకల్యం ఉన్నా కోరుకున్న చోటుకు బదిలీ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ అర్హతలు లేకనే 85 మంది 4వ తరగతి ఉద్యోగులు బదిలీ కావాలంటూ దరఖాస్తులు ఇచ్చారు. వీరిలో కేవలం ఇద్దరు మాత్రమే ఆప్షన్ పత్రాలు సమర్పించారు. వారిలో ఒకరు అంగ వైకల్యం కలిగిన వారు కాగా మరొకరు అంధులు. మిగిలిన 83 మంది ఏ ఆప్షన్ లేకనే దరఖాస్తు చేసుకున్నారు. పక్కా జీవో ఆధారంగా దరఖాస్తులు స్వీకరించాల్సిన కార్యాలయ సిబ్బంది నిబంధనలకు సంబంధించి ఎలాంటి ధ్రువపత్రాలూ సమర్పించకున్నా స్వీకరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో కార్యాలయ సిబ్బంది పక్కా పైరవీలకు తెరతీసినట్లు స్పష్టమవుతోంది. రాజకీయ నాయకుల ఒత్తిళ్లు తమకు తెలిసిన వారిని కావాల్సిన చోటికి బదిలీ చేయాలని జిల్లాలోని పలువురు రాజకీయ నాయకులు సాంఘిక సంక్షేమ శాఖ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అయితే డీడీ బి.జీవపుత్రకుమార్ కాస్త కఠినంగా వ్యవహరిస్తుండటం వారికి మింగుడు పడటం లేదు. అయితే సంబంధిత శాఖా మంత్రికి చెందిన అనుచరులకు మాత్రం బదిలీల్లో అర్హతలు లేకపోయినా సహకరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఇతర రాజకీయ నాయకులు, సిబ్బంది డీడీపై గుర్రుగా ఉన్నట్లు తెల్సింది. ఇప్పటికే విధి నిర్వహణ విషయంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీకి సిబ్బందికి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని కార్యాలయ వర్గాలే చెబుతున్నాయి. ఇక బదిలీల విషయంలో ఒకరికి సహకరించి, మరొకరికి సహకరించకపోతే విబేధాలు మరింత ముదిరే అవకాశం ఉందని జోరుగా చర్చ జరుగుతోంది. -
వామ్మో... కర్నూలా!
♦ డీడీగా వచ్చేందుకు జంకుతున్న అధికారులు? ♦ ఇన్చార్జీల పాలనలోనే సాంఘిక సంక్షేమం హరిప్రసాద్‌ను నియమించినా... ఈ నెల 7వ తేదీన ఇక్కడకు రెగ్యులర్ డీడీగా ఎంవీ హరిప్రసాద్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆయన కూడా ఇక్కడకు డీడీగా వచ్చేందుకు సుముఖత చూపడం లేదు. కడప జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌కు లేదా డీఆర్డీఏకు వెళ్లేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు కార్యాలయ వర్గాల సమాచారం. కర్నూలు(అర్బన్) : కర్నూలుకు బదిలీ అంటేనే సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు హడలిపోతున్నారు. దీంతో గత ఏడాది సెప్టెంబర్ నుంచి డీడీ పోస్టు ఖాళీగా ఉండిపోయింది. గతంలో కూడా ఇక్కడ పనిచేసిన డీడీలు బదిలీ అయిన ఏడాది, ఏడాదిన్నరకు కూడా రెగ్యులర్ డీడీని నియమించని సందర్భాలు ఉన్నాయి. తమకు అనుకూలంగా పనిచేయని అధికారులపై కొందరు పనిగట్టుకొని ఫిర్యాదులు చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. గతంలో డీడీగా విధులు నిర్వహించిన శోభారాణి ఇక్కడి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు బదిలీ అయిన సందర్భంలో ఆమె ఇంకా అక్కడికి వెళ్లి బాధ్యతలు చేపట్టక ముందే ఆ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. అప్పట్లో జరిగిన సన్మాన సభలో ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పి కన్నీటి పర్యంతమయ్యారు. అలాగే కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న పలువురు ఉద్యోగుల్లో సఖ్యత లేక పోవడం, హెచ్‌డబ్ల్యూఓల్లో వర్గ విభేదాలు పొడచూపిన నేపథ్యంలో ఇక్కడకు వచ్చి సమస్యలను తెచ్చుకునేకంటే రాకపోవడమే మేలనే భావనతో పలువురు అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. డీడీ నియామకాల్లో ఎడతెగని జాప్యం... వి. జయప్రకాష్ .. 2011 జూన్ 26వ తేదీన బదిలీ అయినప్పటి నుంచి రెగ్యులర్ డీడీ నియామకంలో జాప్యం జరుగుతూనే వస్తోంది. పలు సందర్భాల్లో సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ఇక్కడకు రెగ్యులర్ డీడీలను నియమించినా, వారు ఏదో ఒక కారణం చూపుతూ.. తమ పలుకుబడిని ఉపయోగించుకొని బదిలీలను రద్దు చేయించుకుంటున్నారు. జయప్రకాష్ బదిలీ అయిన రెండు నెలలకు రిటైర్మెంట్కు ఏడాది సమయం ఉన్న బుచ్చయ్యకు 2011 జూలై 21న ఇక్కడకు పోస్టింగ్ ఇచ్చారు. ఆయన 2012 ఆగష్టులో రిటైర్డు కాగా, 2013 మే 27వ తేదిన శోభారాణి రెగ్యులర్ డీడీగా బాధ్యతలు చేపట్టి 2014 సెప్టెంబర్ 18న పశ్చిమ గోదావరి జిల్లాకు బదిలీపై వెళ్లారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సాంఘిక సంక్షేమ శాఖ ఇన్చార్జీల పాలనలోనే కొనసాగుతోంది. డీడీ పోస్టు ఖాళీ ఏర్పడిన ప్రతీ సందర్భంలోన ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పులిచేరి సారయ్య ఇన్చార్జ్గా వ్యవహరిస్తూ వస్తున్నారు. జయప్రకాష్ బదిలీ అయిన సందర్భంలో నెల రోజులు, బుచ్చయ్య రిటైర్డు అయి కొత్త డీడీ వచ్చేంతవరకు 8 నెలలు, శోభారాణి బదిలీ అయిన సందర్భంలో ఏడు నెలలు ఇన్చార్జిగా వ్యవహరించారు. అయితే పలు కారణాలతో ఇన్చార్జీ బాధ్యతల నుంచి సారయ్యను తప్పించి ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీ నుంచి హంద్రీనీవా సుజల స్రవంతి స్పెషల్ కలెక్టర్ బాలనాయక్కు ఆ బాధ్యతలు అప్పగించారు. -
స్వచ్ఛంద సంస్థతో ప్రత్యేక ప్రవేశ పరీక్ష
ప్రైవేట్ మెడికల్ యాజమాన్య సీట్లపై సర్కారు నిర్ణయం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, ఏఎఫ్ఆర్సీ ఆధ్వర్యంలో పరీక్ష ? గతేడాదే ఫీజులు పెంచినందున మళ్లీ పెంచబోమన్న మంత్రి లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కళాశాలల ఎంబీబీఎస్ యాజమాన్య కోటా సీట్లకు ఈ విద్యా సంవత్సరం నుంచే.. స్వచ్ఛంద సంస్థతో ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాదే ఫీజులు పెంచినందున ఈసారి మళ్లీ పెంపు ఉండదని కూడా స్పష్టంచేసింది. ప్రత్యేక ప్రవేశ పరీక్ష, ఫీజుల పెంపు విషయాలపై ఇటీవల ప్రైవే ట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి రెండుసార్లు చర్చించిన విషయం విదితమే. ఈ విషయమై ఆయన సీఎం కేసీఆర్‌తో చర్చించారు. సీఎం ఆమోదం మేరకు స్వచ్ఛంద సంస్థతో ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని మంత్రి లక్ష్మారెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదిరిగానే.. స్వచ్ఛంద సంస్థతో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్న మంత్రి అదెలా ఉంటుందో మాత్రం స్పష్టంగా పేర్కొనలేదు. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని సీట్లకు, ఎలా పరీక్ష నిర్వహిస్తుందో.. ఇక్కడ కూడా అలాగే చేస్తామన్నారు. కాగా, తెలంగాణలో మొత్తం 2,950 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వాటిలో 850 సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో, 2,100 సీట్లు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం 35 శాతం ప్రైవేట్ యాజమాన్య కోటా సీట్లుగా నిర్ణయించి దానికే ప్రత్యేక ప్రవేశ పరీక్ష చేపట్టింది. ఆ ప్రకారం తెలంగాణలో 35 శాతం యాజ మాన్య కోటా కింద 735 సీట్లకు ప్రత్యేక పరీక్ష నిర్వహించే అవకాశం ఉంటుంది. స్వచ్ఛంద సంస్థగా స్వయంప్రతిపత్తి కలిగిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ద్వారా ఏపీ ప్రభుత్వం ప్రవేశ పరీక్ష చేపట్టింది. పర్యవేక్షణ బాధ్యతను అడ్మిషన్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) అప్పగించింది. మన ప్రభుత్వం కూడా వాటి ద్వారానే ఈ పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కౌన్సిలిం గ్ను ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ వర్సిటీకే అప్పగించింది. మన ప్రభుత్వమూ అదే చేసే అవకాశం ఉంది. కౌన్సెలింగ్‌లో ప్రైవేట్ యాజ మాన్యాలు కూడా పాల్గొనే వెసులుబాటు ఉండే అవకాశాలున్నాయి. -
కిరాణం..బంద్!
హాస్టళ్లకు నిత్యావసర వస్తువుల సరఫరా ఆగిపోయింది.. దురాశకు పోయి కాంట్రాక్టర్లు ఎమ్మార్పీ కంటే తక్కువకు కోట్‌చేసి టెండర్ దక్కించుకున్నారు.. ఆ తర్వాత ధరలు మండిపోతున్నాయంటూ మెలిక పెట్టి సరుకుల సరఫరా నిలిపివేశారు. నల్లగొండ : సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు కిరాణం సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. నిబంధనలకు లోబడి నాణ్యమైన సరుకులు సరఫరా చేయాలనే అధికారుల నిర్ణయాన్ని టెండరుదారులు బేఖాతరు చేశారు. 2014-15 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని 122 హాస్టళ్లకు కిరాణం సరుకులు సరఫరా చేసే నిమిత్తం గతేడాది మేలో టెండర్లు పిలిచారు. సాధారణ ఎన్నికల అనంతరం జూలైలో ఆరు ఏజెన్సీలను ఎంపిక చేసి కిరాణ సరుకుల సరఫరా కాంట్రాక్టు అప్పగించారు. మొదటి రెండు నెలలు సరఫరా చేసిన ఏజెన్సీలు ఆ తర్వాత లేనిపోని కారణాలను సాకుగా చూపి సరుకులు సరఫరా చేయకుండా మొండికేశాయి. దీంతో అప్పటినుంచి ఈ ఏడాది విద్యాసంవత్సరం ముగిసే వరకు ఆ భారాన్ని వార్డెన్లే మోయాల్సి వచ్చింది. సరుకుల కొనుగోలులో అక్రమాలు నియంత్రించి, నాణ్యమైన వస్తువులు సరఫరా చేయాలన్న ఉద్దేశంతోనే సాంఘిక సంక్షేమ శాఖ ప్రతి ఏడాది విద్యాసంవత్సరం ఆరంభానికి నెల రోజుల ముందుగానే టెండర్లు పిలిచి ఏజెన్సీలు ఎంపిక చేస్తోంది. అదే పద్ధతి అవలంబించిన అధికారులకు గతే డాది చేదు అనుభవం ఎదురైంది. దురాశకు పోయి... టెండర్‌దారులు దురాశకు పోయి అతితక్కువ ధరలకు సరుకులు సరఫరా చేస్తామని కాంట్రాక్టు దక్కించుకున్నారు. ఉదాహరణకు విజయా పామాయిల్ లీటరు రూ.63, కందిపప్పు కి లో రూ.60, చక్కెర కిలో రూ.31, టైగర్/సన్‌ఫీస్ట్ బిస్కట్ ప్యాకెట్ ఎమ్మార్పీ మీద 5 పైసలు తక్కువ...ఇలా 29 రకాల సరుకులు మార్కెట్ ధరల కంటే చౌక ధరలకు సరఫరా చేస్తామని పోటీ పడి మరీ టెండర్లు వేసి కాంట్రాక్టు తీసుకున్నారు. ఒప్పందం ప్రకారం ఏజెన్సీలు రెండు మాసాలకోసారి ఇండెంట్ ప్రకారం సరుకులు సరఫరా చేయాలి. ఈ సరుకులు హాస్టళ్ల పాయింట్ వద్దకు కాకుండా సంబంధిత సహాయ సాంఘిక సంక్షేమాధికారి కార్యాలయానికి (ఏఎస్డబ్ల్యూఓ) సరఫరా చేయాలి. శాంపిల్స్ ప్రకారం నాణ్యమైన వస్తువులు మాత్రమే ఇవ్వాలి. ఏఎస్డబ్ల్యూఓ వద్దకు వచ్చిన సరుకులు స్టాకు రిజిస్టర్లో నమోదు చేసిన తర్వాత హాస్టళ్లకు పంపిణీ చేయాలి. సరుకుల బిల్లుల ధ్రువీకరించడంలో కూడా ఏపీజీఎస్టీ/ టిన్ నంబరు ఉన్న వాటికి మాత్రమే నగదు చెల్లింపులు చేస్తామనే నిబంధన విధించారు. దీంతో మొదటి రెండు మాసాలకు అవసరమయ్యే సరుకులను ఏఎస్డబ్ల్యూఓ కార్యాలయాలకే సరఫరా చేశారు. అయితే హాస్టల్స్ అవసరాలకు అనుగుణంగా కాకుండా సరుకులన్నీ గంపగుత్తగా తీసుకొచ్చి పడేశారు. ఒప్పందం ప్రకారం కాకుండా అలా ఇష్టం వచ్చినట్లు సప్లయ్ చేస్తే అంగీకరించేది లేదని సహాయ అధికారులు తేల్చి చెప్పారు. దీంతో కంగుతున్న ఏజెన్సీలు ఇలాగైతే తమ పొట్టనింపుకోవడం కష్టమని భావించి సరుకులను ఏఎస్ డబ్ల్యూఓ కార్యాలయాలకు కాకుండా హాస్టళ్లకు నేరుగా పంపిస్తామని మెలిక పెట్టారు. నేరుగా సరఫరా చేయడం వల్ల ఎదురయ్యే పరిణామాలను ముందుగానే ఊహించే జిల్లా అధికారులు నిబంధనలు కఠినం చేశారు. దీంతో ఏజెన్సీలు ఓ అడుగు ముందుకు వేసి మార్కెట్లో ధరలు పెరిగాయని, వాటికి అనుగుణంగా టెండరు ధరలు సవరిస్తే అందజేస్తామని మరో మెలిక పెట్టారు. దీనికి జిల్లా అధికారులు ససేమిరా ఒప్పుకోకపోవడంతో ఏజెన్సీలు సరఫరా నిలిపేశాయి. దీంతో మరో గత్యంతరం లేక వార్డెన్లు సరుకులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంత జరిగినా ఇప్పటి వరకు ఆ ఏజెన్సీలపై ఎలాంటి చర్యలూ తీసుకోని జిల్లా యంత్రాంగం మళ్లీ వచ్చే విద్యాసంవత్సరానికి కిరాణం టెండర్లు పిలిచేందుకు సిద్ధమైంది. -
సంక్షేమ హాస్టళ్లకు మంగళం!
50 నుంచి 65 మందిలోపు విద్యార్థులున్న హాస్టళ్ల ఎత్తివేతకు రంగం సిద్ధం తొలుత ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న వాటిపై దృష్టి 2015-16 విద్యా సంవత్సరం నుంచి శ్రీకారం కడప రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల సంక్షేమం పట్ల కపట ప్రేమ ప్రదర్శిస్తోంది. ఉన్న హాస్టళ్లను అభివృద్ధి చేయకుండా తక్కువ విద్యార్థులు ఉన్నారనే సాకుతో ఎత్తి వేయడానికి పావులు కదుపుతోంది. తొలుత ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న హాస్టళ్లను ఎత్తి వేయడానికి సంకల్పించింది. సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని 143 వసతి గృహాల్లో వంద హాస్టళ్లు ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతుండగా, 43 హాస్టళ్లు ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్నాయి. నిధుల కొరత నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు తక్కువగా ఉన్నారనే నెపంతో ఎత్తివేయడానికి సంకల్పించింది. ఆ మేరకు 50 నుంచి 65 లోపు విద్యార్థులుండి.. ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న హాస్టళ్ల వివరాలను ప్రభుత్వం సేకరించింది. ఈ శాఖ పరిధిలో మొత్తం 43 ప్రైవేటు భవనాల్లో హాస్టళ్లలో కొనసాగుతుండగా, అందులో 17 హాస్టళ్లలో 50 నుంచి 65లోపు కంటే తక్కువగా విద్యార్థులున్నారు. మొత్తం 774 మంది విద్యార్థులు ఉన్నట్లుగా ధ్రువీకరించారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ పరిధిలో మొత్తం 60 హాస్టళ్లు ఉండగా, వాటిల్లో 4 హాస్టళ్లలో 50 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్నట్లు ధ్రువీకరించారు. గురుకుల పాఠశాలల్లోకి తరలిస్తారట! ఐదు నుంచి 10వ తరగతి విద్యార్థులను సమీపంలోని గురుకుల పాఠశాలల్లో ఒక్కో తరగతిలో 10 మంది విద్యార్థులను చేర్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. అక్కడ వసతులు ఉన్నాయా? లేవా? అనే వివరాలు కూడా సేకరించింది. గురుకుల పాఠశాలల్లో సీట్ల వివరాలను రాబట్టి 2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించి చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. ఆ ప్రకారం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖలో తొలి దశలో 17 వసతి గృహాలను ఎత్తి వేయనున్నారు. బీసీ సంక్షేమ శాఖకు సంబంధించి ఇంకా నిర్ణయం వెలువడలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లేదా? ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాలను ఎత్తివేసి సమీపంలోని గురుకుల పాఠశాలల్లో ఆయా విద్యార్థులను చేర్పించి నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లేదని ప్రభుత్వం పరోక్షంగా ఒప్పుకున్నట్లేనా.. అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్య ఉంటే ఆ విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అందించవచ్చుకదా అని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. వివరాలు అడిగారు.. ప్రైవేటు భవనాల్లో నడుస్తూండి.. తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్న హాస్టళ్ల వివరాలను ప్రభుత్వం అడిగింది. అందుకు సంబంధించిన సమాచారం నివేదించాము. ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటాం. - పీఎస్ఏ ప్రసాద్, జాయింట్ డెరైక్టర్, సాంఘిక సంక్షేమ శాఖ, వైఎస్సార్ జిల్లా. -
సాంఘిక సంక్షేమానికి కోత
బెంగళూరు:గత ఏడాది బడ్జెట్‌తో పోలిస్తే ఈ ఏడాది సాంఘిక సంక్షేమ శాఖకు నిధుల కేటాయింపులో భారీగానే కోతపడింది. గతఏడాది బడ్జెట్లో రూ.6,475 కోట్లు కేటాయించగా ఈ బడ్జెట్లో రూ.4,584 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే మొత్తంగా సాంఘిక సంక్షేమ శాఖకు రూ.1,891 కోట్లు తగ్గించారు.ఎస్సీ, ఎస్టీలకు గ్రామీణ ప్రాంతాల్లో యూనిట్‌కు రూ.1.5లక్షల వ్యయంతో లక్ష ఇళ్ల నిర్మాణం, పట్టణ ప్రాంతాల్లో యూనిట్‌కు రూ.1.8లక్షల వ్యయంతో 50వేల ఇళ్ల నిర్మాణం అస్పృశ్యతా నివారణ దిశగా ఇతర వర్ణాలకు చెందిన అమ్మాయిని వివాహం చేసుకునే అబ్బాయిలకు ఇచ్చే ప్రోత్సాహకం రూ.50వేల నుంచి రూ. 2లక్షలకు పెంపు, ఇతర వర్ణాలకు చెందిన అబ్బాయిని వివాహం చేసుకునే అమ్మాయిలకు ఇచ్చే ప్రోత్సాహకం లక్ష రూపాయల నుంచి రూ.3లక్షలకు పెంపుప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల భోజనం ఖర్చులు రూ.800 నుంచి రూ.900కు పెంపు(నెలవారీగా) సొంత భవనం కలిగిన అన్ని ప్రభుత్వ కళాశాలల వసతి గృహాల్లో కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్స్‌ను ఏర్పాటు చేయడంతో పాటు ఈ-లర్నింగ్ సదుపాయం సైతం అందుబాటులోకి ఏడాదికి ఆరు లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉన్న ఎస్సీ,ఎస్టీల పిల్లలకు 100శాతం ఫీజు రీఎంబర్స్మెంట్. -
బాలికపై సమీప బంధువు అత్యాచారయత్నం
పిఠాపురం: వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న ఓ బాలికను నూతన వస్త్రాలు ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్లిన సమీప బంధువు ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో ఆదివారం రాత్రి జరగ్గా... బాధితురాలి తల్లిదండ్రులు సోమవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సాంఘిక సంక్షేమ శాఖ సమీకృత బాలికల వసతి గృహానికి చెందిన 9వ తరగతి విద్యార్థినిని సమీప బంధువు ఆదివారం సాయంత్రం బయటకు తీసుకెళ్లాడు. నూతన వస్త్రాలు ఇప్పిస్తానని చెప్పి నేరుగా ఓ లాడ్జీకి తీసుకెళ్లిన అతడు అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. బాలిక కేకులు పెట్టగా కొట్టాడు. ఆమె అక్కడి నుంచి పారిపోయి వసతి గృహానికి వచ్చి జరిగిన విషయాన్ని సిబ్బందికి చెప్పింది. వారు ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిర్భయ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఇదేనా ‘సంక్షేమం’..!
ఇందూరు: ‘నీళ్లుంటే, బాత్రూంలుండవు.. బాత్రూంలుంటే నీళ్లుండవు. సన్నబియ్యం వండుతున్నరు.. కానీ కూరలు, పప్పులు నాణ్యంగా ఉండవు. పప్పును చూస్తే నీళ్లలో పసుపు కలిపినట్లుగా ఉంటుంది. కొన్ని హాస్టళ్లను చూస్తే పశువులా కొట్టాల్లా ఉన్నారుు.. ఇదేనా... పిల్లలకు ఇచ్చే సంక్షేమం..’ అని సాంఘిక సంక్షేమ స్థాయీసంఘం సంబంధిత శాఖాధికారులపై మండిపడింది. జిల్లా పరిషత్‌లో సాంఘిక సంక్షేమం స్థాయి సంఘం సమావేశం ఆ కమిటీ చైర్మన్ కున్యోత్ లత అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సంఘం సభ్యులు సంక్షేమాధికారుల పనితీరును ఎండగట్టారు. చదివించే స్థోమత లేని పేద తల్లిదండ్రులు తమ పిల్లలను నమ్మకంతో వసతిగృహాలకు పంపుతున్నారు. అలాంటి పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం నిధులనూ ఇస్తోంది. కానీ.. బాధ్యతలను నెరవేర్చాల్సిన అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వార్డెన్లు స్థానికకంగా ఉండాలని నిబంధనలు ఉన్నా.. పాటించడం లేదని ఆరోపించారు. సహాయ సంక్షేమాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే వార్డెన్లు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారన్నారు. కొన్ని వసతిగృహాల్లో విద్యార్థులకు పెట్టే భోజన మెనూ లేదని, హాస్టళ్లు అధ్వానంగా ఉన్నాయని జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు అసహనం వ్యక్తం చేశారు. తాగునీటి, టాయిలెట్ల సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, తాను విజిట్ చేసినప్పుడు నిజాలు బయటపడినట్లు తెలిపారు. తమ మండలంలో ఉన్న ఓ వసతిగృహం పరిస్థితి చూస్తే మరీ దారుణంగా ఉందని, పశువుల కొట్టాన్ని తలపిస్తోందని స్థాయిసంఘం చైర్మన్ కున్యోత్ లత ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమ్‌గల్, కుద్వాన్పూర్ వసతిగృహాల వార్డెన్ల పనితీరు బాగోలేదని, వారికి మెమోలు జారీ చేయాలని స్థాయీ సంఘం సభ్యులు తీర్మానించారు. కల్యాణలక్ష్మి పథకం కార్యక్రమాల్లో జడ్పీటీసీలను పిలువడం లేదని, ఇక ముందు తప్పనిసరిగా పిలువాలని నిర్ణయించారు. సాక్షి కథనంతో ఆరా.. డిసెంబర్లో ఎస్సీ వసతిగృహాల విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేసిన వాటిలో గోల్మాల్ జరిగిందని, నాణ్యత లేని దుప్పట్లు పంపిణీ చేశారని పక్షం రోజుల కిత్రం సాక్షి జిల్లా టాబ్లాయిడ్లో ‘దుప్పట్ల కొనుగోల్‌మాల్’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. ఈ విషయంపై జడ్పీ ఇన్చార్జి సీఈఓ, ఏజేసీ రాజారాం ఆరా తీశారు. స్థాయి సంఘ సమావేశానికి వచ్చిన ఏఎస్‌డబ్ల్యుఓ జగదీశ్వర్ రెడ్డిని ప్రశ్నించారు. దుప్పట్ల కొనుగోలు టెండర్లు పిలువడం మట్టుకే పరిశీలన కమిటీని సద్వినియోగం చేసుకున్నారని, పంపిణీ చేసే సమయంలో కమిటీ ముందు పెట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యతను చూడకుండా ఎలా పంపిణీ చేశారన్నారు. దీని విషయంలో తనకు వివరణ ఇవ్వాలని దేశించారు. అలాగే సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన ఇంజినీరింగ్ శాఖ చేపడుతున్న భవనాల నిర్మాణాల నివేదిక పాతది ఇవ్వడంపై సంబంధిత అధికారిపై మండిపడ్డారు. బీసీ సంక్షేమ శాఖ ద్వారా నడుస్తున్న బీసీ స్టడీ సర్కిల్లో అభ్యర్థులకు కోచింగ్ ఇచ్చే విషయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మధ్యాహ్నాం మూడు గంటలకు పనుల స్థాయి సంఘ సమావేశం జరిగింది. భవనాలు, రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, ఇతర పనులన్నింటినీ త్వరగా పూర్తి చేయాలని కమిటీ సభ్యులు తీర్మానం చేశారు. -
మంత్రి కిషోర్‌బాబును అడ్డుకున్న ఎమ్మార్పీఎస్ నాయకులు
ఒంగోలు(ప్రకాశం జిల్లా): సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు మందకృష్ణ మాదిగపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఎమ్మార్పీఎస్నాయకులు ఒంగోలులో ఆయనను అడ్డుకున్నారు. శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ మందకృష్ణ మాదిగకు డబ్బులు ఇవ్వడంతో ఆయన ఆ పార్టీని విమర్శించడంలేదని ఆరోపించారు. దీంతో శనివారం ఒంగోలులో మరో మంత్రి సిద్దరాఘవరావు ఇంటి వద్ద ఎమ్మార్పీఎస్ నాయకులుకిషోర్బాబును అడ్డుకున్నారు. ఆయన వారిని పట్టించుకోకపోవడంతో సిద్ధరాఘవరావు ఇంటి ముందు నినాదాలు చేశారు. దీంతో ఆయన వారిని ఇంటిలోకి పిలిచి మంతనాలు జరుపుతున్నారు. -
మేడపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యా యత్నం
టీచర్ నిత్యం మందలిస్తుండడమే కారణం ? ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన విశాఖలో చికిత్స పొందుతున్న బాలిక గరుగుబిల్లి: టీచర్ నిత్యం మందలిస్తుండడాన్ని భరించలేక ఓ విద్యార్థిని మేడపై నుంచి దూకి ఆత్మహత్యా యత్నం చేసింది . అయితే పాఠశాల యాజమాన్యం ఈ విషయాన్ని గోప్యంగా ఉం చింది. హోం వర్క్ చేయడంలేద ని, సక్రమంగా చదవడం లేదని నిత్యం టీచర్ మందలిస్తుండడం తో మనస్తాపానికి గురైన రవ్వ రేవతి అనే విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గరుగుబిల్లి మండల కేంద్రంలోని ఏపీ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఆమె గత నెల 28న పాఠశాల మేడపైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తోటి విద్యార్థినులు చెబుతున్నారు. మేడపైనుంచి దూకడంతో తీవ్రంగా గాయపడిన ఆమెకు స్థానికంగా చికిత్స చేసి, 29న ఉదయం తల్లిదండ్రులతో ఆ విద్యార్థినిని పంపించారు. ప్రస్తుతం విద్యార్థిని విశాఖపట్నంలోని కేజీహెచ్ లో చికిత్స పొందుతోంది. ఈ విషయాన్ని తెలుసుకున్న సీపీఎం, ఎస్ఎఫ్ఐ నాయకులు బుధవారం పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులను నిలదీశారు. విద్యార్థినులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేయడంవల్లే ఆత్మహత్యా యత్నాలకు పాల్పడుతున్నారని సీపీఎం నాయకులు ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ మాణిక్యం మాట్లాడుతూ రేవతికి బ్రెయిన్‌కు సంబంధించిన వ్యాధి ఉందని, పలుమార్లు ఉన్నట్లుండి పడిపోతుండేదని ఈ విషయాన్ని తల్లిదండ్రులకు కూడా తెలియజేశామన్నారు. మెట్లు ఎక్కుతుండగా రేవతి పడిపోవడంతో గాయాలు పాలైనట్లు తెలిపారు. -
ఏ ఒక్కరూ ఆకలితో అలమటించరాదు
సీఎం సిద్ధరామయ్య బళ్లారి(దావణగెరె): రాష్ర్టంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించరాదన్న భావనతోనే అన్నభాగ్య పథకాన్ని ప్రవేశపెట్టినట్లు రాష్ర్ట ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. మంగళవారం దావణగెరె జిల్లా చెన్నగిరిలో ఏర్పాటు చేసిన తరళబాళు హుణ్ణిమె కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చిన్నతనంలో పడిన కష్టాలు, గడిపిన గడ్డు రోజులే రాష్ట్రంలో అన్నభాగ్య పథకం జారీకి కారణమయ్యాయని వివరించారు. రాష్ట్రంలో ప్రతి 100 మందిలో 24 మంది ఒక పూట భోజనానికి కూడా తల్లడిల్లుతున్నారని తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన తర్వాత చేపట్టిన సమీక్షలో తేలిందన్నారు. దీనికి పరిష్కారం కోసమే ఈ పథకమని, ఇందుకోసం రూ. 4500 కోట్లు వెచ్చిస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి హెచ్.ఆంజనేయ మాట్లాడుతూ ఉబ్రాణి ఎత్తిపోతల పథకం మాదిరిగానే తరీకెరె, బుక్కుంబుది చెరువు 750 ఎకరాల విశాలమైన చెరువు అభివృద్ధి, చెన్నగిరి, తరీకెరె, దావణగెరె, చిత్రదుర్గంలోని 53 చెరువులకు నీటిని నింపే ఇంకా రెండు పథకాలను సిరిగెరె స్వామీజీ ప్రతిపాదించారన్నారు. వాటికి కూడా ముఖ్యమంత్రి నిధులు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సిరిగెరె మఠం తరళబాళు జగద్గురు డాక్టర్ శ్రీశివమూర్తి శివాచార్య స్వామీజీ, సాణెహళ్లి డాక్టర్ పండితారాధ్య శివాచార్య స్వామీజీ, రేణుక శివాచార్య స్వామీజీ, అభినవ సిద్ధలింగ శివాచార్య స్వామీజీ, ఎమ్మెల్యే వడ్నాళ్ రాజణ్ణ, మాజీ ఎమ్మెల్యే మాడాళు కె.విరుపాక్షప్ప, తుమ్కోస్ అధ్యక్షుడు హెచ్ఎస్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మెస్ నిర్వాహకులపై రావెల ఆగ్రహం
విజయవాడ: సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు సోమవారం నూజివీడు ట్రిపుల్ ఐటీలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో భోజన సదుపాయం సరిగా లేదని విద్యార్థు మంత్రి దృష్టికి తెచ్చారు. దీంతో రావెల మెస్ నిర్వాహకులైన నూర్వెల్ కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటానని వారిని హెచ్చరించారు. -
వరంగల్‌లో కలెక్టర్ ఆకస్మిక పర్యటన
వరంగల్: వరంగల్ జిల్లా కలెక్టర్ వి. కరుణ మంగళవారం నగరంలో ఆకస్మికంగా పర్యటన చేపట్టారు. అండర్ రైల్వే బ్రిడ్జి సమీపంలోని పెరిక బాలికల వసతి గృహాన్ని ఆమె ఈరోజు ఉదయం తనిఖీ చేశారు. వసతి గృహంలోని సౌకర్యాలపై బాలికలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్... నగరంలోని మురుగు నీటి పారుదల వ్యవస్థను పరిశీలించారు. పరిస్థితిని మెరుగుపరచాలని అధికారులను ఆమె ఆదేశించారు. -
కీలక అధికారులేరీ..?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : అభివృద్ధి పరంగా జిల్లాను పరుగులు తీయించాలని ప్రయత్నిస్తున్న ప్రభుత్వం జిల్లాలో సుదీర్ఘకాలం నుంచి ఖాళీగా ఉంటున్న పలు కీలక పోస్టులపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇన్చార్జిల ఏలుబడిలో ఉన్న ఆయా శాఖలకు పూర్తిస్థాయి అధికారులను నియమించే విషయమై పరిశీలన చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలైనా పలు కారణాల వల్ల జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల పోస్టులు భర్తీకి నోచుకోలేదు. జిల్లా మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు బాధ్యతలు తీసుకోవడంతో పూర్తిస్థాయి అధికారుల నియామకం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అభివృద్ధి పరంగా జిల్లాను అగ్రగామిగా ఉంచాలంటే అన్ని కీలక శాఖలకు పూర్తిస్థాయి అధికారులు ఉండి తీరాల్సిందేనని మంత్రి తుమ్మల నిశ్చితాభిప్రాయంతో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఏయే శాఖల కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి.. అనే విషాయాన్ని జిల్లా అధికారయంత్రాంగంతో చర్చించినట్లు తెలుస్తోంది. కీలకమైన ఖమ్మం నగర పాలక సంస్థ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం, సోషల్ వెల్ఫేర్ డీడీ వంటి కీలక శాఖలకు జిల్లాస్థాయి అధికారులు లేకపోవడం వల్ల పాలనాపరంగా జరుగుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వీటిని భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో జిల్లాలో విశిష్ట సేవలు అందించిన అధికారులలో కొందర్ని తిరిగి జిల్లాకు తీసుకురావడానికి అధికార పార్టీ నుంచి ప్రయత్నాలు ప్రారంభమైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే జిల్లాలో కీలక శాఖల కోసం మరోవైపు ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న కొందరు అధికారులే తీవ్ర స్థాయిలో పైరవీలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. జిల్లాపై అవగాహన, వారి పనితీరు ప్రాతిపదికగా తీసుకుని ఖమ్మం నగర పాలక సంస్థకు గ్రూప్-1 అధికారిని లేదా ఐఏఎస్ అధికారిని నియమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే కీలకమైన డీఆర్డీఏ పీడీ పదవి కోసం భారీ పైరవీలు సాగుతున్నాయని సమాచారం. పలు ప్రధాన శాఖలకు జిల్లా అధికారులు పూర్తిస్థాయిలో లేకపోవడంతో ఆ శాఖల పనితీరు మందకొడిగా కొనసాగుతోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. పలు కీలక ఫైళ్లను చూసే తీరిక, క్షేత్రస్థాయిలో పర్యటన చేసే ఓపిక కొందరు ఇన్చార్జి అధికారులకు ఉండటం లేదన్న అపవాదు గత కొన్ని నెలలుగా వినపడుతోంది. తమ సొంత శాఖల వ్యవహారాలు చక్కదిద్దడానికి ఇచ్చే ప్రాధాన్యం కొందరు అధికారులు ఇన్చార్జిగా ఉన్న శాఖలకు ఇవ్వకపోవడంతో అక్కడి సిబ్బంది ఫైళ్లతో రోజుల తరబడి జిల్లా అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. తలకు మించినభారం కొత్తరాష్ట్రంలో ప్రభుత్వ అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. వాటిని సక్రమంగా అమలు చేయడం ఇన్చార్జి అధికారులకు భారంగా మారింది. మాతృశాఖలో పనులు చక్కపెట్టడంతో పాటు మరో శాఖ బాధ్యతలు చూడటం వారికి తలనొప్పిగా మారింది. పలు సమీక్ష సమావేశాల్లో ప్రజాప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సరైన జవాబు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఒకరికే రెండు శాఖల బాధ్యతలు ఉండటంతో పనిభారంతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నట్లు ఓ అధికారి చెప్పారు. అవగహన లేక ఇబ్బందులు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వ పలు పథకాలను అమలు చేస్తోంది. వీటిపై ఇన్చార్జిలుగా కొనసాగుతున్న అధికారులకు అవగహన లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూర్తిస్థాయిలో అజమాయిషీ లేక, కిందిస్థాయి ఉద్యోగులను సమన్వయం చేయలేక నానాతంటాలు పడుతున్నారు. ఆయా శాఖల్లో పాలనపై పర్యవేక్షణ కుంటుపడుతోంది. కొందరు అధికారులు ఇన్చార్జి పాలనతో అందినకాడికి మెక్కుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇన్చార్జిల పాలనలో ఉన్న కీలక శాఖలు ఇవే.. ఖమ్మం కార్పొరేషన్‌కు జిల్లా కలెక్టర్ ఇలంబరితి ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తున్నారు. నగర పాలక సంస్థకు కమిషనర్ లేక పోవడంతో మెప్మా పీడీ వేణుమనోహర్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. అలాగే నగరపాలక సంస్థకు పూర్తిస్థాయి మేనేజర్ సైతం లేకపోవడంతో ఇన్చార్జితోనే నెట్టకొస్తున్నారు. పూర్తిస్థాయి జిల్లా పంచాయతీ అధికారి లేకపోవడంతో డీఎల్పీవో రవీందర్తోనే పంచాయతీ పాలన సాగుతోంది. డీఆర్డీఏ పీడీ పద్మజారాణి బదిలీపై వెళ్ళడంతో ఆమెస్థానంలో జిల్లా పరిశ్రమల మేనేజర్ శ్రీనివాస్‌నాయక్ కొనసాగుతున్నారు. గృహ నిర్మాణ శాఖ పీడీ రాందేవ్‌రెడ్డి బదిలీపై వెళ్ళడంతో మధిర డీఈగా పని చేస్తున్న వైద్యం భాస్కర్‌కు ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చారు. - ఎస్సీ వెల్ఫేర్ డీడీ రంగలక్ష్మీదేవి సెలవుపై వెళ్లడంతో సీపీవో డీడీ జెడ్. రాందాస్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. జిల్లా పరిషత్ డెప్యూటి సీఈవో కర్నాటి రాజేశ్వరి, ఏఓ అప్పారావులు ఇన్‌చార్జులుగానే విధులు నిర్వహిస్తున్నారు. డ్వామా పీడీ జగత్‌కుమార్‌రెడ్డి కూడా ఇన్చార్జి విధుల్లోనే కొనసాగుతున్నారు. -
పట్టాలిచ్చింది పొమ్మనడానికేనా?
రామచంద్రపురం :‘మీరు ఇల్లు కట్టుకోలేదు గనుక.. గతంలో ఇచ్చిన ఈ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటాం’ అంటూ రెవెన్యూ అధికారులు జారీ చేస్తున్న నోటీసులు రామచంద్రపురం అర్బన్, రూరల్ ప్రాంతాల్లో పేదలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇచ్చిన జాగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, ఇళ్ల నిర్మాణానికి కృషి చేయాల్సి ఉండగా.. జిల్లాలో ఎక్కడా లేనట్టు వెనక్కి లాక్కునే ప్రయత్నం చేస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారు. రామచంద్రపురం మండలంలోని ఆదివారపుపేటలో 13, నరసాపురపుపేటలో 10 ఎకరాలను 2007లో ప్రభుత్వం సేకరించింది. స్థలాల మెరక నిమిత్తం అప్పట్లో సాంఘిక సంక్షేమ శాఖ నుంచి ఆదివారపుపేట భూమికి రూ.3 కోట్లు, నరసాపురపుపేట భూమికి రూ.1.80 కోట్లు మంజూరు చేశారు. ఆదివారపుపేటలో సేకరించిన స్థలాన్ని మెరకపనులు పూర్తిచేసి 525 లబ్ధిదారులకు పట్టాలిచ్చారు. నరసాపురపుపేటలో అసంపూర్తి మెరక పనులతోనే 170 మందికి పట్టాలందజేశారు. అనంతరం వచ్చిన ప్రభుత్వం ఆ స్థలాల్లో గృహనిర్మాణానికి పూనుకోకపోగా తాగునీరు, విద్యుత్ వంటి కనీస సదుపాయాలు కల్పించలేదు. గృహనిర్మాణ శాఖ ద్వారా రుణాలు సైతం మంజూరు చేయలేదు. దీంతో లబ్ధిదారులు ఇళ్లు కట్టుకునేందుకు వీలులేకపోయింది. ఇప్పుడు ‘మీరు ఇల్లు కోలేదు. మీ అందరి ఇంటి పట్టాలు రద్దు చేసి, స్థలాలు స్వాధీనం చేసుకుంటాం’ అంటూ తహశీల్దార్ నోటీసులు ఇవ్వడం లబ్ధిదారులను ఆందోళనకు గురిచేస్తోంది. రుణాలు మంజూరు చేయకుండా ఇళ్లు ఎలా నిర్మించుకోగలమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరవై ఏళ్లు పోరాడి సాధించుకున్న స్థలాలను లాక్కొనే ప్రయత్నమేమిటని ప్రశ్నిస్తున్నారు. నోటీసులపై ఇదేమిటని ప్రశ్నిస్తే ఆ స్థలాల్లో ప్రభుత్వం వివిధ కళాశాలలను నిర్మిస్తుందని తహశీల్దార్ చెబుతున్నారని లబ్ధిదారులు అంటున్నారు. నిరుపేదలకు అందించిన స్థలాల్లో కళాశాలలు నిర్మించటమేమిటని ప్రశ్నిస్తున్నారు. స్థానిక అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ల మేరకే ఇలా జరుగుతోందన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పట్టాల రద్దును నిలిపివేసి, రుణాలు మంజూరు చేస్తే ఇంటి నిర్మాణం చేపడతామంటున్నారు. దీనిపై కలెక్టర్‌ను ఆశ్రయిస్తామంటున్నారు. పాత పట్టాలు రద్దు చేసి.. తమ వారికి కట్టబెట్టాలని.. కాగా రామచంద్రపురం అర్బన్ పరిధిలోని కొత్తూరులో గతంలో 42 ఎకరాలు సేకరించి, జీ ప్లస్ తరహాలో గృహ సముదాయం నిర్మించి ఇచ్చేందుకు పట్టణంలో పేద, మధ్య తరగతులకు చెందిన 2800 మందిని ఎంపిక చేసి పట్టాలు ఇచ్చారు. స్థలం మెరక పనులకు సుమారు రూ.3 కోట్లు కేటాయించారు. కాగా ప్రభుత్వాలు మారాక ఈ స్థలాన్ని పట్టించుకునే వారే లేరు. ఇప్పుడు.. గతంలో ఇచ్చిన పట్టాల్ని రద్దు చేసి, కొత్తగా అధికార పార్టీ కార్యకర్తలకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణ వినిపిస్తోంది. ఈమేరకు అధికార పార్టీకి చెందిన కొందరు తమ పార్టీ కార్యకర్తల నుంచి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులతో పాటు కొంత సొమ్మును కూడా వసూలు చేస్తున్నట్టు సమాచారం. గతంలో ఇదే స్థలంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను కట్టేందుకు స్థానిక ప్రజాప్రతినిధి ప్రయత్నించి నిబంధనలు అడ్డు రావటంతో వెనుకంజ వేశారు. ఇప్పుడు పాత పట్టాలను రద్దు చేయడానికి అధికార పార్టీ నేతలు రెవెన్యూ అధికారులను వాడుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఇళ్లు కట్టుకోనందునే నోటీసులిచ్చాం.. ఆదివారపుపేట, నరసాపురపుపేటల్లో గతంలో పట్టాలు పొందిన వారికి నోటీసులు ఇవ్వడంపై రామచంద్రపురం తహశీల్దార్ టీఎల్ రాజేశ్వరరావును వివరణ కోరగా లబ్ధిదారులు ఇళ్లు కట్టుకోనందునే పట్టాల రద్దుకు నోటీసులిచ్చామన్నారు. గృహనిర్మాణ శాఖ రుణాలు మంజూరు ఎందుకు చేయలేదనే విషయాన్ని ఆ శాఖ అధికారులతో చర్చించి అనంతరం పట్టాల రద్దుకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తామన్నారు. -
నేనూ పేదింటి బిడ్డనే...
నిత్యం నియోజకవర్గ ప్రజల అర్జీలస్వీకరణ.. అధికారులతో సమీక్షలు.. పార్టీ నాయకుల, కార్యకర్తలతో భేటీలు.. బిజీబిజీగా గడిపే సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్.. ఆదివారం సాయంత్రం మాత్రం అన్నీ కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు. అధికారులతో తర్వాత మాట్లాడతానంటూ ఫోన్లు బందు పెట్టుకున్నారు. తనను ఆదివారం కలవద్దంటూ పార్టీ కార్యకర్తలకు కరాఖండిగా చెప్పేశారు. సాయంత్రం 5 గంటలకు సాధారణ వ్యక్తిలా వాహనం దిగి ‘సాక్షి’ మైక్ పట్టుకుని సంగారెడ్డిలో మహిళా డిగ్రీ కళాశాల పక్కనే ఉన్న సాంఘిక సంక్షేమశాఖ ఎస్సీ, బీసీ హాస్టల్ వైపు అడుగులు వేశారు. ‘నేనూ పేదింటి బిడ్డనే...ప్రభుత్వ పాఠశాలలోనే సదువుకున్నా... బలహీనవర్గానికి చెందిన నాకు పేదల బతుకులు తెలుసు’.. హాస్టల్ పిల్లల కష్టాలు, కడగండ్లు తెలుసుకునేందుకే ‘సాక్షి’ తరఫున విలేకరిగా వచ్చా... చెప్పండి మీ సమస్యలేమిటో.. అంటూ విద్యార్థులతో మాట్లాడారు. హాస్టళ్లలోనే నిద్రిస్తా... రూపు రేఖలు మారుస్తా చాలా హాస్టళ్లలో సమస్యలు ఉన్నమాట వాస్తవం. హాస్టల్లోని సమస్యలు తెలుసుకునేందుకు త్వరలో అన్ని హాస్టళ్లలో రాత్రి బస చేస్తా. సీఎం కేసీఆర్, జిల్లా మంత్రి హరీష్‌రావు దృష్టికి హాస్టల్ సమస్యలను తీసుకెళ్లి వాటి రూపురేఖలు మారుస్తా. తాగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రతి హాస్టల్లో ఆర్ఓ ప్లాంటు ఏర్పాటు చేయిస్తా. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటా. విద్యార్థులు కోరిన విధంగా కాస్మొటిక్ చార్జీల పెంపు అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా. పదో తరగతి విద్యార్థుల కోసం హాస్టల్లలో ప్రత్యేకంగా స్టడీ రూం, లైబ్రరీలు ఏర్పాటుకు చర్యలు చేపడతా. నూతన హాస్టల్ భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేస్తాం. -చింతా ప్రభాకర్, ఎమ్మెల్యే సంగారెడ్డి చింతా ప్రభాకర్: అమ్మా.. నీ పేరేంటీ, ఎంతకాలం నుంచి హాస్టల్లో ఉంటున్నావు, ఏమైనా సమస్యలున్నాయా? మౌనిక: సార్ నేను మూడేళ్లుగా ఇదే హాస్టల్లో ఉంటున్నా. ఒకే ప్రాంగణంలో మూడు హాస్టల్లు ఉండటంతో ఇబ్బంది పడుతున్నాం. నీటి సమస్య, మరుగుదొడ్ల సమస్య ఉంది. చింతా ప్రభాకర్: మీ హాస్టల్‌కు మంజీరా వస్తోంది కదా...అయినా నీటి సమస్య ఉందా? శ్రవంతి (9వతరగతి): తాగునీటికి నీటి ఇబ్బంది లేదు సార్..కానీ ఇతర అవసరాలకు నీళ్లు సరిపోవటంలేదు. మూడు హాస్టల్ళ్లలోని 240 మంది విద్యార్థులకు ఒకే బోరు ఉంది. నీటికి ఇబ్బంది పడుతున్నాం. ఒక బోర్ వేస్తే మా సమస్య తీరుతుంది. చింతా ప్రభాకర్: హాస్టల్లో భోజనం ఎలా ఉంది. మెనూ ప్రకారం వేళకు టిఫన్, భోజనాలు పెడుతున్నారా? భవానీ: మెనూ ప్రకారం భోజనం, టిఫిన్ పెడుతున్నారు సార్.. అయితే నాణ్యత ఉండటం లేదు. బియ్యం దొడ్డుగా ఉండటంతో తినటానికి ఇబ్బంది పడుతున్నాం. సన్న బియ్యం అన్నం పెట్టేలా చూడండి. చింతా ప్రభాకర్: ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా, కరెంటు బాగానే వస్తోందా? సమర్పణ: ఎస్సీ -ఏ, ఎస్సీ- బీ హాస్టళ్లతోపాటు బీసీ బాలికల హాస్టల్ ఈ మూడు ఒకే ప్రాంగణంలో ఉండటం వల్ల ఇబ్బందులు పడుతున్నాము. హాస్టల్లను వేరు చేసి ఇతర భవనాల్లోకి మారిస్తే అందరు విద్యార్థులకు మెరుగైన వసతి సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. కరెంటు సమస్య ఉంది. కరెంటు పోతే కొవ్వొత్తులు వెలిగించుకుంటాం. (పక్కనే ఉన్న బీసీ హాస్టల్ వార్డెన్ కవితతో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ‘ఏమ్మా బాలికల హాస్టల్లో కరెంటు పోతే కొవ్వొత్తుల వెలుగులపై ఆధారపడితే ఎలా..ఇన్వర్టర్ సదుపాయం లేదా’ అంటూ ప్రశ్నించారు. ‘‘ ఇన్వర్టర్ సదుపాయం మాకు లేదు సార్ ...ఇక్కడే కాదు ఏ హాస్టల్‌కు అలాంటి సదుపాయం కల్పించలేదని ఆమె సమాధానమిచ్చారు. దీంతో హాస్టళ్లలో ఇన్వర్టర్ ఏర్పాటు అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానంటూ చింతా ప్రభాకర్ హామీ ఇచ్చారు) చింతా ప్రభాకర్: ఏమ్మా చిన్నారి..నీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా..? అంటూ మూడవ తరగతి విద్యార్థి మౌనికను అప్యాయంగా ప్రశ్నించారు. బి.మౌనిక: ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ను చూసి భయం..భయంగా...సిగ్గుపడుతూ ఉహూ.. పెద్ద సమస్యలు ఏమీ లేవు. అయితే బోరు పాడైంది అంటూ సమాధానం ఇచ్చింది. (నీ కష్టం తీరుస్తాలే చిన్నారి అంటూ మౌనిక బుగ్గలను చిదుముతూ అప్యాయంగా చెప్పారు ఎమ్మెల్యే చింతా)ఎస్సీ హాస్టల్ నుంచి బీసీ హాస్టల్ వైపు అడుగులు వేస్తూ చింతా ప్రభాకర్ పక్కనే ఉన్న విద్యార్థుల మరుగుదొడ్లను పరిశీలించారు. ఆ తర్వాత బీసీ హాస్టల్ వైపు కదిలి అక్కడ బయట ఉన్న విద్యార్థులను పలకరించారు. చింతా ప్రభాకర్: ఏమ్మా..ఇక్కడ అంతా సౌకర్యంగానే ఉందా? అన్నీ వసతులు బాగున్నాయా? మమత: అంతా బాగుంది సార్. సమయానికి భోజనం పెడుతున్నారు. కానీ, మాకు నీటి సమస్య ఎక్కువగా ఉంది. ఆ సమస్యను పరిష్కరించండి. చింతా ప్రభాకర్: మీకు ఆరోగ్య సమస్యలు వస్తే ఏం చేస్తున్నారు..?హాస్టల్‌కు డాక్టర్ వచ్చి పరీక్షిస్తున్నారా? సునీత: ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ వ చ్చి పరీక్షలు చేసి మందులు ఇస్తున్నారు. ఎప్పుడైనా ఆరోగ్య సమస్య వస్తే ఆస్పత్రికి వెళ్తున్నాము. చింతా ప్రభాకర్: మీకు ఇంకేమైనా సమస్యలు ఉంటే ధైర్యంగా చెప్పండి? సరస్వతి: సార్..ఈ హాస్టల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. సరైన సంఖ్యలో మరుగుదొడ్లు, బాత్రూంలు లేవు. మాకు మంచి సదుపాయాలు కల్పించి సమస్యలు పరిష్కరించండి. సంధ్య: సరైన ఫర్నీచర్ లేదు. స్టడీచైర్స్ లేవు. బెడ్స్ కావాలి. చలితో ఇబ్బంది పడుతున్నాం. మందంగా ఉన్న దుప్పట్లు సరఫరా అయ్యేలా చూడండి సార్. స్టడీ మెటీరియల్..స్పోకెన్ ఇంగ్లీషు కోచింగ్ కావాలే అనంతరం హాస్టల్లోని పదవ తరగతి విద్యార్థులతో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రత్యేకంగా మాట్లాడి వారి సమస్యలు ఇలా తెలుసుకున్నారు. చింతా ప్రభాకర్: ఏమ్మా.. మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా. పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవుతున్నారు? సుమలత: సార్ పదవ తరగతి పరీక్షలకు ప్రిపేర్ కావాలని ఉన్నా...మాకు ఇంకా అవసరమైన స్టడీ మెటీరియల్ ఇవ్వలేదు. స్టడీ మెటీరియల్ అందక ఇబ్బందులు పడుతున్నాము. శ్రవంతి: పరీక్షలు దగ్గర పడుతున్నా ఏడు సబ్టెక్టులకు సంబంధించి ఇంకా స్టడీ మెటిరియల్ ఇవ్వలేదు. స్టడీ మెటిరీయల్ ఇప్పించేలా చర్యలు తీసుకోండి. (స్టడీ మెటీరియల్ అందకపోవటానికి గల సమస్యను వార్డెన్లతో ఎమ్మెల్యే ఆరా తీశారు. సమస్య పరిష్కారానికి అప్పటికప్పుడు ఆదేశించారు) చింతా ప్రభాకర్ : పదవ తరగతి విద్యార్థులకు ఇంకా సమస్యల ఉన్నాయా? సిద్దమ్మ: సార్.. మాకు స్టడీ మెటీరియల్‌తోపాటు హాస్టల్లో స్పోకెన్ ఇంగ్లీషులో శిక్షణ ఇప్పిస్తే బాగుంటుంది. అలాగే మాకు అందజేస్తున్న కాస్మోటిక్ చార్జీలు సరిపోవటంలేదు. కాస్మొటిక్ చార్జీలను రూ.75 నుంచి రూ.150 వరకు పెంచేలా చూడండి. ఆర్.సోనీ: సార్... మా హాస్టల్లో ప్రత్యేకంగా స్టడీ రూం. లైబ్రరీ ఏర్పాటు చేయిస్తే బాగుంటుంది. విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. -
సమావేశంపై చిత్తశుద్ధి ఏదీ !
ఇందూరు : జడ్పీ స్థాయీ సంఘాలలో అతి ముఖ్యమైన సాంఘిక సంక్షేమం స్థాయి సంఘ సమావేశం శనివారం సాదాసీదాగా కొనసాగింది. సమావేశానికి హాజరై తమ పరిధిలో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన సభ్యులు చాలా మంది హాజరు కాకపోవడం, మాట్లాడే వారు లేకపోవడంతో సమావేశం ముగిసిందనిపించారు. సాంఘిక సంక్షేమం సంఘం కమిటీ చైర్మన్‌గా ఉన్న మాక్లూర్ జడ్పీటీసీ సభ్యురాలు కున్యోత్ లతతో పాటు సభ్యులైన బీర్కూర్, భీమ్‌గల్ జడ్పీటీసీ సభ్యులు నేనావత్ కిషన్, బధావత్ లక్ష్మి మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. మిగతా బిచ్కుంద, మాచారెడ్డి, లింగంపేట జడ్పీటీసీ సభ్యులు సంధి సాయిరాం, గ్యార లక్ష్మి, నాగుల శ్రీలత, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే హన్మంత్ సింధేలతో పాటు జడ్పీ చైర్మన్ దఫేదారు రాజు కూడా సమావేశానికి హాజరుకాలేదు. దీంతో ఖాళీ కూర్చీల నడుమ సంబంధిత శాఖల అధికారులతో సమావేశం ముగిసింది. కేవలం ముగ్గురు ప్రజా ప్రతినిధులతోనే సమావేశం జరగడంతో సంక్షేమానికి సంబంధించిన విషయాలు ఒకటి రెండు తప్పా పెద్దగా ప్రస్తావనకు రాలేదు. తమ సమస్యలను సమావేశాల్లో చెప్పి పరిష్కరిస్తారని ఎన్నుకున్న ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సమీక్షించిన జడ్పీ సీఈఓ సభ్యులు పెద్దగా రాకపోవడంతో జడ్పీ సీఈఓ రాజారాం ఒక్కరే సమావేశ బాధ్యతలను తీసుకున్నారు. సాంఘిక సంక్షేమం స్థాయీ సంఘం చైర్మన్ మహిళా కావడంతో ఆమె మాట్లాడలేకపోయారు. అధికారులు చెప్పిన వివరాలను వినడానికి మాత్రమే పరిమితమయ్యారు. సంక్షేమానికి సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ, కార్పొరేషన్ శాఖల అధికారులతో పథకాల వివరాలు, రుణాలు, హాస్టళ్లు తదితర వివరాలు సీఈఓ అడిగి తెలుసుకున్నారు. ఇటు సంక్షేమ శాఖల ఇంజనీర్ శాఖ అధికారితో మాట్లాడి సంక్షేమ వసతిగృహాల నూతన భవనాలు, టాయిలెట్లు, ప్రహరీ తదితర భవనాల నిర్మాణాలు ఎక్కడి వచ్చాయో ఆరా తీశారు. జిల్లాలోని వవసతిగృహాల్లో దాదాపు 2600 వరకు సీట్లు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయడానికి చర్యలు చేపట్టాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో, ఆ కులానికి చెందిన విద్యార్థులనే కాకుండా ఇతర కుల విద్యార్థులను కూడా చేర్పించుకోవాలని తద్వారా ఖాళీల సంఖ్య తగ్గుతుందని సంక్షేమాధికారులు చేసిన ప్రతిపాదనకు సీఈఓ అంగీకారం తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, జనరల్ బాడీ సమావేశంలో చర్చకు తెస్తామన్నారు. వసతిగృహాల భవనాలు, టాయిలెట్లు వచ్చే సమావేశంలోగా పూర్తి చేయాలని, పనులు ప్రారంభించని వాటిని వెంటనే ప్రారంభించాలని సంబంధిత ఇంజనీర్ ఈఈని ఆదేశించారు. ఆర్మూర్, నిజామాబాద్‌లకు మంజూరైన బీసీ స్టడీ సర్కిల్‌ళ్ల నిర్మాణాలకు టెండర్లు ఆహ్వానించాలని సూచించారు. బీసీ కార్పొరేషన్లో గతేడాది రుణాలు రానందుకు మళ్లీ ప్రభుత్వానికి లేఖ రాయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ జేడీ ఖాలేబ్, బీసీ కార్పొరేషన్ ఏఈఓ రామారావు పాల్గొన్నారు. ఆర్థిక-ప్రణాళిక స్థాయీ సంఘ సమావేశం... మధ్యాహ్నం మూడు గంటలకు ఆర్థిక-ప్రణాళిక స్థాయీ సంఘ సమావేశం ఆ సంఘం చైర్మన్ అయిన జడ్పీ చైర్మన్ దఫేదారు రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్థిక, ప్రణాళిక శాఖల అధికారులతో సమీక్షించారు. శనివారంతో జడ్పీ ఏడు స్థాయి సంఘాల సమావేశాలు ముగిశాయి. -
హాస్టళ్లపై విజి‘లెన్స్’
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల కళాశాలలు అక్రమాలకు నిల యాలుగా మారాయి. నిరుపేద దళి త విద్యార్థుల విద్యాభ్యున్నతికి ఏ ర్పాటు చేసిన ఈ విద్యా సంస్థల్లో పెద్దఎత్తున అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. పలు గురుకుల కళాశాలల్లో అధికారులు రికార్డుల నిర్వహణను గాలికొదిలేశారు. నిర్వహణ నిధులను పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ గురుకులాల్లో జరుగుతున్న అక్రమాల బాగోతంపై ఆ శాఖ విజిలెన్స్ విభాగం ప్ర త్యేక దృష్టి సారించింది. ఆయా గురుకులా ల్లో ఆకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పక్షం రోజుల క్రితం జిల్లాలోని లక్సెట్టిపేట గురుకుల కళాశాల ను అధికారులు తనిఖీ చేశారు. పలు రికార్డు ల నిర్వహణను కళాశాల సిబ్బంది గాలికొది లేసినట్లు విజిలెన్స్ విభాగం దృష్టికి వచ్చిం ది. అలాగే.. ఆయా గురుకులాల నిర్వహణకు వచ్చిన నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చు చేసినట్లు విజిలెన్స్ అధికారులు తేల్చినట్లు సమాచారం. సుమారు 15 రకాల రిజిష్టర్లను పరిశీలించగా, ఈ రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ విభాగం ఇచ్చిన నివేదిక ప్రకారం ఇందుకు బాధ్యులైన గురుకులం సూపరిండెంట్‌పై సస్పెన్షన్ వేటు పడింది. గురుకుల సొసైటీ రాష్ట్ర ఉన్నతాధికారులు నుంచి బుధవారం ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలో 14 గురుకులాలు.. జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాలు 14 ఉన్నాయి. ఇందులో రెండు గురుకు ల పాఠశాలలు కాగా, మిగిలిన 12 గురుకు ల కళాశాలలు ఉన్నాయి. సుమారు ఎనిమి ది వేల మంది దళిత విద్యార్థులు విద్య న భ్యసిస్తూ, వసతి పొందుతున్నారు. ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి ఆధునిక హంగు ల భవనాలతో గురుకులాలను నిర్మించింది. ఒక్కో గురుకులంలో సుమారు 600 నుంచి 700 వరకు విద్యార్థులు చదువుతున్నారు. వీరికి వసతితోపాటు, అదే పరిసరాల్లో కళాశాల, పాఠశాలలు ఏర్పాటు చేయడం ద్వారా ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుందనుకున్నారు. వీటి నిర్వహణకు ప్రతినెలా రూ.లక్షల్లో నిధులు మంజూరవుతున్నాయి. వసతిగృహాల నిర్వహణకు ఎక్కువ మొత్తంలో నిధులు వస్తున్నాయి. విద్యార్థుల భోజనానికి అవసరమైన పాలు, గుడ్లు, కిరాణ, ఇతర ప్రొవిజన్స్ కొనుగోళ్ల కోసం ప్రతినెలా రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. అలాగే అకాడమిక్ వైపు లెక్చరర్లు, ఉపాధ్యాయులు, కాంట్రాక్టు ఉద్యోగుల జీతభత్యాల, స్టేషనరీ, ఇతర కొనుగోళ్ల కోసం కూడా నిధులు వస్తాయి. కొందరు అధికారులు, సిబ్బంది కలిసి ఈ నిర్వహణ నిధులను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సంబంధిత రికార్డులను ఏవీ నిర్వహించకుండానే నిధులు డ్రా చేసినట్లు విజిలెన్స్ విచారణలో వెలుగుచూసినట్లు సమాచారం. ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నాం.. - యాదగిరి, జిల్లా కోఆర్డినేటర్. గురుకుల కళాశాలల నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. వారానికి రెండు గురుకులాలను తనిఖీలు చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్త తనిఖీల్లో భాగంగా విజిలెన్స్ విభాగం లక్సెట్టిపేట గురుకులాన్ని తనిఖీ చేసింది. ఈ విజిలెన్స్ ఇచ్చిన నివేదిక మేరకు సూపరిండెంట్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. -
ఆకలి బాధలు ఎన్నాళ్లు?
పార్వతీపురంటౌన్: మా చేతులతో పది మంది పిల్లలకు కడుపారా భోజనం వడ్డిస్తున్నామని, మేము మా కుటుంబసభ్యులం మాత్ర ఏడాదిగా ఆకలిబాధలతో బతుకులీడుస్తున్నామని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ కుక్, కమాటి, వాచ్మన్లు వాపోతున్నారు. 12 నెలలుగా జీతాలు అందకపోవడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని 60 సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో 98 మంది కుక్, కమాటి, వాచ్మన్లు కాంట్రాక్ట్ పద్ధతిపై విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి నెలా కేసలి స్వచ్ఛంద సంస్థ ద్వారా కాంట్రాక్ట్ కార్మికులు జీతాలు పొందుతున్నారు. గత ఏడాది సమైక్యాంధ్ర ఉద్యమం కార ణంగా అప్పటి అధికార కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం కూడా జీతాలకు సంబంధించిన నిధులు విడుదల చేయకపోవడంతో కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. జీతాలకు సంబంధించి కేసలి స్వచ్ఛంద సంస్థను అడగలేక, సాంఘిక సంక్షేమ శాఖాధికారులను నిలదీయలేక ‘ముందుకు వెళ్తే నుయ్యి..వెనక్కి వస్తే గొయ్యి’ అన్న చందంగా కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు 2013 అక్టోబర్ నుంచి 2014 నవంబర్ వరకు నెలకు రూ.6, 700 చొప్పున వీరికి జీతాలు రావాలి. కానీ ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో స్వచ్ఛంద సంస్థ చేతులెత్తేసింది. దీంతో కుక్‌లు, కమాటీ, వాచ్మన్లు కుటుంబాలను పోషించుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. నూతనంగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మా కష్టాలు తీరుస్తుందని ఆశపడ్డామని, కానీ మా కష్టాలు మరింత పెరిగాయని కాంట్రాక్ట్ కార్మికులు వాపోతున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడం వల్లే.. ‘సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న 98 మంది కుక్, కమాటీ, వాచ్మన్లకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడం వల్లే జీతాలు చెల్లించలేకపోతున్నాం. గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించిన జీతాలు వచ్చాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు జీతాలు చెల్లించాల్సి ఉంది. జీతాల చెల్లింపు గురించి ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వానికి తెలియజేశాం.’ - జిల్లా సాంఘిక సంక్షేమశాఖ డీడీ ఆదిత్య లక్ష్మి -
సామూహిక వివాహాల్లో మంత్రి కుమార్తె పెళ్లి !
* సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆంజనేయ నిర్ణయం సాక్షి, బెంగళూరు: సాధారణంగా మంత్రుల బిడ్డల వివాహ కార్యక్రమాలు అత్యంత ఆడంబరంగా, తమ వద్ద ఉన్న సంపదను చాటుకునేలా జరగడం సర్వసాధారణం. అయితే రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి మాత్రం ఇందుకు భిన్నంగా నిర్ణయం తీసుకున్నారు. తన కుమార్తె వివాహాన్ని సామూహిక వివాహాల్లో అత్యంత సాధారణంగా జరిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ఆయన కుమార్తె కూడా అంగీకరించడంతో ఈ వివాహం ఓ వినూత్న ఆలోచనకు వేదికగా మారనుంది. ఇక ఈ నిర్ణయం తీసుకున్న వ్యక్తి మరెవరో కాదు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆంజనేయ. అవును మంత్రి ఆంజనేయ పెద్ద కుమార్తె అనుపమ, రాష్ట్ర ప్రజాపనుల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శేఖరప్ప పెద్ద కుమారుడు శాశ్వత్ల వివాహం ఈనెల 19న జరగనుంది. చిత్రదుర్గలోని హోళల్కెరె శ్రీకొట్రెనంజప్ప కాలేజు మైదానంలో మొత్తం 96 మంది పేద యువతీ, యువకులు వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. ఇదే వేదికపై మంత్రి కుమార్తె అనుపమ వివాహం కూడా జరగనుంది. తన కుమార్తె వివాహానికి కేటాయించిన మొత్తంలోనే ఈ జంటలకు వివాహ వస్త్రాలు, తాళితో పాటు వారి జీవన ఉపాధికి అవసరమైన ఒక గేదె, ఒక కొబ్బరి మొక్కను సైతం మంత్రి ఆంజనేయ అందజేయనున్నారు. వివాహ కార్యక్రమాల కోసం అధిక మొత్తంలో ధనాన్ని వెచ్చించరాదనే ఆలోచనతోనే ఈ విధంగా తన కుమార్తె వివాహాన్ని జరిపేందుకు నిర్ణయించానని, ఇందుకు తన కుమార్తె అనుపమతో పాటు ఆమెకు కాబోయే భర్త శాశ్వత్ కూడా అంగీకారం తెలపడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని మంత్రి ఆంజనేయ తెలిపారు. -
పింఛన్లను సత్వరమే పంపిణీ చేయండి
అధికారులకు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ ఆదేశం న్యూఢిల్లీ: లబ్ధిదారులకు సత్వరమే పింఛన్లు అందేవిధంగా చూడాలని సామాజిక సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ ఆదేశించారు. అధికారిక నివాసం రాజ్‌నివాస్‌లో మంగళవారం వివిధ శాఖల అధికారులతో సమావేశమైన జంగ్ వారితో సమీక్షలు నిర్వహించారు. సమాజంలో అనేక ఇబ్బందులకు గురయ్యేది వారేనని, అందువల్ల పింఛన్లు త్వరగా అందేవిధంగా చూడాలన్నారు. అంతకుముందు సామాజిక సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ పింఛన్ లబ్ధిదారుల సంఖ్య పెరిగిందన్నారు. ఇప్పటికే 3.90 లక్షలమంది ఉండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 40 వేలమంది ఈ జాబితాలోకి చేరారన్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి వచ్చే నెల నుంచి పింఛన్లను అందజేస్తామన్నారు. ఇందుకు లెఫ్టినెంట్ గవర్నర్ స్పందిస్తూ పింఛన్లకు సంబంధించిన ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాల్సిందిగా సూచించారు. చాందినీచౌక్ పునరాభివృద్ధి పనులపై సమీక్ష చాందినీచౌక్ పునరాభివృద్ధి పనులపైనా సంబంధిత అధికారులతో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సమీక్ష నిర్వహించారు. ప్రజాపనుల శాఖ ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్న సంగతి విదితమే. ఆ తర్వాత ప్రజాపనుల శాఖ, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) తాము చుపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై ప్రత్యేక ప్రజెంటేషన్లు ఇచ్చాయి. చాందినీచౌక్‌లో ట్రామ్‌ల నిర్వహణ సాధ్యాసాధ్యాలకు సంబంధించి కూడా డీఎంఆర్సీ... తన నివేదికను ఈ సందర్భంగా ఎల్జీకి అందజేసింది. దీంతోపాటు ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలపైనా నివేదించింది. కాగా చాందినీచౌక్ ప్రాంతంలో 4.5 కిలోమీటర్ల పొడవున ట్రామ్ మార్గాన్ని నిర్మించాలని డీఎంఆర్సీ యోచిస్తోంది. ఈ అంశంపైనా ఎల్జీ... సంబంధిత అధికారులతో సమీక్షించారు. -
కాంట్రాక్ట్ ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్
* చట్టంలో మార్పుకు క్యాబినెట్ సబ్‌కమిటీ అంగీకారం * వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ముసాయిదా బిల్లు * మంత్రి ఆంజనేయ వెల్లడి సాక్షి, బెంగళూరు : కాంట్రాక్ట్ పద్ధతిలో చేపట్టే నియామకాల్లోనూ ఇకపై రిజర్వేషన్లు పాటించాల్సి ఉంటుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆంజనేయ వెల్లడించారు. ఇందుకు సంబంధించి ప్రస్తుతం ఉన్న చట్టంలో మార్పు చేయడానికి తన అధ్యక్షతన ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్‌కమిటీ మంగళవారం అంగీకరించిందన్నారు. బ్యాక్లాగ్పోస్టుల భర్తీ, అవుట్సోర్స్ నియమకాల్లో రిజర్వేషన్ల విషయమై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్‌కమిటీ మంగళవారం ఇక్కడి విధానసౌధలో సమావేశమై సుధీర్ఘంగా చర్చింది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను మంత్రి ఆంజనేయ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో వెల్లడించారు. ప్రస్తుతం కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకాలు పొందిన లక్ష మంది రాష్ట్రం లోని వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. ఈ నియమకాలు ఏవీ రిజర్వేషన్లు అనుసరించి జరగలేదన్నారు. ఇకపై కాంట్రాక్ట్ పద్ధతిలో జరిగే నియామకాల్లోనూ రిజర్వేషన్లు పాటించాల్సి ఉంటుందన్నా రు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ, బాక్వర్డ్ క్లాస్ అపాయింట్మెంట్-1990 చట్టంలో మా ర్పులు తీసుకువస్తున్నట్లు తెలి పారు. ఈ మేరకు రూపొం దించిన ముసాయిదా బిల్లుకు రానున్న అసెంబ్లీ సమా వేశాల్లో అనుమతి పొందుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. తను నిర్వహిస్తున్న సాంఘిక సంక్షేమ శాఖలో ఇకపై కాంట్రాక్ట్ పద్ధతిన నియామకాలు చేపట్టడానికి అంగీకరించబోమని, శాశ్వత ప్రతిపాదికనే నియామకాలు ఉంటాయని తెలిపారు. ఇందుకు రాష్ట్ర ఆర్థిక శాఖతోపాటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సూత్రప్రాయంగా అంగీకరించారన్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో చేపట్టే నియామకాల్లో అనేక లోపాలు ఉండడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మిగిలిన విభాగాల్లో కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తే బాగుంటుందనేది తన వ్యక్తిగత అభిప్రాయమేనని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రస్తుతం వివిధ ప్రభుత్వ శాఖల్లో భర్తీ కాని బ్యాక్లాగ్ పోస్టుల వివరాలను అందజేయడానికి సంబంధిత అధికారులకు రెండు నెలలు గడువు ఇచ్చామన్నారు. వివరాలు అందిన వెంటనే నియామక ప్రక్రియను ప్రారంభిస్తామని వివరించారు. -
ప్రతి పనికి పైసలివ్వాలి
సాంఘిక సంక్షేమ శాఖకు అవినీతి జబ్బు ఒక్కో హాస్టల్ నుంచి నెలకు రూ.2వేలు వసూలు ప్రొటోకాల్ పేరుతో మరో రూ.500 పదోన్నతికి సప‘రేటు’ రూల్స్! చిన్నచిన్న పొరపాట్లు సహజమంటున్న డీడీ మచిలీపట్నం : సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలోని పిల్లలు అర్ధాకలితో అలమటించినా పట్టించుకోని జిల్లా అధికారులు.. తమకు మామూళ్లు అందడం ఒక్కరోజు ఆలస్యమైనా వెంటనే ప్రతాపాన్ని చూపుతారు. వార్డెన్లపై చిందులేసి ఆకస్మిక తనిఖీలకు బయలుదేరుతారు. హాస్టళ్లలో సౌకర్యాలు అధ్వానంగా ఉన్నాయని పిల్లలు ఆందోళన చేసినా కన్నెత్తి చూడని అధికారులు.. పిల్లలు తక్కువగా ఉన్నారు, పెద్దగా మామూళ్లు ఇవ్వలేమని విన్నవించిన వసతిగృహ సిబ్బందిపై మాత్రం మూడో కన్ను తెరుస్తారు... ఇలా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖకు అవినీతి జబ్బు పట్టిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. చేయి తడిపిన వారికే పనులు చేస్తున్నట్లు సమాచారం. గ్రేడ్-2 వార్డెన్లుగా పనిచేసే వారికి గ్రేడ్-1 వార్డెన్లుగా పదోన్నతి ఇచ్చే అంశంలోనూ పెద్ద మొత్తంలో నగదు చేతులు మారిందనే విమర్శలు వినవస్తున్నాయి. నెలకు రూ. 2వేలు సమర్పించుకోవాల్సిందే.. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 160 వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో 15వేల మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ఒక్కో హాస్టల్లో ఎంత మంది విద్యార్థులు ఉన్నా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారికి మాత్రం నెలకు రూ.1,500లు, డివిజన్ అధికారికి రూ.500 చొప్పున ప్రతి నెలా వార్డెన్లు మామూళ్లు సమర్పించుకోవాల్సి ఉంది. పిల్లల సంఖ్య తక్కువగా ఉందని, నెలకు రూ. 2వేలు చొప్పున ఇవ్వలేమని కోరినా, ఈ మొత్తాన్ని తగ్గించేందుకు అధికారులు అంగీకరించటం లేదని పలువురు వార్డెన్లు వాపోతున్నారు. మరోవైపు ప్రొటోకాల్ పేరుతో ఒక్కో హాస్టల్ నుంచి నెలకు రూ.500 చొప్పున వసూలు చేస్తున్నారు. ఎవరైనా వార్డెన్లు సకాలంలో నగదు చెల్లించకపోతే వారికి మెమోలు ఇవ్వటం, ఆకస్మిక తనిఖీలతో ఇబ్బందులు పెట్టడం రివాజుగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. పదోన్నతుల్లో కిరికిరి సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేస్తున్న వార్డెన్లకు ప్రతి సంవత్సరం పదోన్నతులు ఇవ్వాల్సి ఉంది. గ్రేడ్-2 వార్డెన్లుగా పనిచేస్తున్న వారికి గ్రేడ్-1గా పదోన్నతి ఇచ్చేందుకు అనేక నిబంధనలు ఉన్నాయి. సీనియార్టీ ప్రకారం డిపార్ట్మెంటల్ టెస్టులు రాసి అర్హత పొందిన వారికి పదోన్నతులు ఇవ్వాలి. అయితే, ఈ శాఖ అధికారులు తమను ప్రసన్నం చేసుకున్న వారినే పదోన్నతుల జాబితాలో చేర్చారనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు యూనియన్ నాయకులు కూడా చక్రం తిప్పి తమ అనుయాయులకు పదోన్నతుల కోసం తెరవెనుక మంత్రాంగం నడిపారనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయంలో ఒక్కొక్కరి నుంచి రూ.50వేల వరకు వసూలు చేసినట్లు సమాచారం. అధికారులు ఇష్టానుసారంగా తయారు చేసి పంపిన జాబితాపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందడంతో ఆ ఫైలును వెనక్కి పంపినట్లు తెలిసింది. మరోసారి సక్రమంగా ఫైలును తయారు చేసి పంపాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం. 15 నెలలుగా అవుట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు లేవు సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బందికి 15 నెలలుగా వేతనాలు అందలేదు. తమకు వేతనాలు అందించాలని అవుట్ సోర్సింగ్ సిబ్బంది పలుమార్లు అధికారులను కోరినా ఫలితం లేకపోయింది. ఆరోపణలు సహజం సాంఘిక సంక్షేమ శాఖలో చిన్న, చిన్న పొరపాట్లు జరగవచ్చు. వీటిని భూతద్దంలో చూపుతూ కొందరు ప్రచారం చేస్తున్నారు. సాంఘిక సంక్షేమ శాఖను అల్లరిపాలు చేస్తున్నారు. ప్రతి నెల మామూళ్లు వసూలు చేయటం అవాస్తవం. వార్డెన్లకు పదోన్నతులు ఇచ్చే అంశంలో నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించాం. -మధుసూదనరావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ -
హాస్టళ్లలో బయోమెట్రిక్!
సమస్తం ఆన్లైన్లోనే హాజరు మాయాజాలానికి తావులేదు వార్డెన్లకు ల్యాప్‌టాప్‌లు దసరా అనంతరం అమలు నూజివీడు : జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చోటు చేసుకుంటున్న అక్రమాలకు ప్రభుత్వం చెక్ పెట్టనుంది.హాజరు మాయాజాలానికి కాలం చెల్లినట్లే. హాస్టల్లో ఉండే విద్యార్థుల హాజరును ఇక నుంచి బయో మెట్రిక్ విధానంలో తీసుకోనున్నారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదువుకుంటున్న 10,500మంది విద్యార్థుల్లో 226మంది విద్యార్థులను మినహాయిస్తే అందరి ఆధార్‌కార్డు నంబర్లను అనుసంధానం చేశారు. బయోమెట్రిక్ హాజరు విధానం దసరా సెలవుల అనంతరం నుంచి ప్రారంభం కానుంది. ఈ విధానంలో భాగంగా విద్యార్థుల వేలిముద్రలను తీసుకునే పరికరంను, ల్యాప్‌ట్యాప్‌లను జిల్లాలోని 105 వసతి గృహాల వార్డెన్లకు అందజేశారు. అలాగే ప్రతి హాస్టల్‌కు బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసును తీసుకుంటున్నారు. ప్రతి రోజూ ప్రతి హాస్టల్ విద్యార్థుల హాజరు ఆన్లైన్ చేయడంతో హైదరాబాద్‌లోని సాంఘిక సంక్షేమశాఖ ఉన్నతాధికారులకు నిమిషాల వ్యవధిలో చేరుతుంది. దీంతో ఇప్పటివరకు కొనసాగుతున్న హాజరు మాయాజాలానికి ఇక నుంచి తెరపడనుంది. దీనివల్ల ప్రభుత్వ నిధుల దుర్వినియోగం పూర్తిగా తగ్గిపోనుంది. విద్యార్థుల హాజరు ఇలా తీసుకుంటారు.... వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన ఆధార్ నంబర్లను ఇప్పటికే సేకరించి అనుసంధానం చేశారు. దీంతో వార్డెన్లకు ఇచ్చిన ల్యాప్‌టాప్‌లో ఆ విద్యార్థుల వేలిముద్రలు, ఫొటోలు నిక్షిప్తం చేసి ఉన్నాయి. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో వార్డెన్లు హాస్టల్లో ఉన్న విద్యార్థుల వేలిముద్రలను వేలిముద్రల సేకరణ మిషన్‌తో సేకరిస్తారు. వారి సేకరణ పూర్తయిన తరువాత వార్డెన్లు కూడా తమ వేలిముద్రలను వేయాల్సి ఉంటుంది. ఇలా ఎంతమంది వేలిముద్రలైతే సరిపోతాయో అంతమంది విద్యార్థులు హాస్టల్లో ఉన్నట్లు లెక్క. హాజరును బట్టి, ఆ రోజు మెనూ ప్రకారం బియ్యం, పప్పులు, కూరగాయలు, పాలు తదితరాలన్నీ ఎంతెంత పరిమాణంలో వాడారనేది కూడా అప్పటికప్పుడే ల్యాప్‌టాప్‌లో చూపించడంతో పాటు ఆన్‌లైన్‌లోనూ చూపుతుంది. జిల్లాకు 105ల్యాప్‌టాప్‌లు, బయోమెట్రిక్ మిషన్లు... సాంఘిక సంక్షేమశాఖ పరిధిలో 145 వసతి గృహాలుండగా 50మంది కంటే తక్కువ విద్యార్థులున్న 40 వసతి గృహాలను మినహాయించి, మిగిలిన 105 వసతి గృహాలకు ల్యాప్ టాప్‌లను, బయోమెట్రిక్ మిషన్లను అందజేశారు. విద్యార్థులు అధిక సంఖ్యలో ఉంటే ఇబ్బందే... జిల్లాలో చాలా వసతి గృహాల్లో వందమంది విద్యార్థులున్నారు. వీరందరికీ ప్రతి రోజూ రెండు పూటలా వేలి ముద్రలు స్వీకరణ పెద్ద ప్రహసనంగా మారనుంది. వందమంది విద్యార్థులున్న వసతి గృహంలో 17నిమిషాల సమయం తీసుకుంటుంది. నూజివీడులోని ఇంటిగ్రేటెడ్ వసతి గృహంలో 311మంది విద్యార్థులున్నారు. దీనికి కేవలం ఒకేఒక్క ల్యాప్‌టాప్, బయోమెట్రిక్ మిషన్ ఇచ్చారు. వీళ్లందరి వేలిముద్రలు తీసుకోవాలంటే రెండు గంటల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉన్న వసతి గృహాలకు మరొక ల్యాప్‌ట్యాప్ ఇచ్చినట్లయితే సౌకర్యంగా ఉంటుంది. -
బయోమెట్రిక్’తో విద్యార్థుల గైర్హాజరీకి చెక్
మిరుదొడ్డి: జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టి గైర్హాజరయ్యే విద్యార్థులకు చెక్ పెట్టనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఎన్ సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం మిరుదొడ్డి ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఆయన ఆకస్మికంగా తనీఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. అనంతరం బయోమెట్రిక్ విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది వరకు ఉన్న హాజరు రిజిస్టర్ స్థానంలో బయోమెట్రిక్ విధాన్నాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విధానం ద్వారా గైర్హాజరయ్యే విద్యార్థులను గుర్తించి వారి తల్లిదండ్రులకు సమాచారం ఇస్తామన్నారు. దీనిద్వారా విద్యార్థి హాజరు కాకపోవడానికి గల కారణాలను తెలుసుకోవడం జరుగుతుందన్నారు. బయోమెట్రిక్ విధానంలో విద్యార్థుల చేతి వే లి ముద్రల ద్వారా ఏ రోజుకారోజు హాజరు నమోదు చేస్తామని తెలిపారు. బయోమెట్రిక్ నమోదు చేసుకోక పోతే విద్యార్థులకు ఆరోజు ఎలాంటి భోజన వసతి కల్పించడం జరగదని స్పష్టం చేశారు. జిల్లాలో 83 సంక్షేమ హాస్టళ్లు ఉండగా మెదటి విడతగా 61 సంక్షేమ హాస్టళ్లలో బయోమెట్రిక్‌ను ప్రవేశ పెడుతున్నట్లు తెలిపారు. విద్యార్థుల వేలి ముద్రల ఆధారంగా ప్రతి రోజు హాజరును రికార్డు చేస్తామన్నారు. మిరుదొడ్డి ఎస్సీ హాస్టల్లో 9వ తరగతి వరకు చదివే అవకాశం ఉండగా విద్యార్థుల సంఖ్యను బట్టి వచ్చే విద్యా సంవత్సరంలో 10వ తరగతి విద్యార్థులకు అనుమతి ఇస్తామన్నారు. నిబంధనలను విస్మరిస్తే చర్యలు బయోమెట్రిక్ విధానంలో హాస్టల్ వెల్ఫేర్ అధికారులు విస్మరిస్తే చర్యలు తప్పవని జిల్లా వెల్ఫేర్ అధికారి ఎన్ సత్యనారాయణ హెచ్చరించారు. హాస్టళ్లలో బస చేసే విద్యార్థులకు కొత్త మెనూ అమలు చేస్తామన్నారు. పౌష్టికాహారంతో వారం రోజల పాటు గుడ్లు, ఆరు రోజుల పాటు పండ్లు, ఆదివారం చికెన్, బటర్ మిల్క్, ప్రతి రోజు స్నాక్స్ అందిస్తామని తెలిపారు. హాస్టళ్లను తనిఖీ చేసిన జిల్లా సంక్షేమాధికారి రామాయంపేట: మండలంలోని రామాయంపేటలోని ఎస్సీ బాలుర ,బాలికల హాస్టళ్లతోపాటు నిజాంపేటలో ఉన్న సాంఘిక సంక్షేమ హాస్టల్‌ను ఆదివారం జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి సత్యనారాయణ తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన హాస్టళ్లలో నెలకొని ఉన్న సమస్యలను పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. భోజనం ఎలా పెడుతున్నారని ఆయన విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కాస్మొటిక్ చార్జీలు, బట్టలు, బెడ్షీట్లు, ప్లేట్లు ఇచ్చారా లేదా అనే విషయాన్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. నిజాంపేట హాస్టల్‌కు మంజూరైన ప్రహారీగోడ, మరుగుదొడ్ల నిర్మాణం ఎందుకు చేపట్టలేదని ఆయన వార్డెన్‌ను ప్రశ్నించారు. త్వరితగతిన పనులు పూర్తయ్యేవిధంగా చూడాలని వార్డెన్‌ను ఆదేశించారు. హాస్టల్లోని చిన్న చిన్న మరమ్మతులకు గాను రూ. ఐదువేలు మంజూరైనట్లు తెలిపారు. ఆయన వెంట వార్డెన్ వెంకటయ్య తదితరులున్నారు. -
పండుటాకు పదిలమిలా!
- ఈతరానికి తెలియజెప్పేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రయత్నం - ప్రత్యేక అవగాహన కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళికలు న్యూఢిల్లీ: కనీ.. పెంచీ.. పెద్దచేసిన తల్లిదండ్రులకు ఈతరం యువతీయువకులు ఇస్తున్న గౌరవం అంతంతమాత్రమే. రెక్కలు రాగానే చదువులు, ఉద్యోగాలం టూ ఎక్కడికో ఎగిరిపోతున్నారు. దీంతో వృద్ధాప్యంలో చూసుకునేవారు లేక ఒం టిరి పక్షుల్లా బిక్కుబిక్కుమంటూ కాలం గడపుతున్నవారి సంఖ్య తక్కువేం కాదు. కొందరైతే కొడుకులు, బిడ్డలు ఉండి కూడా వృద్ధాశ్రమాల్లో గడుపుతున్నారు. అలా ఎందుకని అడిగితే తమను చూసుకోవడానికి పిల్లలకు సమయం లేదని చెబుతున్నారు. నగరంలో ఇలాంటి దుస్థితిలో ఉన్న పండుటాకులు ప్రతి గల్లీలోని ఏ మూలకు వెళ్లినా కనిపిస్తాయి. పెద్దలపట్ల యువతీయువకుల్లో అవగాహన లేకపోవడమే ఇందుకు కారణమని, డబ్బు సంపాదనకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్న ఈతరం పిల్లలు మూలాలను మర్చిపోతున్నారని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివారిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఢిల్లీ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ దిశగానే ఆలోచిస్తోంది. వయోధికులపట్ల పిల్లల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది. పెద్దల విలువ చాటిచెప్పేలా ఈ కార్యక్రమాలు ఉంటాయని చెబుతున్నారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలో ఈ కార్యక్రమాల ద్వారా తెలిజెప్పే ప్రయత్నం చేస్తామంటున్నారు. పెద్దల్లో ఎంతో మేధాశక్తి దాగుంటుందని, దానిని ఈనాటి యువత ఉపయోగించుకుంటే మరిన్ని అద్భుతాలు సాధించవచ్చని, ఎన్నో ఉపద్రవాలను నిరోధించవచ్చని చెబుతున్నారు ప్రభుత్వ మాజీ అధికారి భూరేలాల్. సాంఘిక సంక్షేమశాఖ ఈ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోందని భూరేలాల్ చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వం వద్ద ఉన్న గణాంకాల ప్రకారం నగరంలోని ప్రతి పదిమందిలో ఒకరు సీనియర్ సిటిజన్. ఇక ఢిల్లీ పోలీసుల వద్ద ఉన్న వివరాల ప్రకారం... వయోధికులపై జరుగుతున్న దారుణాల్లో ఎక్కువగా సొంతవారే నేరస్తులుగా తేలుతున్నారు. సరిగా పట్టించుకోకపోవడం, వదిలించుకోవాలని చూడడం, అవసరమైతే హతమార్చాలని భావిస్తుండడం, ఆస్తి కోసం చిత్రహింసలు పెట్టడం వంటి నేరాలకు సొంతవారు పాల్పడుతుంటే వృద్ధులు.. బలహీనులన్న అంశాన్ని అవకాశంగా చేసుకొని బయటివారు పండుటాకులపై దాడులకు పాల్పడుతున్నారు. ఇటువంటి సంఘటనలు నగరంలో ఏటా పెరిగిపోతుండడంతో ఢిల్లీ సర్కార్ ఈ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది. -
ఏసీబీ వలలో సోషల్ వెల్ఫేర్ డీడీ
గుంటూరులో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన హనువుంతునాయుక్ తెలంగాణవాసి అయినందునే దాడి చేరుుంచారని టీఎస్ ఉద్యోగ సంఘాల ఆరోపణ గుంటూరు/హైదరాబాద్ : నర్సింగ్ విద్యార్థినుల స్కాలర్‌షిప్‌ల పెండింగ్ ఫైల్ క్లియరెన్స కోసం రూ.లక్ష డిమాండ్ చేసిన సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఏసీబీకి చిక్కాడు. కళాశాల చైర్మన్ నుంచి సోమవారం రాత్రి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. గుంటూరు లక్ష్మీపురంలోని ఏసీబీ కార్యాలయంలో మంగళవారం దీనికి సంబంధించిన వివరాలను ఏసీబీ డీఎస్పీ రాజారావు వెల్లడించారు. గుంటూరు నగరానికి చెందిన పుల్లగూర ఇమానియేల్ ప్రకాష్ ఫిరంగిపురంలో నర్సింగ్ కళాశాల నడుపుతున్నాడు. ఈ కళాశాల విద్యార్థినులకు 2012-13 సంవత్సరానికిగాను స్కాలర్షిప్లు రావాల్సి ఉంది. విద్యార్థుల వివరాలను ఆన్లైన్లో రిజిస్టర్ చేసేందుకు, పెండింగ్ ఫైల్‌ను కమిషన్ కార్యాలయానికి పంపేందుకు గుంటూరు సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డెరైక్టర్ డి.హనుమంతు నాయక్ బాధితుల దగ్గర రూ.లక్ష డిమాండ్ చేశారు. ఈ నెల 13న ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్న బాధితుడు అదేరోజు గుంటూరు ఏసీబీని ఆశ్రయించాడు. పథకం ప్రకారం సోమవారం రాత్రి డీడీ ఇంట్లో బాధితుడు లంచం ఇస్తుండగా అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. డీడీ హనుమంతు పరారయ్యేందుకు ప్రయత్నించాడు. ఏసీబీ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకునే క్రమంలో డీడీ చేతిగోరు అతనికే తగలడంతో కంటికి స్వల్ప గాయమైంది. డీడీపై అవినీతి నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ వివరించారు. కాగా ఈ దాడి అంశం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల మధ్య వివాదంగా మారింది. రిలీవ్ అయ్యేందుకు వెళ్లిన హనువుంతు నాయుక్పై సోమవారం రాత్రి ఏసీబీ దాడులు చేయడం కక్ష పూరితమేనని తెలంగాణ ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. విషయూన్ని గ్రూపు-1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసే తెలంగాణ ఉద్యోగులకు భద్రత లేదనే విషయం తేలిపోయిందని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు దేవీ ప్రసాద్ పేర్కొన్నారు. ఇలాంటి కక్ష పూరిత దాడులు కొనసాగితే తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులను పని చేయనీయబోమని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మమత, సత్యనారాయణ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల విభజనను ఈనెలాఖరులోగా పూర్తి చేయాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్ స్పష్టం చేశారు. చర్యలు తీసుకుంటామని సీఎం హామీ.. తెలంగాణ గ్రూపు-1 అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి హనుమంత్ నాయక్‌ను గుంటూరు ఏసీబీ అధికారులు దాడి చేసి అరెస్టు చేయడాన్ని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఛైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ తీవ్రంగా ఖండించారు. ఈ వ్యవహారంపై తగిన చర్యలు వెంటనే చేపట్టాలని మంగళవారం రాత్రి శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావును కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎస్‌తో మాట్లాడి తగిన చర్యలు చేపట్టాలని రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు ఆదేశాలు జారీ చేస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అన్యాయుంగా ఇరికించారు: కోదండరామ్ హనువుంతును అన్యాయంగా ఏసీబీ కేసులో ఇరికించారని టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ అన్నారు. ఏసీబీ కేసులో నిందితుడైన హనుమంతు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు జోక్యం చేసుకొని బేషరతుగా కేసు నుంచి విముక్తి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన పలువురు టీజేఏసీ నాయకులతో కలసి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్-17ను తెలంగాణ ప్రజలు విలీన దినాన్ని పార్టీలకు, కులమతాలకు అతీతంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. -
సొంత పిల్లల్లా చూసుకోవాలి
కర్నూలు(అర్బన్): ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థినులను ఆయా వసతి గృహ సంక్షేమాధికారులు సొంత పిల్లల్లా చూసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎంఎస్ శోభారాణి అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక బి.క్యాంప్‌లోని ఎస్సీ బాలుర వసతి గృహ సముదాయ ఆవరణలో జిల్లాలోని సాంఘిక సంక్షేమశాఖ కళాశాల, హైస్కూల్ స్థాయి ప్రత్యేక వసతి గృహాల సంక్షేమాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ వసతి గృహాల్లో 9, 10 తరగతులతో పాటు ఇంటర్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులతో వార్డెన్లు స్నేహ పూర్వకమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. మెనూ ప్రకారం భోజనాలు పెడుతున్నామా? విద్యార్థినులు సక్రమంగా కళాశాలకు వెళ్తున్నారా? తదితర విషయాలతో పాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలనూ తెలుసుకోవాలన్నారు. సాధారణంగా ఈ వయస్సులోని విద్యార్థినులు తమ బాధలను ఇతరులతో చెప్పుకోలేక.. సరైన నిర్ణయాలు తీసుకోలేక నష్టపోతుంటారన్నారు. అందువల్ల వారి కష్టసుఖాల్లో పాల్పంచుకుంటూ కుటుంబ విషయాలను కూడా చర్చించేలా సఖ్యత పెంపొందించుకోవాలన్నారు. ఇంటర్, డిగ్రీ విద్యార్థినులను పోటీ పరీక్షలకు సంసిద్ధులను చేయాలన్నారు. ఇప్పటికే అన్ని కళాశాలల వసతి గృహాలకు పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను పంపామన్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థినులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు దిశానిర్దేశం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఇ.నాగభూషణం, సహాయ సంక్షేమాధికారులు కె.బాబు, మోహన్‌రెడ్డి, జాకీర్ హుసేన్, సిద్ధరామయ్య, కళాశాల వసతిగృహ సంక్షేమాధికారులు మాధవేణి, గౌరి, హైస్కూల్ స్థాయి ప్రత్యేక హాస్టళ్ల సంక్షేమ అధికారులు లీలావతి, కల్పన, కరుణలత, అనిత తదితరులు పాల్గొన్నారు. -
అర్జీల పరిష్కారానికి వెబ్సైట్
ప్రజావాణిలో జేసీ జె.మురళి చిలకలపూడి (మచిలీపట్నం) : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన అర్జీల పరిష్కారం కోసం నూతన వెబ్‌సైట్‌ను రూపొందించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ జె.మురళి తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీతోపాటు డీఆర్వో ఎ.ప్రభావతి, జెడ్పీ సీఈవో టి.సుదర్శనం, యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనివాస్‌లు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ prajavani.ap.gov.inవెబ్సైట్లో ప్రజావాణిలో వచ్చిన అర్జీలకు సంబంధించి వివరాలను పొందుపరచాలని అధికారులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజావాణిలో వచ్చిన అర్జీల పరిష్కారం విషయంలో శాఖల వారీగా అధికారుల పని తీరును గమనిస్తూ ఉంటారని తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు సమస్యల పరిష్కారం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. సాంఘిక సంక్షేమ శాఖ డీడీ డి.మధుసూదనరావు, హౌసింగ్ పీడీ సీహెచ్ ప్రతాపరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎన్వీవీ సత్యనారాయణ, మత్స్యశాఖ డీడీ టి.కళ్యాణం, డీఎస్వో పీబీ సంధ్యారాణి, డీసీవో రమేష్‌బాబు, డీఆర్డీఏ ఏపీడీ జి.జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అర్జీలు ఇవే.. అధికారులు లంచం తీసుకుని కైకలూరు కిరాణా మర్చంట్స్ వీధిలో ఉన్న తమ భూమిని వేరొకరికి చల్లపల్లి రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేశారని, ఈ ఘటనపై విచారించి, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని, తన భూమిని అప్పగించాలని ఎండీ షీమాబేగం వినతిపత్రం ఇచ్చారు. మదర్ థెరిస్సా వికలాంగుల సేవా సంక్షేమ సంఘంలోని 250 మంది సభ్యులకు ఇళ్లస్థలాలు కేటాయించాలని, పింఛను పెంచాలని ఆ సంఘ కార్యదర్శి ఎన్.అరుణ తదితరులు అర్జీ అందజేశారు. గుడివాడ లేబర్ కాంట్రాక్ట్ కో-ఆపరేటివ్ సొసైటీ ద్వారా 2000వ సంవత్సరం నుంచి 220 మంది కార్మికులు కాంట్రాక్టు ప్రాతిపదికన ఎఫ్‌సీఐ గోడౌన్లో పనిచేస్తున్నారని, వారిలో 150 మందికి మాత్రమే డీపీఎస్ ఆర్డర్లు ఇచ్చారని, మిగిలిన 70 మందికి ఇవ్వకపోవటంతో వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని, వెంటనే వారికి కూడా డీపీఎస్ ఆర్డర్లు ఇవ్వాలని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ మారుమూడి విక్టర్‌ప్రసాద్ వినతిపత్రం అందజేశారు. రైతుల రుణమాఫీ ఫిర్యాదులపై రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఉత్తర్వుల ప్రకారం జిల్లాలో రైతు రుణమాఫీలో ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లీడ్ బ్యాంక్ మేనేజరు కన్వీనరుగా కమిటీని నియమించి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ అర్జీ ఇచ్చారు. -
ఏసీబీ వలలో అవినీతి చేపలు
లంగర్‌హౌస్ ఎస్ఐ, హెడ్‌కానిస్టేబుల్ మరో కేసులో ఆర్ అండ్ బీ ఇంజనీర్లు లంగర్‌హౌస్: లంచం తీసుకుంటూ వేర్వేరు ఘటనల్లో లంగర్‌హౌస్ ఎస్ఐ, హెడ్‌కానిస్టేబుల్, ఆర్ అండ్ బీ ఇంజనీర్లు చిక్కారు. వివరాలిలా ఉన్నాయి. కిషన్‌బాగ్‌లో ఉండే మహమ్మద్ మతిన్ అలీ స్క్రాప్ వ్యాపారి. ఇదే వ్యాపారం చేసే అత్తాపూర్‌కు చెందిన అన్నాతమ్ముళ్లు ఫెరోజ్, షేక్ మతిన్, సద్దాం, ముబిన్‌తో వ్యాపార విషయంలో గొడవలు ఉన్నాయి. దీంతో బాధితుడు మతిన్ రాజేంద్రనగర్ పోలీసులతో పాటు, ఏసీపీకి ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉండగా.. ఇటీవల నలుగురు సోదరుల్లో ఒకరైన ఫెరోజ్‌ను ఇన్నోవా కారు ఢీకొనడంతో కాలు విరిగిందని వారం క్రితం లం గర్హౌస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కారు మ తిన్కు చెందినదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, బాధితులతో మాట్లాడి రాజీ కుదురుస్తామని, అందు కు తమకు రూ.10 వేలు ఇవ్వాలని ఎస్సై బి.శ్రీనివాసరావు, హెడ్‌కానిస్టేబుల్ అశోక్‌రెడ్డిలు మహమ్మద్ మతి న్ను డిమాండ్ చేశారు. లేదంటే హత్యాయత్నం కేసు నమోదు చేస్తామని బెదిరించారు. అతను ఏసీ బీని ఆశ్రయించడంతో సీఐ జేసుదాసు ఆధ్వర్యంలో బాధితుడికి రుంగురుద్దిన నగదును ఇచ్చి పంపి ఎస్సై, హె డ్కానిస్టేబుల్ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కేసు నమోదు చేశారు. ఆర్అండ్బీ ఇంజినీర్లు... ఖైరతాబాద్: హాస్టల్ భవనం అద్దె నిర్ణయించే విషయమై లంచం డిమాండ్ చేసిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజనీర్‌ను ఏసీబీ అధికారులు బుధవారం సాయంత్రం వల పన్ని పట్టుకున్నారు. సోమయ్య అనే వ్యక్తికి ఎల్బీనగర్లో సొంత భవనం ఉంది. దీన్ని సాం ఘిక సంక్షేమ శాఖ హాస్టల్ నిర్వహించేందుకు అధికారు లు అద్దెకు అడిగారు. అద్దె నిర్ణయించే విషయంపై ఆర్అండ్బీ ఈఈ కె.నరేష్కుమార్, అసిస్టెంట్ ఇంజినీర్ ఎం.రాజశేఖర్‌ను సోమయ్య కలవగా రూ.10వేలు లం చం డిమాండ్ చేశారు. దీనిపై సోమయ్య మంగళవా రం ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. వారి సూచనల మేరకు బుధవారం సోమయ్య ఖైరతాబాద్‌లోని ఆర్అండ్బీ కార్యాలయంలో ఇంజినీర్లకు లంచం ఇస్తుండగా ఏసీబీ సిటీ రేంజ్ డీఎస్పీ ఎన్.చంద్రశేఖర్ సిబ్బందితో కలసి ఈఈ నరేష్కుమార్, ఏఈ ఎం.రాజశేఖర్‌ను అరెస్ట్ చే శారు. వారినుంచి రూ.10వేలు స్వాధీనం చేసుకున్నారు. -
గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: రావెల
హైదరాబాద్: గిరిజనుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు స్పష్టం చేశారు. గిరిజనుల అభివృద్ధిని గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలోని మరిన్ని గ్రామాలను షెడ్యూల్ గ్రామాలల్లో కలపాలని యోచిస్తున్నట్లు చెప్పారు. అందుకు సంబంధించిన ప్రక్రియపై కేంద్రంలో సంప్రదించి ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అది కూడా సాధ్యమైనంత త్వరగా ఆ ప్రక్రియను చేపట్టనున్నట్లు రావెల కిషోర్ బాబు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గిరిజనుల సమస్యలపై ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో తెలపాలంటూ ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు రావెల కిషోర్ బాబుపై విధంగా సమాధానం ఇచ్చారు. -
వసతి గృహాన్ని తనిఖీ చేసిన సోషల్ వెల్ఫేర్ డీడీ
అవనిగడ్డ : స్థానిక ఎస్పీ బాలుర వసతీ గృహాన్ని సాంఘిక సంక్షేమశాఖ డెప్యూటీ డెరైక్టర్ బి.మధుసూదనరావు సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీచేశారు. సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు ఆదేశాల మేరకు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలను పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం కలెక్టర్ 52 మందిని పరిశీలికులుగా నియమించినట్లు చెప్పారు. వసతీ గృహాల్లో మౌలిక సదుపాయూలు, మెనూ అమలు తీరు పరిశీలించి, నివేదికను అందించేందుకు ఈ తనిఖీ చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వసతి గృహంలోని విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ వీఎస్ఎస్ గణేష్‌బాబు పాల్గొన్నారు. స్టాకు వివరాలు సక్రమంగా ఉండాలి నందిగామ రూరల్ : విద్యార్థుల వసతి గృహాల్లో స్టాక్‌రిజిస్టర్లు సక్రమంగా లేకపోతే ఉపేక్షించేంది లేదని సివిల్ సప్లయీస్ జిల్లా మేనేజర్ ఎం.చిట్టిబాబు హెచ్చరించారు. నందిగామ పట్టణంలోని ఎస్సీ-1 బాలుర వసతి గృహాన్ని సోమవారం రాత్రి పొద్దుపోయాక ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్వహకుడు రవికుమార్‌ను అడిగి స్టాక్, విద్యార్థుల వివరాలను తెలుసుకున్నారు. రిజిస్టర్లో స్టాక్ వివరాలకు, నిల్వకు వ్యత్యాసం ఉండటంతో వాటి వివరాలు నమోదు చేసుకున్నారు. తనఖీల్లో ఎంసీహెచ్ నాగేశ్వరరావు, ఆర్ఐ వెంకటేశ్వరరావు, వీఆర్వో బ్రహ్మం పాల్గొన్నారు. -
ఈ ‘వసతి’ మాకొద్దు బాబోయ్
స్పెషల్ డ్రైవ్‌లకు స్పందన కరువు విద్యార్థుల్లేక మూతపడుతున్న హాస్టళ్లు ‘‘నందిగామలో ఒకే సముదాయంలో నాలుగు ప్రభుత్వ వసతి గృహాలున్నాయి. రెండు ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ హాస్టల్లో విద్యార్థులు చదువుతున్నారు. రెండేళ్ల క్రితం ఈ హాస్టళ్లలో 580మంది విద్యార్థులుండేవారు. అయితే ఈ ఏడాది ఒక్కసారిగా సగానికి సగం పడిపోయి కేవలం 241మందికి చేరింది. దాదాపు ఇదే పరిస్థితి జిల్లా అంతటా నెలకొంది.’’ విజయవాడ : ప్రభుత్వ వసతి గృహాల్లో రానురాను కనీస సౌకర్యాలు దూరమవుతుండడంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోతుంది. ఇవి వెలవెల పోతుండడంతో మేల్కొన్న అధికారులు విద్యార్థులు హాస్టళ్లలో చేరాలని నెలరోజులుగా మొత్తుకుంటున్నా చీమంత కూడా స్పందన కానరావడంలేదు. నిబంధనల ప్రకారం వందమంది ఉండాల్సిన హాస్టల్లో సగం మంది కూడా ఉండటం లేదు. జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న ఎస్సీ హాస్టళ్లు 149 వున్నాయి. వీటిలో బాలురకు 87, బాలికలకు 62 ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఈ హాస్టళ్లలో దాదాపు 15,800 మంది విద్యార్థులు వసతి పొందాలి. గత ఏడాది 11,232 మంది, సంవత్సరం 10,713 మందికి ఈ సంఖ్య పడిపోయింది. బీసీ-ఎస్టీ హాస్టళ్లలోనూ అదే పరిస్థితి... కాగా బీసీ హాస్టళ్లలోనూ ఇదే పరిస్థితి ఉందని చెబుతున్నారు. జిల్లాలో 63 హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో 46 బాలుర హాస్టళ్లుకాగా, 17 బాలికలవి ఉన్నాయి. దాదాపు 6,300 మంది విద్యార్థులు ఉండాల్సిన ఈ హాస్టళ్లలో 4,560మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. షెడ్యూల్డ్ తెగల హాస్టళ్లలోనూ విద్యార్థులు చేరడం లేదు. 20 హాస్టళ్లలో దాదాపు రెండు వేల మంది విద్యార్థులకు వసతి సౌకర్యం ఉండగా కేవలం 1100మంది మాత్రమే ఉన్నారు. జూన్ 1వ తేదీనుంచి హాస్టల్ వార్డెన్లు, గ్రామాల్లో పర్యటించి అడ్మిషన ్లకోసం స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించారు. కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించి హాస్టళ్లలో సీట్ల భర్తీ కోసం చేసిన ప్రయత్నాలు వృథాఅయ్యాయి. ప్రతీ గ్రామం లో ప్రజాప్రతినిధులు, వార్డెన్లు కలిసి ప్రచారం చేసినా ఫలితం శూన్యమైంది. కారణాలివేనా?.. గ్రామీణ ప్రాంతాల హస్టళ్లలో సరైన సౌకర్యాలు లేకపోవడంతోనే తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్చటానికి ఇష్టపడడం లేదని తెలిసింది. హాస్టల్ వార్డెన్లు, సిబ్బంది సరిగా లేకపోవ డం, మెను కూడా సరిగా లేకపోవడంతో క్రమేపి ప్రభుత్వ హాస్టళ్ల పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతోంది. దీనికి తోడు గ్రామీణ ప్రాంతాల్లోనూ పుట్టగొడుగుల్లా ప్రైవేటు విద్యాసంస్థలు ఏర్పాటు కావడంతో విద్యార్థులను హాస్టళ్లకు పంపటం లేదు. పేదలు తమ బిడ్డలను ఇంగ్లిష్ మీడియం చదివించేందుకు సిద్ధమవుతున్నారు. మూసివేత దిశగా హాస్టళ్లు... ఇదిలా ఉండగా వరుసగా మూడేళ్లపాటు విద్యార్థుల సంఖ్య తగ్గితే వసతి గృహాలను మూసి వేస్తారు. గత ప్రభుత్వం 75మంది విద్యార్థుల కంటే తక్కువగా ఉన్న వసతి గృహాల ను మూసివేయాలనే ప్రతిపాదనలు తయారు చేసింది. ఇప్పటికే తక్కువగా ఉన్న హాస్టళ్ల వివరాలను ఆన్లైన్లో ఉంచారు. ఈ విద్యాసంవత్సరంలోనూ విద్యార్థుల సంఖ్య పెరగకపోతే దాదాపు సగానికి సగం హాస్టళ్లు మూసివేయక తప్పదని అధికారులు భావిస్తున్నారు. -
హాస్టళ్లపై ఫిర్యాదులొస్తే ఉపేక్షించం
కర్నూలు(జిల్లా పరిషత్): జిల్లాలోని కళాశాలల హాస్టళ్లపై ఫిర్యాదులొస్తే కఠిన చర్యలు తప్పవని సాంఘిక సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ఎం.ఎస్.శోభారాణి హెచ్చరించారు. కళాశాలల హాస్టళ్ల వార్డెన్లతో సోమవారం ఆమె తన చాంబర్లో సమీక్ష నిర్వహించారు. 21 కళాశాలల హాస్టళ్లలో ఎక్కడా మెనూ చార్ట్ అతికించలేదని, విద్యార్థినీ విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించడం లేదని మండిపడ్డారు. వారానికి 5 రోజులు కోడిగుడ్డు ఇవ్వాల్సి ఉన్నా ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. పిల్లలు వారానికి ఒకరోజు చికెన్ చాలని చెబుతున్నట్లు వార్డెన్లు వివరించారు. ప్రతి హాస్టల్లో విద్యార్థుల వివరాలను ఆన్లైన్లో ఎన్రోల్ చేయాలని డీడీ సూచించారు. అన్ని హాస్టళ్లకు రెండు నెలల ముందుగానే లైబ్రరీ పుస్తకాలు, అల్మారాలు పంపిణీ చేశామని.. అయితే చాలా చోట్ల వాటిని ఉపయోగించుకోకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి హాస్టల్‌కు పోటీ పరీక్షలకు అనుగుణంగా మరో వెయ్యి రూపాయల విలువల చేసే పుస్తకాలు అందిస్తామని, వాటిని విద్యార్థులకు అందుబాటులో ఉంచాలన్నారు. విద్యార్థులు పుస్తకం పోగొడితే అందుకు రెట్టింపు మొత్తం వసూలు చేయాలన్నారు. హాస్టళ్లలో నలుగురు విద్యార్థులచే మెనూ కమిటీ వేయాలన్నారు. విద్యార్థులు భోజనం చేయడానికి ప్లేట్లు, గ్లాసులు లేవని.. బెడ్షీట్లు, కార్పెట్, ట్రంకు పెట్టెలు అవసరమని వార్డెన్లు చెప్పడంతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని డీడీ చెప్పారు. ప్రతి విద్యార్థినీ విద్యార్థులకు గుర్తింపుకార్డు ఉండాలని, వారినే హాస్టల్లోకి అనుమతించాలన్నారు. చాలా బాలుర హాస్టళ్లల్లో బయటి విద్యార్థులు వచ్చి ఉంటున్నారని, ఇది సహించరాని విషయమన్నారు. విద్యుత్ కోతలతో బాలికల హాస్టళ్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు వార్డెన్లు డీడీ దృష్టికి తీసుకురాగా.. అలాంటి చోట్ల ఇన్వర్టర్లు, జనరేటర్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. బాలికలకు ప్రతి నెలా పీహెచ్సీ వైద్యులచే పరీక్షలు చేయించాలని వార్డెన్లు కోరగా డీఎంహెచ్ఓకు లేఖ రాస్తామని తెలిపారు. -
ఉచిత కరెంటుకు మంగళం!
ప్రభుత్వం నుంచి ట్రాన్స్‌కోకు అందని నిధులు లబ్ధిదారుల నుంచి బిల్లులు వసూలు చేస్తున్న ట్రాన్స్‌కో మూన్నాళ్ల ముచ్చటగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ఎస్సీ, ఎస్టీలకు ఆసరాగా ఉండేందుకు గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 50 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ పథకం ఆరు నెలలు తిరక్కుండానే అభాసుపాలవుతోంది. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం దీనిగురించి పట్టించుకోవడంలేదు. అసలే అప్పుల ఊబిలో కూరుకుపోయిన ట్రాన్స్‌కో లబ్ధిదారుల నుంచి ముక్కుపిండి బిల్లులు వసూలు చేస్తోంది. పలమనేరు: ఎస్సీ,ఎస్టీ కాలనీల్లో 50 యూనిట్లలోపు విద్యుత్‌ను వాడే లబ్ధిదారులకు ఉచిత కరెంటును అందజేసేలా గత ప్రభుత్వం ఉచి త విద్యుత్ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. ఈ పథకాన్ని ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడంలేదు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ద్వారా నిధులు రాకపోవడంతో ఈ పథకం మూన్నాళ్ల ముచ్చటగా మారింది. ట్రాన్స్‌కో అధికారులు ఎస్సీ, ఎస్టీల నుంచి విద్యుత్ చార్జీలను వసూలు చేస్తున్నారు. పథక ఉద్దేశమేమిటంటే... ఎస్సీ, ఎస్టీల కాలనీల్లో 50 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించే కుటుంబాలకు ఉచిత కరెంటును అందివ్వడమే ఈ పథక లక్ష్యం. ఇందుకోసం గత ఏడాది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ ద్వారా ఈ పథకానికి నిధులు సమకూర్చింది. కార్యక్రమ నిర్వహణను సాంఘిక సంక్షేమశాఖకు అప్పగించింది. పథకం ప్రారంభమైన తర్వాత రెండు నెలలు మాత్రం ట్రాన్స్‌కోకు నిధులు అందాయి. ఆపై దీని గురించి పట్టించుకోలేదు. ట్రాన్స్‌కోకు రూ.2.40 కోట్ల బకాయి తిరుపతి ట్రాన్స్‌కో సర్కిల్ పరిధిలోని రూరల్ డివిజన్లలో ఈ పథకం అమలవుతోంది. చిత్తూరురూరల్, మదనపల్లెరూరల్, తిరుపతి రూర ల్, పూతలపట్టు, పీలేరు డివిజన్ పరిధులతో పాటు కుప్పం రెస్కోతో కలిపి దాదాపు 44 వేల మంది ఎస్సీ,ఎస్టీ లబ్ధిదారులున్నారు. వీరికి సంబంధించి ఆరు నెలలుగా రూ.2.40 కోట్ల వరకు సాంఘిక సంక్షేమ శాఖ ట్రాన్స్‌కోకు బకాయిపడింది. ఇన్నాళ్లూ ఎదురుచూసినా డబ్బులు రాకపోవడంతో లబ్ధిదారుల నుంచి బిల్లులు వసూలు చేస్తోంది. రెండు నెలల నుంచి వసూలు రెండు నెలల నుంచి ట్రాన్స్‌కో అధికారులు లబ్ధిదారుల నుంచి కరెంటు బిల్లులు కట్టించుకుంటున్నారు. కొందరు బిల్లులు చెల్లించేందుకు ముందుకు రాకపోవడంతో ఓ నెల వేచిచూసే ధోరణిలో ట్రాన్స్‌కో ఉం ది. వచ్చే నెల నుంచి కచ్చితంగా బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి. కుదరదంటే ఇళ్లకు డీసీలు చేయాల్సి వస్తుందని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. ఈ విషయమై చిత్తూరు ట్రాన్స్‌కో డీఈ రమణను వివరణ కోరగా పథకం ప్రారంభమయ్యాక రెండు నెలలు మాృతం బిల్లులందాయని, ఆ తర్వాత ప్రభుత్వం నుంచి తమకు డబ్బు జమ కాలేదన్నారు. తమ శాఖకు ఈ బిల్లులు గుదిబండలా మారాయన్నారు. అందుకే ఎస్సీ,ఎస్టీ లబ్ధిదారుల నుంచి బిల్లులు వసూలు చేస్తున్నామన్నారు. -
గురుకులాల ఉద్యోగులకు జీతాల్లేవ్!
శ్రీకాకుళం కలెక్టరేట్: సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి జూన్ నెల జీతాలు ఇంతవరకు అందలేదు. సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీకే సంబంధిత ప్రిన్సిపాళ్లకు ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది జీతాలు, నిర్వహణ ఖర్చుల నిధులు విడుదల చేసేవారు. జిల్లాలో 12 సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 256 మంది వివిధ కేడర్ల ఉపాధ్యాయులు, 86 మంది ఉపాధ్యాయేతర సిబ్బంది పని చేస్తున్నారు. సగటున ఒక పాఠశాలకు జీతాలు, నిర్వహణ ఖర్చులకు నెలకు 8 నుంచి రూ. 10 లక్షల వరకు నెలకు అవసరమవుతుంది. 12 పాఠశాలలకు కలిపి రూ.1.20 కోట్లు చెల్లాంచాల్సి ఉంది. ఈ బడ్జెట్‌ను గత ప్రభుత్వాలు సకాలంలోనే చెక్కుల రూపంలో సంబంధిత ప్రిన్సిపాళ్లకు అందజేసేవారు. దీని ప్రకారం జూన్ జీతాల బిల్లు జూలై 1 నాటికి ప్రిన్సిపాళ్లకు చేరాలి. 2న సిబ్బందికి జీతాలు చెల్లించాలి. అయితే ఈ నెల అలా జరగలేదు. 8వ తేదీ దాటిపోయినా జీతాలు అందకపోవడంతో సిబ్బంది ఆందోళన చెం దుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో జాప్యం జరుగుతోం దని కొందరు అంటున్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా ఉద్యోగుల జీతాలు ఆలస్యం చేయబోమని ప్రభుత్వం ప్రకటించడంతోపా టు మిగిలిన అన్ని శాఖల ఉద్యోగులకు ఇప్పటికే జీతాల చెల్లింపులు దాదాపు పూర్తి అయ్యా యి. ఇదే విషయాన్ని గురుకుల కళాశాలల కో-ఆర్డినేటర్ చంద్రావతి వద్ద ప్రస్తావిం చగా ఈ నెల జీతాల నిధులు అందకపోవడం వాస్తవమేనన్నారు. అయితే ఎందుకు ఆలస్యమైందన్నదానికి కారణాలు తెలియవన్నారు. -
పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య
హన్మకొండ సిటీ : బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యనందించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. ఈ మేరకు విద్యార్థుల కోసం ప్రత్యేక హాస్టళ్లు, పదో తరగతి శిక్షణ కేంద్రాలు ఏర్పాటుచేస్తున్న ట్లు పేర్కొన్నారు. హన్మకొండ బాలసముద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల హాస్టల్లో పదో తరగతి విద్యార్థుల(బాలికల) ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని శుక్రవారం కలెక్టర్ ప్రారంభించారు. తొలుత బీ.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసిన కలెక్టర్ ఆ తర్వాత ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. కష్టపడి చదవాలి విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్విని యోగం చేసుకుంటూ కష్టపడి చదువుకుని ఉన్నత స్థా యికి చేరాలని కలెక్టర్ కిషన్ సూచించారు. తెలంగాణ ఆవిర్భవించి రాష్ర్ట పునర్నిర్మాణం చేసుకుంటున్న దశ లో రాష్ర్టంలోనే జిల్లాలో మొదటిసారిగా పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ శిబిరాలు ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఎస్సెస్సీలో 10 జీపీఏ సాధించడమే లక్ష్యంగా జిల్లాలో 29 శిబి రాలు ఏర్పాటుచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ శిబిరాల్లో విద్యార్థులకు చదువు చెప్పేందుకు నిపుణులైన ఉపాధ్యాయులను నియమించడంతో పాటు మంచి భోజన, వసతి కల్పిస్తామన్నారు. ప్రతిరోజూ సాయంత్రం ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు బోధిస్తూ వారానికోసారి పరీక్ష నిర్వహిస్తారని కలెక్టర్ తెలిపారు. పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా బోధనలో మార్పులు చేస్తారని వివరించారు. దసరా, సంక్రాంతి సెలవులకు మాత్రమే ఇంటికి వెళ్లి, మిగతా పది నెలలు చదువుపైనే దృష్టి సారించాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. ఎన్సీఆర్టీ పుస్తకాలు అందుబాటులో ఉంచడంతో పాటు ఐఐటీ కోచింగ్ ఇప్పించనున్నట్లు చెప్పారు. అలాగే, ఏమైనా సమస్య ఉంటే నేరుగా తనకు ఫోన్ చేసేందుకు వీలుగా హాస్టల్లో కాయిన్ బాక్స్ ఏర్పాటుచేయిస్తానని తెలిపారు. హాస్టల్లో ఏర్పాటుచేయనున్న గ్రీవెన్స్ రిజి స్టర్‌ను వారానికో సారి పరిశీలించి విద్యార్థుల సమస్య లు పరిష్కరిస్తానని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భం గా విద్యార్థులకు పుస్తకాలు, బెడ్షీట్లు, దుప్పట్లు అం దించారు. సమావేశంలో ఏజేసీ కృష్ణారెడ్డి, డీఈఓ విజ య్‌కుమార్, సాంఘీక సంక్షేమ సహాయ అధికారిణి రమాదేవి, సమాచార కేంద్రం డిప్యూటీ డైరక్టర్ డీ.ఎస్.జగన్, హాస్టల్ వార్డెన్ పద్మజ పాల్గొన్నారు. -
కాసులిస్తే సీటు!
- బెస్ట్ అవెలెబుల్ స్కూల్ ఎంపికలో అక్రమాలు - సాంఘిక సంక్షేమ శాఖాధికారుల లీలలు - సీటు ఇచ్చేందుకు రూ.5 వేలు డిమాండ్ ఆదిలాబాద్ : బెస్ట్ అవెలెబుల్ స్కూల్ పథకం ద్వారా కార్పొరేట్ విద్యను పేద దళిత విద్యార్థులకు అందించాలనే ఉన్నత లక్ష్యం అధికారుల ధనదాహం వల్ల నీరుగారుతోంది. సీటు కావాలంటే రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుండడంతో పేద తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తమ పిల్లలకు కార్పొరేట్ విద్య యోగ్యం లేదని వెనుదిరుగుతున్నారు. జిల్లాలో ఆదిలాబాద్‌లోని సీఆర్ఆర్, నిర్మల్‌లోని రవి స్కూల్, ఉట్నూర్‌లోని సెయింట్‌పాల్ స్కూల్లో బెస్ట్ అవెలెబుల్ స్కూల్ పథకం కింద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందిస్తున్నారు. ఏడాదికి రూ.20 వేలు ఒక్కో విద్యార్థి పేరిట సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా కార్పొరేట్ స్కూళ్లకు చెల్లించడం జరుగుతుంది. వేయిటింగ్ పేరిట అక్రమాలు సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో బెస్ట్ అవెలెబుల్ రెసిడెన్షియల్ స్కూ ల్ పథకం ద్వారా పేద ఎస్సీ విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలలో ఐదో తరగతిలో ప్రవేశం కోసం మే 25న నోటిఫికేషన్ జారీ చేశారు. జూన్ 5 వరకు దరఖాస్తులు తీసుకున్నారు. 100 సీట్లకు 500 దరఖాస్తులు వచ్చాయి. 10న లక్కీడ్రా ద్వారా వంద మంది విద్యార్థులను ఎంపిక చేశారు. కొంత మందిని వెయిటింగ్ లిస్టులో ఉంచారు. కాగా లక్కీడ్రా ముగిసి 15 రోజులు పైబడినా ఇంకా సీట్ల భర్తీలో అధికారు లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 84 మంది విద్యార్థుల ప్రవేశాలు పూర్తికాగా మరో 14 మంది విద్యార్థులు చేరలేదని అధికారులు చెబుతున్నారు. మరోపక్క వెయిటింగ్లో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులను ఆశ్రయించగా రూ.5 వేలు ఇస్తే సీటు ఇస్తామని చెబు తూ దండుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారనే ఆరోపణలు బాహా టంగా వినిపిస్తున్నాయి. విద్యార్థినుల పరంగా వెయిటింగ్ లిస్టులో కేవలం ఇద్దరికి మాత్రమే అవకాశం ఉండగా, నాలుగో నంబర్లో వేయిటింగ్‌లో ఉన్న విద్యార్థిని తండ్రిని రూ.5 వేలు ఇస్తే సీటు ఇస్తామని చెప్పడం అధికారుల తీరుకు నిదర్శనం. ఈ విషయంలో సాక్షి సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు అంకం శంకర్‌ను వివరణ కోరగా సీటు రానివారు ఇలాంటి ఆరోపణలు చేస్తారని, ఇందులో వాస్తవం లేదని పేర్కొన్నారు. లక్కీడ్రా నుంచి మొదలుకుంటే అన్ని విషయాల్లో పారదర్శకంగా వ్యవహరించామని, ప్రతీ విషయంలో వి ద్యార్థుల తల్లిదండ్రుల సంతకాలు కూడా తీసుకున్నామని తెలిపారు -
ఉచిత ఇంటర్‌కు నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోండి
విద్యార్థులకు సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ఎంఎస్ శోభారాణి సూచన కర్నూలు(అర్బన్): కార్పొరేట్ కళాశాలల్లో ఉచితంగా ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించేందుకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 30వ తేదీ వరకు గడువును పొడిగించినట్లు సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకులు ఎంఎస్ శోభారాణి తెలిపారు. సోమవారం సాయంత్రం తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీడీ మాట్లాడుతూ జిల్లాలోని జిల్లాపరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పూర్తి చేసిన అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. బీఏఎస్ పాఠశాలల్లో ఎస్సీ విద్యార్థులకు ప్రవేశం: జిల్లాలో ప్రభుత్వం ఎంపిక చేసిన 11 బెస్ట్ అవేలబుల్ స్కూల్స్‌లో 100 మంది ఎస్సీ బాల బాలికలకు 1వ తరగతి ఇంగ్లిషు మీడియంలో ప్రవేశం కల్పిస్తున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ డీడీ శోభారాణి తెలిపారు. ఇందులో 33 సీట్లను బాలికలకు, 67 సీట్లను బాలురకు కేటాయిస్తున్నట్లు చెప్పారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఒక్కో విద్యార్థికి స్కూల్ ఫీజులు, పుస్తకాలు ఇతరత్రా ఖర్చుల కింద ఎంపికైన పాఠశాలలకు ఏడాదికి రూ.20 వేలను ప్రభుత్వం మంజూరు చేయనుందని తెలిపారు. 1వ తరగతిలో తమ చిన్నారులకు చేర్చబోయే తల్లిదండ్రుల నివాసం ఆయా పాఠశాలలకు సమీపంలో ఉండాలన్నారు. ఈ పాఠశాలలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు నివాస, కుల, తల్లిదండ్రుల ఆదాయ, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు జీరాక్స్ కాపీలు, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫోటోలను దరఖాస్తుకు జతపరచాలన్నారు. ఈ పాఠశాలల్లో చేరే విద్యార్థులు 01-06-2008 నుంచి 01-06-2009 సంవత్సరాల మధ్య జన్మించి ఉండాలని, అలాగే పుట్టిన తేదీ సర్టిఫికెట్లు సంబంధిత మునిసిపల్‌కమిషనర్, తహశీల్దార్లు జారీ చేసినవై ఉండాలన్నారు. దరఖాస్తు ఫారాలు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో, జిల్లాలోని ఏడు సహాయ సంక్షేమాధికారుల కార్యాలయాల్లో లభ్యమవుతున్నట్లు ఆమె తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 28లోగా తమ కార్యాలయంలో అందించాలని పేర్కొన్నారు. ఈ నెల 30న ఉదయం 11 గంటలకు స్థానిక అంబేద్కర్ భవన్లో లాటరీ పద్ధతిన విద్యార్థులకు ఎంపిక చేస్తారని ఆమె తెలిపారు. బీఏఎస్గా ఎంపికైన పాఠశాలలు: జిల్లా కేంద్రంలోని సర్వేపల్లి విద్యాలయం క్రిష్ణానగర్, జీసస్ మేరీ జోసఫ్ ఇంగిషు మీడియం స్కూల్ చిల్డ్రన్స్ పార్కు సమీపంలో, కాకతీయ పబ్లిక్ స్కూల్ మద్దూర్‌నగర్, నందికొట్కూరు నవనంది హైస్కూల్, నంద్యాల సమతా విద్యానికేతన్, కాల్వబుగ్గ బుగ్గరామేశ్వర హైస్కూల్, డోన్ సుధ హైస్కూల్, ఎమ్మిగనూరు ఆదర్శ విద్యా పీఠం, నలంద హైస్కూల్, ఆళ్లగడ్డ శ్రీ రాఘవేంధ్ర పబ్లిక్ స్కూల్, కోవెలకుంట్ల సెయింట్ జోసఫ్ ఇంగ్లిషు మీడియం స్కూల్స్ ఎంపికైనట్లు డీడీ శోభారాణి తెలిపారు. -
‘సంక్షేమా’న్ని గాడిలో పెడతాం : మంత్రి రావెల
విమానాశ్రయం (గన్నవరం) : కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో భ్రస్టుపట్టిపోయిన సాంఘిక సంక్షేమ శాఖను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, గిరిజన అభివృద్ధి శాఖల మంత్రి రావెల కిషోర్‌బాబు స్పష్టం చేశారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అవినీతిమయమైన కాంగ్రెస్ పాలకులు రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నాశనం చేశారని చెప్పారు. కొత్తగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నేతృత్వంలో ఈ లోపాలను సరిచేసి ప్రజలకు నీతివంతమైన పాలనను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ఖచ్చితంగా ప్రత్యేక హోదా సాధిస్తామని స్పష్టం చేశారు. నూతనంగా నిర్మించనున్న రాష్ట్ర రాజధానికి ప్రజలు తమవంతు సహాయమందించాలని కోరారు. తంగిరాల మృతికి సంతాపం... నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు ఆకాల మృతి పార్టీకి, దళిత వర్గాలకు తీరని లోటన్నారు. విద్యార్థి దశ నుంచి మంచి నాయకత్వ లక్షణాలు కలిగిన ఆయన టీడీపీలో అంచెలంచెలుగా ఎదిగి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాకరని తెలిపారు. తంగిరాల కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. తొలుత విమానాశ్రయంలో మంత్రికి సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో పాటు పలు దళిత సంఘాల నాయకులు, ఎస్సీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. -
'ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధిస్తాం'
ఆంధ్రప్రదేశ్‌కు కచ్చితంగా ప్రత్యేక హోదా సాధిస్తామని ఆ రాష్ట్ర మంత్రి రావెల కిషోర్ బాబు స్ఫష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రకాల వనరులు ఉన్నాయని తెలిపారు. ఆ వనరులను రాష్ట్రాభివృద్ధి వినియోగించుకుంటామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై గతంలో పార్లమెంట్ హమీ ఇచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉందని, ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా సాధ్యమేనని కిషోర్ కుమార్ పేర్కొన్నారు. -
సంక్షేమ భవన్లో విభజన లొల్లి!
భవనంలోని అంతస్థులనువిభజించినా... మారని చాంబర్లు సహకరించడం లేదంటూ రెండు ప్రాంతాల ఉద్యోగుల ఆరోపణలు హైదరాబాద్: అధికారికంగా రెండు రాష్ట్రాలు ఏర్పాటై వారం గడుస్తున్నా... సంక్షేమశాఖలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సంక్షేమ కార్యాలయాల విభజన కూడా ఈ శాఖలో కనిపించడం లేదు. నగరంలో మాసబ్‌ట్యాంక్‌లోని సంక్షేమ భవన్లో రెండు ప్రాంతాల అధికారులు, ఉద్యోగుల మధ్య సమన్వయం కొరవ డడంతో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. జూన్ 2 అపాయింటెడ్ డే నుంచి తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పాటు కావడంతో అంతకు ముందే ప్రభుత్వం సంక్షేమభవన్‌లోని ఆరు అంతస్తులను జనాభా ప్రాతిపదికన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు విభజించింది. గ్రౌండ్ ఫ్లోర్, మొదటి, రెండో అంతస్తులను తెలంగాణకు , మూడు నుంచి ఆరు అంతస్తు లను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. ఈ మేరకు సంక్షేమ భవన్లో విభజన వివరాలను కాగితాలపై ముద్రించి అన్ని అంతస్తులలో అతికించారు కూడా. అయితే వారం రోజులు గడచినా... రెండు ప్రాంతాల అధికారులు, ఉద్యోగులు తమ చాంబర్లను ఖాళీ చేయలేదు. విభజనకు ముందు ఉన్నట్టుగానే అధికారులు, ఉద్యోగులు యథాస్థానాల్లోనే ఉండి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే రెండు ప్రాంతాలకు చెందిన వారు నెపాన్ని ఎదుటివారిపై నెట్టేస్తున్నారు. దీంతో సంక్షేమ భవన్‌కు వచ్చే ప్రజలు, ఫీజు రీయింబర్స్‌మెంటు కోసం వచ్చే విద్యార్థులు అయోమయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఏపీలోకి 13 మంది తెలంగాణ ఉద్యోగులు గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగంలో పూర్వపు ఆంధ్రప్రదేశ్‌లో 516 మంది ఉద్యోగులు ఉండ గా, ప్రధాన కార్యాలయమైన సంక్షేమ భవన్లో 69 మంది ఉద్యోగులున్నారు. ఈ 69 మందిలో స్థానికత ఆధారంగా 23 మంది ఉద్యోగులను తెలంగాణకు కేటాయించారు. మిగతా 46 మందిని ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించారు. మంజూరైన పోస్టుల ఆధారంగా జరిగిన ఈ విభజనలో సీమాంధ్రకు వెళ్లినవారిలో 13 మంది తెలంగాణ వారున్నారు. తెలంగాణకు చెందిన తమను సీమాంధ్రకు కేటాయించడంపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే తమను సీమాంధ్రకు పంపించారన్న అభిప్రాయంతో ఉన్న ఆ ఉద్యోగులు సహకరించడం లేదని సీమాంధ్ర అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై గిరిజన శాఖ ఇంజనీరింగ్ విభాగం ఈఎన్సీ రాజేంద్రప్రసాద్ ‘సాక్షి’ తో మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే ఉద్యోగుల విభజన జరిగిందని, తెలంగాణకు కొత్తగా పోస్టులు మంజూరైన తరువాత సీమాంధ్రకు కేటాయించిన ఉద్యోగులు తమ ప్రాంతాలకు వెళతారని చెప్పారు. -
మాతృదేవోభవ..!
అమ్మ..రెండక్షరాలు. అనురాగ చిహ్నాలు. ఆత్మీయతకు సంకేతాలు. సృష్టిలోని జీవరాశులన్నింటికీ మూల కారకాలు. ఆప్యాయత ఆమె సొంతం. సహనానికి మరో రూపం. అందుకే తల్లిది అద్వితీయ స్థానం. జీవితంలో ఆమెకు నిత్యస్మరణీయ ప్రాధాన్యం. తొలిగురువు. ఎదిగే..ప్రతీ అడుగులో నడిపించే మార్గదర్శి. ‘గీతా’కారుడు కృష్ణుడైనా, శాంతి దూత క్రీస్తయినా అమ్మ ఆలన,పాలనలోనే అంతటి వారయ్యారు. ఇక..మహ్మద్ ప్రవక్తయితే స్వర్గం ఎక్కడుంటుందీ అంటే తల్లి పాదాల చెంతనే అని సందేశమిచ్చాడు. అలాంటి మాతృమూర్తి...మనిషి జీవితంలో అమృతమూర్తి. ప్రేరణ నిచ్చే చైతన్యశీలి. నిత్యమై..సత్యమై వందనాలందుకునే త్యాగశీలి. ఆమెకు ‘మాతృ దినోత్సవ వేళ’ పాదాభివందనం.. అలంపూర్, న్యూస్‌లైన్: ‘అమ్మ అందించిన సహకారంతోనే నేను ఐపీఎస్ చదవి.. ఇంతటి స్థాయిలో ఉన్నా. అమ్మరుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది.. చిన్నప్పటినుంచే ఎంతో క్రమశిక్షణ నేర్పించారు..’అని సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యాదర్శి డాక్టర్ ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ అన్నారు. శనివారం అలంపూర్‌కు వచ్చిన ఆయన తన ఇంటికి వెళ్లి తల్లి ప్రేమమ్మను పలకరించారు. అనంతరం స్థానిక అంబేద్కర్ విజ్ఞానకేంద్రాన్ని సందర్శించారు. అక్కడే విద్యార్థులతో కలిసి ముచ్చటించారు. రాష్ట్రంలో ఉన్న 384 గురుకుల పాఠశాలల్లో రెండులక్షలకుపైగా విద్యార్థులు చదువుతున్నారని చెప్పారు. జిల్లాలో 45 విజ్ఞానకేంద్రాలను ప్రారంభించామని తెలిపారు. గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు 24వేల సీట్లు ఉండగా, 70వేల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని పేర్కొన్నారు. క్రమశిక్షణతో మేలి గితే విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించే అవకాశం ఉంటుందన్నారు. అమ్మ చూపించే ప్రేమానురాగాల ముందు చంద్రుడి చల్లదనం చిన్నబోతుంది. అమ్మచేతి కమ్మని వంటకం అమృతాన్నీ అధిగమిస్తుంది. సృష్టినే సృష్టించిన బ్రహ్మ అరుునా అ మ్మ కాన్నా చిన్న. తన ప్రాణ ం ఫణంగా పెట్టి బిడ్డకు జీవం పోసే అమ్మ ముందు దే వదేవతలూ దిగదుడుపే. తన రక్తాన్ని పాలుగా మార్చి బిడ్డ ఆకలి తీర్చే తల్లి రుణం ఎన్నటికీ తీర్చలేం. అందుకే సదా కన్న తల్లి దేవత. ఈ జీవితానికి ఆమె విధాత. - న్యూస్‌లైన్, జడ్చర్లటౌన్ -
86 మంది విద్యార్థులకు అస్వస్థత
విస్సన్నపేట, కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం నరసాపురంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాలలో 86 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఈ పాఠశాలలో సుమారు 500 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. శనివారం రాత్రి విద్యుత్తు లేకపోవటంతో వీరు చీకటిలోనే భోజనం చేశారు, కొద్దిసేపటికే ఎనిమిది మంది విద్యార్థులు వాంతులు చేసుకుంటూ కడుపునొప్పితో బాధపడ్డారు. ఆదివారం ఉదయానికి ఏకంగా 78 మంది కడుపు నొప్పితో బాధపడుతున్నా నిర్వాహకులు పట్టించుకోలేదు. ఆదివారం విద్యార్థులను కలుసుకునేందుకు తల్లిదండ్రులు రావడంతో విషయం బయటపడింది. తల్లిదండ్రులు ఆందోళనతో నిర్వాహకులు 108 వాహనాలకు సమాచారం అందించి విద్యార్థులను మెరుగైన వైద్యంకోసం నూజివీడు తరలించారు. వంటగదిలో, భోజనం హాలులో కరెంటు పోతే చీకట్లో భోజనం పెట్టడం ఏంటని తల్లిదండ్రులు నిర్వాహకులను నిలదీశారు. -
బెస్ట్ ఎవైలబుల్ స్కూల్స్’కు దరఖాస్తుల ఆహ్వానం
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్ : సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ ఎవైలబుల్ స్కూల్స్, రెసిడెన్షియల్స్‌ను ఎంపిక చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ శాఖ డిప్యూటీ డెరైక్టర్ కే సరస్వతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని వసతులు ఉన్న విద్యా సంస్థలు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఐదేళ్లుగా పదో తరగతి పరీక్షల్లో 90 శాతం, మొత్తం విద్యార్థుల్లో 50 శాతం మంది విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలని తెలిపారు. ఈ పథకం ద్వారా ఎంపిక చేసిన పాఠశాలల్లో సాంఘిక సంక్షేమ శాఖ ఎంపిక చేసిన విద్యార్థులను చేరుస్తామన్నారు. ఒక్కో విద్యార్థికి ఏడాదికి 20 వేల ఉపకార వేతనాన్ని ప్రభుత్వం మంజూరు చేస్తుందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న పాఠశాలల యాజమాన్యాలు ఈ నెల 20వ తే దీలోగా సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
సమగ్రంగా రండి
కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్‌లైన్ : ప్రజావాణికి హాజరయ్యే అధికారులంతా అర్జీల పరిష్కారానికి సంబంధించిన సమగ్ర సమాచారంతో రావాలని అదనపు జాయింట్ కలెక్టర్ బీఎల్ చెన్నకేశవరావు చెప్పారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏజేసీతో పాటు డీఆర్వో ఎల్ విజయచందర్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఏజేసీ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీల పరిష్కారం అర్ధవంతంగా ఉండాలన్నారు. ఆయా శాఖాధికారులు సంబంధిత శాఖల పరిధిలో వచ్చిన అర్జీలు ఎన్ని పరిష్కరించబడ్డాయి, ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి. అందుకుగల కారణాలు తదితర వివరాలతో ఒక రిజిష్టర్ నిర్వహించాలని తెలిపారు. సాంఘిక సంక్షేమశాఖ డీడీ డీ మధుసూదనరావు, గృహనిర్మాణశాఖ పీడీ సీహెచ్.ప్రతాపరావు, ఐసీడీఎస్ పీడీ కే కృష్ణకుమారి, బీసీ సంక్షేమశాఖ డీడీ ఎన్.చినబాబు, డీఎంఅండ్‌హెచ్‌వో సరసిజాక్షి, డీఎస్వో పీబీ సంధ్యారాణి, డీసీవో రమేష్‌బాబు, సీపీవో వెంకటేశ్వర్లు, బీసీ కార్పొరేషన్ ఈడీ పుష్పలత తదితర అధికారులు పాల్గొన్నారు. అర్జీలు ఇవే.... ఘంటసాల మండలం శ్రీకాకుళం నుంచి సూరపనేనిపాలెం వెళ్లే రహదారి మిగిలిపోయిన పనులను వెంటనే చేపట్టాలని గ్రామానికి చెందిన పోతన శివాజీ తదితరులు అర్జీ ఇచ్చారు. అవనిగడ్డ 1వ వార్డు రహదారిలో ఉన్న ఆక్రమణలు తొలగించి డ్రెయినేజీ సౌకర్యం కల్పించాలని రేపల్లె యోగానంద్ అర్జీ సమర్పించారు. నాగాయలంక మండలం తలగడదీవి గ్రామంలోని రహదారుల నిర్మాణం చేపట్టేందుకు ఎస్సీ గ్రాంటు నుంచి నిధులు మంజూరు చేయాలని కోరుతూ గ్రామానికి చెందిన పీ నరసింహారావు అర్జీ ఇచ్చారు. తన భర్తను సబ్ ఇన్స్పెక్టర్ అన్యాయంగా అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేశారని, ఆయనపై చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని గుడ్లవల్లేరుకు చెందిన వీరంకి ఉమాదేవి వినతిపత్రం అందజేశారు. డిసెంబరు 15వ తేదీన సాక్షి జిల్లా ఎడిషనల్లో ప్రచురితమైన ‘ఆల్ టైమ్ అలక్ష్యం’ వార్తకు స్పందనగా జిల్లాలోని వాణిజ్య బ్యాంకుల ఏటీఎంలలో సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసి ఖాతాదారులకు భద్రత కల్పించాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ అర్జీ ఇచ్చారు. మచిలీపట్నంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని సైకిల్ స్టాండులో అధికారికంగా నిర్ణయించిన ధరలకన్నా అధిక ధరలు వసూలు చేస్తున్నారని పాటదారులపై తగిన చర్యలు తీసుకోవాలని లక్ష్మణరావుపురానికి చెందిన వైవీ సుబ్రమణ్యం అర్జీ సమర్పించారు. ఘంటసాల మండలం డాలిపర్రు గ్రామంలో రక్షిత మంచినీటి పథకానికి మంజూరైన నిధులతో వాటర్ ట్యాంకు నిర్మాణం చేపట్టి ప్రజలకు తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన మాతంగి వెంకటేశ్వరరావు అర్జీ ఇచ్చారు. నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలో ఉన్న చెరువుకు వేలంపాటను నిర్వహించాలని గ్రామానికి చెందిన డీఎస్కే అప్పారావు అర్జీ సమర్పించారు. ఇటీవల జిల్లాలోని కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లోని ఇనస్ట్రక్టర్ల నియామకంలో అవకతవకలు జరిగాయని, నియామకాలపై విచారణ జరిపి ప్రతిభావంతులకు అవకాశం కల్పించాలని గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామానికి చెందిన పీవీఎన్ కీర్తి కోరారు. -
వర్గీకరణకు మద్దతు కూడగట్టాలి
= కేంద్ర సహాయ మంత్రి సర్వే సత్యనారాయణ =ఆర్ట్స అండ్ సైన్స కళాశాలలో మాదిగ ఉద్యోగుల రాష్ర్ట మహాసభ విద్యారణ్యపురి, న్యూస్‌లైన్ : ఎస్సీ వర్గీకరణ కోసం అన్ని పార్టీ ల మద్దతు కూడగట్టాలని కేంద్ర జాతీయ రహదారుల శాఖ సహాయ మంత్రి సర్వే సత్యనారాయణ మాదిగ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని హన్మకొండలోని ఆర్ట్స అండ్ సైన్స కళాశాలలో శనివారం నిర్వహించిన మాదిగ ఉద్యోగుల రాష్ర్ట మహాసభలో ఆయన మాట్లాడారు. వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో పెట్టాలని 20 ఏళ్లుగా పోరాడుతున్న మంద కృష్ణ కృషిని ఆయన కొనియాడారు. తాను ఒక్కడినే మాదిగ జాతి నుంచి గతంలో ఎంపీగా ఉన్నానని వివరించారు. అసెంబ్లీలో 24 మంది మాది గ ఎమ్మెల్యేలున్నా వర్గీకరణపై స్పందించ డం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సోనియాగాంధీ దృష్టికి వర్గీకరణ విషయాన్ని తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తే 59 మాదిగ ఉపకులాలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పని చేసినప్పుడే చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొచ్చి వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదింపజేశామని వివరించారు. ఈ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టాలి మాదిగ ఎంపీలు, ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లు ప్ర వేశపెట్టేలా కృషిచేయాలని ఎమ్మార్పీస్ వ్య వస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కోరారు. మరో నాలుగు నెలలైతే ఎన్నికలు రానున్నాయని తెలిపారు. అసెంబ్లీలో 24 మంది మాదిగ ఎమ్మెల్యేలు ఉంటే 24 నిమిషాలు కూడా వర్గీకరణ కోసం మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగ దండోరా ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీచేసి నలుగురు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అడ్డంకులు ఉన్నా తెలంగా ణ బిల్లు రాష్ట్రానికి వచ్చిందని, ఎలాంటి అడ్డంకులు లేని ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఎందుకు చట్టబద్ధత రావడం లేదని ఆయ న ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో నాలుగేళ్లు మాత్రమే ఎస్సీ వర్గీకరణ అమలు జరిగిందని, తర్వాత కోర్టు తీర్పుతో అ మలుకావడం లేదని ఆయన వివరించా రు. రాబోయే తెలంగాణలో సీఎం పదవి మాదిగ కులానికి చెందిన వ్యక్తికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షు డు కె.ప్రసాద్‌బాబు మాట్లాడుతూ వర్గీకరణతోనే మాదిగలు,ఉపకులాలకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌తో పాటు వివిధ పార్టీలు, ఎంఈఎఫ్ నాయకులు రా జారపు ప్రతాప్, డాక్టర్ రామగళ్ల పరమేశ్వ ర్, మంద వినోద్‌కుమార్, డాక్టర్ కృష్ణ య్య, ఇనుగుర్తి హన్మంంతరావు. తిప్పారపు లక్ష్మణ్, డాక్టర్ సీహెచ్.శ్రీనివాస్‌రా వు, డాక్టర్ ప్రసాద్‌బాబు, బెజవాడ పాప య్య, మల్లెపూడి సత్యనారాయణ, దిలీప్, ప్రవీణ్‌కుమార్, రాజారపు భాస్కర్, రా జేంద్రప్రసాద్, తిరుపతి, ఎంవీఎఫ్ నాయకురాలు ఆశ పాల్గొన్నారు. -
అక్కరకురాడు
=హాస్టళ్లలో ఐదేళ్లుగా అమలుకాని పథకం =అవస్థలు పడుతున్న విద్యార్థులు =సమరసాక్షితో కదిలిన అధికార యంత్రాంగం ఉన్నఊరిని.. కన్నవారిని వదిలి పగలంతా చదువులమ్మ ఒడిలో.. రాత్రివేళ సమస్యల లోగిళ్లలో.. నిరంతరం చదువుల పోరాటం సాగిస్తున్న పేద బిడ్డలకు ‘ఆత్మీయుడు’ అక్కరకు రావడంలేదు. ఐదేళ్ల కిందట వైఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆత్మీయుడు’ కార్యక్రమం ఏడాదిపాటు సజావుగా సాగినా ఆ తర్వాత దాన్ని పట్టించుకున్న నాథుడే లేడు. ఫలితంగా చాలా వసతిగృహాల్లో వార్డెన్లు పెట్టిందే తినాలి.. చెప్పిందే వినాలి అన్నట్టుగా పరిస్థితి తయారైంది. వసతి గృహాల్లో ఇబ్బందులపై మూడు రోజులుగా ‘సమరసాక్షి’ కలమెత్తడంతో కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు స్పందించడాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షిస్తున్నారు. సాక్షి, మచిలీపట్నం : హాస్టళ్ల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలివ్వాలని కలెక్టర్ ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ‘ఆత్మీయుడు’ కార్యక్రమానికి నిర్లక్ష్యపు బద్దకాన్ని వదిలిస్తే వసతిగృహాల పనితీరు మరింత మెరుగుపడుతుంది. ప్రతి వసతిగృహంలో ఉన్న మౌలిక వసతులు ఏ మేరకు ఉన్నాయి, ఇంకా ఏం కావాలి.. లోపాలుంటే చక్కదిద్దేందుకు 2008లో వైఎస్ ‘ఆత్మీయుడు’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ వసతిగృహాలను పర్యవేక్షించేందుకు అప్పట్లో ఒక్కో మండల స్థాయి అధికారిని ఒక్కో హాస్టల్‌కు ‘ఆత్మీయుడి’గా నియమించారు. నవీన్‌మిట్టల్ కలెక్టర్‌గా ఉన్న సమయంలో ఈ ఆత్మీయులు హాస్టళ్లకు వెళ్లి మంచిచెడ్డలు విచారణ జరిపేవారు. దీనికితోడు నెలలో ఒకరోజు విద్యార్థులతో కలిసి వారికి పెట్టే భోజనం తిని అక్కడే నిద్రించేవారు. తొలినాళ్లలో కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా అమలుచేసినా ఆ తర్వాత అటకెక్కించారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా కొందరు నిర్వాహకులు (వార్డెన్లు) రోజుల తరబడి వసతి గృహాల వైపు కన్నెత్తి చూడడం లేదు. విద్యార్థులకు అందజేయాల్సిన మెనూను వంటమనుషులకు అప్పగించి సొంత పనులు చూసుకుంటున్నారు. రికార్డుల మాయ.. జిల్లాలోని 300 ప్రభుత్వ వసతిగృహాల్లో దాదాపు 20 వేల మందికిపైగా విద్యార్థులున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నిర్వాహకులు విద్యార్థుల సంఖ్యను రికార్డుల్లో గిమ్మిక్కులు చేస్తున్నారు. ఇలా చేసిన చాలామందిని విధుల నుంచి తొలగించినప్పటికీ కొందరి ధోరణిలో మాత్రం ఎటువంటి మార్పు కనిపించడం లేదు. గత ఏడాది ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హాస్టల్ విద్యార్థులకు ప్రతి ఆదివారం ఎగ్ బిర్యాని అందించే పథకాన్ని ఆర్భాటంగా ప్రకటించారు. దాని కోసం విద్యార్థుల మెస్ చార్జీలు కూడా పెంచారు. అయినా ప్రస్తుతం కొన్నిచోట్లే బిర్యానీ పెడుతున్నారు. పలు వసతిగృహాల్లో విద్యార్థులకు కడుపునిండా సరైన భోజనం కూడా పెట్టడం లే దన్న ఆరోపణలు వినవస్తున్నాయి. విద్యార్థులు పడుతున్న అవస్థలు బయటవారికి చెబితే వారిని వార్డెన్లు మరింత ఇబ్బందులకు గురిచేస్తారని కొన్నిప్రాంతాల్లోని వసతిగృహాల నిర్వాహకులు చెబుతున్నారు. దీనివల్ల చాలామంది విద్యార్థులు వసతి గృహాల్లో లోపాలున్నప్పటికీ ఉన్నతాధికారులు తనిఖీలకు వెళ్లిన సమయంలో అన్నీ బాగున్నాయని చెబుతుంటారు. 12 అంశాలపై నివేదిక కోరిన కలెక్టర్ సాక్షిలో ప్రచురించిన వరుస కథనాలపై కలెక్టర్ దృష్టిసారించడంతో వసతిగృహాల నిర్వాహకుల్లో కలకలం రేగుతోంది. ఇప్పటికే కలెక్టర్ ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులను 12 అంశాలపై నివేదికలు కోరారు. హాస్టల్వారీగా నిర్వహణ ఎలా ఉంది.. ఏం కావాలి.. మెనూ అమలవుతుందా.. మౌలిక సదుపాయాల మాటేమిటి.. పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత కోసం ఎటువంటి చర్యలు తీసుకున్నారు.. పారిశుధ్య నిర్వహణ ఎలా ఉంది.. తదితర అంశాలను ప్రస్తావిస్తూ నివేదిక ఇవ్వాలని కలెక్టర్ కోరడంతో అధికారులు ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టారు. ఇప్పటికే జిల్లాలోని హాస్టళ్ల మరమ్మతుల కోసం మంజూరైన రూ.5.65 కోట్లు, ప్రహరీ నిర్మాణాలకు మంజూరైన రూ.95 లక్షలతో ఎక్కడెక్కడ పనులు చేపట్టారు.. వాటి పురోగతి ఏమిటి.. అనే వివరాలు కూడా కలెక్టర్ ఆరా తీశారు. వీటిపై పూర్తిస్థాయి నివేదికలు తెప్పించుకుని ఈ నెల 14న హైదరాబాద్ నుంచి జిల్లాకు వచ్చిన తరువాత సమీక్ష నిర్వహిస్తారని అధికారులు చెబుతున్నారు. ఇద్దరు వార్డెన్లకు మెమోలు.. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు వార్డెన్లకు మెమోలిచ్చినట్టు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డెరైక్టర్ డి.మధుసూదనరావు సాక్షికి చెప్పారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వసతిగృహాలను ఆకస్మిక తని ఖీలు చేస్తున్నామన్నారు. మంగళవారం రాత్రి పామరు, అడ్డాడ వసతి గృహాలను తనిఖీ చేసినప్పుడు లోపాలు గుర్తించినట్టు చెప్పారు. అడ్డాడ హాస్టల్లో ఆరుగురు, పామర్రు హాస్టల్లో తొమ్మిది మాత్రమే విద్యార్థులు ఉన్నారని, సంబంధిత వార్డెన్లకు నోటీసులు ఇచ్చామన్నారు. వారి వివరణ సంతృప్తికరంగా లేకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులకు సరైన భోజనం పెట్టకుండా, వారికి సౌకర్యాలు కల్పించకుండా నిర్లక్ష్యం వహించే వార్డెన్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడేది లేదని మధుసూదనరావు స్పష్టం చేశారు. -
గాలిలో ‘సంక్షేమ’...చలితో సహవాసం
చలిపులి వణికిస్తుంటే తల్లిదండ్రుల పొత్తిళ్లలో వెచ్చగా ఆదమరిచి నిద్రపోవాల్సిన చిన్నారులు వారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించక తప్పనిసరి పరిస్థితుల్లో కన్నవారికి దూరంగా హాస్టళ్లలో వసతి పొందుతూ విద్యనభ్యసిస్తున్నారు. కష్టం వస్తే కన్నవారికి కూడా చెప్పుకోలేని దయనీయ స్థితిలో.. తమకు కలిగే ఇబ్బందులపై నోరెత్తి కూడా అడగలేని దుస్థితిలో ఉన్న ఆ చిన్నారులు కనీసం చలిగాలుల నుంచి కూడా రక్షణ లేక హాస్టల్ గదుల్లో వణికిపోతున్నారు. ఆదివారం రాత్రి జిల్లాలోని హాస్టళ్లలో న్యూస్‌లైన్ విజిట్‌లో విద్యార్థులు ఇబ్బందులు వెలుగుచూశాయి. మచిలీపట్నం, న్యూస్‌లైన్ : ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులు చలితో సహవాసం చేస్తున్నారు. చలిపులి వెన్నులో వణుకు పుట్టిస్తున్నా ఎవరికీ చెప్పుకోలేని దుస్థితిలో చిన్నారులు కొట్టుమిట్టాడుతున్నారు. వసతి గృహంలోని గదులకు ఉన్న కిటికీల రెక్కలు విరిగి వెక్కిరిస్తుంటే అందులోనే ఓ మూలకు చేరి ముడుచుకుని పడుకుంటున్నారు. జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 151 వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో 84 బాలుర, 67 బాలికల హాస్టళ్లు ఉన్నాయి. 15,100 మంది విద్యార్థులు వీటిలో వసతి పొందుతూ విద్యనభ్యసిస్తున్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలుర వసతి గృహాలు 45, బాలికల వసతి గృహాలు 17 ఉన్నాయి. వీటిలో 4,797 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. విద్యార్థులు బాగోగులు చూసేందుకు ఆత్మీయ అధికారులను ఏర్పాటుచేసినా వారెవరూ తమకు కేటాయించిన వసతి గృహాల వైపు కన్నెత్తి కూడా చూడని పరిస్థితి నెలకొంది. దీంతో విద్యార్థుల ఇబ్బందుల గురించి పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. పెడన నియోజకవర్గంలోని రెండు వసతి గృహాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. కిటికీల తలుపులు లేకపోవటంతో దోమల బెడద అధికంగా ఉంది. దోమతెరలు పాడైపోవటంతో విద్యార్థుల పాట్లు అన్నీ ఇన్నీ కావు. కైకలూరు నియోజకవర్గంలోని భుజబలపట్నం ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ‘న్యూస్‌లైన్’ సందర్శించిన సమయంలో ఒక్క విద్యార్థి కూడా లేరు. 34 మంది హాజరైనట్లు అక్కడి సిబ్బంది చెబుతున్నా ఒక్కరు కూడా వసతి గృహంలో లేకపోవటం గమనార్హం. అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు ఎస్సీ బాలుర వసతి గృహానికి భవనం లేకపోవటంతో పాఠశాలలోని ఓ గదిని కేటాయించారు. ఈ వసతి గృహంలో 62 మంది బాలికలు ఉన్నారు. వీరంతా ఒకే గదిలో సర్దుకోవాల్సి వస్తోంది. పరిస్థితి ఇంత దయనీయంగా ఉన్నా అధికారులు మాత్రం వారికి సౌకర్యాలతో కూడిన భవనం ఏర్పాటుకు చొరవ చూపటం లేదు. ఈ హాస్టల్లో చదువుతున్న బాలికలు రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. మైలవరం ఎస్సీ బాలికల వసతి గృహంలో తాగునీటి సౌకర్యం లేదు. బోరునీటినే తాగేందుకు ఉపయోగిస్తున్నారు. ఎస్సీ బాలుర వసతి గృహంలో బోరు పాడైపోయింది. దీంతో దూరంగా ఉన్న మరో బోరు నుంచి నీటిని విద్యార్థులు తెచ్చుకుంటున్నారు. తుళ్లూరు వసతి గృహంలో మరుగుదొడ్లు లేకపోవటంతో బాలల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. మచిలీపట్నం వలందపాలెంలోని సాంఘిక సంక్షేమ శాఖ ఆరో నంబరు వసతి గృహం, నోబుల్ కాలనీలోని 10వ నంబరు బీసీ వసతి గృహం భవనాల్లో కిటికీలు విరిగిపోయి ఉన్నాయి. చలిగాలులతో పాటు దోమలు, విజృంభిస్తుండటంతో విద్యార్థుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. నందిగామ నియోజకవర్గంలోని పలు హాస్టళ్లలో తాగునీటి సౌకర్యం లేదు. దీంతో బోరు నీటినే తాగాల్సి వస్తోంది. బోరు నీటిలో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉండటంతో విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులోని ఎస్టీ వసతిగృహంలోని కిటికీలు, తలుపులు సరిగా లేకపోవడంతో చలిగాలులకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పోలీసు పారా మిలటరీ దళాలు ఈ వసతిగృహంలోనే బస చేస్తుండటం గమనార్హం. జగ్గయ్యపేట పట్టణంలోని ఎస్టీ వసతిగృహం పక్కనే మురుగుకాలువ ఉండటంతో దుర్వాసన వెదజల్లుతోంది. దుప్పట్లు అరకొరగా పంపిణీ చేశారు. బాలికల ఇంట్రిగేటెడ్ హాస్టల్ వద్ద తాగునీరు కూడా లేకపోవడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వత్సవాయి మండలంలోని ఎస్సీ వసతిగృహంలో ఫ్యాన్లు లేకపోవడంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెనమలూరు నియోజకవర్గంలో 14 హాస్టళ్లలో 715 మంది విద్యార్థులు అరకొర వసతుల నడుమ విద్యనభ్యసిస్తున్నారు. హాస్టళ్లన్నింటిలో కిటికీలకు గెడలు లేక, కొన్నింట కిటికీలకు తలుపులు లేక విద్యార్థులు చలితో వణుకుతున్నారు. -
విశాఖలో సాంఘీక సంక్షేమ శాఖ విద్యార్ధుల సైన్స్ ఫెయిర్
-
బీసీ హాస్టళ్లకు ఆన్లైన్ బెంగ!
=అన్ని వివరాలు నమోదు చేయాలని జీవో =రెండు మూడు రోజుల్లో పూర్తిచేయాలని ఆదేశం =హైరానా పడుతున్న వార్డెన్లు నర్సీపట్నం, న్యూస్‌లైన్ : బీసీ హాస్టల్ వార్డెన్లకు ఆన్లైన్ గుబులు పట్టుకుంది. నిర్ణీత గడువు లేకుండా తక్షణం అన్ని వివరాలు నమోదు చేయాలన్న ఆదేశాలతో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. ఈ ప్రక్రియ సకాలంలో పూర్తిచేయకుంటే బిల్లుల మంజూరుపై దాని ప్రభావం పడుతుందని వారంతా ఆందోళన చెందుతున్నారు. హాస్టళ్లలో బిల్లుల జారీ మరింత పారదర్శకంగా ఉండాలని భావించిన ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఇప్పటికే ఈ విధానం గిరిజన, సాంఘిక సంక్షేమశాఖల్లో అమలవుతోంది. తాజాగా బీసీ హాస్టళ్లకు విస్తరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా అన్ని బీసీ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల వివరాలు, ఫొటోలతో జతపరచాలని ప్రత్యేక జీవో గత నెలాఖరున జారీచేసింది. అలాగే భోజన తయారీకి అవసరమైన వస్తువుల కొనుగోలుకు సంబంధించి అన్ని బిల్లుల వివరాలు ఆన్లైన్లో జతపరచాలని పేర్కొంది. జూన్ నెల నుంచి ఇప్పటివరకు జతపరిచి, తక్షణం అప్లోడ్ చేయాలంటూ ఆదేశాలు జారీచేసింది. ఎటువంటి శిక్షణ లేకుండానే... ఏదైనా కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చేటప్పుడు దానిపై సంబంధిత అధికారులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. అదేవిధంగా వీటికి అవసరమైన మౌలిక సదుపాయాలు,వ్యయంతో పాటు ఇతర అవసరాలను సమకూర్చాల్సి ఉంది. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఈ ప్రక్రియను ప్రారంభించే సమయంలో ఇదే విధానాన్ని ప్రభుత్వం పాటించింది. దీనిని బీసీ హాస్టళ్లకు విస్తరించేటపుడు మాత్రం విస్మరించింది. జిల్లాలోని 68 బీసీ హాస్టళ్లలో సుమారు ఏడువేల మంది విద్యార్థులు ఉన్నారు. వీరి అవసరాలకు సంబంధించి వస్తువుల కొనుగోలు, తదితర వివరాలు నమోదుకు పదిహేను రోజులకు మించి పడుతుంది. ఇలాంటి వ్యవహారాన్ని కేవలం రెండు రోజుల్లో పూర్తిచేయాలంటూ ఆదేశాలు వచ్చాయి. ఇదే కాకుండా జూన్ నెల నుంచి అన్ని వివరాలను వీటిలో అప్లోడ్ చేయాలని ప్రభుత్వం పేర్కొంది. వాస్తవంగా ఒక్కో నెలకు సంబంధించి అన్ని వివరాలు నమోదు చేయాలంటే మూడు నాలుగు రోజులు పడుతుంది. వీటికి అవసరమైన వసతులు ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. దీనికి కొంతమేర ఖర్చుపెట్టాల్సి ఉంది. ఇలాంటి వసతుల్లేక వార్డెన్లు మల్లగుల్లాలు పడుతున్నారు. తక్షణం పూర్తిచేయాలని ఆదేశాలు రావడంతో ఏం చేయాలో పాలుపోక హైరానా పడుతున్నారు. ఇవి సకాలంలో పూర్తికాకపోతే బిల్లుల పరిస్థితి ఏమవుతుందోనని వారంతా ఆందోళన చెందుతున్నారు. సాంఘిక సంక్షేమం మాదిరిగానే బీసీ హాస్టళ్లలోని వివరాలు నమోదుకు అన్ని వసతులు కల్పించి, ఆన్లైన్ ప్రక్రియకు సహకరించాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. -
కంటి ఆస్పత్రిలో అక్రమ నియామకాలు
కేఎంసీ, న్యూస్‌లైన్ : వరంగల్ ప్రాంతీయ కంటి ఆస్పత్రిలో అక్రమ నియామకాలకు రంగం సిద్ధమైంది. నిబంధనలకు విరుద్ధంగా బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్లంబర్, టైలర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం ఒక్కో అభ్యర్థి నుంచి ఆరు నెలల క్రితమే రూ. 4 లక్షల చొప్పున వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ పేరుతో ప్రత్యేకంగా నోట్‌ఫైల్ (681-26.2.2013) తయారు చేసి గుట్టుచప్పుడు కాకుండా కలెక్టర్‌కు పంపించారు. నోట్‌ఫైల్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఈ మేరకు ఐటీఐ ప్రిన్సిపాల్, జిల్లా సోషల్వెల్ఫేర్ ఆఫీసర్, కేఎంసీ ప్రిన్సిపాల్‌తో కూడిన కమిటీని నియమించి నిబంధనల ప్రకారం పోస్టులను భర్తీ చేయాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. కానీ, కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా మహిళకు టైలర్పోస్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఓ వ్యక్తికి ప్లంబర్ పోస్టు ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. టైలర్పోస్టు ఇవ్వనున్న మహిళ భర్త అదే ఆస్పత్రిలో పనిచేస్తుండడం గమనార్హం. నిజానికి బ్యాక్లాగ్ పోస్టులు భర్తీచేసే జీఓ కాలపరిమితి జూన్‌లోనే పూర్తయింది. రిజర్వేషన్, రోస్టర్ ప్రకారం రెండు పోస్టుల కన్నా ఎక్కువగా ఉంటేనే బ్యాక్లాగ్ కిందికి వస్తాయి. ఒక పోస్టు ఉంటే జనరల్‌గా భర్తీయాలి. పోస్టులు భర్తీచేయాలని గతంలో లంబాడ హక్కుల పోరాటసమితి నాయకులు అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఆస్పత్రిలో ఎలాంటి బ్యాక్లాగ్ పోస్టులు లేవని 30-12-20011న ఫైల్ నంబర్ ఈ1-681 విడుదల చేసి వివరణ ఇచ్చారు. 12-01-2012 తేదీన తమ ఆస్పత్రిలో టైలర్, ప్లంబర్, రిఫ్రాక్షనిస్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కలెక్టర్‌కు ఫైల్ పంపించారు. 20 రోజుల్లోనే ఇంటర్వ్యూ సైతం నిర్వహించారు. దీంతో టైలర్ పోస్టు కోసం ఇంటర్వ్యూకు హాజరైన సౌజన్య అనే మహిళ కోర్టుకు వెళ్లింది. ట్రిబ్యునల్ నంబర్ (5874/2012)తో కోర్టు ఆర్డర్ తెచ్చుకుంది. అయితే ఈమెతో పాటు ఇంటర్వ్యూకు హాజరైన స్వరూప, పరంజ్యోతిని కాదని అర్హతలేని వేరే మహిళను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ప్లంబ ర్ పోస్టు కోసం ఇమ్మానియేల్, రాజు, నవీన్ హాజరయ్యారు. కాగా, అదే ఆస్పత్రిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగి వద్ద డబ్బులు తీసుకుని ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ నియామకం చెల్లదని గతంలోనే కోర్టు సైతం కొట్టివేసింది. నిజానికి ఐ ఆస్పత్రిలో ప్లంబర్, ఓ టైలర్ పోస్టు భర్తీకి 25-1-1990లో జీఓ 73 విడుదలైంది. తమకు అనుకూలమైన వారితో భర్తీచేయాలని అధికారులు 23 సంవత్సరాలుగా వేచిచూశారనే విమర్శలు వస్తున్నాయి. బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయొద్దని నెల రోజుల కిత్రం డీఎంఈ నుంచి ప్రత్యేక జీఓ ఆస్పత్రికి జారీ అయింది. గతంలో పనిచేసిన వారికి అన్యాయం.. నెల రోజుల క్రితం ఎవరికి తెలియకుండా ఒక కంప్యూటర్ ఆపరేటర్, ఒక ఆంకోను నియమించినట్లు తెలిసింది. గతంలో పనిచేసిన వారిని కాదని డబ్బులు వసూలు చేసి ఈ దందాకు తెరలేపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విధంగా కంటి ఆస్పత్రిలో ప్రతి సంవత్సరం సుమారు 10 అక్రమ పోస్టులు నియామకం చేపడుతున్నారని గతంలో పనిచేసిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్, డీఎంఈ అక్రమ నియామకాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు ఉద్యోగులు, యూని యన్ నాయకులు కోరుతున్నారు. నిబంధనల ప్రకారమే : పాండురంగజాదవ్, ఐ ఆస్పత్రి సూపరింటెండెంట్ నింబంధనల ప్రకారమే నియామకాలు చేస్తున్నాం. కలెక్టర్ కార్యాలయానికి ఫైల్ పంపించాం. ఆయన అనుమతితోనే పోస్టుల భర్తీ ఉంటుంది. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణల్లో నిజం లేదు.