బంగారు తెలంగాణ లక్ష్యంగా తమ పయనం సాగుతోందని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.
హైదరాబాద్: బంగారు తెలంగాణ లక్ష్యంగా తమ పయనం సాగుతోందని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఆర్థిక బడ్జెట్ 2015-16 ప్రవేశపెట్టిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే బడ్జెట్ రూపకల్పన చేసినట్టు చెప్పారు. పరిశ్రమల స్థాపన, ఐటీ రంగాలకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు.
రాబోయే కాలంలో సంక్షేమ రంగానికి కేటాయింపులు పెంచుతామన్నారు. పూర్తి అవసరాలు తీర్చే సత్తా ఏ ప్రభుత్వానికి ఉండదని, ఉన్న నిధులతోనే సమర్థవంతంగా పాలన సాగించాల్సివుంటుందన్నారు. తమ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపించే పరిస్థితి తెచ్చుకోమని ఈటెల రాజేందర్ అన్నారు.