ఒంగోలు(ప్రకాశం జిల్లా): సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు మందకృష్ణ మాదిగపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఎమ్మార్పీఎస్నాయకులు ఒంగోలులో ఆయనను అడ్డుకున్నారు. శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ మందకృష్ణ మాదిగకు డబ్బులు ఇవ్వడంతో ఆయన ఆ పార్టీని విమర్శించడంలేదని ఆరోపించారు. దీంతో శనివారం ఒంగోలులో మరో మంత్రి సిద్దరాఘవరావు ఇంటి వద్ద ఎమ్మార్పీఎస్ నాయకులుకిషోర్‌బాబును అడ్డుకున్నారు. ఆయన వారిని పట్టించుకోకపోవడంతో సిద్ధరాఘవరావు ఇంటి ముందు నినాదాలు చేశారు. దీంతో ఆయన వారిని ఇంటిలోకి పిలిచి మంతనాలు జరుపుతున్నారు.