మెగా అభిమానులకు మరో శుభవార్త. మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కు సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ మరో మాంచి కిక్కు ఎక్కించే సమాచరం అందించారు.
హైదరాబాద్: మెగా అభిమానులకు మరో శుభవార్త. అమ్మడు- కుమ్ముడు సాంగ్ తో పండగ చేసుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కు సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ మరో మాంచి కిక్కు ఎక్కించే సమాచరం అందించారు. ఆల్ సందరాస్ గెట్ రడీ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. సుందరీ పాట పాడుకోవడానికి రడీగా ఉండండి ..లెట్స్ పార్టీ ఫర్ క్రిస్మమస్ అంటూ లెట్స్ పార్టీ ఫర్ క్రిస్మమస్ అంటూ ఈ మోస్ట్ ఎవైటింగ్ సినిమాలోని రెండవ పాటపై మరింత ఉత్కంఠ రాజేశారు. డిసెంబర్ 24 (రేపే) రెండవ పాటను రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించారు.
కాగా కొణిదెల ప్రొడక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ఖైదీ 150. లాంగ్ గ్యాప్ తర్వాత చిరు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుండటంతో ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయింది. దీనికి తగ్గట్టుగానే ఇటీవలన విడుదలైన చిత్ర సంగీత దర్శకుడు దేవీశ్రీ అందించిన కుమ్ముడు పాట దుమ్ము రేపిన సంగతి తెలిసిందే.