కల్యాణలక్ష్మికి నిధుల మోక్షం
రూ. 34.15 కోట్లు విడుదల చేసిన సాంఘిక సంక్షేమ శాఖ
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత తొలిసారిగా కల్యాణలక్ష్మి పథ కానికి నిధులు విడుదలయ్యా యి. రాష్ట్రవ్యాప్తంగా 68 రెవెన్యూ డివిజినల్ అధికా రుల ఖాతాలకు రూ.34.15 కోట్లు విడుదల చేస్తూ ఎస్సీ అభివృద్ధి శాఖ రాష్ట్ర సంచాలకులు పి.కరుణా కర్ ఉత్తర్వులు జారీ చేశారు. కల్యాణలక్ష్మి పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ బాధ్యత ను ప్రభుత్వం ఆర్డీవోకు అప్పగించిన సంగతి తెలిసిందే. ఆర్డీవోలు పీడీ అకౌంట్ ద్వారా లబ్ధిదారులకు నిధులు విడుదల చేస్తారు. ప్రస్తుతం నిధులు విడుదల చేసినప్పటికీ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ మాత్రం నత్తనడకన సాగుతోంది. దీంతో ఈ నిధులను లబ్ధిదారులకు ఇప్పట్లో పంపిణీ చేసే అవకాశం లేదు. రాష్ట్రవ్యాప్తంగా కల్యాణలక్ష్మి పథకానికి సంబంధించి 40 వేల దరఖాస్తులు పెండిం గ్‌లో ఉన్నాయి. వీటి పరిశీలన పూర్తికి కనిష్టంగా రెండు నెలలు పడుతుందని అధికారులు చెబుతు న్నారు. ఈలోపు నిధుల పంపిణీ మరింత నెమ్మదిం చనుంది. దీంతో ఆర్థిక సాయం కోసం లబ్ధిదారులు రెండు నెలలపాటు వేచిచూడాల్సిందే.