ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్ : సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ ఎవైలబుల్ స్కూల్స్, రెసిడెన్షియల్స్‌ను ఎంపిక చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ శాఖ డిప్యూటీ డెరైక్టర్ కే సరస్వతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని వసతులు ఉన్న విద్యా సంస్థలు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ఐదేళ్లుగా పదో తరగతి పరీక్షల్లో 90 శాతం, మొత్తం విద్యార్థుల్లో 50 శాతం మంది విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలని తెలిపారు. ఈ పథకం ద్వారా ఎంపిక చేసిన పాఠశాలల్లో సాంఘిక సంక్షేమ శాఖ ఎంపిక చేసిన విద్యార్థులను చేరుస్తామన్నారు.
ఒక్కో విద్యార్థికి ఏడాదికి 20 వేల ఉపకార వేతనాన్ని ప్రభుత్వం మంజూరు చేస్తుందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న పాఠశాలల యాజమాన్యాలు ఈ నెల 20వ తే దీలోగా సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
బెస్ట్ ఎవైలబుల్ స్కూల్స్’కు దరఖాస్తుల ఆహ్వానం
Published Sat, Mar 15 2014 3:19 AM | Last Updated on Sat, Sep 2 2017 4:42 AM
Advertisement