- బెస్ట్ అవెలెబుల్ స్కూల్ ఎంపికలో అక్రమాలు
- సాంఘిక సంక్షేమ శాఖాధికారుల లీలలు
- సీటు ఇచ్చేందుకు రూ.5 వేలు డిమాండ్
ఆదిలాబాద్ : బెస్ట్ అవెలెబుల్ స్కూల్ పథకం ద్వారా కార్పొరేట్ విద్యను పేద దళిత విద్యార్థులకు అందించాలనే ఉన్నత లక్ష్యం అధికారుల ధనదాహం వల్ల నీరుగారుతోంది. సీటు కావాలంటే రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుండడంతో పేద తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తమ పిల్లలకు కార్పొరేట్ విద్య యోగ్యం లేదని వెనుదిరుగుతున్నారు. జిల్లాలో ఆదిలాబాద్‌లోని సీఆర్‌ఆర్, నిర్మల్‌లోని రవి స్కూల్, ఉట్నూర్‌లోని సెయింట్‌పాల్ స్కూల్‌లో బెస్ట్ అవెలెబుల్ స్కూల్ పథకం కింద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందిస్తున్నారు. ఏడాదికి రూ.20 వేలు ఒక్కో విద్యార్థి పేరిట సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా కార్పొరేట్ స్కూళ్లకు చెల్లించడం జరుగుతుంది.
వేయిటింగ్ పేరిట అక్రమాలు
సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో బెస్ట్ అవెలెబుల్ రెసిడెన్షియల్ స్కూ ల్ పథకం ద్వారా పేద ఎస్సీ విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలలో ఐదో తరగతిలో ప్రవేశం కోసం మే 25న నోటిఫికేషన్ జారీ చేశారు. జూన్ 5 వరకు దరఖాస్తులు తీసుకున్నారు. 100 సీట్లకు 500 దరఖాస్తులు వచ్చాయి. 10న లక్కీడ్రా ద్వారా వంద మంది విద్యార్థులను ఎంపిక చేశారు.
కొంత మందిని వెయిటింగ్ లిస్టులో ఉంచారు. కాగా లక్కీడ్రా ముగిసి 15 రోజులు పైబడినా ఇంకా సీట్ల భర్తీలో అధికారు లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 84 మంది విద్యార్థుల ప్రవేశాలు పూర్తికాగా మరో 14 మంది విద్యార్థులు చేరలేదని అధికారులు చెబుతున్నారు. మరోపక్క వెయిటింగ్‌లో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులను ఆశ్రయించగా రూ.5 వేలు ఇస్తే సీటు ఇస్తామని చెబు తూ దండుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారనే ఆరోపణలు బాహా టంగా వినిపిస్తున్నాయి.
విద్యార్థినుల పరంగా వెయిటింగ్ లిస్టులో కేవలం ఇద్దరికి మాత్రమే అవకాశం ఉండగా, నాలుగో నంబర్‌లో వేయిటింగ్‌లో ఉన్న విద్యార్థిని తండ్రిని రూ.5 వేలు ఇస్తే సీటు ఇస్తామని చెప్పడం అధికారుల తీరుకు నిదర్శనం. ఈ విషయంలో సాక్షి సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు అంకం శంకర్‌ను వివరణ కోరగా సీటు రానివారు ఇలాంటి ఆరోపణలు చేస్తారని, ఇందులో వాస్తవం లేదని పేర్కొన్నారు. లక్కీడ్రా నుంచి మొదలుకుంటే అన్ని విషయాల్లో పారదర్శకంగా వ్యవహరించామని, ప్రతీ విషయంలో వి ద్యార్థుల తల్లిదండ్రుల సంతకాలు కూడా తీసుకున్నామని తెలిపారు
కాసులిస్తే సీటు!
Published Thu, Jun 26 2014 3:08 AM | Last Updated on Mon, Oct 22 2018 7:32 PM
Advertisement