టీచర్ నిత్యం మందలిస్తుండడమే కారణం ?
ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన
విశాఖలో చికిత్స పొందుతున్న బాలిక
గరుగుబిల్లి: టీచర్ నిత్యం మందలిస్తుండడాన్ని భరించలేక ఓ విద్యార్థిని మేడపై నుంచి దూకి ఆత్మహత్యా యత్నం చేసింది . అయితే పాఠశాల యాజమాన్యం ఈ విషయాన్ని గోప్యంగా ఉం చింది. హోం వర్క్ చేయడంలేద ని, సక్రమంగా చదవడం లేదని నిత్యం టీచర్ మందలిస్తుండడం తో మనస్తాపానికి గురైన రవ్వ రేవతి అనే విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గరుగుబిల్లి మండల కేంద్రంలోని ఏపీ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఆమె గత నెల 28న పాఠశాల మేడపైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తోటి విద్యార్థినులు చెబుతున్నారు. మేడపైనుంచి దూకడంతో తీవ్రంగా గాయపడిన ఆమెకు స్థానికంగా చికిత్స చేసి, 29న ఉదయం తల్లిదండ్రులతో ఆ విద్యార్థినిని పంపించారు.
ప్రస్తుతం విద్యార్థిని విశాఖపట్నంలోని కేజీహెచ్ లో చికిత్స పొందుతోంది. ఈ విషయాన్ని తెలుసుకున్న సీపీఎం, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బుధవారం పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులను నిలదీశారు. విద్యార్థినులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేయడంవల్లే ఆత్మహత్యా యత్నాలకు పాల్పడుతున్నారని సీపీఎం నాయకులు ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ మాణిక్యం మాట్లాడుతూ రేవతికి బ్రెయిన్‌కు సంబంధించిన వ్యాధి ఉందని, పలుమార్లు ఉన్నట్లుండి పడిపోతుండేదని ఈ విషయాన్ని తల్లిదండ్రులకు కూడా తెలియజేశామన్నారు. మెట్లు ఎక్కుతుండగా రేవతి పడిపోవడంతో గాయాలు పాలైనట్లు తెలిపారు.
మేడపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యా యత్నం
Published Thu, Feb 5 2015 3:06 AM | Last Updated on Mon, Oct 22 2018 7:32 PM
Advertisement
Advertisement