ఆంధ్రప్రదేశ్కు కచ్చితంగా ప్రత్యేక హోదా సాధిస్తామని ఆ రాష్ట్ర మంత్రి రావెల కిషోర్ బాబు స్ఫష్టం చేశారు. శనివారం హైదరాబాద్లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాల వనరులు ఉన్నాయని తెలిపారు. ఆ వనరులను రాష్ట్రాభివృద్ధి వినియోగించుకుంటామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై గతంలో పార్లమెంట్ హమీ ఇచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉందని, ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా సాధ్యమేనని కిషోర్ కుమార్ పేర్కొన్నారు.
'ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధిస్తాం'
Published Sat, Jun 14 2014 8:39 AM | Last Updated on Mon, Oct 22 2018 7:32 PM
Advertisement
Advertisement