ఆందోల్ (మెదక్) : హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. మెదక్ జిల్లా ఆందోల్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో ఉంటూ ఇంటర్మీడియట్ చదువుతున్న సౌజన్య, ప్రవల్లిక అనే ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. విద్యార్థినులు శుక్రవారం నుంచి కనిపించడంలేదు. దీంతో ప్రిన్సిపాల్ శనివారం జోగిపేట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.