సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల కళాశాలలు అక్రమాలకు నిల యాలుగా మారాయి. నిరుపేద దళి త విద్యార్థుల విద్యాభ్యున్నతికి ఏ ర్పాటు చేసిన ఈ విద్యా సంస్థల్లో పెద్దఎత్తున అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. పలు గురుకుల కళాశాలల్లో అధికారులు రికార్డుల నిర్వహణను గాలికొదిలేశారు. నిర్వహణ నిధులను పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ గురుకులాల్లో జరుగుతున్న అక్రమాల బాగోతంపై ఆ శాఖ విజిలెన్స్ విభాగం ప్ర త్యేక దృష్టి సారించింది. ఆయా గురుకులా ల్లో ఆకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టింది.
ఇందులో భాగంగా పక్షం రోజుల క్రితం జిల్లాలోని లక్సెట్టిపేట గురుకుల కళాశాల ను అధికారులు తనిఖీ చేశారు. పలు రికార్డు ల నిర్వహణను కళాశాల సిబ్బంది గాలికొది లేసినట్లు విజిలెన్స్ విభాగం దృష్టికి వచ్చిం ది. అలాగే.. ఆయా గురుకులాల నిర్వహణకు వచ్చిన నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చు చేసినట్లు విజిలెన్స్ అధికారులు తేల్చినట్లు సమాచారం. సుమారు 15 రకాల రిజిష్టర్లను పరిశీలించగా, ఈ రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ విభాగం ఇచ్చిన నివేదిక ప్రకారం ఇందుకు బాధ్యులైన గురుకులం సూపరిండెంట్‌పై సస్పెన్షన్ వేటు పడింది. గురుకుల సొసైటీ రాష్ట్ర ఉన్నతాధికారులు నుంచి బుధవారం ఆదేశాలు జారీ అయ్యాయి.
జిల్లాలో 14 గురుకులాలు..
జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాలు 14 ఉన్నాయి. ఇందులో రెండు గురుకు ల పాఠశాలలు కాగా, మిగిలిన 12 గురుకు ల కళాశాలలు ఉన్నాయి. సుమారు ఎనిమి ది వేల మంది దళిత విద్యార్థులు విద్య న భ్యసిస్తూ, వసతి పొందుతున్నారు. ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి ఆధునిక హంగు ల భవనాలతో గురుకులాలను నిర్మించింది. ఒక్కో గురుకులంలో సుమారు 600 నుంచి 700 వరకు విద్యార్థులు చదువుతున్నారు. వీరికి వసతితోపాటు, అదే పరిసరాల్లో కళాశాల, పాఠశాలలు ఏర్పాటు చేయడం ద్వారా ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుందనుకున్నారు.
వీటి నిర్వహణకు ప్రతినెలా రూ.లక్షల్లో నిధులు మంజూరవుతున్నాయి. వసతిగృహాల నిర్వహణకు ఎక్కువ మొత్తంలో నిధులు వస్తున్నాయి. విద్యార్థుల భోజనానికి అవసరమైన పాలు, గుడ్లు, కిరాణ, ఇతర ప్రొవిజన్స్ కొనుగోళ్ల కోసం ప్రతినెలా రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. అలాగే అకాడమిక్ వైపు లెక్చరర్లు, ఉపాధ్యాయులు, కాంట్రాక్టు ఉద్యోగుల జీతభత్యాల, స్టేషనరీ, ఇతర కొనుగోళ్ల కోసం కూడా నిధులు వస్తాయి. కొందరు అధికారులు, సిబ్బంది కలిసి ఈ నిర్వహణ నిధులను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సంబంధిత రికార్డులను ఏవీ నిర్వహించకుండానే నిధులు డ్రా చేసినట్లు విజిలెన్స్ విచారణలో వెలుగుచూసినట్లు సమాచారం.
ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నాం..
- యాదగిరి, జిల్లా కోఆర్డినేటర్.
గురుకుల కళాశాలల నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. వారానికి రెండు గురుకులాలను తనిఖీలు చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్త తనిఖీల్లో భాగంగా విజిలెన్స్ విభాగం లక్సెట్టిపేట గురుకులాన్ని తనిఖీ చేసింది. ఈ విజిలెన్స్ ఇచ్చిన నివేదిక మేరకు సూపరిండెంట్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి.
హాస్టళ్లపై విజి‘లెన్స్’
Published Fri, Dec 5 2014 2:29 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM
Advertisement